
ఢిల్లీ: మీడియా ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. సైరన్ల శబ్దాలు వాడొద్దంటూ సూచించింది. అలా వాడితే.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. కేవలం అవగాహన కార్యక్రమాల్లోని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది.
భారత్-పాకిస్తాన్‌ల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సంబంధించి స్థానిక, జాతీయ మీడియా విస్తృత కవరేజీ ఇస్తోంది. ఈ క్రమంలో పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను న్యూస్ కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్స్ సమయంలో మాత్రమే ప్రజలు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది.