Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Minister Lokesh On Kasibugga Stampede Incident1
కాశీబుగ్గ తొక్కిసలాటపై మంత్రి లోకేష్‌ పొంతన లేని మాటలు

శ్రీకాకుళం : జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) ఏకాదశి పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భర్తులు రావడంతో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అయితే శనివారం సాయంత్రం మంత్రి లోకేష్‌.. తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ దేవాలయాన్ని సందర్శించారు.దీనిలో భాగంగా మంత్రి లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట అంశానికి సంబంధించి పొంతనలేని మాటలు మాట్లాడారు. ప్రతీ శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా లేదన్నారు. భక్తుల రద్దీకి ఉచిత బస్సు కూడా కారణమని లోకేష్‌ చెప్పిన సమాధానం వింతగా ఉంది. ఉదయం ఆరు గంటలకే భక్తులు అక్కడికి చేరుకున్నా సమాచారం లేదని దాటవేత సమాధానం చెప్పారు లోకేష్‌. ఒక ఊరి నుంచి వంద మంది వస్తే తెలుస్తుంది కానీ.. ఒక ఊరి నుంచి పది మంది చొప్పున వస్తే ఎలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. ఇలా లోకేష్‌ మాటల్లో తడబాటు కనబడింది. ధర్మకర్త వీడియో వెలుగులోకి.. సర్కారు వైఫల్యమే కారణంపోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది కూటమి పెద్దలు చెప్పే వాదన తప్పు అని ధర్మకర్త పాండా మాటల్లోనే తేలిపోయింది. పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చామని ధర్మకర్త పాండా చెప్పిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ధర్మకర్త స్థానంలో ఉన్న పాండా సమాచారం ఇచ్చినా సర్కారు తగిన భద్రత కల్పించకపోవడం గమనార్హం. ముందస్తు సమాచారం లేదంటూ మంత్రులు, అధికారుల ప్రకటించగా, సమాచారం ఇవ్వలేదా అని పాండాను మీడియా ప్రశ్నిం‍చింది. ‘ఈరోజు కాదు.. నిన్నే పోలీసులకు చెప్పా’ అని పాండా చెప్పారు. దీనికి సంబంధించిన ఆ వీడియో బయటకి రావడంతో సర్కారు వైఫల్యం బట్టబయలైంది. దాంతో తర్వాత ధర్మకర్త పాండాతో సమాచారం ఇవ్వలేదని, ఇంతమంది భక్తులు వస్తారని అనుకోలేదంటూ అధికారులు చెప్పించడంతో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందనడానికి ఉదాహరణ.

Vreels Virtually Relax Explore Engage Live Share app in tech market2
టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్‌.. పూర్తి వివరాలు..

డిజిటల్ యుగం మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ప్రతి రోజూ మనం ఎన్నో యాప్‌లు ఉపయోగిస్తూ ఉంటాం. అందులో కొన్ని చాటింగ్‌ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. వాడుతుంటాం. అయితే ఒకే వేదికపై ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్‌(Vreels-Virtually Relax, Explore, Engage, Live, Share) రూపొందించారు. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేశారు.ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా దశలో ఉంది. Play Store, App Storeలో Vreelsను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.వెబ్సైట్: www.vreels.comసృజనాత్మకతతో..Vreels ఒకే చోట కంటెంట్‌ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా మారింది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్‌గా మారొచ్చు. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీస్‌ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించుకోవచ్చు. ఇందులోని ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ మరింత పర్సనల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. యాప్‌లోని కొన్ని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.Reels, Pixమీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలు.. అన్నీ ఒక క్లిక్‌లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ఆకస్తి కరంగా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్త్‌తో Vreels క్రియేటర్లకు మెరుగైన అనుభవం ఇస్తుంది.Pix Pouches.. డిజిటల్‌ నోట్‌బుక్‌Pix Pouches అనేది డిజిటల్ నోట్‌బుక్‌. ఇష్టమైన ఫొటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా స్టోర్‌ చేసుకోవచ్చు. మిత్రులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, మంచి ప్రాజెక్టులను ప్లాన్ చేయవచ్చు.Chats, Calls — కనెక్ట్ అ​‍య్యేందుకు..స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్‌లో చాట్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్‌లు అవసరం లేదు. Vreelsలోనే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. వీరీల్స్‌ క్రియేటివ్ వేదికగా ఉన్నందున ఇది సాధ్యపడింది. మీరు మాట్లాడుతూనే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చు.V Map — లొకేషన్‌ షేరింగ్‌మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో V Mapతో సులభంగా తెలుసుకోవచ్చు. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.V Capsules — మధుర జ్ఞాపకాలుఈ ప్రత్యేక ఫీచర్‌లో భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్‌గా ఒక ‘క్యాప్సూల్’లో ఉంచి ఒక నిర్దిష్ట తేదీన దాన్ని ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు. బర్త్‌డే, యానివర్సరీ, లేదా మైల్‌స్టోన్‌.. వంటి ముధుర జ్ఞాపకాలను భద్రపరుచుకొని తిరిగి ఆ మెమొరీని చూసుకోవడం ఆనంద క్షణంగా ఉంటుంది.Vreels Shop/Bid — మీ అవసరాలన్నీ ఒకే చోటVreels షాప్/బిడ్ త్వరలో రాబోతోంది. యూజర్లకు కావాల్సిన ప్రతి ఉత్పత్తిని ఇందులో కొనుగోలు చేయవచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు. యూజర్లు నమ్మకంగా ఇందులో బిడ్ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఇది అంతా ఒకే సురక్షితమైన, సౌకర్యవంతమైన వేదికలో జరుగుతుంది. నమ్మకం, నాణ్యత, విశ్వాసం ఇవే Vreels షాప్/బిడ్ పునాది సూత్రాలని నిర్వాహకులు చెబుతున్నారు.భద్రత.. యూజర్ విశ్వాసమే ప్రాధాన్యంఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచంలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు వాడుతారో అన్న సందేహం సహజం. కానీ Vreelsలో మీరు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూజర్ల డేటాకు అధిక భద్రత ఉంటుంది.టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు.. ఇవన్నీ యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడటానికి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా యూజర్‌ పోస్టులు, ప్రొఫైల్, లొకేషన్.. ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా యూజర్‌ పరిధిలోనే ఉంటుంది.Vreels ఆవిష్కరణల వేదికVreels ఒక యాప్ మాత్రమే కాదు. అమెరికన్‌ వ్యాపార స్పూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వేదిక. ప్రతి అప్‌డేట్‌తో కొత్త సాంకేతిక పరిణామాలు, స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు తెస్తోంది. ఇది Made for the World అనే స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే Vreels బృందం వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, త్వరలోనే మంజూరు అవుతాయని అంచనా. ఈ పేటెంట్లు ఆమోదం పొందిన తర్వాత Vreels సాంకేతిక సామర్థ్యం మరింత బలపడటమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించనుంది.Vreels యాప్ డౌన్‌లోడ్ చేసుకోనే లింక్‌లు కింద ఉన్నాయి.ఆండ్రాయిడ్‌ యూజర్లుhttps://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsయాపిల్‌ యూజర్లుhttps://apps.apple.com/us/app/vreels/id6744721098 కింది క్యూఆర్‌ కోడ్‌లు స్కాన్‌ చేసి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Tension at Visakhapatnam Samatha College3
విశాఖ: బిల్డింగ్‌పై నుంచి దూకేస్తాం.. సమతా కాలేజీ వద్ద ఉద్రిక్తత

సాక్షి, విశాఖపట్నం: నగరంలోని సమతా కాలేజీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులకు గురిచేశారనే కారణంతో విశాఖ సమతా కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి సాయితేజ ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న విషయం తెలిసిందే. న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భవనంపై నుంచి దూకేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.సాయితేజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు చెబుతున్నారు. యాజమాన్యం న్యాయం చేయకపోతే బిల్డింగ్‌పై నుంచి దూకేస్తానంటూ సాయితేజ సోదరుడు హెచ్చరించారు. న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు.విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ బలవన్మరణం కలకలం రేపింది. ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సహచర విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన మేరకు.. తోటి విద్యార్థులతో సరదాగా ఉండే సాయితేజ కొంతకాలంగా తరగతులకు హాజరుకావడంలేదు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా అధ్యాపకులు వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు, తమ్ముడి వద్ద పలుమార్లు వాపోయాడు.ఐదో సెమిస్టర్‌లో భాగంగా స్టాటిస్టిక్స్‌ రికార్డ్‌ పూర్తిచేసి ఇటీవల అధ్యాపకురాలికి సబ్మిట్‌ చేశాడు. అందులో కరెక్షన్స్‌ ఉన్నాయంటూ ఆమె రికార్డ్‌ను రిజెక్ట్‌ చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని రోజులుగా సాయితేజ మరింత మనస్తాపానికి గురయ్యాడు. చాలాసార్లు కరెక్షన్లు చేసినా అధ్యాపకురాలు రికార్డ్‌ తీసుకోలేదు. దీంతో మరోసారి కరెక్షన్స్‌ చేసి సబ్మిట్‌ చేసేందుకు గురువారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఆ అధ్యాపకురాలు కళాశాలకు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళదామని తల్లిదండ్రులు చెప్పారు.ముందు మీరు వెళ్లండి, నేను తరువాత వస్తా.. అని సాయితేజ తల్లిదండ్రులకు, తమ్ముడికి చెప్పాడు. వారు కళాశాలకు వెళ్లి ఎంతసేపు చూసినా.. సాయితేజ రాలేదు. ఫోన్‌ కూడా తీయలేదు. దీంతో ఇసుకతోటలోని ఇంటికి వెళ్లిన వారికి సాయితేజ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించి, అతడిని మెడికవర్‌ హాస్పటల్‌కు తరలించారు. అప్పటికే సాయితేజ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఎంవీపీ పోలీసులు అక్కడికు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.ఏడాది కాలంగా సాయితేజ ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులకు గురవుతున్నట్లు సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. సహచర విద్యార్థులతో పాటు తమ్ముడికి కూడా సాయితేజ చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. ఒక అధ్యాపకురాలు ‘ఉదయాన్నే నన్ను ఎందుకు విష్‌ చేయడంలేదు.. నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్‌కి వస్తావా?.. నాగురించి ఒకసారైనా ఆలోచించవా..’ వంటి మెసేజ్‌లు పంపటంతో పాటు తరచు వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు సాయితేజ చెప్పాడని స్నేహితులు తెలిపారు. మరో అధ్యాపకురాలు సబ్జెక్ట్‌ పరంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు.

ICC Women's ODI World Cup: Harmanpreets India remain far from perfect before final4
సెమీస్‌లో గెలిస్తే సంబరమే..! కానీ ఫైనల్లో ఆ తప్పులు చేశారంటే?

భారత మహిళల జట్టు.. తమ 47 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్లో ఆదివారం సౌతాఫ్రికాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈసారి మనం మహిళల క్రికెట్‌లో సరికొత్త వరల్డ్ ఛాంపియన్ చూడబోతున్నాము. ఎందుకంటే, భారత్ కానీ, దక్షిణాఫ్రికా కానీ ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేదు. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా ముచ్చటగా మూడోసారి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే సెమీస్‌లో భారత అమ్మాయిల జట్టు రికార్డు విజయం సాధించినప్పటికి.. ఫైనల్‌కు ముందు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి.ఫీల్డింగ్‌ మారుతుందా?ఈ మెగా టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ ప‌రంగా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న‌ప్ప‌టికి.. ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో మాత్రం తీవ్ర నిరాశ‌ప‌రుస్తోంది. భారత జట్టు ఫీల్డింగ్ మ్యాచ్‌కు మ్యాచ్‌కు దిగజారుతోంది. ఈ టోర్నమెంట్‌లో భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు 18 క్యాచ్‌లు జారవిడిచింది. అత్య‌ధిక క్యాచ్‌లు విడిచిపెట్టిన జాబితాలో హ‌ర్మ‌న్ సేన అగ్ర‌స్దానంలో నిలిచింది.ఆసీస్‌తో సెమీస్‌లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సైతం సునాయ‌స క్యాచ్‌ను జార‌విడించింది. మిస్‌ఫీల్డ్స్, ఓవర్ త్రోల రూపంలో మ‌న అమ్మాయిల జ‌ట్టు భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటుంది. ఈ ఈవెంట్‌లో ఇప్పుటివ‌ర‌కు భార‌త్ మొత్తం 74 మిస్‌ఫీల్డ్స్ (అన్ని జట్లలో అత్యధికం) చేశారు. 6 ఓవ‌ర్‌త్రోలు కూడా ఉన్నాయి. సెమీస్‌లో మిస్‌ఫీల్డ్స్, ఓవర్ త్రోల ద్వారానే భారత్ 22 అదనపు పరుగులు ఇచ్చింది. కనీసం ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ మెరుగైన ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.డెత్‌ బౌలింగ్‌ కష్టాలు..బౌలింగ్ విభాగంలో కూడా భార‌త్ చాలా బ‌ల‌హీనంగా క‌న్పిస్తోంది. ఆసీస్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ఒక్క శ్రీ చ‌ర‌ణి మిన‌హా మిగితా బౌల‌ర్లంతా తేలిపోయారు. ఆఖ‌రికి దీప్తి శ‌ర్మ వంటి స్టార్ స్పిన్న‌ర్ సైతం భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంది.రేణుకా సింగ్ వంటి స్టార్ పేస‌ర్ జట్టులో ఉన్న‌ప్ప‌టికి ఆరంభంలో పిచ్ స్వింగ్‌కు అనుకూలించ‌క‌పోతే ఆమె ఒక సాధార‌ణ బౌల‌ర్‌గా మారిపోతుంది. అంతేకాకుండా సెమీఫైన‌ల్లో హ‌ర్లీన్ డియోల్ వంటి స్టార్ బ్యాట‌ర్‌ను ప‌క్క‌న పెట్టిమ‌రి రాధా యాద‌వ్‌ను తీసుకొచ్చారు. కానీ ఆమె కూడా ఏ మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయారు. క్రాంతి గౌడ్ యువ ఫాస్ట్ బౌల‌ర్ ఆడ‌ప‌ద‌డ‌ప ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్న‌ప్ప‌టికి.. ఫైన‌ల్ వంటి హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఇక భార‌త జ‌ట్టులో డెత్ బౌలింగ్ లేమి స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది.భారత జట్టులో డెత్ ఓవర్లలో కట్టడి చేయగలిగే బౌలర్లే లేరు. రేణుకా గానీ, గౌడ్ గానీ డెత్ బౌలర్లు కాదు. దీప్తి శర్మపైనే అతిగా ఆధారపడటం ఒక పెద్ద సమస్యగా మారింది. లీగ్ ద‌శ‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ విష‌యం తేటతెల్లమైంది. 251 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో సఫారీలు 81/5 తో కష్టాల్లో ఉన్నప్పటికీ.. భార‌త్ బౌల‌ర్లు మాత్రం వారిని ఆలౌట్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఆ మ్యాచ్‌లో భార‌త్ అనుహ్య ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు ఫైన‌ల్లో అదే సౌతాఫ్రికాపై మ‌న బౌల‌ర్లు ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో భారత్‌ మెరుగ్గా రాణిస్తే తొలి వరల్డ్‌కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఖాయమనే చెప్పాలి. ఇక బ్యాటింగ్‌లో యువ ఓపెనర్‌ షెఫాలీ వర్మ బ్యాట్‌ ఝూళిపించాల్సి ఉంది. రెగ్యూలర్‌ ఓపెనర్‌ ప్రతీక రావల్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో షెఫాలీకి అవకాశం లభించింది. కానీ ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆమె కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటైంది.అదేవిధంగా లీగ్‌ దశలో దుమ్ములేపిన స్మృతి మంధాన కీలకమైన ఫైనల్లో తన బ్యాట్‌కు పనిచెప్పాలి. ఆమె కూడా సెమీస్‌లో విఫలమైంది. మిడిలార్డర్‌లో రోడ్రిగ్స్‌, హర్మన్‌ వంటి ప్లేయర్లు మరోసారి చెలరేగాల్సిన అవసరముంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్‌ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు

Actor Rajasekhar Reacts Irritable Bowel Syndrome Issue5
ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్

గత కొన్నిరోజులుగా 'ఇదేటమ్మా మాయ మాయ' అనే పాత పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఇప్పుడు అదే పాటని స్టేజీ మీద స్వయంగా రాజశేఖర్(Rajasekhar) హమ్ చేశారు. అలానే తను ఎప్పటినుంచో ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇంతకీ ఈ వ్యాధి ఏంటి? రాజశేఖర్ ఎక్కడ ఈ విషయాన్ని చెప్పారు.అంకుశం, అల్లరి ప్రియుడు, సింహరాశి లాంటి సినిమాలతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రాజశేఖర్.. తర్వాత కాలంలో హిట్స్ లేక పూర్తిగా డీలా పడిపోయారు. 2017లో 'పీఎస్ గరుడ వేగ'తో సక్సెస్ అందుకున్న ఈయన తర్వాత ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా కనిపించలేదు. లాక్ డౌన్ టైంలో కరోనా కారణంగా అనారోగ్యానికి గురైన ఈయన.. కొన్నాళ్లకు ఇంటికే పరిమితమయ్యారు కూడా.(ఇదీ చదవండి: శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్ రిలీజ్)2023లో నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రాజశేఖర్.. తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు శర్వానంద్ హీరోగా చేస్తున్న 'బైకర్'లో ఈయన కూడా ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు తెలిసింది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా రాజశేఖర్.. ఈవెంట్‌లో కనిపించారు. తను కూడా మంచి పాత్రలో కనిపించబోతున్నానని చెప్పారు.మాటల మధ్యలో తాను చాన్నాళ్ల నుంచి 'ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్'(Irritable Bowel Syndrome) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని రాజశేఖర్ చెప్పారు. ఈవెంట్‌కి రావాలని, నిన్న తనకు సమాచారం అందించారని.. దీంతో స్పీచ్ ఏం ఇవ్వాలనే యాంగ్జైటీతో నా కడుపు అంతా చెడిపోయిందని అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాధి గురించి రాజశేఖర్ మాట్లాడారు.ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు,మలబద్ధకం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ సమస్య వల్లనే చాలా ఇబ్బందులు పడుతుంటానని, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టదని గతంలో రాజశేఖర్ ఓసారి చెప్పారు. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని, దీనివల్ల చాలా కోపం వస్తుండేదని, నా గురించి తెలిసిన వాళ్లు నేను ఏమన్నా పట్టించుకునేవారు కాదని అప్పట్లో చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఈ వ్యాధి గురించి మాట్లాడటంతో మరోసారి ఇది చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)

Women Devotees Angry On Minister Atchannaidu6
తొక్కిసలాట: మంత్రి అచ్చెన్నాయుడిని నిలదీసిన భక్తులు

సాక్షి, శ్రీకాకుళం: మంత్రి అచ్చెన్నాయుడిని మహిళా భక్తులు నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా రావడంతో తోపులాట జరిగింది. రెయింలింగ్‌ ఉండిపోవడంతో భక్తులు కింద పడ్డారు. 10 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారని.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతి ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాలనుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’’ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

RS 5 Must For Booking Slot Of Sabarimala Darshanam7
శబరిమల దర్శనానికి రూ. 5 తప్పనిసరి

శబరిమల వెళ్లే భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) షాకిచ్చింది..! ఇకపై www.sabarimalaonline.orgలో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే భక్తులు రూ.5 చొప్పున వెల్ఫేర్ ఫండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఆ మేరకు మండల, మకరవిళక్కు సీజన్‌కు సంబంధించి శనివారం సాయంత్రం స్లాట్ బుకింగ్ ప్రారంభమవ్వగా.. రూ.5 వెల్ఫేర్ ఫండ్ నిర్ణయాన్ని అమలు చేసింది. అంటే.. ఇకపై ఒక్కో స్లాట్‌ బుకింగ్‌కు రూ. 5 చెల్లించాల్సిందే. వెల్ఫేర్ ఫండ్ చెల్లిస్తేనే స్లాట్‌ బుక్‌ అవుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు యాత్రికులకు సహాయం చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వెల్ఫేర్ ఫండ్‌ను తెరపైకి తీసుకువచ్చినట్లు టీడీబీ పేర్కొంది. పేమెంట్ గేట్‌వేలో సమస్యలు:శనివారం సాయంత్రం స్లాట్ బుకింగ్‌కు యత్నించిన భక్తులకు పేమెంట్ గేట్‌వేలో సమస్యలు తలెత్తాయి. ఒకేసారి వేల సంఖ్యలో భక్తులు స్లాట్ బుకింగ్‌కు యత్నించడంతో ఈ సమస్య నెలకొని ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: శబరిమలకు నేటి నుంచి వర్చువల్‌ బుకింగ్‌

From Fisherman Son To Dubai Visionary The Remarkable Journey Of Mohamed Alabbar8
తండ్రి మత్స్యకారుడు.. కొడుకు బుర్జ్ ఖలీఫా ఓనర్

దుబాయ్ అంటే అందరికీ 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనంగా ప్రసిద్ధి చెందిన ఈ బుర్జ్ ఖలీఫాను ఒక మత్స్యకారుడి కుమారుడు నిర్మించారనే విషయం బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.బుర్జ్ ఖలీఫాను.. దుబాయ్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించింది. ఈ కంపెనీ ఫౌండర్ 'మహమ్మద్ అలబ్బర్' (Mohamed Alabbar). ఈయనే బుర్జ్ ఖలీఫా యజమాని.తండ్రి మత్స్యకారుడుమహమ్మద్ అలబ్బర్.. దుబాయ్‌లో ఒక సాధారణ, మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఒక మత్స్యకారుడు. చిన్నప్పుడు తన తండ్రి చేసే పనిలో సహాయం చేసేవాడు. పట్టుదల, క్రమశిక్షణ, వినయాన్ని నా తండ్రి నుంచే నేర్చుకున్నానని అలబ్బర్ అనేక ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.ప్రాధమిక విద్యను దుబాయ్‌లో పూర్తిచేసిన మహమ్మద్ అలబ్బర్.. ఆ తరువాత ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్ ద్వారా అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత 1981లో స్వదేశానికి (దుబాయ్) తిరిగి వచ్చాడు. అలబ్బర్ అమెరికా నుంచి కేవలం డిగ్రీతో రాలేదు. జీవితంలో ఎదగడానికి ఎదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వచ్చాడు.బ్యాంక్‌లో ఉద్యోగంఅలబ్బర్ తన కెరియర్‌ను యుఎఈ సెంట్రల్ బ్యాంక్‌లో ప్రారంభించి, ఆర్థిక వ్యవస్థల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. పనితనంతో అందరి దృష్టినీ ఆకసారిస్తూ.. చాలా తక్కువ కాలంలోనే ఆయన దుబాయ్ ఆర్థిక అభివృద్ధి విభాగానికి డైరెక్టర్ జనరల్ అయ్యారు. ఆ సమయంలోనే దుబాయ్ దార్శనిక పాలకుడు 'షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్'తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాతే భవిష్యత్తును ఊహించాడు.1997లో అలబ్బర్ ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను స్థాపించినప్పుడు. ఆ సమయంలో చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఒక దశాబ్దంలోనే దీనికి ఎనలేని గుర్తింపు లభించింది. ఆ తరువాత దుబాయ్ ఫౌంటెన్, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మాల్ వంటి నిర్మాణాలను పూర్తిచేసి.. ఈ రంగంలో అలబ్బర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు.బుర్జ్ ఖలీఫా గురించిప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా.. అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ భవనాల్లో కూడా ఒకటి. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ అద్దె ఏడాదికి 180000 – 250000 దిర్హామ్‌లు (రూ. 40 లక్షల నుంచి రూ. 55 లక్షలు).బుర్జ్ ఖలీఫా ఎత్తు 829.8 మీటర్లు (2,722 అడుగులు). ఇందులో 163 అంతస్తులు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణం 2010కి పూర్తయింది. 95 కిలోమీటర్ల నుంచి కూడా కనిపించే ఈ భవనంలో 304 విలాసవంతమైన హోటల్ రూల్స్, 900 హై-ఎండ్ అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్డింగ్ బయటివైపు శుభ్రం చేయడానికే సుమారు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందన్న భయం: రోజుకు రెండు గంటలే నిద్ర!

Congress Leader Sridhar Babu Comments On BJP, BRS9
మాపై దుష్ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజార్టీని పెంచుకునేందుకు కాంగ్రెస్ పని చేస్తుంటే... బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం మాపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని శాలివాహన నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ స్వార్ధ రాజకీయాల కోసం బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇప్పుడు కొత్త డైవర్షన్ డ్రామాకు తెరదీశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా వక్రీకరించుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క ప్రధాన సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని, ఆపలేదన్నారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను రాజు కాదు అని ప్రజల సొమ్ముకు ధర్మకర్త మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించే అర్హత బీఆర్ఎస్ కు గానీ బీజేపీకి గానీ లేదన్నారు. ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగదని, జరగనివ్వమన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించే ముందు, పేదలకు పునరావాసం కల్పించాకే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అధికారుల అత్యుత్సాహాన్ని సహించమన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరారు. ప్రతిపక్షాల జూటా మాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా ముందుకెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన మాదిగ దండోరా, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, టి.ఎం.ఆర్.పి.ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ టీజీఆర్‌ఎస్‌ఏ తదితర 9 దళిత సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ విశ్వనాథ్, ఎమ్మెల్యేలు విజయ రామరావు, మక్కన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

Story On How corruption preys on the vulnerable in Bengaluru10
చావులే.. వారికి డబ్బులు పుట్టించే మెషిన్లు!

ఒక చావు.. కొందరిని కుంగదీస్తుంది. కుమిలిపోయేలా చేస్తుంది. అదే చావు.. మరికొందరికి మాత్రం కాసుల పంట పండిస్తుంది. ‘శవాల మీద పేలాలు ఏరుకుని తినే నీచులు..’ అంటూ.. మానవత్వం లేని మనుషుల గురించి మనం తిట్లు వింటూ ఉంటాం. కానీ.. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే.. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా ఉంటూ.. లంచాలు తెగమేసి బతకడానికి అలవాటుపడిన దుర్మార్గులు.. ఈ తరహా అమానవీయ పోకడల విషయంలో ఎంతటి మాస్టర్ డిగ్రీలు చేశారో అర్థమవుతుంది.తాము లంచాలు కాజేయడం మాత్రమే వారికి ప్రయారిటీ! సందర్భం ఏదైనా సరే వారికి పట్టింపులేదు. అవతలి వారు ఎంతటి దారిద్ర్యంలో ఉన్నారో, ఎంతటి వేదనలో ఉన్నారో కూడా వారికి అక్కర్లేదు. లంచాలు మింగడం మాత్రమే కాదు.. వేదనలో ఉన్న వారిని పరుషవ్యాఖ్యలతో నొప్పించడం వారి దుర్మార్గానికి మరింత పరాకాష్ట. ఆధునిక సమాజంలో మానవీయ విలువలు పూర్తిగా కనుమరుగైపోయాయని మనం చెప్పలేం. కాకపోతే.. ఇలాంటి ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు మాత్రం ఆ మానవీయతకే తీరని కళంకం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో ఒక వేదనాభరితమైన దుర్ఘటన చోటుచేసుకుంది. బీపీసీఎల్ సంస్థలో చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్‌గా పనిచేసిన 64 ఏళ్ల కె శివకుమార్ జీవితంలో చోటుచేసుకున్న విషాదం అది. ఆయనకున్న ఏకైక కూతురు అక్షయ శివకుమార్ (34). ఐఐటీ నుంచి బిటెక్ చేసింది, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీయే చేసింది. ఓ మల్టినేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విషాదం ఏంటంటే.. ఇటీవల ఆమె బ్రెయిన్ హెమరేజ్ తో దుర్మరణం పాలైంది. అసహజ మరణంగా గుర్తించడంతో మెడికో లీగల్ కేసు నమోదు అయింది. ఒక చావు సంభవిస్తే.. అనుబంధాలను పెనవేసుకున్న వందల వేల హృదయాలు దుఃఖిస్తాయి. ఇలాంటి చావు సంభవించినప్పుడు.. దాని నుంచి డబ్బులు ఏరుకోవడానికి పదుల సంఖ్యలో పరాన్నభుక్కుల వంటి కుక్కలు సదా సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి దుర్మార్గాలు, శివకుమార్‌కు వరుసగా స్వానుభవంలోకి వచ్చాయి.అంబులెన్సులో ఆస్పత్రికి, శ్మశానానికి తరలించే వాడికి ఓ రేంజి లంచం, కేసు రిజిస్టరు అయింది గనుక.. బెలందూరు పోలీసు వారికి లంచం, అంతా పూర్తయి కూతురు డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటే.. బెంగుళూరు నగరపాలిక సంస్థ వారికి లంచం.. ఈ వ్యవహారాలతో అసలే దుఃఖంలో ఉన్న ఆయన మరింతగా క్షోభకు గురయ్యారు. లంచాలు డిమాండ్ చేయడం మాత్రమే కాదు.. ఉన్న ఒక్కగానొక్క కూతురును కోల్పోయి పుట్టెడు బాధలో ఉంటే.. లంచం కోసం బెలందూరు పోలీసులు దూషించిన తీరు కూడా ఆయన క్షోభను మరింతగా పెంచింది. ఈ గోడు మొత్తం వెళ్లగక్కుతూ ఆయన ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. ఇలాంటి వారి బారిన పడి.. ఎన్ని వేల లక్షల హృదయాలు ఎంతగా క్షోభిస్తూ ఉంటాయో.. ఆ పోస్టు కాస్తా వైరల్ అయింది. పోలీసు పెద్దలు కొంచెం జాగ్రత్త పడి.. బెలందూరు స్టేషన్లో ఇద్దరిని సస్పెండ్ చేశారు.లంచగొండితనం అనేది ఇవాళ్టి సమాజంలో ఒక యాక్సెప్టబుల్ వ్యవహారం అయిపోయింది. గవర్నమెంటుతో ముడిపడిన ఈ పని మనకు ఉన్నా.. తృణమో పణమో అడక్కముందే సమర్పించేసుకోవడం సాధారణ జనానికి అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇలా పుట్టే డబ్బులు పుట్టెడు ఉంటాయి. అలాగని ఒకరో ఇద్దరో దారిద్ర్యంలో పడి అలమటిస్తున్న వారు.. డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. ఈ లంచగొండులు విడిచిపెట్టడం లేదు. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో, బాధాకరమైన వేళల్లో కూడా తమ దందా తాము సాగించాలనే అనుకుంటున్నారు. అక్కడే అసలు సమస్య మొదలవుతోంది.‘నేనంటే డబ్బున్న వాణ్ని గనుక.. అందరికీ అడిగినంత లంచాలు ముట్టజెప్పాను. డబ్బులేని పేదల పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆ శివకుమార్ తన పోస్టులో ప్రశ్నించిన తీరు.. సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. ఈసడించుకున్నంత మాత్రాన.. కించిత్తు కూడా ఈ లంచగొండి అవతారాల్లో మార్పు రాదన్నది నిజం. ఎందుకంటే.. ఆస్పత్రుల్లో లంచాలు, తప్పుడు చికిత్సలు, పోలీసుల లంచాలు, నీతిమాలిన వైనం గురించి.. కొన్ని వందల సినిమాల్లో ఘాటుగా చర్చిస్తూనే వచ్చారు. ఏం మారింది సమాజం? అలా లంచం తీసుకోవడాన్ని ఒక లాంఛనంగా, అధికారిక క్రతువులాగా మార్చేసుకుంటున్నారు. కేవలం ఒకటిరెండు సస్పెన్షన్లతో ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట పడుతుందా? ఆ అంబులెన్సు డ్రైవరూ, ఆ ఆసుపత్రి సిబ్బంది, శ్మశానం సిబ్బందీ, బెంగుళూరు కార్పొరేషన్ పెద్దలూ, పోలీసు మహానుభావులూ అందరివీ పత్రికల్లో పెద్దపెద్ద ఫోటోలు వేసి.. చావుల మీద లంచాల డబ్బులు ఏరుకుంటున్న నీచులు వీళ్లేనని తగుమాత్రం ప్రచారం కల్పించాలి. సోషల్ మీడియా లో ఫోటోలతో సహా వారి నీచత్వాన్ని డప్పు కొట్టి మరీ చెప్పాలి. నగరమంతా పోస్టర్లు వేయాలి. వారి బతుకుల్లో సిగ్గు పుట్టించాలి. లేకపోతే ఇలాంటి అరాచకత్వాలకు నిష్కృతి లేదు...ఎం.రాజేశ్వరి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement