ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి.. | telangana chef divya sarika wins 5 gold medals in culinary olympiad | Sakshi
Sakshi News home page

ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..

Mar 17 2026 9:26 AM | Updated on Mar 17 2026 9:26 AM

telangana chef divya sarika wins 5 gold medals in culinary olympiad

ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి.. ఈ పాట వినగానే నోరూరిపోతుంది..కదూ! సరిగ్గా ఇదే తరహాలో.. వంటల పోటీలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో.. ప్రపంచ చెఫ్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కలినరీ ఒలింపియాడ్‌ పోటీల్లో మేడ్చల్‌ సర్కిల్‌ గిర్మాపూర్‌కు చెందిన మహిళ ప్రతిభ కనబరిచింది. ఈ నెల 10 నుండి 14 వరకు జరిగిన పోటీల్లో ముక్కెర దివ్యసారిక దేశ, విదేశాలకు చెందిన పలు రకాల వంటలు వండి వార్చారు. ఆహార పదార్థాల రుచికి ఫిదా అయిన సెలెక్షన్‌ ప్యానెల్‌ ఆమెను ఐదు బంగారు పతకాలతో సత్కరించింది. ఇందులో భాగంగా బేకరి పాపీస్, ప్‌లెటైడ్‌ డెజర్ట్స్, వెడ్డింగ్‌ కేక్, రీజినల్‌ క్యూజిన్, డిన్నర్‌ మెనూ, తదితర విభాగాల్లో దివ్యసారిక ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి పతకాలు పొందారు. వివిధ దేశాలకు చెందిన చెఫ్స్‌ ఆమెను అభినంధించారు. 
– మేడ్చల్‌   

Advertisement
 
Advertisement
Advertisement