'రష్మిక వెడ్డింగ్.. మాకు చాలా తక్కువ టైమ్ ఇచ్చింది' | Rashmika Mandanna Gives less time her Make up Artist in grand wedding | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'రష్మిక వెడ్డింగ్.. అలా కనిపించాలని మాతో చెప్పింది'

Apr 14 2026 9:02 PM | Updated on Apr 14 2026 9:03 PM

Rashmika Mandanna Gives less time her Make up Artist in grand wedding

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్‌లో ఉన్న ముద్దుగుమ్మ ఎట్టకేలకు ఈ ఏడాది తెలుగింటి కోడలిగా ఎంట్రీ ఇచ్చింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌ జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ‍అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.

అయితే ఈ పెళ్లిలో రష్మికను ముస్తాబు చేసిన మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్‌ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనకు ఎక్కువ మేకప్ వద్దని చెప్పిన రష్మిక.. మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారని తెలిపింది. కేవలం 40 నిమిషాల్లో రెడీ చేయాలని సూచించారని వెల్లడించింది. కానీ రష్మిక ఇచ్చిన టైమ్‌లో మా పని పూర్తి కాలేదని.. దాదాపు 90 నిమిషాలు పట్టిందని తన్వీ వివరించింది.

ఆమె అనుకున్న టైమ్ కన్నా ఆలస్యంగా రావడం వల్లే మాకు సమయం తగ్గించారని తన్వీ పేర్కొంది. పెళ్లిలో తాను చాలా సింపుల్‌గా, నేచురల్‌గా కనిపించాలని మాతో చెప్పిందని మేకప్ ఆర్టిస్ట్ వెల్లడించింది. కనీసం కాటుక కూడా పెట్టుకోవడానికి ఆమె ఇష్టపడలేదని తెలిపింది. మేము కూడా రష్మిక చెప్పనట్టే చేశామని.. కానీ ఇంతలా మాకు ప్రశంసలు వస్తాయని అనుకోలేదని చెప్పింది. రష్మిక హీరోయిన్ కావడంతో మేకప్‌, హెయిర్‌ స్టైల్‌పై ఆమెకు ఫుల్ క్లారిటీ ఉందని తన్వీ అన్నారు.

ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణబాలితో పాటు మైసా అనే చిత్రంలో నటిస్తున్నారు. రణబాలిలో విజయ్ దేవరకొండ సరసన కనిపించనున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తోన్న చిత్రమిదే కావడం విశేషం. ఈ మూవీని 1854- 1978 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి  రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement