భారత క్రికెట్‌లో ఇటీవలి కాలంలో ఫ్యాన్ ఆర్మీ,సూపర్ హీరో సంస్కృతి బాగా పెరిగిపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇది భారత క్రికెట్‌ను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపాడు. ఆటగాళ్ల కంటే వారి పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, దీనివల్ల ఫ్యాన్‌వార్ పెరిగిపోతుందన్నాడు.
కోల్‌కతాలో జరిగిన రేవ్ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ కార్యక్రమానికి హాజరైన అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ ఆటగాడికి ఆ ఆటగాడితో సమస్య ఉంది. అందుకే ఆ ఆటగాడు జట్టులో లేడు.. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటివే తరచుగ2ఆ కనబడితే సహజంగానే ఏదో జరుగుతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఇది మానవసహజం.
కోచ్ గౌతమ్ గంభీర్ చేయాల్సిన పని చాలా ఉంది. జట్టులో నుంచి నేను, కోహ్లీ, రోహిత్ వెళ్లిపోవాలని అతడు భావించినా పర్వాలేదు. అది అతడి పని. నేను ఎప్పుడూ అహాన్ని వదిలించుకోవాలనే చూశాను. ఇక 25 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాపై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది కాబట్టి లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. అది కేవలం లక్ష్మణ్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాదు.. జట్టు విజయం కూడా. అభిమానులు క్రికెటర్లను ఆరాధించవచ్చు, కానీ డ్రెస్సింగ్‌రూమ్‌లో వ్యక్తులకన్నా జట్టుకే అధిక ప్రాధాన్యం ఉంటుంది’ అని అశ్విన్ వెల్లడించాడు.
చదవండి: అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!


