రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం | Incident in Chintalapudi mandal of Eluru district | Sakshi
Sakshi News home page

రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం

Mar 17 2026 4:26 AM | Updated on Mar 17 2026 4:26 AM

Incident in Chintalapudi mandal of Eluru district

చింతలపూడిలో దారుణం 

చింతలపూడి: సభ్య సమా­జం తలదించుకునే ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో చోటు­చేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రెండు రోజుల క్రితం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. 

అదే గ్రామానికి చెందిన రాముడు (53) ఆ బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడి బారి నుంచి బయటపడిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి పోలీసులు రాముడుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ క్రాంతికుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement