ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 16-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Mar 16 2026 3:30 AM | Updated on Mar 16 2026 5:13 AM

Rasi Phalalu: Daily Horoscope On 16-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.7.54 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ధనిష్ఠ తె.5.29 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి శతభిషం, వర్జ్యం: ఉ.8.42 నుండి 10.22 వరకు, దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.20 వరకు, తదుపరి ప.2.50 నుండి 3.42 వరకు, అమృత ఘడియలు: సా.6.30 నుండి 8.08 వరకు

సూర్యోదయం : 6.12
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం.... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత స్థితి.

వృషభం.... రుణాలు చేయాల్సివస్తుంది. శ్రమా«ధిక్యం. పనులలో స్వల్ప అవాంతరాలు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. దైవచింతన.

మిథునం.... ధనవ్యయం. శ్రమాధిక్యం. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో  వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కర్కాటకం.... మిత్రుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తిలాభ సూచనలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం... రుణాలు తీరతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు సజావుగా సొగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సా«ధిస్తారు.

కన్య... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. భూవివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

తుల.... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.

వృశ్చికం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

ధనుస్సు.... పనులలో స్వల్ప అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. విద్యార్థులకు ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం........ మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఆధ్యాత్మిక చింతన. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కుంభం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో తొందరపాటు. వ్యవహారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం... రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువులతో సఖ్యత. ఆస్తి వివాదాలు కొంత పరిష్కారం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement