బీవైడీ సీలియన్ కొత్త ఎడిషన్: ధర, వివరాలు | BYD Celebrates 1 Year Of Sealion 7 In India With First Anniversary Edition Launch, Check Price And Specifications | Sakshi
Sakshi News home page

బీవైడీ సీలియన్ కొత్త ఎడిషన్: ధర, వివరాలు

Mar 17 2026 9:02 PM | Updated on Mar 18 2026 4:20 PM

BYD Sealion 7 Anniversary Edition Launched In India

బీవైడీ కంపెనీ భారతదేశంలో తన సీలియన్ 7 కారును లాంచ్ చేసి ఏడాది కాలం అయింది. ఈ సందర్భంగా సంస్థ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీనికోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.70000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని బీవైడీ వెల్లడించింది.

బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్‌ ప్రీమియం, పెర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు, కాగా ప్రీమియం వెర్షన్ అదే వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుంది. రెండు వేరియంట్లు 82.56 kWh బ్యాటరీ ప్యాక్‌ పొందినప్పటికీ.. NEDC ప్రమాణాల ప్రకారం, పెర్ఫార్మెన్స్ మోడల్ డ్రైవింగ్ రేంజ్ 542 కిలోమీటర్లు కాగా.. ప్రీమియం వేరియంట్ 567 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్‌ ప్రీమియం, పెర్ఫామెన్స్ ధరలు వరుసగా.. రూ. 49.40 లక్షలు, రూ. 54.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ముందు బుక్ చేసుకున్న 1100 మందికి ఇన్‌స్టాలేషన్‌తో పాటు 11 kW హోమ్ ఛార్జర్‌ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తారు. అంతేకాకుండా, ఈ ప్యాకేజీలో రెండు సంవత్సరాల ఉచిత సర్వీస్ మరియు మెయింటెనెన్స్ కూడా లభిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement