రష్మిక బర్త్ ‍డే.. మైసా టీమ్ స్పెషల్ పోస్టర్ | Mysaa Team Released special Poster rashmika mandanna birthday | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక బర్త్ ‍డే.. మైసా టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Apr 5 2026 10:39 AM | Updated on Apr 5 2026 1:00 PM

Mysaa Team Released special Poster rashmika mandanna birthday

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లీడ్‌ రోల్‌లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ మైసా. ఈ మూవీని పాన్‌ ఇండియా రేంజ్‌లో రవీంద్ర పూలే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌లో రష్మిక లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

తాజాగా ఇవాళ రష్మిక బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. రష్మిక జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. పూర్తిగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌లో రిలీజ్ చేసిన పోస్టర్‌ చూస్తుంటే ఫుల్ మాస్‌ యాక్షన్‌ మోడ్‌లో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫిమేల్‌ సెంట్రిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో రష్మిక కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2026లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాకుండా రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా వస్తోన్న రణబలిలోనూ నటిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement