Mock drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి! | Blackout Mock Drill Across India On May 7th Amid India-Pak Tensions, Check Out Complete Details Of This Security Drill | Sakshi
Sakshi News home page

India Blackout Mock Drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి!

May 6 2025 12:40 PM | Updated on May 6 2025 1:42 PM

May 7 Blackout Drill Amid India-Pak Tensions

ఢిల్లీ: భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ముఖ్య ప్రదేశాలలో సివిల్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలో అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది.

ఈ మాక్‌ డ్రిల్‌పై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నీ రాష్ట్రాల సెక్రటరీలు,డీజీపీలు,ఫైర్‌ డీజీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలో ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  

అదే సమయంలో దాడులకు అవకాశం ఉన్న  జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజించింది. 

  • కేటగిరి 1లో దేశ రాజధాని  ఢిల్లీ , తారాపూర్ అణు కేంద్రం

  • కేటగిరి 2 లో విశాఖపట్నం, హైదరాబాద్

  • ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో ఏ కేటగిరిలో ఢిల్లీ ప్రాంతాలు ఉన్నాయి.  


దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. 

1. అండమాన్ & నికోబార్ ద్వీపాలు
   Category-II:

 పోర్ట్ బ్లెయిర్

2. ఆంధ్ర ప్రదేశ్
Category-II:

 హైదరాబాద్, విశాఖపట్నం

3. అరుణాచల్ ప్రదేశ్
  Category-II:
    •    ఆలోగ్ (వెస్ట్ సియాంగ్)
    •    ఇటనగర్
    •    తవాంగ్
    •    హయులింగ్
    •    Category-III: బొమ్డిలా

4. అస్సాం
   Category-II:
    •    బోంగైగావోన్
    •    డిబ్రూగఢ్
    •    ధుబ్రి
    •    గోల్పారా
    •    జోర్హాట్
    •    శిబ్‌సాగర్
    •    టిన్‌సుకియా
    •    తేజ్‌పూర్
    •    డిగ్బోయ్
    •    దిలీజన్
    •    గువహాటి (డిస్పూర్)
    •    రంగియా
    •    నమ్రుప్
    •    నజీరా
    •    నార్త్-లక్ష…

26.ఒరిస్సా (ఒడిశా)
Category-II:
    
•    టాల్చర్
 Category-III:

    •    బలాసోర్
    •    కోరాపుట్
    •    భువనేశ్వర్
    •    గోపాల్పూర్
    •    హిరాకుడ
    •    పారా‌దీప్
    •    రౌర్కెలా
    •    భద్రక్
    •    ధేంకనాల్
    •    జగత్సింగ్‌పూర్
    •    కేండ్రాపాడా

27. పుదుచ్చేరి
 Category-II:

పుదుచ్చేరి

28. పంజాబ్
Category-II:

    •    అమృత్‌సర్
    •    భటిండా
    •    ఫిరోజ్‌పూర్
    •    గుర్‌దాస్‌పూర్
    •    హోషియార్‌పూర్
    •    జలంధర్
    •    లుధియానా
    •    పటియాలా
    •    పఠాన్‌కోట్
    •    అడాంపూర్
    •    బర్ణాలా
    •    భాఖ్రా-నంగళ్
    •    హల్వారా
    •    కొఠ్‌కాపూర్
    •    బటాలా
    •    మోహాలి (ససనగర్)
    •    అబోహర్

Category-III:

    •    ఫరీద్‌పూర్
    •    రోపర్
    •    సంగ్రూర్

29. రాజస్థాన్
Category-II:

    •    కోటా
    •    రావత్‌భాటా
    •    అజ్మీర్
    •    అల్‌వార్
    •    బార్మేర్
    •    భరత్పూర్
    •    బీకానేర్
    •    బుండీ
    •    గంగానగర్
    •    హనుమాన్గఢ్
    •    జైపూర్
    •    జైసల్మేర్
    •    జోధ్‌పూర్
    •    ఉదయ్‌పూర్
    •    సికార్
    •    నాల్
    •    సూరత్‌గఢ్
    •    అబూ రోడ్
    •    నసీరాబాద్ (అజ్మీర్)
    •    భివారీ

 Category-III:

    •    ఫులేరా (జైపూర్)
    •    నాగౌర్ (మెర్టా రోడ్)
    •    జాలోర్
    •    బేవార్ (అజ్మీర్)
    •    లాల్‌గఢ్ (గంగానగర్)
    •    సవాయ్ మాధోపూర్
    •    పాలి
    •    భిల్వారా

👉రేపటి మాక్ డ్రిల్ సందర్భంగా ఎదురయ్యే పరిణామాలు

  • ఎలక్ట్రిసిటీ బ్లాక్ అవుట్
  • మొబైల్ సిగ్నల్స్ నిలిపివేత
  • ట్రాఫిక్ దారి మళ్లింపు
  • ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలు
  • పబ్లిక్ అనౌన్స్మెంట్స్

👉యుద్ధం తరహా ఎమర్జెన్సీలో పోలీసులు, పారా మిలిటరీ వ్యవహరించే విధానం

  • సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలు వ్యవహరించాల్సిన విధానం
  • ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండడం. స్థానిక గా ఇచ్చే సూచనలు పాటించాలి
  • వదంతులను వ్యాపింప చేయొద్దు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మవద్దు
  • కరెంటు లేక పోయినా, ఇంటర్నెట్ పనిచేయకపోయినా ఆందోళనకు గురికావద్దు  
  • అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ చానల్స్, రేడియోను మాత్రమే  వినాలి
  • ప్రజలు, అధికారులు తమ తమ బాధ్యతలు గుర్తెరిగి  మెలగాలి
  • మార్క్ డ్రిల్స్ కేవలం ప్రజల సన్నద్ధత కోసమే తప్ప... ఆందోళన కు గురిచేయడం లక్ష్యం కాదు
     
    👉రేపటి మాక్  డ్రిల్ నిర్వహించే విధానం ఇదే...

ఎయిర్ రైడ్ సైరన్స్ : ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకి వెళ్ళాలి
క్రాష్ బ్లాక్ ఔట్స్: నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు. 1971 యుద్ధ సమయంలో బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించిన భారత్ 
కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ: కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్ ను గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు 
తరలింపు చర్యలు: హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం , లాజిస్టిక్స్ ఇష్యూస్ ను గుర్తించడం 
పౌరులకు శిక్షణ: పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో శిక్షణ. సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండడం అంశాలపై శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement