breaking news
Bridal makeup
-
మౌన్ జారో పెళ్లికూతురు
పెళ్లి పీటలెక్కే ముందు నాజూగ్గా కనిపించాలన్న ఆకాంక్ష కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ ఆకాంక్ష ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’. ‘మౌన్ జారో’ అనే టైప్ 2 డయాబెటిస్ ఇంజెక్షన్లను ఇస్తూ ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్‌లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.క్షేమకరం కాని ఈ ట్రెండ్ పై కథనం.అదేమిటో... పెళ్లంటే అమ్మాయే అందంగా కనిపించాలని సామాజిక చట్టం. అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు. అమ్మాయి రూపానికి సంబంధించి ఎన్నో పట్టింపులు, ఆరాలు, నఖశిఖ పర్యంత పరీక్షలు. కాబట్టే పెళ్లంటే ఈ కాలంలో కూడా అమ్మాయిలు టెన్స్ అయ్యే పరిస్థితి ఉంది. వీరి కోసమని ‘మేకోవర్’లూ, ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్యాకేజీ’లు మార్కెట్లో బయలుదేరాయి. ఈ పరిస్థితి ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’.‘మౌన్ జారో’ అనేది టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు వాడే ఔషధం. దీనిలోని ‘టిర్జెపటైడ్’ అనే పదార్థం ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ ఔషధం పేరుతోనే ఇప్పుడు ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్‌లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.ఎందుకు ఈ ట్రెండ్?పెళ్లికి మూడు నుంచి ఆరునెలల ముందు 10నుంచి 15 కిలోలు తగ్గాలని చాలామంది యువతులు కోరుకుంటున్నారు. జిమ్, డైట్‌తో సాధ్యం కాని ఫలితాలు త్వరగా కావాలనుకునే వారు ఈ ప్యాకేజీల వైపు మొగ్గుతున్నారు. పెళ్లికి అవసరమైన లెహంగా ఫిట్టింగ్, ఫొటో షూట్, సోషల్ మీడియా ఒత్తిడి కూడా దీనికి కారణమవుతున్నాయి.ప్యాకేజీల్లో ఏముంది?ఢిల్లీలోని క్లినిక్‌లు ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్’, ‘వెడ్డింగ్ రెడీ’ పేర్లతో ప్యాకేజీలు ఇస్తున్నాయి. వీటిలో వైద్యుల పర్యవేక్షణలో మౌన్ జారో ఇంజెక్షన్లు, డైట్ కౌన్సెలింగ్, బాడీ కాంటూరింగ్ (నిర్దిష్ట శరీర భాగం సన్నబరచడం) సెషన్లు కలిపి అందిస్తున్నారు. వీటి ధర 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటోంది. పెళ్లి డేట్ చెప్పగానే ఆ డేట్‌కు టార్గెట్ బరువు సెట్ చేసి ప్లాన్ ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.వైద్యుల హెచ్చరికఅనన్య లాంటి కేసులపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌన్ జారో అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడని ఔషధం. వికారం, వాంతులు, ప్యాంక్రియాటైటిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కేవలం కాస్మెటిక్ కారణాలతో, వైద్య అవసరం లేకుండా దీన్ని వాడడం ప్రమాదకరమని ఎండోక్రై నాలజిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత జీవనశైలి మార్చుకోకపోతే తిరిగి బరువు పెరిగే అవకాశం 80 శాతం వరకు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.నా రూపమే నా సౌందర్యంఇలాంటి ట్రెండ్ సమాజంపై ఒత్తిడిని పెంచుతోందనీ సాదాసీదా అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తోందని సామాజికవేత్తలు అంటున్నారు. పెళ్లంటే సన్నగా ఉండాలనే భావన బలపడేలా చేస్తున్న సౌందర్య సాధనాల సంస్థల ప్రచారాన్ని నిరోధించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ‘మౌన్ జారో పెళ్లికూతురు’ ట్రెండ్ యథాతథ రూపంలోని ఒరిజినాలిటీని సవాలు చేస్తోంది. ‘నా రూపమే నా సౌందర్యం’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెళ్లగిస్తోంది. ‘ఆరోగ్యంగా ఉండటమూ అందంగా ఉండటమే’ అనే సంగతిని ఆడపిల్లలు మర్చిపోతున్నారు. పెళ్లిరోజున అందంగా కనిపించాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరిని మర్చిపోవద్దు. అలాగే నకిలీ వెల్నెస్ క్లినిక్‌ల బారిన పడొద్దు. పెళ్లిలో బాగా కనిపించాలని..ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల అనన్య శర్మ (పేరు మార్చబడింది) అనుభవం ఈ ట్రెండ్‌కు అద్దం పడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన అనన్యకు 2026 ఆగస్టులో వివాహం నిశ్చయమైంది. ఆమె బరువు 78 కిలోలు. డిజైనర్ లెహంగా సెట్ అవ్వాలంటే కనీసం 65 కిలోలకు రావాలని బోటిక్ వారు సూచించారు. జిమ్‌లో చేరినా ఉద్యోగ ఒత్తిడి వల్ల క్రమం తప్పకుండా వెళ్లలేకపోయింది. దీంతో స్నేహితురాలి సలహాతో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రముఖ స్లిమ్మింగ్ క్లినిక్‌లో ‘బ్రైడల్ మౌన్ జారో ప్యాకేజీ’ తీసుకుంది. నాలుగు నెలల ప్యాకేజీ ఖరీదు 1.4 లక్షలు. వారానికి ఒకసారి టిర్జెపటైడ్ ఇంజెక్షన్, నెలకు రెండుసార్లు డైటీషియన్ కన్సల్టేషన్, 8 సెషన్ల బాడీ కాంటూరింగ్ ఇందులో భాగం. ‘మొదటి నెలలోనే ఆకలి బాగా తగ్గింది. 4 కిలోలు తగ్గాను’ అని అనన్య చెప్పింది. నాలుగు నెలలు పూర్తయ్యేసరికి ఆమె 12 కిలోలు తగ్గి 66కిలోలకు చేరింది. అయితే ఈ క్రమంలో తరచూ వికారం, నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపింది. ‘పెళ్లి అయ్యాక మందు ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతానేమో అనే భయం ఉంది. కానీ పెళ్లి రోజు ఫోటోల్లో బాగా కనిపించడం నాకు ముఖ్యం’ అని ఆమె అంది. -
'రష్మిక వెడ్డింగ్.. మాకు చాలా తక్కువ టైమ్ ఇచ్చింది'
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఎట్టకేలకు ఈ ఏడాది తెలుగింటి కోడలిగా ఎంట్రీ ఇచ్చింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే ఈ పెళ్లిలో రష్మికను ముస్తాబు చేసిన మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనకు ఎక్కువ మేకప్ వద్దని చెప్పిన రష్మిక.. మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారని తెలిపింది. కేవలం 40 నిమిషాల్లో రెడీ చేయాలని సూచించారని వెల్లడించింది. కానీ రష్మిక ఇచ్చిన టైమ్‌లో మా పని పూర్తి కాలేదని.. దాదాపు 90 నిమిషాలు పట్టిందని తన్వీ వివరించింది.ఆమె అనుకున్న టైమ్ కన్నా ఆలస్యంగా రావడం వల్లే మాకు సమయం తగ్గించారని తన్వీ పేర్కొంది. పెళ్లిలో తాను చాలా సింపుల్‌గా, నేచురల్‌గా కనిపించాలని మాతో చెప్పిందని మేకప్ ఆర్టిస్ట్ వెల్లడించింది. కనీసం కాటుక కూడా పెట్టుకోవడానికి ఆమె ఇష్టపడలేదని తెలిపింది. మేము కూడా రష్మిక చెప్పనట్టే చేశామని.. కానీ ఇంతలా మాకు ప్రశంసలు వస్తాయని అనుకోలేదని చెప్పింది. రష్మిక హీరోయిన్ కావడంతో మేకప్, హెయిర్ స్టైల్‌పై ఆమెకు ఫుల్ క్లారిటీ ఉందని తన్వీ అన్నారు.ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణబాలితో పాటు మైసా అనే చిత్రంలో నటిస్తున్నారు. రణబాలిలో విజయ్ దేవరకొండ సరసన కనిపించనున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తోన్న చిత్రమిదే కావడం విశేషం. ఈ మూవీని 1854- 1978 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
వావ్; పెళ్లిలో రాణీగారి కిరీటం.. నెట్టింట వైరల్
వివాహంలో వధువు అలంకరణ గొప్పగా ఉండటంతో పాటు వినూత్నంగానూ కనిపించాలనే తపన ఉంటుంది. దాంట్లో భాగంగా పాకిస్తాన్ పెళ్లికూతురు వాజ్మా తన రూపాన్ని మరింత అందంగా, ప్రత్యేకంగా మార్చేసింది. వెడ్డింగ్ ఫోటో షూట్లో భాగంగా చేసిన అలంకరణ నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. అందమైన పువ్వులు, లతల ఎంబ్రాయిడరీ చేసిన గ్రాండ్ డ్రెస్ ధరించింది. చెవులకు పెద్ద పెద్ద జూకాలు, పాపిట్లో వెడల్పాటి మాంగ్ టిక్కా ఆభరణాల అలంకరణా అంతే గ్రాండ్‌గా ఉంది. వీటితోపాటు మరింత ఆకర్షణీయంగా అమర్చుకున్న కిరీటం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు తీసినా నటాషా జుబైర్ సోషల్ మీడియాలో ఈ ప్రత్యేక ఫొటోలను షేర్ చేశాడు. ‘నేను పెళ్లికూతుళ్ల ఫొటోలు ఎన్నో తీశాను. వారి డిజైనర్ డ్రెస్‌లు చూశాను. అవన్నీ ఒకేలా ఉండేవి. కానీ, ఈ పెళ్ళి ఫొటోలు ప్రత్యేకమైనవి. దుస్తులు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. పెళ్లికూతురు మెహెందీ వేడుకకు కిరీటంతో సందడి చేసింది. తెలుపు, ఎరుపు గులాబీలతో కురులను అందంగా అలంకరించింది. ఆమె డ్రెస్సింగ్ మొత్తం చైనీస్, ఇండోనేషియా సంస్కృతి నుంచి తీసుకున్నవి. తల ఆభరణాలను మాత్రం కస్టమైజ్ చేసింది’ అంటూ వివరించాడు. ఏ దేశమైనా పెళ్లి అలంకరణలో అందంతో పాటు కొంత వినూత్నత కూడా జత చేరితే ఎల్లలు లేకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటాయి. -
వెడ్డింగ్ మేకప్ ట్రెండ్స్‌పై స్పెషల్ వర్క్ షాప్
-
బ్రైడల్ షోకేస్
ప్రతి అమ్మాయికి పెళ్లి ఓ మధురమైన ఘట్టం. అతివల ప్రియమైన వేడుకలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రయోగం మొదలుపెట్టింది జూబ్లీహిల్స్‌లోని ‘మిర్రర్స్ సెలూన్ అండ్ అకాడమీ’. బ్రైడల్ మేకప్‌లోని ట్రెండ్స్‌ను హైదరాబాదీలకు పరిచయం చేసింది. ముంబైకి చెందిన సెలబ్రిటీ మేకప్‌మ్యాన్ చిరాగ్ బాంబోట్ మిర్రర్స్ సెలూన్ అండ్ అకాడమీ విద్యార్థులకు నాలుగు రకాల మేకప్‌లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సెలీనాజైట్లీ, సుష్మితాసేన్, కత్రినాకైఫ్, సన్నీలియోన్, కంగనా రనౌత్, అనుష్క వంటి ప్రముఖ తారలకు మేకప్‌మ్యాన్‌గా వ్యవహరిస్తున్నారు చిరాగ్ బాంబోట్. ఎంగేజ్మెంట్కు ఫ్రెష్ అండ్ ఫ్లోరల్, సంగీత్‌కు వాటర్‌ప్రూఫ్, వెడ్డింగ్‌కు దివా లుక్, రిసెప్షన్‌కు బ్రైడల్ కోచర్ లుక్... ఇలా ఒక్కో ప్రత్యేకమైన మేకప్‌లను చేసి చూపించారాయన. - శిరీష చల్లపల్లి


