103 అమృత్‌ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ | PM Modi Bikaner Visit: Railway Station Inauguration | Sakshi
Sakshi News home page

103 అమృత్‌ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

May 22 2025 11:42 AM | Updated on May 22 2025 12:20 PM

PM Modi Bikaner Visit: Railway Station Inauguration

బికనీర్: ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని ఎనిమిది స్టేషన్లతో సహా 18 రాష్ట్రాలలో 103 పునరాభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్‌లను గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు.
 

రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఒకరోజు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ముందుగా రాజస్థాన్‌లో రూ. 26 వేల కోట్ల విలువైన కీలకమైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించారు.

తొలుత ప్రధాని భారత వైమానిక దళానికి చెందిన నల్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నారు. అక్కడి దేశ్‌నోక్‌లోని కర్ణి మాత ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం రాష్ట్రంలోని ఎనిమిది స్టేషన్లతో సహా 18 రాష్ట్రాలలో 103 పునరాభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు.

అలాగే బికనీర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. చురు-సాదుల్‌పూర్ రైలు మార్గానికి కూడా ఆయన పునాది రాయి వేశారు. బహుళ విద్యుదీకరించిన రైల్వే మార్గాలను జాతికి అంకితం చేశారు. సరిహద్దు కనెక్టివిటీని పెంచడానికి  అనువైన రూ. 4,850 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాల అనంతరం పలానాలో జరిగిన ప్రజా ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. 

 

ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’కు‌ నెల.. ముష్కరుల వేటలో ఎన్‌ఐఏ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement