హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ క్రికెటర్లను కొనుగోలు చేయడంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సన్‌రైజర్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణాలు తీస్తుందని వ్యాఖ్యానించారు.
అయితే సునీల్ గావస్కర్ వ్యాఖ్యలను పాక్ సంతతికి చెందిన ఇంగ్లీష్ క్రికెటర్ అజీమ్ రఫిక్ ఖండించడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక దిగ్గజ క్రికెటర్ అనే కనీసం గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి కొత్త వివాదానికి తెరలేపాడు. ‘సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవే.
అసలు ఆయన మాట్లాడిన మాటలను ఎవరైనా అంగీకరించగలరా చెప్పండి? అయినా మీరు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్ని పరుగులు చేశారన్నది నాకు అనవసరం. కానీ సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు మాత్రం అర్థరహితం’ అని పేర్కొన్నాడు. అయితే అజీమ్ రఫిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘
పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం లేదన్న విషయం నిరూపించగలవా? అక్కడ నాన్ ముస్లింలనే లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించడం ఎంతవరకు సమంజసం’..‘భారత్‌పై పడి ఏడ్వడం మానండి. సునీల్ గావస్కర్ ఒక దిగ్గజ క్రికెటర్ అన్న కనీస మర్యాద కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. ఆయన అనుభవమంత వయసు కూడా నీకు లేదు. ముందు ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆ తర్వాత ఉపన్యాసాలు ఇవ్వొచ్చు’.. ‘పాక్ క్రికెటర్లు సుద్దపూసలైతే ఆసియా కప్‌లో ఆ జట్టు బోర్డు చైర్మన్ ప్రవర్తించిన తీరు సరైనదేనా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది?’ అని కామెంట్లు పెట్టారు.
This is absolutely ridiculous & should be condemned ..
How are these comments acceptable? I don’t care how many runs you have scored
Vile stuff from Gavaskar https://t.co/sLYtUKmGnZ— Azeem Rafiq (@AzeemRafiq30) March 16, 2026


