’ఇంకా నేర్చుకుంటూనే ఉండు.. సెలక్టర్లకు బుద్ధి లేదు’ | Learn He Learn Start Ho Gaya: Pakistan Batter Lambasts Rizwan Flop Show | Sakshi
Sakshi News home page

’ఇంకా నేర్చుకుంటూనే ఉండు.. సెలక్టర్లకు బుద్ధి లేదు’

Mar 17 2026 4:17 PM | Updated on Mar 17 2026 4:40 PM

Learn He Learn Start Ho Gaya: Pakistan Batter Lambasts Rizwan Flop Show

పాకిస్తాన్‌ స్టార్‌ మహ్మద్‌ రిజ్వాన్‌పై ఆ దేశ వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెజాద్‌ విమర్శల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా నేర్చుకునే దశలోనూ ఉన్నాడంటూ చురకలు అంటించాడు. ఇప్పటికైనా ఆట తీరు మార్చుకోకపోతే జట్టులో కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డాడు.

చేదు అనుభవం.. బంగ్లా చేతిలో చిత్తు
టీ20 ప్రపంచకప్‌-2026లో సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్‌ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్‌ పర్యటనలోనూ చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో 2-1తో ఓడిపోయి దాదాపు పదకొండేళ్ల తర్వాత.. తొలిసారి బంగ్లాదేశ్‌కు సిరీస్‌ కోల్పోయింది.

షాహిన్‌ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాతో వన్డే సిరీస్‌ ఆడిన పాకిస్తాన్‌ జట్టులో రిజ్వాన్‌ ఒక్కటే సీనియర్‌ మోస్ట్‌ ప్లేయర్‌. అయితే, ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 58 పరుగులే చేశాడు.

అసలు టెక్నికే సరిగ్గా లేదు
ఈ నేపథ్యంలో  అహ్మద్‌ షెజాద్‌ రిజ్వాన్‌ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బంతులు నువ్వు ఆడగలిగేలానే పడుతున్నాయి రిజ్వాన్‌ సాబ్‌. నువ్వు చాలా సమయం తీసుకుంటున్నావు. అయినా సరే బంతిని బాదలేకపోతున్నావు.

అసలు టెక్నికే సరిగ్గా లేదు. లెగ్‌ సైడ్‌ ఆడాల్సింది. ఇన్నేళ్లు గడిచినా నువ్వింకా నేర్చుకునే దశలోనే ఉన్నావు. అసలు నీ ఆటలో ఏమైనా పురోగతి ఉందా? టీ20 ప్రపంచకప్‌ జట్టులో నీకు స్థానమే లేదు.

బుద్ధి రావడం లేదు
వన్డేల్లోనైనా అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్‌ వంటి జట్టుపై నువ్వు సెంచరీలు బాదాల్సింది. కానీ సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించేలా చెత్తగా ఆడావు. నిన్ను జట్టుకు ఎంపిక చేసే వాళ్లకు కూడా బుద్ధి రావడం లేదు’’ అని  అహ్మద్‌ షెజాద్‌ ఘాటు విమర్శలు చేశాడు. 

​కాగా 2015లో పాకిస్తాన్‌ తరఫున అరంగేట్రం చేసిన రిజ్వాన్‌.. ఇప్పటి వరకు 41 టెస్టుల్లో 2399, 103 వన్డేల్లో 2979, 106 టీ20లలో 3414 పరుగులు సాధించాడు.

చదవండి: కోహ్లి, గేల్‌ కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్‌ అతడే: డివిలియర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement