ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి.. గుజరాతీ పనేనా? | Delhi CM Rekha Gupta Slapped By Man During Jan Sunvai Event At Her Residence, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి.. గుజరాతీ పనేనా?

Aug 20 2025 9:27 AM | Updated on Aug 20 2025 11:30 AM

Delhi CM Rekha Gupta slapped by man during Jan Sunvai event

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. ‘జన్ సున్‌నాయ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేఖా గుప్తాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ముఖ్యమంత్రి రేఖను దూషిస్తూ.. ఆమె చెంపపై కొట్టాడు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని గుజరాత్‌కు చెందినట్టుగా పోలీసులు గుర్తించారు.  అతడి వివరాలు తెలియ్సాలి ఉంది. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

వివరాల ప్రకారం.. సివిల్‌ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్‌ సున్‌వాయ్‌’ నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ వ్యక్తి చేయి చోటుచేసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాయి. తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ స్పందించారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. దీనిపై విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని బీజేపీ నేతలు సహా ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఖండించారు. సీఎంపైనే దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇలా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరగడం భద్రతా వైఫల్యమని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా దాడి చేసిన వ్యక్తి ఫొటో బయటకు వచ్చింది. గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

ఈ ఘటన సమయంలో ఏం జరిగిందే అక్కడే ఉన్న ఓ మహిళ వివరించారు.. తాజాగా అంజలి అనే మహిళ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతున్న సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. జన్‌సున్‌వాయ్‌ నిర్వహిస్తుండగా సదరు వ్యక్తితో సీఎం రేఖా మాట్లాడుతున్న సమయంలో అతడు.. చెంప దెబ్బ కొట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇలా చేయడం తప్పు అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement