పెళ్లి తర్వాత తొలి వేకేషన్ ట్రిప్.. విరోష్ జంట వీడియో వైరల్..! | Vijay and Rashmika first vacation trip after wedding video goes viral | Sakshi
Sakshi News home page

Vijay-Rashmika: 'మా సొంత ఇల్లులా అనిపించింది'.. వేకేషన్‌పై రష్మిక పోస్ట్ వైరల్

Mar 25 2026 5:32 PM | Updated on Mar 26 2026 4:27 PM

Vijay and Rashmika first vacation trip after wedding video goes viral

టాలీవుడ్ జంట విజయ్-రష్మిక ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు. ఈ రిసెప్షన్‌ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.

తాజాగా పెళ్లి తర్వాత విరోష్ జంట వేకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం హనీమూన్‌ ట్రిప్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధంచిన  ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరలవుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఈ థాయ్‌లాండ్‌ ట్రిప్‌లో తామిద్దరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేశామని రష్మిక తెలిపారు. ఈ మేరకు  ఎయిర్‌బిఎన్‌బి (Airbnb) భాగస్వామ్యంతో రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు.

 ‘ప్రశాంతమైన ఉదయం, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, పూల్ ఆటలతో ఇక్కడి కో సముయ్‌లోని ప్రాంతం  మా సొంత ఇల్లులా అనిపించిందని తెలిపింది.  ఆ రోజుల్లో మేము గడిపిన కొన్ని క్షణాలు’ అంటూ వీడియోను పోస్ట్ చేసింది. 

అయితే వీరి పెళ్లి కోసం టాలీవుడ్‌ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఎక్కడా తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు. ఎన్నిసార్లు రూమర్స్ వినిపించినా వాటిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొన్ని సార్లు ఇన్‌ డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తూ వచ్చారు. చాలాసార్లు వీరిద్దరు ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. కానీ చివరికీ పెళ్లి కొద్ది రోజుల ముందు మాత్రమే సోషల్ మీడియాలో అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement