టాలీవుడ్ నటి రష్మిక మందన్న, విజయ దేవర కొండల పెళ్లి ఫిబ్రవరి 26,2026న ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయ శైలిని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దాలో పాఠాలు నేర్పుతూనే ఉంది. తన పెళ్లి వేడుక కోసం కిలోల కొద్దీ బంగారు ఆభరణాల నుంచి రిసెప్షన్‌లో ధరించి కూర్గీ శైలి చీర వరకు ప్రతి సందర్భంలోనూ ఫ్యాషన్ ప్రియులను గ్లామరస్ లుక్‌తో కట్టిపడేస్తోంది.
ఒక అవార్డుల వేడుకు కోసం రష్మిక క్రీమ్ కలర్ సిల్క్ చీరలో తళుక్కుమంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన ఫోటోలను రష్మిక షేర్ చేశారు. ఆమె స్టైలిస్ట్ గౌర్వి ప్రత్యర్తి మృణాలినీ రావు కలెక్షన్ల నుంచి ఎంపిక చేసుకున్నారు ఈ చీరను. ఈ సిల్క్ పట్టు మాదిరి చీరకు క్లిష్టమైన పూల జర్దోజీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చీరకు ఎరుపు రంగులోని ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ని జత చేశారు. దాంతో ఈ చీర అత్యంత హైలెట్‌గా నిలిచి అందరి చూపులను ఆకర్షించింది.
అంతేగాదు ఈ చీర ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 1.68 లక్షలు పైనే పలుకుతుంది. అందుకు తగ్గట్టుగా చాలా నేచురల్ మేకప్, హెయిర్ స్టైల్ కోసం మధ్యలో పాపిడి తీసిన పోనీటెయిల్‌తో తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. అలాగే తన శారీకి అనుగుణంగా మధ్యలో పచ్చరాయితో మెరుస్తున్న స్టేట్‌మెంట్ చెవిపోగులు, చిన్న నెక్‌చైన్, మంగళ సూత్రంతో సాంప్రదాయబద్దమైన మహిళలా అద్భుతంగా కనిపించారామె.
అంతేగాదు రష్మిక బ్యూటీఫుల్ ఫోటోలను రీపోస్ట్ చేస్తూ సదరు బ్రాండ్ ఇలా రాసింది. "మృణాలినీ రావు దుస్తులలో మిమ్మల్ని చూడటం మాకు ఎల్లప్పుడూ ఇష్టమే! ఈ చీరలో అద్భుతంగా కనిపిస్తున్నారు." అని పేర్కొంది.
(చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..)


