కాళ్లకు మెట్టెలతో రష్మిక కఠిన శిక్షణ.. రోజుకు 8 గంటలకు పైనే! | Rashmika Mandanna Trained In Martial Arts For Mysaa | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌లో రష్మిక కఠిన శిక్షణ.. రోజుకు 8 గంటకు పైనే!

Apr 18 2026 2:34 PM | Updated on Apr 18 2026 2:42 PM

Rashmika Mandanna Trained In Martial Arts For Mysaa

మొన్నటిదాకా పెళ్లి, బడ్డీమూన్‌ అంటూ పర్సనల్‌ లైఫ్‌ని ఆనందంగా గడిపినన రష్మిక, విజయ్‌ దేవరకొండ..ఇప్పుడు కెరీర్‌పై ఫోకస్‌ పెట్టారు. ఇద్దరూ తమ కొత్త సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయారు. రష్మిక అయితే తన ఫోకస్‌ అంతా ‘మైసా’పైనే పెట్టింది. ఈ చిత్రం కోసం ఆమె మానసికంగానే కాకుండా శారీరకంగానూ కష్టపడుతుంది.

ఇన్నాళ్లు రొమాంటిక్‌, కమర్షియల్‌ పాత్రలకే పరిమితం అయిన రష్మిక..ఇప్పుడు యాక్షన్‌ అవతారం ఎత్తింది. మైసాలో ఆమెకు భారీ యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అందుకే సవాళ్లతో కూడా శిక్షణను తీసుకుంటుంది. దాని కోసమే తాజాగా రష్మిక బ్యాంకాక్‌ వెళ్లింది. అక్కడ అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ నేతృత్వంలో, అలాగే ప్రఖ్యాత జైకా స్టంట్ టీమ్‌తో కలిసి మార్షల్ ఆర్ట్స్, స్టంట్ టెక్నిక్స్, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్‌లో శిక్షణ పొందుతోందట. దీని కోసం రష్మిక రోజుకు దాదాపు 8 గంటల పాటు ప్రాక్టీస్‌ చేస్తుందట. కాళ్లకు మట్టెలు ధరించి.. ప్రాక్టీస్‌ చేస్తున్న రష్మిక ఫోటోలు ఇప్పుడు నెటి​ంట వైరల్‌గా మారాయి.  

మైసా విషయానికొస్తే.. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయన ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు. అన్‌ఫార్ములా ఫిలింస్‌ పతాకంపై అజయ్, అనిల్‌ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ సినిమాలో గోండు జాతి హక్కులను కాపాడే యోధురాలిగా రష్మిక నటించబోతుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement