మాట నిలబెట్టుకున్న విజయ్‌.. చిన్నారిని ఇంటికి పిలిచి మరీ.. | Vijay Devarakonda, Rashmika Mandanna Invites Litle fan to Home, Offers Laddoos | Sakshi
Sakshi News home page

Virosh: చిన్నారిపై విరోష్‌ ముద్దుల వర్షం.. లడ్డూలు పెట్టి మరీ..

Mar 20 2026 5:19 PM | Updated on Mar 20 2026 6:36 PM

Vijay Devarakonda, Rashmika Mandanna Invites Litle fan to Home, Offers Laddoos

పెళ్లంటే ఇలా ఉండాలి అన్నంత అద్భుతంగా వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌ బర్డ్స్‌ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. 

వైభవంగా పెళ్లి
దేవరకొండ ఫౌండేషన్‌ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ ఇస్తామని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ కూడా చేశారు. హైదరాబాద్‌లో మార్చి 4న గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరుపుకున్నారు. అయితే ఇంత గొప్పగా పెళ్లి చేసుకున్న విరోష్‌ జోడీ తననెందుకు పిలవలేదని ఓ చిన్నారి అలిగింది. 

లడ్డూలు ఇవ్వొచ్చు కదా!
నేను కూడా విజయ్‌కు అభిమానినే కదా.. నన్ను కూడా పెళ్లికి పిలవచ్చు కదా.. లడ్డూలు ఇవ్వొచ్చు కదా.. అంటూ క్యూట్‌గా రిక్వెస్ట్‌ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో రౌడీబాయ్‌ కంటపడింది. బుజ్జితల్లి.. మా ఇంటికి రా.. నీకు నచ్చిన ఫుడ్‌, స్వీట్స్‌.. అన్నీ ఇంట్లోనే నీకోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తా అన్నాడు. అనడమే కాదు చేసి చూపించాడు కూడా! వి

ప్రేమతో ముద్దుల వర్షం
రోష్‌ జోడీ ఆ బుజ్జితల్లిని ఇంటికి పిలిచి తనకు నచ్చిన భోజనం వడ్డించారు. లడ్డూలు తినిపించారు. విజయ్‌ ఆ పాపను ఆప్యాయంగా ఎత్తుకుంటే రష్మిక తనపై ప్రేమతో ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పటినుంచి మనం కూడా ఫ్రెండ్సే అంటూ పాపతో సంభాషించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మనం కూడా ఫ్రెండ్సేకదా.. అనుకుంటూనే మొత్తానికి సాధించావ్‌, విరోష్‌ను కలిశావ్‌ అంటూ జనం కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: తెలుగు హీరోలని కొడతారెందుకు? ఎందుకంత కోపం? హీరోయిన్‌ ఆన్సరిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement