గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం; తిథి బ.త్రయోదశి ఉ.8.08 వరకు; తదుపరి చతుర్దశి; నక్షత్రం శతభిషం తె.5.50 వరకు(తెల్లవారితే బుధవారం), తదుపరి పూర్వాభాద్ర; వర్జ్యం ప.12.46 నుండి 2.24 వరకు; దుర్ముహూర్తం ఉ.8.33 నుండి 9.21 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు; అమృత ఘడియలు రా.10.20 నుండి 11.57 వరకు
సూర్యోదయం : 6.11
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: దూరప్రాంతాల నుంచి ఆసక్తికర సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.
వృషభం: రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో పురోగతి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో పనిభారం ఉండవచ్చు.
కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.
సింహం: పనులు అనుకున్న విధంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
కన్య: చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు.
తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు సంభవం. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.
మీనం: పనులు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.


