దుమారం.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు | SP leader Ram Gopal Yadav controversial comments on Wing Commander Vyomika Singh | Sakshi
Sakshi News home page

దుమారం.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

May 16 2025 7:25 AM | Updated on May 16 2025 8:43 AM

SP leader Ram Gopal Yadav controversial comments on Wing Commander Vyomika Singh

లక్నో: ఉత్త‌ర ప్ర‌దేశ్ సమాజ్‌వాది పార్టీ నేత రామ్ గోపాల్‌ యాదవ్‌ (Ram Gopal Yadav) వింగ్ క‌మాండ్ వ్యోమికా సింగ్‌పై (Vyomika Singh)వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ఇటీవల, కల్నల్‌ సోఫియా ఖురేషీ (Sofia Khureshi)పై మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా (Vijay Shah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని రామ్ గోపాల్ యాదవ్ తాజాగా, ప్రస్తావిస్తూ.. ‘వింగ్ క‌మాండర్‌ వ్యోమికా సింగ్ రాజ్‌పుత్ కాబ‌ట్టే ఆమెను వ‌దిలేసి.. ముస్లిం మతానికి చెందిన క‌ల్న‌ల్ సోఫియా ఖురేషీ గురించి విజ‌య్ షా మాట్లాడారని అన్నారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మోరాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఎస్పీ నేత రామ్ గోపాల్ యాద‌వ్ పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మంలో మంత్రి విజ‌య్ షా కల్నల్ ఖురేషీపైచేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావించారు. ‘ఓ మంత్రి క‌ల్న‌ల్ ఖురేషీని ఉద్దేశిస్తూ చేసిన మ‌త‌త‌త్వ వ్యాఖ్య‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అత‌నిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. కానీ అతనికి వింగ్ క‌మాండర్‌ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల గురించి తెలియదు. లేదంటే వాళ్ల‌ని టార్గెట్ చేసేవారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సంద‌ర్భంగా వ్యోమికా సింగ్, ఎయిర్ మార్ష‌ల్ ఏకే భార‌తి కులాల ప్రస్తావనకు తెచ్చారు. 

అదే సమయంలో ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్ ఉగ్రవాదుల పీచమణిచిన సాయుధ దళాల సేవల కంటే  బీజేపీ స్వీయ ప్రశంసలకు ప్రాధాన్యత ఇస్తుందని రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. మనస్తత్వం చెడుగా ఉన్నప్పుడు, సైన్యం సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి బదులుగా, వారు తమ సొంత విజయాలను హైలైట్ చేస్తారంటూ అభిప్రాయ పడ్డారు. 

 

 సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం
రామ్‌ గోపాల్‌ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల యూనిఫామ్‌ను కుల దృక్పథంతో చూడరని, సైనికులు ఏ కులానికి లేదా మతానికి ప్రతినిధులు  కాదని  అన్నారు. దేశ వీర వనితను గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్‌ గోపాల్‌ యాదవ్‌ ఆలోచనలకు నిదర్శనం మాత్రమే కాదు, సైనికుల వీరత్వాన్ని, దేశ గౌరవాన్ని అవమానించడమేనని ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement