హీరోయిన్ రష్మికా మందన్న యాక్షన్ బాట పట్టారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభం అయింది. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మైసా’. ఈ మూవీలో రష్మిక గోండు గిరిజన అమ్మాయిగా కనిపించనున్నారు.
పాన్ ఇండియాగా రూపొందుతోన్న ఈ మూవీలో తన కెరీర్‌లో అత్యంత సవాల్‌తో కూడిన పాత్ర చేస్తున్నారు రష్మిక. 15 రోజుల పాటు జరగనున్న యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్‌ను కేరళలో ప్రారంభించాం. కేచా ఖంపక్దీ మాస్టర్ హై ఓల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్‌గా నిలిచేలా ఉంటుంది. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: శ్రేయాస్ పి. కృష్ణ.


