‘‘పెళ్లి వేడుకల తర్వాత మేం కొన్నాళ్లు తీరికగా గడపాలనుకున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాల వివాహం ఫిబ్రవరి 26న జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్, గుడికి వెళ్లడం, సత్యనారాయణ వ్రతం, అభిమానులతో విందు, మీడియాని ప్రత్యేకంగా కలవడం... ఇలా వివాహ వేడుకలతో బిజీ బిజీగా గడిపిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ఉరుకులు పరుగులు లేకుండా కాస్త ప్రశాంతంగా ఉండాలనుకున్నారు. అందుకే థాయ్‌ల్యాండ్‌లోని కో సామ్యూయ్ దీవికి వెళ్లారు.
అయితే ఈ నూతన జంటతో పాటు వీరి స్నేహితులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ‘‘ప్రశాంతమైన ఉదయాలు, ఈతతో మధ్యాహ్నాలు, టేబుల్ టెన్నిస్ మరియు పూల్ గేమ్స్‌తో సాయంత్రాలు, సినిమాలతో రాత్రిళ్లు... ఇలా చిరునవ్వులతో సమయం గడిచి΄ోయింది. కో సామ్యూయ్ మాకు ఇల్లులానే అనిపించింది. ఫ్రెండ్స్‌తో కలిసి గడిపిన ఆ ఆనంద క్షణాలు’’ అని పేర్కొని, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రష్మిక కొన్ని ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ‘మై హజ్బెండ్’ అని విజయ్‌ని రష్మిక పిలవడం, విజయ్ నవ్వుతూ చూడడం, ఇంకా రష్మిక కోసం విజయ్ పిజ్జా తయారు చేయించి, ఇవ్వడం, ఇద్దరూ డ్యాన్స్ చేయడం, చిరునవ్వులు చిందించడం, మాట్లాడుకోవడం వంటి విజువల్స్ ఉన్నాయి.


