మాట్లాడుకుందామని పిలిచి అంతమొందించాడు | Police Break Down Chilkanagar AR Constable Sudheer Reddy Case | Sakshi
Sakshi News home page

మాట్లాడుకుందామని పిలిచి అంతమొందించాడు

Mar 17 2026 9:15 AM | Updated on Mar 17 2026 9:15 AM

Police Break Down Chilkanagar AR Constable Sudheer Reddy Case

ఉప్పల్‌: ఏఆర్‌ కానిస్టేబుల్‌ హత్య కేసులో  పోలీసులు నిందితులను ఆరుగంటల్లోపే ఛేదించారు.  ఉప్పల్‌ డీసీపీ కె.సురేష్‌ కుమార్‌ తెలిపిన మేరకు.. బానోతు సంతోష్‌  తరుణ్, సుధీర్‌ కుమార్‌ ముగ్గురూ స్నేహతులు. మూడు రోజుల క్రితం సుదీర్‌ తన బావ ఇంటి గృహప్రవేశానికి వీరిని పిలిచాడు.

 అయితే ఫంక్షన్‌ రోజున సంతోష్‌ చేసిన ఫోన్‌ కాల్స్‌ను సుధీర్‌ రిసీవ్‌ చేసుకోలేదు. ‘నన్ను పిలిచి.. నా ఫోన్‌ ఎత్తవా అంటూ ఆగ్రహానికి గురయ్యాడు. వాట్సాప్‌లో తీవ్ర పదజాలంతో ఇద్దరి మధ్యా చాటింగ్‌ జరిగింది. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ‘మాట్లాడుకుందాం రా’ అని సుదీర్‌ను చిలుకానగర్‌ ఖాళీ స్థలానికి  పిలిచారు. అక్కడ సంతోష్‌.. సుదీర్‌ను  విచక్షణా రహితంగా పొడిచాడు.   సు«దీర్‌ రోడ్డుపైకి పరుగులు తీసినా వదలకుండా వెంటాడి అందరూ చూస్తుండగానే పొడిచి చంపేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో   స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. 

సంతోష్‌ తోపాటు తరుణ్‌ నాగారంలోని సంతోష్‌ అక్క  ఇంటికి చేరుకున్నారు.  తెల్లవారే ముందే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే నిందితుల ఫోన్‌ సిగ్నల్స్, సీసీ ఫుటేజీలను ఆధారంగా  నిందితులను తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని, తన ఇన్‌స్ర్ట్రాగామ్‌లో కూడా స్ట్రీట్‌ ఫైటర్‌ నంటూ పోస్టులు  పెట్టుకున్నాడని తెలిపారు.సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement