Top Stories
ప్రధాన వార్తలు

జూన్ 4న వెన్నుపోటు దినం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారాయన. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారాయన.ఇదీ చదవండి: YS Jagan-నాకు పోరాటాలు కొత్త కాదు

విజయసాయిలాంటి వాళ్ల స్టేట్మెంట్లకు విలువుందా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మరోసారి తన మంత్ర దండం బయటకు తీశారని.. వ్యస్థలను మేనేజ్ చేస్తూ తన మోసాలను ప్రశ్నించేవారి గొంతును నొక్కేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే.. లిక్కర్ స్కాం అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారాయన. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా?. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా?. ఎక్కడైనా దుకాణాలు 33 శాతం తగ్గిస్తే లంచాలు ఇస్తారా?. 2019-2024 మధ్య లిక్కర్ సేల్ తగ్గింది. ఒక్క కంపెనీకి లైసెన్స్ ఇవ్వలేదు. ట్యాక్స్‌లు పెంచాం. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు పోలేదు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాం. అదే సమయంలో.. మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేశాం. ప్రతీ బాటిల్‌పై క్యూఆర్ కోడ్ పెట్టించాం.లాభాపేక్ష లేకుండా మా(వైఎస్సార్సీపీ) ప్రభుత్వం అమ్మకాలు జరిపాం... అసలు లిక్కర్ స్కాం (Jagan on Liquor Scam) ఎక్కడ జరిగింది?. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ 12 నెలల కాలంలో లిక్కర్ సేల్ పెరిగింది. కూటమి పాలనలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయి. బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడం లేదు.. మద్యాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే అవి నడుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కొత్త కొత్త బ్రాండులను తీసుకొచ్చారాయన. గతంలో..(2014-19) తన హయాంలోనూ లిక్కర్ సేల్స్ పెంచుకుంటూ పోయారు. తద్వారా అమ్మకాలు పెరిగాయి. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు వెళ్లాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాంటప్పుడు స్కాం ఎక్కడ జరిగింది?. డిస్టరీలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మా హయాంలో ఉందా?’’ అని జగన్ ప్రశ్నించారు.గతంలో లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టికి బెయిల్ మీద ఉంది నిజం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు.. లాటరీ పేరుతో రిగ్గింగ్ చేసి మద్యం షాపులు దోచుకున్నారు. ఆనాడు కూడా ప్రైవేట్ సిండికేట్‌కు మేలు చేశారు. తనకు కావాల్సిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారు. 2015-19 మధ్య ఐదు కంపెనీలు 69 శాతం ఆర్డరులు ఇచ్చారు. తద్వారా కొన్నిబ్రాండ్‌లకు మాత్రమే డిమాండ్ సృష్టించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ సిండికేట్‌కు లబ్ధి చేకూర్చడం కోసం.. తన పాలసీని కొనసాగించడం కోసం.. ఏం స్కాం జరగకపోయినా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. భయపెట్టి.. బెదిరించి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి.. తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి(V. Vijayasai Reddy). వైఎస్సార్సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని.. మూడేళ్ల టర్మ్ ఉండగానే కూటమికి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి.. ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది?. లోక్‌సభ ఎంపీ, ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం?. ఆయన తండ్రి పెద్దిరెడ్డి కనీసం ఆ శాఖ మంత్రి కూడా కాదు. ఐఏఎస్, ఐపీఎస్‌లను జైళ్లో పెట్టిన చరిత్ర లేదు. సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అరెస్ట్ చేసిన ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కేసిరెడ్డి ఒకరు. కేసిరెడ్డికి, బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఏం సంబంధం?. విజయవాడ టీడీపీ ఎంపీ, కేసిరెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. కేసిరెడ్డి అప్రూవర్‌గా మారలేదని నిందితుడిగా చేర్చారు. కావాల్సిన స్టేట్మెంట్ ఇస్తే కేసిరెడ్డిని వదిలేసేవారు. లిక్కర్ స్కాంకి సంబంధించి ఒక్క ఫైల్ అయినా సీఎంవోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా? అని చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా. కుట్రలు చేసి.. సంబంధం లేని వ్యక్తులనూ తెరపైకి తీసుకొచ్చి లిక్కర్ కేసులంటూ తప్పుడు కేసులు పెడుతూ.. రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు. ఐపీఎస్‌లు సంజయ్, కాంతిలాల్ ఠాణా, జాషువా, విశాల్ గున్నీ, ధనుంజయ్, రఘురామ్ రెడ్డి ఇలా అధికారులను వేధిస్తున్నారు అని వైఎస్ జగన్ అన్నారు.

‘కేసరి: చాఫ్టర్ 2(తెలుగు వెర్షన్)’ మూవీ రివ్యూ
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘కేసరి: చాప్టర్ 2’. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై మే 23న ఇది తెలుగులో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేశారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు. డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే?శతాబ్దం క్రితం భారత్‌లో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయులపై నాటి బ్రిటిష్ పాలకులు జరిపిన మారణకాండ గురించి పుస్తకాలల్లో చదివాం. భారతీయ న్యాయవాది శంకరన్ చేసిన న్యాయ పోరాటం గురించి కూడా విన్నాం. ఈ రెండిటికి దృశ్యరూపం ఇస్తే.. అది ‘కేసరి: ఛాప్టర్ 2’ చిత్రం అవుతుంది. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే..శంకరన్ చేసిన న్యాయ పోరుని హైలెట్ చేశారు. నిజంగా అప్పట్లో బ్రిటీష్ ఉన్నతాధికారిపై కేసు వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. కానీ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న శంకరన్ ఆ సాహసం చేశాడు. దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో దర్శకుడు కరణ్ సింగ్ మరోసారి తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామాని అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం. శంకరన్, మెక్కిన్లే మధ్య జరిగే వాదనలు ఉత్కంఠను రేకిస్తూనే.. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. జలియన్‌వాలాబాగ్ ఘటన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత శంకరన్ నేపథ్యం, కమీషన్ ఏర్పాటు వరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. శంకరన్ డయ్యర్‌కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. తొలి ట్రయల్‌లో శంకరన్ వాదనలు ఆకట్టుకుంటాయి. శంకరన్‌కి పోటీగా డయ్యర్ తరపున మెక్కిన్లే రంగంలోకి దిగడంతో కథనం మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ మొత్తం కోర్ట్‌లో జరిగే వాదనల చుట్టూనే కథనం సాగుతుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. మొత్తంగా మనల్ని రెండున్నర గంటల పాటు ఆ కాలం నాటి పరిస్థితులను తీసుకెళ్లి.. బ్రిటీష్ పాలకులు చేసిన అరచకాలను చూపిస్తూనే స్వాతంత్రం కోసం మనవాళ్లు చేసిన పోరాటాలను గుర్తు చేసే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్. ఎవరెలా చేశారంటే.. సర్ శంకరన్ నాయర్‌గా అక్షయ్ కుమార్ ఒదిగిపోయాడు. నిజమైన న్యాయవాదిలా ఆయన వాదనలు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆయన చేప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న మెక్ కిన్లేగా ఆర్ మాధవన్ ఒదిగిపోయాడు. యువ న్యాయవాది దిల్రీత్ గిల్‌గా అనన్య పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. శంకరన్ భార్యగా రేజీనా ఉన్నంతలో చక్కగానే నటించింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాష్వత్ సచ్దేవ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు భావోద్వేగాన్ని రగిలించేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితీరు అద్భుతం. 1919 నాటి పరిస్థితుల్ని.. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్

పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్
బికనీర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రధాన మోదీ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన అనంతరం పలానాలో జరిగిన ప్రజా ర్యాలీలో ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్(Pakistan) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అది ఆ దేశ సైన్యం, ఆర్థిక వ్యవస్థ భరించాల్సి వస్తుందన్నారు. పాక్ ఉగ్రవాదం ఎగుమతిని కొనసాగిస్తే, ఆ దేశం ఒక్క రూపాయి కోసం కూడా తడబడే పరిస్థితి వస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. భారతీయుల రక్తంతో ఆడితే పాకిస్తాన్ దానికి భారీ మొత్తంలో నష్టం చవిచూడాల్సి వస్తుందన్నారు.ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని, ఇకపై ఉగ్ర దాడి జరిగినట్లయితే, తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.. ఇందుకు సమయాన్ని, విధానాన్ని, నిబంధనలను భారత సైన్యం స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. అణ్వాయుధాల బెదిరింపులతో భారతదేశం వెనక్కి తగ్గబోదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, ప్రభుత్వాన్నీ వేరు చేయలేమని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో ‘స్టేట్’, ‘నాన్-స్టేట్ యాక్టర్స్’ (గూండాలు) కలసి ఆడే ఆటలు ఇక కొనసాగవన్నారు. 22వ తేదీన జరిగిన పాక్ దాడికి ప్రతిగా 22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేశామని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ప్రతీకార దాడి చేస్తే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా చూపించామని, ప్రతి భారతీయుడు(Indian) ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలనే సంకల్పంతో ఉన్నారడన్నారు. భారత సైన్యం ప్రజల ఆశీర్వాదంతో ఆ సంకల్పాన్ని నెరవేర్చిందన్నారు. భారత ప్రభుత్వం మూడు దళాలకూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. పాకిస్తాన్‌ను మోకాళ్లపై సాగిలపడేలా చేయడానికి భారత సైన్యం చక్రవ్యూహం రచించిందని ప్రధాని మోదీ అన్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా మే 7న భారత్ ప్రతీకార సైనిక చర్య ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ సమయంలో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద గ్రూపులతో సంబంధమున్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

కూటమి నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు రాలేదు: జ్యోతుల నెహ్రూ
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ..‘కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించండి. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి?. ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా?.(కుడా చైర్మన్, డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు). కూటమిలో పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నిసార్లు బయటకు రాలేదు.టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలి. నేను వాళ్లకు ఇవ్వకూడదు అని అనడం లేదు. మా నిష్పత్తి ప్రకారం టీడీపీకి కూడా ఇవ్వండి అంటున్నాను. ద్వితీయ శ్రేణి నేతలు తమ ఇంట్లో వారికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మా వాటా పదవులు మాకు సక్రమంగా ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2025)ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టాప్-4 నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. ముంబై ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు ముంబై టైటిల్ పోరులో నిలిచింది. మరోవైపు.. ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ సీజన్లో తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలిచి కూడా.. ప్లే ఆఫ్స్ చేరని ఏకైక జట్టుగా నిలిచింది.వరుసగా నాలుగు విజయాలుకాగా ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ (Axar Patel) పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో తొలుత లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడ్డ ఢిల్లీ.. ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. మరుసటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టిన అక్షర్ సేన.. చెపాక్‌లో సీఎస్కేను 25 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇలా సీజన్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయింది.ముంబై చేతిలో అపుడూ ఓడిన ఢిల్లీముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన(ఏప్రిల్ 13) ఢిల్లీ సీజన్లో తొలి పరాజయం చవిచూసింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ ఢిల్లీ అదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన అక్షర్ సేన.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌పై సీజన్లో రెండో విజయం సాధించింది.అయితే, ఆర్సీబీ మాత్రం ప్రతీకారం తీర్చుకుని ఢిల్లీలోనే ఢిల్లీ జట్టును ఓడించింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ అక్షర్ సేన ఓడిపోయింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గట్టెక్కింది. అనంతరం పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ మ్యాచ్ సాంకేతిక కారణాల (ఆపరేషన్ సిందూర్) వల్ల ఆగిపోయింది.ఆ తర్వాత గుజరాత్‌ను ఢీకొట్టిన ఢిల్లీ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో మరోసారి ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వాంఖడే వేదికగా ఢిల్లీ జట్టు.. హార్దిక్ సేనతో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నమన్ ధీర్ (24 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.లక్ష్య ఛేదనలో ఢిల్లీ విలవిలఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ చేతులెత్తేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6).. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్(6) దారుణంగా విఫలమయ్యారు. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఆలౌట్ అయింది. దీంతో ముంబై చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇలా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అపవాదును మూటగట్టుకుంది. కాగా లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌తో తలపడనుంది.చదవండి: వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025

బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! ఆరోగ్యానికి మంచిదేనా?
ఇటీవల హెల్దీగా ఉందాం అనే నినాదం ప్రజల్లో బాగా వళ్తోంది. అందురూ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకునేందుకే ఇష్టపడుతున్నారు. పైగా తమ శరీరానికి సరిపోయే డైట్‌ని ఫాలోఅయ్యి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడొక కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీబిల్డర్ తనపైన అధిక ప్రోటీన్ ఫుడ్ ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం అని రోజుకి 30 గుడ్లు చొప్పున నెలకు 900 గుడ్లు తింటే త్వరితగతిన కండరాలు ఏర్పడి బాడీబిల్డర్‌గా మారడానికి తోడ్పడుతుందో లేదా తెలుసుకోవాలని తనమీదే స్వయంగా ప్రయోగం చేసుకున్నాడు. చివరికి ఏమైందంటే..యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీ బిల్డర్ జోసెఫ్ ఎవెరెట్ ప్రముఖ బాడీబిల్డింగ్ లెజెండ్ విన్స్ గిరోండా చెప్పే 900 ఎగ్స్ డైట్‌ని పరీక్షించాలనుకున్నాడు. గిరోండా తాను రోజు 30 గుడ్డు తింటానని, అదే తన కండల తిరిగిన దేహం రహస్యమని చెబుతుంటారు. అది ఎంతవరకు నిజం అని తెలుసకునేందుకు ఈ యూట్యూబర్ తనమీద ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం రోజుకి 30కి పైగా గుడ్లను డైట్లో తీసుకునేవాడు. అతను గుడ్డు తెల్లసొన ఆమ్లెట్లు, పచ్చసొన స్మూతీలు ఆహారంతో చేర్చుకునేవాడు. వాటితో పాటు రైస్, మాంసం, పెరుగు, పండ్లు, తేనె తదితరాలు తీసుకున్నాడు. ఈ ఆహారం తోపాటు వెయిట్ లిఫ్టింగ్‌కి సంబంధించిన అన్ని వ్యాయామాలు చేశాడు. ఆ తర్వాత తన బాడీలో జరిగిన మార్పులపై వైద్య పరీక్షలు జరిపించగా..మంచికొలస్ట్రాల్ స్థాయిలు పెరగడం తోపాటు, రక్తంలో చెడు కొలస్ట్రాల్‌కి సంబంధించి గణనీయమైన మార్పులు కనిపించాయి.ఈ డైట్ మంచిదేనా..? ప్రముఖ డైటీషియన్ కనిక మల్హోత్రా ఇలాంటి డైట్‌తో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డులోని పచ్చసొనలో ఉండే అధిక కొలస్ట్రాల్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందన్నారు. ఇది గుడ్డు జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు. అంతేగాదు అధికంగా గుడ్లు తీసుకోవడం వల్ల.. కొంతమంది వ్యక్తుల్లో పొట్ట ఉబ్బరం, గ్యాస్, విరేచనలు వంటి జీర్ణ సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. అంతేగాదు ఇలా గుడ్లు అధికంగా తీసుకుంటే పోష అసమతుల్యత వస్తుందన్నారు. అలాగే పచ్చిగా లేదా తక్కువగా ఉడికించి తీసుకుంటే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కండరాల పెరుగుదల కోసం గుడ్డు అధికంగా తీసుకోవాల్సిందేనా..గుడ్డు కండరాల పెరుగుదలకు ఉపయోగపడినప్పటికీ..అధికంగా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని తేల్చి చెప్పారు. గుడ్డులోని పచ్చసొన కండరాల ప్రోటీన్ సంశ్లేషణను సమర్థవంతంగా పెంచుతుందన్నారు. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఇతర వాటిలో కంటే ఎక్కువ. పైగా దీన్ని ఉడకించి తింటేనే సులభంగా అరుగుతుంది లేదంటే శరీరం దాన్ని అరిగించుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందన్నారు. చెప్పాలంటే సోయా లేదా గోధుమలు, పాలు తదితరాల కంటే గుడ్డులో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కువ కాబట్టి దీన్ని తగు మోతాదులో తీసుకుంటే కండరాల పెరుగుదలకు, బాడీ బిల్డింగ్‌కి ఉపయోగపడుతుందని తెలిపారు. అంతకు మించి అంటే..మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స)

హద్దు దాటారు.. తమిళనాడులో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.ఇటీవల తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సిబల్ వాదనలు వినిపిస్తూ.. 2014-21 వరకు రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. కానీ, ఈడీ 2025లో టాస్మాక్ హెడ్ క్వార్టర్లలో సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయవచ్చు కానీ.. మొత్తం కార్పొరేషన్‌ను దీనికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించింది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.CJI: We have granted stay; Sibal: they are investigating-why are ED coming here?ASG Raju: We have done nothing wrong CJI: If they have registered FIR, why ED should come? Raju: 1000 crore fraudCJI: Where is the predicate offence? ED passing all limits— Live Law (@LiveLawIndia) May 22, 2025ఇదిలా ఉండగా.. తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో 1,000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తమిళనాడులో రాజకీయ గందరగోళాన్ని సృష్టించింది. తమిళనాడులో మద్యం విక్రయాలపై పూర్తి గుత్తాధిపత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ TASMAC, రాష్ట్ర ఆదాయంలో గణనీయమైన భాగం (సంవత్సరానికి దాదాపు రూ. 45,000 కోట్లు) సమకూరుస్తుంది. ఇది రాష్ట్రంలో 4,700కు పైగా రిటైల్ షాపుల ద్వారా మద్యం పంపిణీ చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. TASMAC కార్యకలాపాలలో బహుళ అవకతవకలు జరిగాయి. ఇందులో టెండర్ మానిప్యులేషన్, అక్రమ నగదు లావాదేవీలు, రూ. 1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపించింది. కాగా ఇటీవల ఈ కేసులో భాగంగా టాస్మార్క్ అధికారుల ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈడీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా TASMAC అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

హైరేంజ్లో హైదరాబాద్
దశాబ్దాల చరిత్రను ఇముడ్చుకున్న హైదరాబాద్ చారిత్రక నగరం మరెన్నో చరిత్రలు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అటు ఐటీ ఇటు రియల్టీ మరోవైపు ఫార్మా, ఇంకోవైపు సినిమా.. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురేలేదు అన్నట్టు ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఈ దూకుడు ఇలాగే కొనసాగనుందని, దేశంలోనే మన సిటీ అగ్రగామిగా అవతరించనుందని జేఎల్ఎల్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక వెల్లడించిన విశేషాల్లో కొన్ని.. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో అభివృద్ధి కేంద్రంగా నగరం స్థిరపడుతోంది. పలు రంగాల్లో ప్రగతితో పాటు ప్రణాళికా బద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరించిన అంతర్జాతీయ స్థాయి జీవనశైలి కారణంగా నగరంలో నివాస, వాణిజ్య గిడ్డంగుల విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, నగరంలో వచ్చే 3–4 సంవత్సరాల్లో లక్ష కొత్త నివాస యూనిట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాన రిటైల్ కంపెనీలు నగరంలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ఐటీ నుంచి స్టార్టప్స్ దాకా..నగరంలో ఐటీ/ఐటీఈఎస్ రంగం సిటీ దూకుడుకు దోహదం చేస్తున్న ప్రధానమైన డ్రైవర్‌గా నిలుస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నగరం 32 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ ఎగుమతులతో దేశంలోనే రెండో స్థానాన్ని సాధించింది. ఇక్కడ 4 వేలకు పైగా స్టార్టప్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని మొత్తం గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాల్లో 15.6 శాతం భాగస్వామ్యంతో నగరం ముందంజలో నిలిచింది. అలాగే, దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో(జీసీసీఎస్) 17 శాతం నగరంలో ఉన్నాయి.హైదరాబాద్‌కి ఈ ఊపు ఎందుకు..?‘హైదరాబాద్‌లో 17 శాతం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు(జీసీసీఎస్) ఉండటం దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన మలుపు కాగా ఈ కేంద్రాల నాణ్యత, పరిధి నగర స్థిరాభివృద్ధికి అండగా నిలుస్తాయి,’ అని ప్రముఖ ఆర్బర్ ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థాపకుడు చిరాగ్ మెహతా అన్నారు. జేయుఎస్‌టివో రియల్ ఫిన్ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పుష్పమిత్ర దాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రానున్న రెండేళ్లలో ఏడాదికి 17–19 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని జోడించనుందని, అలాగే, గిడ్డంగుల సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెంచనుందనీ తెలిపారు.ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్న అంశాల్లో ఆయన అభిప్రాయం ప్రకారం, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఒక సంతులిత ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగింది. ఇది ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్ ఇలా భిన్న రంగాల్లో వృద్ధిని చూపిస్తోంది. మెగా మాస్టర్ ప్లాన్ 2050, ముచెర్ల 4.0 ఐటీ హబ్, మెట్రో రైలు విస్తరణ వంటి ప్రణాళికలు నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా బెంగళూరుతో పోలిస్తే స్తిరాస్తి ధరలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారిందని అన్నారు. ‘నాణ్యమైన వసతులు, తక్కువ ధరలతో వ్యాపారం నిర్వహించాలనుకునే సంస్థలకు హైదరాబాద్ గొప్ప అవకాశం. పలు రంగాల్లో సమతులిత అభివృద్ధి కనిపిస్తుండటంతో పాటు మౌలిక వసతుల పురోగతికి పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు’ అని దాస్ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగిఆఫీస్ స్పేస్‌కి డిమాండ్.. మెరుస్తున్న మాల్స్2019 నుంచి ఇప్పటి వరకు 78.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ల గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాన్ని నగరం జోడించగా, 2024లో 7.31 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం జరిగిందని జేఎల్ఎల్ పేర్కొంది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 6.1 శాతం అధిక వృద్ధిగా తేల్చింది. నగరంలోని గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ స్థలం 9.86 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా లెక్కించింది. ఇక నగరంలో రానురానూ ఖాళీ స్థలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన డిమాండ్‌కి సంకేతంగా భావించవచ్చు. మరోవైపు డేటా సెంటర్ల సామర్థ్యం కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో 23 మెగావాట్ల మేరకు పెరగనుంది. తద్వారా హైదరాబాద్ ఒక ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారనుంది. దీని సామర్థ్యం 2020 మొదటి అర్ధభాగంలో 32ఎం.డబ్ల్యూ నుంచి 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగి 130ఎం.డబ్ల్యూకు చేరుకుంటుంది.

అసలువి మరచి.. కొసరుతో కాలక్షేపం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు గమ్మత్తుగా ఉంటుంది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన విషయం ప్రజలకు గుర్తు రాకుండా చేసేందుకు అన్ని రకాల గిమ్మిక్కులూ చేస్తుంటారు. చిన్న, చితకా విషయాలపై సమీక్షల పేరుతో గంటల కొద్దీ సమావేశాలు పెట్టడం.. ఆ వార్తలు తమ అనుకూల పత్రికల్లో ప్రముఖంగా వచ్చేలా చూసుకోవడం.. ఇదీ బాబు మోడల్.చంద్రబాబు ఈ నెల 19న జరిపిన సమీక్ష సమావేశాలనే ఉదాహరణగా తీసుకుందాం. రెండు అంశాలు. ఒకటి.. ప్రభుత్వ సేవలలో లోపాలకు చెక్ పెట్టాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్‌తో మార్పులు చేయాలి అని!. రెండోది... గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా? అన్నది. మామూలుగా చూస్తే ఇది బాగానే ఉంది కదా? అనిపిస్తుంది. కానీ.. ఇది ఒక ముఖ్యమంత్రి సమీక్షించాల్సిన అంశాలా? కింది స్థాయి అధికారో.. లేక సంబంధిత శాఖల మంత్రులో చేస్తే సరిపోదా? అన్నది ప్రశ్న! పైగా తమ సొంత నిర్ణయాల కారణంగా నిన్న మొన్నటి వరకూ ప్రజలకు అందుతున్న రకరకాల సేవలను తొలగించి ఇలా మాట్లాడటం బాబుకే చెల్లుతుంది!.ఈ సమీక్షలోనే రేషన్ సరుకులు పంపిణీ విషయంలో 74 శాతం మంది తమకు రేషన్ అందుతోందని చెప్పారట. ఆయన అడగాల్సిన ప్రశ్న ఇదా? ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని తొలగించిన తరువాత ఏం జరుగుతోందని కదా?. ఇంటి పట్టున అందే రేషన్ అందక ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. కొన్నిసార్లు రద్దీ కారణంగా తోపులాటలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చిత్తశుద్ధిగల ప్రభుత్వం ఏదైనా ఇళ్లవద్దకే రేషన్ అందివ్వాలా? లేక షాపుల వద్దనైనా ఓకేనా? అని ప్రజలను అడిగి తెలుసుకోవాలి. ఇవేవీ చేయకుండానే.. రేషన్ సరఫరా వాహనాలను సేవల నుంచి తొలగించాలని మంత్రివర్గం ఎలా నిర్ణయించింది? ఎవరిని మభ్య పెట్టడానికి ఈ సమీక్ష!.గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయమూ ఇంతే. ఏజెన్సీల నుంచి సిలిండర్లు తీసుకొచ్చేవారికి ఎంతో కొంత టిప్ ఇవ్వడం సాధారణమే. ఇవ్వకపోయినా చెల్లుతుంది. పైగా ఇలాంటి అంశాల గురించి సాధారణంగా కలెక్టర్లు తమ సమీక్షల్లో చర్చిస్తుంటారు. పౌర సరఫరాల శాఖకు ఒక మంత్రి కూడా ఉన్నారు. వీరి స్థాయిలో జరగాల్సిన పనులను ముఖ్యమంత్రి స్వయంగా చేపట్టడం ఎంత వరకూ సబబు?. వాస్తవానికి బాబు సమీక్షించాల్సిన అంశం తాము ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ ఎలా అమలవుతోంది? అని!. ఏడాదికి ఒక సిలిండర్.. అది కూడా కొంతమందికే ఇవ్వడం వల్ల ప్రజలేమనుకుంటున్నారు? అని!. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎల్లో మీడియాలో రాయించుకుంటే ఏం ప్రయోజనం?. పైగా ఇప్పుడు ఇంకొ కొత్తమాట మాట్లాడుతున్నారు.. మూడు సిలిండర్లకు డబ్బులు ప్రజల ఖాతాల్లోకి వేస్తామూ అంటున్నారు. మంచిదే కానీ.. వీటికి నిధులు ఎక్కడివి అని కూడా చెబితే కదా ప్రజలకు నమ్మకం కుదిరేది?. పంచాయతీలలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతోందని అరవై శాతం మంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కూడా సీఎం స్థాయి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చిన అంశం.జగన్ టైమ్‌లో కొద్దిపాటి నిర్వహణ ఛార్జీలతో చెత్త తరలింపు సమర్థంగా చేపడితే ‘‘చెత్త పన్ను’’ అంటూ బాబు అండ్ కో వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు చెత్తపన్ను తీసేశామని చెప్పి... ఆస్తి పన్ను పెంచేశారు! పోనీ చెత్త తొలగింపు జరుగుతోందా అంటే అది అంతంత మాత్రమే!. చెత్త సరిగా ఎత్తడం లేదని 40 శాతం మంది చెప్పారంటేనే ఆ విషయం స్పష్టమవుతోంది!. స్వచ్చాంద్రప్రదేశ్ పేరుతో చంద్రబాబు ఈ మధ్య ప్రత్యేక సభలు పెడుతున్నారు. ఈ మాత్రం పని పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత మంత్రులు చేయలేకపోయారా?. పంచాయతీ రాజ్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? బహుశా ఆయన సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారేమో మరి.ఆర్టీసీ బస్స్టాండ్లలో సేవలపై ప్రజలలో అసంతృప్తి ఉందని తేలిందట. తాగునీరు, టాయిలెట్లు తదితర సదుపాయాలు బాగోలేవట. ఈ సంగతి ముఖ్యమంత్రి స్థాయిలో కనిపెట్టాలా? మరి సంబంధిత మంత్రి ఏమి చేస్తున్నారు?. ఆర్టీసీకి అవసరమైన నిధులు కేటాయించినా అధికారులు ఎందుకు ఈ సేవలు అందించ లేకపోతున్నారు?. ఇక వాట్సప్ సేవలతో అన్ని జరిగిపోతున్నట్లు ప్రొజెక్టు చేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 375 సేవలు అందిస్తున్నారని, జూన్ 12 నాటికి 500 సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. బాగానే ఉంది. ఇంతవరకు 45 లక్షల మంది ఈ సేవలను వాడుకున్నారట. ఏపీ జనాభా ఐదు కోట్లు అనుకుంటే ఈ సేవలను పది శాతం మంది మాత్రమే వాడుకున్నారన్న మాట!. వాట్సప్ సేవల సంగతేమో కాని, జనం ప్రతీ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వస్తోంది.జగన్ హయాంలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, వలంటీర్ల వ్యవస్థలన్నీ నీరు కార్చి ఇప్పుడు వాట్సాప్ కథలు చెబుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం ఐదు వేల నుంచి పది వేలకు పెంచుతామని ఉగాది నాడు పూజలు చేసి మరీ వాగ్దానం చేసిన చంద్రబాబు దానిని గాలికి వదిలి వేశారు. దీనిపై కూడా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనవసరం లేదా!. ఆరోగ్యశ్రీని క్రమేపి బీమా కిందకు మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా?.కొన్ని ప్రభుత్వ సంస్థలలో నెలల తరబడి జీతాలు అందడం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలపై అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాటిపై సమీక్ష జరిపితే పది మందికి మేలు జరుగుతుంది. ఏది ఏమైనా తాను ఇచ్చిన హామీలను అమలు చేసి ఆ తర్వాత వాటి తీరుతెన్నులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటే ఉపయోగం తప్ప, ఇలా విషయం లేని అభిప్రాయ సేకరణలు జరిపి, ఈ స్థాయిలో వాటిని సమీక్షించడం అంటే అవి సీఎం వద్ద జరిగే కాలక్షేపం మీటింగులే అని ప్రజలు భావిస్తారని చంద్రబాబుకు తెలియదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
జీతం పెంచలేదని ఉద్యోగం మానేసిన మహిళ.. తర్వాత..
చమురుకు మరింత డిమాండ్
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కూటమి నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు రాలేదు: జ్యోతుల నెహ్రూ
‘కేసరి: చాఫ్టర్ 2(తెలుగు వెర్షన్)’ మూవీ రివ్యూ
జూన్ 4న వెన్నుపోటు దినం: వైఎస్ జగన్
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
జీతం పెంచలేదని ఉద్యోగం మానేసిన మహిళ.. తర్వాత..
చమురుకు మరింత డిమాండ్
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కూటమి నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు రాలేదు: జ్యోతుల నెహ్రూ
‘కేసరి: చాఫ్టర్ 2(తెలుగు వెర్షన్)’ మూవీ రివ్యూ
జూన్ 4న వెన్నుపోటు దినం: వైఎస్ జగన్
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
దుబాయ్‌లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
సినిమా

అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
టాలీవుడ్ నటి అనసూయ ఇంట మరో వేడుక జరిగింది. ఇటీవలే నూతన గృహ ప్రవేశం చేసిన అనసూయ.. తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తన కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను జరుపుకున్నారు. ఉపనయనం అంటే మన ఆధ్యాత్మిక పద్ధతులను పాటించండం, వైదిక సంప్రదాయంలో ప్రకారం ఉపనయన వేడుకలో శరీరంపై యజ్ఞోపవీతం (పవిత్ర దారం) ధరిస్తారు. ఈ వేడుకకు సంబంధించిన వేడుకను అనసూయ తన ఇన్‌స్టాలో పంచుకుంది.అనసూయ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా పెద్ద కొడుకు ప్రియమైన శౌర్యభరద్వాజ్.. నీకు ఈ అధికారిక వేడుక అవసరం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఈరోజు నీ ఉపనయనం వేడుకతో నీ తల్లిదండ్రులుగా, కుటుంబంగా మేమంతా కలిసి ఆధ్యాత్మిక పునర్జన్మలోకి అడుగుపెట్టాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు, సూత్రాలు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా.. మన సాంస్కృతిని కొనసాగించేలా వాగ్దానాన్ని తీసుకున్నాం. నువ్వు మన సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. ఆ హనుమాన్ జీ శక్తి నిన్ను ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడిపిస్తుంది' అంటూ పోస్ట్ చేసింది. ఇవాళ హనుమాన్ జయంతి కావడంతో అనసూయ ఈ శుభకార్యం చేపట్టినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.ఉపనయనం అంటే ఏమిటి?ఉపనయనం అనేది ఒక ప్రాచీన హిందూ ఆచారం. ఇది వేదాధ్యయనానికి, ఆధ్యాత్మిక జీవితానికి, సమాజంలో గౌరవప్రతిష్టను అందుకోవడానికి ప్రారంభంగా భావిస్తారు. ఉపనయనం విద్యాభ్యాసం, గురువు-శిష్య సంబంధంలో ముఖ్యమైన దశగా చెబుతారు. ఈ ఆచారం ముఖ్యంగా హిందూ కుటుంబాల్లో కనిపిస్తుంది. ఈ ఆచారం సాధారణంగా అబ్బాయిలకు విద్య నేర్చుకునే తొలి దశగా పరిగణిస్తారు.ఈ ఆచారం అబ్బాయిలకు సంబంధించినది అయినప్పటికీ.. ఆధునిక కాలంలో అమ్మాయిలకు కూడా ఈ ఆచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఇది సంప్రదాయబద్ధంగా చూస్తే కేవలం అబ్బాయిలకు మాత్రమే నిర్వహిస్తారు. పురాణాలలో, హిందూ ధర్మంలో ఈ ఆచారం అబ్బాయిలకే జరిపినట్లుగానే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఉపనయనం వేడుకను సాధారణంగా పిల్లల వయస్సు 7 నుండి 16 సంవత్సరాల మధ్య చేయడం ఉత్తమమని భావిస్తారు. దీనికి కారణం, ఈ వయస్సులో పిల్లలు మానసికంగా, శారీరకంగా బలంగా మారేదశగా గుర్తిస్తారు. ఈ ఆచారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖాండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా పాటిస్తారు.

అట్లీ- బన్ని సినిమా అప్డేట్.. ఫ్యాన్స్‌కి పునకాలు గ్యారెంటీ!
హీరో అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు అట్లీ (Atlee)ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. తమ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో రానున్న సినిమా పనులను స్పీడప్ చేశారు. తాజాగా ఈ చిత్రం ప్రీ డక్షన్ పనుల నిమిత్తమై అల్లు అర్జున్ను కలిసేందుకు హైదారాబాద్ వచ్చారు అట్లీ. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను ముగించేసి, జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలన్నది వీరి ప్లాన్ అని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారట. ఈ మూడు పాత్రల్లో ఒకటి యానిమేటెడ్ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్‌కి పునకాలు తెప్పించే సన్నివేశాలో ఇందులో చాలా ఉండబోతున్నాయట. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగే ఈ చారిత్రాత్మక చిత్రంలో యాక్షన్ సీన్స్ వేరే లెవల్లో ఉంటాయట. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని చిత్రబృందం ముందు నుంచి చెబుతుంది. రూ.700 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటించబోతున్నట్లు సమాచారం.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఐశ్వర్యరాయ్
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సందడి చేసింది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వైట్ శారీలో మెరిసింది. నుదుటన సింధూరం ధరించిన కేన్స్ ఫెస్టివల్లో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌కు భారత ప్రభుత్వం సింధూర్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకగానే ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సింధూరం పెట్టుకుని కనిపించింది. గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కేన్స్ వేదికగా తన లుక్‌తో మద్దతుగా నిలిచారు ఐశ్వర్య. ఈ సందర్భాన్ని చాటిచెప్పేలా ఐశ్వర్య సిందూరం పెట్టుకుని బలమైన సందేశం ఇచ్చారని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరుగుతోంది. ఈ సారి వేడుకల్లో చీరకట్టులో మెరిసిన ఐశ్వర్యరాయ్ ఆమె నటించిన దేవదాస్ సినిమాను గుర్తుకు తెచ్చారు. 2002లో తొలిసారి ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్‌కు చీరకట్టులో హాజరయ్యారు. సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ చిత్రం కోసం ఈ వేడుకల్లో చీరలో కనిపించారు. కొత్త లుక్‌ను చూసిన తర్వాత అభిమానులు దేవదాస్ చిత్రంలోని పార్వతిని గుర్తు చేసుకుంటున్నారు.ఎందుకంటే ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ కనిపించినా ఫ్యాషన్ దుస్తుల్లోనే మెరిశారు. సినీ వేడుకల్లో ఐశ్వర్య లుక్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ ఏడాది ఆమె లుక్ మాత్రం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ ష్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆె చీరను డిజైన్ చేశారు. ఆమె ధరించిన నెక్లెస్‌ను 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపులు, వజ్రాలతో తయారు చేశారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

అప్పుడు బాహుబలి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్.. రెండు చిత్రాలు మన దర్శకధీరుడివే!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈ మూవీని లండన్‌లో ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ఆ ఘనతను దక్కించుకున్న చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. రాయల్ అల్బర్ట్ హాల్ స్థాపించి ఇప్పటి వరకు దాదాపు 154 ఏళ్లు పూర్తయింది. ఈ హాల్ స్థాపించాక ప్రదర్శించిన సినిమాల్లో ఇప్పటి వరకు కేవలం బాహుబలి మాత్రమే నాన్ ఇంగ్లీష్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. 2019లో బాహుబలి మూవీని ఇదే హాల్లో ప్రదర్శించారు.తాజాగా 2025లో ఆర్ఆర్ఆర్ ఈ ఘనతను సాధించింది. బాహుబలి తర్వాత ఈ రికార్డ్ సాధించిన రెండో నాన్ ఇంగ్లీష్ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో టాలీవుడ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా దర్శకధీరుడికే దక్కుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ భారీ అడ్వెంచరస్ మూవీని తెరెకెక్కిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంది. ప్రస్తుతం షూటింగ్‌కు విరామం లభించడంతో రాజమౌళి లండన్ కార్యక్రమానికి హాజరయ్యారు.An SS Rajamouli Film… Does it again!! 🔥🌊 HistorRRRy continues at @RoyalAlbertHall!#RRRMovie is the second non-English film after Baahubali since its inauguration 154 years ago. ✊🏻 https://t.co/AJ9Od2mnD4 pic.twitter.com/FMf5UWHBKM— RRR Movie (@RRRMovie) May 21, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

హామీలు నెరవేర్చలేకే రెడ్‌బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్
క్రీడలు

వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా
ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో కీలక పోరులో విజయం సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. కాగా గతేడాది హార్దిక్ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే.టాప్-4లో అడుగుఇక ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలోనూ వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చిన హార్దిక్ సేన.. బుధవారం ఢిల్లీపై గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది.సూర్య, నమన్ ఫటాఫట్సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్) వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఫాఫ్ బృందాన్ని కోలుకోనివ్వకుండా చేశారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(6)ను అవుట్ చేసి దీపక్ చహర్ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (11)ను బౌల్డ్ పెవిలియన్‌కు పంపాడు.సాంట్నర్, బుమ్రా అదరగొట్టారుఆ తర్వాత మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. క్రీజులో పాతుకుపోవాలని చూసిన సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20)ల రూపంలో కీలక వికెట్లు తీసిన సాంట్నర్.. మరో హిట్టర్ అశుతోష్ శర్మ (18) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ (2) రూపంలో ప్రమాదకర బ్యాటర్‌ను వెనక్కి పంపడంతో పాటు.. మాధవ్ తివారి (3), ముస్తాఫిజుర్ రహ్మమాన్ (0)లను బౌల్డ్ చేసి.. ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ కాగా.. హార్దిక్ సేన 59 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్లో ఎనిమిదో గెలుపు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సాంట్నర్, బుమ్రాలకు బంతిని ఇచ్చేందుకు వెనుకాడను. ఎందుకంటే వారిద్దరు మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో దిట్ట.అంతేకాదు.. ఏ పని చేసినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. వాళ్లిద్దరి వల్లే నా పని సులువైంది. ఈ పిచ్‌పై 160 పరుగుల రావడమే ఎక్కువ అనుకున్నాం. అలాంటి స్థితిలో సూర్య, నమన్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా.. నమన్.. వికెట్ కఠినంగా మారుతున్న వేళ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు’’ అని సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కేవలం మూడు పరుగులే చేశాడు. అదే విధంగా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025

MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం అదరగొట్టింది. సీజన్ ఆరంభంలో తడబడ్డా.. ఆతర్వాత తిరిగి పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. టాప్-4కు అర్హత సాధించింది.కుమారుడితో కలిసి మ్యాచ్ వీక్షించిన నీతాఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆమె కుమారుడు ఆకాశ్ అంబానీ ఆనందంలో మునిగిపోయారు. వాంఖడేలో ప్రత్యక్ష్యంగా మ్యాచ్ వీక్షిస్తూ ఆద్యంతం తమ హావభావాలతో హైలైట్ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.ముందు చేతులు శుభ్రం చేసుకోఈ సందర్భంగా నీతా అంబానీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయంలో నీతా.. ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఆవిడే స్వయంగా బుమ్రా చేతులపై సానిటైజర్ పోశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోవిడ్ కేసుల నేపథ్యంలోకాగా ఇటీవలి కాలంలో కోవిడ్-19 కేసులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రవిస్ హెడ్‌కు ఇటీవల కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నీతా అంబానీ.. బుమ్రా చేతులను సానిటైజ్ చేయడం గమనార్హం.సెలైవాతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశంకాగా ఈసారి ఐపీఎల్లో బౌలర్లు సెలైవా (ఉమ్మి)ను ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే. స్వింగ్ రాబట్టేందుకు పేసర్లు బంతిపై లాలాజలం ఉపయోగించే వీలు కల్పించింది. కరోనా కాలంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా.. విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక బుమ్రా కూడా పేసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య స్పృహతో నీతా అంబానీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.దంచికొట్టిన సూర్య, నమన్ఇక బుమ్రా ఒక్కడికే కాకుండా సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్ తదితరులకు సానిటైజర్ అందించారు నీతా. అందరు ఆటగాళ్లను చేతులను శుభ్రం చేసుకోమని చెప్పారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంత మైదానంలో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (5) విఫలం కాగా.. రియాన్ రెకెల్టన్ (25) ఫర్వాలేదనిపించాడు. విల్ జాక్స్ (13 బంతుల్లో 21) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తిలక్ వర్మ (27) కూడా చేతులెత్తేశాడు.ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపారు. వీరిద్దరి కారణంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.బౌలర్లు చెలరేగడంతోఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీని 18.2 ఓవర్లలో 121 పరుగుల వద్ద ముంబై ఆలౌట్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇలా ముంబై బౌలర్లంతా సమిష్టిగా రాణించి జట్టు గెలుపులో భాగం పంచుకున్నారు. సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఢిల్లీని 59 పరుగుల తేడాతో ఓడించిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025

MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. అతడి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జత చేసింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బుధవారం ముంబై ఇండియన్స్‌తో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆరంభంలో ఆకట్టుకున్నా.. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ (2/48) రెండు వికెట్లతో రాణించగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది.ఢిల్లీ తడ‘బ్యా’టుఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6) పూర్తిగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ (6) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడే ప్రయత్నం చేశారు.అయితే, ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువ సేపు నిలవలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 59 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.అనుచిత ప్రవర్తనఇక ఈ మ్యాచ్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ముకేశ్ కుమార్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఐపీల్ ప్రవర్తనా నియమావళిలలోని ఆర్టికల్ 2.2 (ఆటకు సంబంధించిన వస్తువులు, దుస్తులు, గ్రౌండ్‌కు చెందిన ఎక్విప్మెంట్ను డ్యామేజ్ చేయడం) ప్రకారం ముకేశ్ కుమార్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు.ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు’’ అని ఐపీఎల్ పాలక మండలి తెలిపింది. అయితే, ముకేశ్ కుమార్ చేసిన తప్పేమిటో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న వేళ ఈ ఢిల్లీ పేసర్ కాస్త అసహనానికి లోనైన విషయం తెలిసిందే.ఇక ముంబైతో కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమైన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఈ ఆల్‌రౌండర్ సేవలను జట్టు వినియోగించుకోలేకపోయింది. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఢిల్లీని ముందుకు నడిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవడంతో ఇంటిబాట పట్టింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025

వెస్టిండీస్‌కు ‘భారీ’ షాకిచ్చిన ఐర్లాండ్.. చిత్తు చిత్తుగా ఓడించి..
వెస్టిండీస్‌కు ఐర్లాండ్ క్రికెట్ జట్టు భారీ షాకిచ్చింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (ODI Series)ను ఘనంగా ఆరంభించింది. డబ్లిన్ వేదికగా బుధవారం జరిగిన తొలి పోరులో ఐర్లాండ్ వెస్టిండీస్‌ను ఏకంగా 124 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం వెస్టిండీస్ ఐర్లాండ్‌లో పర్యటిస్తోంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం తొలి వన్డే జరిగింది. ‘ది విలేజ్’ మైదానంలో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 303 పరుగులు చేసింది.ఓపెనర్లలో ఆండీ బాల్బిర్నీ (138 బంతుల్లో 112; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు).. నాలుగో నంబర్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ (56; 6 ఫోర్లు) అర్ధశతకాలు బాదారు. ఇక విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 34.1 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. రోస్టన్ చేజ్ (55; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ 4 వికెట్లు తీశాడు. సెంచరీ హీరో బాల్బిర్నీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తొలి వన్డేలో విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో వన్డే జరగనుంది. కాగా ఓవరాల్‌గా వెస్టిండీస్‌పై ఐర్లాండ్కిది నాలుగో విజయం కావడం విశేషం. ఇదీ చదవండి: విండీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు షాక్లండన్: ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 29న ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్చర్‌కు కుడిచేతి బొటనవేలికి గాయమైంది. లీగ్ వారం వాయిదా పడగానే స్వదేశానికి చేరుకున్న అతను తిరిగి ఐపీఎల్ పునఃప్రారంభమైనప్పటికీ గాయం కారణంగానే భారత్‌కు రాలేకపోయాడు.గాయపడిన అతని పరిస్థితిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, రెండు వారాల తర్వాత మరోసారి గాయం తీవ్రతను సమీక్షిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే ఆర్చర్‌కు గాయమవడం... జట్టుకు దూరమవడం ఇదేం కొత్త కాదు. సుదీర్ఘకాలంగా అతను మోచేతి గాయంతో సతమతమయ్యాడు. పలుమార్లు సర్జరీలు కూడా జరిగాయి.తర్వాత వెన్నెముక గాయంతో చాన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అమెరికా, కరీబియన్లు ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌తో పునరాగమనం చేశాడు. ఈ ఏడాది పాక్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అతని స్థానంలో లాంకషైర్‌కు చెందిన లెఫ్టార్మ్ సీమర్ ల్యూక్ వుడ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇదివరకే టీ20 జట్టుకు ఎంపికైన వుడ్‌కు ఇప్పుడు వన్డే జట్టులోనూ స్థానం దక్కింది. 2022–23 సీజన్లో రెండు వన్డేలాడిన ల్యూక్ వుడ్ ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. చదవండి: IPL 2025: ‘ప్లే ఆఫ్స్’కు ముంబై█▓▒▒░░░Score update░░░▒▒▓█What a hundred from Balbo 👏👏👏▪️Ireland 256-3 (44 overs)👀 WATCH: TNT Sport 2 (411)📝 SCORECARD: https://t.co/9cwPX120LU#BackingGreen #TokenFi @solar_failte☘️🏏 pic.twitter.com/Sgvq0EOBDp— Cricket Ireland (@cricketireland) May 21, 2025
బిజినెస్

కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగి
పని ప్రదేశంలో ప్రతికూల వాతావరణం కారణంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతికా పాయ్ ఆరోపిస్తూ కంపెనీపై సివిల్ దావా వేశారు. రూ.35.3 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనను ఉద్దేశపూర్వకంగా రాజీనామా చేయించారని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు మే 7న ఈ కేసును విచారించి బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టుకు తరలించింది. దీనిపై జూన్ 9న బెంగళూరులో విచారణ జరగనుంది.స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎక్స్‌పర్ట్‌గా కంపెనీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాయ్ జులై 2024లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పార్ట్నర్స్ కంట్రీ హెడ్‌గా పాయ్ ఉన్నారు. తాను నాయకత్వం వహించిన ఫ్లాగ్షిప్ స్టార్టప్ ఇనిషియేటివ్ ‘హైవే టు ఏ 100 యూనికార్న్స్’పై గతంలో కంపెనీ అంతర్గత దర్యాప్తు నిర్వహించింది. తరువాత ఎనిమిది నెలలపాటు తనపై బెదిరింపులకు పాల్పడినట్లు పాయ్ ఆరోపించారు. 2019లో మైక్రోసాఫ్ట్ వెంచర్ క్యాపిటల్ వ్యవహారాల్లో పక్షపాతంగా ఉంటున్నారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు పాయ్పై అభియోగాలు నమోదయ్యాయి. దాంతో దర్యాప్తు నిర్వహించి పాయ్ ఎలాంటి తప్పు చేయలేదని తేలడంతో 2021లో పదోన్నతి పొందారు.ఇదీ చదవండి: ‘రూ.కోట్లున్నా మాకొద్దీ వ్యాపారం..’ మారుతున్న దృక్పథంతర్వాత కొంత కాలానికి న్యాయ సంస్థ మోర్గాన్ లూయిస్ అండ్ బోకియస్ 2024 మార్చిలో రెండో దఫా దర్యాప్తును ప్రారంభించింది. అయితే మైక్రోసాఫ్ట్ విధానానికి విరుద్ధంగా 2024లో ఒక కీలక ఇంటర్వ్యూను రికార్డ్ చేయకుండా విచారణ నిర్వహించారని పాయ్ పేర్కొన్నారు. వీటిపై తన అభ్యంతరాలను కంపెనీ వ్యతిరేకించిందని చెప్పారు. ఆమెను కీలక పదవుల నుంచి తొలగించి ‘ట్రబుల్‌మేకర్’గా ముద్ర వేశారని తెలిపారు. 2020 సైబర్ బుల్లీయింగ్ కేసులో మైక్రోసాఫ్ట్ తగిన చర్యలు తీసుకోలేదని పాయ్ ఆరోపించారు. మైక్రోసాఫ్ట్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సహకారం సందేహాస్పదంగా ఉందని ఆమె అన్నారు.

పాదరసంలా పసిడి ధరలు! తులం ఇప్పుడు..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) పాదరసంలా కదులుతున్నాయి. క్రితం రోజున సర్రున ఎగిసిన పసిడి ధరలు నేడు (మే 22) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు మరింత భారం తప్పదు. మే 22 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.👉ఇది చదివారా? ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,060🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి. వెండి ధరలూ..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.1000 పెరిగి రూ.1,12,000 వద్దకు చేరింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.1000 ఎగిసి రూ. 1,01,000 లను తాకింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 225 పాయింట్లు దిగజారి 24,587కు చేరింది. సెన్సెక్స్(Sensex) 736 ప్లాయింట్లు పడిపోయి 80,813 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.61 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.41 శాతం పడిపోయింది.భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య అధికమవుతుంది. వారం రోజుల్లో 170కి పైగా కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఫ్లైట్ జర్నీ.. 1.43 కోట్ల మంది విమానమెక్కారు
న్యూఢిల్లీ: దేశీయంగా ఏప్రిల్‌లో 1.43 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1.32 కోట్లతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 8.45 శాతం పెరిగింది. మార్కెట్ వాటాపరంగా చూస్తే 64.1 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఎయిరిండియా గ్రూప్ (27.2 శాతం), ఆకాశ ఎయిర్ (5 శాతం), స్పైస్‌జెట్ (2.6 శాతం) ఉన్నాయి. 2025 జనవరి–ఏప్రిల్ మధ్యకాలంలో దేశీ విమానయాన సంస్థలు 5.75 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నెలవారీ రిపోర్టులో వెల్లడించింది. వార్షికంగా చూస్తే ఈ సంఖ్య 9.87 శాతం, నెలవారీగా చూస్తే 8.45 శాతం పెరిగినట్లు వివరించింది. సమయ పాలనపరంగా (ఓటీపీ) చూస్తే 80.8 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. 77.5 శాతం ఓటీపీతో ఆకాశ ఎయిర్, 72.4 శాతంతో ఎయిరిండియా గ్రూప్ .. ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. స్పైస్‌జెట్ సమయ పాలన అత్యంత కనిష్ట స్థాయిలో 60 శాతంగా నమోదైంది.
ఫ్యామిలీ

ఇంటర్వ్యూకెళ్ళాలంటే భయం!
నేను బీటెక్, ఎం. బి.ఎ. చేశాను. చదువులో మొదట్నుంచి టాప్! ఈ మధ్య చాలా చోట్ల నుండి – ఇంటర్వ్యూలు వస్తున్నాయి. కానీ ఇంటర్వ్యూ కెళ్ళాలంటేనే దడ పుట్టుకొస్తుంది. ఆ మధ్య హైద్రాబాద్‌లో ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకెళితే, వెయిటింగ్ హాల్లో వొళ్ళంతా వణుకుడు, చెమటలు పట్టి విపరీతమైన భయం వేసి శ్వాస కూడా ఆడలేదు. చివరికి లోపలికి వెళ్ళిన తరువాత వారడిగే ప్రశ్నలకు సమాధానాలు తెల్సినా, టెన్షన్, మాట తడబడటం, మైండ్ల్బ్లాక్ కావడంతోఒక్క ప్రశ్నకు కూడా సరిగా ఆన్సర్ చెప్పలేక పోయాను. చదువులో అంత టాప్‌లో ఉన్న నాకు ఇంటర్వ్యూ విషయానికొచ్చేసరికి ఎందుకిలా అవుతోందో అర్థం కావడం లేదు. ఈ భయం వల్ల మంచి ఆఫర్స్ కూడా చేతులారా పోగొట్టుకుంటున్నాను. అందరి లాగా నేను కూడా ఇంటర్వ్యూలు ధైర్యంగా ఫేస్ చేయగలనంటారా?– రవిచంద్ర, కాకినాడ చదువులో టాప్‌లో ఉండి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న మీరు కేవలం ఈ ఇంటర్వ్యూ భయం వల్ల వచ్చిన ఆఫర్స్ పోగొట్టుకుంటున్నారన్న విషయం బాధాకరమైందే. మంచి తెలివి తేటలు, క్వాలిఫికేషన్స్ ఉండి కూడా కేవలం ఈ ఇంటర్వ్యూ భయం వల్ల ఇలా వెనకబడిపోతున్నారు. ‘సోషల్ యాంక్సైటీ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనయిన వారిలో ఇలాంటి భయాలుంటాయి. కొందరికి నలుగురిలో కలవాలంటే భయం. మరికొందరికి స్టేజి మీద మాట్లాడాలన్నా, గుంపులో కలవాలన్నా అమితమైన భయం, సిగ్గు, మొహమాటం. ముడుచుకు΄ోయి ఒక మూలగా ఒంటరిగా ఉండటం ఇవన్నీ ఈ సోషల్ యాంక్సైటీ లక్షణాలే! వారసత్వం వల్ల కొందరు, కుటుంబ వాతావరణం వల్ల మరి కొందరు ఈ మానసిక రుగ్మతకు లోనయ్యే అవకాశముంది. దీనివల్ల ఎంత మెరిట్ ఉన్నా, ఉద్యోగంలో, జీవితంలో నెగ్గుకు రాలేరు. మరికొందరు అన్నింటిలో యావరేజ్లో ఉన్నా ఇలాంటి భయాలేం లేకుండా ఆత్మవిశ్వాసంతో అన్నింటిలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇది కూడా ఒక మానసిక రుగ్మత అన్న విషయం తెలియక చాలామంది అలాగే ఉండిపోతున్నారు. ఈ సమస్యను కొన్ని మానసిక చికిత్స పద్ధతుల ద్వారా, మరి కొన్ని మంచి మందుల ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు. జాకబ్సక్సెస్ రిలాక్సేషన్, ‘డీసెన్సిటైజేషన్, మైండ్ ఫుల్ నెస్, ‘వర్చువల్ రియాలిటీ’ అనే ఆధునిక పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని పూర్తిగా ఈ సమస్య నుండి పూర్తి బయట పడవేయవచ్చు. వెంటనే సైకియాట్రిస్టుని సంప్రదించండి. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైక్రియాట్రిస్ట్, విజయవాడ, మీ సమస్యలు, సందేహాల కోసం పంపవల్సిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com(చదవండి: హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..)

హనుమ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాసం
సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యంచేసే తెగువ, అసాధారణ కార్యదక్షత, భయాన్నీ, నిరాశానిస్పృహలను దరిచేరనివ్వని ధీశక్తి... ఈ లక్షణాలకు తోడు ఎదుటివారిని ప్రభావితం చేయగలిగే వాక్పటుత్వం... ఇవన్నీ కలబోసుకున్న ఒక విశిష్ఠ వ్యక్తి హనుమ. కేవలం ఆయనను దైవంగా పూజించడంతో సరిపెట్టుకోకుండా ఆయన బుద్ధిబలం, దేనినైనా సాధించి తీరాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యం, దేహ దారుఢ్యం వంటి వాటిని అలవరచుకోగలగాలి. నేడు హనుమజ్జయంతి సందర్భంగా ఆయనలోని వ్యక్తిత్వ వికాస కోణాన్ని చర్చించుకుందాం.జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. అయినా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరం మీద నుంచి చూసి భయపడిపోతున్న సుగ్రీవునికి ధైర్యం చెప్పేప్రయత్నం చేస్తాడు హనుమ ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే సుగ్రీవునికే కాదు మనకు కూడా నిర్భయత్వాన్ని అలవరచుకోవాలనే పాఠం చెప్పే గురువుగా.. మంత్రిగా... సన్మిత్రుడిగా దర్శనమిస్తాడు. ‘సుగ్రీవా! నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని భయపడితే ఎలాగయ్యా.. నడక చేత, అవయవాల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు?‘ ఈ విధంగా హనుమ తొలిసారిగా కనిపించగానే నిర్భీకతను బోధించే గురువుగా దర్శనమిస్తాడు.సమయోచిత వేష భాషలుఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ అవసరమని చెపుతూ ఉంటాం. సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక యతి వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా! తాను స్వతహాగా అత్యంత శక్తిమంతుడైనా వ్యక్తి కంటే ధర్మం గొప్పది అని నమ్మిన వాడు గనకనే అధర్మపరుడైన వాలితో కాక సుగ్రీవునితోనే వుంటాడు ఆంజనేయుడు. అతను మాట్లడిన నాలుగు మాటలకే మురిసి పోతాడు తానే పెద్ద వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు. హనుమంతుని సంభాషణా చాతుర్యాన్ని గురించి ‘‘చూశావా లక్ష్మణా, ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడం లేదు, లలాటం అదరడం లేదు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని అనవసరంగా కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నాడు’’ అని రాముడు తన సోదరుడైన లక్ష్మణునితో చెబుతాడు. అంటే దీనిని బట్టి మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి.ఆయన జీవితమే ఓ పాఠ్యపుస్తకంనేను చేపట్టిన కార్యం అసాధ్యమేమో అని భయపడుతూ ఉండిపోతే ఏ కార్యం కూడా సాధ్యం కాదు... ఉదాహరణకు హనుమకు అప్పగించిన పనినే తీసుకోండి. సీతను అతను ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎలాఉంటుందో తెలియదు. ఆమెను ఎత్తికెళ్ళింది ఎవరో తెలియదు ఎక్కడ దాచి ఉంచాడో తెలియదు. ఐనా నెల రోజులలో ఆమె ఆచూకీ తెలుసుకొని వస్తానని బయలుదేరతాడు హనుమంతుడు. అంటే సవాళ్లను స్వీకరించి వాటిని సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అనే అంశాన్ని నేర్చుకోవడానికి హనుమ జీవితమే మనకు ఒక పెద్ద ఉదాహరణ. వినయగుణ సంపన్నుడుసముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమ ప్రవర్తన చూసి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేర్చుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేటంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ ఎగిసి ఎగిసి పడలేదు. శ్రేయాంసి బహు విఘ్నాని అని ఉత్తమ కార్యంలో అనేక విఘ్నాలు ఎదురవుతూనే ఉంటాయి. అవాంతరాలను ఎదుర్కొని కార్య సాధన చేయడమెలాగో, తొణకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కపెట్టడమెలాగో హనుమనే మనకు చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి ΄÷మ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలంగా కనిపించే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. భుజబలాన్నీ, బుద్ధి బలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటి లోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం ఇది ఒక గొప్ప కళ. అశోక వనంలో సీతతో మాట్లాడుతున్నప్పుడు చూడాలి హనుమ చాతుర్యం. ‘అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా‘ అన్న పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి.సమర్థుడైన కార్యసాధకుడుఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమ దగ్గర నేర్చుకోవాలి. అంతిమ విజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవ తీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి. సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించే అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. అక్కడికక్కడ నిర్ణయాలను తీసుకోగలగడం ఒక సమర్థుడైన కార్యసాధకుడి లక్షణం. హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వ వికాస లక్షణాలనూ, సకారాత్మక ఆలోచనా విధానాన్నీ, యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. సంభాషణా చతురుడులంక నుంచి తిరిగి వచ్చిన తరువాత దూరంనించే ‘దృష్టా సీతా‘ అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు. అలాకాకుండా మైనాకుడూ, సరమా, సింహికా, లంఖిణీ అని నస మొదలు పెడితే వినేవారికి ఆందోళన. పెరిగిపోవడం ఖాయం. అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాతుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీద కూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇదీ మనం నేర్చుకోవాలి హనుమ దగ్గర. ఎలాంటి వారికైనా సహజంగానే పరిస్థితుల ్రపాబల్యం వల్ల ఒక్కొక్కసారి దారుణమైన ఆవేదన, గ్లాని కలుగుతూ ఉంటాయి గానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలిగి, నిర్వేదం నుంచి తక్షణమే బయటపడగలిగితేనే ఏదైనా సాధించగలం. – డి.వి.ఆర్.

అందమైన సమాజం!!
హైదరాబాద్‌లోని ట్రై డెంట్ హోటల్లో మిస్ వరల్డ్ 2025 పాజంట్స్ మధ్య కలివిడిగా తిరుగుతున్నారు షానియా బాలెస్టర్. కొత్తగా కనిపించిన వారిని తానే ముందుగా పలకరించి ‘ఐ యామ్ ఫ్రమ్ జిబ్రాల్టర్’ అని పరిచయం చేసుకుంటోంది. దేశం పేరు అడగకుండానే చెబుతోంది, తన పేరు మాత్రం అడిగితే తప్ప చెప్పడం లేదు. ‘భౌగోళికంగా దేశాలుగా విడిపోయిన మనందరిదీ ఒకటే ప్రపంచం’ అన్నారు షానియా బాలెస్టర్. చిన్న దేశం ‘‘మిస్ వరల్డ్ 2025కి క్యాప్షన్ బ్యూటీ విత్ పర్పస్. నాకు సంబంధించినంత వరకు ప్రపంచపటంలో జిబ్రాల్టర్ అనే దేశం ఒకటుందని ప్రపంచానికి తెలియచేసే అరుదైన అవకాశం. జిబ్రాల్టర్ చాలా చిన్నదేశం. జనాభా ముప్ఫై ఐదు వేల లోపే. ప్రపంచంలోని అనేక ఖండాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో మా దేశం రకరకాల సంస్కృతుల నిలయమైంది. దాంతో ఇండియా కూడా నాకు సుపరిచితమైన దేశంలానే అనిపిస్తోంది. హైదరాబాద్ ఆహారం కొంచెం ఘాటుగా అనిపించినప్పటికీ చాలా రుచిగా ఉంది. ప్రపంచానికి పరిచయం నా కెరీర్ మోడలింగ్. నాకు సంతోషాన్నిచ్చే పని చారిటీ. నాలుగేళ్ల నుంచి మోడలింగ్‌కు కొంత విరామం ఇచ్చి బ్యూటీ కాంటెస్ట్ మీద దృష్టి పెట్టాను. మిస్ జిబ్రాల్టర్ కిరీటంతోనే ఆగిపోయి ఉంటే ఆ విజయం నాకు మాత్రమే పరిమితమయ్యేది. నా విజయం నా దేశానికి ఉపయోగపడాలంటే అది ప్రపంచ వేదిక మీదనే సాధ్యమవుతుంది. మాది సార్వభౌమత్వం సాధించాల్సిన దేశం. ఇప్పుడు మాకున్న గుర్తింపు బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీగానే. ఈ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వందకు పైగా దేశాలకు మా దేశం పరిచయమైంది. అందాల పోటీల ద్వారా దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమవుతాయి. ప్రపంచం అంతా ఒకటేననే భావన పెంపొందుతుంది. రెండు దేశాల మధ్య మాత్రమే కాదు ప్రపంచదేశాలన్నింటి మధ్య సుçహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఒక దేశం చరిత్ర మరొకరికి అర్థమవుతుంది, సాంస్కృతిక గొప్పదనం అవగతమవుతుంది. మనకిప్పటి వరకు తెలియని అనేక దేశాల గురించి తెలుసుకుంటాం. ఒకదేశం ఔన్నత్యం గురించి మరొక దేశంలో సందర్భోచితంగా తెలియచేయగలుగుతాం. అవసరమైన సందర్భంలో సంఘీభావంతో వ్యవహరించగలుగుతాం. అందం మనసుదే మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది. నిజానికి అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. దయ, కరుణ, అర్థం చేసుకోవడం. ఎదుటి వారి కష్టాన్ని వారి దృష్టి కోణం నుంచి విశ్లేషించుకుని అర్థం చేసుకోగలిగిన మనసు ఉండడమే నిజమైన అందం. ఈ బ్యూటీ పాజంట్ తర్వాత కూడా నా సర్వీస్‌ని కొనసాగిస్తాను. అయితే భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పుడే చెప్పలేను. నా దేశం సార్వభౌమాధికారం సాధించడానికి నేనేం చేయగలనో అంతా చేస్తాను’’ అన్నారు మిస్ వరల్డ్ జిబ్రాల్టర్ షానియా బాలెస్టర్. మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది.– షానియా – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్

గ్లోబల్ నర్సింగ్ స్టార్స్
చండీగఢ్‌లోని ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్’కి చెందిన సుఖ్‌పాల్ కౌర్, అహ్మదాబాద్‌లోని ‘హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్’కి చెందిన విభా సలాలియా 199 దేశాలలోని లక్ష మంది అభ్యర్థుల నుంచి గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ తుది జాబితాకు ఎంపికయ్యారు.నర్సింగ్ గత సంవత్సరాలలో ఎలా మారిందో, గ్లోబల్ నర్సింగ్ స్టాండర్స్‌తో సమానంగా ఉండడానికి మన దేశంలో ఏం చేయవచ్చో... మొదలైన అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంది.చాలా మార్పులుపంజాబ్లోని గురుదాస్‌పూర్‌లో పుట్టిన సుఖ్‌పాల్ కౌర్‌కు సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను నర్సింగ్‌లో చేరేలా చేసింది. ‘ఇతరులకు సహాయపడాలనే నా తత్వానికి నేను ఎంచుకున్న వృత్తి బాగా సరిపోయింది’ అంటారు కౌర్. ప్రస్తుతం ఆమె ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్’కి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడే ఆమె బీఎస్సీ, మాస్టర్స్, నర్సింగ్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు.నిజానికి ఆమె ఈ ఇన్స్టిట్యూట్లో క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరారు. క్రమంగా లెక్చరర్, అసోసియేట్ప్రొఫెసర్ అయ్యారు. ప్రిన్సిపల్ కావడానికి ముందు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ప్రమోట్ అయ్యారు. ‘నర్సింగ్ విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మేము క్రిటికల్ కేర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్‌లాంటి ఏడు స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లను నడుపుతున్నాం’ అంటున్నారు 58 సంవత్సరాల కౌర్.తలకు గాయాలు అయిన పేషెంట్ల కోసం నర్స్‌ల ఆధ్వర్యంలో క్లినిక్స్నుప్రారంభించారు కౌర్. మన దేశంలో మొట్టమొదటి ఎంఎస్సీ నర్సింగ్ప్రోగ్రామ్ ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్‌ను లీడ్ చేస్తున్నారు కౌర్. ‘మేము మొదట్లో మాన్యువల్‌గా చెక్ చేసేవాళ్లం. ఇప్పుడు ముఖ్య లక్షణాలు నేరుగా చూపించే మానిటర్స్ వచ్చాయి. ఇది టైమ్‌ను సేవ్ చేస్తుంది. ఇక చదువుకు సంబంధించి చాక్, బ్లాక్‌బోర్డ్ నుండి మల్టీమీడియా క్లాస్‌రూమ్‌లు, ఇంటరాక్టివ్ బోర్డ్స్, ఫ్లిప్ క్లాస్‌రూమ్‌లకు మారాయి. ఫ్లిప్ క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్స్ ముందుగానే ప్రిపేర్ అవుతారు’ అంటున్నారు కౌర్.బాల్య జ్ఞాపకమే బాట చూపింది...మెంటల్ హెల్త్ కేర్ని మార్చడానికి తన కెరీర్‌ను అంకితం చేశారు యాభై ఆరు సంవత్సరాల విభా సలాలియా. 33 సంవత్సరాల వృత్తి అనుభవాన్ని గుజరాత్‌లోని మెంటల్ హెల్త్ కేర్ని మెరుగుపరచడంలో ఉపయోగించారు. మానసిక అనారోగ్యం బారినపడిన వేలాదిమందికి అండగా ఉన్నారు. వారు ఆత్మగౌరవంతో బతికేలా చేశారు.‘మెంటల్ హెల్త్ కేర్’పై విభా ఆసక్తి చూపడానికి కారణం... బాల్య జ్ఞాపకం.‘మా ఇంటి బయట ఒక మహిళ చింపిరి జుట్టుతో, శుభ్రత లేకుండా అస్తవ్యస్తంగా కూర్చొని ఉండడం నాకు గుర్తుంది. ఊరివాళ్లు ఆమెను అవమానించి పిచ్చిది అని పిలిచేవాళ్లు. ఆమెకు సహాయం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉండి బాధపడేదాన్ని’ తన బాల్య జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు విభా సలాలియ.ఈ జ్ఞాపకమే తనను మెంటల్ హెల్త్ నర్సింగ్‌లో స్పెషలైజ్ చేయడానికి కారణం అయింది. నిజానికి విభా రెగ్యులర్ బీఎస్సీలో చేరారు. అయితే తన బంధువు ఒకరు అడ్మిట్ అయిన హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు నర్సింగ్‌ని ప్రొఫెషనల్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.‘మా బంధువును నర్స్‌లు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ దృశ్యాలు చూసిన తరవాత ఎలాగైనా నర్సింగ్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. బీఎస్సీ కోర్సు వదిలేసి అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్లో నర్సింగ్ లో చేరాను’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు విభా.నర్సింగ్ విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మేము క్రిటికల్ కేర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్‌లాంటి ఏడు స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లను నడుపుతున్నాం.– కౌర్
ఫొటోలు


HHVM మూవీ ఈవెంట్లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)


Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)


ప్రసాద్ ఐమ్యాక్స్ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్ ఈవెంట్ రానా సందడి (ఫొటోలు)


హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)


హనుమాన్ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)


విజయ్ సేతుపతి 'ఏస్' మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)


'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)


కుమారుడి టాలెంట్ చూసి మురిసిపోతున్నడైరెక్టర్ సుకుమార్ భార్య (ఫొటోలు)


Cannes 2025 : కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్ (ఫోటోలు)
అంతర్జాతీయం

జైళ్లనిండా బుల్లి ఫోన్లే
ఇది రికార్డుల కోసం తయారు చేసిన బుల్లి ఫోన్ కాదు. ఎంచక్కా పని చేస్తుంది. ఫ్రాన్స్ జైళ్లలో ఖైదీలు వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. జైలు నుంచే దర్జాగా డ్రగ్ డీల్స్ మొదలుకుని కాంట్రాక్ట్ హత్యల దాకా నానా దందాలూ చక్కబెట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెంచి జైళ్లలో నిబంధనల జాడే లేనంతగా అరాచకం రాజ్యమేలుతోందని జనం మండిపడుతున్నారు. దాంతో జైళ్లలో ఫోన్ల వాడకంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ‘ప్రిజన్ బ్రేక్’ పేరిట మంగళవారం దేశవ్యాప్తంగా ఏకంగా 66 జైళ్లలో ఏకకాలంలో తనిఖీ ఆపరేషన్ నిర్వహించారు. కరడుగట్టిన ఖైదీల వద్ద ఇలాంటి బుల్లి ఫోన్లు వేలాదిగా దొరకడంతో విస్తుపోయారు. కేవలం సిగరెట్ లైటర్ పరిమాణంలో ఉండే ఈ ఫోన్లన్నీ చైనా పీసులేనని విచారణలో తేలడం విశేషం! ఆపొరి్టక్ అనే ఫ్రెంచి కంపెనీ వీటిని విక్రయిస్తోంది. జైళ్లలో జరిపే ఎలాంటి ఎల్రక్టానిక్ తనిఖీలకూ ఇవి చిక్కవని వెబ్సైట్లో బాహాటంగా ప్రచారం చేసుకుంటోంది! దాంతో సదరు కంపెనీని ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టింది.

పాక్ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్
ఇస్లామాబాద్: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అత్యున్నత మిలటరీ హోదా అయిన ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై చర్చించి, ఆమోదం తెలిపిందని పేర్కొంది.ఇటీవల భారత్‌తో తలెత్తిన సైనిక ఉద్రిక్తతల సమయంలో పాక్ బలగాలను విజయం దిశగా నడిపించిన మునీర్ పదోన్నతి పొందారని స్థానిక మీడియా తెలిపింది. ఈ విషయంలో ఆయన అద్వితీయమైన పాత్ర పోషించారని ప్రశంసించింది. యుద్ధంలో తమదే విజయమంటూ పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటుండగా, భారత్ మాత్రం సాక్ష్యాధారాలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై వాస్తవాలను వివరిస్తూ వస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ తిరుగులేని అధికారాలను చెలాయిస్తున్న మునీర్‌కు ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం తెల్సిందే. తాజాగా, ఆయనకు ప్రమోషన్ సైతం లభించడం గమనార్హం. Government of Pakistan has promoted Army Chief General Asim Munir to the rank of Field Marshal. ⭐⭐⭐⭐⭐ pic.twitter.com/NNrAM9Npzp— Ambassador Murad Baseer (@muradbaseer) May 20, 2025

అశ్లీల కంటెంట్‌పై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఆన్లైన్లో అశ్లీల కంటెంట్‌పై అమెరికా కొరడా ఝళిపించింది. దాని నియంత్రణకు ‘టేకిట్ డౌన్’ పేరిట కొత్తం చట్టం తెచ్చింది. దీనిప్రకారం వ్యక్తుల తాలూకు అశ్లీల, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడానికి వీల్లేదు. సోషల్ ప్లాట్‌ఫాంలు అలాంటి కంటెంట్‌ను తమ దృష్టికి రెండు రోజుల్లోగా తొలగించాల్సి ఉంటుంది.ఈ నిబంధన డీప్‌ఫేక్ కంటెంట్‌కు కూడా వర్తిస్తుంది. ఈ చట్టం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎన్నాళ్లుగానో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లుపై సోమవారం ఆమె సమక్షంలోనే ట్రంప్ సంతకం చేశారు. అనంతరం ఆయన కోరిక మేరకు మెలానియా కూడా బిల్లుపై సంతకం చేయడం విశేషం. ‘‘దీనికోసం మెలానియా ఎంతగానో పోరాడింది. కనుక ఆమె సంతకానికి అర్హురాలు’’ అని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.

బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే..
లండన్: భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నవారిపై ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన బ్రిటిష్ అకాడమిక్ నితాషా కౌల్(Nitasha Kaul)కు చెందిన ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) స్టేటస్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా సాయంతో వెల్లడించారు.తాను భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నానని, ప్రత్యేకించి తన రచనలు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు.. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భారత ప్రభుత్వం తనపై ఆరోపణలు గుప్పించిందని నితాషా కౌల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌లో జన్మించిన కౌల్ కశ్మీరీ పండిట్, బ్రిటిష్ పౌరురాలు. ఆమె వెస్ట్మిన్స్టర్ విశ్వవిద్యాలయం(University of Westminster)లో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ (సీఎస్డీ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, యాక్టివిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం తన ఓసీఐ స్టేటస్‌ను రద్దు చేయడాన్ని క్రూరమైన, ప్రతీకార చర్యగా ఆమె అభివర్ణించారు.2024 ఫిబ్రవరిలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ‘రాజ్యాంగం, భారత ఐక్యత" అనే అంశంపై ఒక సమావేశంలో ప్రసంగించేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న నితాషాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, లండన్‌కు తిరిగి పంపించారు. ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను విమర్శించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు నాడు తెలిపారు. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో నితాషా కౌల్.. భారతదేశ సార్వభౌమత్వంపై దురుద్దేశపూరితంగా, వాస్తవాలు లేదా చరిత్రను పట్టించుకోకుండా రచనలు, ప్రసంగాలు, జర్నలిస్టిక్ కార్యకలాపాటు సాగించినట్లు పేర్కొంది. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్దేశించిన ఓసీఐ నిబంధనల ప్రకారం, భారత ప్రభుత్వం ఏ వ్యక్తి కి చెందిన ఓసీఐ రిజిస్ట్రేషన్‌ను అయినా కొన్ని నిర్దిష్ట కారణాలతో రద్దు చేయవచ్చు.ఇది కూడా చదవండి: ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..
జాతీయం

మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన
శ్రీనగర్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్ కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్, పాక్ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.Delhi–Srinagar IndiGo flight hit by severe turbulenceFlight 6E-2142 was caught in a terrifying hailstorm just before landing in Srinagar, forcing an emergency landing around 6:30pm. Damage to plane's nose cone, cabin luggage tumbling. #6E2142 #indigo6e pic.twitter.com/gHKFxpn7SI— Lucifer (@krishnakamal077) May 21, 2025ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది.

కేంద్రంపై స్టాలిన్ పోరాటం.. సుప్రీంలో పిటిషన్
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వశిక్ష అభియాన్ నిధుల కోసం తమిళనాడు ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. 2024–2025 సంవత్సరానికి రూ.2,151 కోట్లకు పైగా నిధులను నిలిపేయడాన్ని సవాలు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ విద్యా విధానం 2020ని డీఎంకే ప్రభుత్వం అమలుచేయకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వ శిక్ష అభియాన్ నిధులను కేంద్రం నిలుపుదల చేసింది. జాతీయ విద్యా విధానం అమలుతోనే నిధులు వస్తాయని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేంద్రంపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. సర్వశిక్ష అభియాన్ నిధులను జాతీయ విద్యావిధానాన్ని అనుసంధానిస్తూ కేంద్రం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం, అసమంజసమైనదని పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ పెట్టిన వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోమారు ప్రభుత్వం కేంద్ర నిధులపై పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

సెలవుల్లో పని చేయడానికి లాయర్లు ఇష్టపడడం లేదు
న్యూఢిల్లీ: సెలవు రోజుల్లో పని చేయడానికి న్యాయవాదులు ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు పెండింగ్ కేసులు పరిష్కరించడం లేదంటూ న్యాయ వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని పేర్కొంది. తమ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత ప్రారంభించాలని కోరిన ఓ న్యాయవాది పట్ల ధర్మాసనం బుధవారం అసంతృప్తి వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టులో మొదటి ఐదుగురు న్యాయమూర్తులు వేసవి సెలవుల్లోనూ విధులు నిర్వర్తిస్తారని తెలియజేసింది. అయినప్పటికీ బ్యాక్లాగ్ కేసుల విషయంలో తమపై నిందలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. వాస్తవానికి వేసవి సెలవుల్లో పని చేయడం లాయర్లకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టుకు ఈ నెల 26 నుంచి జూలై 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయస్థానం నోటిఫికేషన్ జారీ చేసింది. సెలవుల సమయంలోనూ ధర్మాసనాలు పాక్షికంగా పని చేయాలని సూచించింది. రెండు నుంచి ఐదు వెకేషన్ బెంచ్‌లు పని చేయాలని నిర్దేశించింది. సీజేఐ సహా ఐదుగురు న్యాయమూర్తులు విధులకు హాజరవుతారు. గతంలో వేసవి సెలవుల్లో కేవలం రెండు వెకేషన్ బెంచ్‌లు పనిచేసేవి. సీనియర్ న్యాయమూర్తులు విధులు నిర్వర్తించాలన్న నిబంధన ఉండేది కాదు. కానీ, ఈ నిబంధనల్లో సుప్రీంకోర్టు తాజాగా మార్పులు చేసింది. ఈ నెల 26 నుంచి ఐదు ధర్మాసనాలకు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ బి.బి.నాగరత్న నేతృత్వం వహిస్తారు. అలాగే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తెరిచి ఉంటుంది.

అజంతా గుహ నుంచి సముద్ర అలల మీదకు
కర్వార్(కర్ణాటక): ప్రఖ్యాత అజంతా గుహలోని ఒక శిలపై చిత్రించిన పెయింటింగ్ నుంచి స్ఫూర్తి పొందిన భారత నావికాదళం ఎట్టకేలకు ఐదో శతాబ్దినాటి పడవకు ప్రాణప్రతిష్టచేసింది. ప్రాచీన భారతీయ నావికా సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా ఈ నౌకను రూపొందించింది. కర్ణాటకలోని వ్యూహాత్మకమైన కర్వార్ నావికా స్థావరంలో ఈ పురాతన సంప్రదాయక రీతిలో నిర్మించిన ఐఎన్ఎస్వీ కౌండిన్యను ఇండియన్ నేవీ బుధవారం ఆవిష్కరించింది. ఒకటో శతాబ్దంలో హిందూ మహాసముద్రంలో సముద్ర యానం చేసి ఆగ్నేయాసియాను చుట్టొచ్చిన ప్రఖ్యాత భారత నావికుడు కౌండిన్య పేరును ఈ ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్(ఐఎన్ఎస్వీ)కి పెట్టారు. ఈ నౌకకు ఎన్నో విశిష్టతలున్నాయని దీని ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం చెప్పారు. ఆధునిక తరం నౌకలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైంది. నీటిలో మునిగే ప్రధాన భాగం, చదరపు తెరలు, వేరే ఆకృతిలో తెడ్డులతో దీనిని సహజ ముడి సరుకులతో నిర్మించామని నేవీ అధికార ప్రతినిధి చెప్పారు. ‘‘ ఈ నౌకకు సంబంధించిన వాస్తవ కొలతల మ్యాప్‌లు, బ్లూప్రింట్లు అందుబాటులో లేవు. ద్విమితీయ చిత్రంలో ఉన్న ఒక్కో అంశాన్ని స్పష్టంగా అర్థంచేసుకుని వాటినే కొలతలుగా భావించి వాస్తవిక ఊహతో నౌక నిర్మాణం మొదలెట్టాం. పురాతన నౌక నిర్మాణాలు, నౌకా నిర్మాణ శాస్త్రం, సాంప్రదాయక విధానాలను మేళవిస్తూ ఈ నౌక సముద్ర పరిస్థితులను ఏ విధంగా తట్టుకోగలదనే అంచనాతో నౌకకు తుదిరూపునిచ్చాం’’ అని నేవీ అధికారి తెలిపారు. ‘‘భారతీయుల సముద్రయాన ఘనతను, వారసత్వాన్ని గుర్తు చేస్తూ ఆనాటి నిర్మాణ కౌశల్యాన్ని కళ్లముందే సాక్ష్యాత్కరిస్తోంది’’ అని మంత్రి షెకావత్ అన్నారు. పురాతన విధానంలో నిర్మించిన ఈ నౌక పనితీరు, సామర్థ్యాన్ని విశ్లేషించేందుకు త్వరలోనే దీనిని గుజరాత్ తీరం నుంచి ఒమన్‌కు నడపనున్నారు.
ఎన్ఆర్ఐ

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్‌రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్‌నేత్రాలయ ప్రకటించింది.
క్రైమ్

ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్‌షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు.

బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్‌రేప్
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్ఎంసీ యార్డు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. 2023 జూన్‌లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్‌ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు.

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్‌ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్‌గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్‌లైన్‌గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్‌మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్‌గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్‌లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి.

45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది.
వీడియోలు


అందాల యుద్ధం


అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక


రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..


అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3


చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు


వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా


స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్


ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..


చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్


మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!