వికారాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు.. ఆర్ఐ రిచర్డ్ సైమన్ అరెస్ట్ | ACB raids in Vikarabad district RI Richard Simon arrested | Sakshi
Sakshi News home page

వికారాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు.. ఆర్ఐ రిచర్డ్ సైమన్ అరెస్ట్

Mar 17 2026 11:05 PM | Updated on Mar 17 2026 11:16 PM

ACB raids in Vikarabad district RI Richard Simon arrested

సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని పెద్దేముల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.  

సమాచారం ప్రకారం.. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మోటేషన్ ఫైల్ కోసం ఆర్ఐ రిచర్డ్ సైమన్ వద్ద పని చేయించుకోవడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా రూ.15,000 లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు పెద్దేముల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement