వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు | Doctors Negligence In Guntur Government Hospital, More Details Inside | Sakshi
Sakshi News home page

వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు

May 20 2025 1:34 PM | Updated on May 20 2025 3:06 PM

Doctors Negligence in Guntur Government Hospital

గుంటూరు: ఈ ఏడాది ఫిబ్రవరిలో నా భర్త సాయిబాబు బల్బు బిగిస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు చేయి మణికట్టు వద్ద విరిగింది. స్థానిక కొత్తపేటలోని హాస్పిటల్‌కు తీసుకెళితే సర్జరీ చేశారు. చేసిన మరుసటి రోజే ఆయనకు కుడివైపు పక్షవాతం వచ్చింది. కనీసం ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయకపోగా హడావుడిగా మమ్మల్ని బయటకు పంపేశారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబాన్ని నడిపించే నా భర్త అచేతనంగా పడి ఉండడానికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. మెడికల్‌ వెరిఫికేషన్‌ పెట్టించాలని మనవి.
–జక్కంపూడి శ్రీవల్లి, గుంటూరు

నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement