రేపు విజయవాడకు వైఎస్ జగన్ | Vijayawada: Ys Jagan Will Participate In Ysrcp Iftar Dinner On March 18 | Sakshi
Sakshi News home page

రేపు విజయవాడకు వైఎస్ జగన్

Mar 17 2026 7:09 PM | Updated on Mar 17 2026 7:44 PM

Vijayawada: Ys Jagan Will Participate In Ysrcp Iftar Dinner On March 18

సాక్షి, తాడేపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో రేపు(మార్చి 18, బుధవారం) వైఎస్సార్‌సీపీ నిర్వహించే ఇఫ్తార్‌ విందు విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్‌ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.

రంజాన్ మాసం సోదరభావం, సామరస్యం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ వేదికగా జరిగే ఈ ఇఫ్తార్‌ విందులో పాల్గొనేందుకు సాయంత్రం 6 గంటలకు వైఎస్‌ జగన్‌ విజయవాడ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement