సాయంత్రానికి సగం తగ్గిన గోల్డ్ రేటు! | Latest Gold and Silver Price in India | Sakshi
Sakshi News home page

సాయంత్రానికి సగం తగ్గిన గోల్డ్ రేటు!

Mar 17 2026 9:42 PM | Updated on Mar 17 2026 9:42 PM

Latest Gold and Silver Price in India

రోజురోజుకి తగ్గుతున్న గోల్డ్ రేటు ఈ రోజు (మంగళవారం) కొంత పెరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకముందే.. పెరిగిన రేటులో సగం తగ్గిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం లేటెస్ట్ ధరల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,45,400 రూపాయల వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల బంగారం ధర సాయంత్రానికి రూ.1,44,900 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.500 తగ్గిందన్నమాట. 24 క్యారెట్ల ధర 1,58,620 రూపాయల నుంచి రూ.1,58,080 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో లేటెస్ట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 158230 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 145050 రూపాయల వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం ఉన్న ధరల కంటే తక్కువ కావడం గమనార్హం.

చెన్నైలో గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఉదయం ఎలా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,46,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,59,820 వద్ద ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement