హీరోయిన్ రష్మికా మందన్న మైసా సినిమా కోసం భారీ సాహసమే చేస్తుంది. ఈ చిత్రంలో గోండు గిరిజన యువతిగా నటిస్తున్న ఆమె భారీ స్టంట్స్‌కు సంబంధించిన మెళకువలు నేర్చుకుంది. దీంతో ఈ మూవీ ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలబడిపోతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. రష్మిక కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద సాహసమే చేసిందని దర్శకుడు రవీంద్ర పుల్లె మాటాల్లో తెలుస్తోంది.. మైసాలో ఒక సీన్ కోసం రష్మిక మందన చేసిన సాహసం గురించి ఆయన రివీల్ చేశారు.
రష్మికా మందన్న నటిస్తున్న మైసా తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభమైన విషయం తెలసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన సీన్ కోసం ఆమె చాలా రిష్క్ చేసిందని దర్శకుడు చెప్పారు. సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ లేకుండా రష్మిక జంప్ చేసిందని ఆయన వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి హీరోలు 10 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయాలంటే డూప్ కావాలని కోరడం చూస్తూనే ఉన్నాం. అలాంటిది రష్మిక ఇంతపెద్ద రిష్క్ చేయడంతో అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కేరళలో కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా సారథ్యంలో సుమారు 20రోజుల పాటు అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ అంచనా వేస్తుంది. మైసాలో తన పాత్ర కోసం రష్మిక మందన్న చాలా కఠినంగా శిక్షణ తీసుకున్నారు. బ్యాంకాక్‌లో కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ దాదాపు ఎనిమిది గంటలకు పైగానే ఫైటింగ్ మరియు స్టంట్స్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ఆమె అంకితభావం చూస్తే, తెరపై పూర్తిగా కొత్త మరియు ఉగ్రమైన ఇమేజ్‌ను ప్రదర్శించాలనే ఆమె లక్ష్యం స్పష్టమవుతుంది.


