న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) నాలుగో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించేందుకు అనుమతించింది. దీంతో వాటాదారులకు షేరుకి రూ. 3.25 చొప్పున లభించనుంది. ఇందుకు ఈ నెల 23 రికార్డ్ డేట్‌కాగా.. ఏప్రిల్ 16కల్లా చెల్లించనుంది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో రూ. 1,60,000 కోట్ల రుణ సమీకరణ ప్రణాళికకు సైతం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.
ఈబీఆర్ నిధులకు సంబంధంలేకుండా వీటిని ఒకేసారి లేదా దశలవారీగా వివిధ మూలాల నుంచి సమీకరించనుంది. వీటిలో రూ. లక్ష కోట్లు బాండ్లు, సెక్యూరిటీలు, మధ్యకాలిక ఇన్‌స్ట్రుమెంట్స్, కాలావధి రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. వివిధ ఇన్‌స్ట్రుమెంట్స్ జారీతో రూ. 20,000 కోట్ల విదేశీ మారకపు రుణాలు సైతం వీటిలో కలసి ఉన్నాయి.
ఈ వార్తల నేపథ్యంలో పీఎఫ్‌సీ షేరు బీఎస్‌ఈలో 3% జంప్‌చేసి రూ. 418 వద్ద ముగిసింది.


