breaking news
IFA
-
దుమారం.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ (Ram Gopal Yadav) వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్‌పై (Vyomika Singh)వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.ఇటీవల, కల్నల్ సోఫియా ఖురేషీ (Sofia Khureshi)పై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijay Shah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని రామ్ గోపాల్ యాదవ్ తాజాగా, ప్రస్తావిస్తూ.. ‘వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ రాజ్‌పుత్ కాబట్టే ఆమెను వదిలేసి.. ముస్లిం మతానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ గురించి విజయ్ షా మాట్లాడారని అన్నారు. 🚨SP’s Ramgopal Yadav hurls CASTEIST slur at Wing Commander Vyomika Singh - calls her “CHAM*R” 😳~ No outrage. No suo moto by courts. No feminist noise.Because the abuser isn’t from BJP, and the victim isn’t convenient for the ecosystem👏🏼 pic.twitter.com/BXegkYPAg5— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 15, 2025ఉత్తరప్రదేశ్ మోరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మంత్రి విజయ్ షా కల్నల్ ఖురేషీపైచేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ‘ఓ మంత్రి కల్నల్ ఖురేషీని ఉద్దేశిస్తూ చేసిన మతతత్వ వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. కానీ అతనికి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల గురించి తెలియదు. లేదంటే వాళ్లని టార్గెట్ చేసేవారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి కులాల ప్రస్తావనకు తెచ్చారు. అదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్రవాదుల పీచమణిచిన సాయుధ దళాల సేవల కంటే బీజేపీ స్వీయ ప్రశంసలకు ప్రాధాన్యత ఇస్తుందని రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. మనస్తత్వం చెడుగా ఉన్నప్పుడు, సైన్యం సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి బదులుగా, వారు తమ సొంత విజయాలను హైలైట్ చేస్తారంటూ అభిప్రాయ పడ్డారు. सेना की वर्दी 'जातिवादी चश्मे' से नहीं देखी जाती है। भारतीय सेना का प्रत्येक सैनिक 'राष्ट्रधर्म' निभाता है, न कि किसी जाति या मजहब का प्रतिनिधि होता है।समाजवादी पार्टी के राष्ट्रीय महासचिव द्वारा एक वीरांगना बेटी को जाति की परिधि में बांधना न केवल उनकी पार्टी की संकुचित सोच का…— Yogi Adityanath (@myogiadityanath) May 15, 2025 సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహంరామ్ గోపాల్ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల యూనిఫామ్‌ను కుల దృక్పథంతో చూడరని, సైనికులు ఏ కులానికి లేదా మతానికి ప్రతినిధులు కాదని అన్నారు. దేశ వీర వనితను గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్ గోపాల్ యాదవ్ ఆలోచనలకు నిదర్శనం మాత్రమే కాదు, సైనికుల వీరత్వాన్ని, దేశ గౌరవాన్ని అవమానించడమేనని ట్వీట్ చేశారు. -
IFA Shield: రన్నరప్ శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ
కోల్‌కతా: భారత్‌లో రెండో అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఐఎఫ్ఏ షీల్డ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) జట్టు రన్నరప్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఈ టోర్నీలో తొలిసారి పాల్గొన్న శ్రీనిధి డెక్కన్ జట్టు 1–2 గోల్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ జట్టు చేతిలో ఓడింది. శ్రీనిధి డెక్కన్ క్లబ్ గోల్‌కీపర్ సీకే ఉబైద్కు టోర్నీ ‘ఉత్తమ గోల్‌కీపర్’ పురస్కారం లభించింది. చదవండి: నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు: విరాట్ కోహ్లి -
హువావే మేట్ 20 లైట్ లాంచ్
చైనా కంపెనీ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మేట్ 20 లైట్‌ను విడుదల చేసింది. బెర్లిన్‌లో (ఆగస్టు 31- సెప్టెంబర్ 5) ప్రారంభమైన ఐఎఫ్ఏ 2018 ఈవెంట్లో లాంచ్ చేసింది. అధునాతన ప్రాసెసర్, మొత్తం నాలుగు కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు ఏఐ ఆధారిత క్యూట్ స్పీకర్‌ను కూడా విడుదల చేసింది. హువావే మేట్ 20 లైట్ ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ హై సిలికాన్ 710 ఎస్ఓసీ ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3650 ఎంఏహెచ్ బ్యాటరీ -
బెర్లిన్‌లో ఐఎఫ్ఏ మెగా ఎలక్ట్రానిక్స్ షో
-
తడిచినా, కిందపడినా ఈ మొబైల్ పాడుకాదట!
ప్రముఖ మొబైల్ తయారీ దారు ఆర్కోస్ మరో సరికొత్త మొబైల్ ను విడుదల చేసింది. 'ఆర్కోస్ 50 సాఫిర్' ను పేరుతో ఈ నూతన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఐపీ 68 సర్టిఫైడ్ తమ మొబైల్ పైనుంచి పడినా , ఒక మీటరు లోతు నీళ్లలో అరగంట సేపు ఉంచినా పాడైపోదని కంపెనీ చెబుతోంది. 99 యూరోలు( సుమారు రూ.7,500)లుగా దీనికి ధరనునిర్ణయించింది. జర్మనీలోని బెర్లిన్‌లో జరుగుతున్న 'ఐఎఫ్ఏ 2016' ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ షో లో కూడా దీన్ని ప్రదర్శనకు ఉంచింది. ఈ డివైస్ అక్టోబర్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుంది. ఆర్కోస్ 50 సాఫిర్ ఫీచర్లు... ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్ 5 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 720 X 1280 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఐపీ68 సర్టిఫైడ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.0 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
యూత్ బ్రాండ్ యునినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ యునినార్‌కు దేశవ్యాప్తంగా జూన్ నాటికి 3.93 కోట్ల మంది చందాదారులున్నారు. వీరిలో 60 శాతం మంది 18-25 ఏళ్ల వయసు వారే కావడం విశేషం. సబ్సే సస్తా పేరుతో అన్ని కంపెనీల కంటే చవకైన ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నామని, దీంతో యూత్ బ్రాండ్‌గా నిలిచామని యునినార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజీవ్ సేథి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. అందరికీ ఇంటర్నెట్ను చేరువ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇంటర్నెట్ చార్జీ గంటకు 50 పైసలు మొదలు చవక ధరలో ప్యాక్‌లు, టారిఫ్‌లు పరిచయం చేశామన్నారు. యునినార్ వినియోగదారుల్లో 30 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. మార్చికల్లా ఈ సంఖ్య2 రెట్లు ఆశిస్తున్నాన్నారు. అవసరంగా ఇంటర్నెట్.. కనీస అవసరంగా ఇంటర్నెట్ మారిందని రాజీవ్ సేథి తెలిపారు. ‘యునినార్ వినియోగదారుల్లో 50 శాతం మంది గ్రామీణులు ఉన్నారు. వీరు వినోదం కోసం నెట్లో ముఖ్యంగా పాటలు, యూట్యూబ్, ఫేస్బుక్ వాడుతున్నారు. పట్టణ వినియోగదారులు సమాచారం, పరిజ్ఞానం తెలుసుకోవడానికి నెట్‌పై ఆధారపడుతున్నారు’ అని తెలిపారు. టెలికం రంగంలో తాము 45 శాతం వృద్ధి నమోదు చేస్తున్నామని, పరిశ్రమ వృద్ధి రేటు కేవలం 10 శాతానికి పరిమితమైందని వివరించారు. అస్సాంలో జనవరిలో అడుగు పెట్టనున్నామని, దీంతో యునినార్ సర్కిళ్ల సంఖ్య 7కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఉత్తమ ఐడియాకు.. నార్వేలోని ఓస్లోలో డిసెంబరులో టెలినార్ యూత్ సమ్మిట్ జరగనుంది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ ఫర్ ఆల్ చాలెంజ్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. 18-25 ఏళ్ల వయసున్నవారు చాలెంజ్‌కు అర్హులని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ కన్నన్ తెలిపారు. మొబైల్ ఇంటర్నెట్ను ఆసరాగా చేసుకుని సామాజిక మార్పు, అభివృద్ధికి దోహదపడే ఉత్తమ వ్యాపార ఆలోచనలను ఎంపిక చేస్తారు. ఒక్కో సర్కిల్ నుంచి ఇద్దరిని, ఇలా భారత్‌లో 12 మందిని ఎంపిక చేస్తారు. ఇద్దరు విజేతలకు ప్రథమ బహుమతి రూ.1 లక్ష, ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు ఇస్తారు. ఇలా టెలినార్ సేవలందిస్తున్న 14 దేశాల నుంచి 28 మందిని సమ్మిట్‌కు పంపిస్తారు. దరఖాస్తును ఫేస్బుక్లో యునినార్ పేజీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు పంపించేందుకు చివరితేదీ ఆగస్టు 31.