
ఢిల్లీ : ‘మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై తొలిసారి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు’ అని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి.భారత సైన్యానికి,సైంటిస్టులకు నా సెల్యూట్. పహల్గాంలో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచాన్ని కలిచి వేసింది. పహల్గాం ఘటన నన్ను వ్యక్తి గతం కలిచివేసింది. మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం.ఉగ్రవాదులు కలలో కూడా దాడిని ఊహించి ఉండరు
పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల్నిటార్గెట్ చేశారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.ఆపరేషన్ సిందూర్ అంటే పేరు కాదు, ఆవేదన. ఆపరేషన్ సిందూర్ అంటే ప్రతిజ్ఞ. ఏడో తేదీన తెల్లవారున ఈ ప్రతిజ్ఞ నెరవేరడం ప్రపంచమంతా చూసింది. పహల్గాం ఘటన తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది.
వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం
భారత సైన్యం ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేసింది. భారత డ్రోన్లు ఉగ్రవాదుల స్థావరాల్ని మట్టిలో కలిపేశాయి. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ బెంబేలెత్తిపోయింది. పాక్ గుండెలపై భారత సైన్యం దాడి చేసింది. భయంతో,రక్షణ కోసం పాకిస్తాన్ ప్రపంచ దేశాలను ఆశ్రయించింది
పాక్ శరణు గోరింది
ఈ నెల 10 భారత్ డీజీఎంవోను పాక్ శరణు గోరింది. మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడబోమని,సైన్యంపై కాల్పులు జరపొద్దని ప్రాధేయపడింది. 3రోజుల్లో పాక్‌పై ఊహకందని విధంగా దాడి చేశాం. ఎడారి,కొండలు,ఆకాశంలో పాక్‌ను వదిలిపెట్టలేదు. యుద్ధరంగంలో ప్రతిసారి పాక్‌ను మట్టి కరిపించాం. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌ను ఓడించాం.
ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాం
అణ్వాయుధాల బ్లాక్ మెయిల్‌ను ఇక సహించేది లేదు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. అదే ఉగ్రవాదం చేతిలో అంతమవుతుంది. ఈ యుద్ధంలో మేకిన్ ఇండియా ఆయుధాలు బాగా పనిచేశాయి. చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని బట్టి పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారని అర్ధమవుతుంది. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాం. భవిష్యత్‌లో పాక్ చర్యను బట్టి భారత్ అదే స్థాయిలో స్పందిస్తోంది.
నీరు,రక్తం కలిసి పారలేవు
ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు. నీరు,రక్తం కలిసి పారలేవు. పాక్‌తో చర్చించాల్సింది పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే. మన ఐక్యతే.. మన శక్తి.ఈ రోజు బుద్ధపూర్ణిమ. బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపాడు.అదే మనకు ఆదర్శం అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
ఆపరేషన్ సిందూర్‌ను
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత్ -పాకిస్తాన్‌ల మధ్య మూడురోజుల పాటు భీకర కాల్పులు జరిపాయి. భారత్ జరిపిన భీకర దాడులకు పాకిస్తాన్ తోక ముడిచింది. కాల్పులు జరపొద్దంటూ భారత్‌ను ప్రాధేయపడింది. కాల్పుల విరమణతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయాయి.
Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh
— ANI (@ANI) May 12, 2025
ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. రక్షణ శాఖ,విదేశాంగ శాఖ, త్రివిధ దళాదిపతులతో ఆపరేషన్ సిందూర్ గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
