జమ్మూ కాశ్మీర్‌లో తెలంగాణ పోలీస్ క్రీడాకారిణి ప్రతిభ | Telangana Police Sportswoman Talent in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కాశ్మీర్‌లో తెలంగాణ పోలీస్ క్రీడాకారిణి ప్రతిభ

Mar 17 2026 11:42 PM | Updated on Mar 17 2026 11:42 PM

Telangana Police Sportswoman Talent in Jammu and Kashmir

సాక్షి,హైదరాబాద్‌: జమ్మూ కాశ్మీర్‌లో మార్చి 7 నుంచి 13 వరకు జరిగిన ఫెన్సింగ్ ఈవెంట్ (కబడ్డీ క్లస్టర్)లో తెలంగాణ పోలీస్ క్రీడాకారిణి షేక్ ఫౌజియా (PC 13109) విశేష ప్రతిభ కనబరిచారు. భోంగిర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆమె మహిళల ఫోయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరుకొని రజత పతకం సాధించారు.  

ఈ విజయంపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆమెను, కోచ్ ఎస్.ఆర్. అర్జున్‌ను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఐజీపీ (స్పోర్ట్స్) డాక్టర్ గజారావు భూపాల్, ఏసీపీ & స్పోర్ట్స్ ఆఫీసర్ రామారావు సమక్షంలో ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. షేక్ ఫౌజియా సాధించిన ఈ రజత పతకం తెలంగాణ పోలీస్ క్రీడా విభాగానికి గర్వకారణంగా నిలిచింది.  

Advertisement
 
Advertisement
Advertisement