లేబర్ ఫోర్స్ సర్వే: నిరుద్యోగం రేటు ఇలా.. | Unemployment Rate Eases to 4 9 in February | Sakshi
Sakshi News home page

లేబర్ ఫోర్స్ సర్వే: నిరుద్యోగం రేటు ఇలా..

Mar 17 2026 4:32 PM | Updated on Mar 17 2026 4:41 PM

Unemployment Rate Eases to 4 9 in February

దేశీయంగా 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గింది. జనవరిలో నిరుద్యోగిత రేటు (యూఆర్‌) 5 శాతంగా ఉండగా, గత నెల 4.9 శాతానికి నెమ్మదించినట్లు కార్మిక శక్తి సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదికలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.6 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేకుండా 4.2 శాతంగా కొనసాగింది.

గత నెలలో మహిళల్లో (15 సంవత్సరాలు పైబడిన వారు) యూఆర్‌ జనవరిలో 5.6 శాతంగాను ఉండగా, గత నెల 5.1 శాతానికి దిగివచి్చంది. పట్టణ ప్రాంతాల్లో 9.8 శాతం నుంచి 8.7 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 4.3 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,74,879 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రజల్లో ఉద్యోగాలు, నిరుద్యోగాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే పీఎల్‌ఎఫ్‌ఎస్‌ని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) నిర్వహిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement