టాలీవుడ్ జంట రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ కొత్త ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. పెళ్లికి కొన్ని రోజుల ముందే తమ బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. వీరిద్దరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో విరోష్ జంట సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని సందడి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు.
తాజాగా ఈ జంట పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. విరోష్ జంట తమ హనీమూన్ కోసం థాయ్‌లాండ్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఫుల్ రొమాంటిక్‌గా ఉన్న ఈ ఫోటో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ థాయిలాండ్ హనీమూన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోలో విరోష్ జంట ఒక మెట్లపై ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ప్రశాంతంగా హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న 'రణబలి' చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ మూవీ బ్రిటిష్ కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు.


