
ఢిల్లీ: 26/11 దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై దాడి సూత్రధారిని భారత్ మట్టుబెట్టింది. ఉగ్ర స్థావరాలపై దాడిలో అబూ జిందాల్ హతమయ్యారు. భారత్ దాడిలో టాప్-5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నెల 7న భారత్ దళాలు చేసిన దాడిలో టాప్-5 ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టింది. ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతమయ్యారు.
మురిద్కే, బవహాల్‌పూర్‌లో జరిగిన దాడుల్లో ఉగ్రనేతలను భారత్ హతమార్చింది. ముర్కిదే దాడిలో అబు జిందాల్ హతమవ్వగా.. అబు అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ హాజరయ్యారు. కాందహార్ హైజాక్ కీలక సూత్రధారి మహమ్మద్ యూసుఫ్ అజార్‌ను కూడా భారత్ హతం చేసేసింది. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ తుడిచిపెట్టేసింది.