Top Stories
ప్రధాన వార్తలు

మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం: వైఎస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి:’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.‘‘మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని, మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం, కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా, చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం...జగనన్నకు చెబుదాం నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..👉స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు👉తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి పెట్టి, లాగేసుకునే ప్రయత్నంచేస్తోంది👉అయినా సరే మెజార్టీ వైయస్సార్సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు:👉పోలీసులు వైయస్సార్సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు👉సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు👉కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే👉రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు👉ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం👉పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు👉యలమంచిలిలో మన వాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు👉ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది👉కాని చంద్రబాబుగారి పరిపాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది👉మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు👉జగన్ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు👉కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు 👉కాని, మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ వెళ్లాడు👉గడపగడపకూ కార్యక్రమం కింద మూడుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లారు:👉99శాతం హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైయస్సార్సీపీ మాత్రమే👉మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు👉10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు👉ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్‌బాల్ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు👉వైఎస్సార్సీపీ మాదిరిగా ప్రతి ఇంటికీ వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా?👉హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది👉మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు👉పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు👉ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు👉రూ.3600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు👉ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు👉వైద్యంకోసం అప్పులు పాలు అయ్యే పరిస్థితి👉ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడంలేదు👉ప్రభుత్వం రంగంలో వైయస్సార్సీపీ తీసుకొచ్చిన కాలేజీలను చంద్రబాబు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు:👉కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం ప్రారంభించాం👉శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లాం👉ఇప్పుడు ఆమూడు పోర్టులను కమీషన్లకోసం అమ్మేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు👉ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపించాం👉ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు పెట్టాం👉బోగాపురం ఎయిర్‌పోర్టుకు గత చంద్రబాబు హయాంలో అనుమతులు లేవు, భూసేకరణ లేదు👉మనం అన్నీచేసి 30శాతం పనులు చేశాం👉రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనులు కేవలం వైయస్సార్సీపీ హయాంలోనే జరిగాయి👉ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి👉వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు👉ప్రజలను వెన్నుపోటు పొడిచాడు👉ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చాడు👉రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు👉ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నాడు👉చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు👉తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు 👉గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు👉పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు👉ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను👉జగన్ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది👉కోవిడ్ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం👉ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను 👉రేపు కచ్చితంగా వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ ఒన్👉అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి👉కొడతానంటే.. కొట్టమనండి👉కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి👉కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం👉రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం👉దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం👉అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం👉మనకూ టైం వస్తుంది👉చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి👉చంద్రబాబు దుర్మార్గపు పాలనవల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది👉మహిళలను అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు👉ఒక కేసులో బెయిల్ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు👉ఇలా కేసులు మీదు కేసులు పెడుతన్నారు👉వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు👉దళితుడైన ఎంపీ నందిగం సురేష్ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు👉సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు👉తనను, తన కుటుంబ సభ్యులను తిడితే, ఎందుకు తిట్టావన్నందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు👉చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మరిచిపోవద్దు👉రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దాం👉వచ్చేది మన ప్రభుత్వమే👉మంచి రోజులు కచ్చితంగా వస్తాయి

తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా
సాక్షి, విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. కోరం లేక ముగించిసనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న, ఈ రోజు టీడీపీ అరాచకం వల్ల ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరగకుండా టీడీపీ గూండాలు అల్లర్లు సృష్టించారు. టీడీపీ గూండాల బీభత్సంతో రెండు రోజులు ఎన్నిక జరగలేదు. వైసీపీ కౌన్సిలర్లు తిరువురు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజురుకాలేకపోయారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ఆర్డీవో కే.మాధురి ముగించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యచరణ ఉంటుందని ఆర్డీవో ప్రకటించారు.దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసు వాహనం ఎక్కనివ్వకుండా టీడీపీ టీడీపీ నేత రమేష్ రెడ్డి, టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై కూడా టీడీపీ గూండాల దాడి చేశారు. దేవినేని అవినాష్ , మొండితోక అరుణ్ కుమార్‌లను రెడ్డిగూడెం స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు.

KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం (మే 20) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది. కాగా, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో హరీష్‌రావు నిటి పారుదల వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పొడిగింపు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Kaleshwaram commission) విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్,హరీష్‌రావు,ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది.

NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు
చండీఘడ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లు వినియోగించినట్లు తేలింది. ఎన్ఐఏ విచారణలో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్‌గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే? ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేదని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం,ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాన్ దార్‌తో సన్నిహితంగా ఉండడంతో మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.గూఢచర్యం కేసులో ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్లో పర్యటన, ఐఎస్ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది.

IPL 2025: చరిత్ర సృష్టించిన లక్నో ప్లేయర్లు.. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి..!
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. లీగ్‌లో మునుపెన్నడూ జరగని విధంగా ఈ సీజన్లో లక్నోకు చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో ఒకే ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి.నిన్న (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్ త్రయం ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఈ ఘనత సాధించింది. సీజన్ ప్రారంభం నుంచి భీకర ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటారు. ఈ మ్యాచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్ష్ (61), మార్క్రమ్ (61), పూరన్ (45) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందే పూరన్ 400 పరుగులు పూర్తి చేయగా.. మార్క్రమ్, మార్ష్ ఈ మ్యాచ్‌లో 400 పరుగుల మైలురాయిని తాకారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పూరన్ నాలుగు అర్ద సెంచరీల సాయంతో 455 పరుగులు చేయగా.. మార్ష్ 11 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు.. మార్క్రమ్ 12 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 409 పరుగులు చేశారు. ఈ సీజన్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో పూరన్ 9, మార్ష్ 10, మార్క్రమ్ 12 స్థానాల్లో ఉన్నారు.ఈ సీజన్లో ముగ్గురు విదేశీ బ్యాటర్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా లక్నో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం సోచనీయం. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్, మార్ష్, మార్క్రమ్ సత్తా చాటినా లక్నో గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో లక్నో తరఫున ఈ ముగ్గురు మినహా బ్యాటింగ్‌లో ఎవ్వరూ రాణించలేదు. అడపాదడపా బదోని బ్యాట్‌కు పని చెప్పాడు. మిడిలార్డర్లో పంత్ ఘోరంగా విఫలం కావడం.. సరైన్ ఫినిషర్ లేకపోవడం ఈ సీజన్లో లక్నో కొంపముంచాయి. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ పర్వాలేదనిపించినా వీరికి సహకరించే బౌలర్లే కరువయ్యారు. రవి బిష్ణోయ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. పేసర్ ఆకాశ్‌దీప్ తేలిపోయాడు. మరో పేసర్ ప్రిన్స్ యాదవ్ అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సీజన్ ప్రారంభ మ్యాచ్లకంతా దూరంగా ఉండిన మయాంక్ యాదవ్ రెండు మ్యాచ్‌లు ఆడి తిరిగి గాయపడ్డాడు. వీటన్నిటికి మించి రిషబ్ కెప్టెన్సీలో లోపాలు ఈ సీజన్లో లక్నో ఖేల్ ఖతం చేశాయి. మార్క్రమ్, మార్ష్, పూరన్ ఫామ్ మినహా ఈ సీజన్లో లక్నో గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సీజన్లో లక్నోకు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు (మే 22న గుజరాత్‌తో, మే 27న ఆర్సీబీతో) మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవడం తప్ప లక్నో చేయగలిగిందేమీ లేదు.

వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి
👉వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్‌దేవినేని అవినాష్, అరుణ్‌కుమార్‌లు అరెస్ట్‌తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులురెడ్డిగూడెం స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడిదేవినేని అవినాష్, అరుణ్‌కుమార్ వాహనాలపై దాడివైఎస్సార్సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలుదారికాసి వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలుఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్ వద్ద టీడీపీ గూండాల విధ్వంసంసాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైసీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్సీపీ నేత స్వామిదాస్ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.వైఎస్సార్సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్, స్వామిదాస్ అరుణ్ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్, స్వామిదాస్‌పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.

‘ఇవేం రోడ్లు?.. బీబీఎంపీకి రూ.50 లక్షల నోటీస్
బెంగళూరు: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు అనువైన రోడ్లు ఎంతో అవసరం. అయితే భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గుంతలు, గతుకులు, వర్షం పడితే చాలు నీటితో నిండిపోయే రోడ్లు బెంగళూరు వాసులను ఇబ్బందుకు గురిచేస్తున్నాయి. ఈ ఇక్కట్లపై స్పందించిన బెంగళూరుకు చెందిన దివ్య కిరణ్(43) బృహత్ బెంగళూరు మహానగరపాలిక(Greater Bengaluru Metropolitan City) (బీబీఎంపీ)కి నోటీసులు పంపించారు.బెంగళూరు నగరంలోని రోడ్లపై ప్రయాణిస్తున్న కారణంగా తనకు శారీరక బాధలు ఎదురవడమే కాకుండా, మానసిక సమస్యలు కూడా తలెత్తాయని పేర్కొంటూ ఆయన బీబీఎంపీకి రూ. 50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. నగరానికి చెందిన సామాన్య పౌరుడినైన తాను పన్నులను చెల్లిస్తూ, నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నానని కిరణ్ పేర్కొన్నారు. అయితే గతుకుల రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే కదలికల కారణంగా తాను తీవ్రమైన మెడ, వీపు నొప్పులకు లోనయ్యానని పేర్కొన్నాడు. ఈ నొప్పుల నుంచి ఉపశమనానికి ఐదు సార్లు ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్(Orthopedic specialist)లను సంప్రదించాల్సి వచ్చిందని కిరణ్ ఆ నోటీసులో పేర్కొన్నాడు.నగర రోడ్లపై ప్రయాణిస్తున్న కారణంగా తన క్లయింట్ కిరణ్ పలు ఇబ్బందుకు ఎదుర్కొంటున్నాడని ఇంజక్షన్లు, చికిత్సలు, నొప్పి నివారణ మందులు.. అతని రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయాయని అడ్వకేట్ కేవీ లవీన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దివ్య కిరణ్ ఆటోలు, టూ-వీలర్లలో ప్రయాణించడం అసాధ్యంగా మారిందని, క్యాబ్‌లు కొంచెం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, రోడ్ల దుస్థితి కారణంగా అవి కూడా అతని బాధను తప్పించలేకపోతున్నాయని లవీన్ పేర్కొన్నారు. నగరంలోని రోడ్ల పరిస్థితి అతని వృత్తిపరమైన జీవితాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు.తాను ఎదుర్కొంటున్న సమస్యలకు బీబీఎంపీ నిర్లక్ష్యమే కారణమని దివ్య కిరణ్ ఆరోపించారు. దీనికి ప్రతిగా తనకు రూ. 50 లక్షల పరిహారాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ దీనిపై స్పందించకుంటే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) కూడా దాఖలు చేస్తాననని కిరణ్ తెలిపారు.ఇది కూడా చదవండి: బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే..

మీడియాకు పీపుల్స్ స్టార్ పాఠాలు
పీపుల్ స్టార్ నారాయణమూర్తి ఏ అంశాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఆయనకు ముఖస్తుతి.. డబ్బా కొట్టడం.. చెంచాగిరి అసలు తెలియదు.. చిన్నపిల్లలు పెద్దవాళ్లు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు.. డబ్బున్న వాళ్ళు పేదలు అనే తేడా లేకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉంటూనే తన మనసులో ఉన్న భావాలను స్పష్టంగా వెల్లడించగలిగే ధైర్యం కలిగిన ఒకే ఒక్క సినీ నటుడు నారాయణమూర్తి.ఆయన ఎవరిని అయినా మంచి చేసుకోవడం కోసమో మచ్చిక చేసుకోవడం కోసమో మాట్లాడరు. కెరీర్ కోసము.. సినీ అవకాశాల కోసం భజన చేయడం అసలు ఉండదు.. అలాంటి నారాయణమూర్తి ఓ సభలో మీడియా తీరతెన్నులను తూర్పారబట్టారు. సమాజంలో మీడియా బాధ్యతను.. సమాజ మనుగడలో మీడియా పాత్రను దాన్ని ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూనే ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు పోతున్న పోకడలను ఈ పీపుల్స్ స్టార్ పెద్దల సమక్షంలోనే ఎండగట్టారు.కొన్ని పత్రికలు, కొంతమంది కోసం.. కొన్ని మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూ తన బాధ్యతను విస్మరిస్తున్నాయని.. తమకు నచ్చిన నాయకుడు ఎలా వ్యవహరిస్తున్న ఎంత దుర్మార్గంగా పాలిస్తున్నా ఆయన కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని, ఈ వైఖరి అంతిమంగా సమాజానికి ఎనలేని కీడు చేస్తోందని నారాయణమూర్తి దుయ్యబట్టారు.మీడియా సంస్థలు తమ బాధ్యతను విస్మరించి కొన్ని పార్టీలకు ఊడిగం చేస్తూ మనుగడ సాగిస్తున్నాయని ఇలాంటి సంస్థల వలన సమాజానికి ఏం లాభం అని ఆయన మాజీ చీఫ్ జస్టిస్ రమణ వంటి పెద్దల సమక్షంలోనే దులిపి ఆరేశారు. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థలను నేరుగా తాకాయని పాత్రికేయులు విశ్లేషకులు అంటున్నారు. నారాయణమూర్తి మాట్లాడింది నూటికి నూరు శాతం నిజం అని.. చంద్రబాబుని కొన్ని మీడియా సంస్థలు వెనకేసుకు వస్తూ ఆయన తప్పులను కాపాడుతూ సమాజానికి నష్టం చేస్తున్నాయని.. విషయాన్ని నారాయణమూర్తి నిర్భయంగా బయటపెట్టారని ఎప్పటికీ సోషల్ మీడియాలో పోస్టింగులు మొదలయ్యాయి.ఇంగ్లీష్ మీడియం చదవాలండిదీంతోపాటు నారాయణమూర్తి ఇంకేమన్నారంటే పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలని ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించాలని అప్పుడే ఉన్నత స్థానాలకు చేరగలుగుతారని అన్నారు. వేదికపై ఉన్న మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను చూపిస్తూ ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగులోనే సాగిన ఆ తర్వాత ఆంగ్లంలో ప్రారంభించిన సంపాదించి న్యాయ స్థానాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఈ అంశం కూడా గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియాని ప్రవేశపెట్టిన అంశాన్ని పాత్రికేయులు ప్రజలు గుర్తు చేసుకున్నారు.ఆనాడు వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు మరికొందరు నాయకులు అడ్డుకున్నారని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాని వ్యతిరేకించారని తద్వారా పేద పిల్లలకు ఆంగ్ల అందకుండా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. నేడు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి కూడా ఆంగ్ల విద్య ప్రాధాన్యాన్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఆనాటి వైఎస్ జగన్ పాలనను గుర్తుచేస్తుంది అని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి నిక్కచ్చిగా మాట్లాడే నారాయణమూర్తి పలు అంశాల్లో అటు పక్షపాత మీడియాకు.. ఆంగ్ల మీడియం వద్దన్న నాయకులకు చురకల్లా తగిలాయని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న

24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నతనంలోనే చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే అధికబరువుతో దారితీస్తున్న అనారోగ్యాలపై పెరుగుతున్న అవగాహన కారణంగా అధికబరువును తగ్గించేందుకు కసరత్తుల భారీగానే చేస్తున్నారు. ఆహారంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. తమ సక్సెస్ స్టోరీను సోషల్‌మీడియాలో ఫాలోయర్స్‌తో పంచుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్. పదండి ఆమె వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం. కోపాల్ అగర్వాల్ చిన్న వయసులోనే 101 బరువుతో బాధపడేది. ఇష్టమైన దుస్తులు వేసుకోవాలంటే కుదిరేదికాదు. పైగా ఏనుగులా వున్నావ్.. నీతో ఎవరు డేటింగ్ చేస్తారు... ఇలాంటి వెక్కింపులు, వేళాకోళాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేది. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించు కుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. చక్కటి ఫలితాన్ని సాధించింది. 101 కిలోల బరువు వద్ద మొదలైన ఆమె వెయిట్ లాస్జర్నీ 62 కిలోలకు చేరింది.కోపాల్ అగర్వాల్ తన అద్భుతమైన సక్సెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తను పాటించిన ఆహార నియమాలు, వ్యాయామల గురించి అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనం తీసుకునేది. క్రమం తప్పకుండా కఠిన వ్యాయామం చేసింది. దీంతో సుమారు 40 కిలోల బరువును తగ్గించుకుంది. ఇపుడు ఇష్టమైన మోడ్రన్ దుస్తులు కూడా వేసుకుంటోంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక శ్రేయస్సు , కాన్ఫిడెన్స్ కూడా మెరుగుపడిందని ఆమె చెప్పింది. మరో వీడియోలో, తాను కేవలం ఆరు నెలల్లో 32 కిలోలు తగ్గినట్టు చెప్పుకొచ్చింది అగర్వాల్. View this post on Instagram A post shared by KOPAL AGARWAL | Fitness | Nutrition | Skincare | Travel (@_kopal.agarwal_)బరువు తగ్గడానికి తీసుకున్న రోజువారీ ఆహారం:అల్పాహారం: ఒక రోటీ, 5 గుడ్డులోని తెల్లసొన, ఒక గిన్నె పోహా 2 పనీర్ ముక్కలతో అధిక ప్రోటీన్ కలిగిన ఫ్రూట్స్, పెరుగుమధ్యాహ్నం: పుచ్చకాయ , స్ట్రాబెర్రీలు బ్లాక్ కాఫీ, కొబ్బరి నీరుభోజనం: ఆకుకూరలతో 100 గ్రాముల చికెన్, కిచ్డీ పెరుగుతో పచ్చి కూరగాయలతో పనీర్ భుర్జీమధ్యాహ్నం: గ్రీన్ టీరాత్రి భోజనం: ఆకుకూరలతో సాటేడ్ పనీర్ సలాడ్, 100 గ్రాముల చికెన్, గుడ్డు భుర్జీదీంతో పాటు, రాత్రి తొందరగా నిద్రపోవడం, ఉదయాన్నేతొందరగా మేల్కోవడం లాంటివి పాటించింది. ఇంకా ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు త్రాగడం , పరగడుపున గోరువెచ్చని నీరు సేవించడం, ప్రతిరోజూ కనీసం 10వేలు అడుగులు నడవడంతన దినచర్యలో భాగం చేసుకుంది. చక్కెర ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తీసుకుంటూ, జంక్ ఫుడ్‌కు కంప్లీట్‌గా నో చెప్పింది. మొత్తానికి కష్టపడి తన శరీర బరువు 101 నుండి 62 కిలోలకు చేరి వావ్ అనిపించుకుంది.నోట్ : ఇదే టిప్స్ అందరికీ పాటించాలనే నియమం ఏదీ లేదు. కానీ కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తి నిబద్దత, ఓపికతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం కష్టమేమీ కాదు. అయితే బరువు తగ్గే ప్రయత్నాలను ప్రారంభించేందు ముందు, బరువు పెరగడానికి గల కారణాలును వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకుని ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త పడాలి.

గాయాలతో రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్
హీరోయిన్ రాశి ఖన్నా స్వల్పంగా గాయపడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఒక సినిమా షూటింగ్లో కథ డిమాండ్ మేరకు చాలా రిష్క్ ఉన్న యాక్షన్ సీన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్గా 'ది సబర్మతి రిపోర్ట్'తో మెప్పించిన ఆమె 'ఫర్జీ2' వెబ్ సిరీస్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఆమెకు గాయాలు అయినట్లు సమాచారం.గాయాలతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన రాశి ఖన్నా ఇలా చెప్పుకొచ్చింది. 'ఒక్కోసారి కథ డిమాండ్ చేస్తే గాయలను కూడా లెక్కచేయకూడదు. ఈ క్రమంలో మీ గాయాలు కూడా ఒక్కోసారి మీ శరీరం, మీ శ్వాస మీద ప్రభావం చూపవచ్చు.' అంటూ పోస్ట్ చేసింది. షూటింగ్లో చిన్నచిన్న గాయాలైనట్లు రాశి ఖన్నా తెలిపింది.కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్గా చేయనుంది. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna)
ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్
గతి తప్పుతున్న చైనా ఆధిపత్యం
IPL 2025: చరిత్ర సృష్టించిన లక్నో ప్లేయర్లు.. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి..!
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
స్పా ముసుగులో వ్యభిచారం
మీడియాకు పీపుల్స్ స్టార్ పాఠాలు
KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ: సుదర్శన్‌రెడ్డి
Covid-19 Returns: 257 కేసులు.. ఇద్దరు మృతి
అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఇండియా ఇంత బలహీనమైనదా?
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
సారూ.. మా ఊరు పేరు మార్చండి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్
గతి తప్పుతున్న చైనా ఆధిపత్యం
IPL 2025: చరిత్ర సృష్టించిన లక్నో ప్లేయర్లు.. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి..!
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
స్పా ముసుగులో వ్యభిచారం
మీడియాకు పీపుల్స్ స్టార్ పాఠాలు
KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ: సుదర్శన్‌రెడ్డి
Covid-19 Returns: 257 కేసులు.. ఇద్దరు మృతి
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఇండియా ఇంత బలహీనమైనదా?
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
సారూ.. మా ఊరు పేరు మార్చండి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
సినిమా

కలెక్టర్ కావాలనుకున్న పేద విద్యార్థినికి కమల్ సాయం
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తను చేసిన సాయాన్ని బయటిప్రపంచానికి పెద్దగా చెప్పుకోడు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆ సాయం పొందిన వారు ఏదో వేదిక మీద చెప్పిన తర్వాత వైరల్ అవుతుంటుంది. ఈయన ఇప్పటికే కమల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి వందల మందికి విద్యాదానం చేస్తున్నారు. తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పాంబన్ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన అనే విద్యార్ధిని ప్లస్ –2 పరీక్షల్లో 562 మార్కులు సాధించింది. ఈమె తండ్రి మత్స్యకారుడు. తల్లి పీతలు ఎగుమతి కంపెనీలో రోజువారీ కూలీ. కాగా తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధిని శోభన. ఈమెకు ఉన్నత విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలన్నది ఆశ. అయితే కుటుంబ ఆర్థిక స్థోమత లేకపోవడంతో శోభన చదువు మానేసి ఒక బట్టల దుకాణంలో పనికి చేరింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కమలహాసన్ విద్యార్ధిని శోభనను తన కార్యాలయానికి పిలిపించి కమల్ సాంస్కృతి కేంద్రం ద్వారా ఆమె ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులకు సాయం చేశారు. తను సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేవరకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. తన సంరక్షణలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆపై సివిల్ సర్వీస్‌కు కావాల్సిన వనరులు ఏర్పాటు చేస్తానని శోభనకు ఆయన మాట ఇచ్చారు. దీంతో శోభన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కమల్ సార్ చేసిన సాయాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ వృధా కానివ్వనని శోభన చెప్పింది. తాను సివిల్ సర్వీస్ సాధించి తప్పకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతానని మాటిచ్చింది.

ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు
జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్‌కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్లను దాటుకుంటూ విరుచుకపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్‌ను ఆల్‌రౌండర్ అంటారు.. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి. క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే.. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా.. అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్రపరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20).. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..తారక్ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్'ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్‌కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌తో తిరిగొచ్చాడు.తారక్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం🎥 తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.🎥 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.🎥ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.🎥 యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.🎥 జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.🎥 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.🎥 నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.🎥 మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.🎥 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.🎥 పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.🎥సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.🎥 2016లో వచ్చిన జనతా గ్యారేజ్‌తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు🎥కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్🎥 బాల రామాయణము,ఆది నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందకున్నాడు 🎥తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట🎥 తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.🎥 జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు🎥అమ్మ (శాలనీ) చిరకాల కలను తీర్చిన తారక్.. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలనే ఆమె కోరికను కొడుకుగా తీర్చాడు.

ఇక నాకు ఇది కొత్త జన్మ: మంచు మనోజ్
‘‘నాకు నా హార్డ్‌వర్క్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఈ బర్త్ డే (మే 20) నుంచి నాకు ఇది కొత్త జన్మ. నా బర్త్ డే స్టార్ట్ కాక ముందే నేను ఏదైతే స్టేజ్ (సినిమా వేదిక) మిస్సవుతున్నానో ఆ స్టేజ్‌కు తీసుకువచ్చాడు దేవుడు. అంతకంటే పెద్ద బర్త్ డే గిఫ్ట్ ఏదీ ఉండదు’’ అని మంచు మనోజ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. జయంతిలాల్ గడా సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. అలాగే నేడు (మంగళవారం) మంచు మనోజ్ బర్త్ డే. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో మనోజ్ పంచుకున్న విశేషాలు.⇒ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తమ్ముడు శ్రీనివాస్ (బెల్లంకొండ సాయి) నన్ను కలవడం, ‘గరుడన్ ’ సినిమా తెలుగు రీమేక్ ‘భైరవం’ గురించి దర్శకుడు విజయ్‌తో మాట్లాడమని చెప్పడం, కథ నచ్చి, నేనీ సినిమాకు ఓకే చెప్పడం చకా చకా జరిగిపోయాయి. ∙ఈ చిత్రంలో నేను గజపతి వర్మ అనే క్యారెక్టర్ చేశాను. ‘భైరవం’ని డైరెక్టర్ విజయ్ బాగా తీశాడు. యాక్టర్స్‌గా నాకు, శ్రీనివాస్, నారా రోహిత్‌గారికి కొంత స్క్రీన్ గ్యాప్ వచ్చింది. అయినా మాతో రాధామోహన్ గారు మంచి మూవీ నిర్మించారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది.⇒ నా జీవితంలో నాకు మా నాన్నే హీరో (ప్రముఖ నటుడు–నిర్మాత మోహన్ బాబు). నాన్నగారు కష్టపడి, పోరాడి ఇంత గొప్ప స్థాయికి వచ్చింది మనందరం చూశాం. ఆయన్ను చూస్తూ పెరిగాను. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. నమ్మినవాళ్లను బాగా చూసుకోవడం, వాళ్లతోనే ఉండటం, పదిమందికి హెల్ప్ చేయడం, స్కూల్‌ని బిల్డ్ చేయడం... ఇలా నాన్నగారు చాలా చేశారు. ఇక దాన్నుంచి (ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి కావొచ్చు) నేను బయటకు రాలేకపోతున్నాను. విష్ణు అన్న నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే ఏ సిట్యువేషన్ లోనైనా మాట్లాడి, ఆ పరిస్థితులను ఎలా సెట్ చేయవచ్చో విష్ణు అన్న దగ్గర్నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉన్నాను.⇒ నేను తిరుపతిలో చదువుకున్నాను. తను (భార్య మౌనిక) ఆళ్లగడ్డలో చదువుకున్నారు. ఈ సిటీ జీవితమే కాకుండా మాకు పల్లె జీవితం కూడా ఉంది. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆదరణ మాపై ఉన్నాయి. మా పిల్లలకు ఏదైనా ఇవ్వగలను అంటే అది ఇదే.⇒ నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు. కానీ నా ఇబ్బందుల్లో వారిని ఇన్ వాల్వ్ చేయాలనుకోలేదు. నా భార్య మౌనిక సపోర్ట్ సరిపోయింది. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు గమ్మునుండిపోతే, తప్పు చేసిన వ్యక్తులుగా మిగిలిపోతాం. భవిష్యత్‌లో మా పిల్లలు ‘నువ్వు చేయనప్పుడు ఎందుకు గమ్మునున్నావ్’ అంటే, ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా ఉండకూడదనిపించింది. తప్పు చేయనప్పుడు ఎక్కడైనా మాట్లాడగలను.

శిల్పా శిరోద్కర్‌కు కరోనా
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, అందరూ మాస్క్‌లు ధరించి, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శిల్పా శిరోద్కర్. కోవిడ్‌పాజిటివ్ నేపథ్యంలో ప్రస్తుతం శిల్పా ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఇక బాలీవుడ్లో ‘త్రినేత్ర’, ‘హమ్’ (1991), ‘గోపీ కిషన్’ (1994) వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు శిల్పా.అలాగే 1992లో తెలుగులో ‘బ్రహ్మ’ చిత్రంలో కూడా నటించారామె. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి, బ్రేక్ తీసుకున్న శిల్పా ఇటీవల బిగ్‌బాస్ 18 సీజన్లో కంటెస్టెంట్గాపాల్గొన్నారు. ఇదిలా ఉంటే... ఆసియా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో శిల్పా అక్కడికి ట్రావెల్ చేసి, ముంబై వచ్చారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మహేశ్‌బాబు సతీమణి నమత్ర సోదరి శిల్పా శిరోద్కర్ అనే సంగతి తెలిసిందే.
న్యూస్ పాడ్‌కాస్ట్

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం
క్రీడలు

IPL 2025: మా వ్యూహాలు మార్చాల్సిన పనిలేదు: సీఎస్కే హెడ్‌కోచ్
తన దృష్టిలో ఎప్పటికీ అనుభవానికి పెద్ద పీట ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. గతంలో సీనియర్లతోనే తాము వరుసగా టైటిల్స్ గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపవాదు మూటగట్టుకున్న సీఎస్కే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది ఇప్పటికి ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి దారుణంగా విఫలమైంది.సీనియర్లు విఫలంయువ ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే, నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) లాంటివారు రాణించినా... జట్టు నమ్ముకున్న సీనియర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా లీగ్‌లో ఎంతో అనుభవం ఉన్నా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. అయితే తమ టీమ్ వైఫల్యానికి పలు కారణాలు ఉన్నాయని కోచ్ ఫ్లెమింగ్ అన్నాడు. అయితే, ఆటగాళ్ల వయసు ఇందుకు కారణం కాదని పేర్కొన్నాడు.అనుభవం అమూల్యమైంది‘ఆటగాళ్ల వయసు ఎంత ఎక్కువగా ఉందనేది నేను పట్టించుకోను. నా దృష్టిలో అనుభవం అమూల్యమైంది. గత కొన్నేళ్లలో మాకు అదే ఎన్నో విజయాలు అందించింది. ఈ సీజన్లో అది పని చేయకపోవచ్చు. ఫలితం అందరికీ నిరాశ కలిగించిన మాట వాస్తవమే కానీ వైఫల్యానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి’ అని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.ఇన్నేళ్లుగా చెన్నై టీమ్ సీనియర్ల ఆటతో అనుసరిస్తున్న వ్యూహాలను ఇకపై కూడా మార్చాల్సిన అవసరం లేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ‘సీనియర్లపై నమ్మకం ఉంచడంతో పాటు ప్రతిభాన్వేషణ కూడా ఈ సమయంలో ముఖ్యం. జట్టులో యువ ఆటగాళ్లు ఉండాలని అందరూ అంటున్నారు. కానీ వారందరినీ వెతికి తెచ్చుకోవాలి కదా. జట్టులో వారు సరిపోతారో లేదో చూడాలి.అనుభవజ్ఞులతో కలిపి వారిని ఆడించాలి. ఈ సీజన్లో కొందరు కొత్త కుర్రాళ్లు చెలరేగడం నిజమే అయినా అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల ఆటగాళ్ల జాబితా చూస్తే ఐపీఎల్లో అనుభవం ఉన్నవారే కనిపిస్తారు. మాకు ఈ సీజన్ పెద్ద సవాల్‌గా నిలిచింది. ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని ఫ్లెమింగ్ వివరించాడు.చదవండి: IPL 2025: దిగ్వేష్ సింగ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్! వీడియో వైరల్

ధోనికి ఒకటి.. సంజూకు రెండు.. ఒకే మ్యాచ్‌లో భారీ మైలురాయిపై కన్నేసిన సీఎస్కే, రాజస్థాన్ కెప్టెన్లు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 20) నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు ధోని, సంజూ శాంసన్ ఓ భారీ మైలురాయిపై కన్నేశారు.ధోని ఓ సిక్సర్, సంజూ రెండు సిక్సర్లు బాదితే టీ20ల్లో 350 సిక్సర్ల మార్కును తాకుతారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 33 మంది మాత్రమే ఈ మైలురాయిని తాకారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (1056) బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ తర్వాతి స్థానాల్లో పోలార్డ్ (908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు (టాప్-10లో).ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ ఆటగాళ్లు ఆకాశమే హద్దు అన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ఈ సీజన్లో ఆ జట్టు బ్యాటర్లు మొదటి నుంచి విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ లక్ కలిసి రాలేదు. యశస్వి జైస్వాల్, కుర్ర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో సారి తెగబడి ఆడే ఛాన్స్ ఉంది. కొత్తగా జట్టులోకి వచ్చిన ప్రిటోరియస్ కూడా బ్యాట్‌కు పని చెప్పవచ్చుఈ సీజన్లో చాలా మ్యాచ్‌ల్లో రాయల్స్ గెలుపు వాకిట బోల్తా పడింది. ఇలా జరిగినందుకు ఈ సీజన్లో ఆ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నేడు సీఎస్కేతో జరుగబోయే మ్యాచ్ రాయల్స్‌కు ఈ సీజన్లో చివరిది. కాబట్టి సీజన్‌ను గెలుపుతో ముగించి పరువు కాపాడుకోవాలని రాయల్స్ భావిస్తుంది.సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు కూడా నేటి మ్యాచ్‌లో విజృంభించే అవకాశం ఉంది. ఈ జట్టు బ్యాటర్లు ఎదురుదాడి చేస్తే పోయేదేముందన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంది. కుర్ర బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ నుంచి రికార్డు విన్యాసాలు ఆశించవచ్చు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇరు జట్లు ఐపీఎల్లో ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 16, రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. 2020 నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌ల్లో రాయల్స్ ఏడింట విజయాలు సాధించింది. నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్లు ప్రయోగాల బాటపట్టవచ్చు.తుది జట్లు (అంచనా)..సీఎస్కే: ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, MS ధోని (కెప్టెన్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్/మతీషా పతిరానారాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, లువాన్-డ్రే ప్రిటోరియస్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ, నాంద్రే బర్గర్, అశోక్ శర్మ/శుభమ్ దూబే

'అందుకే' మందు మానేశా: స్టార్ క్రికెటర్
లండన్: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. తరచు గాయాల బారిన పడుతూ మళ్లీ మళ్లీ ఆటకు దూరమవుతున్న 33 ఏళ్ల స్టోక్స్ గత ఏడాది డిసెంబర్ తర్వాత అసలు ఏ స్థాయి మ్యాచ్ కూడా ఆడలేదు. తొడ కండరాల గాయంతో తప్పుకున్న అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. వేగంగా ఫిట్నెస్ అందుకునే క్రమంలో భాగంగా ‘రీహాబిలిటేషన్’ సమయంలో మద్యానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘నాకు తొలిసారి గాయమైనప్పుడు నా శరీరం చికిత్సకు సరిగా స్పందించలేదు. ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తే వారం రోజుల క్రితం బాగా మద్యం తాగిన విషయం గుర్తుకొచి్చంది. బహుశా అది కూడా కారణం కావచ్చనిపించింది. దాంతో ఈసారి గాయం తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను మారితే మంచిదని భావించా. అయితే పూర్తిగా అది సాధ్యం కాదు కాబట్టి రీహాబిలిటేషన్ వరకు నియంత్రణలో ఉండేందుకు ప్రయత్నించా. మైదానంలోకి దిగే వరకు దీనిని పాటించాలని ప్రయతి్నస్తున్నా. అందుకే ఈ ఏడాది జనవరి నుంచి మద్యం మానేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిని ముట్టలేదు’ అని స్టోక్స్ చెప్పాడు. గురువారం నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టులో బరిలోకి దిగనున్న స్టోక్స్...ఆ తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్, యాషెస్ సిరీస్ కోసం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.

వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన నేపాల్, థాయ్‌లాండ్
నేపాల్, థాయ్‌లాండ్ జట్లు ఆఖరి నిమిషంలో మహిళల టీ20 వరల్డ్‌కప్-2026 గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పోటీ పడేందుకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో యూఏఈపై విజయాలు సాధించిన నేపాల్, థాయ్‌లాండ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు ఇదివరకే స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి అర్హత సాధించే జట్లేవో తెలియాల్సి ఉంది. ఈ రెండు టోర్నీల నుంచి రెండు జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో ఆరు జట్లు పోటీ పడి, నాలుగు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా, 2026 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఇంగ్లండ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడతాయి. ఆతిధ్య దేశ హోదాలో ఇంగ్లండ్ తొలుత ఈ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు బెర్త్‌లు గ్లోబల్ క్వాలిఫయర్స్ ద్వారా డిసైడ్ అవుతాయి. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.
బిజినెస్

యాపిల్ ఎయిర్‌పాడ్స్ కొత్త వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..
యాపిల్ 2025 సంవత్సరంలో కొత్త ఎయిర్‌పాడ్స్‌ను లాంచ్ చేసే అవకాశం లేదని ప్రముఖ టెక్ విశ్లేషకులు మింగ్-చి కువో తెలిపారు. యాపిల్ ఈ ఏడాదిలో మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రోను విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో కువో ఇలా ప్రకటనలు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసుఎయిర్పాడ్స్ ప్రో లైనప్‌కు తదుపరి అప్డేట్ వర్షన్ 2026 వరకు రాదని కువో అంచనా వేస్తున్నారు. ఎయిర్‌పాడ్స్ లైటర్ వర్షన్ మ్యాక్స్ వర్షన్ 2027లో వస్తుందని చెప్పారు. ఆడియోను మెరుగుపరచడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాలను అందించేందుకు ఉద్దేశించిన బిల్ట్-ఇన్ ఇన్ఫ్రారెడ్(ఐఆర్) కెమెరాలు రాబోయే ఎయిర్‌పాడ్ మోడల్లో ఉంచనున్నట్లు తెలిపారు. ఐఆర్ కెమెరాల అనుసంధానం రోజువారీ వేరబుల్స్‌లో అధునాతన సెన్సింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి యాపిల్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఎయిర్‌పాడ్స్ ప్రో 2 2022లో విడుదలైంది.

మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసు
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2.1 కోట్లకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించకపోతే అసెట్స్‌తో పాటు బ్యాంకు ఖాతాలు కూడా అటాచ్ అవుతాయంటూ హెచ్చరించింది. గీతాంజలి జెమ్స్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల మీద 2022 జనవరిలో విధించిన జరిమానాను చోక్సీ చెల్లించకపోవడంతో ఈ నోటీసు జారీ అయింది. గీతాంజలి జెమ్స్ సీఎండీ అయిన చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14,000 కోట్లు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లో వారు దేశం నుంచి పరారయ్యారు. 2019లో బ్రిటన్‌లో అరెస్టయిన మోదీ ప్రస్తుతం అక్కడి జైల్లో ఉండగా, చోక్సీ బెల్జియంలో అరెస్టయ్యారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోతఇటీవల అరెస్ట్భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్‌లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి.

ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోత
దేశంలోనే దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల (0.20 శాతం) మేర తగ్గించింది. ఈ నిర్ణయం ఈ నెల 16 నుంచే అమల్లోకి వచ్చింది. బ్యాంక్ వెబ్సైట్లో ఉంచిన సమాచారం మేరకు.. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు కాలవ్యవధి డిపాజిట్లపై గరిష్టంగా 6.7 శాతం రేటు ఇకమీదట లభించనుంది.మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై రేటు 6.55 శాతం అమల్లోకి వచ్చింది. 5–10 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 6.30 శాతానికి తగ్గింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్డీలపై 6.5 శాతం రేటు అమలవుతుంది. అమృత్ వర్ష్(444 రోజుల డిపాజిట్)పై రేటు 7.05 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గింది. ఇదీ చదవండి: యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!60 ఏళ్లు నిండిన, 80 ఏళ్లు నిండిన వృద్ధులకు ఎప్పటి మాదిరే వడ్డీ రేటులో అదనపు ప్రయోజనం కొనసాగనుంది. గత నెలలోనూ ఎస్బీఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10–25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం గమనార్హం. ఆర్బీఐ ఇప్పటివరకు రెండు విడతల్లో కలిపి అర శాతం మేర రెపో రేటును తగ్గించడంతో ఈ మేరకు డిపాజిట్ రేట్లను బ్యాంక్‌లు సర్దుబాటు చేస్తుండడం గమనార్హం.

ఫండ్స్ ఆస్తులు రూ.65.74 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 23 శాతం పెరిగి రూ.65.74 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్ ర్యాలీతో పెట్టుబడుల విలువ పెరగడానికి తోడు, నికర పెట్టుబడుల రాక ఏయూఎం వృద్ధికి తోడ్పడింది. 2023–24 చివరికి మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం రూ.53.40 లక్షల కోట్లుగా ఉంది. ‘‘ఆస్తుల పరిమాణం పెరగడానికి మార్క్ టు మార్కెట్ (ఎంటీఎం) పెరుగుదల సానుకూలించింది. నిఫ్టీ 50 టీఆర్ఐ 6 శాతం, సెన్సెక్స్ టీఆర్ఐ 5.9 శాతం చొప్పున పెరగడం ఇందుకు దోహదం చేసింది. డెట్ విభాగంలోనూ ఎంటీఎం పెరగడం అనుకూలించింది’’అని యాంఫి తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల పథకాల్లోకి రూ.8.15 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ఫండ్స్ నిర్వహణ ఆస్తుల వృద్ధికి దారితీసింది. ముఖ్యంగా ఈక్విటీల్లోకి రికార్డు స్థాయిలో రూ.4.17 లక్షల కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లు, పెట్టుబడి ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్నింటా వృద్ధి కనిపించింది. మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు 23.45 కోట్ల గరిష్టానికి చేరాయి. ఇన్వెస్టర్ల సంఖ్య 5.67 కోట్లకు పెరిగింది. 1.38 కోట్ల మంది మహిళా ఇన్వెస్టర్లు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈక్విటీ పథకాలకు సంబంధించి ఫోలియోలు 33 శాతం పెరిగి 16.38 కోట్లుగా ఉన్నాయి. అంటే మొత్తం ఫోలియోల్లో ఈక్విటీ ఫోలియోలే 70 శాతం మేర ఉండడం గమనార్హం. హైబ్రిడ్ ఫండ్స్ ఫోలియోలు 16 శాతం పెరిగి 1.56 కోట్లుగా ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల (ప్యాసివ్ ఫండ్స్) ఫోలియోలు 48 శాతం పెరిగి 4.15 కోట్లుగా ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌వోల జోరు గత ఆర్థిక సంవత్సరంలో న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వోలు) కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. 70 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్ నుంచి రూ.85,244 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. 2023–24లో వచ్చిన ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు 58కాగా, అవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులు రూ.39,297 కోట్లుగానే ఉన్నాయి. డెట్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.1.38 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.సిప్ పెట్టుబడులు రూ.2.89 లక్షల కోట్లు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రికార్డు స్థాయిలో రూ.2.89 లక్షల కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 45 శాతం పెరిగాయి. సిప్ నిర్వహణ ఆస్తులు 24.6 శాతం పెరిగి రూ.13.35 లక్షల కోట్లకు చేరాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మొత్తం నిర్వహణ ఆస్తుల్లో సిప్ ఏయూఎం 20.31 శాతానికి పెరిగింది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 24 శాతం మేర పెరిగి 1.38 కోట్లుగా (ప్రతి నలుగురిలో ఒకరు) ఉంది. మహిళల్లోనూ ఆర్థిక స్వాతంత్య్రం, అవగాహన పెరుగుతోందని యాంఫి నివేదిక తెలిపింది. ఆర్థిక అక్షరాస్యతకు తోడు, ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లోకి నికరంగా రూ.4.17 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే రెట్టింపయ్యాయి. దీంతో ఈక్విటీ పథకాల నిర్వహణ ఆస్తుల విలువ 25 శాతానికి పైగా పెరిగి రూ.29.45 లక్షల కోట్లకు చేరుకుంది.
ఫ్యామిలీ

ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్!
పెళ్లి వేడుకలు అనగానే...ఎంత ఖర్చు చేస్తే అంత గొప్ప అనే భావన చాలామందిలో ఉంది. అయితే కొందరు అందుకు భిన్నంగా ఉంటారు. చెన్నైకి చెందిన లైఫ్‌స్టైల్ అండ్ కమ్యూనిటీ బ్లాగర్ ఉమా రామ్ రెండో కోవకు చెందిన మహిళ. తన వివాహాన్ని ఎకో–ఫ్రెండ్లీ వెడ్డింగ్‌గా జరుపుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. శుభలేఖల నుంచి పెళ్లి వేడుకల ముగింపు వరకు ప్రతి దశలోనూ పర్యావరణ దృష్టితో అడుగులు వేసింది.వివాహ వేడుకలో వ్యర్థాలను తగ్గించడానికి స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ టు భూమి’ సహాయం తీసుకొన్నారు. డైనింగ్ నుంచి డెకార్ వరకు వృథాను వెట్, డ్రై వేస్ట్‌గా వేరు చేశారు. వివాహ వేడుకల్లో ఉపయోగించిన పువ్వులు, పండ్లు, ఇతర కంపోస్టు చేయగల వ్యర్థాలను న్యూట్రీయెంట్–రిచ్ మాన్యూర్గా మార్చారు. పెళ్లి ఆహ్వాన పత్రికలను సీడ్ పేపర్ నుంచి తయారుచేశారు. ‘మనసు ఉంటే మార్గం ఉంటుంది’ అంటారు. ఈ మంచి సూత్రాన్ని వివాహ వేడుకలలో కూడా అనుసరిస్తే... పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు

Miss world 2025 బ్యూటీఫుల్ గేమ్స్
మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ టాలెంట్, బ్యూటి విత్ ఎ పర్పస్, బెస్ట్ స్విమ్ సూట్, నైట్ గౌన్, మిస్ ఫొటోజెనిక్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ హెయిర్.. స్కిన్ వంటి రౌండ్స్ ఉన్నట్టే స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. మిస్ వరల్డ్ 2025 పోటీలో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ రౌండ్లో మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా విజయం అందుకున్నారు. మొదటి రన్నరప్‌గా మిస్ మార్టీనిక్ ఆరేలీ జోచిమ్, రెండో రన్నరప్‌గా మిస్ కెనడా మారిసన్ నిలిచారు. వాళ్ల వివరాలు..మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా1999 నుంచి ఇప్పటివరకు ఎస్టోనియా దేశం.. మిస్ వరల్డ్ పోటీల్లో స్పోర్ట్స్ ఈవెంట్లో గెలిచి, ఈ బ్యూటీ పాజెంట్లోని తర్వాత రౌండ్స్‌కి అర్హత పొందడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా.. యూరప్ టాప్ టెన్ ఫైనలిస్ట్స్, టాప్ 40 ఫైనలిస్ట్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఎస్టోనియాలోని కిర్నాకు చెందిన ఎలిస్.. ఐటీ సిస్టమ్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్. సేల్స్ కన్సల్టెంట్‌గా, స్టోర్ మేనేజర్‌గా, రాడిసన్ మెరిటన్ పార్క్ ఇన్ హోటల్లో హోస్టెస్‌గా, జూనియర్ ఐటీ డెవలప్మెంట్ స్పెషలిస్ట్‌గా.. రకరకాల ఉద్యోగాలు చేసింది. మోడలింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ఆన్లైన్ చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె వాటినే తన బ్యూటీ విత్ ఎ పర్పస్‌గా పేర్కొంది. ‘స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్లో స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానో లేదో అనుకున్నా కానీ సులభంగానే గెలిచాను. నిజానికిదో చాలెంజ్.. గొప్ప అనుభవం! జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించవచ్చో నేర్పే ఈవెంట్ ఇది. లైఫ్‌కి చాలా ఉపయోగపడుతుంది!’ అని ఆ ఈవెంట్ గురించి చెప్పింది ఎలిస్. మిస్ మార్టీనిక్.. ఆరేలీ జోచిమ్..మార్టీనిక్లోని డ్యూకోస్ పట్టణానికి చెందిన ఆరేలీ జోచిమ్.. హైజీన్ సేఫ్టీ ఎన్వైర్మెంట్ స్టడీస్‌లో డి΄్లోమా చేసింది. నిత్యం నవ్వుతూ ఉండే ఆరేలీకి ప్రకృతి అంటేప్రాణం. జీవితాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటా నంటోంది. తన జీవితానుభవాలు, తన భావోద్వేగ ప్రయాణాల స్ఫూర్తితో ‘మెసొన్ లాన్మూర్ (ప్రేమాలయం)’ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. దీని గురించే ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్’లో ముచ్చటించనుంది. ‘బాడీ ఫిట్‌గా ఉండాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. ఏప్రొఫెషన్లో ఉన్నా ఆటల పట్ల ఆసక్తి పెంచుకుని ఏదో ఒక స్పోర్ట్‌ని ప్రాక్టీస్ చేస్తే శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఇది మన రెగ్యులర్ప్రొఫెషన్లో సక్సెస్‌కి చాలా ఉపయోగపడుతుంది’ అంటుంది ఆరేలీ జోచిమ్.మిస్ కెనడా.. ఎమ్మా మారిసన్.. కెనడా, ఓంటారియోలోని ఓ చిన్న పట్టణం (Chapleau) లో పుట్టి, పెరిగిన ఎమ్మా.. మిస్ కెనడా కిరీటాన్ని ధరించిన స్థానిక ఆదిమ తెగకు చెందిన తొలి యువతి. ఇండిజినస్ ప్రిపరేటరీ స్టడీస్ అండ్ టూరిజంలో డిగ్రీ చేసింది. ఈస్థటిక్స్ అండ్ హెయిర్‌కి సంబంధించిన కోర్స్ కూడా చదివింది. అందాల పోటీ అంటే స్కిన్ షో కాదని, సామాజిక బాధ్యతను గుర్తించే వేదికని తెలిశాక.. ఆ పోటీల పట్ల మక్కువ పెంచుకుంది.బ్యూటీ పాజెంట్స్లో పాల్గొంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనే కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనేది తమ తెగ మహిళలకు సంబంధించిన ఒక సంప్రదాయ నేత. దాన్ని వాళ్లు తమ చరిత్ర, సాంస్కృతిక సంబరాలకు ఒక గుర్తుగా భావిస్తారు. దాన్నే ఆమె తన సామాజిక సేవా కార్యక్రమంగా ఎంచుకుంది. ‘ఎందుకంటే కెనడాలో మైదానప్రాంతపు అమ్మాయిల కన్నా పన్నెండింతలు మా తెగకు చెందిన అమ్మాయిలు అదీ పదిహేనేళ్లలోపే శారీరక, లైంగిక దాడులకు బలవుతున్నారు. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలుదీన్ని నిలువరించి మా తెగలోని అమ్మాయిలు సాధికారత సాధించేందుకే నేను ‘రిబ్బన్ స్కర్ట్స్’ పేరుతో సామాజిక కార్యక్రమాలను స్టార్ట్ చేశాను. స్వావలంబన తో మావాళ్లను నాగరిక సమాజానికి కనెక్ట్ చేయాలన్నదే నా లక్ష్యం. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్’ అంటుంది ఎమ్మా. మిస్ వరల్డ్ అందాల పోటీలలో సెకండ్ రన్నరప్ గెలుపు గురించి మాట్లాడుతూ ‘గొప్ప ఎక్స్‌పీరియెన్స్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వాళ్లతో పోటీపడి విజేతగా నిలవడం మరచిపోని అనుభూతి. తర్వాత దశకు ఇదొక స్ఫూర్తి. నా బలాబలాలు తెలుసుకోవడానికి ఈ స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ చాలా ఉపయోగపడింది. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని చెప్పింది. చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!

ఐ డ్రాప్స్, ఇన్హేలర్లు ఎక్కువగా వాడుతున్నారా..! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా కన్ను ఎర్రబారిన, దురదపుడుతున్నా..డాక్టర్ని సంప్రదించకుండానే ఐడ్రాప్స్ తెచ్చుకుని వేసేసుకుంటాం. అలాగే కాస్త ముక్కుదిబ్బడగా ఉన్న వెంటనే నాసల్ ఇన్హేలర్లను వాడేస్తాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణ రిలీఫ్ కోసం తరుచుగా వీటిని వాడేస్తుంటాం. ఇలా అస్సలు చేయొద్దని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే ఆ సమస్య తప్పదని చెబుతున్నారు.ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పదేళ్ల వయసున్న పిల్లలు గ్లాకోమా( Glaucoma)తో బాధపడుతున్న కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇలా ఎందుకు జరగుతుందని వైద్యులు క్షణ్ణంగా పరిశీలించగా..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్దిపాటి అలెర్జీలకైనా వెంటనే స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలను వాడుస్తుండటమే దీనికి కారణమని పరిశోధనలో తేలింది. ఎయిమ్స్‌లో నమోదైన దాదాపు చాలా కేసులు ఇలాంటి కోవకు చెందినవేనని వైద్యులు చెబుతున్నారు. ఇలా వైద్యుడిని సంప్రదించకుండా పదేపదే ఐ డ్రాప్స్ ఉపయోగిస్తే గ్లాకోమా బారినపడి అంధత్వంతో బాధపడతారని చెబుతున్నారు. ఇలా స్టైరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, ఇన్హేలర్లు లేదా స్టెరాయిడ్లను మాత్రలు లేదా ఇంజెక్షన్ రూపంలో ఉపయోగిస్తే..అవి కంటిలోపల ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. ఫలితంగా కంటి లోపలి ఆప్టిక్ నరాలు దెబ్బతినడానికి దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కండ్లకలక కోసం ఈ ఐడ్రాప్స్ వినియోగించి గ్లాకోమా బారిన పడిన కేసులు రాజస్థాన్, హర్యానా వంటి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదయ్యాయని తెలిపారు వైద్యులు. అదీగాక ఈ గ్లాకోమా లక్షణాలను ప్రారంభంలో గుర్తించకుండా చివరిదశలో రావడంతో చాలామంది పిల్లలు అంధత్వం బారినపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే చాలామంది గ్లాకోమా రోగుల్లో ఇన్హేలర్ వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లల్లో అంతగా కనబడని ఈవ్యాధి..స్టెరాయిడ్ ఆధారిత ఐడ్రాప్స్, ఇన్హేలర్లు వాడటం వల్లనే అని పరిశోధనలో తేలింది. సాధారణంగా వయోజన గ్లాకోమా 40 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతుందట. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా ఈ వ్యాధి బారినపడిన చరిత్ర, డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు, కంటి గాయం తదితరాల వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే అథ్లెట్లు చర్మ సంబంధమైన స్టెరాయిడ్ క్రీమ్‌లు, కండరాల నిర్మాణానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లను వాడొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇవి గ్లాకోమాకు దారితీస్తాయని అంటున్నారు. అంతేగాదు ముఖం మీద, కళ్ల చుట్టూ స్టెరాయిడ్లు ఉన్న క్రీములు వినియోగిస్తే..గ్లాకోమాకు దారితీయవచ్చని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, క్రీమ్‌లు వినియోగిచొద్దని నొక్కి చెప్పారు. ఇక కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుదల కూడా కంటిలోపలి ఒత్తిడిని పెంచుతుందని, ఇది కంటిలోపలి రక్తపోటుకు దారితీస్తుందని అన్నారు. ఏదైనా కారణం చేత ఆరు వారాలకు పైగా స్టెరాయిడ్లు తీసుకునే రోగులు తప్పనిసరిగా వైద్యులు చేత గ్లాకోమా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గ్లాకోమా అనేది లక్షణాలు లేకుండా మన కను దృష్టిని అదృశ్యం చేసే వ్యాధి. అందువల్ల క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అత్యంత కీలకం. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారికి లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గ్లాకోమా వ్యాది వచ్చిన చరిత్ర ఉన్న వారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువని వెల్లడించారు. అంతేగాదు చాలామందికి తమకు గ్లాకోమా ఉందని తెలియదట. ప్రాథమిక స్థాయిలోనే దీన్ని గుర్తించేలా.. కంటి స్క్రీనింగ్‌పరీక్షలు అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. దీన్ని ముందుగానే గుర్తిస్తేనే అంధత్వం బారినపడకుండా ఉండగలమని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: 'అంధురాలైన అమ్మమ్మ సాధించిన విజయం'..! పోస్ట్ వైరల్ )

Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు
శరీరానికి ప్రాణం పోసేది శ్వాస. శ్వాస ఆగిపోతే జీవితం ఆగిపోయినట్టే. అందుకే రోజువారీ దినచర్యలో శ్వాసను నియంత్రించడం చాలా అవసరమని యోగ చెబుతోంది. సంస్కృతంలో, "ప్రాణ" అంటే ప్రాణశక్తి లేదా శక్తి, " యమ" అంటే నియంత్రణ. యోగాలో ప్రాణాయామం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఆయువును పొడిగించే ఆసనాన్నే ప్రాణాయామం అని చెప్తారు. మనస్సును నియంత్రించడానికి అనుసరించే అత్యంత ముఖ్యమైన పద్ధతుల్లో ఇది ఒకటి. మనిషి ఎక్కువ కాలం జీవించడానికి ప్రాణాయామం సహాయపడుతుంది. ప్రాణాయామం లేదా శ్వాస నియంత్రణ, అనేక శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలకు ఆక్సిజన్ అందించి అన్నింటినీ సక్రమంగా నడిపించే ప్రక్రియ శ్వాసక్రియ. అన్ని కణాలకు, శరీర వ్యవస్థలకు ఆక్సిజన్ సరఫరా జరగాలంటే శ్వాస మెరుగ్గా ఉండాలని, యోగా ద్వారా శ్వాసను నియంత్రించడం సాధ్యమని యోగా నిపుణులు చెబుతారు. మనసును అదుపులో ఉంచడం, ఏకాగ్రతను సాధించడం అనేవి నాడీవ్యవస్థకు సంబంధించినవి. ఇందులో అత్యంత కీలకమైన దశ శ్వాస. ప్రాణాయామంతో మనస్సు, శరీరం రీఛార్జ్ యోగాలో ప్రాణాయామం ప్రయోజనాలు యోగాకు మించి ఉంటాయి. శ్వాస మీద పని చేస్తున్నప్పుడు, శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తూనే తగినంత ఆక్సిజన్ సరఫరాతో శ్వాసను నియంత్రించడం, సరైన విధంగా సాధన చేయడం ఈ యోగాలో కీలకం. శరీరాన్ని రీఛార్జ్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది ప్రాణాయామం జీర్ణాశయానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది, మెరుగైన జీర్ణక్రియ కోసం రక్త ప్రవాహాన్ని, ప్రేగుల బలాన్ని పెంచుతుంది. యోగా ఆసనాలతో కలిపి చేసే ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవక్రియ వ్యర్థాలను తొలగిస్తుంది. సాధన చేయడానికి... ప్రాణాయామం చేయడానికి, ఒక ప్రశాంతమైన స్థానంలో కూర్చొని, వెన్నును నిటారుగా ఉంచాలి. రెండు కళ్ళను మూసి, శ్వాసను లోపలికి పీల్చుకోవాలి. కొన్ని క్షణాలు ఆ శ్వాసను బిగించి, తర్వాత నెమ్మదిగా బయటకు వదిలేయాలి. ఈ ప్రక్రియను పదే పదే పునరావృతం చేయడం వల్ల శరీరానికి, మనసుకు ప్రశాంతత చేకూరి శక్తిమంతం అవుతాయి. శ్వాస సాధన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రాణాయామంలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఐదు ప్రాణాయామాలు ఉన్నాయి. అనులోమ విలోమ ప్రాణాయామంకపాలభాతి ప్రాణాయామంభ్రమరి ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం దిర్గ ప్రాణాయామం
ఫొటోలు


'వార్ 2' మొదలైంది.. టీజర్లో ఈ షాట్స్ గమనించారా? (ఫోటోలు)


ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)


విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)


ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)


జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)


పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)


ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)


హైదరాబాద్ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)


కాజల్ బర్త్‌డే స్పెషల్.. ఆ సినిమాతోనే స్టార్డమ్ (ఫొటోలు)


23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్ హీరోయిన్స్ (ఫోటోలు)
అంతర్జాతీయం

బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్.. స్పందించిన ట్రంప్, కమలాహారిస్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తాజాగా ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఆయనకు జరిపిన ఆరోగ్య పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధరణ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల బైడెన్‌కు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో, పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబసభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ స్పందించారు. బైడెన్ క్యాన్సర్ అనే విషయం తనను కలచి వేసిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ పోరాట యోధుడని పేర్కొన్న ఆమె.. ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.Doug and I are saddened to learn of President Biden’s prostate cancer diagnosis. We are keeping him, Dr. Biden, and their entire family in our hearts and prayers during this time. Joe is a fighter — and I know he will face this challenge with the same strength, resilience, and… pic.twitter.com/gG5nB0GMPp— Kamala Harris (@KamalaHarris) May 18, 2025మరోవైపు.. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్.. ‘జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడం దురదృష్టకరం. ఈ విషయం తెలిసి నేను, మెలానియా చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. "Melania and I are saddened to hear about @JoeBiden’s recent medical diagnosis. We extend our warmest and best wishes to Jill and the family, and we wish Joe a fast and successful recovery." –President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/6HjermTGK7— The White House (@WhiteHouse) May 18, 2025

ఎవరెస్ట్‌పైకి 19వసారి!
కఠ్మాండు: ప్రఖ్యాత బ్రిటిష్ పర్వతారోహకుడు కెంటన్ కూల్ (51) సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను రికార్డు స్థాయిలో 19వ సారి అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి షెర్పాయేతరుడిగా నిలిచారు. ఈ విషయంలో కూల్ తన రికార్డును తానే అధిగమించడం విశేషం. మౌంటెయిన్ గైడ్ అయిన కూల్ ఇతర అధిరోహకులతో కలిసి ఆదివారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన 2004లో తొలిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అప్పటినుంచి 2014, 2015, 2020ల్లో మినహా ఏటా ఎవరెస్ట్ ఎక్కుతూ వస్తున్నారు. మంచు చరియలు విరిగిపడటం వల్ల 2014లో, భూకంపంతో 2015లో, కరోనా కారణంగా 2020లో ఎవరెస్ట్ యాత్ర జరగలేదు. ఎవరెస్ట్‌ను అత్యధిక పర్యాయాలు అధిరోహించిన రికార్డు మాత్రం నేపాలీ షెర్పాలదే. షెర్పా గైడ్ కమి రిటా అత్యధికంగా 30సార్లు ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన మరోసారి శిఖరాన్ని చేరుకునే ప్రయత్నంలోనే ఉండటం విశేషం!

సముద్రగర్భంలో పెను విస్ఫోటం!
అగ్నిపర్వతం బద్దలైనప్పుడు నిప్పులు చిమ్ముతూ లావా నింగిలోకి ఎగసిపడటం, విపరీతంగా ధూళి సమీప గ్రామాలపై దుమ్ము దుప్పటి కప్పేయడం టీవీల్లో చూసే ఉంటారు. వీటికి పూర్తిభిన్నమైన అగ్నిపర్వతం అతి త్వరలో బద్దలుకానుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఆస్టోరియా నగర తీరానికి 300 మైళ్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. దీని పేరు యాక్సియల్ సీమౌంట్. భూ ఉపరితలం మీద కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలానికి 1.4 కిలోమీటర్ల లోతులో ఉండటమే ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత. ఎందుకంత ప్రత్యేకత? ఈ అగ్నిపర్వతం రెండు భూ పలకలు ఢీకొనే చోట ఏర్పడింది. పసిఫిక్ భూ పలక, జువాన్ డీ ఫ్యూకా భూ పలకలు తరచూ అత్యంత స్వల్పంగా కదులుతుంటాయి. ఈ క్రమంలో ఇవి పరస్పరం తగులుతూ భూమి ఉపరితల పొరల కదలికలకు కారణం అవుతున్నాయి. వీటి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం త్వరలో బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలోని హ్యాట్‌ఫీల్డ్ మెరైన్ సైన్స్ సెంటర్లో పరిశోధకుడైన బిల్ చాడ్విక్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘భూకేంద్రంలో ద్రవరూపంలోని శిలలు అగ్నిపర్వతం ద్వారా బయటకు వస్తాయి. ఈ శిలాద్రవం (మాగ్మా) వెంటనే సముద్ర జలాలకు తగిలి చల్లబడుతుంది. ఈ క్రమంలో అక్కడి సముద్ర జలాలు వేడెక్కుతాయి’’ అని చాడ్విక్ చెప్పారు.వేల కొద్దీ భూకంపాలు! ‘‘అగ్నిపర్వతం ఎత్తు కేవలం 3,300 అడుగులు. కానీ అత్యంత క్రియాశీలంగా తయారైంది. ఇటీవలికాలంలో శిలాద్రవం బయటికొచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. భూమి కంపిస్తోంది. అగ్నిపర్వతం తాజా స్థితిని తెల్సుకునేందుకు మేం సమీప ప్రాంతం దాకా కేబుల్ వ్యవస్థ ద్వారా భూకంప తీవ్రతలను కనిపెట్టే ఏర్పాట్లుచేశాం’’ అని ఆయన చెప్పారు. ‘‘ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భూమి వందల సార్లు కంపిస్తుంది. ఇక అగ్నిపర్వతం బద్దలైన సందర్భాల్లో వేల సార్లు కంపిస్తుంది. 2015 ఏప్రిల్‌లో చివరిసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు విపరీతంగా శిలాద్రవం బయటకు ఎగజిమ్మింది. అప్పుడు 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 10,000 చిన్నపాటి భూకంపాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భూమి కంపించే వీలుంది’’ అని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీ’లో మెరైన్ జియోఫిజిసిస్ట్, ప్రొఫెసర్ విలియం విల్కుక్ స్పష్టంచేశారు. జీవవైవిధ్యానికి బాసట అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భారీ స్థాయిలో శిలాద్రవం మహాసముద్రజలాల్లో కలిసిపోతుంది. ఈ శిలాద్రవంలో ఎన్నో రకాల మూలకాలు ద్రవరూపంలో ఉంటాయి. ఇవన్నీ సముద్రజలాల్లో సమ్మిళితమై అక్కడి సూక్ష్మజీవులకు ఆహారంగా మారతాయి. ఈ సూక్ష్మజీవులపై ఆధారపడిన చిన్న జలచరాలు, వాటిని ఆహారం తీసుకునే చేపలు.. ఇలా ఆహార చక్రం సదా సవ్యంగా కొనసాగేందుకు అగ్నిపర్వతం పరోక్షంగా సాయపడుతోంది. అత్యంత వేడితో సెగలు కక్కే మాగ్నా సముద్ర ఉపరితలానికి ఎగసిపడగానే అక్కడ జీవులు కొన్ని చనిపోయినా తర్వాత మాత్రం అక్కడ జీవరాశి పెరుగుదలకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో జీవం మనుగడకు అగ్నిపర్వతాలు సైతం తమ వంతు సాయం చేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మెరైన్ జియోలజీ, జియోఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ డెబీ కెల్లీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

పాక్‌కు ఐఎంఎఫ్ మరో 11 షరతులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ నిధులు విడుదల చేసే విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 11 కొత్త షరతులు విధించింది. అలాగే భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవడం తగదని హితవు పలికింది. ఉద్రిక్తతలు పెంచుకొంటే మీకే ఎక్కువ సమస్యలు వస్తాయని తేల్చిచెప్పింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, సంస్కరణ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని తేల్చిచెప్పింది. బిలియన్ డాలర్ల(రూ.8,540 కోట్లు) రుణానికి సంబంధించిన నిధులు పొందాలంటే షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. తాజాగా విధించిన 11 షరతులతో కలిపి పాకిస్తాన్‌పై విధించిన ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరుకోవడం గమనార్హం. రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని, విద్యుత్ బిల్లులపై రుణ సరీ్వసింగ్ సర్‌చార్జి పెంచాలని, మూడేళ్లు దాటిన పాత కార్ల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలని ఐఎంఎఫ్ పేర్కొంది. మొత్తం బడ్జెట్లో రూ.1.07 ట్రిలియన్ల సొమ్మును అభివృద్ధి కోసం కేటాయించాలని నిర్దేశించింది. పాక్‌లోని నాలుగు ప్రావిన్సుల్లో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలని అమలు చేయాలని తేల్చిచెప్పింది.
జాతీయం

మొసలి కన్నీళ్లు వద్దు
న్యూఢిల్లీ: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యల కేసులో మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా క్షమాపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘‘న్యాయ విచారణ నుంచి బయటపడేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నట్లు నటిస్తారు. మొసలి కన్నీరు కారుస్తారు. మీ క్షమాపణ అలాగే ఉంది. హైకోర్టులో మీరు క్షమాపణలు చెప్పిన వీడియో చూశాం. ఏదో కోర్టు అడిగింది కదా అని చెబుతున్నట్లుగా ఉంది. సూటిగా తప్పు ఒప్పుకుంటూ నేరుగా క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. కానీ మీరేం చేశారు? అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వాటివల్ల ఎవరైనా బాధ పడి ఉంటే అంటూ నానా వంకలూ తిప్పారు. ఇదెక్కడి క్షమాపణ? తప్పు ఒప్పుకునే పద్ధతేనా ఇది? ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు’’ అంటూ తూర్పార బట్టింది. ‘‘నిజాయితీగా, మన స్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఎందుకు? మీ వ్యాఖ్యలతో యావత్ దేశం సిగ్గుపడుతోంది’’ అంటూ తీవ్రంగా మందలించింది. ఈ విషయంలో మంత్రిని అత్యున్నత న్యాయస్థానం గత వారమే తీవ్రంగా మందలించడం, కల్నల్ ఖురేషీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో మంత్రి క్షమాపణలు చెప్పారు. తనపై కేసు కొట్టేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మంత్రి క్షమాపణలు చెప్పిన తీరుపై జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘అలాంటి మొసలి కన్నీళ్లు వద్దు. కనుక మీ క్షమాపణలు అవసరం లేదు. మీలాంటి వాళ్ల విషయంలో ఎలా వ్యవహరించాలో మాకు బాగా తెలుసు’’ అని స్పష్టం చేశారు. ‘‘మీరో సీనియర్ రాజకీయ నాయకుడు. చాలా ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. తద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ మీరేం చేశారు? కల్నల్ ఖురేషీపై వ్యాఖ్యల వీడియో పూర్తిగా చూశాం. మీరు దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మరింత అభ్యంతరకర పదజాలం కూడా వాడబోయారు. సమయానికి పదాలు దొరక్క ఆగిపోయారంతే! మన సైన్యం ఘనతను చూసి దేశమంతా గర్విస్తుంటే మీరేమో ఇలాంటి మతిలేని మాటలకు దిగారు. ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు!’’ అంటూ మండిపడ్డారు.సిట్‌లో మహిళా ఐపీఎస్మంత్రి వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపైన ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. దర్యాప్తు ప్రగతిపై పోలీసులను ప్రశ్నించి వారి సమాధానంపై పెదవి విరిచింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లతో సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. ‘‘మంగళవారం ఉదయం పదింటికల్లా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటవ్వాలి. ముగ్గురు ఐపీఎస్‌లూ రాష్ట్రానికి చెందని వారై ఉండాలి. ఒక మహిళా ఐపీఎస్ ఉండాలి. మే 28లోగా సిట్ తొలి నివేదిక సమర్పించాలి’’ అని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరిగా వర్ణిస్తూ విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది.దేశం ధర్మసత్రం కాదు శరణార్థులకు ఆశ్రయం కుదరదుశ్రీలంకవాసి కేసులో ‘సుప్రీం’ వ్యాఖ్యలుశరణార్థులు దేశం వీడాలని ఆదేశంన్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ధర్మసత్రమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లో ఆశ్రయం ఓ శ్రీలంక శరణార్థి పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భారత్ ఇప్పటికే 140 కోట్లకు పైగా జనాభాతో సతమతమవుతోంది. శరణార్థులకు ఆశ్రయమివ్వడానికి దేశం ధర్మసత్రం కాదు’’ అని పేర్కొంది. శరణార్థులు తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. వారికి భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2015లో అరెస్టయిన శ్రీలంకవాసి పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రాథమిక హక్కుల్లో భాగంగా పిటిషనర్‌కు స్వేచ్ఛగా జీవించే హక్కుందని ఆయన తరఫున లాయర్ వాదనను జస్టిస్ దీపాంకర్ దత్తా తోసిపుచ్చారు. ఆ హక్కు భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎల్టీటీఈ కార్యకర్త అనే అనుమానంతో పిటిషనర్ 2015లో అరెస్టయ్యాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిషేధ) చట్టం కింద దోషిగా తేలడంతో 2018లో పదేళ్ల జైలు శిక్ష పడింది. 2022లో మద్రాస్ హైకోర్టు దాన్ని ఏడేళ్లకు తగ్గించింది. శిక్ష ముగియగానే భారత్ వీడాలని, అప్పటిదాకా శరణార్థి శిబిరంలో ఉండాలని ఆదేశించింది. వాటిని సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ‘‘2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్టీటీఈ సభ్యుడిగా పోరాడినందున అక్కడ నన్ను బ్లాక్ గెజిటెడ్‌గా ఉంచారు. కనుక శ్రీలంకలో నాకు ప్రాణహాని ఉంది. నా భార్య పలు వ్యాధులతో, కుమారుడు పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుతో బాధపడుతున్నారు. వారు భారత్‌లోనే స్థిరపడ్డారు. నేను కూడా వారితో పాటు ఇక్కడే ఉండిపోతా’’ అని అభ్యర్థించాడు. శ్రీలంకలో ప్రాణహాని ఉందని వాదించాడు. దానితో జస్టిస్ దత్తా పూర్తిగా విభేదించారు. ‘‘అయితే మాత్రం ఇక్కడ స్థిరపడేందుకు మీకేం హక్కుంది? మరే దేశమైనా వెళ్లండి’’ అని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. రోహింగ్యా శరణార్థుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ‘‘ఐరాస శరణార్థుల కార్డుల వంటివి ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్రమంగా దేశంలోకి చొరబడి ఉంటే తిప్పి పంపించేయాల్సిందే’’ అని ఆదేశించింది.

‘మిమ్మల్ని క్షమాపణలు ఎవరు అడిగారు?’
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో కీలక భూమిక పోషించిన కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు(సోమవారం, మే 19) విచారణలో భాగంగా విజయ్ షా చెప్పిన క్షమాపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.‘క్షమాపణలు ఏమిటి..?, అవి ఏ రకమైన క్షమాపణలు. క్షమాపణలు చెబుతున్నామంటే దానికి ఎంతో కొంత అర్థం ఉండాలి. ఇది విచారణ నుంచి బయటపడటానికి కార్చే మొసలి కన్నీరా?, మీకు ఎలాంటి క్షమాపణ ఉంది?, మిమ్మల్ని కోర్టు క్షమాపణలు చెప్పమని అడిగిందా?, మరి ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు?, మీరు ఆ మహిళా అధికారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు నిజాయితీగా క్షమాపణలు కోరిన సందర్భం ఏమైనా ఉందా?, మరి ఇక్కడ ఎందుకు మాకు క్షమాపణలు చెబుతున్నారు?’అంటూ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. అదే సమయంలో విజయ్ షాపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన స్సెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ సిట్ ను రేపటి(మంగళవారం) ఉదయానికల్లా ఏర్పాటు చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. ఒక మహిళా అధికారిని నియమించి మే 28 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.అసలేమిటీ వివాదం? మంత్రి విజయ్ షా గత మంగళవారం(మే 13వ తేదీ)ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు.అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

‘బ్రదర్.. ఇది ఉగ్రవాదంపై పోరు.. లోకల్ పాలిటిక్స్ పక్కనపెట్టు’
పుణె: ఉగ్రవాద మూకలను తన దేశంలోనే పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగట్టే క్రమంలో భారత ప్రజాప్రతినిధులను విదేశాలకు పంపే ప్రక్రియను ‘ ఇండియా కూటమి’ బాయ్ కాట్ చేయాలంటూ శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యాలపై శరద్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ సంజయ్ రౌత్‌కు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందంటూనే బ్రెయిన్ వాష్ చేశారు శరద్ పవార్. అంతర్జాతీయ అంశాలకు స్థానిక రాజకీయాలను జత చేయొద్దంటూ క్లాస్ పీకారు. ఇది జాతీయంగా పరిష్కరించుకునే అంశం కాదని, అంతర్జాతీయ సమస్యను ఎలా చూడాలో అలానే చూడాలంటూ హితవు పలికారు శరద్ పవార్. ఇక్కడ తాను గతంలో ఒక ప్రతినిధి బృందంలో సభ్యుడిగా ఉన్న సంగతిని శరద్ పవార్ గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతినిధి బృందంలో సభ్యునిగా ఉన్న సంగతిని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.బరామతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘ ఎప్పుడైనా అంతర్జాతీయ అంశాలపై దృష్టి సారించాల్సిన సమయంలో అంతా ఏకతాటిపై ఉండాలి. అంతేకానీ ఇక్కడ లోకల్ పాలిటిక్స్ చేయకూడదు. అంతర్జాతీయ వేదికపై భారత్ వాణి వినిపించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసింది. పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ప్రపంచ దేశాలకు తెలిపే బాధ్యతను ఆయా ప్రజాప్రతినిధులపై ఉంచింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో దేశాన్ని అప్పగిస్తూ వస్తోంది. భారత్ నినాదం ఒక్కటే.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమనేది మనం చెప్పాల్సింది. పాకిస్తాన్ తీరును అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడమే మన ముందున్న లక్ష్యం. అటువంటి తరుణంలో దీనిని బాయ్ కాట్ చేద్దామంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికావు’ అంటూ శరద్ పవార్ క్లియర్ మెస్సేజ్ పంపారు.

షాషీ జామా మసీదులో సర్వే కొనసాగుతుంది: అలహాబాద్ హైకోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న షాషీ జామా మసీదు సర్వేలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలన్న 2024 నవంబర్‌లో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలని కోరుతూ ముస్లీం సంస్థ ప్రతినిధులు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (మే19) అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులు నిలిపివేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసింది. సర్వే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఎన్ఆర్ఐ

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.
క్రైమ్

నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు.. మా కళ్లెదుటే అమ్మ చనిపోయింది’ అంటూ ఆ చిన్నారి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని తన తల్లిని చంపిన వైనాన్ని పోలీసులకు వివరించిన తీరు స్థానికులను కలచివేసింది. కన్న బిడ్డల ఎదుటే అతి కిరాతకంగా భార్యను కడతేర్చిన ఘటనపై పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య వీణమ్మ(28)ను భర్త రాపూరు శ్రీనివాసులు హత్య చేసిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి తుపాకులు పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలికి అఖిల(7), బత్తెయ్య(4), ఆదెయ్య(3) చిన్నారులున్నారు. శనివారం రాత్రి భర్త శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి భార్య వీణమ్మతో గొడవపడ్డాడు. ఆపై బండరాయితో తలపై మోది చంపేశాడు. తర్వాత పాము కాటు వేయడంతో వీణమ్మ మృతి చెందిందని నమ్మబలికాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పెంచలమ్మ ఆదివారం ఉదయం బిక్కుబిక్కుమంటూ ఏడ్చుతున్న వీణమ్మ పిల్లల్ని అక్కున చేర్చుకుంది.పోలీసుల ఔదార్యం విచారణ అనంతరం వీణమ్మ మృతదేహానికి సోమవారం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుటంబ సభ్యులు నిరుపేద గిరిజనులు కావండతో వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. వీణమ్మ మృతదేహాన్ని సైతం తీసుకెళ్లందుకు వారి వద్ద నగదు లేక పోవడంతో పోలీసులే నాయుడుపేటలో వీణమ్మకు అంత్యక్రియలు జరిపించారు. పరారీలో ఉన్న ఆమె భర్త శ్రీనివాసులును త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
శ్రీకాకుళం రూరల్: నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా ముక్కులో దూది పెట్టుకున్నాడు. చేతులను కుర్చీ వెనక్కి కట్టుకున్నాడు. ఇలా ప్రాణం పోకపోతే.. ఎలాగైనా చనిపోవాలని నాలుగు రకాల కత్తులను రెడీగా ఉంచుకున్నాడు. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో దాసరి ఉమామహేశ్వరరావు (26) అనే యువకుడు సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం రూరల్ మండ లం రాగోలు గ్రామం షిర్డీ సాయినగర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దాసరి ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిరంజీవి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. తమ్ముడు బెంగళూరులో ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఉమామహేశ్వరరావుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒక్కడే ఇంటిలో ఉంటున్నాడు. ఏమైందో గానీ సోమవారం రా త్రి తలుపునకు గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భోజనం కోసం బంధువులు ఎంత తలుపు తట్టినా తీయకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి.. కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధ తెలియకూడదనేనా.. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించా రు. మృతుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నా రు. నొప్పి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. ముందుగా వీల్‌చైర్‌లో కూర్చుని నోటికి పది రౌండ్ల టేపును చుట్టుకున్నాడని, ముక్కులో దూది పెట్టుకుని, రెండు చేతులను కుర్చీ వెనక్కి కట్టుకునేలా ఏ ర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు వివరించారు. ఈప్లాన్ సక్సెస్ కాకపోతే మరోలాగైనా చనిపోవడానికి నాలుగు రకాల కత్తులు ఉంచుకున్నాడని పేర్కొన్నారు. మృతుడి చిన్నాన్న దాసరి ప్రభాకర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్‌ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్‌అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్కేసర్ మండలం, నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్‌పవర్ సప్లయ్ చేసేవాడు. సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు అదుపుతప్పి క్రాష్ బారియర్‌ను ఢీకొంది. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లడంతో కితాబ్‌అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్‌బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఔటర్‌రింగ్ రోడ్డు సిబ్బంది సహాయంతో కారు పైభాగం కట్ చేయించి గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్లో ఉంటూ భవన నిర్మాణ కారి్మకులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచి్చన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్‌కు నచ్చజెప్పేందుకు యతి్నంచాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్‌ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్‌ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
వీడియోలు


కేసీఆర్ తో పాటు హరీష్‌రావు, ఈటలకు నోటీసులు


ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే దిగిపోవాలి: తిరుపతి మహిళలు


Sudarshan Reddy: హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని పచ్చ ఖాకీలు


దేవినేని అవినాష్ అరెస్ట్


YSRCP నేతలను రౌండప్ చేసిన టీడీపీ గూండాలు


తిరువూరు మున్సిపల్ ఎన్నికపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది


ప్రకాశం పంతులుకి వైఎస్ జగన్ నివాళి


పెళ్లి నుంచి తిరిగొస్తూ.. తిరిగిరాని లోకానికి


బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం


ఉమ్మడి విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు