సాహసాల మైసా | Rashmika Mandanna Trains Hard in Bangkok | Sakshi
Sakshi News home page

సాహసాల మైసా

Apr 19 2026 1:13 AM | Updated on Apr 19 2026 1:13 AM

Rashmika Mandanna Trains Hard in Bangkok

సినిమాల పట్ల, తాను పోషించే పాత్రల పట్ల హీరోయిన్‌ రష్మికా మందన్నా ఎంతో అంకితభావంతో పని చేస్తుంటారు... ఎంతైనా కష్టపడతారు.... ఎలాంటి సవాల్‌ అయినా స్వీకరిస్తారు. ప్రస్తుతం ‘మైసా’లో సవాల్‌తో కూడుకున్న పాత్రను చేస్తున్నారామె. ఈ ఉమన్‌ సెంట్రిక్‌ యాక్షన్‌ సినిమాలో రష్మికా మందన్నా టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ఇందులో గోండు జాతికి చెందిన గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నారు. త్వరలోనే కేరళలో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన సవాల్‌ని ఎదుర్కోడానికి రష్మిక ప్రస్తుతం బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ‘‘మైసా పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకోవాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు రష్మిక.

బ్యాంకాక్‌లో రోజుకు దాదాపు 8 గంటల పాటు అడ్వాన్డ్స్‌ స్టంట్స్, హ్యాండ్‌ టు హ్యాండ్‌ ఫైట్, హై స్పీడ్‌ యాక్షన్‌ టెక్నిక్స్, కంబాట్‌ స్టంట్స్‌ నేర్చుకుంటున్నారామె. ఈ సినిమాలో ఒక సంకల్పంతో కూడిన యోధురాలిలా రష్మిక కనిపిస్తారు. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచి పోతుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement