బ్రైడల్ షోకేస్ | Special Makeup for Bridal showcases | Sakshi
Sakshi News home page

బ్రైడల్ షోకేస్

Jul 31 2014 1:19 AM | Updated on Sep 2 2017 11:07 AM

బ్రైడల్ షోకేస్

బ్రైడల్ షోకేస్

ప్రతి అమ్మాయికి పెళ్లి ఓ మధురమైన ఘట్టం. అతివల ప్రియమైన వేడుకలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రయోగం మొదలుపెట్టింది జూబ్లీహిల్స్‌లోని ‘మిర్రర్స్ సెలూన్ అండ్ అకాడమీ’.

ప్రతి అమ్మాయికి పెళ్లి ఓ మధురమైన ఘట్టం. అతివల ప్రియమైన వేడుకలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రయోగం మొదలుపెట్టింది జూబ్లీహిల్స్‌లోని ‘మిర్రర్స్ సెలూన్ అండ్ అకాడమీ’. బ్రైడల్ మేకప్‌లోని ట్రెండ్స్‌ను హైదరాబాదీలకు పరిచయం చేసింది. ముంబైకి చెందిన సెలబ్రిటీ మేకప్‌మ్యాన్ చిరాగ్ బాంబోట్ మిర్రర్స్ సెలూన్ అండ్ అకాడమీ విద్యార్థులకు నాలుగు రకాల మేకప్‌లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సెలీనాజైట్లీ, సుష్మితాసేన్, కత్రినాకైఫ్, సన్నీలియోన్, కంగనా రనౌత్, అనుష్క వంటి ప్రముఖ తారలకు మేకప్‌మ్యాన్‌గా వ్యవహరిస్తున్నారు చిరాగ్ బాంబోట్. ఎంగేజ్‌మెంట్‌కు ఫ్రెష్ అండ్ ఫ్లోరల్, సంగీత్‌కు వాటర్‌ప్రూఫ్, వెడ్డింగ్‌కు దివా లుక్, రిసెప్షన్‌కు బ్రైడల్ కోచర్ లుక్... ఇలా ఒక్కో ప్రత్యేకమైన మేకప్‌లను చేసి చూపించారాయన.  
 -  శిరీష చల్లపల్లి

Advertisement
 
Advertisement
Advertisement