
పాకిస్థాన్‌కు భారత్ వరుస షాక్‌లు ఇస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్.. బాగ్‌లిహార్ ఆనకట్ట నుంచి కూడా పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. ఇప్పటికే పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధించగా.. ఆ దేశంపై డిజిటల్ యుద్ధం కూడా ప్రారంభించింది. పాకిస్థాన్ ఓటీటీ, వెబ్‌సీరీస్‌లు, సినిమా పాటలపై నిషేధం విధించింది. పాడ్‌కాస్ట్‌లు, మీడియా కంటెంట్‌పై కూడా నిషేధం విధించాలని నిర్ణయించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది.
పాక్‌ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ముప్పేట దాడి చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ విడిచి పెట్టడం లేదు. తాజాగా, వినోద రంగం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్ ఏదీ కూడా ఇక భారత్‌లో అందుబాటులో ఉండదు. సబ్‌స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీలు పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.
కాగా, దేశవ్యాప్తంగా 27 ఎయిర్ పోర్టులను మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాల రాకపోకలు రద్దు చేశారు. ఢిల్లీకి వచ్చే, వెళ్లే 90 విమానాలను రద్దు చేశారు. రద్దయిన విమానాల్లో ఐదు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి.