breaking news
Rashmika Mandanna
-
రష్మిక కోసం విజయ్ చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా..?
-
8 ఏళ్లు ఎంత బాధపెట్టినా మౌనంగా భరించా.. ఇకనావల్ల కాదు!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఫిబ్రవరి 26ప ఉదయ్‌పూర్‌లో తెలుగు హీరో విజయ్‌దేవరకొండను పెళ్లాడింది. ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.అన్నీభరించా..ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, నన్ను టార్గెట్ చేస్తూ వేధిస్తూనే ఉంది. వాళ్ల వ్యూస్, రీచ్ కోసం నేను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాసింది. అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి నాపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతదూరం వెళ్తారు?ఇప్పుడు నా జీవితంలో మార్పు చేసుకున్న పరిణామాల కారణంగా కావాలనే వాటిని వైరల్ చేస్తున్నారు. ఇంకా ఎంతదూరం వెళ్తారు? మీరిలా చేయడం వల్ల నా కుటుంబసభ్యులే కాకుండా నాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేకాదు, నా ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది. మేమిద్దరం (రక్షిత్, నేను) ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. 24 గంటల్లో డిలీట్‌అయినా సరే కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఎనిమిదేళ్లుగా మీరేం చేసినా మౌనంగా ఉన్నాను. కానీ, ఈరోజు మిగతావారిని కూడా ఇందులోకి లాగుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఇక నేను సహనంగా ఉండలేను. మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాల్ని తొలగించండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.వివాదం ఏంటి?2016లో కిరిక్ పార్టీ మూవీ షూటింగ్లో రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ మరుసటి ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, ఆ ప్రేమ పట్టాలెక్కకముందే 2018లో ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడినట్లుగా ఓ ఆడియో వైరలవుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి సంభాషణను ఇప్పుడు రష్మిక పెళ్లి జరిగిన సమయంలో బయటపెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 🙏🏻 pic.twitter.com/DdJwFIjeP3— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026 -
పెళ్లి తర్వాత తొలిసారి విజయ్, రష్మిక డ్యాన్స్.. వీడియో వైరల్
మొన్నటి వరకు పెళ్లి పనులు, రిసెప్షెన్లతో బిజీగా గడిపిన టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక..ఇప్పుడు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. షూటింగ్స్‌కి గ్యాప్ ఇచ్చి.. ఖాలీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాజాగా ఈ జంట..ఆనంద్ దేవరకొండ పాటకు డ్యాన్స్ చేసింది. పెళ్లి తర్వాత తొలిసారి విజయ్, రష్మిక కలిసి డ్యాన్స్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.సరదాగా ‘సంచారమే..’ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ . ఈ మూవీ నుంచి ఇటీవల సంచారమే అనే పాట రిలీజ్ అయింది. ప్రముఖ గేయరచయిత గొరటి వెంకన్న లిరిక్స్ అందించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడీ ట్రెండీ సాంగ్ ను విజయ్ దేవరకొండ, రష్మిక, ఆనంద్ దేవరకొండ కలిసి రీక్రియేట్ చేశారు. ముగ్గురు కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ‘ఇది కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేస్తే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది’ అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) -
విజయ్-రష్మిక మెహందీ సెలబ్రేషన్ ఫొటోలు
-
అలిగిన చిన్నారికి ఆహ్వానం భోజనానికి ఇంటికి పిలిచిన విజయ్
-
ఇంతలా భావోద్వేగానికి ఎప్పుడు గురికాలేదు: రష్మిక
ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లాడిన హీరోయిన్ రష్మిక తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు స్పందించింది. విజయ్- రష్మిక ప్రేమ, పెళ్లి, వాళ్లద్దరి ప్రయాణం గురించి ఓ కథనం రాసుకొచ్చారు. ఇది చూసిన రష్మిక ఆ ఆర్టికల్‌కు రిప్లై ఇచ్చారు. చాలా రోజులుగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంతగా భావోద్వేగానికి గురి కాలేదని తెలిపింది.రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' చాలా కాలంగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. నేను చెప్పాలనుకున్నది చాలా ఉంది.. కానీ మాటలు రావడం లేదు. ఇప్పుడు నేను ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఆనందంగా ఉన్నా. నా ప్రయాణం గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేను చెప్పగలిగేది ఒక్కటే. మిమ్మల్ని స్వేచ్ఛగా ఉంచే ప్రేమను వెతకండి' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఫిబ్రవరి 26న విజయ్- రష్మిక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. I have never become so emotional reading something written about me this much in a long long time.. There is so much I want to say but so little I can say. I am finding my own room and that’s a journey I am so grateful for.. Thankyou for recognising it..❤️About love all I… https://t.co/f7W5vv0UJ5— Rashmika Mandanna (@iamRashmika) March 8, 2026 -
రష్మికకు గద్దర్ అవార్డ్.. ఆమె భర్త ఏమని పొగిడారంటే?
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఈ జంట ఒక్కటయ్యారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు.అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్స్ అవార్డ్స్‌లో తన భార్య రష్మికకు ఉత్తమ నటిగా ఎంపికైంది. ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఆమె భర్త విజయ్ దేవరకొండ స్పందించారు. తనకు అవార్డ్ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన రష్మిక భర్త పోస్ట్‌కు రిప్లై ఇచ్చింది. విజ్జు.. నీకు గర్వంగా ఉందని చెప్పడాన్ని ప్రేమిస్తా అంటూ పోస్ట్ చేసింది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి ఒకరినొకరు అభినందించుకోవడం విశేషం. -
పెళ్లి వద్దన్నాడు, ఆరోజు బోరున ఏడ్చాడు: విజయ్ మేనమామ
చాలామంది పెళ్లంటేనే జంకుతారు. మ్యారేజ్ అనేది మాకు సెట్టవదు, దాని జోలికి వెళ్లమని బీరాలు పలుకుతారు. కానీ అందరికంటే ముందు వారే పెళ్లిపీటలెక్కుతారు. హీరో విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. వివాహం అంటే నాలుగడుగులు వెనక్కు వేసే విజయ్ ఫిబ్రవరి 26న రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే గతంలో మాత్రం తనకు పెళ్లి సెట్ అవదని అంటుంటేవాడని విజయ్ మేనమామ, నటుడు, నిర్మాత యశ్ రంగినేని చెప్తున్నాడు.పెళ్లి వద్దని..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన విజయ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. యశ్ రంగినేని మాట్లాడుతూ.. విజయ్ పెళ్లి గురించి పాజిటివ్‌గా ఉండేవాడు కాదు. కెరీర్ చూసుకోకుండా పెళ్లి అవసరమా? అనేవాడు. కానీ, రష్మిక పరిచయమయ్యాక అతడి ఆలోచన విధానమే మారిపోయింది. డియర్ కామ్రేడ్ నుంచి విరోష్ (విజయ్- రష్మిక) మధ్య ప్రేమ మొదలైంది. ఇంట్లో చెప్పగానే..ఇప్పుడు వాళ్లిద్దరినీ జంటగా చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. విరోష్ పెళ్లి పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. విజయ్.. రష్మికతో ప్రేమలో ఉన్నానని చెప్పినప్పుడు ఇంట్లో కొంత కంగారుపడ్డారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక గొడవ(విడాకులు) జరుగుతూనే ఉంది. ఆ భయమైతే మా అందరిలో ఉంది. విజయ్ అమ్మానాన్న ఈ విషయం గురించి మాట్లాడారు. కానీ రష్మిక చాలా మంచి అమ్మాయి. తలరాత చెప్పలేంఈ జంటను చూస్తే తర్వాతెలా ఉంటారో? ఏంటో? అన్న అనుమానమే రాదు. వాళ్లిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. జంటగా సంతోషంగా ఉన్నారు. కానీ, తలరాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అయితే ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక. విజయ్ను రౌడీ బాయ్‌లా చూస్తారు. కానీ తను చాలా ఎమోషనల్. టాక్సీవాలా రిలీజ్‌కు రెండురోజుల ముందే సినిమా మొత్తం లీకైంది. దుఃఖం ఆపుకోలేక..ఆ విషయం తెలిసి విజయ్ బోరున ఏడ్చాడు. ఇక రిలీజ్ చేయడం వృథా అనుకుంటున్న సమయంలో విజయ్ పోరాడి సినిమాను విడుదల చేయించాడు. తీరా అది పెద్ద హిట్టయింది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అని ఈ జనరేషన్‌కు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు అని యశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ -
పెళ్లి తర్వాత నో బ్రేక్.. మళ్లీ షూటింగ్ లో బిజీ అయిన విరోష్!
-
'విజయ్ దేవరకొండ మామ.. రష్మిక అక్కా.. చిన్నారి క్యూట్ వీడియో'
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గతనెల ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంచిన ఈ జంట ప్రత్యేకంగా అన్నదానాలు నిర్వహించారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే ఓ చిన్నారి విజయ్ దేవరకొండకు అభిమానినని.. తనను ఎందుకు పెళ్లికి పిలవలేదని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన హీరో విజయ్.. బుజ్జి తల్లికి రిప్లై ఇచ్చాడు. మా ఇంటికి లంచ్‌కి వచ్చేయ్.. నీకిష్టమైన స్వీట్స్, ఫుడ్ ఇంట్లోనే చేయించి వడ్డిస్తానని చిన్నారికి బదులిచ్చాడు. ఇది చూసిన చిన్నారి నన్ను మీ ఇంటికి పిలిచినందుకు థ్యాంక్స్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది. హాయ్ విజయ్ దేవరకొండ మామ.. రష్మిక అక్కా.. మీరు నాకు రిప్లై ఇచ్చి.. నన్ను ఇంటికి రమ్మని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.. బై బై అంటూ క్యూట్‌గా మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నన్ను ఇంటికి పిలిచినందుకు @TheDeverakonda మామకు & @iamRashmika కు థాంక్స్ #ViRoshWeddinghttps://t.co/Bgm2voxks6 pic.twitter.com/Ipv5Qg4hz1— greatandhra (@greatandhranews) March 8, 2026 -
బుజ్జి అభిమానిని సర్ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల పెళ్లి కొద్దిరోజుల క్రితం జరిగింది. వారి పెళ్లిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్వీట్స్ పంచడంతో పాటు పలు దేవాలయాల్లో అన్నదానం చేసి నెటిజన్ల చేత ప్రశంసలు అందుకున్నారు. ప్యాన్స్ కోసం ఒక స్టార్ హోటల్లో విందు ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, ఒక చిన్నారి విరోష్ జోడీపై అలిగి వీడియో చేసింది. తాను కూడా విజయ్‌కు పెద్ద అభిమానినే కదా పెళ్లికి పిలవచ్చు కదా.. ఎందుకు పిలువలేదు. లడ్డూలు ఇవ్వచ్చు కదా అంటూ ఎంతో క్యూట్‌గా వీడియోతో రిక్వెస్ట్ చేసింది. విజయ్ నుంచి పిలుపువిజయ్ దేవరకొండపై అభిమానంతో ఆ చిన్నారి చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఏకంగా పది మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా రౌడీబాయ్ విజయ్ రియాక్ట్ అయ్యారు. తన వీడియో కింద కామెంట్ చేసి సర్ప్రైజ్ చేశారు. 'బుజ్జి తల్లి మా ఇంటికి రండి. మీకు నచ్చిన ఫుడ్, స్వీట్స్ ఎంటో నాకు చెప్పు. నీ కోసం ప్రత్యేకంగా ఇంట్లోనే చేపిస్తాను. ఇద్దరం కలిసి ఇక్కడే లంచ్ చేద్దాం.' అంటూ విజయ్ రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli) -
ప్రజలు మెచ్చిన చిత్రాలకే పట్టం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ లో ప్రజలు మెచ్చిన సినిమాలకు పట్టం కట్టారు. అలాగే తొలి, ద్వితీయ, తృతీయ అవార్డులు దక్కించుకున్న చిత్రాలు స్వచ్ఛమైన పల్లె కథలతో రూపొందినవి కావడం విశేషం. ప్రధాన విభాగాల్లో అవార్డులు పొందినవాటిలో ఎక్కువగా చిన్న చిత్రాలు ఉండటం విశేషం. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్‌లకు ఈ అవార్డులు ప్రకటించారు. శనివారం ప్రకటించిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’లో ఉత్తమ చిత్రాలుగా నిలిచిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (తొలి స్థానం), ‘దండోరా’ (ద్వితీయ చిత్రం), ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (తృతీయ చిత్రం) వంటివన్నీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినవే. వీటితో పాటు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సినిమాలకు, అద్భుతమైన ప్రతిభ కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులను ప్రకటించారు. ఈ నెల 19న ఈ పురస్కారాల ప్రదానం హైదరాబాద్‌లో జరగనుంది. అవార్డు విజేతల్లో పలువురు ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఈ విధంగా...అవార్డు వస్తుందని అంచనా వేశాను‘కార్తికేయ 2’ సినిమాకి అవార్డులు వస్తాయని ఊహించలేదు. కానీ, తెలంగాణ రాష్ట్ర గద్దర్ అవార్డు నుంచి నేషనల్ అవార్డు వరకు కవర్ చేసింది. ‘తండేల్’ విషయంలో నాగచైతన్యకి అవార్డు వస్తుందని అంచనా వేశాను. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన పడినది అతి కష్టం... అంటే ఫిజికల్లీ అన్నమాట. మేము షూటింగ్ చేసినప్పుడు ఉన్న క్లైమాటిక్ కండిషన్స్‌కి సముద్రం మధ్యలోకి వెళ్లడం అంటే సాహసమే. బోట్స్‌లో వెళుతున్నప్పుడు ఆ అలలు, ఆ పరిసరాల వల్ల వెళ్లేటప్పుడు... వచ్చేటప్పుడు వాంతులే. వాటిని, ఎండని నాగచైతన్య లెక్క చేయకుండా సినిమా చేశారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమాకి కచ్చితంగా యూనివర్సల్ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని నాకు అనిపించింది.ఒక సినిమా హిట్ కావాలని ఎలా కోరుకుంటామో... అలానే అవార్డు రావాలనీ కోరుకుంటాం. అవార్డు విషయం తెలిసిన తర్వాత నేను ఫోన్ చేద్దామనుకునేలోపు చైతన్యగారే చేసి, మాట్లాడారు. ‘మనకి అభినందనలు.. థ్యాంక్స్ చందు’ అన్నారు. నాగార్జునగారు కూడా ఫోన్ చేశారు. కథ, కథనంతో పాటు హీరోని డిజైన్ చేసిన విధానం అద్భుతం అన్నారాయన.ఇప్పుడు చైతన్యగారు అఫీషియల్‌గా బెస్ట్ యాక్టర్ అవడం హ్యాపీ. నిజానికి అల్లు అరవింద్, బన్నీ వాసుగార్లు, నేను ‘తండేల్’ చేద్దామనుకున్నప్పుడు ఫిషర్ మేన్ పాత్ర కోసం నాగచైతన్య అనే ఆలోచన మాకు అప్పటికి లేదు. కానీ, ఈ కథ గురించి తెలుసుకున్న ఆయన.. నేను చేస్తాను అని వచ్చారు. ‘తండేల్’ చిత్రం మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా చేరువ కావడం సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మా సినిమా గద్దర్ అవార్డుకి ఎంపిక కావడం అనేది హ్యాపీ. దేవుడికి థ్యాంక్స్.– ‘తండేల్’ చిత్రదర్శకుడు చందు మొండేటిచైతూకు అవార్డు రావడం ఆనందం: నాగార్జునగద్దర్ అవార్డుల విజేతలందరికీ శుభాకాంక్షలు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత, మా నాన్నగారు పేరిట ఏయన్నార్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు ఇది నిజమైన నివాళి. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లకు ధన్యవాదాలు. అలాగే జయసుధగారికి ఈ ఏడాది ఏయన్నార్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఆమె ఇందుకు అర్హురాలు. ఎన్టీఆర్ అవార్డు పురస్కారానికి ఎంపికైన చిరంజీవిగారికి శుభాకాంక్షలు. ‘తండేల్’ సినిమాలోని నటనకు గాను చైతూకు ఉత్తమ నటుడిగా అవార్డు రావడం సంతోషంగా ఉంది. దుళ్ల కొట్టావ్ నాన్న (నాగచైతన్యను ఉద్దేశించి...).అరుదైన గౌరవంగా భావిస్తున్నానునాకు ఈ అవార్డు రావడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వస్తే, నేను పాడిన పాటలను ప్రేక్షకులు వెంటనే జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. అవార్డులు మనకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మాది నిజామాబాద్. భువనగిరిలో నా స్కూలింగ్ జరిగింది. వరంగల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా (‘రాజు వెడ్స్ రాంబాయి’) కథనం సాగుతుంది. దీంతో తెలంగాణ యాస కోసం నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.మేం (ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, ఈ పాట రచయిత మిట్టపల్లి శ్రీధర్, దర్శకుడు సాయిలు) కలిసి పని చేసుకునే ప్రాసెస్‌లో మేం క్రియేట్ చేసిన పాట ఇది (రాంబాయి నీ మీద నాకు .. పాటను ఉద్దేశించి..). మా టీమ్ అంతా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. మా కష్టానికి అవార్డుల రూపంలో ఫలితం లభించిందని అనుకుంటున్నాను. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాకు ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు అవార్డు వచ్చినా, ఇంకా అవార్డులు సాధించిన ‘దండోరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘కోర్టు’, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాల్లో నేను భాగమై ఉన్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్తుంటాను. – ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణినా మనసుకి దగ్గరైన క్యారెక్టర్‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాకు గాను ఉత్తమ నటిగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. భూమా దేవి (‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో రష్మిక మందన్నా పాత్ర పేరు) నా మనసుకు ఎంతో దగ్గరైన పాత్ర. దర్శకుడు రాహుల్, గీతా ఆర్ట్స్, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్యా అక్క... ఇలా ఈ టీమ్ అందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగార్లకు థ్యాంక్స్. – ఉత్తమ నటి రష్మికా మందన్నామా నాన్న ఎమోషనల్ అయ్యారు‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా చేయాలనుకున్నప్పుడు నేను ఏదీ ఆశించలేదు... నా మనసులో ఉన్నది ఒక్కటే... ‘ఈ సినిమా బాగా ఆడితే చాలు’. అది నెరవేరింది. నవంబరు 20న (2025) ఈ సినిమా ప్రీమియర్స్ వేశాం. చూసినవాళ్లందరూ బాగుందని మెచ్చుకున్నారు. ఆ రోజుని నేనెప్పటికీ మరచిపోలేను. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా అని భయపడ్డాను. 21న విడుదలైంది... అందరికీ నచ్చిందనే టాక్ వచ్చింది. లైఫ్‌లో మరచిపోలేను రోజు అది. ఇక అవార్డు రావడం అనేది షాకింగ్‌గా ఉంది. బలమైన కథతో నిజాయతీగా ఒక మంచి సినిమా తీయాలనే పట్టుదలతో చేస్తే, కచ్చితంగా ప్రశంసలు వస్తాయనే నమ్మకం ఏర్పడింది.మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న ఎంతో కష్టపడి చదివించారు... మేం కూడా బాగా చదువుకున్నాం. ఘోరమైన కష్టాలు చూశాం. అయినప్పటికీ సినిమాలంటే నాకున్న ఇష్టాన్ని నా తల్లిదండ్రులు కాదనలేదు. ఇవాళ నాతో పాటు, మా సినిమాకి వచ్చిన అవార్డుల గురించి వినగానే మా నాన్న ఎమోషనల్ అయ్యారు... ఏడ్చేశారు. మా అమ్మ, నా ఇతర కుటుంబ సభ్యుల సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నా భార్య, నా కొడుకు ఈ అవార్డు గురించి విని, ఆనందపడ్డారు. ఇదంతా ఆ దేవుడి దయ. – ఉత్తమ దర్శకుడు సాయిలు కంపాటిఎన్టీఆర్ అవార్డు రావడం గౌరవం: చిరంజీవితెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2025 విజేతలందరికీ శుభాకాంక్షలు. మన సినీ పరిశ్రమలోని వారి కష్టాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుంది. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో నన్ను గౌరవించిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లతో పాటు జ్యూరీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎన్టీఆర్‌గారి పేరుపై ఓ అవార్డు నెలకొల్పటం, ఆ అవార్డు నాకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నా ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలుస్తున్న వారందరి ప్రేమే నా బలం.అవార్డులు వస్తే ఆ కిక్కే వేరు‘దండోరా’ సినిమాకు మూడు విభాగాల్లో (ఉత్తమ ద్వితీయ చిత్రం, సపోర్టింగ్ యాక్టర్, సంగీత దర్శకుడు) అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం మంచి మోటివేషన్‌గా అనిపించింది. నా నెక్ట్స్ సినిమా కోసం మరింత బాధ్యతగా పని చేస్తాను. ఈసారి ఉత్తమ (తొలి) చిత్రం అవార్డు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తాను. ‘దండోరా’లాంటి కథను ప్రేక్షకులకు చెబితే నాకు గుర్తింపు వస్తుందని నమ్మాను. రిస్కీ ప్రాజెక్ట్‌గా అనుకోలేదు. ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాను. ఈ తరహా సినిమాలు తెలుగులో తక్కువగా వస్తుంటాయి.సామాజిక అంశాలు మిళితమై ఉన్న ఈ సినిమాను ఎంటర్టైనింగ్ వేలో చెబితే ప్రేక్షకులకు చేరువ అవుతుందని నమ్మాను. నేను చూసిన కొన్ని పరిస్థితులను కల్పిత కథగా అల్లుకుని, ఈ సినిమా చేశాను. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె. రాబిన్‌కు అవార్డు రావడం సంతోషంగా ఉంది.ఎందుకంటే ఓ దశలో ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన ఈ సినిమా కోసం వర్క్ చేశారు. మన సినిమా ద్వారా మన గురించి ప్రేక్షకులకు తెలియడం, మన కష్టాన్ని జ్యూరీ గుర్తించడం... ఇలా అవార్డులు వస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది. అలాగే ఎన్టీఆర్‌గారు మా ‘దండోరా’ సినిమాను ప్రశించడం మర్చిపోలేను. గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు. – ‘దండోరా’ చిత్రదర్శకుడు మురళీకాంత్నా తర్వాతి చిత్రాలకు ఓ బలం మా సినిమాకి అవార్డు రావడం మా కష్టానికి తగిన ఫలితంతో పాటు ప్రోత్సాహకంగా భావిస్తున్నాను. నా తర్వాతి చిత్రాలకు ఓ బలంలా అనిపిస్తోంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రకథ రాసినప్పట్నుంచి ఇప్పటివరకు అవార్డు వస్తుందని ఊహించలేదు. ఇది నాకో సర్ప్రైజ్లా ఉంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తొలి సినిమాకే అవార్డు అందుకోనుండటంతో నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ‘మా వాడి కష్టానికి తగిన ఫలితంతో పాటు అవార్డు రూపంలో మంచి ప్రోత్సాహం లభించింది’ అని అందరూ హ్యాపీ.మా సినిమా అవార్డుకి ఎంపిక కావడంతో యూనిట్ ఫుల్ హ్యాపీ. నేను, తిరువీర్గారు, నిర్మాతలు సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసినిగార్లు కలిసి ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. మా సినిమా కోసం పనిచేసిన దాదాపు 300 మంది యూనిట్ మెంబర్స్‌కి ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను.– ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఇది నాకో కొత్త ఆరంభం ‘మిరాయ్’ అనుకున్నప్పుడు డైరెక్షన్ మాత్రమే చేయాలనుకున్నాను... డీవోపీ (ఛాయాగ్రాహకుడు) నేను కాదు. అనుకోని పరిస్థితుల్లో ఈ బాధ్యతను కూడా నిర్వర్తించాను. అనుకోకుండా ఈ కేటగిరీకి అవార్డు కూడా వచ్చింది. ఇలా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉన్న సినిమాకి అవార్డు రావడం అంటే అది నిజంగా స్పెషల్ ఫీలింగ్. అయితే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు షూటింగ్‌కి ముందు చాలా వర్క్ చేయడం అవసరం. అలా ప్రీ వర్క్‌కి ఎక్కువ టైమ్ కేటాయించడంతో షూటింగ్ సులువు అయింది. ఈ సినిమా కోసం పక్షులు క్రియేట్ చేశాం.ఒక డైరెక్టర్‌గా బర్డ్ ఎలా ఉండాలి? అని చెబితే ఒక కెమెరామేన్‌గా ఆ బర్డ్ కలర్, టెక్ట్స్ర్, సైజ్... అవన్నీ కెమెరాకి తగ్గట్టు ఎలా ఉండాలో డిజైనర్స్‌కి చె΄్పాలి. అయితే ‘మిరాయ్’కి నేను రైటర్, డైరెక్టర్, డీవోపీ కావడంవల్ల నాకు ఫుల్ క్లారిటీ ఉంటుంది కాబట్టి చెప్పి, చేయించుకున్నాను. మా సినిమా కథ హై టెక్నికల్ స్టాండర్డ్స్‌ని డిమాండ్ చేసింది. ఎంతో జాగ్రత్తగా చేశాం. టెక్నికల్ విభాగంలోనే రెండు అవార్డు (సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్)లు రావడం పట్ల నేను, మా నిర్మాతలు (టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్) చాలా హ్యాపీగా ఉన్నాం. నేనైతే ఈ అవార్డు నా కెరీర్‌కి ఒక కొత్త స్టార్ట్‌లా భావిస్తున్నాను. – ‘మిరాయ్’ డైరెక్టర్–సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని -
రాహులా.. మనం సాధించాం: రష్మిక ట్వీట్ వైరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 జాబితాను శనివారం ప్రకటించారు. అందులో ఉత్తమ నటి అవార్డు స్టార్ హీరోయిన్ రష్మికను వరించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి గానూ రష్మికకు ఈ అవార్డు లభించింది. ఈ విషయాన్ని దర్శకుడు ఎక్స్ వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. రాహుల్ ట్వీట్‌పై రష్మిక కూడా స్పదించింది. ఆయన పోస్ట్‌ని రీట్వీట్ చేస్తూ.. ‘రాహులా.. మనం సాధించాం’ అని రాసుకొచ్చింది. దానికి రాహుల్ రిప్లై ఇస్తూ..‘ఈ అవార్డుకి మీరు అర్హులు. థ్యాంక్యూ రష్మిక’ అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం రష్మిక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, రష్మిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న తన ప్రియుడు, స్టార్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. ఈ నెల 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Rahullaaaaaaa!! @23_rahulr 🥹🥹🥹🥹❤️We did it! ❤️❤️ https://t.co/kSHQ79P07p— Rashmika Mandanna (@iamRashmika) March 7, 2026 -
చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?
హీరోయిన్ రష్మిక పెళ్లి తంతు ముగిసింది. వారం-పదిరోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన ఈమె.. తర్వాత రిసెప్షన్స్‌లో పాల్గొంటూ బాగానే సందడి చేసింది. ఓ వారం గ్యాప్ తీసుకుని 'రణబాలి' షూటింగ్లో భార్యభర్తలిద్దరూ పాల్గొంటారు. సరిగ్గా ఈ టైంలోనే రష్మిక మాజీ ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ రష్మిక పెళ్లి జరిగిన కొన్నాళ్లకే ఇలా ఫొటో షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'కిరిక్ పార్టీ' సినిమాలో రక్షిత్ శెట్టి, రష్మిక కలిసి నటించారు. రష్మికకు హీరోయిన్గా ఇదే తొలి మూవీ. దీని షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ పెళ్లి రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి కెరీర్ పరంగా ఎవరికి వాళ్లు బిజీ అయిపోయారు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రష్మిక స్థాయి మారిపోయింది. పాన్ ఇండియా రేంజుకి వెళ్లిపోయింది. అలా విజయ్ దేవరకొండతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.మరోవైపు రక్షిత్ శెట్టి మాత్రం 42 ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయాడు. అప్పుడెప్పుడో 2023లో 'సప్త సాగర ఎల్లో దాచే' అనే సినిమా రెండు భాగాలతో వచ్చాడు. తర్వాత నుంచి కొత్తగా మరో మూవీ చేయలేదు. ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇతడు స్నేహితుడు రిషభ్ శెట్టి.. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం రక్షిత్.. అమెరికాలో ఉన్నాడని, కొత్త సినిమా కోసం స్టోరీ రాసుకుంటున్నాడని అన్నాడు. తాజాగా రక్షిత్ శెట్టి.. ఫేస్బుక్లో తన 'చార్లీ' మూవీకి సంబంధించిన ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. దీంతో ఇతడి అభిమానులు.. రష్మిక పెళ్లిని లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి రక్షిత్, సోషల్ మీడియాలో కనిపించలేదు. ఉన్నట్లుండి ఇప్పుడీ ఫొటో పెట్టడం చర్చనీయాంశమవుతోంది.రక్షిత్ శెట్టి స్నేహితులైన రిషభ్ శెట్టి 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఛత్రపతి శివాజీ బయోపిక్‌లోనూ నటించబోతున్నాడు. మరో స్నేహితుడు రాజ్ బి శెట్టి కూడా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ నటుడిగా పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రక్షిత్ మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి సినిమాల్లో నటించక, నిర్మాతగానూ కొత్త చిత్రాలేం చేయక సైలెంట్ అయిపోవడం అతడి ఫ్యాన్స్‌ని ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్) -
విరోష్ ప్రేమకథ.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే
-
విరోష్ జంట రిసెప్షన్లో కనిపించని ఆ టాలీవుడ్ స్టార్స్.. అదే కారణమా?
విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ ప్రేమజంట ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సందడి చేశారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను విజయ్, రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే పెళ్లి తర్వాత విరోష్ జోడీ టాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించింది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు యంగ్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.స్టార్స్ డుమ్మా..అయితే కొందరు స్టార్స్ ఈ రిసెప్షన్ వేడుకకు డుమ్మా కొట్టడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ, రామ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నితిన్, కిరణ్ అబ్బవరం ఈ రిసెప్షన్లో ఎక్కడా కూడా కనిపించలేదు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు పెద్దగా బాండింగ్ లేకపోవడం వల్లే రాదని తెలుస్తోంది. మరోవైపు హీరో నితిన్ అందుబాటులో లేనని కొత్త జంటకు ముందే చెప్పినట్లు సమాచారం.అదే కారణమా?కొందరు టాలీవుడ్ స్టార్స్ విరోష్ రిసెప్షన్‌కు హాజరు కాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్- రష్మిక స్వయంగా వెళ్లి ఆహ్వానించకోవపోవడమే కారణమని తెలుస్తోంది. పీఆర్ ఎజెన్సీ ద్వారా ఆహ్వానాలు పంపడం వల్లే కొందరు రాలేదని టాక్ వినిపిస్తోంది. పర్సనల్‌గా ఆహ్వానించలేదనే అసంతృప్తితోనే ఈ వేడుకలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఏదేమైనా టాలీవుడ్ స్టార్స్ ఈ రిసెప్షన్‌కు రాకపోవడం సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది. -
ఇంటికెళ్లి విరోష్ జంటను కలిసిన సీఎం
విరోష్ జంటను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను విజయ్ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి ఆశీర్వదించడం మా హృదయాన్ని కదిలించిందని విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. మాపై ఆయన చూపించే ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్- రష్మిక గతనెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఈనెల 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Heartfully touched that the Hon’ble Chief Minister of Telangana, Shri. @revanth_anumula garu, took the time to visit our home this evening and bless us on our wedding. Grateful for the love and affection he always shares 🙏 pic.twitter.com/QAbp9127ad— Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2026 -
విరోష్ రిసెప్షన్లో రాజకీయ నాయకులు
-
విజయ్, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతంటే..?
టాలీవుడ్ కొత్తజంట విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారనేది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన ఈ జంట దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి జరిగినప్పటికీ ఖర్చు భారీగానే అయినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జరిగిన వీరి వివాహం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగింది.ఉదయ్‌పూర్‌లోనే అత్యధికంగా వారిద్దరూ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విజయ్ సొంతూరులో సత్యనారాయణ వ్రతంతో పాటు గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు ఏర్పాట్లు.. సంగీత్ కార్యక్రమం, అభిమానులకు విందు, దేశవ్యాప్తంగా స్వీట్స్ పంపిణీ, పలు దేవాలయాల్లో అన్నదానం, చివరిగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వంటి కార్యక్రమాలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో భారీగానే ఖర్చు అయినట్లు టాక్.విజయ్, రష్మికల పెళ్లి కోసం సుమారు రూ. 15 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దేశంలోనే ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి పెళ్లి బాధ్యతను అప్పజెప్పారట. అయితే ఏ కార్యక్రమం ఎలా జరగాలనేది విజయ్ పక్కా ప్లాన్‌తో వారికి వివరించారట. అయితే, ఈ ఖర్చును కూడా విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి భరించారని తెలుస్తోంది. పెళ్లి కోసం సుమారు 3కేజీల బంగారం వారు కొనుగోలు చేసినట్లు టాక్ ఉంది. అయితే, వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది. అందుకోసం వీరిద్దరికి ఆ ఓటీటీ సంస్థ సుమారు రూ. 60కోట్లు చెల్లించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రకంగా వారికి రూ. 45కోట్ల వరకు లాభం వచ్చినట్లు అవుతుంది. పెళ్లితో ఎవరికైనా ఖర్చు అవుతుంది. కానీ, ఈ జోడీ మాత్రం తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను పెంచుకుంది. -
స్వగ్రామంలో విజయ్.. ఎమోషనల్ ఫోటో షేర్ చేసిన మేనమామ
లక్షలమంది అభిమానులు, వేలమంది స్నేహితుల ఆశీస్సుల మధ్య విరోష్ జోడీ తమ వివాహాన్ని కనులవిందుగా చేసుకుంది. గత నెల 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక చాలామందికి ఆదర్శంగా నిలిచారు. మార్చి 1న దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీతో పాటు కొన్ని ఆలయాల్లో అన్నదానం చేసిన ఈ జంట చాలామంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచారు. ఆపై హైదరాబాద్‌లో తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక విందు ఇచ్చింది.వివాహానంతరం సతీమణి రష్మిక మందన్నతో స్వగ్రామానికి విజయ్ తిరిగొచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌పేటకు చెందిన దేవరకొండ మాధవి, గోవర్ధన్రావుల మొదటి సంతానం విజయ్ దేవరకొండ అని తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అక్కడ ఆయన సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుని తమ గ్రామప్రజలకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు.సత్యనారాయణ వ్రతం తర్వాత విజయ్ తన గ్రాండ్ పేరంట్స్(నానమ్మ-తాతయ్య) సమాధుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను విజయ్‌కి మేనమామ, స్నేహితుడు, నిర్మాత యష్ రంగినేని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. "ప్రపంచం ఆడంబరాన్ని చూస్తుంది. నేను వినయాన్ని చూస్తున్నాను . ఎంత ఎత్తుకు ఎదిగినా సరే తన మూలాలను మరిచిపోలేదు. అతను సాధించిన విజయాల చప్పట్లకు అతీతంగా.. అతను గొప్ప విలువలతో పాతుకుపోయాడు. తల వంచి తన పూర్వీకుల ఆశీర్వాదం కోరుకోవడానికి మా గ్రామానికి తిరిగి వచ్చాడు." అని యష్ రంగినేని రాసుకొచ్చారు.యశ్ రంగినేని ఎవరో తెలుసా..యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి. View this post on Instagram A post shared by Yash Rangineni (@yashrangineni) -
విరోష్ రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి విజువల్స్
-
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
-
విరోష్ రిసెప్షన్లో సెలబ్రిటీల సందడి
-
విజయ్ దేవరకొండ & రష్మిక మందన్న రిసెప్షన్ విజువల్స్
-
శ్రీవల్లి రిసెప్షన్ కు పుష్ప.. గ్రాండ్ ఎంట్రీ
-
హైదరాబాద్ లో ఘనంగా విజయ్ దేవరకొండ-రష్మికల రిసెప్షన్
-
విరోష్ జంట రిసెప్షన్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
బ్లాక్‌బస్టర్ 'గీత గోవిందం'ను మిస్ చేసుకున్నా: హీరోయిన్
ఎనిమిదేళ్ల క్రితం రష్మిక మెడలో తాళి కడుతుంటే విజయ్‌కు చేతులు వణికాయి. కానీ ఇప్పుడు భయం, బెరుకు ఏదీ లేదు.. మనసంతా గాల్లో తేలుతోంది. చుట్టూ ఉన్న వాతావరణమంతా ప్రేమమయంగా మారింది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన గీతగోవిందం సినిమాలో విజయ్- రష్మిక రీల్ మ్యారేజ్ చేసుకున్నారు. సినిమాలో ఆ సీన్ చూసి సగటు ప్రేక్షకుడు మురిసిపోయాడు.ఆ సినిమాతో పునాదిఇప్పుడూ అంతే.. రియల్ లైఫ్‌లో విజయ్- రష్మిక ఒక్కటైనందుకు ప్రేక్షకలోకం సంతోషంగా శుభాకాంక్షలు చెప్తోంది. కలకాలం కలిసి జీవించమని దీవిస్తోంది. వీరి ప్రయాణానికి పునాది పడింది గీత గోవిందం సినిమాతోనే! పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సినిమా అయిపోయే సరికి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. డియర్ కామ్రేడ్ మూవీ చేస్తున్న టైంలోనే స్నేహం ప్రేమగా మారగా.. ఫస్ట్ రష్మికనే లవ్ ప్రపోజ్ చేసింది. గీత గోవిందం ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదుఅలా ఈ ఏడడుగల బంధానికి తొలి అడుగు పడింది. అయితే గీత గోవిందం సినిమా ఆఫర్ రష్మిక కంటే ముందు చాలామంది హీరోయిన్స్‌కు వెళ్లిందట! వారిలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య ఒకరు. ఈమె ఇటీవలే సీతా పయనం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ దీనికంటే ముందు తనకు తెలుగులో గీత గోవిందం ఆఫర్ వచ్చిందని తెలిపింది. నేను చేయని ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి.సినిమాతెలుగులో 'గీత గోవిందం' కథ విన్నాను. కానీ, ఎందుకో అది కుదర్లేదు. ఇది చాలామంది హీరోయిన్ల దగ్గరకు వెళ్లిందని తెలిసింది. ఏదేమైనా చివరకు సినిమా అద్భుతంగా వచ్చింది అని పేర్కొంది. ఐశ్వర్య.. గీత గోవిందం పోగొట్టుకున్నప్పటికీ సీతా పయనం మూవీతో మంచి డెబ్యూ అందుకుంది. అటు రష్మికకు.. గీత గోవిందం కెరీర్ పరంగా, వ్యక్తిగతంగానూ బాగా కలిసొచ్చింది.చదవండి: కొత్త కోడలు వచ్చింది.. బాగా చూసుకోండి: విజయ్ దేవరకొండ -
#Virosh Reception: ఘనంగా విజయ్- రష్మిక రిసెప్షన్ (ఫోటోలు)
-
విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
-
Virosh Reception: ఘనంగా ‘విరోష్’ వెడ్డింగ్ రిసెప్షన్
విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. స్నేహితులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా, బుధవారం (మార్చి 4) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అతిథులుతెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు.అలాగే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలకు చెందిన చిరంజీవి, నాగార్జున- అమల, వెంకటేశ్, రవితేజ, రామ్‌చరణ్- ఉపాసన, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని- అంజలి, రానా- మిహికా, కార్తీ, మహేశ్‌బాబు సతీమణి నమ్రత, కుమార్తె సితార, దర్శకుడు శేఖర్ కమ్ముల, సుకుమార్, ఆయన సతీమణి తబిత, నాగ్ అశ్విన్, నిర్మాత దిల్ రాజు, ఆయన సతీమణి వైఘా, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, నటి నీనా గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)
-
రష్మిక కోసం విజయ్ చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా?
డెస్టినీ(విధి) అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడదే విజయ్ దేవరకొండ-రష్మికని ఒక్కటి చేసింది. అప్పుడెప్పుడో సినిమా నటులుగా మొదలైన వీళ్ల ప్రయాణం.. ఇప్పుడు భార్యభర్తలుగా మారేందుకు కారణమైంది. ఈ సందర్భంగా వీళ్ల గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దానికి తోడు పెళ్లి ఫొటోలు, సొంతూరిలో విజయ్ సత్యనారాయణ వ్రతం చేయడం, ఊరి వాళ్లందరికీ భోజనాలు పెట్టించడం లాంటి విషయాలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక గురించి విజయ్ చేసిన తొలి ట్వీట్ కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: కొత్త కోడలొచ్చింది.. మంచిగా చూసుకోండి: విజయ్ దేవరకొండ)తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. సహాయ నటుడిగా పలు సినిమాలు చేసి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి తదితర చిత్రాలతో హీరోగా మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 'గీతగోవిందం' అయితే విజయ్‌ని ఫ్యామిలీ ఆడియెన్స్‌కి దగ్గర చేసింది. ఇందులో రష్మిక హీరోయిన్. ఈ మూవీలోనే విజయ్-రష్మిక కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అదే సినిమాకు చాలా ప్లస్ అయింది కూడా. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగానే రష్మిక పాత్ర గురించి 2018 జూన్ 23న ట్వీట్ చేసిన విజయ్.. ఇప్పుడు దాన్ని నిజం చేశాడు.'నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా నడుము నొప్పి లేచినా మీ బరువు బాధ్యత ఎప్పుడు నాదే మేడమ్' అని సదరు ట్వీట్లో విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. ఇక్కడున్నది సినిమాలో రష్మిక పాత్ర గురించే కావొచ్చు. కానీ ఆరేళ్ల తర్వాత తన ట్వీట్ నిజమవుతుంది, రష్మిక తన భార్య అవుతుందని విజయ్ కూడా ఊహించి ఉండడు. విధి వీళ్లిద్దరిని కలిపింది. ఈ క్రమంలోనే విజయ్ చేసిన పాత ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా) -
కొత్త కోడలొచ్చింది.. మంచిగా చూసుకోండి: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ నేడు(మార్చి 4) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. అయితే ఈ విందు కంటే ముందే..తెలుగు మీడియాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన సతీమణి రష్మికతో కలిసి మీడియా ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా విజయ్ మట్లాడుతూ.. తన కెరీర్లో మీడియా సహాకారం ఎంతో ఉందన్నారు.‘కెరీర్ ప్రారంభంలో నాకు మీడియా చాలా సపోర్ట్ చేసింది. నన్ను ప్రజల దగ్గరకు చేర్చేలా చేసింది మీడియాను. నా ప్రతి ఇంటర్వ్యూను తిరిగి చూసుకునేవాడిని. ఎలా మాట్లాడాను? ఇంకా ఎలా మట్లాడాలి?అనేది తెలుసుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి చేసుకొని రష్మికతో కలిసి జంటగా మీ దగ్గరకు రావడం ఆనందంగా ఉంది. ఇదో విభిన్న అనుభూతి. కాలం గడిచిపోతోంది. మనం పెద్దవాళ్లం అయిపోతున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ, మిమ్మల్ని మర్చిపోం. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. తెలుగు మీడియా అనేది మా సొంత మీడియా. మీ ఆశీస్సులు మాకు కావాలి. తెలుగు రాష్ట్రాలకు ఒక కొత్త కోడలు వచ్చింది. మంచిగా చూసుకోండి’ అంటూ విజయ్ నవ్వులు పూయించాడు. కాగా, ఇప్పటికే విజయ్-రష్మిక జంట అభిమానుల కోసం ఓ ప్రత్యేక విందును ఇచ్చింది. అలాగే మార్చి 1న హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్‌తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేశారు.కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం జరగనున్న రిసెప్షన్ పార్టీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. -
విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు నూతన గృహప్రవేశం కూడా చేశారు. తర్వాత గ్రామ ప్రజలందరికీ భోజనాలు కూడా విజయ్ పెట్టించాడు. ఈ సందర్భంగానే తన నియోజకవర్గంలలోని 9,10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తాం, తమ్ముడు ఆనంద్ పెళ్లి ఇక్కడే చేస్తామని తదితర విషయాలు పంచుకున్నాడు. ఇప్పుడు తమ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో విజయ్ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)సొంతూరి నుంచి తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసిన విజయ్-రష్మిక.. ఈ రోజు(మార్చి 04) సాయంత్రం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఇచ్చే రిసెప్షన్లో పాల్గొనున్నారు. అంతకు ముందు అనగా మంగళవారం దాదాపు 200 మంది అభిమానులతో కలిసి బంతి భోజనం చేశారు. ఈ సందర్భంగానే పలు విషయాలు మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ.. 'గీతగోవిందం' చేస్తున్నప్పుడు తాము స్నేహితులు మాత్రమేనని, 'డియర్ కామ్రేడ్' చేస్తున్న టైంలో తమ మధ్య ప్రేమ పుట్టిందని, తర్వాత కొన్నాళ్లకు రష్మికనే తనకు లవ్ ప్రపోజ్ చేసిందని విజయ్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'గీతగోవిందం'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. 'డియర్ కామ్రేడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ చాలామంది విరోష్ ఫ్యాన్స్‌కి ఇది ఫేవరెట్. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ప్రస్తుతం 'రణబాలి'లో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోతున్న మూవీ ఇదే. ఈ ఏడాది సెప్టెంబరు 11న పాన్ ఇండియా రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తీస్తున్నారు.(ఇదీ చదవండి: విరోష్... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్ సెట్టర్..)Star couple #VijayDeverakonda and #Rashmika arranged banthi bojanalu for 200 of their fans.Served them and had lunch together.👌A special day for all🫶🏽#Virosh pic.twitter.com/ZGUPWMdY5o— Suresh PRO (@SureshPRO_) March 3, 2026 -
విరోష్... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్ సెట్టర్..
ఈ సంవత్సరంలో టాప్ హై ప్రొఫైల్ సెలబ్రిటీ ఈవెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక ల వివాహం ‘ విరోష్’ను సినీ పండితులు అభివర్ణిస్తున్నారు అయితే అంతకు మించి విరోష్ అర్థవంతమైన వేడుకగా కూడా నిలుస్తోంది. ఇది సెలబ్రిటీ వేడుకలలో మనం ఇకపై చూడబోయే సరికొత్త సంప్రదాయాలకు నాందిగా మారనుంది.స్టార్స్‌లో అరుదుగా కనిపించే మానవత్వాన్ని ప్రదర్శించిన ఈ జంట తమ ఆనందాన్ని ప్రైవేట్ ఉత్సవాలకు మించి విస్తరించారు, తమ ప్రయాణంలో తమకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరితో తమ ఆనందాన్ని పంచుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్న నవదంపతులకు అందరూ కానుకలు ఇవ్వడం రివాజు. అయితే దీనికి భిన్నంగా ఈ జంట... నిరుపేదలకు తామే కానుకలు పంచి మనసులు గెలుచుకున్నారు.నోరు తీపి చేశారు..గత మార్చి 1న, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్‌తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కస్టమ్–డిజైన్డ్∙కవర్లతో ప్యాక్ చేసిన స్వీట్ బాక్స్‌లు, కీలకమైన నగరాల మీదుగా అందంగా అలంకరించిన ట్రక్కుల ద్వారా పంపిణీ చేశారు, ప్రత్యేకంగా రూపొందించిన ‘‘వి అండ్ ఆర్’ ’ టీ–షర్టులు టోపీలు ధరించిన ఆన్–గ్రౌండ్ బృందాలు ప్రజలకు వ్యక్తిగతంగా స్వీట్లు అందించాయి, ఇది ఓ ప్రైవేట్ వేడుక ను పబ్లిక్ ఫెస్టివల్‌గా మార్చింది. అంతేకాకుండా ప్రతి స్వీట్ బాక్స్‌లో క్యుఆర్ కోడ్ ఏర్పాటు చేశారు, దీనిని స్కాన్ చేసి నేరుగా నవదంపతులకు ఆశీర్వాదాలు కూడా పంపవచ్చు.ఆలయాల్లో... అన్నదానం...అదే సమయంలో, అన్నదానం – ఆహారాన్ని పవిత్రంగా సమర్పించడం – భారతదేశంలోని అనేక దేవాలయాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సేవ... ఆ దేవుళ్ల ఆశీర్వాదాలను కోరుతూనే తమ వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే రష్మిక విజయ్ ల ఉద్దేశ్యాన్ని నొక్కి చెబుతుంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి.తమ వివాహాన్ని ఒక ఖరీదైన వేదికకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు విస్తరించడం ద్వారా, ప్రముఖుల వివాహ వేడుక అర్ధాన్ని ఈ జంట పునర్నిర్వచించారు. ఇది కేవలం ఇద్దరు తారల మధ్య కలయిక మాత్రమే కాదు, సామూహిక ఆనందంతో మేళవించిన జాతీయ అనుభవంగా మార్చారు. నేషనల్ క్రష్ అనే బిరుదును ఆనందించడం మాత్రమే కాదు ఆ స్థాయి ఇచ్చిన వాళ్లను గుర్తుంచుకోవడం కూడా తనకు తెలుసని విజయ్ తోడుగా రష్మిక తెలియజెప్పారు. ‘ఈ దేశంలోని అందరు అందమైన ప్రజలకు, మీరు ఎల్లప్పుడూ మా ప్రయాణాలలో మా ప్రేమలో భాగమయ్యారు. మీ అందరికీ సన్నిహితంగా మా వివాహాన్ని జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంటుంది’’ అంటూ వీరు సోషల్ మీడియాలో ఇచ్చిన తమ వివాహ ప్రకటన రికార్డులను బద్దలు కొట్టింది, ఆసియాలో అత్యధికులు లైక్ చేసిన పోస్ట్‌గా విరాట్ కోహ్లీ గత రికార్డును అధిగమించింది.విద్యాదానం...తెలంగాణలోని తుమ్మన పేటలో విద్యార్థుల కోసం స్కాలర్షిప్లను ఈ విరోష్ జంట ప్రకటించారు. పెళ్లి తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్లోని విజయ్ స్వస్థలాన్ని ఈ జంట సందర్శించారు, నిరుపేదలకు విద్యాదానం చేయడానికి తమ వంతు సాయం అందించారు.దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించిన ఈ స్కాలర్షిప్లు, ఈ ప్రాంతంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న టీనేజర్లకు సహాయం చేయడం వారి చదువును కొనసాగించడానికి ప్రోత్సహించడం, ముఖ్యంగా వారు కీలకమైన పాఠశాల పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారికి ఆసరాగా నిలవడం ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం.తరచుగా ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి కోసం తమ వంతు సాయం చేస్తామ ని ఈ సందర్భంగా ఈ జంట జనం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. స్కాలర్షిప్ కార్యక్రమం ప్రత్యేకతలను వివరిస్తూ, విజయ్ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు జనంలో నుంచి వచ్చిన హర్షాతిరేకాలకు విజయ్ దేవరకొండ తల్లి మాధవి పొంగిపోయారు. మరి ఇది కదా పుత్రోత్సాహం అంటే... మార్చి 4న హైదరాబాద్‌లో ఈ జంట రిసెప్షన్ వేడుక నిర్వహించనుంది. మరోవైపు సెప్టెంబర్‌లో విడుదల కానున్న ’రణబాలి’ చిత్రంలో రష్మిక విజయ్ ఇద్దరూ కలిసి కనిపించనున్నారు. గీత గోవిందం తర్వాత ఇది వారి మూడవ చిత్రం కాగా పెళ్లి తర్వాత వీరు కలిసి నటించిన తొలి చిత్రం కానుంది. తారలంటే తెరమీద నుంచి ఆనందం పంచేవారు మాత్రమే కాదు తమను ఆదరించిన సమాజానికి కృతజ్ఞత పంచేవారు కూడా అని నిరూపించిన వీరిద్దరికీ ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని ఉండాలని కోరుకుందాం. -
విరోష్ వెడ్డింగ్.. సూపర్ హిట్
-
అభిమానులకు విజయ్- రష్మిక ప్రత్యేక విందు.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక తమ గ్రాండ్ వెడ్డింగ్ అభిమానులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవల సొంతూరుకి వెళ్లిన కొత్త జంట సత్యనారాయణవ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. తమ సొంతవారితో ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని నూతన దంపతులు తెలిపారు.తాజాగా విజయ్- రష్మిక అభిమానుల కోసం ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు. వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం వీరిద్దరు వారితో పాటే కలిసి భోజనం చేశారు. విజయ్‌కి రష్మిక భోజనం తినిపిస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈనెల 4న హైదరాబాద్‌లో వీరి గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. The Newlyweds #VijayDeverakonda and #RashmikaMandanna had lunch with fans.#VIROSH pic.twitter.com/VkRnVkgood— Gulte (@GulteOfficial) March 3, 2026 -
హ్యాపీ పార్టీ
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా, పెళ్లికి ముందు జరిగిన వేడుకల్లో సంగీత్కి సంబంధించిన ఫొటోలను మంగళవారం విజయ్–రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఆ రోజు (సంగీత్ని ఉద్దేశించి) సాయంత్రం కన్నీళ్లు వచ్చేంతవరకూ నవ్వుతూనే ఉన్నాం. మా పాదాలు నొప్పి పుట్టేంతవరకు డ్యాన్స్ చేశాం. అందరి స్పీచ్‌లతో భావోద్వేగానికి గురయ్యాం.మా కళ్లు చమర్చేలా సంభ్రమాశ్చర్యాలతో మంచి మనుషులతో గడిపిన బిగ్ హ్యాపీ పార్టీ ఇది’’ అని ‘ఎక్స్’లో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ‘‘ఆ రోజు సాయంత్రం నేను, విజ్జు ఒకరినొకరం సర్ప్రైజ్ చేసుకోవాలనుకున్నాం. ఫ్యామిలీ మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ స్వేచ్ఛగా డ్యాన్స్ చేయడం మాకు సంతోషాన్నిచ్చింది. ఆ రోజు రాత్రి నేను, విజయ్ బాగా డ్యాన్స్ చేశాం’’ అని పేర్కొన్నారు రష్మిక. ఇదిలా ఉంటే... తమ ఫ్యాన్స్ కోసం విజయ్–రష్మిక ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరూ స్వయంగా వడ్డించడంతో పాటు అభిమానులను ఆత్మీయంగా పలకరించి, వారితో కలిసి భోజనం చేశారు. -
పెళ్లిలో హైలైట్... రష్మిక నగలు!
-
విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్
Virosh Wedding సినిమా స్టార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడిలోని ప్రతీ వేడుకు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తరువాత సొంత ఊరిలో కొత్త దంపతుల సత్యనారాయణ వ్రతం, భోజనాల విశేషాల సందడి ముగియముందే ఈ జంట సంగీత్ వేడుక ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. పదండి దాని సంగతులేంటో తెలుసుకుందాం.రష్మిక ఎప్పటిలాగానే డైమండ్ ఆభరణాలతో నిండుగా కనిపించింది. ఇక విజయ్ దేవరకొండ తన 'సంగీత్' వేడుకలో ధరించిన స్పెషల్ హారం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ మెడలోని ప్రత్యేకమైన పచ్చ నెక్లెస్ దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ పెళ్ళిలో రాకుమారుడిలా నగలతో కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌కు నాంది పలికాడు. తన వెడ్డింగ్ లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా, తన సంగీత్ వేడుకలో అతని ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. విజయ్ ,రష్మిక ఫల్గుణి షేన్ పీకాక్ దుస్తుల్లో నాట్య మయూరాల్లా విన్యాసాలు చేశారు. విజయ్ ముదురు నీలం రంగులో ఉన్న కుర్తా-పైజామా సెట్‌ను ఎంబ్రాయిడరీ కోటుతో ధరించగా, రష్మిక సిల్వర్ కలర్ లెహంగాను ధరించింది.యూనిక్ ఎమరాల్డ్ నెక్లెస్విజయ్ ప్రత్యేకమైన వజ్రాలు పొదిగిన పచ్చ నెక్లెస్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్. విజయ్ నెక్లెస్‌లో మధ్యలో భారీ పచ్చ లాకెట్టు అందంగా అమిరిందిన. ఆ లాకెట్టు పైన ఒక పెద్ద డైమండ్ క్యాప్ మరింత వన్నెతెచ్చింది. అలాగే ఎంగేజ్మెంట్ రింగ్‌గా భావిస్తున్న విజయ్ పదహారు రాళ్ల డైమండ్ రింగ్ చాలా విలక్షణమైంది.ఆ ఉంగరంలో ప్రేమకు చిహ్నంగా బ్రాండ్ క్రిస్క్రాస్ X మోటిఫ్ కూడా ఉంది. ఈ వజ్రపు ఉంగరం ధర సుమారు రూ. 15 లక్షలు ఫిబ్రవరి 26, 2026న, తెలుగు, కొడవ సంప్రదాయల ప్రకారం వివాహ వేడుక జరిగితన తరువాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. (విజయ్‌పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు) -
విజయ్, రష్మిక రిసెప్షన్ రూల్స్.. సింగిల్ ఎంట్రీ కోడ్
విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ వేడుక గురించి ఒక వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమ ఫ్యాన్స్ కోసం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంచారు. ప్రధాన ఆలయాల్లో భోజనాలు పెట్టారు. ఇలా తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. అయితే, మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. అందుకోసం పోలీసులు కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ రిసెప్షన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలామంది సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. దీంతో కార్యక్రమానికి ఎంట్రీ అయ్యే వారికి చాలా కఠినమైన నియమాన్ని విధించింది. రిషెప్షన్‌కు వచ్చే అతిథులు లోపలికి వెళ్లాలంటే ఒకసారి మాత్రమే ఉపయోగించగల QR కోడ్‌ను ఏర్పాటు చేశారు. రోండోసారి ఆ కోడ్ పనిచేయదు. ఒక్కసారి లోపలికి ఎంట్రీ ఇస్తే బయటకు వచ్చేందుకు ఛాన్స్ వుండదు.రిసెప్షన్‌కు ఆహ్వానం, QR కోడ్లు లేని వారు అక్కడికి రావద్దని ఇప్పటికే తెలిపారు. ఇది పూర్తిగా పోలీసుల నిఘాలో ఉన్నందున హాజరు కావద్దని వారు అధికారికంగా ప్రకటించారు. పరిస్థితిని అర్థం చేసుకుని భద్రతా చర్యలకు సహకరించాలని విజయ్ టీమ్ కోరింది.(ఇదీ చదవండి: సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు) -
సొంతూరులో సత్యనారాయణ స్వామి వ్రతం.. విజయ్, రష్మిక స్పెషల్ (ఫోటోలు)
-
సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు
సతీమణి రష్మికతో పాటు విజయ్ దేవరకొండ తన సొంతూరులో సందడి చేశారు. పెళ్లి తర్వాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి రావడంతో స్థానికులు సంతోషించారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేటలో తమ ఫాంహౌజ్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో భక్తిశ్రద్ధలతో గృహ ప్రవేశ పూజలు నిర్వహించారు. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే, గ్రామస్థులకు, అభిమానులకు ఏర్పాటు చేసిన విందులో నాన్- వెజ్ ఏర్పాటు చేయడం నెట్టింట వైరల్ అయింది. సత్యనారాయణ స్వామి వ్రతం సమయంలో అతిథిలకు నాన్- వెజ్ ఆహారం పెట్టడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, విజయ్ ఇచ్చిన విందుకు గ్రామస్తులు ఫిదా అయ్యారు. చాలామంచి భోజనంతో పాటుగా అందరినీ గౌరవంగా పలకరించారని చెబుతున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి పూజలు జరిగిన సమయంలో శాఖాహారం (వెజ్) మాత్రమే అతిథిలకు వడ్డిస్తారు. కానీ, విజయ్ దేవరకొండ వెజ్‌తో పాటు నాన్-వెజ్ కూడా వడ్డించారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే, తెలంగాణ నెటిజన్లు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. హిందూ సంప్రదాయాల అందరూ పాటిస్తారంటూనే ప్రాంతాన్ని బట్టి కొన్ని పద్దతులు మారుతాయని చెబుతున్నారు. తెలంగాణలో భక్తితో పాటు తమ ఆహారం పట్ల ప్రత్యేకమైన శైలి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. విజయ్ వారింట్లో పూజ ముగిసిన తర్వాత స్వామివారి పీఠాన్ని జరిపి ఆ కార్యక్రమాన్ని మొదట పూర్తి చేశారని చెబుతున్నారు. ఆ తర్వాతనే మాంసాహార విందును ఏర్పాటు చేశారని తెలుపుతున్నారు. తెలంగాణలోని చాలా కుటుంబాల్లో ఇలాంటి ఆనవాయితీగా వస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. విజయ్ ఇంటికి దూరంగానే నాన్- వెజ్ ఆహారం వడ్డించారని చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో పూజ పూర్తయిన సాయంత్రం లేదా మరుసటి రోజు తప్పకుండా విందు ఉంటుందని అందులో మాంసం వడ్డించడం సర్వసాధారణమని గుర్తుచేస్తున్నారు.సొంతిల్లు కట్టుకున్నా: విజయ్స్వగ్రామం తుమ్మన్‌పేటకు మూడు దశబ్దాలుగా దూరంగా ఉన్నప్పటికీ తమ కుటుంబానికి గ్రామస్థులతో విడదీయరాని అనుబంధం ఉందని విజయ్ దేవరకొండ తెలిపారు. తన తొలి పుట్టినరోజు కూడా ఇదే గ్రామంలో నిర్వహించినట్లు అమ్మా నాన్న చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. తన తండ్రి కోరిక మేరకు స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకున్నానని ఆయన అన్నారు. అందుకే తన వివాహానంతరం వ్రతం చేసి గ్రామస్థులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరు భోజనం చేసి తమను ఆశీర్వదించాలని కోరారు. తుమ్మన్‌పేట పాఠశాలలో 9, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఉపకారవేతనం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అచ్చంపేట పరిధిలోని 44 పాఠశాలల విద్యార్థులకు దీన్ని అమలు చేస్తానన్నారు.ఊరందరికీ వివాహభోజనం పెట్టిన #VijayDeverakondaసొంత ఊర్లో సత్యనారాయణ వ్రతం చేసిన అనంతరం బంధుమిత్రులనదరికీ గ్రామస్తులకు విందు భోజనం పెట్టిన విజయ్ దేవరకొండ..#Virosh ❤️ pic.twitter.com/tojnbgBJcj— Suresh PRO (@SureshPRO_) March 2, 2026 -
Vijay-Rashmika: శుభవార్త చెప్పిన కొత్త జంట
-
విజయ్ దేవరకొండ & రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం
-
సొంతూరుకు విజయ్ వరాలు... ఆనంద్ పెళ్లి ఇక్కడే చేస్తా
-
సంగీత్ పార్టీలో విరోష్ జోడీ.. ఫోటోలు షేర్ చేసిన విజయ్ (ఫోటోలు)
-
'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ
హీరోయిన్ రష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ.. సోమవారం తన సొంతూరు అయిన తుమ్మనపేటకు వచ్చాడు. ఈ గ్రామం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో ఉంది. సొంతూరిలోని ఫామ్ హౌస్‌లో నూతన వధూవరులిద్దరూ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలందరికీ వెజ్-నాన్ వెజ్ భోజనాలు కూడా పెట్టారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)సొంతూరితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊర్లో పొలం కొందాం వ్యవసాయం చేసుకుందాం ఇల్లు కట్టుకుందామని నాన్న ఎప్పుడూ అడిగేవాడు. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది . ఊరిలో ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడంతో హ్యాపీ. ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్‌గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోని అందరి సమక్షంలో చేస్తాం. ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాం అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.ఇకపోతే నిన్న అనగా ఆదివారం.. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం 'విరోష్' జంట అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల స్వీట్ల పంపిణీ కూడా చేశారు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్‌కి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)విరోష్ పెళ్లికానుక.. విద్యార్థులకు విజయ్ దేవరకొండ శుభవార్తవిజయ్ దేవరకొండ తన 'విరోష్' పెళ్లికానుకగా విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా మొదట అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతి ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేయనున్నారు. భవిష్యత్తులో ఈ… pic.twitter.com/nwMlm0M7sI— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2026 -
భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక.. గతవారం పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. తిరిగి హైదరాబాద్ వచ్చేసిన కొత్త జంట.. తెలంగాణలోని తుమ్మనపేట అనే గ్రామానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ సొంతూరు ఇది. సోమవారం ఉదయం అక్కడే సత్యనారాయణ వ్రతం చేశారు. అలానే ఊరి వాళ్లందరికీ భోజనాలు కూడా పెట్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)అయితే ఈ మొత్తం వాటిలో ఒక్క వీడియో మాత్రం విరోష్ (ViRosh) అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో రష్మిక.. తన భర్త విజయ్‌ని చూస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. విజయ్ తనని చూసేసరికి రష్మిక ముఖాన్ని పక్కకు తిప్పుకొని మురిసిపోయింది. పూజ చేస్తున్న టైంలో ఈ క్యూట్ మూమెంట్ కనిపించింది.విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరికి వచ్చాడు. తన ఫామ్ హౌస్‌లోనే సత్యనారాయణ వ్రతం జరిపించాడు. అలానే ఆదివారం దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశాడు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)#VijayDeverakonda & #RashmikaMandanna ❤️pic.twitter.com/9S7AW5b0Zw— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026 -
విజయ్-రష్మిక.. సత్యనారాయణ స్వామి వ్రతం
-
స్వగ్రామంలో విజయ్, రష్మిక సందడి
-
విజయ్ సొంతూరుకు 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దల అంగీకారంతో ఉదయ్‌పూర్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత తొలిసారి సతీమణితో పాటుగా తన సొంతూరుకు విజయ్ చేరుకున్నారు. దీంతో భారీగా అభిమానులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. తెలంగాణలోని మారుమూల గ్రామంలో జన్మించిన విజయ్ స్వశక్తితో ఎదిగి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపుని సాధించారు. తనకు ఇష్టమైన రష్మికని సినిమానే దగ్గర చేసింది. తమకు అభిమానులు పెట్టిన ‘విరోష్’ ట్యాగ్‌నే వివాహ వేడుకకి పేరుగా పెట్టుకుని వారికి ప్రథమ స్థానం ఇచ్చారు. అంతటితో ఆగని ఈ జంట దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంపిణీ చేసి ఫ్యాన్స్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు వివాహ అనంతరం సొంత ఊరుకు తొలిసారి జంటగా చేరుకోవడంతో అక్కడ సందడి వాతావారణం నెలకొంది.విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరు రావడంతో తన చిన్ననాటి స్నేహితులు అందరూ చేరుకున్నారు. నేడు (మార్చి 2న) తుమ్మనపేటలోని ఆయన ఫామ్ హౌస్‌లో సత్యనారాయణ వ్రతం జరిపించనున్నారు. ఇప్పటికే సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. విజయ్ అనుకుంటే హైదరాబాద్‌లోనే ఈ కార్యక్రమం జరిపించవచ్చు. కానీ, తన సొంతూరు గ్రామ ప్రజల సమక్షంలో ఈ వేడుక జరగాలని ఆయన కోరుకున్నట్లు తెలుస్తోంది. (వీడియో క్రెడిట్ — Telugu Scribe)స్వగ్రామానికి చేరుకున్న విజయ్ దేవరకొండ దంపతులునాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేట గ్రామానికి చేరుకున్న నవదంపతులు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్ననూతన ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్న నవ దంపతులు https://t.co/GUBdsVIVLA pic.twitter.com/9GRJBql2Uu— Telugu Scribe (@TeluguScribe) March 2, 2026 -
అల్లు అర్జున్ ఇంటికి విజయ్, రష్మిక జోడీ (ఫోటోలు)
-
విజయ్, రష్మికల రిసెప్షన్.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి
విజయ్ దేవరకొండ , రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో కొద్దిమంది సమక్షంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే, పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలు రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా కొద్దిమంది మాత్రమే పాల్గొననున్నారు. తాజాగా విరోష్ జోడి తమ ఫ్యాన్స్‌కు, ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 4న సాయంత్రం జరిగే రిసెప్షన్ వేడుకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహ్వానం అందిన అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా ఇతరులు ఈ వేడకకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.విజయ్, రష్మిక రిసెప్షన్ కోసం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్‌ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కోరింది. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది. -
సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గతవారం ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్)పెళ్లి జరగడానికే ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని రిసెప్షన్‌కి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికని సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు.. తెలుగు సంప్రదాయంలో భాగంగా చీరపెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రిసెప్షన్ సందర్భంగా అభిమానులని ఉద్దేశిస్తూ.. 'విరోష్' జోడి ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మార్చి 04 సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు ఇందులో పాల్గొనున్నారు. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దు. వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఇందులో విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా) -
హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)
-
'రణబాలి' పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ: దర్శకుడు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందర్భంగా రణబాలి నుంచి ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వారిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో నెట్టింట వైరల్ అయింది. పోస్టర్లో వారిద్దరి లుక్ చాలా ఓల్డ్ గెటప్‌లో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, దీని వెనుక దాగిన ఆసక్తికరమైన స్టోరీని చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ షేర్ చేశారు. రణబాలి నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ కేవలం ఒక సినిమాకు సంబంధించినది మాత్రమే కాదని తెలిపారు. ఈ పోస్టర్ రూపకల్పనలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. పాత కాలపు ఫోటోలంటే తనకు ఎంతో ఇష్టమని దర్శకుడు గుర్తుచేసుకున్నారు. మన పూర్వీకులు కెమెరా ముందు ఎలాంటి కృత్రిమమైన ఫోజులు లేకుండా చాలా సహజంగా ఫోటోలు దిగేవారని చెప్పారు. అలాంటి కృత్రిమమైన లుక్‌ను రణబాలి పోస్టర్లో తీసుకురావాలని తాము ప్రయత్నించినట్లు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు.రణబాలి పోస్టర్ గురించి దర్శకుడు ఇలా చెప్పారు. '1800ల కాలం నాటి నేపథ్యంలో ‘రణబాలి’ మూవీ ఉండనుంది. కాబట్టి, ఆ కాలపు గాంభీర్యం, మట్టి వాసన కనిపించేలా ఈ చిత్రంలో వివాహ వేడుకను డిజైన్ చేశాం. ఈ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్, రష్మిక పెళ్లి దుస్తుల్లో వచ్చినప్పుడు వారిద్దరూ నిజంగానే మన పూర్వపు కాలంలోకి వెళ్ళిన వ్యక్తుల్లా కనిపించారు. ఫోటో లుక్‌లో కూడా వారిద్దరూ ఎలాంటి స్టైలిష్ ఫోజులు ఇవ్వలేదు. కేవలం సాధారణ వ్యక్తుల్లా వారిద్దరినీ కెమెరాతో బంధించాం. ఇదే ఈ పోస్టర్ ప్రత్యేకత. ఈ సినిమా పోస్టర్ విడుదల నాటికి వారిద్దరూ నిజ జీవితంలో ఒక్కటి కావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కోసారి సినిమా, నిజ జీవితం రెండూ పలకరించుకుంటాయ్. ఈ పోస్టర్ చూస్తుంటే వారి గత జన్మకు సంబంధించిన పెళ్లి ఫోటోలా అనిపిస్తుంది.' అని రాహుల్ సాంకృత్యన్ ఎమోషనల్ స్టోరీ రాసుకొచ్చారు.STORY BEHIND THE WEDDING POSTERYesterday, we released the wedding poster of Ranabaali.But this wasn’t designed as a “poster.” It was a moment.I’ve always been fascinated by old photographs — our parents, grandparents… the way they stood before a camera. No posing. No… pic.twitter.com/ppuBj9tMjQ— Rahul Sankrityan (@Rahul_Sankrityn) March 1, 2026 -
విజయ్, రష్మిక మూడోసారి.. చిరు-త్రిష రెండోసారి.. జోడీ రిపీట్
వెండితెరపై ఓ హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరి, ఆ సినిమా హిట్ కూడా అయితే అప్పుడు ‘హిట్ పెయిర్’ అనిపించుకుంటారు. ఆ హిట్ పెయిర్ కాంబినేషన్‌కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కొన్ని జోడీలు రిపీట్ అవుతున్నాయి. తొలిసారి జోడీగా నటించి, సక్సెస్ సాధించిన ఈ జంటకు సక్సెస్ రిపీట్ కావడం ఖాయం అనే అంచనాలున్నాయి. ఇక... రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. రెండోసారి... ఈ మధ్య చిరంజీవి హీరోగా నటించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ మూవీ ఒకటి. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష మెయిన్ హీరోయిన్గా, ఆషికా రంగనాథ్ సెకండ్ హీరోయిన్గా నటించారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్ ’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ‘‘స్టాలిన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి–త్రిష జోడీ ‘విశ్వంభర’తో రెండోసారీ అలరించనుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందింది. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ఫై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని 2025 ఆగస్టు 22న విడుదల చేసిన ‘విశ్వంభర’ సినిమా గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వేసవిలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ ‘విశ్వంభర’. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది... వినోదపరుస్తుంది. ఈ వేసవికి ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా’’ అని చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. వందో చిత్రంలో... హీరో నాగార్జున, హీరోయిన్ టబు జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి పేరు చెప్పగానే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా గుర్తొస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో మొదటిసారి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న రిలీజైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తమదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు నాగార్జున–టబు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ మరోసారి సందడి చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించలేదు. కానీ, ‘సిసింద్రి’ (1995) సినిమాలో మాత్రం ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున–టబు ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో మరోసారి ఆయనకి జోడీగా టబు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీకి పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. విజయ్–రష్మిక కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’కి దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారి లైఫ్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. రీల్ లైఫ్‌లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా రియల్ లైఫ్‌లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి కాంబోలో రానున్న ‘రణబాలి’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. సెకండ్ టైమ్ హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లది హిట్ జోడీ. ‘శతమానం భవతి’ మూవీలో ఫస్ట్ టైమ్ జోడీగా నటించిన ఈ జంట సెకండ్ టైమ్ ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా, డింపుల్ హయతి కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు శర్వానంద్–అనుపమ. వీరిద్దరూ ఫస్ట్ టైమ్ నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ మూవీ 2017 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్నారు శర్వా, అనుపమ. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’లో నటిస్తున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది.ఈసారి భయపెడతారు ‘సామజ వరగమన’ సినిమాతో ప్రేక్షకులకు కడుపుబ్బా వినోదాలు పంచారు హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికా జాన్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ నటించిన సెకండ్ మూవీ ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ మూవీ కోసం రెండోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు–రెబా. తొలి చిత్రంలో ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ జంట ‘మృత్యుంజయ్’లో మాత్రం భయపెట్టనున్నారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సాంగ్స్, కామెడీ లేకుండా హానెస్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. నా నటన కూడా సరికొత్తగా ఉంటుంది’’ అంటూ ఇటీవల శ్రీ విష్ణు తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఈ నెల 6కి ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేశారు. బేబీ హిట్‌తో... ‘బేబీ’ మూవీతో ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి వీరి జోడీపై యూత్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ‘బేబీ’తో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్– వైష్ణవి జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్’. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి స్తున్నారు. కాగా ఎపిక్– ఫస్ట్ సెమిస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి... సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘బేబీ’ మూవీతో సూపర్‌హిట్ జోడీ అనిపించుకున్న ఆనంద్–వైష్ణవి కలిసి నటిస్తున్న ‘ఎపిక్’ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రెండోసారి... ‘కోర్ట్’ సినిమాతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా. ఈ ఇద్దరూ పరిచయమైన తొలి చిత్రం ‘కోర్ట్’. ఇప్పుడు రెండోసారి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా 2025 మార్చి 14న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి జోడీగా నటించిన హర్ష్ రోషన్–శ్రీదేవి హిట్ పెయిర్‌గా నిలిచారు. సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆడియన్స్‌లో వీరి జోడీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరు జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఫుల్ బజ్ నెలకొంది. -
ఫ్యాన్స్ అన్నదానం.. విజయ్- రష్మికపై వెల్లువిరిసిన అభిమానం
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే వీరి పెళ్లిని అభిమానులు కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శ్రీ సాయికృప బాలాజీ మందిర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అభిమానుల కోసం విరోష్ జంట అన్నదానం..కాగా.. తమ అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మిఠాయిలు మార్చి 1వ తేదీన పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద ఆదివారం అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.VDFC JAGITYAL - Dharmapuri❤️❤️#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda #ViRoshWedding pic.twitter.com/jQNFuTENir— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda pic.twitter.com/jcR3130HNM— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 -
విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా?
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్‌గా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్‌గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్‌తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్ మరో రికార్డ్ సృష్టించాయి.2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్‌ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్‌కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ పోస్ట్ రికార్డ్‌ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్‌స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్‌కు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్‌కు ఈ రేంజ్లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
విరోష్ వెడ్డింగ్.. పాన్ ఇండియా ఫ్యాన్స్‌కు కొత్త జంట సర్ప్రైజ్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.తాజాగా అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మార్చి 1వ తేదీన ఆదివారం మిఠాయిలు పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద స్వీట్స్ పంపిణీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆలయాల వద్ద అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.❤️ pic.twitter.com/zXPGxIxHz7— Rashmika Mandanna (@iamRashmika) February 28, 2026 -
విశేషాలకు కొదవ లేని కొడవ కళ్యాణం
అక్కడ పురోహితులు ఉండరు... వేద మంత్రోచ్చారణలు వినిపించవు... వధూవరులు ఏడడుగులు వేయరు... ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడక ఇలానే ఉంటుంది. అంతేనా? ఇంకా చాలా విశేషాలుంటాయి. తెలుగు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఈ వేడుక ఉంటుంది. టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఈ రెండు పద్ధతుల్లోనూ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి జరిగింది. దీంతో కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగి ఉంటుందా?! అనే చర్చలు మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...విజయ్ దేవరకొండది తెలంగాణలోని నాగర్‌కర్నూలు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, సంప్రదాయాలు మిగతా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వారి పూర్వీకులను గౌరవిస్తూ వివాహ వేడుకలను జరుపుతారు. మామూలుగా జరిగే తెలుగు వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. అరిటాకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ వివాహ వేడుకను వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుంది. వేదికను అరిటాకులతో పచ్చదనానికి ప్రతీకగా అలంకరిస్తారు.భిన్నమైన కట్టుకొడవ పెళ్లిలో వధూవరులిద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు ‘కుష్య’ అనే నల్లని కోటు, ‘చేలే’ అని పిలిచే నడుముకు కట్టే పట్టీ, ‘పీచే కత్తి’ (చిన్న కత్తి) ధరిస్తాడు. ఇక వధువు చీరకట్టు సంప్రదాయం మిగతా చీరకట్టులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా భారతీయ వస్త్రధారణలో చీర పల్లూను ముందు నుంచి వెనక వైపుకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీర కొంగును వెనక నుంచి ముందుకు తీసి, వేస్తారు. అలాగే, వెనక వైపు కుచ్చిళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కట్టు ఈ కమ్యూనిటీలో కనిపిస్తుంది. ఇక వేడుక అంతా డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలు చేస్తారు. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. ఈ పద్ధతిని అనుసరిస్తూ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా కూడా ఈ నృత్యాలు చేశారు.కొడవలు ఎవరు కొడవలను ‘కూర్గులు’ అని కూడా అంటారు. వీరిది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు (కూర్గ్) ప్రాంతం. వీరు సుమారు 1.6 లక్షల దాకా ఉన్నారని అంచనా. గతంలో వీరు వ్యవసాయం, ఇతర పనుల మీద ఆధారపడి జీవించేవారు. 19వ శతాబ్దంలో కాఫీ సాగు ద్వారా వీరి పనికి ప్రాధాన్యం లభించింది. మొదట వ్యవసాయ ఆధారిత పండుగలు జరుపుకునే వీరు అనంతరం ఇతర పండుగలూ జరుపుకోవడం మొదలుపెట్టారు. కావేరి నది వీరికి ప్రాధాన్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో వీరు ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. వీరి నైపుణ్యాలను గమనించి బ్రిటిష్ అధికారులు వీరిని మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వినియోగించారు. కొడవల్లో అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు.బంగారు నాణేల మూటపెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అరటి చెట్టు నాటుతారు. వరుడు దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు కాండాన్ని నరకడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత వరుడు పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఆ సమయంలో ముందుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు వరుడిని ఆశీర్వదిస్తారు. తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణేలను అందిస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.12 గులకరాళ్లతో వధువుపై సర్వహక్కులువధూవరులిద్ద్దరూ మల్లెపూల దండలు మార్చుకుంటారు. పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు. దీంతో పాటు వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి, వధువుపై సర్వహక్కులు ఇస్తున్నామని చెబుతారు. అయితే వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకొని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికీ హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు. పుట్టింటివారికి కూతురి పట్ల కొంత బాధ్యత ఉంటందని సూచించడానికే ఇలా చేస్తారని చెప్పవచ్చు.నీళ్ల బిందె తలపై పెట్టుకొని..పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికే ఈ ఘట్టం. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ పెళ్లిళ్లలో మాంసాహారాన్ని వడ్డిస్తారు. అందులో ప్రధానంగా పంది మాంసం, మద్యం తప్పనిసరిగా ఉంటాయట. దీంతో విజయ్–రష్మిక పెళ్లి వేడుకలో ఈ వంటకాన్ని కూడా వడ్డించారు. ఇలా ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరిగిన విజయ్–రష్మికల వివాహ వేడుకలు ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అయ్యాయి. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.విరోష్ సెలబ్రేషన్స్‘‘దేశంలోని ప్రజలందరూ ఎప్పుడూ మా ప్రయాణం, ప్రేమలో భాగమయ్యే ఉన్నారు. అందుకే మీ అందరితో మా వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ప్రతి వేడుకను ఇండియా ఎలా అయితే ఫుడ్ అండ్ మిఠాయిలతో సెలబ్రేట్ చేసుకుంటుందో అలా మా జీవితంలోని ఈ బిగ్ మూమెంట్‌ను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మార్చి 1న దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ స్వీట్ ట్రక్స్‌ను పంపిస్తున్నాం (కొన్ని నగరాల్లో మాత్రమే). అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో విజయ్ అండ్ రష్మిక’’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక ‘ఎక్స్’ లో శనివారం రాత్రి ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ‘విరోష్ సెలబ్రేషన్స్’ అంటూ, ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు, ఏయే దేవాలయాల్లో అన్నదానం నిర్వహించనున్నారన్న జాబితాను కూడా ఈ ఇద్దరూ షేర్ చేశారు.స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్... ∙తెలంగాణ – హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ∙ఢిల్లీ (ఎన్సీటీ) – ఢిల్లీ ∙చండీఘర్ (యూటీ)– చండీఘర్ ∙ఉత్తరప్రదేశ్ – నోయిడా, గజియాబాద్ ∙గుజరాత్ – అహ్మదాబాద్ ∙మధ్యప్రదేశ్ – భోపాల్ ∙మహారాష్ట్ర – ముంబై ∙రాజస్థాన్ – జైపూర్ ∙ఆంధ్రప్రదేశ్ – వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి ∙కేరళ – కొచ్చి ∙కర్ణాటక – మైసూర్, కూర్గ్, బెంగళూరు ∙తమిళనాడు – కోయంబత్తూర్, చెన్నై ∙పాండిచ్చేరి (యూటీ) – పాండిచ్చేరి ∙బిహార్– (ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా సోమవారానికి వాయిదా). -
విజయ్ పెళ్లిలో ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ అట్రాక్షన్ (ఫోటోలు)
-
విజయ్, రష్మికలకు సర్ప్రైజ్ గిఫ్ట్
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న నూతనంగా పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు రణబాలి మూవీ నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేసి మేకర్స్ సర్ప్రైజ్ చేశారు. ఏందయ్య సామీ అంటూ సాగే ఒక గీతాన్ని ప్రోమోగా వదిలారు. సింగర్స్ శ్వేతా మోహన్, అజయ్ గోగవాలే ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటలో కొత్తగా పెళ్లైన దంపతులుగా విజయ్, రష్మికలు కనిపిస్తున్నారు. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్' జోడీ (ఫొటోలు)
-
విరోష్... ఓ రికార్డ్
బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాలు వసూళ్లపరంగా రికార్డ్ బ్రేక్ చేయడం కామన్. అయితే ఇప్పుడు ‘విరోష్’ (విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా) వివాహం ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా ఉయం 10 గంటల 10 నిమిషాలకు విరోష్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఫొటోలను ‘విరోష్’ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ఒకరిçపట్ల మరొకరికి ఉన్న ప్రేమను చెబుతూ, ఓ పోస్ట్‌ని కూడా షేర్ చేశారు. కాగా... రష్మికా మందన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలకు అత్యధిక లైక్స్ దక్కాయి. దీంతో ‘విరోష్’ వివాహ ఫొటోలు రికార్డ్ సాధించాయి. బాలీవుడ్ కపుల్ పిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీల పెళ్లి ఫొటోలు అత్యధిక లైక్స్ దక్కించుకున్న రికార్డ్‌ని సొంతం చేసుకున్నాయి. ఆ రికార్డ్‌ని తాజాగా విరోష్ ఫొటోలు బ్రేక్ చేశాయి. షేర్ చేసిన తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ (15.8 మిలియన్లు) సాధించిన సిద్ధార్థ్–కియారాల రికార్డ్‌ని 18.5 మిలియన్ల లైక్స్‌తో ‘విరోష్’ పెళ్లి ఫొటోలు బ్రేక్ చేశాయి. ఈ నంబర్ ఇంతటితో ఆగలేదు... లైక్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రం దాటుతున్న సమయంలో ఈ సంఖ్య 20 మిలియన్లకు పైగా దాటింది. అంటే... దాదాపు రెండు కోట్లకు పైనే లైక్స్ దక్కాయి. దీన్నిబట్టి విజయ్–రష్మికల జోడీకి ఎంత క్రేజ్ ఉందో ఊహించుకోవచ్చు.ఉదయ్‌పూర్ టు హైదరాబాద్: పెళ్లి ఫొటోల్లో బ్యూటిఫుల్ కపుల్‌లా కనిపించిన విజయ్–రష్మిక శుక్రవారం ఎయిర్‌పోర్టులో క్యూట్‌గా కనిపించి, ఆకట్టుకున్నారు. శుక్రవారం ఈ నూతన జంట హైదరాబాద్ చేరుకుంది. కాగా ఎయిర్‌పోర్టులో ఈ జంటని చూసి, ‘కంగ్రాచ్యులేషన్స్’ అంటూ ఫ్యాన్స్ అభిమానం చాటుకోగా... ‘విరోష్’ శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ... చిరునవ్వులు చిందించారు. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ప్రధానికి ఆహ్వానం... వైరల్భారత ప్రధాని నరేంద్ర మోదీని గత వారం విజయ్–రష్మిక స్వయంగా కలిసి, తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ జంటను ఆశీర్వదిస్తూ... మోదీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా... మోదీని విజయ్–రష్మిక కలిసిన ఫొటోలు తాజాగా బయటకు రాగా... అవి కూడా వైరల్‌గా మారాయి. -
హైదరాబాద్‌లో అడుగుపెట్టిన విరోష్ జంట.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట.అంతకుముందు ఇవాళ ఉదయం ఈ జంట ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ కొత్త ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. The lovely couple #VijayDeverakonda & #RashmikaMandanna touch down in Hyderabad post-wedding!❣️✨#VIROSH #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/gY55ei8q5s— Telugu FilmNagar (@telugufilmnagar) February 27, 2026 -
విజయ్‌తో పెళ్లి.. ముందే చెప్పిన రష్మిక.. వీడియో వైరల్..!
టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విరోష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందే అఫీషియల్‌గా ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కూడా అత్యంత ప్రైవసీ పాటించిన ఈ జంట ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఒక్కటయ్యారు. ఎక్కడా కూడా తమ రిలేషన్షిప్ బయట పడకుండా కొన్నేళ్ల పాటు కొనసాగించారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి దొరికిపోయినప్పటికీ ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు.అలా కొన్నేళ్లుగా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ వస్తున్నా వాటిని అస్సలు పట్టింకోలేదు విరోష్ జంట. కేవలం తమ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అలా అత్యంత సీక్రెట్‌గా విజయ్- రష్మిక తమ బంధాన్ని కొనసాగించారు. అయితే గతేడాది ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన రష్మిక.. తన పెళ్లి గురించి ముందుగానే చెప్పేసింది. కానీ మనకే అర్థం కాలేదంటూ నెటిజన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం.గతంలో ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన రష్మికను.. అనంద్ దేవరకొండ ఆట పట్టించాడు. దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా నన్ను స్పాట్లో పెట్టి అడిగితే ఎట్లా అంటూ అప్పుడే హింట్ ఇచ్చేసింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2024లోనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిందని అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 2024 లోనే అర్థం చేసుకోవాల్సింది మనం We did a mistake 😭😭😭😭😭😭#RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/tryvGuCGsF— Swaasthi (@swaasthi) February 26, 2026 -
ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్' జోడీ
-
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. అందరి ఫోకస్ వాటిపైనే..!
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉదయం పదిగంటల పది నిమిషాలకు విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరోష్ జంట.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లిలో వీరిద్దరు ధరించిన నగలపై పడింది. రాయల్ లుక్‌లో కనిపించిన ఈ నగలే వీరు షేర్ చేసిన ఫోటోలు హైలెట్‌గా నిలిచాయి. దీంతో నెట్టింట వాటి గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో విరోష్ జంట ధరించిన నగలు హైలెట్‌గా నిలిచాయి. రష్మిక నక్షీ వర్క్ నగలు రాజసం ఉట్టిపడేలా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించిన క్లాసిక్ గోల్డ్ జ్యూవెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. అలా గ్రాండ్ రాయల్ లుక్‌తో వీరిద్దరు తమ వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. -
హైదరాబాద్‌కు విజయ్– రష్మిక.. తొలిసారి జంటగా (వీడియో)
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్‌కు రానున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న తర్వాత తొలిసారిగా కలిసి కనిపించారు. తాజాగా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.పెళ్లికి ముందు కూడా వారిద్దరూ కలిసి ప్రయాణం చేసినప్పటికీ వేర్వేరుగా ప్లాన్ చేసుకునేవారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు పెళ్లి తర్వాత ఒకరిచేయి మరోకరు పట్టుకుని సంతోషంగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇలా వారిద్దరూ కలిసి కనిపించడంతో ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్
లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని అత్యంత గోప్యంగా నిర్వహింకున్న వీరిద్దరూ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. ఏఐ కాదు ఒరిజినల్ అంటూ తమ అభిమాన నటుల వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే సంస్కృతి,కళ, సంప్రదాయాల ప్రాముఖ్యతల కలయికతో రాజసం ఉట్టిపడేలా , ప్రత్యేకంగా చేత్తో తయారు చేసిన ఆభరణాలు వారి రాయల్ వెడ్డింగ్‌ను మరింత వైభోగంగా మార్చాయి. విరోష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టించాయి.కర్ణాటకకు చెందిన మందన్న కొడవ వంశం, దేవరకొండ తెలుగు మూలాల సంప్రదాయాలను గౌరవిస్తూ రాయల్ లుక్‌లో అదరగొట్టారు. ఈ జంట దక్షిణ భారత సాంప్రదాయ వివాహ దుస్తులు , పురాతన ఆలయ ఆభరణాలతో స్వర్గం నుండి దిగివచ్చిన దేవతల్లా కనిపించారు. విరోష్ వివాహంలో వధూవరుల ఆభరణాలు, ముఖ్యంగా విజయ్ దేవర కొండ ధరించిన చెవి రింగ్స్, సాంప్రదాయ హరామ్‌లు, స్టేట్మెంట్ ఝుమ్కాలు, జడ బిల్లా, చంపసరాలు, హత్ఫూల్, మఠపట్టి, ముక్కు పిన్, గాజులు, బాజుబంద్, నడుము బెల్ట్, చోకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హై-రిలీఫ్ నక్షి పని , క్లిష్టమైన రావ గ్రాన్యులేషన్ లాంటి మాస్టర్ ఆర్టిస్టులచే చేతితో రూపుదిద్దుకున్నాయని ఆభరణాల నిపుణులు పేర్కొన్నారు. ఈ వివాహ ఆభరణాలను ఒక బలమైన థీమ్‌తో రూపొందించారట. విజయ్ను ఒక శక్తివంతమైన రాజుగా, రష్మికను ఒక దేవతగా ప్రతిబింబించేలా ఈ డిజైన్లు శ్రీ జ్యువెలర్స్ (Shree Jewellers) తీర్చిదిద్దింది.పది నెలల కష్టం.. కిలోల కొద్దీ బంగార అద్భుత సృష్టిన్యూస్ 18 కథనం ప్రకారం, శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్ , కౌశిక్ కుమార్ ఈ జంటతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. విరోష్ జీవితంలో ఒక ముఖ్యమైన వేడుకలో తాము భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ ఆభరణాల తయారీకి సంబంధించి ఆలోచన మొదలు , చివరి రూపం తీసుకొచ్చేవరకు సుమారు పది నెలల సమయం పట్టింది. ఇందులో క్రియేటివ్ చర్చలు, కస్టమైజేషన్, మేకింగ్ , స్టైలింగ్ వంటి అనేక దశలు ఉన్నాయి. దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతులైన రావా గ్రాన్యులేషన్ (Rava granulation) దీప్ నక్షి (Deep Nakshi)తో ఈ కళాఖండాలను రూపొందించారు.దేవతలా రష్మిక మందన్నవివాహ వేడుకలో రష్మిక 11 రకాల ప్రత్యేక ఆభరణాలతో మెరిసిపోయింది.దక్షిణ భారత దేవాలయ శిల్పాల నుండి స్ఫూర్తి పొంది, అనుభవజ్ఞులైన కళాకారుల నక్షి పనితనం,యాంటిక్ మ్యాట్ పాలిష్ (Antique matte polish) ఆభరణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. లేయర్డ్ చోకర్, సాంప్రదాయ హారాలు, జుంకాలు, జడ బిళ్ళ, చెంపసరాలు, హాత్ ఫూల్, మఠాపట్టి, ముక్కు పుడక, గాజులు, బాజుబంద్ (వంకీ), వడ్డాణం , పట్టీలు ఈ సెట్లో ఉన్నాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, తరతరాలకు గుర్తుండిపోయే వారసత్వ ఆభరణాలుగా (Heirloom pieces) నిలిచిపోయేలా రూపొందించబడ్డాయి.విజయ్ దేవరకొండ అలంకరణ: సాధారణంగా భారతీయ వివాహాల్లో వరుడి ఆభరణాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ విజయ్ దేవరకొండ ట్రెండ్‌కు భిన్నంగా పెద్ద చెవిపోగులు, మణికట్టు కఫ్, ఉంగరం రెండు నెక్లెస్‌లు, కాళ్లకు కడియాలు, నడుము ఆభరణాలతో పురుషుల వెడ్డింగ్ జ్యువెలరీకి విజయ్ కొత్త మార్క్‌ను క్రియేట్ చేశారు. డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన రస్ట్ ఆరెంజ్ చీరను ధరించగా, విజయ్ దేవరకొండ ఐవరీ ధోతీ , ఎరుపు రంగు అంగవస్త్రంతో కళకళలాడుతూ అలరించారు. -
రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్, రష్మిక పెళ్లి ఫోటో..
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో ఒక్కటయ్యారు. విరోష్ పేరుతో తమ ఫ్యాన్స్ కోసం వారు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే, తమ అభిమానులు ఈ జంటపై ప్రేమతో పాటు శుభాకాంక్షలు కురిపించారు. పెళ్లి ఫోటోలు సోషల్‌మీడియాలో సంచలనంగా మారాయి. మిలియన్ల కొద్ది లైక్స్‌తో రికార్డ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్లో వీరి పెళ్లి ఫోటోకు అత్యధికంగా లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా గతంలో వారు కూడా ఫోటోలు పంచుకున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ తమ పెళ్లి సమయంలో ఫోటోలు షేర్ చేస్తే 15.8 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డ్. కానీ, తాజాగా విరోష్ జోడీ 18.5 మిలియన్ల లైక్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ కూడా అవే ఫోటోలను షేర్ చేశారు. అక్కడ కూడా 15.2 మిలియన్ల లైక్స్ రావడం విశేషం. మరోసారి విజయ్- రష్మిక జోడీ తమ ఇమేజ్ను చిత్రపరిశ్రమకు చూపారని ఫ్యాన్స్ అంటున్నారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సీవాలా’ విజయం తర్వాత మరోసారి విజయ్‌తో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది సెప్టెంబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!
టాలీవుడ్ సెలబ్రిటీ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి26, 2026న గురువారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయపూర్ వెలుపల 50 కి.మీ దూరంలో ఉన్న అద్భుతమైన ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహం జరిగింది. అయితే వీరిద్దరు తమ పెళ్లిలో ఎంచుకున్న కాస్ట్యూమ్స్ మొత్తం సాంస్కృతిక వారసత్వానికి అర్థం పట్టేలా ఎంచుకున్నారు. ఆధునికతను జోడిస్తూ..సాంప్రదాయ విలువలకు అనుగుణంగా తీర్చిద్దిన డిజైనర్ వేర్లో ముగ్ధమనోహరంగా మెరిశారు. అయితే పెళ్లిలో దాంపత్య విలువను తెలియజేసే పెళ్లి మంత్రాల మాదిరిగా తాను ధరించిన చీరలో సైతం దాన్ని ప్రదర్శించింది రష్మిక. అది ఆ వేడుకనే నిశబ్దంగా హైలెట్ చేసింది. ఇక్కడ రష్మిక ధరించిన ముసుగుపై ఉన్న మూడు శక్తిమంతమైన పదాలు వైవాహిక బంధం గొప్పతనం తెలియజేసేలా చాలాచక్కగా పొందుపరిచారు. ఇంతకీ అక్కడ ఏమని రాశారంటే..రష్మిక పెళ్లివేడుకలో లేత ఎరుపు గోల్డ్ అంచు చీరలో మెరిశారు. మొత్తం చీరపై ఆలయ ప్రేరేపిత ఎంబ్రాయిడరీలు, తోరణాలు, స్థంబాలు, పవిత్రమైన మోటీఫ్‌లతో చాలా వివరణాత్మకంగా తీర్చిదిద్దారు. వాటిలో హైదరాబాద్ చారిత్రాత్మక వాస్తుశిల్పం నుంచి గర్భగుడులు, ఆధ్యాత్మికతకు సంబంధించి.. ఆలయ గృహనమునాలతో ఎంబ్రాయిడరీ చేశారు. బంగారు జరీ వర్క్‌తో డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా బ్లౌజ్ సైతం బంగారు థ్రెడ్‌వర్క్‌తో చక్కటి ఎంబ్రాయిడరీతో హుందాగా ఉంది. దానికి రాయల్టీ లుక్క్ఇచ్చేలా ధరించిన బంగారు మేలి ముసుగు అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. చూపురులను ఆ ముసుగు బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దానిపై ఉన్న బంగారు ఎంబ్రాయిడరీతో రాసిన ఆ " ప్రతి జీవితకాలంలో" అనే పద బంధం అందర్నీ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. అంటే.. జీవితాంతం ఒకరికొకరు మనం వేరు కాదు, ఇది జన్మజన్మల బంధం అని చెబుతూ భావోద్వేగంగా అందరి హృదయాలను తాకింది. వైవాహిక జీవిత గొప్పదనాన్ని ఈ చిన్న పద బంధంతో చాలా అద్భుతంగా హైలెట్ చేసి చెప్పారు. ఒకరకంగా ఇది ఆ డిజైనర్ నైపుణ్యాన్ని నొక్కి చెప్పింది కూడా. ఇక రష్మిక అందుకు తగ్గట్టు ధరించిన ఆభరణాలు గజిబిజి కాకుండా చాలా చక్కగా పెట్టిన తీరు చాలా బాగుంది. నెక్లైన్ నుంచి లేయర్డ్ ఆభరణాలు, చోకర్లు ఆ చీర లుక్‌ని మరింత హైలెట్ చేశాయి.అలాగే తలపై ధరించిన పాపిడి బొట్టు సైతం చెదరకుండా చక్కగా అమర్చారు. రష్మిక మొత్తం ఆహార్యం దివి నుంచి భువికి వచ్చిన దేవ కన్యలా అబ్బురపరిచింది. ఇక హీరో విజయ్ దేవరకొండ అనామిక ఖన్నా డిజైనర్ వేర్ ఐవరీ ధోతీ సిల్హౌట్ ధరించి అద్భుతమైన వెర్మిలియన్ అంగవస్త్రంతో రాజకుమారుడిలా కనిపించారు. ఆయన ధరించి ధోతి హైదరాబాద్ వారసత్వం వనసింగారం నేత, దానిపై అడవి, ఆలయ మూలాంశాలతో కూడిన ఎంబ్రాయిడరీ మన సాంస్కృతిక వారసత్వ శక్తిని హైలెట్ చేశాయి.(చదవండి: నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..) -
ప్రధాని మోదీని కలిసిన 'విరోష్' జోడీ
-
మండపంలో విరోష్ ఆనందభాష్పాలు.. కల్యాణి పోస్ట్
గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.ఇది నా అదృష్టంవారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.ఆనంద భాష్పాలుఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్‌కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇద్దరూ ఎంత చదువుకున్నారంటే? -
పెళ్లి తర్వాత మోదీ, అమిత్ షాలను కలిసిన 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే ‘విరోష్’ జోడీ పేరుతో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిన్న ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన విషయం తెలసిందే. అయితే, మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను విజయ్, రష్మిక ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నూతన దంపతులు కలిసి అహ్వానం అందించారు. ఇప్పటికే వారిద్దరికీ శుభాంకాక్షలు చెబుతూ మోదీ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగునుంది. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ సినీ వ్యాపారవేత్తలను విజయ్, రష్మిక ఆహ్వానించారు.‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. -
నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..!
నటి రష్మిక మందన్న పెళ్లి గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో, సాయంకాలం కొడగు (కూర్గి) సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరిగింది. తన సంప్రదాయ మూలాలను మర్చిపోకుండా కొడగు స్టైల్ కట్టును వివిధ సందర్భాలలో ధరించడం మనం చూశాం. వివాహం, ఇతర వేడుకలలో కొడగు సంప్రదాయ చీరకట్టుదే ప్రత్యేక ఆకర్షణ.రష్మిక వివాహ వేడుక సందర్భంగా కొడగు చీరకట్టు ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశ సంప్రదాయ డ్రేపింగ్ శైలిలో విలక్షణంగా కనిపించే కొడగు కట్టును రీ క్రియేషన్ చేసి, బాలీవుడ్ క్లాసిక్ సినిమాలలోనూ కనువిందు చేశారు తారలు. కొడగు స్టైల్ డ్రేప్ ట్రెండ్ గురించి..కర్నాటకలోని కొడగు జిల్లాలో మగువల చీరకట్టులో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ శారీ డ్రేపింగ్. కొండ ప్రాంతంలో పుట్టిన సంప్రదాయ శైలి ఇది. కొడగు లేదా కొడవ లేదా కూర్గి అని పిలిచే కమ్యూనిటీలోని వివాహ సమయంలో అక్కడి వధువు జరీ అంచుతో ఉన్న పట్టు చీరను వారి సంప్రదాయ శైలిలో ధరిస్తుంది. ఇది కేవలం ఒక శైలి కాదు ఒక తరం నుండి మరొక తరానికి అందివస్తున్న వారసత్వం. ఈ చీరకట్టు కొడవ మహిళల బలం, అందం, స్వాతంత్య్రాన్ని ప్రతిబింబింపజేస్తుంది. వేడుకలలో సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగులలో .. జరీ అంచుతో ఉండే కాంతిమంతమైన పట్టు చీరలను ఎంచుకుంటారు. ఇవి శుభాన్ని, శ్రేయస్సును తీసుకువస్తాయని వారి నమ్మకం.నడుము వద్ద చీరను పెట్టికోట్ లోపలికి టక్ చేస్తారు. సాధారణ చీరకట్టుకు భిన్నంగా ముందు వైపు కాకుండా కూర్గి శారీ డ్రేప్కు వెనకవైపు కుచ్చిళ్లు పెడతారు.చీరను రెండుసార్లు శరీరం చుట్టూ తిప్పుతూ, చీర పల్లూ ఛాతీ మీదుగా ఎడమ భుజం కింద నుంచి, కుడి భుజం పై నుంచి ముందుకు తీస్తారు.కుడి భుజం నుంచి తీసిన పల్లూని బ్లౌజ్‌తో కలిపి పిన్‌తో అటాచ్ చేస్తారు. పల్లూ అలంకరణ కొంత వరకు బెంగాలీ స్టైల్‌ను పోలి ఉంటుంది. కొడవ సంప్రదాయ ఆభరణాలలో చంద్రవంక, నాగాభరణం.. వంటి పొడవాటి హారాలతోపాటు ఇతర సంప్రదాయ నగలను అలంకరించుకుంటారు.కొడవ యువతులు షిఫాన్, జార్జెట్, ఆర్గంజా చీరలతో డ్రేపింగ్‌లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తారు.యువతుల కోసం రెడీమేడ్ కొడవ కట్టు శారీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక ఆకర్షణతో ఉండే బెల్టులు, బ్రోచ్లు ఈ కట్టుకు ఇప్పుడు ఫ్యూజన్ ట్విస్ట్‌ను తీసుకువస్తున్నాయి. View this post on Instagram A post shared by राशि रमा शर्मा (@_wearyourstory__) (చదవండి: ఆ పాదాలకు నమస్కారం..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..) -
నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు నా వైఫ్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
-
పెళ్లి వేళ.. రష్మిక, విజయ్ విద్యార్హతలు వైరల్.. ఎవరెంత చదువుకున్నారు?
టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక భార్యభర్తలయ్యారు. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి ఫోటోలను అటు రష్మిక, ఇటు విజయ్ ఒకేసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో రష్మిక, విజయ్‌లకు సంబంధించిన మరో విషయంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు? వీళ్ల ఎడ్యుకేషన్ ఎలా సాగింది? తదితర వివరాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.విజయ్ ఏం చదువుకున్నాడు?విజయ్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోనే సాగింది. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో బోర్డింగ్ విద్యార్థిగా తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న విజయ్, అబిడ్స్‌లోని భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి బీకాం (B.Com) డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువు ఆపేసి.. ప్యాషన్ వైపు అడుగులు వేశాడు. థియేటర్ ఆర్ట్స్ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు.చదువులోనూ రష్మిక ‘స్టారే’రష్మిక నటిగానే కాకుండా చదవులోనూ ‘స్టార్’గానే కొనసాగింది. ఆమె పాఠశాల విద్య మొత్తం కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్లిన రష్మిక, అక్కడ ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. కేవలం ఒకే సబ్జెక్టులో కాకుండా, రష్మిక సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో ట్రిపుల్ మేజర్ డిగ్రీని పూర్తి చేయడం గమనార్హం.మొత్తంగా విజయ్, రష్మిక ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ.. డిగ్రీల పరంగా చూస్తే మాత్రం విజయ్ కంటే రష్మికనే కాస్త ముందంజలో ఉంది. ఆమె సైకాలజీ, జర్నలిజం లాంటి కీలక రంగాలలో డిగ్రీ పట్టాపొందింది. -
వైభవంగా... ఆహ్లాదకరంగా విరోష్ వివాహం
‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి, ఫిబ్రవరి 26న ‘విరోష్’ (ఫ్యాన్స్ ఈ ఇద్దర్నీ అలానే పిలుస్తారు. తమ వివాహ వేడుకకు ఆ పేరునే పెట్టారు విజయ్–రష్మిక) భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది.ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసి, ఒకరిపట్ల మరొకరికి ఉన్న మమకారాన్ని, నమ్మకాన్ని, ఇష్టాన్ని పంచుకున్నారు.ప్రాణ స్నేహితురాల్ని భార్యను చేసుకున్నాను: విజయ్ ‘‘ఒక రోజు ఆమెను నేను మిస్ అయ్యాను... ఆమె పక్కన ఉండి ఉంటే ఈరోజు ఇంకా బాగుండేది కదా అన్నంతగా ఆమెని మిస్ అయ్యాను. ఒకవేళ ఆమె నా పక్కన కూర్చుని ఉంటే.. నా భోజనం ఇంకా పరిపూర్ణంగా అనిపించేది కదా అనిపించింది... అలాగే నాతో కలిసి ఆమె వర్కవుట్స్ చేస్తే అది పనిష్మెంట్లా కాకుండా ఫన్‌లా ఉండేది అనిపించింది. నా జీవితానికి ఆమె అవసరం అనిపించింది. నేను ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్న అనుభూతిని, ప్రశాంతతను ఇచ్చే ‘ఇల్లు’ అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నేను నా ప్రాణ స్నేహితురాల్ని నా భార్యను చేసుకున్నాను... 26.02.2026’’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) విజ్జూ... మాటలు సరిపోవడం లేదు: రష్మికహాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు ‘నా భర్త’ని పరిచయం చేస్తున్నాను! మిస్టర్ విజయ్ దేవరకొండ!! నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి. ప్రతి రోజూ పెద్ద కలలు కనడం మంచిదే అనీ, ఆ కలను సాకారం చేసుకునే సామర్థ్యం నీకు ఉందని చెప్పిన వ్యక్తి. ఎవరూ నన్ను చూడడంలేదనుకుంటూ నేను డ్యాన్స్ చేస్తుంటే నన్ను ఆపని వ్యక్తి. అలాగే స్నేహితులతో ప్రయాణం చేయడం ఎంత బాగుంటుందో చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి... ఈ వ్యక్తి గురించి ఓ పుస్తకం రాయొచ్చు. నేను ఎలాంటి స్త్రీగా ఉండాలని కలలు కన్నానో అలా ఉండేలా నువ్వు నన్ను మార్చావు.విజ్జూ... నీ గురించి ఎప్పుడు ఏం చెప్పాలన్నా నాకు మాటలు సరిపోవు. నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం... ఇవన్నీ హఠాత్తుగా నాకు అర్థవంతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నందుకు.... వీటన్నింటికీ సాక్ష్యంగా నువ్వు ఉన్నందుకు... నేను నీ భార్యను కావడం, నీ భార్యగా పిలవబడడం నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది పూర్తిగాపార్టీ టైమ్. మనిద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యు. -
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి... గెస్ట్ లిస్ట్ & గ్రాండ్ ఫుడ్ మెనూ
-
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్
-
ఒక రోజు రష్మికను చాలా మిస్ అయ్యా.. పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ విజయ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్‌స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్‌లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
ఇదిగో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు
-
'నా భర్తను పరిచయం చేస్తున్నా'.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
తన పెళ్లి ఫోటోలను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ మై లవ్స్.. తన భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి అని విజయ్ను కొనియాడింది. ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చూపించిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించింది. నా కలలు నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పిన ఏకైక వ్యక్తి అంటూ భర్త విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేసింది. ఇది చూసిన అభిమానులు రష్మిక-విజయ్ జంటకు అభినందనలు చెబుతున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నా. మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించిన వ్యక్తి. ప్రతిరోజు పెద్ద కలలు కనడం.. నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పగలిగే వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించడం నాకు చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యా.. ఎందుకంటే మీరు ఈ రోజు నాదిగా మార్చారు. ఈరోజు నన్ను నిజంగా ఆశీర్వదించారు. విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు!! నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నానంటూ' పోస్ట్ చేసింది.అంతేకాకుండా..'నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నీతో ఉన్నా. ఇది మన జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. మీ భార్యగా ఉండటానికి.. మీ భార్యగా పిలవడానికి.. ఇప్పుడిది పూర్తిగా పార్టీ సమయం. మనిద్దరం కలిసి ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.'ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్..టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
గ్రాండ్‌గా విరోష్ పెళ్లి.. విజయ్ దేవరకొండకు భారీ కట్నకానుకలు?
టాలీవుడ్ పవర్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నడుస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లి ఈ రోజు(ఫిబ్రవరి 26) ఉదయం ఉదయపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కట్న, కానులకు సంబంధించి పలు గాసిప్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రష్మిక నుంచి భారీ కట్నం తీసుకుంటున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ నిజమా? లేక ఓవర్ హైప్‌నా?విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లింకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సీక్రెట్ ఎంగేజ్మెంట్ జరిగిందని సోర్సెస్ చెబుతున్నాయి. కానీ ఇద్దరూ ఓపెన్‌గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెడ్డింగ్ హడావిడి బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ డీటైల్స్ నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్‌ను 'విరోష్ వెడ్డింగ్' అని పిలుస్తున్నారు . ఇక్కడ విరోష్ అంటే విజయ్ + రష్మిక = విరోష్ అని అర్ధం.ఇకపోతే వీళ్ళ పెళ్ళి వార్తల్లో మెయిన్ కాంట్రవర్సీ డౌరీ క్లెయిమ్స్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, రష్మిక సైడ్ నుంచి విజయ్‌కు భారీ డౌరీ ఇస్తున్నారని... గోల్డ్, లగ్జరీ ప్రాపర్టీలు, ఇండియాలో హై-ఎండ్ హోమ్స్, కార్లు, క్యాష్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో "150 కోట్ల డౌరీ" అని కూడా రాస్తున్నారు! ఇది 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' అని, టాలీవుడ్లో ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా జరగబోతోందని ట్రెండ్ అవుతోంది.కానీ ఈ క్లెయిమ్స్ ఎంత వరకు నిజం? చాలా ముఖ్యంగా – ఇవన్నీ *అన్‌వెరిఫైడ్* అలాగే *వైరల్ రూమర్స్* మాత్రమే! విజయ్ లేదా రష్మిక ఎవరూ ఈ డౌరీ గురించి కాదు కదా కనీసం వాళ్ళ పెళ్ళి గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డౌరీ అనేది చట్టవిరుద్ధం, ఈ రకమైన రూమర్స్ సెలబ్రిటీల చుట్టూ తరచూ వస్తాయి – కొన్ని ట్రోల్స్, కొన్ని ఫేక్ న్యూస్ కోసం. గతంలో కూడా ఫిబ్రవరి 2 లేదా ఇతర డేట్స్‌పై ఫేక్ వీడియోలు వచ్చాయి, కానీ అవి తప్పు అని తేలాయి.ఈ కట్నకానుకలతో పాటు ఇంకా కొన్ని హాట్ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వీళ్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 260 కోట్లు కూడా ఆఫర్ చేసిందని, కానీ విజయ్ రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు .ఎందుకంటే తమ వెడ్డింగ్ మెమరీస్ పర్సనల్ అని వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం తమకు ఇష్టంలేదని విజయ్ చెప్పాడట. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించి సెక్యూరిటీ టీమ్ 3 వారాలు ట్రైనింగ్ తీసుకుందని, స్టార్ గెస్ట్స్ లిస్ట్ భారీగా ఉందని కూడా లీక్ అయ్యాయి. అయితే పెళ్లి గురించి అయితే కొంతవరకు ఓకే కాసీ డౌరీ లాంటి సెన్సిటివ్ టాపిక్స్‌పై కూడా రూమర్స్ వ్యాప్తి చేయడం మంచిది కాదు. -
రష్మిక చూసిన మొదటి తెలుగు సినిమా.. మన స్టార్ హీరోదే..!
స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగింటి కోడలిగా మెట్టినింట అడుగుపెట్టనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కర్ణాటకకు చెందిన రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు విజయ్‌తో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ ఈ రోజే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వీరి పెళ్లి వేదికగా నిలిచింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.అియితే రష్మిక మందన్నా తెలుగింటి కోడలిగా రానున్న తరుణంలో గత ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీకిష్టమైన తెలుగు సినిమా ఏది? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి రష్మిక సమాధానమిచ్చింది.తాను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా మహేశ్ బాబు నటించిన బిజినెస్మెన్ అని తెలిపింది. నాన్నతో పాటు వెళ్లి బిజినెస్మెన్ థియేటర్లో చూశానని రష్మిక పంచుకుంది. నా కెరీర్ కాకుండా తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. “First Telugu movie I watched was #Businessman. I went to theatre with my father” - #RashmikaMandanna 🔥#MaheshBabu | #Varanasi pic.twitter.com/4d1xb3PWK2— VardhanDHFM (@_VardhanDHFM_) February 26, 2026 -
విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..!
ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TFNExclusive A 'Sweet' gesture!❣️Team #VIROSH share joy with the media at Udaipur!!🤩✨#VijayDeverakonda #RashmikaMandanna #TeluguFilmNagar pic.twitter.com/6PryBXwsEp— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2026 -
విజయ్ దేవరకొండకు రష్మిక ఎంత కట్నం ఇస్తుందో తెలుసా?
-
కొడవ సంప్రదాయంలో ‘విరోష్’ వివాహం.. పెళ్లి ప్రత్యేకతలు ఇవే!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడుమూళ్లు వేశాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ ఈ పెళ్లికి వేదికగా మారింది. ఈ రోజు సాయంత్రం మరోసారి రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు. తొలుత తెలుగు హిందూ పద్దతిలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రష్మిక కుటుంబ మూలలను గౌరవిస్తూ కొడవ సంప్రదాయంలో వివాహం చేసుకోబోతున్నారు.కొడవ పెళ్లి ఎలా జరుగుతుంది?రష్మికది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన కొడవ సామాజిక వర్గం. అక్కడి వారి పెళ్లి సంప్రదాయ భారతీయ వివాహాలన్నింటిలోకి చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి తంతుని వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. ఈ పెళ్లిళ్లలో హిందూ సంప్రదాయాల్లో కనిపించే పురోహితులు (బ్రాహ్మణులు), అగ్ని సాక్షి (హోమం) వంటివి ఉండవు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుందట.పెళ్లి రోజు ఉదయం వధూవరులు తమ తమ ఇళ్లలో అభ్యంగన స్నానం చేసి, సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు'కుప్య' (నల్లని కోటు), 'చేలే' (నడుముకు కట్టే పట్టీ) మరియు 'పీచే కత్తి' (చిన్న కత్తి) ధరిస్తాడు. పెళ్లి కూతురు వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కొడవ చీరను ధరిస్తుంది.పెళ్లి వేదిక వద్దకు వరుడు వచ్చే ముందు, అడ్డుగా ఉన్న అరటి చెట్టు కాండాలను నరకడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీక.వధూవరులు పెళ్లి పీటలపై కూర్చున్నప్పుడు, కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఎటువంటి మంత్రాలు ఉండవు. కేవలం పెద్దల దీవెనలే ప్రధానం. వధువుకి ఒడి బియ్యానికి బదులు ఒక చిన్న నాణేల మూట అందిస్తారట.ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతం.పెళ్లి తర్వాత వధువు తన అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు గంగా పూజ జరుగుతుంది. వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకుంటారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించే ఆహ్లాదకరమైన ఘట్టం ఇది. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా, కొడవ పెళ్లిళ్లలో మాంసాహారం (ముఖ్యంగా పంది మాంసం), మద్యం తప్పనిసరిగా వడ్డిస్తారు.కొడవ భాష మాట్లాడుతూ.. తన సంప్రదాయ బట్టల్లో రష్మిక#RashmikaMandana #Virosh #VijayDevarakonda pic.twitter.com/ZNNrxCCYgl— Milagro Movies (@MilagroMovies) February 26, 2026 -
ఇద్దరి మధ్య 16 ఏళ్ల గ్యాప్.. రష్మిక చెల్లి గురించి తెలుసా?
హీరోయిన్ రష్మిక ఎట్టకేలకు హీరో విజయ్ దేవరకొండని పెళ్లాడింది. ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయంలో ఏడడుగులు వేశారు. ఈ రోజు సాయంత్రం రష్మికకు చెందిన కొడవ పద్ధతిలోనూ వివాహం జరగనుంది. సరే ఈ విషయాలు కాసేపు పక్కనబెడితే విజయ్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు. కానీ రష్మిక విషయానికొస్తే ఈమె కుటుంబం గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. మరీ ముఖ్యంగా రష్మిక చిట్టి చెల్లెలు ఎవరు? ఈమెకు ఆమెకు 16 ఏళ్ల గ్యాప్ అని తెలుసా?రష్మిక విషయానికొస్తే.. కర్ణాటకలోని విరాజీపేటలో 1995లో పుట్టింది. తండ్రి మదన్‌కి స్థానికంగా ఓ కాఫీ ఎస్టేట్, ఫంక్షన్ హాల్ ఉంది. తల్లి సుమన్ హౌస్ వైఫ్. రష్మికతో పాటు వీళ్లకు మరో కూతురు కూడా ఉంది. పేరు షిమన్. ఈ పాపకు ఇప్పుడు 14 ఏళ్లు. అంటే రష్మిక కంటే 16 ఏళ్లు చిన్నది. ప్రస్తుతం స్కూలింగ్ చేస్తోంది. ఇంతలా వయసు వ్యత్యాసం వల్ల షిమన్‌ని చెల్లిలా కంటే కూతురిలా చూసుకుంటున్నాని రష్మిక గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: #Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక)రష్మిక కాస్త పెద్దయ్యాక షిమన్ పుట్టింది. దీంతో తన చిట్టి చెల్లిల్ని ఎంతో గారాబంగా చూసుకోవాలని రష్మిక అనుకుంది. కానీ నటిగా మారి వరస సినిమాలు చేయడం వల్ల చెల్లితో గడపడమే రష్మికకు చాలా కష్టమైపోయింది. షిమన్‌ని చాలా మిస్ అవుతున్నాననే విషయాన్ని ఏ మాత్రం దాచుకోలేదు. చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని రష్మిక బయటపెట్టింది కూడా. ఇండస్ట్రీలోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా ఆమెతో(చెల్లి) ఉండలేకపోతున్నాను. పెరిగి పెద్దవడాన్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు నా అంత ఎత్తు ఎదిగిపోయింది. ఒక్కోసారి తనని కలవలేకపోతున్నానని ఏడ్చేసేదాన్ని అని రష్మిక చెప్పుకొచ్చింది.రష్మిక ఇంతలా పాన్ ఇండియా స్టారడమ్ అనుభవిస్తున్నప్పటికీ.. తన కుటుంబాన్ని ఎప్పుడు పెద్దగా మీడియా కంటపడనివ్వలేదు. ఈమె తల్లిదండ్రులు కూడా షిమన్‌ని సాధారణ పిల్లల్లానే పెంచాలనుకున్నారు. అందుకే తల్లిదండ్రులతో కలిసి షిమన్.. మైసూరులో ఉండగా.. రష్మిక మాత్రం వరస సినిమాలతో హైదరాబాద్, ముంబైకి తిరుగుతూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఇంట్లో వాలిపోయి చెల్లితో సరదాగా ఆడుకుంటుంది. ఆ ఫొటోల్ని కూడా పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!) -
విజయ్-రష్మిక పెళ్లి.. ప్రధాని స్పెషల్ విషెస్
-
Rashmika Mandanna: నా కాబోయే భర్త అలానే ఉండాలి..!
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు చాలాకాలం ప్రేమలో ఉన్నారు. అయితే ఆ విషయం బయటకు చెప్పకపోవడంతో.. ఈ ఇద్దరూ ఎక్కడ కనిపించినా.. రకరకాల పుకార్లు, గాసిప్స్ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం వాటిన్నింటికీ చెక్పెట్టేస్తూ..ఈ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకోనుంది ఈ జంట. ఇంకొన్ని గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటికానుకున్న నేపథ్యంలో రష్మిక మందన్న తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికరంగా చెప్పారు. అవేంటో ఈ సందర్భంగా చూద్దామా..!ప్రతి అమ్మాయి పెళ్లి విషయంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అంచనాలు, ఆకాంక్షలు ఉంటాయి. అది సహజం. ఇక్కడ నటి మదన్న కూడా అలానే భావించారు. ఈ ముద్దుగుమ్మ సైతం సగటు అమ్మాయిలా..తన కాబోయే వాడు అలానే ఉండాలని అలా ఉంటేనే అతడిని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. ఇంతకీ ఆమె తన భాగస్వామి ఎలా ఉండాలందంటే..ప్రేమలో దయ, గౌరవం ఉంటేనే ఆ బంధం నిలబడుతుందని అంటోంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో సహచరుడు తప్పక ఉండాలి. కాబట్టి ఆ అమ్మాయికి తన కాబోయే జీవిత భాగస్వామి చాలా స్పెషల్‌గా ఉండాలి. ఏవిధంగా అంటే..ఆ అమ్మాయి ప్రతి బాధ, కష్టం, ఆనందంలోనూ తన పక్కనే ఉండాలి . ఆ భాగస్వామిని చూడగానే ఎలాంటి ఒడిదుడుకులనైనా ఇట్టే ఎదుర్కొనగలను అనే ధైర్యం, నమ్మకం కలగించేలా ఉండాలి.అతడే ఆమెకు ఓదార్పు, భద్రత, సానుభూతి.. అన్ని అవ్వాలి. అవే ఏ అమ్మాయైనా తన కాబోయే భర్తలో కోరుకునేది. అలాంటి వ్యక్తి లభిస్తే ఏ అమ్మాయి అయినా..అదృష్టవంతురాలే అంటూ తన కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చాలా చక్కగా వివరించింది రష్మిక. అంతేగాదు ఏ సంబంధంలోనైనా ఒకరినొకరు గౌరవించుకుంటున్నప్పుడు, శ్రద్ధ వహిస్తున్నప్పుడు, బాధ్యత వహిస్తున్నప్పుడు..ఆ బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని అంటోంది. చివరగా..ఇలాంటి లక్షణాలే తన భర్తలో ఉండాలని కోరుకుంటానని నవ్వుతూ చెప్పింది రష్మిక. మరి అలాంటి లక్షణాలే విజయ్‌లో ఉన్నాయి కాబోలు..అందుకే ఈ క్రేజీ బోయ్తో ఇంకొన్ని గంటల్లో ఏడుగుగులు వేసి..కొత్త జీవితాన్ని ఆరభించనుంది ఈ బ్యూటీ. కాగా, విజయ్ రష్మికలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి 50 కి.మీ దూరంలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ మెమెంటోస్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకోనున్నారు.(చదవండి: ట్రెండీగా 'కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా' ..! ఫ్యాషన్‌ని ఇలా కూడా చూపించొచ్చా..) -
తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారంటే?
తెలుగు హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్‌కి టాటా చెప్పేశాడు. హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. ఉదయ్‌పుర్ వేదికగా ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే విజయ్ వయసు 36 కాగా రష్మిక వయసు 29. ఈ సందర్భంగా తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరెప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారంటే?(ఇదీ చదవండి: ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్న 'బిగ్‌బాస్ 8' విజేత నిఖిల్)చిరంజీవి కొడుకు రామ్ చరణ్.. 27 ఏళ్లకే ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలు, ఓ బాబు ఉన్నాడు.ఎన్టీఆర్ తన 28వ ఏట లక్ష్మీ ప్రణతిని వివాహమాడాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు.హీరో నాని కూడా తనకు 28 ఏళ్లున్నప్పుడే వైజాగ్‌కి చెందిన అంజనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.అల్లు అర్జున్ తన 29 ఏళ్లకు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమిది. వీళ్లకు ఓ బాబు, పాప ఉన్నారు.మహేశ్ బాబు కూడా తన 29 ఏటనే నమ్రతతో ఏడడుగులు వేశాడు. వీళ్లది ప్రేమ వివాహమే. ప్రస్తుతం ఓ కొడుకు, కూతురు ఉన్నారు.నాగచైతన్య 30 ఏళ్ల వయసులో సమంతని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. ఏడాదిన్నర క్రితం శోభితని పెళ్లాడాడు.మెగాహీరో వరుణ్ తేజ్ 33వ ఏట హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహమాడాడు. ఇది ప్రేమ వివాహం. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.హీరో నిఖిల్.. తనకు 34 ఏళ్లున్నప్పుడు పల్లవి వర్మ అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.రానా తన 35వ ఏట మిహీక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.విజయ్ దేవరకొండ 36 ఏళ్ల వయసులో ఇప్పుడు రష్మికని పెళ్లి చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఒక్కటయ్యారు.హీరో నితిన్ 37 ఏళ్లకు షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు కూడా ఓ కొడుకు పుట్టాడు.హీరో శర్వానంద్ అయితే 38 ఏళ్లకు రక్షితా రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఓ కూతురు ఉంది.ఇంతమంది హీరోలు పెళ్లిచేసుకుంటున్నారు గానీ ప్రభాస్ మాత్రం 47 ఏళ్లొచ్చినా ఇప్పటికే సింగిల్‌గానే ఉండిపోయాడు. పెళ్లి చేసుకుంటాడో లేదో?(ఇదీ చదవండి: #Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్) -
#Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక
హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఉదయం 10:10 గంటలకు కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల నడుమ వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. ఇదే రోజు సాయంత్రం 4 గంటలకు కన్నడ(కొడవ) సంప్రదాయంలోనూ విజయ్-రష్మిక పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లిలో నో ఫేన్ నిబంధన కారణంగా ఫొటోలు ఇంకేం బయటకు రాలేదు. అధికారికంగా విజయ్-రష్మిక వాటిని పోస్ట్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాలు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. గీతగోవిందం మూవీలో తనతో పాటు కలిసి నటించిన రష్మికనే ఇప్పుడు విజయ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ డియర్ కామ్రేడ్ అనే మూవీ కూడా చేశారు. ప్రస్తుతం 'రణబాలి'లో చాన్నాళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.రష్మిక విషయానికొస్తే కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. 'పుష్ప' దెబ్బకు ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో వరస సినిమాలు చేస్తూ రష్మిక బిజీగా ఉంది.విజయ్-రష్మిక చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ తమ బంధాన్ని అస్సలు బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు డేటింగ్, ట్రిప్స్ గురించి ఎప్పటికప్పుడు ఫొటోలు బయటకొస్తూనే ఉండేవి. ఇప్పుడు పెళ్లి బంధంతో దాన్ని అధికారికం చేసేశారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)
-
#Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ రష్మిక పెళ్లికి అంతా సిద్ధం. ఈరోజు(ఫిబ్రవరి 26) ఉదయం 10:10 గంటలకు విజయ్ మూడు మూళ్లు వేయనున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో మెమొంటోస్ హోటల్.. ఈ వివాహానికి వేదిక. ఇప్పటికే బారాత్ మొదలైపోయింది. ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరగనుండగా.. సాయంత్రం 4 గంటల తర్వాత (కొడవ) కన్నడ సంప్రదాయంలో మరోసారి వివాహ తంతు జరగనుంది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)ఇకపోతే బుధవారం సాయంత్రం హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా.. వేడుకకు వచ్చిన అతిధులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా వెళ్లింది. హల్దీకి సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది హల్దీ కాదని ముందే హోలీ వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఇదే పెళ్లి కోసం హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫొటో చూస్తే.. ఈమె కూడా హల్దీ వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది.ఇదే పెళ్లి కోసం డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, టాలీవుడ్ స్టైలిష్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు ఇప్పటికే ఉదయ్‌పుర్ చేరుకున్నారు. ఈ రోజు గానీ రేపు గానీ వాళ్లు కూడా సోషల్ మీడియాలో కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడతారు. ఫొటోలు కూడా రిలీజ్ చేయడం గ్యారంటీ. అలానే మార్చి 4న హైదారాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
ఉదయపూర్ లో విరోష్ పెళ్లి హంగామా
-
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్‌లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్‌లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కొన్నేళ్లుగా ఎక్కడా బయటపడుకుండా రిలేషన్‌లోన్న విజయ్- రష్మిక ఈనెల 26న పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.అయితే సెలబ్రిటీల పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతారు. గతంలో విరాట్- అనుష్క, దీపిక-రణ్వీర్ సింగ్ సైతం తమ పెళ్లికి అత్యంత సీక్రెట్‌గా జరుపుకున్నారు. దీనికోసం నో మొబైల్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఇప్పుడదే బాటలో రష్మిక- విజయ్ జంట కూడా పెళ్లి వేడుకను జరుపుకుంటోంది. స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ పద్ధతి ఓ అందమైన పేరు కూడా ఉంది. ఈ నో మొబైల్ పాలసీ సంప్రదాయాన్ని అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తారు.అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే..?అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా తమ మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. ఎవరు కూడా ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టడానికి వీలుండదు. అంతే కాకుండా ముందువరుసలో కూర్చొని ఫోన్లలో పెళ్లి ఫోటోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. పెళ్లికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ఆ జంట షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో కనిపించవు. ఈ పద్ధతినే అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నారు. లైఫ్‌లో చాలా ముఖ్యమైన ఈ క్షణాలను అత్యంత ప్రైవసీగా నిర్వహించాలనేది సెలబ్రిటీ వధూవరుల కోరిక. వారు మాత్రమే ఫస్ట్ ఈ వేడుక పిక్స్ పంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది.ఈ వెడ్డింగ్ ప్రైవసీ అన్ప్లగ్డ్ ట్రెండ్ అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మొదటిసారి వైరలైంది. ఆ తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణ్వీర్ సింగ్ కూడా నో ఫోన్ పాలసీని అమలు చేశారు. అంతేకాకుడా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినాకైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ సైతం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. తాజాగా విరోష్ పెళ్లిలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. -
రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!
సినిమాలు, పనులు ఎప్పుడూ ఉండేవే.. కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. కల్యాణం వచ్చినా ఆగదు, కక్కొచ్చినా ఆగదన్నట్లు ఆ శుభఘడియలు ముంచుకొచ్చాక ఎవరూ దాన్ని వాయిదా వేయలేరు. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా విషయంలో ఇదే జరుగుతోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ దాన్ని బయటకు చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు.ఇప్పుడు ఆ ఆటకు ముగింపు పలుకుతూ భార్యాభర్తలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 26న విరోష్ (విజయ్- రష్మిక) పెళ్లి జరగనుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో విజయ్ తల్లి మాధవి.. వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు బహుకరించి తన ప్రేమను చాటుకున్నట్లుృ తెలుస్తోంది. మరి విరోష్ లవ్ స్టోరీ ఎప్పుడు? ఎలా? మొదలైందో ఓసారి చూసేద్దాం..2018లోనే పెళ్లిగీత గోవిందం.. 2018లో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి విజయ్- రష్మిక జంటగా నటించారు. ఆన్ స్క్రీన్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇలా పెళ్లి సీన్లో నటించడం రష్మికకు మూడోసారి కానీ విజయ్‌కు మాత్రం అదే తొలిసారి కావడం విశేషం! ఈ చిత్రంతోనే వీరి మధ్య పరిచయం మొదలైంది. డియర్ కామ్రేడ్ మూవీతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అందుకే ఈ మూవీ తమకెంతో స్పెషల్ అంటుంటారు. కానీ ప్రేమలో ఉన్నామని మాత్రం నేరుగా ఎన్నడూ చెప్పలేదు. అందరి ముందు..కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు కూడా జంటగా ఫోటోలు షేర్ చేసిందీ లేదు. అయితే ఇద్దరూ కలిసే ఉన్నట్లుగా హింట్లు మాత్రం వదిలేవారు. పుష్ప సినిమా సమయంలో విజయ్ను డార్లింగ్ ఫ్రెండ్ అని అభివర్ణించింది రష్. ఇంటర్వ్యూలలో కూడా అతడు తన ఫేవరెట్ అని వెల్లడించింది. ది గర్ల్‌ఫ్రెండ్ ఈవెంట్లో తొలిసారి విజయ్.. అందరిముందు రష్మిక చేయిని ముద్దాడాడు. దీంతో ఆమె సిగ్గుల మొగ్గయింది.ఆ ఒక్క మాటతో..జయాపజయాల్లోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. పలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ తర్వాత విజయ్.. కింగ్డమ్తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చిన్నపిల్లలా సంబరపడిపోయింది నేషనల్ క్రష్. మనం హిట్ కొట్టాం అని మురిసిపోయింది. తన ప్రేమ విజయ్ దగ్గరే ఆగిపోలేదు, అతడి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్స్‌కు వెళ్లేందుకు ఏనాడూ నో చెప్పలేదు. అటు విజయ్ తల్లితోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తనకు అమ్మ తర్వాత అమ్మతో సమానం అన్నప్పుడే ఆమె తెలుగింటి కోడలైపోయింది.పెళ్లి పత్రికలోనూ..విజయ్- రష్మికల ప్రేమను చూసిన అభిమానులు వీరికి విరోష్ (#Viorsh) అనే ట్యాగ్ ఇచ్చారు. అలానే పిలవడం మొదలుపెట్టారు. అభిమానులు ఇచ్చిన విరోష్ అనే పేరు ఈ లవ్‌బర్డ్స్‌కు సైతం నచ్చడంతో పెళ్లి పత్రికలోనూ అదే పేరు అచ్చువేయించారు. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న ఈ విరోష్ జంటకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్!!చదవండి: పెళ్లి వేళ.. రష్మిక వ్యాఖ్యలు వైరల్ -
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)
-
ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్
Wedding of ViRosh నేషనల్ క్రష్, నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందడికి సంబంధించిన కబుర్లుఉ ఊపందుకున్నాయి.విరోష్ అంటూ తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వధూవరులతోపాటు, అతిరథమహారథులు ఈ వివాహ వేడుకకోసం ఉదయపూర్‌కు వెళ్లారు. తెలుగు, కొడవ ఇలా రెండు సంప్రాదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. తాజా నివేదికల ప్రకారం ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి.విజయ్ దేవరకొండ తల్లి రష్మిక మందన్నకు బహుమతిసంగీత వేడుకను మంగళవారం ఘనంగా జరిగింది. సరదాగా క్రికెట్ ఆడిన తర్వాత, ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో సంగీత నైట్ ఉత్సాహంగా నిర్వహించుకోగా, ఈ వేడుకలకు సంబంధించి ఒక భావోద్వేగ సంగతి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. సంగీత వేడుకలో విజయ్ తల్లి మాధవి దేవరకొండ కుటుంబ సంప్రదాయానికిఅనుగుణంగా రష్మికకు వారసత్వ గాజులను బహుకరించారట. తద్వారా తమ కుటుంబంలోకి కోడలిగా రష్మికను ప్రేమగా ఆహ్వానం పలికినట్టుగా భావిస్తున్నారు. సంగీత వేడుక నుండి లీక్ అయిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈరోజు హల్దీ వేడుకు జరగనుందివిరోష్ పెళ్లికి తరలివెళ్లిన అతిథులుమరోవైపు అనేక మంది అతిథులు ఇప్పటికే లేక్స్ నగరానికి చేరుకున్నారు. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్,నటి ఈషా రెబ్బాతోపాటు ఈ జంటకు సన్నిహితురాలైన స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా హాజరయ్యారు. అంతేకాదు రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ నటి ఆషికా రంగనాథ్ , దర్శకుడు-నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా వేడుకలకు తరలివెళ్లారు. కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా, ఆకాష్, శ్లోకా అంబానీలతో సహా అంబానీ కుటుబం కూడా ఉదయపూర్‌లో దిగినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్ కోసం హితులు, సన్నిహితులతోపాటు, స్టార్ లవ్‌బర్డ్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
విజయ్ & రష్మిక వెడ్డింగ్ విశేషాలు..
-
రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే
హీరోయిన్ రష్మిక పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. హీరో విజయ్ దేవరకొండతో ఉదయ్‌పుర్ వేదికగా ఏడడుగులు వేయనుంది. గతంలోనే రష్మిక.. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవాల్సింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి అతడి స్నేహితులకు రష్మిక అంటే ఎందుకో కోపం? తాజాగా రష్మిక పెళ్లికి పిలిచిందా అనే ప్రశ్న 'కాంతార' రిషభ్ శెట్టికి ఎదురైంది. మరి అతడేం సమాధానమిచ్చాడో తెలుసా?(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని)కర్ణాటకకు చెందిన రష్మిక.. రిషభ్ శెట్టి దర్శకత్వం వహించిన 'కిరిక్ పార్టీ' సినిమాతోనే హీరోయిన్ అయింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరో. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే రక్షిత్-రష్మిక ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో పెళ్లి రద్దయింది. అప్పటినుంచి రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టితోపాటు అతడి స్నేహితులు.. రష్మిక గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఇప్పుడు కూడా అదే జరిగింది.మంగళవారం ఉదయం మంత్రాలయంకి వచ్చిన రిషభ్ శెట్టి.. రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే.. రష్మిక మిమ్మల్ని తన పెళ్లికి పిలవలేదా? అని ఓ రిపోర్టర్ అడిగాడు. ప్రశ్న మధ్యలో ఉండగానే థ్యాంక్యూ అని చెబుతూ రిషభ్ శెట్టి అక్కడనుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రష్మిక పెళ్లి విషయానికొస్తే.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి చేసిన విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గురువారం ఉదయం పెళ్లి చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం రష్మిక కుటుంబానికి చెందిన కొడవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)#RishabShetty ignored #RashmikaMandanna’s marriage invitation questionpic.twitter.com/gwUFUpj9AC— cinee worldd (@Cinee_Worldd) February 25, 2026 -
విజయ్, రష్మిక సంగీత్ వీడియో వైరల్.. క్రికెట్ బ్యాట్‌పై పెళ్లి డేట్!
రష్మిక, విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలలో పెళ్లి సందడి మొదలైంది. మోహందీ, సంగీత్ సందడి కూడా జరిగిపోయింది. సంగీత్‌లో విజయ్, రష్మిక కలిసి నటించిన చిత్రాల్లోని క్యూట్ ఫోటోలతో కలర్పుల్గా డెకరేషన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో అధికారికంగా షేర్ చేయాలని కోరుతూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దీంతో పాటు సంగీత్‌లో ఇరుకుటుంబ సభ్యులు సరదగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ను కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. అందులో క్రికెట్ బ్యాట్, సిల్వర్ మెడల్‌పై ఫిబ్రవరి 26 అని రాసి పెళ్లిడేట్ని డిఫరెంట్‌గా ప్రకటించారు. From the #Virosh Premier league! #VijayDeverakonda pic.twitter.com/ghf7F7TMDF— Hourly Vijay Deverakonda (@HourlyDVS) February 24, 2026ఈ రోజు హల్దీ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లోని మెమెంటోస్ హోటల్ జరిగే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే అతిథులు హాజరుకానున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షెన్ ఏర్పాటు చేశారు.We need those original pictures @iamRashmika please 🥹❤️❤️#ViRosh pic.twitter.com/uVx2O2gWLz— Rahul (@The_pathbreaker) February 24, 2026 -
విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. గురువారం(ఫిబ్రవరి 26) జరగనుంది. ఇప్పటికే వీళ్లిద్దరి కుటుంబ సభ్యులు.. ఉదయ్‌పుర్ వెళ్లిపోయారు. పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. మంగళవారం నాడు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు టీమ్స్‌గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడారు. అలానే రాత్రి సంగీత్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. నేడు హల్దీ, మెహందీ తదితర సెలబ్రేషన్స్ జరగనున్నాయి. మరోవైపు కాబోయయే వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నోట్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)విజయ్-రష్మిక వివాహ వేడుకకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న మోదీ.. తన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. విజయ్-రష్మిక జీవితంలో ఇది ఓ కొత్త, సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్నారని అన్నారు. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్, రష్మిక.. నిజ జీవితంలో ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ శుభసందర్భంగా వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!) -
పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసిన విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ నెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి ప్రేమాయణంపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ.. ఇద్దరూ స్పందించలేదు. తాము రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ పరోక్షంగా హింట్ ఇస్తూనే వచ్చారు. చివరకు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సడెన్‌గా పెళ్లి డేట్‌ని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. రేపు ఉదయం ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌లో వీరిద్దరు ఏడు అడుగులు వేయబోతున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.ఇదిలా ఉంటే..పెళ్లివేళ రష్మికకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక గతంలో 'గీత గోవిందం' సినిమాలోని తన తొలి ముద్దు సీన్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘తొలిసారి ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సీన్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది చాలా వ్యక్తిగతమైన విషయం. సెట్లో 200 మంది చూస్తుండగా ఎలా చేయాలో అర్థం కాలేదు. అయితే, నా కో-యాక్టర్ విజయ్‌ది కూడా అదే పరిస్థితి. నాలాగే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. చివరకు అది ఒక టెక్నికల్ విషయంలా పూర్తి చేశాం. పాత్రకు అవసరమైతే అలాంటి సీన్ చేయాల్సిందే’ అని చెప్పుకొచ్చింది. కాబోయే భర్తతోనే తొలి ముద్దు సీన్ చేయడం గమనార్హం. కాగా, రష్మిక, విజయ్ గీత గోవిందంతో పాటు డియర్ కామ్రేడ్ అనే సినిమాలోనూ కలిసి నటించారు. -
విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లికి రెడీ అయిపోయారు. రెండు రోజుల క్రితమే అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా మంగళవారం నుంచి పెళ్లి సందడి మొదలైపోయింది. ఇదలా ఉండగానే పెళ్లి జరగబోయే సంప్రదాయ పద్ధతులు, పెళ్లి జరిగే చోటు, అతిథుల లిస్ట్, మెనూ అని చెప్పి సోషల్ మీడియాలో చాలానే విషయాలు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)కలిసి రెండు సినిమాలు చేసిన విజయ్-రష్మిక.. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాకపోతే ఎప్పుడూ బయటకు చెప్పలేదు. తమ పెళ్లిని గ్రాండ్‌గానే ప్లాన్ చేసుకున్నప్పటికీ.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారు. ఉదయ్‌పుర్‌లోని ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న 'ద మెమొంటోస్' అనే లగ్జరీ హోటల్లో ఈ శుభకార్యం జరగనుంది. ఈ వివాహానికి విరోష్(VIROSH) అని పేరు కూడా పెట్టారు.ఇకపోతే మంగళవారం(ఫిబ్రవరి 24) సాయంత్రం సంగీత్ జరగనుంది. బుధవారం(ఫిబ్రవరి 25) ఉదయం హల్దీ.. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. శుక్రవారం నాడు అంతా కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.అలానే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే హాజరు కానున్నారని, అతిథుల కోసం తెలుగు సంప్రదాయ ఆహారంతో పాటు జపనీస్ వంటకాలు కూడా మెనూలో ఉండనున్నాయని తెలుస్తోంది. వివాహం ఫొటోలు బయటకు రాకుండా ఉండేందుకు 'నో-ఫోన్' కాన్సెప్ట్ కూడా అమలు చేయనున్నట్లు టాక్.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?) -
రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?
అనుకున్నట్లే టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. చాన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ రెండు రోజుల క్రితమే అధికారికంగా తమ వివాహం విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఉదయ్పుర్లో పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఈ గురువారమే(ఫిబ్రవరి 26) విజయ్-రష్మిక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. అయితే తమ ఇంటికి రాబోయే కోడలి గురించి విజయ్ తల్లిదండ్రులు గతంలో మాట్లాడారు. ఒకటి రెండు కండిషన్స్ కూడా పెట్టారు. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)విజయ్ తెలంగాణ అబ్బాయి కాగా.. రష్మిక కన్నడ అమ్మాయి. వీళ్లిద్దరూ తొలుత 'గీతగోవిందం' అనే సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించి, తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. అయితే అదే మూవీ ఈవెంట్లోనే విజయ్ తల్లిదండ్రులు తమ కోడలి ఎలా ఉండాలి అనే విషయాల్ని కొన్ని చెప్పారు. ఇప్పుడు రష్మిక వాటిని నిజం చేసినట్లు కనిపిస్తోంది.'గీతగోవిందం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు? అని విజయ్ తల్లిదండ్రులని అడిగింది. దీనికి సమాధానమిచ్చిన తల్లి మాధవి.. మా బాబుని(విజయ్ దేవరకొండ) బాగా చూసుకునే కోడలు వస్తే చాలు, అతడిని ప్రేమించాలి అంతే. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆమె, అతడిని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు. విజయ్ తండ్రి గోవర్థన్ ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కులం, మతం గురించి పట్టింపులు లేవు. భారతీయురాలిని, ముఖ్యంగా దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషం అని అన్నారు.మరో మూవీ ఈవెంట్లో విజయ్ కూడా తనకు కాబోయే భార్య గురించి మాట్లాడుతూ.. తనకు అరేంజ్డ్ మ్యారేజ్ వర్కౌట్ కాదని, చేసుకుంటే లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి నా తల్లిదండ్రులకు కూడా నచ్చాలి అని కండిషన్ పెట్టాడు. మరో సందర్భంలో రష్మిక మాట్లాడుతూ.. మాధవి(విజయ్ తల్లి) ఆంటీ తనకు మరో అమ్మలాంటిది అని చెప్పుకొచ్చింది. చూస్తుంటే విజయ్ దేవరకొండ పేరెంట్స్ పెట్టిన కండిషన్స్‌కి తగ్గట్లే రష్మిక.. వీళ్ల ఇంటి కోడలు కాబోతోంది. గతంలో పలుమార్లు వీళ్లు హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కలిపి ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?)They imagined the perfect daughter-in-law… Rashmika is their dream come true ❤️#VijayDeverakonda #RashmikaMandanna #Virosh pic.twitter.com/eq3a1NwyTd— Lilly ✨ (@therwdygirl) February 21, 2026 -
సెలబ్రేషన్స్‌కు రెడీ.. విజయ్- రష్మిక పెళ్లి సందడి షురూ..!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా తన పెళ్లిని అనౌన్స్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్ జంట ఒక్కటి కానుందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఉదయపూర్‌లో మెహందీ వేడుకతో రష్మిక-విజయ్ పెళ్లి సందడి మొదలు కానుంది.ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ సందడి కొనసాగనుంది. ఈ వేడుకలు ఉదయపూర్‌లోని విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ జరుగుతాయి. ఈ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొననున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ - రష్మిక వారి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సోమవారం ఉదయమే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. కొన్నేళ్లుగా తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా కొనసాగించిన ఈ జంట చివరికీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండనే స్వయంగా తన పెళ్లిని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివాహం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. -
ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్
-
విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి తొలిసారి స్పందించారు. తమ బంధం గురించి అభిమానులు పెట్టిన 'విరోష్' పేరును గౌరవిస్తున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్యాన్స్ తమలో ఒక భాగం అంటూ.. వారి కోరిక మేరకు పెళ్లి కార్యక్రమానికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, వారిద్దరి వయసు గురించి కొందరు కామెంట్లు చేస్తుండగా... అభిమానులే కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవంగా ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ లేదనే విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ (36), రష్మిక(30)ల మధ్య సుమారు ఆరేళ్ల గ్యాప్ ఉంది. విజయ్ 1989లో జన్మించగా.. రష్మిక 1996లో జన్మించారు. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే పెద్దగా ఏజ్ గ్యాప్ కనిపించదు. దీంతో వారిద్దరిది సరైన జోడీ అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు సంబంధించి సుమారు రూ. 80 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తను ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. రష్మికకు సంబంధించి సుమారు రూ. 70 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తను ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.గీత గోవిందం మూవీతో పరిచయమైన ఈ జోడీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆపై ‘డియర్ కామ్రేడ్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వారి వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్‌లో మార్చి 4న వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది. -
రష్మిక, విజయ్‌ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్..! ప్రత్యేకతలు ఇవే..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ నెల ఫిబ్రవరి 26, 2026న వివాహ చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదిక కానుంది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐటీసీ మెమెంటోస్ హోటల్. సన్నిహిత వర్గాల ప్రకారం..ఒక వారం ముందుగానే బుక్ చేసినట్లు తెలుస్తోంది. పచ్చటి ఆరావళి కొండలు, నీలి ఆకాశానికి నిలయమైన ఈ వాతావరణంలో గడపాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..!.రష్మిక-విజయ్‌లు వివాహం చేసుకుంటున్న ITC మెమెంటోస్ లోపల 117 విల్లాలతో, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, విశాలమైన పచ్చని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వెల్నెస్ సెంటర్, అందంగా రూపొందించిన లాంజ్‌లు ఉన్నాయి. ఇక్కడ అతిథులు చేతితో తయారు చేసిన కాక్టెయిల్స్, వెచ్చని పానీయాలు, ప్రశాంతమైన దృశ్యాలను హాయిగా ఆస్వాదించవచ్చు.ఈ హోటల్లో ఉదయ్ పెవిలియన్, కబాబ్స్ అండ్ కుర్రీస్, రాయల్ వేగా, ది రాక్ బార్ వంటి చక్కటి భోజనాలను ఆస్వాదించొచ్చు. శాఖాహారం నుంచి వివిధ ప్రపంచ రుచుల తోపాటు రిఫ్రెష్ కాక్టెయిల్ వరకు అన్నిరకాల టేస్ట్‌లను ఆస్వాదించొచ్చు. పలనా రెసిపీ లోటు అనేదానికి అవకాశం లేకుండా ప్రతి వంటకం అందుబాటులో ఉంటుందట. ఆరోగ్యం పరంగా ఫిట్నెస్ సెంటర్‌ని అధునాతన యంత్రాలతో సెట్ చేశారు. ఇక్కడ ఉన్న విశాలమైన ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ హాయిగా వర్కౌట్లు చేసుకోవచ్చు. ఇదేగాక మరో గొప్ప అనుభూతి ఏంటంటే..ఇక్కడ రాయల్ స్పాలో, వేడుకకు విచ్చేసిన అతిథులు పురాతన భారతీయ చికిత్సలు, ఉత్తేజకరమైన వెల్నెస్ చికిత్సలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ తప్పనిసరిగా ఇన్ఫినిటీ పూల్ లేదా లాంజ్ పూల్‌ను మిస్ అవ్వకండి. చక్కటి విశ్రాంతికి నిలయం. ఈ పెళ్లికి విచ్చేస్తున్న అతిథులంతా ఇక్కడ జరిగే అన్ని రకాల వినోద కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, ఉదయ్‌పూర్‌ను సందర్శించొచ్చు. ఈ ప్రాంతం ప్రకృతి సహజ సౌందర్యానికి, సాహస అనుభవాలను గమ్యస్థానం. ఈ మెమెంటోస్ సూట్లో బసకి- అక్షరాల రూ. 73,199 - 91,499/-లు ఖర్చు అవుతుందట. View this post on Instagram A post shared by Mementos By ITC Hotels- Ekaaya Udaipur (@mementosbyitchotels_udaipur) (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..! ఆయిల్ మసాజ్‌లు, ఇంట్లో తయారు చేసే..) -
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి విషయమై స్పందించారు. అభిమానులు వీరిని ఎంతో ఇష్టంగా “విరోష్” అని పిలుస్తున్నారు. అదే పేరును తమ వివాహ వేడుకకు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. “మేం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ముందే అభిమానులు ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. అందువల్ల మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఈ జంట వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.వీరిద్ధరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే ఈ జంటపై రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పెళ్లి వార్తలతో ఆ రూమర్స్‌కు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబలి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత క్రేజీ కపుల్‌గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి రిసెప్షన్ డేట్ లీక్
-
విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు
-
విజయ్-రష్మిక పెళ్లి..నాకు ఆహ్వానం అందలేదు: ప్రముఖ నటుడు
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల వివాహానికి తమను ఆహ్వానిస్తారని వెయిట్ చేయడం లేదని ప్రముఖ నటుడు ప్రమోద్ శెట్టి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా రక్షిత్ శెట్టిని.. తనను ఆమె వివాహానికి పిలుస్తారని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రక్షిత్ శెట్టి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్నాడని ప్రమోద్ శెట్టి తెలిపారు. హీరోయిన్ రష్మికతో వివాహం కానందుకు రక్షిత్ శెట్టి బాధపడడం లేదని వెల్లడించారు.కాగా.. గతంలో రష్మికకు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. అంతకుముందు రష్మిక, రక్షిత్ కిరిక్ పార్టీ మూవీలో జంటగా నటించారు. రష్మిక ఈ మూవీతోనే కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రమోద్‌శెట్టి కీలక పాత్రలో కనిపించారు.కాగా.. ఈ నెల 26న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక వివాహం జరగనుంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖులు, సన్నిహితులు హాజరు కానున్నారు. -
విజయ్, రష్మికల సంపాదన ఇద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు అంటే..?
-
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?
ఇండస్ట్రీలో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు చాలా మారిపోయాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే జనాలు తగ్గిపోయారు. హీరోహీరోయిన్లు ఎవరైనా సరే కాస్త వైవిధ్యమైన పాత్రలు చేస్తే చూసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే అలాంటివి చేసే వాళ్లు మాత్రం ఇప్పటికే కాస్త తక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ రష్మిక మాత్రం ఇప్పుడు పెద్ద సాహసమే చేసినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు.. కనీసం కలలో కూడా ఊహించని పాత్రలో కనిపించనుందని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. తొలుత సొంత భాషలో గుర్తింపు తెచ్చుకుని తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్డమ్ సొంతం చేసుకుంది. 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ అయిపోయింది. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్‌లోనూ వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అలా ఈమె చేసిన హిందీ సినిమాల్లో 'కాక్టెయిల్ 2' కూడా ఒకటి.(ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్ భాయ్‌ఫ్రెండ్ భయపడ్డాడు: మృణాల్)ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక నటించారు. అయితే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, కాకపోతే కృతి సనన్, రష్మిక.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. అంటే లెస్బియన్ పాత్రలు అనమాట. బాలీవుడ్ సినిమాల్లో ఈ పాయింట్ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటారు గానీ దక్షిణాదిలో ఇలాంటి పాత్రలు రావడం దాదాపు అసాధ్యం. అందున స్టార్ హీరో లేదా హీరోయిన్లు ఇలాంటి చేయరు. మరి రష్మిక ఈ తరహా పాత్ర చేసిందని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే గనక తెలుగు ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి?ఇకపోతే రష్మిక వచ్చే వారమే పెళ్లి చేసుకోనుంది. ప్రియుడు విజయ్ దేవరకొండతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. రాజస్తాన్ వేదికగా ఈ నెల 26న డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ శుభకార్యానికి ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ) -
సోషల్ మీడియాలో విజయ్- రష్మిక వెడ్డింగ్ కార్డ్.. టీమ్ ఆగ్రహం..!
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిపై తెగ చర్చ నడుస్తోంది. ఈ నెల 26న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వెడ్డింగ్ కార్డ్ నెట్టింట తెగ వైరలైంది. తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. వివాహం, రిసెప్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.'విజయ్- రష్మిక పెళ్లి గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెళ్లి, రిసెప్షన్ వేదిక వివరాలను వెల్లడిస్తున్నారు. ఇలాంటి వాటితో అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. వీరి పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి వేదికల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం సరైంది కాదు. పెళ్లికి హాజరయ్యే అతిథులు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్ నెంబర్ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేస్తే.. అది కూడా పోస్ట్ చేశారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేయవద్దని' విజయ్ టీమ్ పేర్కొంది.Special request from Team Vijay Deverakonda & Rashmika !! As many people were posting the marriage details of Vijay & Rashmika including the RSVP contact and venue. The team now are requesting not to post such sensitive information online which could lead to unnecessary fanfare… pic.twitter.com/YESwrwNumE— Filmy Focus (@FilmyFocus) February 18, 2026 -
విజయ్, రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్ వీళ్లే..!
-
గుట్టుచప్పుడు కాకుండా విజయ్,రష్మిక లవ్ స్టోరీ
-
విజయ్- రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్ వీళ్లే..
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొననున్నారు. అయితే, మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో భారీగా టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.విజయ్, రష్మికల వివాహానికి ఉదయ్‌పూర్ వెళ్లే అతిధుల జాబితా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుండి ఎంపిక చేసిన ప్రముఖులతో పాటు వారి సన్నిహితులు మాత్రమే పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్, సుకుమార్, వర్ష బొల్లమ్మ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, కృతి సనన్, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.అయితే, హైదరాబాద్‌లో మార్చి 4న జరిగే రిసెప్షన్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు స్టార్స్‌తో పాటు యువ నటీనటులు హజరుకానున్నారు. ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుండి కొంతమంది కీలక రాజకీయ నాయకులు కూడా విజయ్ పెళ్లిలో పాల్గొంటారని సమాచారం. ఈ జాబితా గురించి విజయ్ జోడీ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. -
విజయ్ రష్మిక పెళ్లి సందడి శుభలేఖ ఇదే.. పెళ్లి ముహూర్తం ఫిక్స్
-
బ్రేకింగ్: విజయ్ రష్మిక పెళ్లి శుభలేఖ ఇదే.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక.. ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించారు. వీళ్లిద్దరూ వెళ్తున్నది పెళ్లి జరిగే రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కే అనేది తెలిసిందే. తాజాగా వీళ్ల పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)26వ తేదీన ఉదయ్పుర్లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు. కాకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు. ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇదివరకే ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు ఆ ఫొటోలే వైరల్ అవుతున్నాయి.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. అంటే పెళ్లి తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోయే మూవీ ఇదే.(ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష) -
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా) -
60 కోట్లు ఇస్తానన్న నెట్ ఫ్లిక్స్.. షాకిచ్చిన విజయ్
-
రష్మిక, శ్రీలీల బాటలో కాంతార బ్యూటీ.. టాలీవుడ్ కలిసొస్తుందా?
కన్నడ బ్యూటీలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. రష్మిక, శ్రీలీలకు ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్లుగా తమ పేరును లిఖించుకున్నారు. పుష్ప మూవీతో రష్మిక మందన్నా రేంజ్ పూర్తిగా మారిపోయింది. అలా కన్నడ భామలు ఇలా వచ్చి తెలుగులో సూపర్ పవర్‌గా ఎదిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల కంటే శాండల్‌వుడ్ భామలకే ఫుల్ డిమాండ్ ఉంటోంది.ఇప్పుడదే అదే బాటలో మరో కన్నడ బ్యూటీ అడుగులేస్తోంది. గతేడాది కాంతార-2 మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న భామ రుక్మిణి వసంత్. ఇప్పుడు టాలీవుడ్‌పై దృష్టి సారించింది. సప్త సాగరాలు దాటి లాంటి కన్నడ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో అవకాశం దక్కించుకుని టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ కూడా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీతోనైనా రుక్మిణి వసంత్ టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకుంటుందేమో వేచి చూడాల్సిందే. రష్మిక, శ్రీలీల మాదిరిగానే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో స్టార్‌గా హోదాను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్‌లోనూ తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రుక్మిణి వసంత్ ఇప్పటికే తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది. -
రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్‌కు నో..!
టాలీవుడ్లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్లో మోస్ట్ వైరల్ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్‌కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్‌ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
AA22: బన్నీకి విలన్ గా రష్మిక
-
జోడీ రిపీట్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీ రిపీట్ కానుందని సమాచారం. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’లో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో కృతీ సనన్ మరో హీరోయిన్గా చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అయితే తాజాగా మరో రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.హిందీలో ‘బదాయి హో, మైదాన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అమిత్ శర్మ ఓ రొమాంటిక్ కామెడీ కథను రెడీ చేసి, షాహిద్ కపూర్‌కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట షాహిద్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే షాహిద్, రష్మికల జోడీ సిల్వర్ స్క్రీన్‌పై రిపీట్ అవుతుంది. జియో స్టూడియోస్‌తో కలిసి సునీల్ ఖేతర్ పాల్ ఈ సినిమాను నిర్మించనున్నారట.మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణతో రష్మికా మందన్నా బిజీగా ఉన్నారు. ఇంకా విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మైసా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు రష్మికా మందన్నా. ఇలా వరుస చిత్రాలతో రష్మిక బిజీ బిజీగా ఉన్నారు. -
బన్నీ మూవీలో రష్మిక కీ రోల్ ..! అట్లీ ప్లాన్ అదుర్స్
-
ఉదయ్‌పూర్‌లో పెళ్లి
గత ఏడాది అక్టోబరులో విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరిగినప్పట్నుంచి వీరి వివాహ తేదీ ఎప్పుడు? అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ నెల 26న ఈ ప్రేమికులు... భార్యాభర్తలు కానున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదిక కానుంది. ఇంకా 20 రోజులే ఉన్నందున ఇటు విజయ్ అటు రష్మిక కుటుంబ సభ్యులు జోరుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.ఇరువైపు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అలాగే హైదరాబాద్‌లో మార్చి 4న సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇక గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్–రష్మిక జంటగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా వీరి కాంబినేషన్లో మూడో సినిమాగా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. -
రష్మిక, విజయ్ పెళ్లి డేట్ వచ్చేసింది..!
-
రష్మిక- విజయ్ పెళ్లి తేదీపై కన్ఫ్యూజన్.. కన్ఫామ్ చేసినట్టేనా?
టాలీవుడ్లో ఇప్పుడంతా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. డేటింగ్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్ అలాగే ఉంది. గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఎవరి పెళ్లి అనుకుంటున్నారా? అదేనండి మన రష్మిక- విజయ్ దేవరకొండ జంట గురించే. గత కొద్ది రోజలుగా ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అంతేకాకుండా ఈనెల 2న రష్మిక- విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది.అయితే తాజాగా మరో మ్యారేజ్ డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్‌గా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్మైల్‌తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.గత డిసెంబర్లో వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక- విజయ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ప్యాలెస్‌లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో తమ సినీ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటిపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కాగా.. వీరిద్దరు జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
రష్మిక- విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వీడియో వైరల్..!
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పుష్ప మూవీతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న రష్మిక.. బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది ముద్దుగుమ్మ.అయితే రష్మిక సినీ కెరీర్ పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అయిందని వార్తలొచ్చినా.. వీళ్లు మాత్రం అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే ఈవెంట్స్‌లో మాత్రం చెప్పి చెప్పనట్లుగా మాట్లాడుతూ వచ్చారు. అలా అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల వీరిద్దరి పెళ్లి ఉదయ్‌పూర్‌లో జరగనుందని వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అటు విజయ్ దేవరకొండ కానీ.. రష్మిక కానీ ఎక్కడా బయటికి చెప్పలేదు.కానీ తాజాగా వీరి పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరలవుతోంది. ఇద్దరు ఈవెంట్ ప్లానర్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇది రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఇద్దరు అమ్మాయిలు వీడియోలో మాట్లాడారు. రష్మిక- విజయ్ ఈ నెల 2న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఇదంతా ఫేక్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే రష్మిక కానీ.. విజయ్ కానీ క్లారిటీ ఇవ్వాల్సిందే. Rashmika Mandanna and Vijay Devrakonda are getting married in Udaipur on Feb 2 😲-Confirmed by the Event Planners.pic.twitter.com/HXGUS8RdOE— Christopher Kanagaraj (@Chrissuccess) January 31, 2026 -
డబ్బు కోసమే తప్పుడు వార్తలు రాస్తున్నారు: రష్మిక
మనుషుల మనో భావాలు రక రకాలుగా ఉంటాయి. ఇక సినీ తారల అభిప్రాయలు సందర్భానుసారంగా ఉంటాయని చెప్పవచ్చు. కొందరు తమపై వచ్చే విమర్శలను స్వాగతిస్తున్నామంటారు. మరి కొందరు వదంతులను ఎంజాయ్ చేస్తున్నామంటారు. ఇంకొందరు సీరియస్‌గా రియాక్ట్ అవుతుంటారు. ఇందుకు మన కథానాయకిలు అతీతంగా కాదు. అలా నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) కూడా వదంతులపై స్పందించారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటించిన తొలి చిత్రం తరువాత నుంచే వివాదాల్లో చిక్కుకున్నారనే చెప్పాలి. ఆ తరువాత కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ తరువాత ప్రేమ వ్యవహారంలో వైరల్ అయ్యారు. విషయం ఏమిటంటే ఇవేవీ ఈ భామ కెరీర్‌కు ఎఫెక్ట్ అవ్వలేదు. అదే సమయంలో అవన్నీ ఈమెకు ప్లస్ అయ్యాయనే చెప్పాలి. అందుకే శాండిల్ వుడ్ వైయా టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ దాటి బాలీవుడ్‌లోనూ వరుస విజయాలను సాధిస్తూ నేషనల్ క్రష్‌గా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలతో పాటూ హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వైరల్ అవుతున్న రకరకాల ట్రోలింగ్స్‌పై స్పందించిన రష్మిక మందన్నా అసత్య ప్రచారాలపై ఎందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. అలాంటి విషయాలపై స్పందిస్తే వారిని ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. కొందరు డబ్బు కోసమే అలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారని అన్నారు. అలాంటి ముఖం తెలియని వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎప్పుడూ ఒకేలా ఉంటున్నానని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. -
జపాన్ అభిమాని దెబ్బకు బిత్తరపోయిన పుష్ప..
-
విజయ్-రష్మిక పెళ్లి తర్వాత వచ్చే సినిమా ఇదే.. వీడియో రిలీజ్
గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ మాత్రం విజయ్ దేవరకొండకు దొరకట్లేదు. గతేడాది 'కింగ్డమ్'తో వచ్చాడు గానీ అదే సీన్ రిపీటైంది. ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'రౌడీ జనార్ధన' కాగా మరొకటి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పీరియాడిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తుండటం విశేషం.విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు 'రణబాలి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 1876-78 మధ్య రాయలసీమ ప్రాంతంలో జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన బ్రిటీషర్లు.. హిట్లర్ చేసిన దానికంటే ఎంత పెద్ద మారణహోమం సృష్టించారు. ఏకంగా 45 ట్రిలియన్ డాలర్లు దోచుకోవడం, 40 ఏళ్లలో 100 మిలియన్ల మంది చావులకు కారణమవడం.. ఇలాంటి చాలా విషయాలు సినిమాలో ఉండబోతున్నాయని అనౌన్స్మెంట్ వీడియోతో చెప్పకనే చెప్పేశారు.ఇందులో విజయ్.. బ్రిటీషర్లపై పోరాడిన రణబాలి అనే వీరుడిగా కనిపించనున్నాడు. రష్మిక.. జయమ్మ అనే పాత్ర పోషించింది. 'మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో ... సర్ థియోడర్ హెక్టర్ పాత్ర చేశాడు. బాలీవుడ్ ఫేమ్ అజయ్ అతుల్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వీళ్లిద్దరూ భార్యభర్తలుగా నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. గతంలో వీళ్లిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు జంటగా చేశారు. -
VD 14 : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. వీడీ14 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభించారు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్‌కి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా టైటిల్‌ని జనవరి 26న అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "వీడీ 14" సినిమా రూపొందుతోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత "వీడీ 14"లో మూడోసారి రష్మిక, విజయ్ జంటగా కనిపించనున్నారు. 26.1.26.Remember the date🔥You will remember the name❤️🔥#VD14@TheDeverakonda @Rahul_Sankrityn @MythriOfficial #NiravShah #BhushanKumar #KrishanKumar @TSeries #ShivChanana @neerajkalyan_24 @vd14thefilm pic.twitter.com/07HL8UJqth— Mythri Movie Makers (@MythriOfficial) January 24, 2026 -
రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వీడీ 14.. ప్రామిస్ చేసిన దర్శకుడు!
‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో వీడీ14 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి తమ హీరో విజయ్ దేవరకొండ కు మంచి హిట్ మూవీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు.రీసెంట్ గా యశ్వంత్ అనే విజయ్ దేవరకొండ ఫ్యాన్ తమ హీరోకు మెమొరుబల్ మూవీ ఇవ్వాలటూ హార్ట్ టచింగ్ రిక్వెస్ట్ ఒకటి పంపారు. ఆ అభిమాని రిక్వెస్ట్ కు స్పందించిన రాహుల్ సంకృత్యన్ 'మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడీ 14 ఉంటుంది..' అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వీడీ 14 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. -
రష్మిక, మురగదాస్ ఇద్దరి మాట ఒక్కటే..
ఎవరైనా విజయాలను తమకు ఆపాదించుకోవడంలో ముందుంటారు. అపజయాలను ఇతరులపై నెడుతుంటారు. ఇది సహజం. అపజయాలకు బాధ్యత వహించేవారు చాలా తక్కువనే చెప్పాలి. ఆ మధ్య సల్మాన్‌ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన హిందీ చిత్రం సికిందర్. తమిళ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై పూర్తిగా నిరాశ పరచింది. దీంతో ఈ చిత్రం ఫ్లాప్‌పై దర్శకుడు మురుగదాస్ స్పందిస్తూ ఉత్తరాదిలో సల్మాన్‌ఖాన్ బెదిరింపులను ఏదుర్కొంటున్న కారణంగా షూటింగ్‌ను పగలు చేయడం సాధ్యం కాక పగలు చిత్రీకరించాల్సిన సన్నివేశాలను కూడా రాత్రి వేళల్లో చేయాల్సి వచ్చిందని చెప్పారు. సల్మాన్‌ఖాన్ షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చేవారు అని చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. సికిందర్ డిజాస్టర్లో తన పాత్ర లేదని కూడా చెప్పారు. దీంతో సల్మాన్ అభిమానులు దర్శకుడు మురుగదాస్‌పై విమర్శల దాడి చేశారు. సల్మాన్‌ఖాన్ కూడా మురుగదాస్ వ్యాఖ్యలకు పరోక్షంగా గట్టిగానే బదులిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్నా ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సికిందర్ కథను దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తనకు చెప్పినప్పుడు బాగుందని. అయితే షూటింగ్లో వేరే విధంగా మారిపోయిందని పేర్కొన్నారు. ఆ చిత్ర అపజయంలో తన బాధ్యత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కాగా హిందీలో మంచి సక్సెస్‌లో ఉన్న రష్మిక మందన్నాకు సికిందర్ చిత్రం పూర్తిగా నిరాశపరిచందన్నది గమనార్హం. మొత్తం మీద సికిందర్ చిత్రం విడుదలై చాలా కాలం అయినా, దాని గురించి రచ్చ ఇంకా జరుగుతూనే ఉందన్నది గమనార్హం. -
అది నిజం కాదు.. కానీ నిజం కావాలి : రష్మిక
‘‘నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను’’ అని హీరోయిన్ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) అంటున్నారు. నటిగా తన కథల ఎంపిక, పారితోషికం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు రష్మిక. ఆమె మాట్లాడుతూ–‘‘హీరోయిన్గా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా పని. ఎలాంటి భాషాపరమైన హద్దులు లేకుండా, అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికే ప్రయత్నిస్తుంటాను. కొంతమంది ప్రేక్షకులకు లవ్‌స్టోరీ సినిమాలు ఇష్టం. ఇంకొంతమంది వాణిజ్య చిత్రాలను ఇష్టపడతారు. అందుకే కమర్షియల్, లవ్ స్టోరీ, ఉమెన్ సెంట్రిక్... ఇలా విభిన్న రకాల జానర్స్‌లో సినిమాలు చేస్తున్నాను. (చదవండి: నా ఫోటోలు జూమ్ చేసి చూశారు.. దర్శకుడిపై 'ఈషా రెబ్బా')ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసమే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాను. ఇకపై కూడా ఇలానే ముందుకు సాగుతాను. ఇక స్పెషల్ సాంగ్స్ చేయడంపైనా నాకు ఆసక్తి ఉంది. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్ గా ఉండాలి. లేదంటే.. ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు డైరెక్టర్స్ సినిమాల్లో మాత్రం లీడ్ రోల్ కాకపోయినా స్పెషల్ సాంగ్ చేస్తాను. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిని నేనే అనుకుంటున్నారు.. అయితే ఇది నిజం కాదు. కానీ, అది నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
వచ్చేనెలలో విజయ్‌తో పెళ్లి.. రష్మిక ఏమన్నారంటే?
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్‌తో హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.కాగా.. విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. Q: There’s been a lot of buzz that #VijayDeverakonda and Rashmika are engaged and getting married on FEB 26th in Udaipur. What’s the truth?#RashmikaMandanna : pic.twitter.com/x6vD2jSIZB— Whynot Cinemas (@whynotcinemass_) January 19, 2026 -
జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)
-
సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక
గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఛావా, కుబేర, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలతో సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకుంది. 2025లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే.. ఒకే ఒక మూవీ మాత్రం బాక్సాఫీస్ వద డిజాస్టర్‌గా నిలిచింది. అదే సికందర్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.గతేడాది ఒక్కటే ఫ్లాప్ తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. హీరో సమయానికి సెట్‌కు వచ్చేవాడు కాని, అందుకే సినిమా పోయింని మురుగాస్ సల్మాన్‌ను విమర్శించాడు. దాంతో ఆ హీరో కూడా దర్శకుడికి రివర్స్ కౌంటర్లిచ్చాడు. తాజాగా సికందర్ మూవీ గురించి రష్మిక స్పందించింది.నాకు చెప్పిన కథ వేరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సికందర్ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. తర్వాత మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇది సినిమాల్లో జరుగుతూనే ఉంటుంది. మొదట కథ ఒకటి చెప్తారు.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్, రిలీజ్ డేట్, ఎడిటింగ్.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. సికందర్ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పుకొచ్చింది.చదవండి: ఆ ఇద్దరే బిగ్‌బాస్ విజేతలు.. మరో సర్ప్రైజ్ ఏంటంటే? -
జై జై నాయిక..!
ఒకవైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే, సమయం దొరికినప్పుడల్లా ఉమెన్స్ సెంట్రిక్ సినిమాలూ చేస్తున్నారు కొందరు కథానాయికలు. సందేశాత్మక చిత్రాలే కాదు.. ఫుల్ యాక్షన్స్ చిత్రాలకూ సై అంటున్నారు. మరి.. ఏ హీరోయిన్స్ ఏ సినిమా చేస్తున్నారు? తొలిసారిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరు? అనే అంశాలపై ఓ లుక్ వేయండి.మా ఇంటి బంగారం‘ఓ.. బేబీ’ వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత హీరోయిన్స్ సమంత, దర్శకురాలు నందినీరెడ్డి కాంబినేషన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇటీవల ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సమంత ఓ గృహిణి పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు..ఈ చిత్రంలో సమంత క్యారెక్టరైజేషన్స్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా, ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత పాత్ర వివాహం చేసుకుని, అత్తగారిఇంటికి వెళ్లడం, ఆమె ఊహించుకున్న కొన్ని పరిస్థితులు, అంచనాలు తలకిందులు కావడం, మరోవైపు సడన్స్ గా సమంత ఫైట్స్ చేయడం వంటి విజువల్స్ కూడా కనిపించాయి. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజూషా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు, హిమాన్స్ ్క దువ్వూరు ‘మా ఇంటి బంగారం’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుందని తెలిసింది. మరోవైపు 2023లో విజయ్‌దేవరకొండ, సమంత కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించారు. ఈ చిత్రం తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన మరో మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా గత ఏడాది మేలో విడుదలైంది. ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ మాత్రమే చేశారు. మరి..సమంత చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ఈ ఏడాది థియేటర్స్‌లో విడుదలైతే, కొంతగ్యాప్ తర్వాత సమంతను ఓ ఫుల్ లెంగ్త్ రోల్లో ఆడియన్స్, ఆమె ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారని ఊహించవచ్చు. పవర్ఫుల్ మైసారష్మికా మందన్నా నటించిన తొలి ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ గత ఏడాది విడుదలై, సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు..ఈ చిత్రంలో రష్మిక మందన్నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ జోష్‌లో ‘మైసా’ అనే మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కు గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చారు రష్మిక. ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్స్ ఎంటర్టైనర్ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. అన్స్ ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమా కోసం రష్మికా మందన్నా అద్భుతంగా మేకోవర్ అయ్యారు. గోండ్ తెగకు చెందిన శక్తివంతమైన మహిళగా ఇందులో నటిస్తున్నారు రష్మిక. తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో ‘మైసా’ చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు సిల్వర్‌స్క్రీన్స్ పై రష్మిక మందన్నా ఎక్కువగా రొటీన్స్ గ్లామర్ రోల్స్, కాలేజీ అమ్మాయి, గృహిణి.. వంటి పాత్రలు చేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు రష్మిక మందన్నా తొలిసారి ఓ పూర్తి స్థాయి యాక్షన్స్ సినిమా చేస్తుండటంతో, ‘మైసా’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.ది బ్లాక్‌గోల్డ్‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించు కున్నారు హీరోయిన్స్ సంయుక్త. ఈ సక్సెస్‌లతో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ బ్యూటీ తొలిసారిగా ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్స్ జానర్లో ఎంట్రీ ఇచ్చి, ‘ది బ్లాక్‌గోల్డ్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలోపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు సంయుక్త. యోగేష్ కేఎమ్‌సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుత సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తూ, ‘ది బ్లాక్‌గోల్డ్’ను తెరకెక్కిస్తున్నారట యోగేష్. సంయుక్త పూర్తిస్థాయి యాక్షన్స్ చేస్తున్న ఈ ‘ది బ్లాక్‌గోల్డ్’ సినిమాపై ఆడియన్స్్సలో అంచనాలు ఉన్నాయి.భార్యాభర్తల గొడవలుభార్యాభర్తల గొడవలు, వారి అనుబంధాలు, గిల్లికజ్జాలు, విడాకులు... వంటి అంశాల నేపథ్యంతో రూపొందుతున్న సినిమా ‘సతీ లీలావతి’. ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో దేవ్ మోహన్స్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవ్, లావణ్య భార్యాభర్తలు నటించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్ఎంఎస్’ (శివ మనసులో శృతి) చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుందని తెలిసింది.సస్పెన్స్ థ్రిల్లర్హీరోయిన్స్ శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్ర చేసిన సినిమా ‘చీకటిలో..’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సురేష్ ప్రోడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సంధ్య అనే పాత్రలో నటించారు శోభిత. సంధ్య వద్ద శిక్షణ పొందుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చని΄ోతాడు. ఈ మరణం గురించి సంధ్యకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవి ఏంటి? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా జనవరి 23 నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.క్రేజీ కల్యాణంపెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రంలో అనుపమా పరమే శ్వరన్స్ లీడ్ రోల్ చేస్తుండగా, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మెహన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్స్ చేస్తున్నారు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది ‘పరదా’ అనే ఉమెన్స్ సెంట్రిక్ సినిమా చేశారు అనుపమా పరమేశ్వరన్స్ . ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.గరివిడి లక్ష్మిఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ జానపద గాయని, కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి వస్తోంది. ‘గరివిడి లక్ష్మి’ టైటిల్‌తో ఆమె బయోపిక్ తెరకెక్కుతోంది. హీరోయిన్స్ ఆనంది టైటిల్ రోల్ చేస్తున్నారు.1990 నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇలా ఈ కోవలో మరికొన్ని ఉమెన్స్ సెంట్రిక్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరి.. జై జై నాయిక అంటూ ప్రేక్షకులు, హీరోయిన్ల అభిమానులు ఈ తరహా చిత్రాలను ఈ ఏడాదిలో ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి.⇒ లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు మొదలైనట్లుగా తెలిసింది. నిర్మాత రాక్లైన్స్ వెంకటేశ్ ఈ బయోపిక్కు సంబంధిన పనులపై వర్క్ చేస్తున్నారని, ఈ సినిమా నిర్మాణంలో తాను అసోసియేట్ అవుతానన్నట్లుగా ఇటీవల ‘ఈషా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. ఈ రకంగా ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు మొదలైనట్లుగా తెలుస్తోంది.అయితే ఈ బయోపిక్‌లో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా ఎవరు నటించనున్నారు? అనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. హీరోయిన్స్ సాయిపల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి పేరు తెరపైకి వచ్చింది. మరి.. వెండితెరపై ఎంఎస్ సుబ్బలక్ష్మిగా సాయిపల్లవి నటిస్తారా? లేక మరోక హీరోయిన్స్ ఎవరైనా ఈ పాత్రను చేస్తారా? అన్న అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.⇒ వరుస సినిమాలతో టాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు హీరోయిన్స్ శ్రీలీల. అయితే ఈ యంగ్ బ్యూటీ ఇప్పటì æవరకు ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ జానర్లో సినిమా చేయలేదు. అయితే ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్స్ లో సూపర్‌హిట్ ఫిల్మ్ ‘మంగళవారం’ చిత్రానికి సీక్వెల్ రానుందని, ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్స్ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే అనుష్కా శెట్టి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘అరుంధతి’ హిందీలో రీమేక్ కానుందని, ఈ చిత్రంలో శ్రీలీల నటించనున్నానే ప్రచారం సాగింది. అయితే ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.⇒ రవితేజ ‘మిస్టర్ బచ్చన్స్ ’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, రామ్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు హీరోయిన్స్ భాగ్యశ్రీ బోర్సే. కాగా తాజాగా ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ జానర్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట ఈ హీరోయిన్స్ . ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్‌తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా రానుందని, ఈ చిత్రంలో భాగ్యశ్రీ మెయిన్స్ లీడ్ రోల్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ సినిమాను రమేష్ అనే ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మద్యపాన నిషేధం నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. స్వప్న సినిమా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు


