అఫీషియల్‌ బెగ్గర్‌ | Pakistan is an official beggar says AIMIM chief Asaduddin Owaisi | Sakshi
Sakshi News home page

అఫీషియల్‌ బెగ్గర్‌

May 11 2025 3:00 AM | Updated on May 11 2025 3:00 AM

Pakistan is an official beggar says AIMIM chief Asaduddin Owaisi

పాక్‌పై ఒవైసీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ మానవజాతికే ముప్పుగా తయారైందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ఆ దేశం వద్ద అణ్వాయుధాలను లేకుండా చేయాలని అగ్ర రాజ్యాలను ఆయన కోరారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)నుంచి అతికష్టమ్మీద ఉద్దీపన ప్యాకేజీ పొందిన పాకిస్తాన్‌ను అధికారిక బిచ్చగాడు (అఫీషీయల్‌ బెగ్గర్‌)అంటూ ఒవైసీ అభివరి్ణంచారు.

 శనివారం ఆయన ఏఎన్‌ఐకిచి్చన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ నిర్వాకాలను ఎండగట్టారు. ‘ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్తాన్‌లోని సైనిక ప్రాంతంలో ఆశ్రయం పొందుతూ దొరికిపోయాడు. పాక్‌ విఫల దేశమనే విషయాన్ని పశ్చిమ దేశాలు గుర్తించాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధాలనేవీ లేకుండా చేసేందుకు అనువైన సమయమిదే. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. 

మానవాళికే ఆ దేశం ముప్పుగా మారింది’అంటూ ఒవైసీ నిప్పులు చెరిగారు. ‘ఐఎంఎఫ్‌ నుంచి 100 కోట్ల డాలర్లు రుణంగా తీసుకున్న పాక్‌ నేతలు అఫీషియల్‌ బెగ్గర్స్‌. పాక్‌కు అప్పిచ్చేందుకు అమెరికా, జర్మనీ, జపాన్‌ ఎలా అంగీకరించాయి? ఈ డబ్బును పేదరికాన్ని నిర్మూలించేందుకు గానీ పోలియో తగ్గించేందుకు గానీ వాడరు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకే ఈ సొమ్మును పాక్‌ వాడుతుంది’అని ఒవైసీ ఆరోపించారు. అదేవిధంగా ఆయన, పాకిస్తాన్‌ తన సైనిక ఆపరేషన్‌కు బున్యన్‌–అల్‌– మర్సూస్‌’అని పేరుపెట్టడంపైనా ఆయన మండిపడ్డారు. పవిత్ర ఖురాన్‌లోని వాక్కులను పాక్‌ దురి్వనియోగం చేసిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement