విజయ్-రష్మిక పెళ్లి.. గబ్బర్‌ సింగ్‌ టీమ్ ఆవేదన..! | Gabbar Singh Movie Comedians Video Viral About Vijay And Rashmika Wedding | Sakshi
Sakshi News home page

Vijay-Rashmika: విజయ్-రష్మిక పెళ్లి.. అలిగిన గబ్బర్‌ సింగ్‌ టీమ్..!

Mar 23 2026 4:24 PM | Updated on Mar 23 2026 4:49 PM

Gabbar Singh Movie Comedians Video Viral About Vijay And Rashmika Wedding

టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు, కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా భోజనాలు, స్వీట్స్‌ పంపిణీ చేసింది విరోష్ జంట.

అయితే ఇటీవల ఓ చిన్నారి అభిమాని పెళ్లికి పిలవలేదని అలిగింది. నేను మీ ఫ్యాన్‌నే నన్ను ఎందుకు పిలవలేదు? ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవలే ఆ చిట్టి అభిమానిని ఇంటికి పిలిచి లంచ్‌ ఏర్పాటు చేశారు. ఆ చిన్నారికి ఇష్టమైన స్వీట్స్‌ కూడా వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

‍అయితే అలాగే తాజాగా తమను పెళ్లికి పిలవలేదని మరో వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం వాళ్లు చిట్టి అభిమానులు మాత్రం కాదండోయ్. గబ్బర్‌ సింగ్ చిత్రంలో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌ గ్యాంగ్. వీరంతా విజయ్ దేవరకొండకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ తెలిపారు. మేము కూడా ఆర్టిస్తులమే కదా అన్నా.. మమ్మల్ని ఎందుకు పెళ్లి పిలవలేదు అన్న అంటూ వీడియోలో వేడుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement