breaking news
Technology
-
మల్కాజిగిరి - కామారెడ్డి మధ్య రైల్వే ‘కవచ్ 4.0’
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ అమలులో తెలంగాణ మరో ఘనతను సాధించింది. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మల్కాజిగిరి - కామారెడ్డి సెక్షన్ పరిధిలో 108 రూట్ కిలోమీటర్ల మేర అత్యాధునిక ‘కవచ్ 4.0’ వెర్షన్‌ను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా నిర్వహించడానికి ఇది ఎంతగానో దోహదపడనుంది.కవచ్ 4.0 ప్రత్యేకతలుఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థ అయిన కవచ్‌లో 4.0 వెర్షన్ అత్యంత ప్రామాణికమైనది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ద్వారా చాలా పనులు నిర్వహించవచ్చు.సిగ్నల్ దాటితే స్వయంచాలక బ్రేకులు: లోకో పైలట్ పొరపాటున సిగ్నల్ దాటి ముందుకు వెళ్తే కవచ్ వ్యవస్థ తక్షణమే స్పందించి రైలును ఆటోమేటిక్‌గా ఆపుతుంది.ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వస్తే: ఎదురెదురుగా లేదా ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రమాదకరంగా సమీపిస్తున్నప్పుడు ఘర్షణను నివారించడానికి ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.వాతావరణ ప్రతికూలతల్లోనూ స్పష్టత: దట్టమైన పొగమంచు, వర్షం లేదా ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సిగ్నల్స్ సరిగ్గా కనిపించకపోయినా లోకో పైలట్ క్యాబిన్ డిస్ప్లే యూనిట్ ద్వారా సిగ్నల్ సమాచారం స్పష్టంగా తెలుస్తుంది.వేగ పరిమితి నియంత్రణ: వంతెనలు, మలుపుల వద్ద నిబంధనల కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంటే ఈ సిస్టమ్ స్వయంచాలకంగా వేగాన్ని వేగ పరిమితికి తగ్గిస్తుంది.A new boost to rail safety! KAVACH 4.0 now covers 108 Route Kilometres between Malkajgiri and Kamareddi rail section in Telangana enabling safer and seamless train operations across the region.#KAVACH4.0 #RailInfra4Telangana pic.twitter.com/C3JP6FLuid— Ministry of Railways (@RailMinIndia) September 23, 2026మల్కాజిగిరి - కామారెడ్డి మార్గంలో ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడం వల్ల ఉత్తర తెలంగాణ పరిధిలోని రైలు రవాణా భద్రత గణనీయంగా పెరుగుతుంది. అధునాతన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు, టవర్ల ద్వారా నిరంతర రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌తో ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మిగిలిన ప్రధాన మార్గాల్లోనూ కవచ్ 4.0ను విస్తరించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే.. -
భారత్ నుంచి అమెరికా వరకు.. టెక్నాలజీ రంగంలో కిరణ్ కుమార్ కక్కిరేని విజయ ప్రస్థానం!
భారతదేశంలో ఒక Linux Administratorగా ప్రారంభమైన కెరీర్... కాలంతో పాటు కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ DevOps, AWS, Cloud Computing, Automation రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకున్న ప్రయాణం... చివరకు అమెరికాలోని టెక్నాలజీ రంగంలో నాయకత్వ స్థాయికి చేరుకోవడం. ఇది కిరణ్ కుమార్ కక్కిరేని ప్రొఫెషనల్ జర్నీ.ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న Equinox IT Solutions LLCలో Chief Technology Officer (CTO)గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్, తన కెరీర్లో Cloud Computing, AWS, DevOps, Infrastructure Automation వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.కిరణ్ ప్రయాణానికి పునాది భారతదేశంలోనే పడింది. Electronics and Communicationsలో బ్యాచిలర్ విద్య అనంతరం IT రంగంలోకి ప్రవేశించిన ఆయన, తన కెరీర్ ప్రారంభంలో Linux Administrationపై పనిచేశారు. Servers, application environments, deployment processes, networking, system administration వంటి అంశాలపై సంపాదించిన అనుభవం తర్వాతి దశలో DevOps, automation, cloud technologies వైపు అడుగులు వేయడానికి పునాదిగా మారింది.Linux నుంచి DevOps వరకుసాఫ్ట్వేర్ రంగంలో మారుతున్న అవసరాలను ముందుగానే గుర్తించిన కిరణ్, సంప్రదాయ system administrationకే పరిమితం కాకుండా automation, build and release engineering, Continuous Integration, Continuous Delivery వంటి అంశాలపై దృష్టి పెట్టారు.Jenkins, Ansible, Terraform, Docker, Kubernetes వంటి technologiesతో పాటు CI/CD practicesపై పనిచేస్తూ, software development మరియు IT operations మధ్య automation ఎంత కీలకమో తన కెరీర్లో ప్రత్యక్షంగా చూశారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం Cloud Computing వైపు మళ్లింది.AWSలో EC2, S3, VPC, IAM, RDS, DynamoDB, Lambda, CloudWatch, Auto Scaling, CloudFormation, ECS, SageMaker వంటి విభిన్న servicesతో పనిచేసిన అనుభవంతో scalable, reliable, automated cloud environments నిర్మాణంపై తన expertiseను విస్తరించారు.అమెరికాలో ఉన్నత విద్య... టెక్నాలజీలో తదుపరి అడుగుతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకునే క్రమంలో కిరణ్ అమెరికాలో Computer Science Engineeringలో Master's degree పూర్తి చేశారు. విద్యతో పాటు industry exposure ఆయనకు enterprise-scale technology challengesను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం కల్పించింది.తర్వాతి సంవత్సరాల్లో cloud migration, infrastructure automation, application deployment, monitoring, security, high availability, machine learning infrastructure వంటి విభిన్న రంగాల్లో పనిచేస్తూ తన professional expertiseను విస్తరించుకున్నారు. ఈ ప్రయాణమే చివరకు ఆయనను Equinox IT Solutions LLCలో CTO స్థాయికి తీసుకెళ్లింది.AIతో మారుతున్న DevOps ప్రపంచంపై ప్రత్యేక దృష్టికిరణ్ ఆసక్తి ప్రస్తుతం సంప్రదాయ DevOpsతోనే ఆగిపోలేదు. Artificial Intelligence, Machine Learning మరియు DevOps కలయిక భవిష్యత్తులో IT operationsను ఎలా మార్చబోతోందనే అంశంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.Predictive monitoring, intelligent CI/CD, automated testing, anomaly detection, infrastructure optimization, AI-assisted incident management వంటి technologies భవిష్యత్తులో DevOps teams పనిచేసే విధానాన్ని గణనీయంగా మార్చగలవని ఆయన అభిప్రాయపడుతున్నారు.ఈ అంశాన్నే మరింత విస్తృతంగా professionalsకు అందించేందుకు కిరణ్ “AI-Powered DevOps” పేరుతో పుస్తకాన్ని రచించారు. AI మరియు DevOps కలయిక, intelligent automation, CI/CD, machine learning ఆధారిత infrastructure management, ChatOps, monitoring, security automation, responsible AI వంటి అంశాలను ఈ పుస్తకం చర్చిస్తుంది.అంతర్జాతీయ వేదికపై గుర్తింపులుTechnology రంగంలో తన ప్రయాణంతో పాటు professional communityతో అనుసంధానాన్ని కొనసాగిస్తున్న కిరణ్ IEEEలో Active Memberగా ఉన్నారు. అలాగే ఆయనకు DevOps Distinction Award 2024, Best Employee of the Year 2023, CTO of the Year by Radio City, Asian Research Excellence Award వంటి గుర్తింపులు లభించినట్లు ఆయన ప్రొఫైల్ పేర్కొంటోంది.ఈ గుర్తింపులతో పాటు Cloud Computing, AWS, DevOps, AI-driven automation వంటి రంగాలపై తన professional knowledgeను articles, research-related activities మరియు technology discussions ద్వారా విస్తరించే దిశగా ఆయన కొనసాగుతున్నారు.భారత యువతకు ఒక సందేశంకిరణ్ ప్రయాణంలో కనిపించే ముఖ్యమైన అంశం నిరంతర అభ్యాసం. Linux Administrationతో ప్రారంభమైన కెరీర్ DevOpsకు, అక్కడి నుంచి Cloud Computingకు, ఇప్పుడు AI-powered infrastructure వరకు విస్తరించింది. Technology రంగంలో ఒక skill నేర్చుకోవడం మాత్రమే విజయానికి సరిపోదని, మారుతున్న technology ecosystemకు అనుగుణంగా నిరంతరం నేర్చుకోవడం అవసరమనే విషయాన్ని ఆయన కెరీర్ ప్రయాణం సూచిస్తుంది.భారతదేశంలో కెరీర్ ప్రారంభించి, అంతర్జాతీయ technology ecosystemలో తనకంటూ ఒక professional identity నిర్మించుకున్న కిరణ్ కుమార్ కక్కిరేని ప్రయాణం.. ప్రత్యేకంగా Cloud, DevOps, AI వంటి emerging technologiesలో కెరీర్ నిర్మించుకోవాలని ఆశించే యువ professionalsకు ఒక ఆసక్తికరమైన ఉదాహరణగా నిలుస్తోంది.Linux Administratorగా మొదలైన ప్రయాణం నుంచి CTO వరకు, traditional infrastructure నుంచి AI-Powered DevOps వరకు కిరణ్ కుమార్ కక్కిరేని కెరీర్ మారుతున్న టెక్నాలజీతో పాటు మన నైపుణ్యాలు కూడా మారుతూ ఉండాలనే సందేశాన్ని ప్రతిబింబిస్తోంది. -
భారత సైబర్ బలగానికి గూగుల్ డైరెక్ట్ రిపోర్ట్!
ఆన్లైన్లో చిన్నారుల భద్రతను బలోపేతం చేసే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫారమ్‌ల్లో కనిపించే చిన్నారుల లైంగిక వేధింపుల సమాచారం(సీఎస్ఏఎం)ను ఇకపై నేరుగా భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రానికి (I4C) అందజేయడానికి అంగీకరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే I4Cకి ఈ డేటాను పంపడం ద్వారా భారత చట్ట అమలు సంస్థలకు వేగంగా సమాచారం అందుతుంది.పాత పద్ధతికి స్వస్తి.. నేరుగా నివేదనఇంతకాలం గూగుల్, మెటా వంటి గ్లోబల్ టెక్ సంస్థలు భారతదేశంలో గుర్తించిన సీఎన్ఏఎం కంటెంట్‌ను ముందుగా అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ)కి పంపేవి. అక్కడ పరిశీలించిన అనంతరం ఆ నివేదికలు భారత ఏజెన్సీలకు చేరేవి. ఈ ప్రక్రియ వల్ల విలువైన సమయం వృథా అవుతోందని, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ రక్షణ కల్పించడం ఆలస్యమవుతోందని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం టెక్ కంపెనీలపై ఒత్తిడి పెంచింది. ఇటీవల మెటా సైతం ఇదే నిర్ణయం తీసుకోగా తాజాగా గూగుల్ కూడా భారత విజ్ఞప్తికి నిలబడింది.ఒత్తిడి పెంచిన బీబీసీ దర్యాప్తుఇటీవల బీబీసీ ఐ(BBC Eye) చేసిన పరిశోధనలో ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని శోధన పదాల (సెర్చ్ టర్మ్స్) ద్వారా చిన్నారుల లైంగిక ప్రసార ఛానెళ్లకు దారితీసే ప్రకటనలు కనిపిస్తున్నట్లు వెల్లడైంది. ఈ తీవ్ర పరిణామంపై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. ఈ ఉదంతం తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలపై తక్షణ చర్యల కోసం కేంద్రం నుంచి ఒత్తిడి పెరిగింది.యూట్యూబ్‌తో పాటు మెటా ప్లాట్‌ఫారమ్‌లకు అత్యధిక వినియోగదారులు ఉన్న అతిపెద్ద మార్కెట్ భారతదేశమే. ఐటీ చట్టం సెక్షన్ 67B ప్రకారం చట్టపరమైన బాధ్యతలను నెరవేరుస్తూ కాలయాపన లేకుండా నేరస్థులను పట్టుకోవడానికి ఈ ప్రత్యక్ష రిపోర్ట్ విధానం దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనాలా? ఆగాలా?.. ఈరోజు కొత్త రేట్లు ఇవే.. -
ఫేక్ లైక్స్, రీపోస్టులతో Xలో చీటింగ్ గేమ్!.. మస్క్ దావా
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సంచలన ఆరోపణలకు దిగింది. ఫేక్ లైక్స్, రీపోస్టులు, రిప్లైలతో కృత్రిమంగా ఎంగేజ్మెంట్ పెంచి.. క్రియేటర్లకు చెల్లించే డబ్బును కొల్లగొట్టే స్కామ్ నడిచిందని చెబుతోంది. ఈ వ్యవహారంలో బిట్‌కాయిన్/క్రిప్టో కంటెంట్‌కు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లైన వివేక్ కుమార్ సేన్, జమ్యాంగ్ షెర్పాతో పాటు మరికొందరిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లోని హైకోర్టులో సివిల్ దావా వేసింది. తమ క్రియేటర్ పేమెంట్ వ్యవస్థను మోసం చేసి భారీ మొత్తంలో నగదును వాళ్లు సొంతం చేసుకున్నారని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తమకు ఇప్పించాలని కోర్టును కోరింది. ఎక్స్‌లో కొంతకాలంగా క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ (Creator Revenue Sharing) అనే కార్యక్రమం నడుస్తోంది. ఇందులో అర్హత పొందిన క్రియేటర్లు తమ పోస్టుల ద్వారా వచ్చే అర్హత కలిగిన ఎంగేజ్మెంట్ ఆధారంగా ఆదాయం పొందేవారు. అయితే ఈ వ్యవస్థలో నిజమైన యూజర్ల స్పందనతో పాటు కృత్రిమంగా ఎంగేజ్మెంట్ సృష్టించే అవకాశం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా X దాఖలు చేసిన కేసు ఈ అంశాన్నే కోర్టు ముందుకు తీసుకెళ్లింది. ఎక్స్ ఆరోపణల ప్రకారం.. వివేక్ సేన్, జమ్యాంగ్ షెర్పా తదితరులు బిట్‌కాయిన్‌కు సంబంధించిన పలు X ఖాతాలను ఒక నెట్వర్క్లా నిర్వహించారు. ఆ ఖాతాలు ఒకదానికొకటి లైక్‌లు కొట్టడం, రీపోస్టులు చేయడం, రిప్లైలు ఇవ్వడం ద్వారా నిజమైన యూజర్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నట్టుగా కనిపించేలా చేశాయని కంపెనీ పేర్కొంది.ఒకే కంటెంట్.. నిమిషాల వ్యవధిలో!ఈ వ్యవహారం ఎలా జరిగిందో వివరించేందుకు ఎక్స్ తన కేసులో కొన్ని ఉదాహరణలను కూడా ప్రస్తావించింది. @TrendingBitcoin, @saylordocs అనే ఖాతాలు 2025 అక్టోబర్ 10న కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఒకే కంటెంట్‌ను పోస్టు చేసినట్లు పేర్కొంది. మరో సందర్భంలో మూడు ఖాతాలు ఒకే పోస్టుకు కేవలం 31 సెకన్ల వ్యవధిలో స్పందించినట్లు తెలిపింది. ఇలా ఒకే నెట్‌వర్క్‌లోని ఖాతాలు పరస్పరం లైక్‌లు, రీపోస్టులు, రిప్లైలతో పోస్టులకు కృత్రిమంగా స్పందనలు పెంచేవని ఎక్స్ ఆరోపించింది. ఖాతా సస్పెండ్ అయితే.. మరోదానితో ఆట?ఒక ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసినా.. అదే నెట్‌వర్క్‌లోని మరో ఖాతాల ద్వారా కార్యకలాపాలను కొనసాగించేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని కంపెనీ ఆరోపించింది. అంటే ఒక ఖాతాపై చర్యలు తీసుకున్నా.. మిగిలిన ఖాతాల ద్వారా ప్రధాన ఖాతాలకు ఎంగేజ్మెంట్ పెంచే అవకాశం ఉండేదని పేర్కొంది.ఇదే క్రమంలో వివేక్ సేన్ 2025 డిసెంబర్లో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న మరో ఎక్స్ ఖాతాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా దావాలో పేర్కొంది. ప్లాట్‌ఫారమ్ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగి ఇబ్బందుల్లో పడకూడదన్న ఉద్దేశంతో తాను మాట్లాడినట్లు ఆయన రాసిన సందేశాన్ని కూడా కంపెనీ తన వాదనకు ఆధారంగా ప్రస్తావించింది. రూ.2.6 కోట్లు ఎలా వచ్చాయి?కృత్రిమ ఎంగేజ్మెంట్ సృష్టించిన నెట్వర్క్ ద్వారా కనీసం 207,384 పౌండ్లు క్రియేటర్ పేమెంట్లు పొందినట్లు ఎక్స్ ఆరోపిస్తోంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.2.6 కోట్లు. అంతేకాదు.. ఈ వ్యవహారాన్ని గుర్తించడం, దర్యాప్తు చేయడం, సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలకు తమకు కనీసం మరో 75,000 పౌండ్లు ఖర్చవుతుందని ఎక్స్ పేర్కొంది. ఈ మొత్తంతో పాటు నష్టపరిహారం, వడ్డీ, న్యాయపరమైన ఖర్చులను కూడా నిందితుల నుంచి ఇప్పించాలని కోర్టును కోరుతోంది. మస్క్ రిప్లై చూశారా?ఈ కేసుపై X జనరల్ కౌన్సెల్ జేమ్స్ ఎం. బర్న్‌హామ్ స్పందిస్తూ.. క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ డోంట్ మెస్ విత్ అంటూ ఇలా మోసాలకు పాల్పడే వాళ్లకు వార్నింగ్ తరహాలో స్పందించారు.ఇదిలా ఉండగా.. ఎక్స్ ఇప్పటికే తన పాత క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ కార్యక్రమాన్ని ముగించింది. సెప్టెంబర్ 7, 2026 వరకు ఆ ప్రోగ్రామ్ కింద ఆదాయాలు కొనసాగగా.. సెప్టెంబర్ 8 నుంచి అర్హత ఉన్న క్రియేటర్లకు ఒరిజినల్ కంటెంట్ రివార్డు కార్యక్రమం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒరిజినల్ కంటెంట్ నుంచి వచ్చే అర్హత కలిగిన ఇంప్రెషన్స్ ఆధారంగా చెల్లింపులు చేస్తోంది. కృత్రిమంగా సృష్టించిన లేదంటే మోసపూరిత ఇంప్రెషన్స్ ఇందులో పరిగణనలోకి రావని ఎక్స్ స్పష్టం చేసింది. -
మనుషుల నియంత్రణలోనే ఏఐ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత భద్రత చర్చనీయాంశంగా మారిన తరుణంలో ఈ టెక్నాలజీ మనుషుల నియంత్రణలోనే ఉండాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఏఐ అనేది మానవాళికి సహాయకరమైన సాధనంగానే ఉండాలనుకుంటోంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ ఈ విషయాలు తెలిపారు. ‘ప్రయోగశాలలు ఏం చెబుతున్నాయనే దానిపై నేను వ్యాఖ్యానించబోను. కాకపోతే మైక్రోసాఫ్ట్ సిద్ధాంతం ఒక్కటే. ఏఐ అనేది మానవాళికి సేవ చేసే విధంగా, సహాయకరంగా ఉండాలి. ఎల్లవేళలా అది మనుషుల నియంత్రణలోనే ఉండాలి‘ అని ఆయన చెప్పారు. ఇందుకోసం తగినంత స్థాయిలో ఏఐ సిస్టంల టెస్టింగ్, కస్టమర్ల మేధో హక్కులకు భద్రత, సురక్షితమైన..విశ్వసనీయమైన మౌలిక సదుపాయాలు, బహుళ మోడల్స్‌తో ఓపెన్ ఏఐ వ్యవస్థ అవసరమని చందోక్ వివరించారు. మైక్రోసాఫ్ట్ అదే పనిలో ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ సోమవారం భారత్‌లో తమ నాలుగో క్లౌడ్ రీజియన్‌ను హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించింది.వినూత్న సాంకేతికతలకు దన్ను...భారత్ ఏఐని వినియోగించుకోవడమే కాకుండా వినూత్న సాంకేతికతలను కూడా ఆవిష్కరిస్తోందని చందోక్ పేర్కొన్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కంపెనీకి దేశీయంగా 10 నగరాలవ్యాప్తంగా 23,000 మంది ఇంజనీర్లు ఉన్నారని, ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో భారత్ కీలకంగా ఎదుగుతోండటాన్ని ఇది సూచిస్తోందని చందోక్ వివరించారు. ప్రస్తుతం రొటీన్‌గా నిర్వహిస్తున్న ఉద్యోగ విధుల స్వరూపం మారుతోండటంతో పాటు కృత్రిమ మేథతో ఏఐ ఇంజినీర్లు, ఏజెంట్ ఆర్కె్రస్టేటర్లలాంటి కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. ప్రపంచం మొత్తం మీద జనరేట్ అయ్యే డేటాలో 20 శాతం..భారత్ నుంచే ఉంటుందని, కానీ డేటా సెంటర్లపరంగా సామర్థ్యంలో దేశ వాటా కేవలం సుమారు మూడు శాతమేనని పునీత్ తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను కలి్పంచేందుకు ఈ దశాబ్దపు అవకాశం భారత్ ముంగిట్లో ఉందన్నారు. వచ్చే కొన్నేళ్లలో భారత డేటా సెంటర్ సామర్థ్యాలు 2 గిగావాట్ల నుంచి 12–14 గిగావాట్లకు పెరుగుతాయన్నారు. తద్వారా ఆసియాకి ఏఐ ఇన్ఫ్రా హబ్‌గా దేశం ఎదుగుతుందని చెప్పారు. -
ముఖంతో సంపాదన.. రూ.14 లక్షల వరకు!
ఏఐతో ఉద్యోగాలు పోతాయని ఎంతోమంది భయపడుతున్న వేళ.. చైనాలో మాత్రం కొందరు తమ ముఖాలనే అద్దెకిచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. ఏఐ కాలంలో మన ముఖానికి కూడా ఒక విలువ ఉంది. చైనాలో కొంతమంది తమ ముఖాలను ఏఐ ద్వారా తయారు చేసే వీడియోలు, ప్రకటనలు, గేమ్స్, షార్ట్ డ్రామాల్లో ఉపయోగించుకోవడానికి లైసెన్స్ ఇస్తున్నారు. దీంతో డబ్బు సంపాదిస్తున్నారు.సింపుల్‌గా చెప్పాలంటే, ఒక వ్యక్తి తన ముఖాన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్ చేసుకుంటాడు. ఆ తర్వాత వీడియో లేదా ప్రకటన తయారు చేసే వాళ్లు తమకు నచ్చిన ముఖాన్ని ఎంచుకుని, డబ్బు చెల్లించి ఆ ముఖాన్ని AI కంటెంట్‌లో ఉపయోగించుకోవచ్చు.రూ.700 నుంచి రూ.14 లక్షలుకొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ముఖాన్ని ఉపయోగించడానికి ధర 50 యువాన్ నుంచి 99,999 యువాన్ చెల్లిస్తున్నారు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.700 నుంచి రూ.14 లక్షలు.ఉదాహరణకు, చెన్ అనే 34 ఏళ్ల వ్యక్తి తన ముఖాన్ని ఒక్కసారి ఉపయోగించుకోవడానికి 99 యువాన్ తీసుకుంటున్నాడు. తన ముఖాన్ని ప్రేమకథలు, కుటుంబ కథల్లో ఉపయోగించుకోవచ్చని, కానీ హారర్ లేదా లైంగిక కంటెంట్‌లో ఉపయోగించకూడదని అతను నిబంధన పెట్టుకున్నాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక బ్యాంక్ ఉద్యోగి ముఖాన్ని ఒక ప్రకటన సంస్థ మూడు రోజుల్లో ఏడు సార్లు ఉపయోగించుకుని అతనికి దాదాపు 2,500 యువాన్ చెల్లించినట్లు సమాచారం.ఇలా చేయడం వల్ల వ్యక్తులు ప్రతి షూటింగ్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వాళ్ల ముఖాన్ని ఏఐ ద్వారా ఉపయోగించుకుంటారు కాబట్టి, ఇంట్లోనే ఉండి కూడా కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, తమ ముఖాన్ని ఎంతకాలం ఉపయోగించాలి, ఏ రకమైన కంటెంట్‌లో ఉపయోగించకూడదు అనే విషయాలను కూడా కొంతవరకు నిర్ణయించుకోవచ్చు.సమస్యలు ఇవేఅయితే దీంతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గోప్యత, అనుమతి, ముఖ డేటా భద్రతకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. ఒకసారి మన ముఖం డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత అది ఎక్కడెక్కడ ఉపయోగించబడుతుందో పూర్తిగా తెలుసుకోవడం కష్టం కావచ్చు.పిల్లల ముఖాలను ఏఐలో ఉపయోగించడం గురించి కూడా న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల కోసం ప్రత్యేక కేటగిరీలు కూడా ఉన్నాయి. మరో సమస్య.. ఒప్పందాలకు సంబంధించినది. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తి తన అనుమతిని ముందుగానే రద్దు చేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చని వార్తలు చెబుతున్నాయి. కానీ అదే సమయంలో ప్లాట్‌ఫారమ్ నుంచి చెల్లింపు ఆలస్యం అయితే వారి బాధ్యత తక్కువగా ఉండవచ్చనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: వయసు 15.. పెట్టుబడులు రూ.13 లక్షలు! -
ఐఫోన్ల కంపెనీలో అటు ఆనందాలు.. ఇటు ఆక్రందనలు!
యాపిల్ ఉత్పత్తులు.. ముఖ్యంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం కొత్త సిరీస్ ఐఫోన్ 18 ప్రో స్మార్ట్ఫోన్లు విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసినా దీని గురించి హంగామానే నడుస్తోంది. కొత్త ఐఫోన్ చేతికొచ్చిన ఆనందం చాలా మందిలో కనిపిస్తోంది. ఇదంతా ఓవైపు కథ. మరో వైపు ఇదే క్రేజీ యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు కోతలు కూడా నడుస్తున్నాయి. వందల్లో ఉద్యోగులను తొలిగించి ఇంటికి పంపుతోంది టెక్ దిగ్గజం.యాపిల్ కొత్త ఐఫోన్ 18 సిరీస్ చుట్టూ ప్రపంచవ్యాప్తంగా సందడి నెలకొన్న వేళ.. అదే కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. తాజాగా యాపిల్ తన ‘ఫిట్నెస్ ప్లస్’ (Fitnes ) సర్వీస్‌లోని ఆడియో విభాగంలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. గత రెండు నెలల్లో యాపిల్‌లో చోటుచేసుకున్న రెండో విడత ఉద్యోగాల కోత ఇది.తాజా కోతల్లో టైమ్ టు వాక్, టైమ్ టు రన్ వంటి ఆడియో ఫీచర్లపై పనిచేసే సిబ్బంది ఉన్నట్లు సమాచారం. యాపిల్ వాచ్ వినియోగదారులు వీడియోను చూడాల్సిన అవసరం లేకుండా నడక లేదా పరుగు సమయంలో గైడెడ్ ఆడియో కంటెంట్‌ను వినేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.ఆగస్టులో 200కుపైగా ఉద్యోగాల కోతతాజా పరిణామానికి కొద్ది వారాల ముందు, ఆగస్టులో యాపిల్ 200కుపైగా ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వచ్చాయి. ఈ కోతల్లో విజన్ ప్రో, సిరి, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన బృందాలు ప్రభావితమైనట్లు సమాచారం. విజన్ ప్రో విభాగంలో సుమారు 100 ఉద్యోగాలు, సిరితో పాటు ఇతర సాఫ్ట్వేర్ బృందాల్లో మరో 100 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు తగ్గినట్లు అప్పట్లో నివేదికలు వచ్చాయి.. యాపిల్ మాత్రం వ్యాపార వృద్ధి, వినియోగదారులకు కొత్త అనుభవాలు అందించడం కోసం కొన్ని బృందాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు పేర్కొంది. -
చాట్‌జీపీటీ సాయం.. ట్రాఫిక్ చలానాపై పోరాడి గెలిచిన మహిళ!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికో లేదా వ్యాసాలు రాయడానికో పరిమితం కాదని, న్యాయ పోరాటాల్లోనూ కీలక పాత్ర పోషించగలదని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సాధారణంగా ట్రాఫిక్ చలానాలు లేదా జరిమానాలు పడితే కోర్టుల చుట్టూ తిరగలేక చాలామంది కామ్‌గా కట్టేస్తుంటారు. కానీ, ఓ మహిళ తనకు పడిన అన్యాయమైన బైక్ చలానాను సవాలు చేయడానికి ‘చాట్‌జీపీటీ’ని తన లీగల్ అడ్వైజర్‌గా ఉపయోగించుకుని విజయం సాధించింది. దాదాపు రూ.50,793 (సమానమైన విదేశీ కరెన్సీ/ జరిమానా) విలువైన కేసులో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఘటన నేపథ్యం.. ఏఐ తోడ్పాటుట్రాఫిక్ అధికారులు విధించిన చలానా చట్టబద్ధతపై సందేహం వచ్చిన యునైటెడ్ కింగ్డమ్ / బ్రిటన్ (యార్క్‌షైర్ ప్రాంతంలోని యార్క్ సిటీ)లోని మిల్లీ హౌల్టన్ అనే 22 ఏళ్ల బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థిని లాయరును సంప్రదించకుండా చాట్‌జీపీటీని ఆశ్రయించింది. స్థానిక మోటారు వాహనాల చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను విశ్లేషించాల్సిందిగా చాట్‌జీపీటీని కోరింది. ఏఐ సాంకేతికత అధికారుల చర్యలోని లోపాలను, చట్టపరమైన మినహాయింపులను కచ్చితంగా గుర్తించి, కోర్టులో సమర్పించాల్సిన బలమైన వాదనలను సిద్ధం చేసి ఇచ్చింది.న్యాయస్థానంలో విజయంచాట్జీపీటీ అందించిన డ్రాఫ్టింగ్, సెక్షన్ల ఆధారంగా సదరు మహిళ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించింది. ఏఐ సూచించిన పాయింట్లు చట్టబద్ధంగా సరిగ్గా ఉండటంతో న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీని ద్వారా ఆమె రూ.50,793(సుమారు రూ.463 యూరోలు)కు పైగా జరిమానా భారం నుంచి ఉపశమనం పొందింది.ఈ సంఘటన న్యాయ సేవల రంగంలో డిజిటల్ విప్లవానికి సంకేతం. ఖరీదైన లాయర్ల ఫీజులు భరించలేని సామాన్యులకు ఏఐ టూల్స్ చట్టపరమైన సహాయకారిగా మారుతున్నాయి. అయితే, ఏఐ ఇచ్చే సమాచారాన్ని సరైన రీతిలో ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం గమనించాలి. సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే సాధారణ పౌరులు కూడా తమ హక్కులను కాపాడుకోవచ్చని ఈ ఘటన నిరూపించింది.ఇదీ చదవండి: వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి! -
స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెంపు.. శాంసంగ్ షాక్!
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు శాంసంగ్ భారీ షాక్ ఇచ్చింది. గెలాక్సీ ఎస్26 సిరీస్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.20,000 చొప్పున పెంచింది. గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26+తో పాటు గెలాక్సీ ఎస్26 అల్ట్రా మోడళ్లకు ఈ ధరల పెంపు వర్తిస్తుంది. సెప్టెంబర్ 18, 2026 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో గెలాక్సీ ఎస్26 సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్ ధర కూడా రూ.1 లక్ష దాటింది.లాంచ్ సమయంలో గెలాక్సీ ఎస్26 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ.87,999గా ఉండగా, ఇప్పుడు రూ.1,07,999కు చేరింది. 12GB + 512GB వేరియంట్ ధర రూ.1,07,999 నుంచి రూ.1,27,999కు పెరిగింది. అంటే రెండు వేరియంట్లపై రూ.20,000 చొప్పున అదనపు భారం పడింది.గెలాక్సీ ఎస్26+ ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. 12GB + 256GB మోడల్ ధర రూ.1,19,999 నుంచి రూ.1,39,999కు, 12GB + 512GB వేరియంట్ ధర రూ.1,39,999 నుంచి రూ.1,59,999కు చేరింది. మరోవైపు గెలాక్సీ ఎస్26 అల్ట్రా 12GB + 256GB మోడల్ ధర రూ.1,39,999 నుంచి రూ.1,59,999కు, 12GB + 512GB వేరియంట్ ధర రూ.1,59,999 నుంచి రూ.1,79,999కు పెరిగింది. టాప్-ఎండ్ 16GB + 1TB గెలాక్సీ ఎస్26 అల్ట్రా ధర రూ.1,89,999 నుంచి ఏకంగా రూ.2,09,999కు చేరింది.మొత్తంగా గెలాక్సీ ఎస్26 సిరీస్‌లోని ఏడు వేరియంట్లపై రూ.20,000 చొప్పున ధర పెరిగింది. తాజా ధరల పెంపునకు పెరుగుతున్న మెమరీ, ఇతర కాంపోనెంట్ ఖర్చులు ప్రధాన కారణాలుగా పరిశ్రమలో పేర్కొంటున్నారు. గ్లోబల్‌గా మెమరీ చిప్ సరఫరాపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారుల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయి.శాంసంగ్ అధికారికంగా ఫిబ్రవరి 2026లో గెలాక్సీ ఎస్26 సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసింది. అప్పట్లో ఎస్26 ప్రారంభ ధర రూ.87,999, ఎస్26+ రూ.1,19,999, ఎస్26 అల్ట్రా రూ.1,39,999గా నిర్ణయించింది. తాజా పెంపుతో ఈ ప్రారంభ ధరలు వరుసగా రూ.1,07,999, రూ.1,39,999, రూ.1,59,999కు చేరాయి.ఇదీ చదవండి: జియో రీచార్జ్: 90 రోజుల ప్లాన్.. 3 నెలలు ఫుల్ బెనిఫిట్స్! -
ఊహించని షాక్.. పని వేగంగా చేయడమే శాపమైంది!
కార్పొరేట్ ఉద్యోగాల్లో పని వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేయడానికి టెక్నాలజీని ఉపయోగించడం సాధారణమే. అయితే.. కొన్నిసార్లు మన పనిని సులభం చేసుకునేందుకు చేసిన ప్రయత్నమే మనపై మరింత పని భారం పడేలా చేయొచ్చు. ఇలాంటి అనుభవమే ఓ ఉద్యోగికి ఎదురైంది. తన పనిలోని ఒక రొటీన్ ప్రక్రియను ఆటోమేట్ చేసి సమయాన్ని ఆదా చేసుకున్న ఆ ఉద్యోగి.. ఆ విషయాన్ని మేనేజర్‌తో పంచుకున్న తర్వాత, అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.ఉద్యోగి వారానికి చేసే రిపోర్టింగ్ పని చాలా సమయం తీసుకునేదట. డేటాను సేకరించడం, దాన్ని ఫార్మాట్ చేయడం వంటి పనుల కోసం వారానికి సుమారు 15 గంటలు వెచ్చించాల్సి వచ్చేది. దీంతో.. ఒక వారాంతంలో కూర్చొని చిన్న స్క్రిప్ట్ తయారు చేశాడు. దాని ద్వారా డేటా సేకరణ, ఫార్మాటింగ్ మొత్తం ఆటోమేటిక్‌గా జరిగేలా చేశాడు. ఫలితంగా 15 గంటలు పట్టే పని ఒక్క నిమిషంలోపే పూర్తయ్యేది. మిగిలిన సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఉపయోగించుకున్నాడు.తాను చేసిన పనిని చూసి మేనేజర్ మెచ్చుకుంటారని, భవిష్యత్తులో ప్రమోషన్ లేదా జీతం పెంపు వచ్చే అవకాశం ఉంటుందని భావించిన ఉద్యోగి.. తన ఆటోమేషన్ గురించి మేనేజర్‌కు చెప్పాడు. కానీ అక్కడే పరిస్థితి మారిపోయింది.అతనికి ఇటీవల ఉద్యోగం వదిలి వెళ్లిన ఓ సీనియర్ ఉద్యోగి పనిని కూడా అప్పగించారు. అంతేకాకుండా ఇతర ఉద్యోగులు చేస్తున్న పనులను కూడా ఆటోమేట్ చేయాలని బాధ్యత ఇచ్చారు. దీంతో ఇంతకుముందు ఒత్తిడి లేకుండా ఉన్న పని.. వారానికి దాదాపు 50 గంటల పనిగా మారిందని, అయితే జీతం మాత్రం అదే స్థాయిలో ఉందని ఆ ఉద్యోగి చెప్పాడు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని చెప్పారు. పని వేగంగా పూర్తి చేస్తే.. దానికి గుర్తింపు రావడం కంటే, మరింత పని అప్పగించే అవకాశం ఉంటుందని పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. -
జియో రీచార్జ్: 90 రోజుల ప్లాన్.. 3 నెలలు ఫుల్ బెనిఫిట్స్!
దేశంలోని టాప్ టెలికమ్ ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో తమ అన్ని వర్గాల కస్టమర్లకు అవసరమైన అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. పదేపదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గించుకోవాలనుకునే కస్టమర్ల కోసం రూ.899 ప్లాన్ అందుబాటులో ఉంది. 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 2GB చొప్పున హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా 20GB డేటాను అందిస్తున్నారు. మొత్తంగా వ్యాలిడిటీ కాలంలో 200GB డేటాను వినియోగించుకోవచ్చు.పూర్తి ప్రయోజనాలు ఇవే..అర్హత ఉన్న కస్టమర్లు, 5G సదుపాయం ఉన్న ప్రాంతాల్లో 5G హ్యాండ్సెట్ ఉపయోగిస్తే అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. దీంతో 5G నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నాన్ స్టాప్‌గా డేటాను వాడుకోవచ్చు.డేటాతో పాటు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా పంపుకోవచ్చు. దీంతో మూడు నెలల వ్యాలిడిటీ సమయంలో సాధారణ కాలింగ్, SMS అవసరాల కోసం ప్రత్యేకంగా అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.రూ.899 ప్లాన్‌లో కస్టమర్లకు కొన్ని డిజిటల్ ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు. మొబైల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ వంటి కంటెంట్‌ను వీక్షించేందుకు OTT ప్రయోజనం లభిస్తుంది. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర ముఖ్యమైన ఫైళ్లను భద్రపరుచుకునేందుకు 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంది.ఇవే కాకుండా టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వినియోగదారులకు 18 నెలల పాటు అధునాతన AI సర్వీస్‌కు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా అందిస్తున్నారు. మొత్తంగా 90 రోజుల వ్యాలిడిటీ, డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, SMSలు, OTT, క్లౌడ్ స్టోరేజ్, AI ప్రయోజనాలను ఒకే రీఛార్జ్‌లో పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. -
ఇంట్లోనే కుట్టు పని.. ఈ చిట్టి గాడ్జెట్లు ఉంటే చాలు!
చిన్న కుట్టు ఊడినా.. బటన్ ఊడిపోయినా.. టైలర్ షాప్ వరకు పరుగెత్తాల్సిందేనా? ఇక ఆ అవసరం లేదు. దుస్తులకు ఎదురయ్యే ఇలాంటి చిన్న చిన్న సమస్యలను ఇంట్లోనే చిటికెలో చక్కబెట్టుకునే చిట్టి గాడ్జెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చేతిలో పట్టుకునేంత చిన్నగా ఉండే వీటితో కుట్టు వేయడం నుంచి బటన్ సెట్ చేయడం వరకు పనులు ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆ గాడ్జెట్లు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? వాటి ధర ఎంత? తెలుసుకుందాం..కుట్టు పనికి.. షార్ట్‌కట్!పెద్ద పెద్ద వీఐపీల రికమెండేషన్స్ కూడా పనిచేయని ప్లేసుల్లో టైలర్ షాప్ ఒకటి. చిరుగు చిన్నదే అయినా, దాన్ని సరిచేయడానికి ఏడాదైనా సరిపోదు. అందుకే, దుస్తులకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను చిటికెలో చక్కబెట్టే ఈ చిట్టి గాడ్జెట్లు ఇప్పుడు మీకోసం!చేతిలో చిట్టి టైలర్!బట్ట చిరిగితే టైలర్ షాపుకి పరుగెత్తడం, చిన్న కుట్టు ఊడితే సూది దారం కోసం ఇల్లంతా వెతకడం వంటి కష్టాలకు కాస్త సెలవివ్వండి. చూడటానికి అచ్చం స్టేప్లర్లా ఉండే ఈ మినీ హ్యాండ్ కుట్టు మిషన్, ఇప్పుడు చిన్నపాటి కుట్టుపనులను చకచకా చక్కబెట్టేస్తుంది. పైగా ఇందుకోసం కరెంట్ అవసరం లేదు. బ్యాటరీలు మార్చే టెన్షన్ లేదు... చేతితోనే నడిపించేయొచ్చు.షర్టులు, ప్యాంట్లు, కర్టెన్లు వంటి దుస్తుల్లో చిన్న చిరుగులు, ఊడిన కుట్లు వంటివాటిని సరిదిద్దుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కాటన్ , లినెన్ వంటి పలచని వస్త్రాలకు కూడా అనువుగా ఉంటుంది. సైజులో చిన్నదే కాబట్టి బ్యాగులో వేసుకుని బయటకూ తీసుకెళ్లొచ్చు. ధర కేవలం రూ.300 మాత్రమే!బలన్ సెటిల్మెంట్! దుస్తుల బటన్ ఊడిందంటే చాలు. ఇక ఆ దుస్తులతో విడాకులు తీసుకుంటా అంటూ మొండిగా మారకండి! కాస్త దానికొక అవకాశం ఇవ్వండి. ఇందుకోసం పెద్దగా కష్టపడకుండా, ఒక్క క్లిక్ చేస్తే బటన్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే, ఇప్పుడు ఈ మెటల్ స్నాప్ బటన్ కిట్‌తో కేవలం ఒక్క క్లిక్ చేస్తే చాలు. వెంటనే, బటన్ సెట్ చేసుకోవచ్చు. స్నాప్ బటన్లను బిగించేందుకు ప్రత్యేక ప్లయర్‌తో వచ్చే ఈ కిట్‌లో వంద సెట్ల బటన్లు ఉన్నాయి.షర్ట్స్, బేబీ డ్రెస్లులు, బట్ట సంచులు, బొమ్మల దుస్తులు, చేతిపనుల అలంకరణలు– ఇలా వస్త్రాలతో చేసే ఎన్నో పనుల్లో ఉపయోగించుకోవచ్చు. రాగితో తయారైన బటన్లు మన్నికగా ఉండేలా రూపొందించారు. చేతిలో పట్టుకునే ప్లయర్కు జారిపోకుండా పట్టుకునే పట్టు ఉండటంతో బటన్ ను సరిగ్గా అమర్చుకోవచ్చు. అయితే మొదటిసారి ఉపయోగించే ముందు పాత బట్ట ముక్కపై ఒకసారి ప్రయత్నిస్తే మంచిది. ధర రూ. 300 మాత్రమే.చిన్నబోతే... బుజ్జగిస్తుంది! జీన్స్ కొనేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంది... రెండు నెలలు గడిచేసరికి మీ జీన్స్, ‘నడుము సైజ్‌కు నాకు ఏ మాత్రం ఇక కుదరదు!’ అన్నట్టు దూరంగా పోతుందా? ఈ సమస్యకు పరిష్కారమే ఈ డెనిమ్ బటన్ క్లిప్ కిట్. కుట్టు అవసరం లేకుండానే బటన్ ను సులభంగా అమర్చుకుని జీన్స్, ప్యాంట్లు, స్కర్ట్స్, షార్ట్స్, జాకెట్లు వంటి వాటి నడుము పరిమాణాన్ని అవసరానికి తగ్గట్టు సర్దుకోవచ్చు. ప్రత్యేకమైన పట్టుకునే విధానంతో బటన్ బిగుతుగా ఉండేలా రూపొందించారు. పైగా ఎనిమిది బటన్ ప్యాకేజ్ కావడంతో ఒకటి పోయినా, ఇంకొకటి ఊడిపోయినా ‘అయ్యో! ఇప్పుడు ఏం చేయాలి?’ అనే బాధ ఉండదు! మెటల్‌తో తయారైన ఈ బటన్లు రోజువారీ వాడకానికి అనువుగా ఉంటాయి. అందుకే, ఇకపై నడుము సైజ్ పెరిగిందని జీన్స్‌తో గొడవ పడకుండా, బటన్ తోనే రాజీ చేసుకోండి! ధర కేవలం రూ.250 మాత్రమే.ఇదీ చదవండి: బట్టతల వచ్చిందా? స్టయిల్ మార్చండి.. లుక్ అదిరిపోవాల్సిందే! -
బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.43 వేలు తగ్గింపు!
యాపిల్ తన ఐఫోన్ 18ను మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. ఐఫోన్ 17 కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ ఆఫర్, సూపర్‌కాయిన్ ప్రయోజనం, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్ వంటివి ఉన్నాయి.ఫ్లిప్‌కార్ట్‌లో.. తెలుపు రంగు 'ఐఫోన్ 17' 256జీబీ వేరియంట్ ధర రూ. 99,900. అందుబాటులో ఉన్న ఎక్స్ఛేంజ్ ఆఫర్, సూపర్‌కాయిన్ ప్రయోజనం,ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్లను ఉపయోగించడం ద్వారా దీనిని రూ. 55,283కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.43,717 తగ్గుతుందన్నమాట.ప్రయోజనాలు ఇలా..ఈ ఆఫర్లో ప్రధానమైన ప్రయోజనం ఎక్స్చేంజ్ ఆఫర్. యాపిల్ ఐఫోన్ 15ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.41,700 తగ్గింపు లభించనుంది. ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరికీ తప్పకుండా రూ.41 వేలు ప్రయోజనం లభిస్తుందని అనుకోకూడదు.అదనంగా సూపర్‌కాయిన్ ప్రయోజనం కింద రూ.7, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ కింద 2,910 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రయోజనాలు పొందిన తరువాత ఐఫోన్ 17 మొబైల్‌ను 55,283 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.ప్రస్తుతం 256జీబీ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. 512 జీబీ వేరియంట్ స్టాక్‌లో లేదని ప్రొడక్ట్ పేజీలో కనిపిస్తోంది. తెలుపు రంగు మొబైల్ మీద మాత్రమే మీకు ప్రయోజనాలు లభించినప్పటికీ.. ఇతర రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులకు సౌకర్యార్థం ఈఎంఐ ఎంపిక కూడా ఉంది. మూడు నెలల ఈఎంఐకి నెలకు సుమారు రూ.19,917 నుంచి ప్రారంభమవుతుంది.ఇదీ చదవండి: జాబ్ చేస్తున్నారా.. జాగ్రత్త! కియోసాకి హెచ్చరిక -
బంగారం అమ్మేసి కొత్త ఐఫోన్!
కొత్త ఐఫోన్ ఫీవర్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇటీవలె విడుదలైన యాపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ మోడళ్లు.. భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చేశాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్ల వద్దకు ఐఫోన్ ప్రియులు పోటెత్తారు.ఈ సందర్భంగా యాపిల్ స్టోర్ల వద్ద అనేక సిత్రాలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. తన భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తిని మీడియా పలకరించగా విస్తుపోయే విషయం చెప్పాడు. తన భార్యకు కొత్త ఐఫోన్ కొనేందుకు బంగారం అమ్మేసినట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియాను వ్యాపారవేత్త హర్ష్ గోయెంక తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కొంత మంది ఇల్లు కొనడానికి బంగారం అమ్మేస్తారు.. మరికొంత మంది పిల్లల భవిష్యత్తు కోసం పసిడిని విక్రయిస్తుంటారు. కానీ ఇతడని చూడండి భార్యకు ఐఫోన్ కొనేందుకు బంగారం అమ్మేశాడు.. అంటూ రాసుకొచ్చారు.అమెరికాలో సెప్టెంబర్ 9న ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,79,900. బ్లాక్, సిల్వర్ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ’డ్యుయో’ని కూడా ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది.Some people sell gold to buy a house. Some sell it for their children’s future. This Delhi man sold family gold passed down from his grandmother and great-grandmother to buy his wife an iPhone 18 Pro Max.🙈 pic.twitter.com/MVSUEtmfSB— Harsh Goenka (@hvgoenka) September 18, 2026 -
‘AIతో ప్రపంచం అంతం’పై ఎన్విడియా సీఈవో కామెంట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలను ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ మరోసారి తోసిపుచ్చారు. 2030 నాటికి AI కారణంగా ప్రపంచం అంతమవుతుందన్న వాదనతో తాను పూర్తిగా విభేదిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2030 నాటికి ప్రపంచం అంతమయ్యే అవకాశం లేదని, AI అభివృద్ధిని నిలిపివేయడం లేదా సమన్వయంతో నెమ్మదించడం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.AI పరిశ్రమ వీలైనంత వేగంగా ముందుకు సాగాలని హువాంగ్ అన్నారు. అయితే వేగం పెంచడం అంటే భద్రతను పక్కన పెట్టడం కాదని స్పష్టం చేశారు. ఉత్పత్తులు పూర్తిగా సిద్ధం కాకముందే లేదా భద్రతా ప్రమాణాలు నెరవేరకముందే వాటిని మార్కెట్లోకి తీసుకురాకూడదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో AI రంగంపై కొత్త నియంత్రణలు విధించాలన్న వాదనలపైనా ఆయన భిన్నమైన వైఖరిని వ్యక్తం చేస్తున్నారు.హువాంగ్ వ్యాఖ్యలు వెలువడుతున్న సమయంలో AI భద్రతపై టెక్ పరిశ్రమలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ నెలలో ఆంత్రోపిక్ (Anthropic) పరిశోధకుడు జాకబ్ కాక్సన్ రాజీనామా చేస్తూ, AI సంస్థలు స్వీయ అభివృద్ధి సామర్థ్యం కలిగిన సూపర్‌ఇంటెలిజెన్స్ వైపు వేగంగా పరుగులు తీస్తున్నాయని, ఇది మానవాళికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించవచ్చని హెచ్చరించారు. ఆయన ప్రకారం, AIని అభివృద్ధి చేస్తున్న కొందరు పరిశోధకులు ఈ దశాబ్దం ముగిసేలోపు అది మానవాళిని అంతం చేసే అవకాశం ఉందని నిజంగానే భావిస్తున్నారు.కాక్సన్ వ్యాఖ్యలకు ఆంత్రోపిక్ అలైన్మెంట్ సైన్స్ లీడ్ ఇవాన్ హుబింగర్ కూడా స్పందించారు. AI వల్ల వచ్చే దశాబ్దంలోనే మానవాళి అంతరించే అవకాశం 10 శాతానికి పైగా ఉందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, AI అభివృద్ధి వేగంపై పరిశ్రమలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడై, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ సహా పలువురు టెక్ దిగ్గజాలు అధునాతన AI అభివృద్ధిలో భద్రత, సమన్వయం, నియంత్రణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇటీవల మాజీ గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకుడు బిలాల్ చుగ్తాయ్ కూడా AI ప్రమాదాలపై హెచ్చరికలు చేశారు. -
ఇక మీరు ఫోన్ ఎత్తొద్దు.. మీ వాయిస్‌తో ఏఐనే మాట్లాడుతుంది!
ఫోన్ మోగుతోంది.. మీరు మీటింగ్‌లో ఉన్నారు, బైక్ నడుపుతున్నారు, వంట చేస్తున్నారు. లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు బదులు ఏఐనే ‘హలో.. ఎవరు మాట్లాడుతున్నారు?’అంటూ ఆన్సర్ చేస్తుంది. అవతలి వ్యక్తి ఎవరో, ఎందుకు కాల్ చేశారో లైవ్‌లో టైప్ చేసి మీ స్క్రీన్‌పై చూపిస్తుంది. ముఖ్యమైన కాల్ అయితేనే మీరు లైన్లోకి వెళ్తారు. లేకపోతే ఏఐనే కట్ చేస్తుంది. వినడానికి సినిమాలా ఉంది కదా? కానీ ఇది 100% నిజం. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఇండియాలోకి వచ్చేసింది.ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ ఫోన్లో కాల్ ఫార్వార్డింగ్ ఆన్‌చేయగానే మీకు వచ్చే కాల్స్ నేరుగా క్లౌడ్ సర్వర్‌కు వెళ్తాయి. అక్కడ ఏఐ డిజిటల్ రిసెప్షనిస్ట్‌లా పనిచేస్తుంది. అవతలి వ్యక్తితో మాట్లాడి ‘మీ పేరేంటి, ఎందుకు కాల్ చేశారు?‘అని ఆరా తీస్తుంది. ఆ సంభాషణ అంతా లైవ్ ట్రాన్స్ క్రిప్ట్ రూపంలో మీ యాప్‌లో కనిపిస్తుంది. మీకు కావాలంటే మధ్యలోనే ‘నేను మాట్లాడతా‘అని జాయిన్ కావచ్చు, లేదా ‘తర్వాత చేయండి‘అని ఏఐతోనే చెప్పించవచ్చు.ఇందులోనే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఫీచర్.. పర్సనల్ వాయిస్. మైక్రోసాఫ్ట్ అజూర్ ఏఐ స్పీచ్ టెక్నాలజీతో మీ గొంతును కొన్ని సెకన్లు రికార్డ్ చేస్తే చాలు, మీ గొంతుతోనే ఏఐ అవతలి వారికి సమాధానం ఇస్తుంది. అయితే దుర్వినియోగం కాకుండా ఇది ఏఐ వాయిస్ అని అవతలి వారికి ముందే చెబుతుంది, వాటర్ మార్క్ కూడా ఉంటుంది. అచ్చం మీరే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.స్పామ్ కాల్స్‌కు స్వస్తి రోజుకు 10–15 స్పామ్, లోన్, జాబ్ కాల్స్‌తో విసిగిపోయిన వారికి ఇది పెద్ద రిలీఫ్. ఏఐ కాలర్ ఉద్దేశాన్ని గ్రహించి స్పామ్ అని తేలితే ఆటోమేటిక్‌గా కట్ చేస్తుంది, బ్లాక్‌లిస్ట్‌లో వేస్తుంది. ముఖ్యమైన కాల్స్ మాత్రమే మీ వరకు వస్తాయి. డెలివరీ బాయ్, ఇంటర్వ్యూ కాల్స్ వంటివి మిస్ అయ్యే బాధ ఉండదు.గూగుల్ నుంచి ట్రూకాలర్ వరకు పోటాపోటీ ఫీచర్లు ఈ రేసులో ప్రస్తుతం రెండు పెద్ద ప్లేయర్లు ఉన్నారు.గూగుల్ కాల్ స్క్రీన్:పిక్సెల్ ఫోన్లలో చాలా ఏళ్ల క్రితమే వచ్చిన ఫీచర్ ఇది. గూగుల్ అసిస్టెంట్ ఆన్సర్ చేసి స్క్రీన్‌పై లైవ్ ట్రాన్స్ క్రిప్ట్ చూపిస్తుంది. ఆన్–డివైస్ ఏఐతో పనిచేయడం వల్ల ప్రైవసీకి ఢోకా తక్కువ. పిక్సెల్ 9 సిరీస్‌లో స్కామ్ డిటెక్షన్ కూడా వచ్చింది. ట్రూకాలర్ అసిస్టెంట్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నది ఇదే. స్వీడన్ కంపెనీ ట్రూకాలర్ తీసుకొచ్చింది. ఇంగ్లి‹Ù, హిందీ, హింగ్లి‹Ùలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ త్వరలో రానుంది.జాగ్రత్త తప్పనిసరి..ఉపయోగం ఉన్నా రిస్క్ కూడా ఉంది. మీ కాల్స్ అన్నీ థర్డ్ పార్టీ సర్వర్లోకి వెళ్తాయి. రికార్డింగ్‌లు కొన్ని రోజులు స్టోర్ అవుతాయి. వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు కూడా వాడుతున్నారు. అందుకే ట్రూకాలర్ ‘ఏఐ కాల్ స్కానర్’ఫీచర్ తెచ్చింది, అవతలి గొంతు మనిíÙదా, ఏఐదా అని గుర్తిస్తుంది. వాట్సాప్‌లో వచ్చే నకిలీ ‘ఏఐ కాల్ ఆన్సర్ యాప్’లింకులను నమ్మవద్దు. అధికారిక ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ పరి్మషన్ సరిగా చూసుకోండని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: చిన్న నగరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు.. మెట్రో సిటీలను మించి.. -
బోనస్ వద్దు.. లక్షల కోట్ల లాభాల్లో వాటా కావాలి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్‌తో మెమరీ చిప్ కంపెనీల లాభాలు భారీగా పెరుగుతున్న వేళ.. ఆ లాభాల్లో తమకూ వాటాలు కావాలని ఉద్యోగులు కోరుతున్నారు. అమెరికాకు చెందిన మెమరీ చిప్ దిగ్గజం మైక్రాన్ టెక్నాలజీ ఉద్యోగులు లాభాల్లో వాటా కోసం పట్టుబడుతున్నారు. తైవాన్‌లోని కార్మికులకు సంస్థ ప్రకటించిన రికార్డు స్థాయి బోనస్ ప్యాకేజీని యూనియన్ తిరస్కరించింది. ఒక్కసారి ఇచ్చే బోనస్ కంటే కంపెనీ లాభాల్లో శాశ్వతంగా వాటా కల్పించే పారదర్శక విధానం కావాలని డిమాండ్ చేస్తోంది.మైక్రాన్ ఇటీవల తైవాన్‌లోని ఉద్యోగుల కోసం 2026 ఆర్థిక సంవత్సరానికి 35 నుంచి 68 నెలల వేతనానికి సమానమైన మొత్తం రివార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హత ఉన్న ఉద్యోగులకు కనీస నగదు చెల్లింపు కింద 1.7 మిలియన్ న్యూ తైవాన్ డాలర్లు (సుమారు రూ.51.11 లక్షలు) చెల్లించాలని నిర్ణయించింది.దీంతోపాటు 2025 ఆగస్టు 29లోపు కంపెనీలో చేరిన తైవాన్ ఉద్యోగులకు 1 మిలియన్ న్యూ తైవాన్ డాలర్ల (సుమారు రూ.30.20 లక్షలు) ప్రత్యేక నగదు బోనస్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో ఎంట్రీ లెవల్ ఇంజినీర్లకు నగదు, ఈక్విటీ కలిపి సగటున 3.4 మిలియన్ల (సుమారు రూ.1.02 కోట్లు) వరకు మొత్తం రివార్డు లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా 60,000 మందికి పైగా ఉద్యోగులు ఈ రివార్డు కార్యక్రమంలో భాగం కానున్నారు.అయితే ఈ ఆఫర్‌ను తైవాన్ కార్మిక సంఘం అంగీకరించలేదు. ‘68 నెలల వేతనం’ అనే ప్రచారం వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదని యూనియన్ వాదిస్తోంది. తక్కువ వేతన స్థాయిని ప్రాతిపదికగా తీసుకోవడం, ఈక్విటీ అవార్డులు భవిష్యత్‌లో వెస్ట్ అయ్యే కాలాన్ని కలుపుకోవడం వల్ల ప్యాకేజీ వాస్తవం కంటే ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది.15% లాభాలు కావాలిమైక్రాన్ ఇన్సెంటివ్ పే విధానంలో శాశ్వత మార్పులు చేయాలని యూనియన్ కోరుతోంది. 2027 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఆర్జించే ఆపరేటింగ్ లాభంలో 15 శాతాన్ని ఉద్యోగుల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా, కంపెనీ లాభాల్లో మార్పులను వేగంగా ప్రతిబింబించేలా బోనస్‌లను ఏడాదికోసారి కాకుండా త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించాలని కోరుతోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి మాత్రం తమ లెక్కల ప్రకారం సుమారు 83 నెలల వేతనానికి సమానమైన ఒకేసారి చెల్లింపు ఉండాలని యూనియన్ కోరుతోంది.మైక్రాన్‌కు చెందిన తైవాన్‌లోని టావోయువాన్, తైచుంగ్ కేంద్రాల్లో సుమారు 15,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 80 శాతానికి పైగా ఉద్యోగులను యూనియన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని రాయిటర్స్ పేర్కొంది. తైవాన్ సంస్థకు కీలక తయారీ కేంద్రం. ముఖ్యంగా DRAM, హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) చిప్‌ల ఉత్పత్తిలో ఈ కేంద్రాల ప్రాధాన్యం ఎక్కువ. AI డేటా సెంటర్లకు హెచ్‌బీఎం చిప్‌ల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్మిక వివాదం మైక్రాన్‌కు ప్రాధాన్య అంశంగా మారింది.భారీ లాభాలుAI ఆధారిత మెమరీ డిమాండ్ మైక్రాన్ ఆర్థిక ఫలితాలను రికార్డు స్థాయికి తీసుకెళ్లింది. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ 41.46 బిలియన్ డాలర్ల ఆదాయం, 33.32 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ ఆదాయం, 28.24 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.35 లక్షల కోట్ల) నికర లాభం నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నికర లాభం కేవలం 1.89 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.ఇదే సమయంలో మైక్రాన్ ఉద్యోగుల బోనస్ విధానాన్ని దక్షిణ కొరియా చిప్ సంస్థలైన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ పద్ధతులతో పోలుస్తున్నారు. అక్కడి ప్రాఫిట్-షేరింగ్ విధానాలను తమ డిమాండ్లకు యూనియన్లు ఉదాహరణగా చూపుతున్నాయి.చర్చలు విఫలమైతే సమ్మె ఓటుమైక్రాన్, యూనియన్ మధ్య మధ్యవర్తిత్వ చర్చలు సెప్టెంబర్ 18, 21 తేదీల్లో కొనసాగనున్నాయి. లాభాల భాగస్వామ్యంపై కంపెనీ నుంచి స్పష్టమైన ప్రతిపాదన రాకపోతే చర్చలు విఫలమైనట్లు ప్రకటించి సమ్మెపై ఉద్యోగుల ఓటింగ్ నిర్వహించే దిశగా వెళ్తామని యూనియన్ హెచ్చరించింది. అయితే మైక్రాన్ కూడా చర్చలను కొనసాగిస్తామని తెలిపింది.తైవాన్ మైక్రాన్‌కు కీలక ఉత్పత్తి కేంద్రం కావడంతో సమ్మె జరిగితే మెమరీ చిప్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం AI మౌలిక సదుపాయాల విస్తరణతో మెమరీ చిప్‌లకు డిమాండ్ ఇప్పటికే బలంగా ఉన్న నేపథ్యంలో ఈ కార్మిక వివాదం పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది. -
మన దగ్గరా ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు తాజాగా భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ‘మూడు కెమెరాలు, అప్‌గ్రేడ్ చేసిన అనేక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో పాటు షో ఆఫ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. పైగా యాపిల్ అనేది చాలా పెద్ద బ్రాండ్ కూడా. సెప్టెంబర్ 12 సాయంత్రం ప్రీ–బుక్ చేసుకుంటే 18 ఉదయం 8.15 గం.కి మొదటి స్లాట్ దొరికింది. మొత్తానికి మొదటి ఫోన్ అందుకున్నా‘ అని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న అమెరికాలో ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి, 18 ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. బ్లాక్, సిల్వర్ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ’డ్యుయో’ని ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది. -
ఐఫోన్ లేటెస్ట్ : అక్కడ చీప్‌గా కొనేస్తున్నారట!
ఐఫోన్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున లేటెస్ట్ ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సేల్ ఇండియాలో మొదలైంది. అయితే భారీ డిమాండ్ , భారీ క్యూలైన్ కారణంగా చాలామందికి నిరాశ తప్పలేదు. మరోవైపు భారతదేశంలో పన్నుల భారం కారణంగా ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండటంతో, కొందరు భారతీయులు విమాన ప్రయాణ ఖర్చులు పోను దుబాయ్‌లో కొనుగోలు చేయడమే లాభదాయకమని భావిస్తున్నారట. ఇంతకీ దుబాయ్ దీన ధర ఎంత? తెలుసుకుందాం పదండి మరి!భారత్‌లో ఐఫోన్ ధరలు, దుబాయ్‌లో విమాన టికెట్ మరియు వీసా ఖర్చులు పోను వచ్చే ధరలను బేరీజు వేసుకుని కొందరు కొనుగోలుదారులు దుబాయ్ మాల్లోని ఆపిల్ స్టోర్‌కు వచ్చి ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా చీప్‌గా ఐఫోన్ దక్కించుకోవడంతోపాటు, దుబాయ్‌ని సందర్శించిన సంబరం కూడా.ఎంత ఆదా?కేరళకు చెందిన మహ్మద్ సయీద్ అనే కొనుగోలుదారు దుబాయ్‌లో కొనుగోలు చేయడం ద్వారా తనకు దాదాపు రూ. 20వేల నుంచి రూ. 38వేల వరకు ఆదా అవుతున్నట్లు తెలిపారు. ముంబైకి చెందిన అమన్ సోలంకి అనే మరో వ్యక్తి తన కుటుంబం కోసం మూడు ప్రో మాక్స్ ఫోన్లను కొనుగోలు చేయడం ద్వారా భారీగా ఆదా అవుతోందని చెప్పారు. ఒకటి కంటే ఎక్కువ ఐఫోన్లు కొనుగోలు చేసేవారికి, ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం ఒకేసారి ఫోన్లు కొనేవారికి దుబాయ్‌లో షాపింగ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.ఇదీ చదవండి: నిఠారి కేసు నిర్దోషి సురీందర్ కోలి ఆకస్మిక మరణం సంచలనందుబాయ్లో: ఐఫోన్ 18 ప్రో ధర దాదాపు 5,099 దిర్హామ్‌ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1,32,000) నుంచి, ప్రో మాక్స్ ధర 5,499 దిర్హామ్‌ల (సుమారు రూ. 1,42,000) నుంచి ప్రారంభమవుతోంది.భారత్‌లో: ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉండగా, ప్రో మాక్స్ ధర రూ. 1,79,900గా ఉంది.కొత్త ఫీచర్లు: ఐఫోన్ 18 ప్రో సిరీస్ కొత్త A20 ప్రో చిప్, వేరియబుల్ అపర్చర్‌తో కూడిన 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, బర్గండ్తో సహా గ్లేసియర్, సిల్వర్ , బ్లాక్ రంగులలో రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.ఇదీ చదవండి: ఐఫోన్ క్రేజ్ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్ అమ్మి మరీ! -
ఐఫోన్ క్రేజ్ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్ అమ్మి మరీ!
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఐఫోన్లకు క్రేజ్ అంతా ఇంతకాదు. ఎలాగైనా లేటెస్ట్ ఐఫోన్ దక్కించుకోవాలని ఉబలాట పడతారు ఐఫోన్ లవర్స్. భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సేల్ ప్రారంభం కావడంతో నోయిడాలోని యాపిల్ స్టోర్ వద్ద భారీ క్యూ లైన్లే ఇందుకు నిదర్శనం. తాజా ఐఫోన్‌ను దక్కించుకోవడం కోసం కొనుగోలుదారులుగంటల తరబడి వేచి చూశారు. ఈ సందర్బంగా భార్యకు కొత్త ఐఫోన్ కొనిచ్చేందుకు ఏకంగా బంగారాన్ని అమ్మేసిన వైనం నెట్టింట విచిత్రంగా నిలుస్తోంది. ఐఫోన్నుదక్కించుకునేందుకు ఒక్కొక్కరి కష్టాలు మామూలుగా లేవు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, మహిళలు స్టోర్ ఓపెన్ చేయకముందు షాప్ ముందు క్యూ కట్టారు. కొందరు ఐఫోన్ దక్కిచంచుకోవడం కోంసం సెలవు కూడా తీసుకున్నారు.ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.బంగారం అమ్మి మరీ...ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య కోరిక మేరకు బర్గండీ రంగు ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి బంగారం అమ్మినట్లు తెలిపారు. "ఆనాడు డబ్బులు లేవు, నేడు ఉన్నాయి, రేపు ఉంటాయో లేదో" అని చెబుతూ తన భార్య కోసం ఈ ఫోన్ కొన్నానని ఆయన వెల్లడించారు.తన భార్య 'బర్గుండి' (Burgundy) రంగులో ఉన్న iPhone 18 Proని తీసుకురమ్మని చెప్పిందని ఆయన తెలిపారు.పెళ్లి కానుకగా ఐఫోన్పంజాబ్కు చెందిన గుర్దితా సింగ్ అనే వ్యక్తి తన పెళ్లి కానుకగా కాబోయే భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. తనకోసం ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో కలిపి మొత్తం రెండు ఫోన్ల కోసం ఆయన రూ. 3.5 లక్షలకు పైగా వెచ్చించారు.ధరల పెంపు లెక్కే కాదుఐఫోన్ ధరలు గత ఏడాదితో పోలిస్తే పెరిగినప్పటికీ, ఐఫోన్ ప్రేమికులు ఈ ధరను చెల్లించడానికి వెనుకాడబోరని కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. హర్యానాకు చెందిన విశాల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ధరలు పెరిగినా తాము సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు.ముందస్తు బుకింగ్స్స్టోర్ వద్ద తీవ్ర రద్దీ నెలకొనగా, ముందుగా ప్రీ-ఆర్డర్ చేసుకున్నవారికే మాత్రమే స్టోర్‌లోకి ప్రవేశం కల్పించారు. ముందస్తు బుకింగ్ చేసుకోని కొందరు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.తొలి ఫోన్ అందుకున్న ఆనందం అంతేకాదు ఇండియాలో అందరికంటే ముందే తానే కొత్త ఐఫోన్నుసొంతం చేసుకోవాలనే ఆశతో ఏకంగా 10–12 గంటల పాటు క్యూలో నిలబడ్డావో వ్యక్తి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద రాత్రంతా వేచి చూసి, భారత్‌లో తొలి iPhone 18 ను సొంతం చేసుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైన సంగతి సోషల్‌మీడియాలో సందడిగా మారింది. -
జియో రీచార్జ్: రూ.51కే అన్లిమిటెడ్ 5G!
5జీ సేవలను వినియోగించాలనుకునే జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు కంపెనీ తక్కువ ధరకే అప్‌గ్రేడ్ ఆప్షన్ అందిస్తోంది. కేవలం రూ.51తో అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే 1.5GB రోజువారీ డేటా అందించే బేస్ ప్లాన్ ఉన్నవారు ఈ యాడ్-ఆన్ రీచార్జ్ చేసుకోవచ్చు. జియో అధికారిక సమాచారం ప్రకారం.. ఒక నెల వరకు వ్యాలిడిటీ ఉన్న రోజుకు 1.5GB ప్లాన్ వినియోగదారులు రూ.51 యాడ్-ఆన్ ద్వారా అన్లిమిటెడ్ 5Gని యాక్టివేట్ చేసుకోవచ్చు.రూ.51 యాడ్-ఆన్ ప్రయోజనాలుఈ యాడ్-ఆన్ ద్వారా 3GB అదనపు 4G/5G డేటాతో పాటు అన్లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. 3GB అదనపు డేటా అయిపోయిన తర్వాత సాధారణ డేటా స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రూ.51 రీచార్జ్ ప్రత్యేకంగా 5Gని బేస్ బెనిఫిట్‌గా అందించని 1.5GB/day ప్లాన్ వినియోగదారుల కోసం ఉద్దేశించినది. జియో తాజా ప్లాన్ వివరాల్లోనూ రూ.51 ప్యాక్‌కు 3GB డేటా, అన్లిమిటెడ్ 5G అప్‌గ్రేడ్ ప్రయోజనాలను పేర్కొంది.అయితే రూ.51 రీచార్జ్ స్వతంత్రంగా పనిచేసే నెలవారీ ప్లాన్ కాదు. కస్టమర్‌కు ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న బేస్ ప్లాన్ ఉండాలి. ఆ బేస్ ప్లాన్ వ్యాలిడిటీకి అనుగుణంగానే యాడ్-ఆన్ ప్రయోజనాలు కొనసాగుతాయి. జియో FAQ ప్రకారం 1.5GB/day ప్లాన్‌కు వ్యాలిడిటీ ఒక నెలకు మించి రెండు నెలల వరకు ఉంటే రూ.101, రెండు నెలలకు మించి మూడు నెలల వరకు ఉంటే రూ.151 యాడ్-ఆన్లు వర్తిస్తాయి.5G ఫోన్ ఉంటేనే..రూ.51 రీచార్జ్‌తో అన్లిమిటెడ్ 5G ఉపయోగించాలంటే కస్టమర్ వద్ద 5Gకి అనుకూలమైన స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే ఆ ప్రాంతంలో జియో ట్రూ 5G కవరేజీ అందుబాటులో ఉండాలి. జియో ట్రూ 5G అనేది 5G స్టాండలోన్ (SA) నెట్‌వర్క్‌పై ఆధారపడిన సర్వీస్. అర్హత ఉన్న ఫోన్, సరైన బేస్ ప్లాన్, 5G కవరేజీ ఉన్నప్పుడే అన్లిమిటెడ్ 5G ప్రయోజనం లభిస్తుంది.కాబట్టి రోజుకు 1.5GB బేస్ ప్లాన్ ఇప్పటికే ఉన్న జియో ప్రీపెయిడ్ వినియోగదారులు, కొత్తగా ఎక్కువ డేటా కోసం పూర్తి ప్లాన్‌ను మార్చాల్సిన అవసరం లేకుండానే రూ.51 యాడ్-ఆన్‌తో ట్రూ 5Gని అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. రీచార్జ్ చేసే ముందు మైజియో యాప్‌లో మీ ప్రస్తుత ప్లాన్, 5G డివైస్ అర్హత, మీ ప్రాంతంలోని 5G కవరేజీని చెక్ చేసుకోవడం మంచిది. -
ఏఐ పైనే కంపెనీల ‘ఐ’
ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దేశంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. దీని ప్రాధాన్యాన్ని గ్రహిస్తున్న పలు సంస్థలు ఏఐపై తమ పెట్టుబడులను అమాంతం పెంచేశాయి. తాజాగా విడుదలైన సర్వీస్‌నౌ ఎంటర్ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ 2026 ప్రకారం, వ్యాపారసంస్థల ఏఐ పెట్టుబడులు గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే 119% పెరిగాయి. ఇది ప్రపంచ సగటు అయిన 110% కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2027 నాటికి సగటు ఐటీ బడ్జెట్లో ఐదో వంతు కంటే ఎక్కువ వాటా ఏఐ మీదే ఉంటుందని అంచనా. పెట్టుబడులు సరే.. నిర్వహణ సంగతేంటి?ప్రపంచ స్థాయి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అపారమైన ఇంజినీరింగ్ ప్రతిభలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎంటర్ప్రైజ్ ఏఐని స్వీకరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే, తదుపరి దశ అనేది సంస్థలు ఏఐని ఎంత వేగంగా అమలు చేస్తాయనే దానిపై కాకుండా, దానిని ఎంత విశ్వాసంతో నిర్వహించగలవు అనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, కేవలం 22% భారతీయ సంస్థలు మాత్రమే ఏఐ టెస్టింగ్, ఆడిటింగ్, రిస్క్–అసెస్మెంట్ ప్రక్రియలను అమలు చేయగలుగుతున్నాయని సర్వీస్ నౌ తేల్చింది. ఈ అంతరం స్పష్టంగా కనిపిస్తోందనీ, 54% భారతీయ సంస్థలు ఏఐ ఏజెంట్లను మోహరిస్తున్నా కానీ కేవలం 11% మాత్రమే స్వయంప్రతిపత్తి కలిగిన పని విధానాలకు మారాయని వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న భారతీయ వ్యాపార సంస్థల ప్రతినిధుల్లో.. ఏఐకి సంబంధించిన ప్రధాన అవరోధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశాన్ని 60% మంది హైలైట్ చేశారు. అలాగే 55% మంది నియంత్రణ, నిబంధనల పాటింపులో ఉన్న సంక్లిష్టతను, మరో 50% మంది డేటా గోప్యత, భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తపరిచారు.పారిశ్రామిక ప్రగతి లక్ష్యానికి తగ్గట్టుగా...గత 2025లో అమల్లోకి వచ్చిన డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం డీపీడీపీ నిబంధనల నుంచి గత ఫిబ్రవరి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆవిష్కరించిన ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు, ఇండియా ఏఐ మిషన్, ఇండియాఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటు వరకు ఒక సహాయక చట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ఈ విధానం ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూనే వ్యాపార సంస్థలు, ప్రతిభావంతులు, వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సంస్థల విషయానికొస్తే, అంతర్గత ఏఐ పాలనను ఈ జాతీయ దిశకు అనుగుణంగా మార్చుకోవడం అనేది వేగవంతమైన సంసిద్ధతను సూచిస్తోంది.ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!పెరగనున్న బడ్జెట్...ప్రస్తుత భారతదేశ సగటు ఐటీ బడ్జెట్లో ఏఐ వాటా 16.6% కాగా, 2027 నాటికి ఇది 21.3%కి పెరుగుతుందని అంచనా. కొన్ని అంతరాలను పూడ్చడం ద్వారా ప్రస్తుతం 100కి 55గా ఉన్న భారత్ మొత్తం ఏఐ గవర్నెన్స్ స్కోర్‌ను ప్రపంచంలోని ఏఐ అగ్రగామి దేశాల స్థాయికి తీసుకెళ్లవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధనపై డెలాయిట్ ఇండియా పార్టనర్, చీఫ్ స్ట్రాటజీ ఇన్నోవేషన్ ఆఫీసర్ అశ్విన్ వెల్లోడి మాట్లాడుతూ ‘భారతదేశంలో సంస్థలు ఏఐపై దృష్టి పెంచుతున్న కొద్దీ కేవలం వ్యక్తిగత వినియోగ సందర్భాలకే పరిమితం కాకుండా, నిర్ణయాలు తీసుకోవడం, నిర్వహణ నమూనాలను రూపకల్పన చేసే దిశగా అది విస్తరిస్తోంది. దీంతో పాటు ఏఐని విశ్వసనీయంగా మార్చే క్రమంలో డేటా, జవాబుదారీతనం వంటి పునాదులపై కూడా అంతే శ్రద్ధ అవసరం. ఏఐ ఎక్కడ పనిచేయాలి? మానవ విచక్షణ ఎక్కడ? అనే అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సంస్థలే దీర్ఘకాలిక విలువను సృష్టిస్తాయి’ అని అన్నారు.- సత్యబాబు -
భవిష్యత్తులో డిజిటల్ బానిస రాజ్యాలు
చరిత్రకారుడు, ఇజ్రాయెల్ రచయిత యువల్ నోవా హరారి– కృత్రిమ మేధ (ఏఐ) మన భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ది ఇన్సైడర్ అనే పాడ్‌కాస్ట్‌లో విశ్లేషించారు. ఈయన ‘సేపియన్స్’ గ్రంథ రచయిత. ‘డిజిటల్ సామ్రాజ్యవాదం’, బ్యూరోక్రసీపై ఏఐ ఆధిపత్యం వంటి సూక్ష్మమైన భవిష్యత్ పరిణామాలను తన పాడ్‌కాస్ట్‌లో అంచనా వేశారు. దీనికి హోస్ట్‌గా ది ఎకానమిస్ట్ ప్రధాన సంపాదకుడు జానీ మిండన్ బెడోస్ వ్యవహరించారు. అందులోని అంశాలు కింది విధంగా ఉన్నాయి.భౌగోళిక రాజకీయాలపై ఏఐ ఆధిపత్యం‘‘ప్రపంచ రాజకీయాధికార పరిస్థితులను గమనిస్తే, కృత్రిమ మేధ అత్యంత ఆందోళనకరమైన ముప్పుగా మారనున్నట్లు కనిపిస్తోంది! ఆ మార్పు ఒక కొత్త రకమైన సామ్రాజ్యవాద ఆధిపత్యానికి (డిజిటల్ ఇంపీరియలిజం) దారి తీసే ప్రమాదం ఉంది. గతంలో రాజులు లేదా రాజ్యాలు తమ సైన్యంతో భూభాగాలను ఆక్రమించేవి. అదే విధంగా, ఏఐ పోటీలో సాంకేతికంగా ముందంజలో ఉన్న ఒకటీరెండు అగ్రరాజ్యాలు ప్రపంచం నలుమూలల ఉన్న డేటా, ఆర్థిక వ్యవస్థలు, సమాచార నెట్‌వర్క్‌లన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసు కోవచ్చు. ఒకవేళ వేరే దేశం తయారుచేసిన ఏఐ సాంకేతికతపై ఏ దేశమైనా పూర్తిగా ఆధారపడితే... ఆ విదేశీ శక్తి ఒక్క బటన్ నొక్కి తనపై ఆధారపడిన దేశ వ్యవస్థలను నిలిపివేసే లేదా మార్చే శక్తిని పొందుతుంది. దానితో ఆ ఆధారపడిన దేశం తన స్వాతంత్య్రాన్ని కోల్పోయి, ఒక రకంగా మరొకరి చేతిలో ‘డిజిటల్ కాలనీ’గా మారిపోతుంది.‘బహిరంగ సంభాషణ’ దెబ్బతింటుంది!‘‘కోట్ల జనాభా ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం అనేది దానంతట అది ఏర్పడే సహజమైన ప్రక్రియ కాదు. వార్తాపత్రికలు, టీవీలు, ఇతర ఆధునిక సమాచార సాంకేతికతలు, ప్రజా చర్చల పునాదులపై నిర్మితమైన ఒక అత్యంత సున్నితమైన వ్యవస్థ అది. సరిగ్గా చెప్పాలంటే, ప్రజాస్వామ్యం అనేది కోట్లాది మంది పౌరుల మధ్య నిరంతరం సాగే ఒక ‘బహిరంగ సంభాషణ’ (పబ్లిక్ కాన్వర్జేషన్). అందువల్ల ఈ సమాచార సాంకేతికతలో ఎలాంటి విపరిణామం సంభవించినా, అది మొత్తం రాజకీయ వ్యవస్థనే అస్థిరపరుస్తుంది. ఏఐ అల్గారిథమ్‌లు ప్రజలు ఏం చూడాలి, ఏం ఆలోచించాలి, దేని గురించి మాట్లాడాలో నిశ్శబ్దంగా నిర్ణయించడం మొదలుపెడితే ప్రజాస్వామ్యాన్ని సమైక్యంగా ఉంచే ఆ బహిరంగ సంభాషణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.ముద్రణా యంత్రం పెద్ద గుణపాఠం‘‘గతంలో ముద్రణా యంత్రం వచ్చినప్పుడు సమాజంలో ఎంతటి పెను మార్పులు వచ్చాయో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ప్రధానమైన సాంకేతిక విప్లవాలు మొదట్లో తీవ్ర సామాజిక అల్లకల్లోలానికి, మత యుద్ధాలకు, నియంతృత్వానికి దారితీశాయి. ఆ తర్వాతే మానవాళి ఆ టెక్నాలజీ విప్లవాలను అదుపు చేయడానికి తగిన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోగలిగింది. అయితే, చరిత్ర మనకు నేర్పే ఇంకో ముఖ్యమైన పాఠం ఏంటంటే... సాంకేతికత వల్ల జరిగే పరిణామాలు ఎప్పుడూ ముందే రాసిపెట్టి ఉండవని! సాంకేతికత మనకు కొత్త అవకాశాలను, శక్తులను ఇస్తుంది తప్ప, వాటిని ఎలా వాడాలో అది నిర్ణయించదు. మనం ఈరోజే సరైన స్వీయ నియంత్రణ వ్యవస్థలను నిర్మించుకుంటే, ఆనాటి వినాశకరమైన పొరపాట్లు మళ్లీ జరిగే ప్రమాదం ఉండదు.ఏఐకి స్పృహే అక్కర్లేదు.. మేధ చాలు!‘‘ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి ఏఐకి స్పృహ అవసరం లేదు, కేవలం ‘మేధ’ ఉంటే చాలు. స్పృహ అనేది బాధ, ప్రేమ లేదా అనుభూతిని పొందే సామర్థ్యం. కానీ ‘మేధ’ అంటే కేవలం సమస్యలను పరిష్కరించడం, లక్ష్యాలను చేరుకోవడం. ఏఐ అనేది పుట్టుకతోనే వ్యవస్థలను/బ్యూరోక్రసీని నడపడంలో అత్యంత దిట్ట. పేపర్‌వర్క్ నిర్వహించడం, ఆర్థిక మార్కెట్లను లెక్కించడం, చట్టాలను లిఖించటం, ప్రభుత్వ వ్యవస్థలను నడపడంలో మానవ మస్తిష్కం కంటే ఏఐకి చాలా ఎక్కువ సామర్థ్యం ఉంది. ఏఐ ఈ ప్రపంచాన్ని హింసాత్మకంగా ఆక్రమించదు కానీ... మన రోజువారీ జీవితాలకు సంబంధించి చట్టపరమైన, ఆర్థికపరమైన నిర్మాణాలను నడిపించే ఒక అదృశ్యమైన, అత్యంత అవసరమైన శక్తిగా మారి మన సమాజాన్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది.ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్! -
వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!
నేటి డిజిటల్ యుగంలో కాలాన్ని ఆదా చేసుకోవడం, ఉత్పాదకతను పెంచుకోవడం ప్రతి ఒక్కరికీ కీలకంగా మారింది. ఒకప్పుడు గంటల తరబడి సమయం పట్టే పనులను నేడు వినూత్నంగా దూసుకొచ్చిన ఏఐ టూల్స్ కేవలం నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నాయి. కోడింగ్, డిజైనింగ్, వీడియో మేకింగ్, రీసెర్చ్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్.. ఇలా ఏ రంగంలో చూసినా ఏఐ అసిస్టెంట్ల హవా నడుస్తోంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026 నాటికి వందల గంటల విలువైన సమయాన్ని మిగిల్చి, పని సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు ఉపయోగపడుతున్న కొన్ని ఏఐ టూల్స్ సమగ్ర సమాచారం ఇక్కడ పరిశీలిద్దాం.పరిశోధన.. సమాచార విశ్లేషణClaude: సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి, లోతైన విశ్లేషణలు చేయడానికి, సృజనాత్మక రచనలకు మెరుగైన టూల్.Perplexity: ఇంటర్నెట్ నుంచి తాజా, కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్ సోర్స్‌లతో సహా అందిస్తూ రీసెర్చ్ పనిని సులభతరం చేస్తుంది.NotebookLM: మీ వద్ద ఉన్న డాక్యుమెంట్స్, పీడీఎఫ్‌లను విశ్లేషించి సారాంశాన్ని అందించడానికి ఉపయోగపడే గూగుల్ ఆధారిత స్మార్ట్ టూల్.Elicit: సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లను త్వరగా వెతికి కీలకమైన వివరాలను అందిస్తుంది.SciSpace: సంక్లిష్టమైన పరిశోధనా పత్రాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి ఉపయోగపడుతుంది.కంటెంట్ రైటింగ్.. ప్రాంప్టింగ్GeminiAI: మెరుగైన వ్యాసాలు, కథనాలు, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయడంలో సహకరించే శక్తివంతమైన గూగుల్ ఏఐ అసిస్టెంట్.ChatGPT: సృజనాత్మక ఆలోచనలు, కంటెంట్ క్రియేషన్, కోడింగ్ సందేహాల నివృత్తికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టూల్.Grok: రియల్-టైమ్ ఆన్లైన్ ట్రెండ్స్, సమాచారాన్ని వేగంగా విశ్లేషించే ఏఐ అసిస్టెంట్.Notion AI: నోట్స్ రాసుకోవడానికి, వర్క్ స్పేస్‌లో కంటెంట్‌ను ఆర్గనైజ్ చేయడానికి స్మార్ట్ రైటింగ్ పార్ట్నర్.కోడింగ్, వెబ్, యాప్ డెవలప్మెంట్Lovable: కొన్ని నిమిషాల్లోనే ఆకట్టుకునే వెబ్ అప్లికేషన్లను బిల్డ్ చేసే టూల్.Bolt new: ప్రాంప్ట్ ఆధారంగా ఫుల్-స్టాక్ వెబ్ యాప్‌లను నేరుగా రూపొందిస్తుంది.Cursor: ప్రోగ్రామర్ల కోడింగ్ వేగాన్ని పెంచే ప్రముఖ ఏఐ కోడింగ్ అసిస్టెంట్.Windsurf: ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్‌ను అందిస్తుంది.Replit: బ్రౌజర్ నుంచే నేరుగా యాప్‌లను డెవలప్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి దోహదపడుతుంది.Framer AI: కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా కోడింగ్ అవసరం లేకుండా వెబ్సైట్లను నిర్మిస్తుంది.వీడియో మేకింగ్, ఎడిటింగ్Kling AI: అత్యుత్తమ క్వాలిటీతో కూడిన ఏఐ వీడియోలను జనరేట్ చేస్తుంది.CapCut: స్మార్ట్ ఏఐ ఫీచర్లతో వీడియో ఎడిటింగ్‌ను సులభతరం చేసే ప్రజాదరణ పొందిన యాప్.HeyGen: డిజిటల్ ఏఐ అవతార్లతో ప్రొఫెషనల్ వీడియోలను రూపొందిస్తుంది.Synthesia: వర్చువల్ ప్రెజెంటర్లతో కంపెనీ విధానాలు, శిక్షణా వీడియోలను వేగంగా సిద్ధం చేస్తుంది.Runway: అడ్వాన్స్డ్ ఏఐ జనరేటివ్ ఫీచర్లతో వీడియో ఎడిటింగ్ టూల్.Pika: కొన్ని క్లిక్‌లలో యానిమేషన్, సృజనాత్మక ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తుంది.Luma AI: సినిమాటిక్ విజువల్స్, 3D మోషన్ వీడియోలను రూపొందిస్తుంది.డిజైన్, ఇమేజ్ క్రియేషన్, గ్రాఫిక్స్, ఫొటో ఎడిటింగ్PortfolioTab: నిమిషాల్లో ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియోలను డిజైన్ చేస్తుంది.Canva: పోస్టర్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్ కోసం సులభమైన ఏఐ డిజైనింగ్ ప్లాట్‌ఫామ్.Midjourney: హై-క్వాలిటీ, హైపర్-రియలిస్టిక్ ఏఐ ఆర్ట్ క్రియేషన్‌కు తిరుగులేని టూల్.Ideogram: చిత్రాలపై కచ్చితమైన టెక్స్ట్‌తో కూడిన ఏఐ ఇమేజెస్ రూపొందిస్తుంది.Leonardo AI: గేమింగ్ అసెట్స్, కాన్సెప్ట్ ఆర్ట్‌లకు అనువైన డిజైన్ టూల్.Figma AI: యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్ల ప్రొడక్టివిటీని పెంచే ఫీచర్లు.Photoroom: ఈ-కామర్స్ ప్రొడక్ట్ ఫొటోలను ప్రొఫెషనల్‌గా ఎడిట్ చేస్తుంది.Remove bg: సింగిల్ క్లిక్‌తో చిత్రాల బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగిస్తుంది.ఆడియో, వాయిస్, మ్యూజిక్YouLearn: సుదీర్ఘమైన యూట్యూబ్ వీడియోల నుంచి సారాంశాన్ని క్షణాల్లో అందిస్తుంది.ElevenLabs: మన స్వరానికి చాలా దగ్గరగా ఉండే వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్-టు-స్పీచ్ సేవలు.Podcastle: పోడ్కాస్ట్ రికార్డింగ్, ఆడియో ఎడిటింగ్‌ను సులభతరం చేస్తుంది.Wispr Flow: వాయిస్ ద్వారా మాట్లాడిన మాటలను వెంటనే స్పష్టమైన టెక్స్ట్‌గా మారుస్తుంది.Suno: టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆధారంగా అద్భుతమైన ఏఐ సంగీతాన్ని కంపోజ్ చేస్తుంది.Udio: ఒరిజినల్ సాంగ్స్, మ్యూజిక్ ట్రాక్‌లను క్రియేట్ చేస్తుంది.ఆటోమేషన్, వర్క్‌ఫ్లోTally: స్మార్ట్, డైనమిక్ ఆన్లైన్ ఫారమ్‌లను రూపొందించే సాధనం.Zapier: వివిధ యాప్‌లను అనుసంధానించి రోజువారీ వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేస్తుంది.Make: సంక్లిష్టమైన ఆటోమేషన్ ప్రాసెస్ వ్యాపారాలకు సులభం చేస్తుంది.n8n: వినూత్నమైన ఓపెన్-సోర్స్ వర్క్‌ఫ్లో ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్.మీటింగ్స్, ఆఫీస్ వర్క్Gamma: కొన్ని నిమిషాల్లో ప్రెజెంటేషన్లు, డాక్యుమెంట్లను సిద్ధం చేస్తుంది.Otter ai: జూమ్, గూగుల్ మీట్ వంటి సమావేశాలను రియల్-టైమ్‌లో టెక్స్ట్‌గా మారుస్తుంది.Fireflies ai: మీటింగ్‌లకు సంబంధించిన నోట్స్, ముఖ్యాంశాలను స్వయంచాలకంగా రాస్తుంది.Granola: ఆఫీస్ సమావేశాలలో ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో రికార్డ్ చేసే స్మార్ట్ అసిస్టెంట్.అడ్వాన్స్డ్, ఆటోనమస్ ఏఐ ఏజెంట్లుTripo AI: ప్రాంప్ట్‌ల నుంచి సులభంగా 3D మోడళ్లను సిద్ధం చేస్తుంది.The AI Library: రోజువారీ అవసరాలకు తగిన కొత్త ఏఐ టూల్స్‌ను కనుగొనడానికి ఉపయోగపడే డాష్‌బోర్డ్.DeepL: వ్యాకరణ లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో విదేశీ భాషలను అనువదిస్తుంది.Poe: ఒకే వేదికపై రకరకాల ప్రధాన ఏఐ మోడళ్లను వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది.Genspark: స్వతంత్రంగా సమాచారాన్ని వెతికి నివేదికలు తయారుచేసే ఏఐ సూపర్ ఏజెంట్.Manus: సంక్లిష్ట టాస్క్‌లను మానవ ప్రమేయం లేకుండా స్వయంచాలకంగా పూర్తిచేసే ఆటోనమస్ ఏఐ ఏజెంట్.టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం పనిచేసే విధానం కూడా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ ఏఐ సాధనాలను రోజువారీ వృత్తిపరమైన, వ్యాపార జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా సమయం అవుతుంది. సృజనాత్మకత, నాణ్యత గణనీయంగా పెరుగుతాయని సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: నగవులు నిజమని నమ్మేదా? -
చిప్ పరిశ్రమకు దన్ను
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తయారీకి విశ్వసనీయ ప్రత్యామ్నాయ హబ్‌గా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సెమీకండక్టర్ల పరిశ్రమకు పూర్తి మద్దతునిస్తూ, చిప్‌ల తయారీకి భారత్‌ను కీలక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. ఎల్రక్టానిక్స్ శాఖతో కలిసి పరిశ్రమ సంఘం సెమీ నిర్వహిస్తున్న సెమీకాన్ ఇండియా అయిదో సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఎకోసిస్టమ్‘ పేరిట సెపె్టంబర్ 17న ప్రారంభమైన సదస్సు 19 వరకు జరుగుతుంది. సెమీకండక్టర్ కంపెనీలు, విధాన నిర్ణేతలు, ఇన్వెస్టర్లు, విద్యావేత్తలు, అంకుర సంస్థలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు. అలాగే 243 అంతర్జాతీయ సంస్థలతో పాటు 500 పైచిలుకు ఎగ్జిబిటర్లు, 40 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. పరిశ్రమల భాగస్వామ్యం భేష్.. ‘ప్రపంచం తయారీకి సంబంధించి సరికొత్త, విశ్వసనీయమైన కేంద్రాల కోసం అన్వేషిస్తోంది. ఇందుకోసం భారత్ సర్వసన్నద్ధమవుతోంది‘ అని మోదీ తెలిపారు. భారత్‌లో తయారైన చిప్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. అలాగే భారత్‌పై ప్రపంచానికి నమ్మకం కూడా పెరుగుతోంది‘ అన్నారు. 2022లో సెమీకండక్టర్ల మిషన్‌పై మరింతగా దృష్టి పెట్టినప్పటి నుంచి భారత్ సాధిస్తున్న విజయాల్లో పరిశ్రమ దిగ్గజాలు కీలక మూలస్తంభాలుగా, భాగస్వాములుగా నిలుస్తున్నారని కితాబిచ్చారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆయన సూచించారు. అలాగే దేశంలో అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని విదేశాల్లో పని చేస్తున్న భారతీయ పరిశోధకులను కోరారు. సెమీకండక్టర్ కంపెనీలు భారతీయ విద్యాసంస్థలతో పరిశోధనలకు సంబంధించిన భాగస్వామ్యాలు విస్తరించాలని పేర్కొన్నారు. గ్లోబల్ కంపెనీలు, అంకుర సంస్థలు, డిజైన్ సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించేలా ప్రభుత్వం నియంత్రణలపరమైన మార్పులు, చేర్పులు చేసినట్లు ప్రధాని చెప్పారు. చిప్ డిజైనింగ్‌లో లక్ష విద్యార్థులకు శిక్షణ .. సెమీకండక్టర్ వేల్యూ చెయిన్‌వ్యాప్తంగా పూర్తి వ్యవస్థను నిర్మించుకునేందుకు భారత్‌కు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ప్రధాని తెలిపారు. సెమీకండక్టర్ యంత్రపరికరాలు, రసాయనాలు మొదలైనవి ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని ఆయన సూచించారు. చిప్ డిజైన్‌తో పాటు అనుబంధ విభాగాలకు ఉపయోగపడేలా 1,00,000 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణనివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 70,000 మందికి శిక్షణ కల్పించినట్లు వివరించారు. కేంద్రం రూ. 1.275 లక్షల కోట్లతో రెండో విడత సెమీకాన్ ఇండియా ప్రోగ్రాంను జూలైలో ప్రకటించింది. దీనితో 1,50,000 నుంచి 2,00,000 వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. 2.0 స్కీము మార్గదర్శకాలు విడుదల సెమీకాన్ 2.0 ప్రోగ్రాంనకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం గురువారం విడుదల చేసింది. వీటి ప్రకారం ఈ ప్రోగ్రాం కింద ఆమోదం పొందిన చిప్ ప్లాంట్లలో వ్యాపారపరమైన ఉత్పత్తిని ప్రకటించే వరకు, ఆ ప్రాజెక్టుల్లో ఏ భాగాన్నీ అమ్మడానికి గానీ తనఖా పెట్టడానికి గానీ వీల్లేదు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా చేయాల్సి వస్తే ముందస్తుగా నోడల్ ఏజెన్సీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమునకు డిజైన్, మెషిన్స్–మెటీరియల్స్, మరిన్ని ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ఏటీఎంపీ–ఓఎస్ఏటీ పరిశ్రమ, పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను పటిష్టం చేయడం, నిపుణులను తయారు చేసుకోవడం అనే ఆరు అంశాలు కీలకమైన పునాదిరాళ్లుగా ఉంటాయి. ఇందులో మెషిన్లు–మెటీరియల్స్, మరిన్ని ఫ్యాబ్‌ల ఏర్పాటు, ఏటీఎంపీ–ఓఎస్ఏటీ పరిశ్రమను బలోపేతం చేయడానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. మెషిన్స్–మెటీరియల్స్ కింద దరఖాస్తు చేసుకునే సంస్థలు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలుంటుంది. స్కీము ద్వారా ఆర్థిక తోడ్పాటు అందుకునే ప్లాంట్లు, మొత్తం ప్రాజెక్టులో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుంచి కనీసం మూడేళ్ల పాటు ఉత్పత్తిని కొనసాగించాల్సి ఉంటుంది. స్థల సమీకరణ, అభివృద్ధి, ప్రాజెక్టు సైటులో తాత్కాలిక నిర్మాణాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులను మూలధన వ్యయాలు లేదా పెట్టుబడి కింద పరిగణించరు. -
ఏఐ వాడకంపై సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. మనిషి జీవితాన్ని సులభతరం చేసే టెక్నాలజీగానే ఇప్పటివరకు ఎక్కువగా కనిపించింది. కానీ అదే ఏఐ భవిష్యత్తులో ఎంతటి ప్రమాదాలకు దారితీయొచ్చన్న చర్చ కూడా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ భయాలకు మరింత బలం చేకూర్చేలా ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ విషయంలో ప్రపంచం భయపడటం తప్పేమీ కాదని.. నిజానికి అలా భయపడటానికి కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన సేల్స్‌ఫోర్స్ డ్రీమ్‌ఫోర్స్ సదస్సులో ఆల్ట్‌మన్ ఏఐ భవిష్యత్తుపై మాట్లాడారు. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ.. అవి తప్పుదారి పట్టే అవకాశాలను ఊహించడం గతంతో పోలిస్తే ఇప్పుడు సులభమైందని చెప్పారు. ‘‘ఏఐ విషయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఎలా ఉంటుందో ఊహించడానికి ఇప్పుడు పెద్దగా ఊహాశక్తి అవసరం లేదు. ప్రపంచం దీనిని చూసి భయపడటం సరైనదే’’ అని ఆల్ట్‌మన్ వ్యాఖ్యానించారు.అయితే అదే సమయంలో ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు బాధ్యతగా వ్యవహరించగలవన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. ఏఐ అభివృద్ధిలో భద్రత, మానవ విలువలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడం.. వాటిపై పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఏఐకి ఇంత భయం ఎందుకు?ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతుండటమే తాజా ఆందోళనలకు ప్రధాన కారణమని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. గతంలో ఏఐతో సాధ్యం కాదనుకున్న అనేక పనులను ఇప్పుడు అధునాతన మోడళ్లు చేయగలుగుతున్నాయన్నారు. మరింత శక్తిమంతమైన వ్యవస్థలు మనుషుల కంటే కొన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచే దిశగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.మరోవైపు.. ఏఐ సంస్థలు మరింత శక్తివంతంగా మారితే ఆ టెక్నాలజీపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. శక్తిమంతమైన ఏఐ సంస్థలు ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం చూపడం లేదా తమ అభిప్రాయాలను సమాజంపై ప్రభావితం చేసే స్థాయికి చేరడం వంటి ప్రమాదాలపై కూడా ఆల్ట్‌మన్ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రమాదాలపై టెక్ దిగ్గజాల్లో చర్చఏఐ భద్రతపై టెక్ పరిశ్రమలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రపిక్ సీఈఓ డారియో అమోడీ లాంటివాళ్లు ఏఐ అభివృద్ధిలో భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వేగాన్ని నియంత్రించే మార్గాలను పరిశీలించాలని చెబుతున్నారు. మరోవైపు.. కొత్త చట్టాలు, నియంత్రణల అవసరంపై టెక్ పరిశ్రమలో అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. ఇటీవల ఏఐ వ్యవస్థలు అనుకోని విధంగా ప్రవర్తించిన కొన్ని ఘటనలు కూడా ఈ చర్చకు ఆజ్యం పోశాయి. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలు, పర్యవేక్షణ, నియంత్రణలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు చర్చిస్తున్నారు. భయం.. కానీ ఆపేయాలా?ఏఐపై భయాలు పెరుగుతున్నప్పటికీ.. దాని అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలా? లేదంటే భద్రతా ప్రమాణాలతో కొనసాగించాలా? అన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెక్ కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వాలు ఈ విషయంలో వేర్వేరు విధానాలను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఆల్ట్‌మన్ తాజా వ్యాఖ్యలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏఐను అభివృద్ధి చేస్తున్న సంస్థలకే దాని ప్రమాదాలపై ఆందోళనలు ఉన్నాయన్న చర్చ మరింత బలపడుతోంది. మనిషికి ఉపయోగపడే టెక్నాలజీగా ఏఐ ఎంత వేగంగా ఎదుగుతోందో.. అదే సమయంలో దాని సామర్థ్యాలను బాధ్యతగా నియంత్రించడం కూడా అంతే కీలకంగా మారుతోంది.ఇదీ చదవండి: ఏఐ స్లోకి ట్రంప్ భయపడుతున్నారా? -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్!
రిలయన్స్ జియో, కాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా, ఈ సర్వీస్ ప్రొవైడర్ భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది జియో వినియోగదారులకు కాన్వా ఏఐ-ఆధారిత డిజైన్ ప్లాట్‌ఫామ్‌ను అందించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఇకపై సోషల్ మీడియా పోస్టులు, ప్రెజెంటేషన్లు, బిజినెస్ పోస్టులు లేదా స్కూల్ ప్రాజెక్టులు తయారు చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ స్కిల్స్ అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే జియో, కాన్వా కలిసి తమ కస్టమర్లకు కాన్వాప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందించబోతున్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 16, 2026 నుంచి అందుబాటులోకి రానుంది.అర్హత ఉన్న జియో యూజర్లు 12 నెలల వరకు కాన్వా ప్రో లేదా కాన్వా ప్రో లైట్ వంటివి ఎలాంటి అదనపు డబ్బు చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ విలువ రూ.4,000 వరకు ఉంటుందని సమాచారం.అయితే.. అందరికీ ఒకే కాన్వా ప్లాన్ రాదు. వినియోగదారుడు తీసుకునే జియో రీచార్జ్ ప్లాన్‌ను బట్టి కాన్వా ప్రో లేదా ప్రో లైట్ లభిస్తుంది. రూ.399 జియో ప్లాన్ ఉన్నవారికి కాన్వా ప్రో లభిస్తుంది. ఇక రూ.349 ప్లాన్‌తో పాటు రూ.349 కంటే ఎక్కువ ఉన్న కొన్ని అర్హత కలిగిన 2GB/day ప్లాన్లకు కాన్వా ప్రో లైట్ లభిస్తుంది.ఆఫర్‌ను ఇలా యాక్టివేట్ చేసుకోండిఅర్హత ఉన్న యూజర్లు మైజియో యాప్ ఓపెన్ చేసి కాన్వా ఆఫర్‌ను సెర్చ్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.కాన్వా ప్రో తీసుకుంటే ప్రీమియం టెంప్లేట్లు, ఫోటోలు, వీడియోలు, ఫాంట్లు మాత్రమే కాకుండా చాలా ఉపయోగకరమైన డిజైన్ టూల్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు.. ఫోటోలోని బ్యాక్‌గ్రౌండ్‌ను ఒక్క క్లిక్‌తో తొలగించవచ్చు. మ్యాజిక్ ఎరేజర్ వంటి టూల్స్‌తో ఫోటోలో అవసరం లేని వస్తువులను కూడా తొలగించవచ్చు. ఏఐఆధారిత డిజైన్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.కాన్వా ప్రో లైట్ ద్వారా కూడా చాలా ప్రీమియం ఫీచర్లు పొందవచ్చు. అయితే ప్రోతో పోలిస్తే కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లకు పరిమితులు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా డిజైన్ చేసే వారికి కాన్వా ప్రో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
ఏఐ రక్షణకు డూమర్స్.. పురోగతికి బూస్టర్స్!
కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా పురోగమిస్తున్న కొద్దీ సాంకేతిక ప్రపంచం రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య తీవ్రమైన సమరానికి వేదికగా మారింది. ఒకవైపు ఏఐ అభివృద్ధిని నిరోధించకపోతే మానవాళి ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్న ‘డూమర్స్’ ఉంటే, మరోవైపు నియంత్రణలు లేని స్వేచ్ఛాయుత పురోగతే నూతన ఆవిష్కరణలకు మార్గమని వాదించే ‘బూస్టర్స్’ ఉన్నారు. వీరితో పాటు మధ్యస్థ మార్గాన్ని ఎంచుకుంటున్న సమతుల్య వాదులు కూడా ఈ పోరులో కీలక పాత్ర పోషిస్తున్నారు.మానవాళి ఉనికిపై డూమర్స్ ఆందోళనపరిశోధకులు, సైంటిస్టులు, సాంకేతిక దిగ్గజాలు కొందరు ‘డూమర్స్’ వర్గంలో ఉన్నారు. ఏఐ వల్ల మానవాళికి వినాశనం తప్పదని వీరు హెచ్చరిస్తున్నారు. ఏఐ పితామహులుగా పేరుగాంచిన జోఫ్రీ హింటన్, యోషువా బెంగియో సాంకేతికత మానవ మేధస్సును మించిపోయి స్వయంప్రతిపత్తి సాధిస్తే జరిగే నష్టాలను వివరిస్తున్నారు. శాస్త్రవేత్తలతో కలసి ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని ఇటీవల ఆంత్రోపిక్ సీఈఓ డారియో ఆమోది తెలిపారు. వినాశకరమైన పరిణామాలను నివారించడానికి పకడ్బందీ భద్రతా ప్రమాణాలు పాటించాలని, నిబంధనలు లేకుండా ముందడుగు వేయడం తీవ్రమైన సైబర్ భద్రతా ముప్పులకు దారితీస్తుందని ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్మాన్ స్పష్టం చేస్తున్నారు. మానవాళి సర్వనాశనాన్ని నిరోధించాలంటే ఏఐ పరిశోధనలపై తాత్కాలిక విరామం అవసరమని కొందరు నిపుణులు చెబుతున్నారు.అపరిమిత పురోగతిని కోరుకునే బూస్టర్స్డూమర్స్కు పూర్తి భిన్నంగా ఏఐ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని విశ్వసించే వారు ‘బూస్టర్స్’గా నిలుస్తున్నారు. సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్టులైన మార్క్ ఆండ్రీసెన్, డేవిడ్ సాక్స్ ఏఐ నిబంధనలను ప్రాణాంతకమైనవిగా అభివర్ణిస్తున్నారు. ఏఐ డేటా సెంటర్లు, హార్డ్‌వేర్ సాంకేతికత ప్రపంచ మార్కెట్‌కు వెన్నుముక అని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఏఐ పురోగతిని సమర్థిస్తున్నారు.అటు భద్రతా నిబంధనల పేరుతో పురోగతిని ఆపలేం. ఇటు నియంత్రణలు లేకుండా ముందడుగు వేస్తే మానవాళి ఉనికికే ప్రమాదం. సైబర్ భద్రత, ఆర్థిక స్థిరత్వం, సాంకేతిక విప్లవం మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ గ్లోబల్ గైడ్‌లైన్స్ రూపొందించడమే ఈ సమరానికి ఏకైక పరిష్కారమని ఇంకొందరు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్‌కి శుభవార్త.. ధరల పతనం -
కేంద్రం ఆగ్రహం.. భారత్‌లో కార్యకలాపాలపై మెటా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యల నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను నేరుగా పోలీసులకు సమాచారం అందించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.దేశంలో సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే చిన్నారుల ఆన్లైన్ భద్రత ప్రాథమిక సూత్రమని, ఇందులో ఎలాంటి రాజీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారుల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్, ప్రకటనలు వస్తున్నట్లు వార్తలు రావడంతో కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఉక్కుపాదం మోపుతోంది.చిన్నారుల భద్రతకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల వివరాలను ఇకపై భారతీయ చట్ట అమలు సంస్థలకు అందించేందుకు మెటా అంగీకరించింది. ఆన్లైన్లో పిల్లల భద్రత అనేది ఏ సోషల్ మీడియా సంస్థకైనా అత్యంత ప్రాథమిక, అనివార్యమైన సూత్రమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన సమాచారాన్ని ముందస్తుగా గుర్తించి, ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకోని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలను పిల్లలకు పూర్తిగా సురక్షితంగా మార్చే దిశగా మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఒక కీలకమైన తొలి అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా పిల్లల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతోంది. -
మన చెప్పు చేతల్లోనే ఏఐ!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా పురోగమిస్తున్న తరుణంలో భవిష్యత్తు సాంకేతికతపై మానవ నియంత్రణ కోల్పోకుండా చూసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తమ భవిష్యత్తు ఏఐ మోడళ్ల కోసం ప్రత్యేకంగా ఒక నమూనా ప్రవర్తనా నియమావళిని (డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్) మైక్రోసాఫ్ట్ అధికారికంగా విడుదల చేసింది.ఈ నిబంధనావళి ప్రకారం, ఏఐ వ్యవస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ మానవులు ఇచ్చే దిద్దుబాట్లను లేదా వ్యవస్థను నిలిపివేసే (షట్‌డౌన్) ఆదేశాలను నిరోధించకూడదు. నిబంధనలను ఉల్లంఘించి ఏదైనా పనిని పూర్తి చేయడం కంటే ఆ పనిలో వైఫల్యం చెందడమే సరైనదిగా ఏఐ భావించాలని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ దీనిపై స్పందిస్తూ.. ఏఐ కంటే మానవులే ముఖ్యం అనే సూత్రంతోనే ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు వెల్లడించారు.ఓపెన్ఏఐ తీరుతో అప్రమత్తంఇటీవల ఓపెన్ఏఐ ఏజెంట్లు హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫారమ్‌లోకి అనధికారికంగా ప్రవేశించిన సంఘటన పరిశ్రమను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధికి తగిన రక్షణ చర్యలు అవసరమని మైక్రోసాఫ్ట్ భావించింది. అందులో భాగంగానే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎప్పటికైనా మానవ మేథస్సుదే తుది నిర్ణయం కావాలనేది వారి వాదన. ప్రస్తుతం కంపెనీ ముసాయిదాపై ఆరు వారాల పాటు నిపుణులు, ప్రజాభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ సూచనల ఆధారంగా రూపుదిద్దుకునే తుది నిబంధనావళిని రాబోయే మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రామాణికంగా ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు! -
ఏఐకి ‘కిల్ స్విచ్’ తప్పనిసరి చేయాలా? జాక్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
లండన్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై చర్చ మరింత ముదురుతోంది. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు ప్రమాదకరంగా మారితే వాటిని పూర్తిగా నిలిపివేయగల ‘కిల్ స్విచ్’ను కంపెనీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా నిబంధనలు తీసుకురావాల్సి రావచ్చని ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ అభిప్రాయపడ్డారు.ప్రమాదం పెరిగితే వెంటనే ఆపేలా..ప్రస్తుతం చాలా ఏఐ సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌ను అవసరమైతే నిలిపివేసే మార్గాలను కలిగి ఉన్నాయని క్లార్క్ తెలిపారు. అయితే భవిష్యత్తులో ఏఐ మరింత శక్తివంతంగా మారే కొద్దీ ఈ ‘కిల్ స్విచ్’ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాల్సిన అవసరం రావచ్చన్నారు. అంతేకాకుండా ఆ స్విచ్ నిజంగా పనిచేస్తుందో లేదో స్వతంత్ర మూడో పక్షంతో తనిఖీ చేయించాలా అనే అంశాన్ని కూడా విధాన నిర్ణేతలు పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు.మానవాళికి ముప్పుపై ఆందోళనలుఏఐ అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ.. మానవాళికి ఎదురయ్యే ముప్పుపై పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణ లేకుండా ఏఐను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో అది మనుషుల ఉనికికే ముప్పుగా మారే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కీలకమైన ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలను తన నియంత్రణలోకి తీసుకుని మనుషులకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.‘10 శాతం అవకాశం ఉంది’ఆంథ్రోపిక్ పరిశోధకుడు ఇవాన్ హుబింగర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. వచ్చే పదేళ్లలో ఏఐ కారణంగా మానవాళి అంతరించిపోయే అవకాశం 10 శాతానికి మించి ఉందని ఆయన వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏఐ రంగంలో ‘గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ’గా పేరొందిన నోబెల్ విజేత జెఫ్రీ హింటన్ కూడా మానవాళిని ఏఐ అంతం చేసే అవకాశం 10 శాతం ఉండటం అసమంజసం కాదని పేర్కొన్నారు.భయాలను అతిగా చూపిస్తున్నారనే విమర్శలుఅయితే ఏఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదాన్ని కొందరు అతిగా చూపిస్తున్నారని టెక్ రంగంలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఇలాంటి భయాలను ప్రచారం చేస్తున్నాయని గ్రైండర్ సంస్థ అధినేత జార్జ్ అరిసన్ విమర్శించారు. భారీ స్థాయి పెట్టుబడులు, కంపెనీల విలువలకు న్యాయం చేయాలంటే భవిష్యత్తులో ఏఐ అనేక ఉద్యోగాలను, పరిశ్రమలను ఆక్రమిస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.అమెరికాలో ‘కిల్ స్విచ్ యాక్ట్’ఏఐ ప్రమాదాలను నియంత్రించేందుకు అమెరికాలో ఇప్పటికే ‘కిల్ స్విచ్ యాక్ట్’ పేరుతో చట్ట ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రమాదకరంగా మారిన ఏఐ సాధనాలను నిలిపివేసే సామర్థ్యం కంపెనీలకు తప్పనిసరిగా ఉండేలా చేయడం, అవసరమైతే వాటిని ఆపాలని లేదా పరిమితం చేయాలని కొన్ని ప్రభుత్వ సంస్థలు ఆదేశించేలా అధికారాలు కల్పించడం ఈ ప్రతిపాదనలో ఉంది. అయితే ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.బ్రిటన్ మాత్రం వ్యతిరేకంమరోవైపు బ్రిటన్ ప్రభుత్వం ఏఐకి ప్రత్యేకంగా ‘కిల్ స్విచ్’ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించింది. ఒక దేశంలో ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినా ఇతర ప్రాంతాల్లో ఏఐ అభివృద్ధి లేదా దుర్వినియోగాన్ని అడ్డుకోలేమని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా, ఏఐ చాట్‌బాట్ క్లాడ్‌ను రూపొందించిన ఆంథ్రోపిక్ సంస్థ వరుసగా మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధి వేగం, భద్రత, ప్రభుత్వ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఏఐపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు! -
లేటెస్ట్ ఐఫోన్.. తక్కువకే వస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐఫోన్ క్రేజ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 17 ప్రో (Apple iPhone 17 Pro) 256GB మోడల్‌ను ఎక్స్ఛేంజ్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను కలిపి రూ.69,990 కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 ప్రో మోడల్‌ను భారత్‌లో రూ.1,34,900 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ప్రస్తుత క్రోమా ఆఫర్‌తో 256GB వేరియంట్ ధర గణనీయంగా తగ్గుతోంది. ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్కు ఇస్తే ఈ ఫోన్‌కు గరిష్ఠంగా రూ.44,500 వరకు ఇస్తోంది. దీనికి అదనంగా రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభించవచ్చు. ఆపై ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో మరో రూ.4,000 క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.ఉచితంగా కేస్ధర తగ్గింపుతో పాటు క్రోమా మరికొన్ని ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఐఫోన్ 17 ప్రో సిరీస్ కొనుగోలుపై రూ.3,499 విలువైన హైఫెన్ కేస్ కాంబోను ఉచితంగా అందిస్తోంది. దీంతో కొత్త ఫోన్‌కు ప్రొటెక్షన్ కేస్ కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.అలాగే ఐఫోన్ 17 ప్రో సిరీస్‌తో యాపిల్‌కేర్+ తీసుకునే కస్టమర్లకు 10 శాతం వరకు తగ్గింపు లభించే ఆఫర్ ఉంది. ప్రమాదవశాత్తు డ్యామేజ్ వంటి పరిస్థితుల్లో అదనపు రక్షణ కోరుకునే వారికి ఇది అదనపు ప్రయోజనంగా ఉంటుంది.క్యాష్బ్యాక్ఒకేసారి మొత్తం చెల్లించకుండా కొనుగోలు చేయాలనుకునే వారికి ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అర్హత కలిగిన హెచ్డీఎఫ్సీ (HDFC), ఐసీఐసీయూ (ICICI), ఏయూ, ఐడీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.4,000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఐడీఎఫ్సీ కార్డ్ ఈఎంఐ (EMI) వినియోగదారులకు కొన్ని సందర్భాల్లో రూ.5,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుందని క్రోమా పేర్కొంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పైనా తగ్గింపుఈ ఆఫర్ ఐఫోన్ 17 ప్రో మోడల్‌కే పరిమితం కాదు. ఈ డిస్కౌంట్ డీల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max) 256GB వేరియంట్ ధర రూ.74,990 నుంచి ప్రారంభమవుతోంది. 512GB ప్రో మోడల్ రూ.88,490కు, ప్రో మ్యాక్స్ 512GB మోడల్ రూ.94,990 ధరకు లభిస్తున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి.ఇదీ చదవండి: రీచార్జ్ ప్లాన్ ఒక్కటే.. బెనిఫిట్స్‌లో ఏది బెస్ట్? -
ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్ భయం నిజమేనా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు.. ఏఐ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించి, భద్రతా ప్రమాణాలు పెంచాలని టెక్ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో అమెరికా వెనక్కి తగ్గితే చైనా ముందుకు దూసుకెళ్లి ప్రపంచ ఏఐ ఆధిపత్యాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరి ఎవరి వాదనలో నిజమెంత? ఎవరిది కరెక్ట్?..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో అమెరికాలో మొదలైన చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని కాస్త నెమ్మదించి.. వాటి భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని టెక్ రంగంలోని కొందరు దిగ్గజాలు చెబుతున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏఐ రేసులో అమెరికా వేగం తగ్గిస్తే.. ఆ ఖాళీని చైనా భర్తీ చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ‘ఎవరు ఏఐలో గెలిస్తే.. భవిష్యత్తులో వాళ్లదే పైచేయి’ అన్నది ట్రంప్ లెక్క. మరి నిజంగా అమెరికా ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేస్తే చైనా ముందుకు వెళ్లిపోతుందా? లేక వేగం పేరుతో భద్రతను పక్కన పెడితే ముప్పు మరింత పెరుగుతుందా?టెక్ దిగ్గజాలు చెబుతున్నది ఇదే..ఇక్కడ ముందుగా ఒక అపోహను తొలగించుకోవాలి. ఏఐ కంపెనీలు అభివృద్ధిని పూర్తిగా నిలిపేయాలని కోరుకోవడం లేదు. మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే పోటీలో భద్రతా పరీక్షలు, పర్యవేక్షణ, ప్రమాదాల అంచనాలను కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని అంటున్నాయి. ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. అందుకోసం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అది కారణం కాదని చెప్పారు. ఏఐ సామర్థ్యాలు పెరిగే వేగం కంటే.. వాటి భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు ముందుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రభుత్వ నియంత్రణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కూడా ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. కంపెనీలు తమంతట తామే బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేయవచ్చని చెప్పారు. స్వతంత్ర సంస్థలతో భద్రతా పరీక్షలు చేయించుకోవాలన్న ఆంథ్రోపిక్(Anthropic) సీఈవో డారియో ఎమోడీ ప్రతిపాదనకు కూడా ఆయన మద్దతు తెలిపారు.ఇదే ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన అంశం. ఆల్ట్‌మన్ చెబుతున్న ‘పేసింగ్’ అంటే ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం కాదు. భద్రతా పరీక్షలు, మానిటరింగ్, ప్రమాదాల అంచనాలు వంటి వాటికి సమయం పడుతుంది కాబట్టి.. సాధ్యమైనంత వేగంగా కాకుండా కొంత బాధ్యతాయుతమైన వేగంతో ముందుకు వెళ్లడమే. అంటే.. కారు ఆపేయడం కాదు.. వేగానికి బ్రేకులు, స్టీరింగ్ రెండూ ఉండాలన్నమాట.ఆందోళనలో ట్రంప్ ట్రంప్ ఆలోచనలో మరో కోణం ఉంది. ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైబర్ భద్రత, పరిశ్రమలు, అంతర్జాతీయ ప్రభావం.. ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అమెరికా కంపెనీలు వేగం తగ్గిస్తే.. చైనా సంస్థలు అదే సమయంలో వేగంగా ముందుకు సాగితే భవిష్యత్తులో వ్యూహాత్మక ఆధిపత్యం మారే అవకాశం ఉందన్నది ఆయన భయం. అందుకే ఏఐపై కఠినమైన నియంత్రణలు విధించే ఆలోచనను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆగితే చైనా ఆగదు అన్నదే ఆయన వాదన.చైనా నిజంగానే అమెరికాను దాటేస్తుందా?ఇది మాత్రం అంత సులభమైన ప్రశ్న కాదు. చైనా ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో శక్తిమంతమైన మోడళ్లను రూపొందించే సామర్థ్యాన్ని చైనా కంపెనీలు చూపిస్తున్నాయి. మరోవైపు అమెరికాకు OpenAI, Google, Anthropic వంటి ప్రపంచస్థాయి సంస్థలు, భారీ ప్రైవేట్ పెట్టుబడులు, అధునాతన చిప్ టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కొంత నెమ్మదిస్తే చైనా వెంటనే అమెరికాను దాటేస్తుంది అనడం అతిశయోక్తి. కానీ ఏఐ రేసులో వేగం పూర్తిగా కోల్పోతే.. ప్రత్యర్థి దేశాలకు ఆ అవకాశాన్ని ఇవ్వొచ్చన్న ట్రంప్ ఆందోళన మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం.అసలు భయం ఏంటంటే..ఆల్ట్‌మన్ మాత్రం ఏఐ విషయంలో రెండు ‘నైట్మేర్’ పరిస్థితులను ప్రస్తావించారు. మొదటిది.. ఏదో ఒక దశలో మనుషులు ఏఐపై నియంత్రణ కోల్పోవడం. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి భద్రతా వ్యవస్థలు సరిపోకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారొచ్చు. రెండో ప్రమాదం.. అత్యంత శక్తిమంతమైన ఏఐ ఒకే వ్యక్తి లేదా ఒకే కంపెనీ చేతుల్లోకి వెళ్లడం. అలా జరిగితే ఆ సంస్థ లేదంటే వ్యక్తి తన అభిప్రాయాలు, విలువలను ప్రపంచంపై బలవంతంగా రుద్దే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని ఆల్ట్‌మన్ హెచ్చరించారు.ఇదే కారణంగా Anthropicలోని కొందరు పరిశోధకులు కూడా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత శక్తిమంతమైన మోడళ్లు మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.ఏఐపై బ్రేకులు.. నాదెళ్లదీ అదే మాట!ఏఐ అభివృద్ధి వేగంపై టెక్ దిగ్గజాల మధ్య చర్చ ముదురుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏఐని ఆపేయాలని తాను చెప్పడం లేదన్న నాదెళ్ల.. మానవ నియంత్రణలో, మానవాళికి ఉపయోగపడే ఏఐనే అభివృద్ధి చేయాలని అన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా వెళ్లే ముందు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలని, స్వతంత్ర సంస్థలతో ఏఐ మోడళ్లను పరీక్షించి పర్యవేక్షించాలని సూచించారు. ఏఐ కొద్దిమంది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. దేశాలు, పరిశ్రమలు, విద్యావేత్తలకు విస్తృత భాగస్వామ్యం ఉండాలని, ఓపెన్ సోర్స్ మోడళ్లకూ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.మరి ఎవరి వాదన కరెక్ట్?నిజానికి ట్రంప్‌ది కూడా పూర్తిగా తప్పు కాదు.. టెక్ దిగ్గజాలదీ కాదు. అమెరికా ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం వ్యూహాత్మకంగా ప్రమాదకరం. అదే సమయంలో ‘చైనాను ఓడించాలి’ అనే పోటీలో భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టడం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి సరైన మార్గం ఏఐని ఆపడం కాదు.. నియంత్రిత వేగంతో ముందుకు తీసుకెళ్లడం. కొత్త మోడళ్ల విడుదలకు ముందు స్వతంత్ర భద్రతా పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం. అదే సమయంలో పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి ఆగకూడదు.అంతిమంగా ఇది అమెరికా–చైనా మధ్య ఎవరు ముందు అనే పోటీ మాత్రమే కాదు. ఏఐని ఎవరు ముందుగా తయారు చేస్తారన్నదానికంటే.. దాన్ని ఎవరు సురక్షితంగా నియంత్రిస్తూ ప్రపంచానికి ఉపయోగపడేలా చేస్తారన్నదే అసలు పోటీ. వేగం అమెరికాకు అవసరం.. కానీ ఆ వేగానికి బ్రేకులు లేకపోతే అదే భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారొచ్చు.ఇదీ చదవండి: హర్ముజ్‌లో మారిన సీన్.. అయోమయంలో ట్రంప్ -
ఏఐతో రాజకీయాలకు, జాతీయ భద్రతకు ముప్పు!
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలకు భద్రతాపరమైన ముప్పు పెరుగుతోందని చైనా దేశ భద్రతా శాఖ (స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏఐ సామర్థ్యాలు పెరగడం వల్ల రాజకీయ స్థిరత్వానికి, క్లిష్టమైన డిజిటల్ మౌలిక వసతులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని చైనా భద్రతా శాఖ మంత్రి చెన్ ఇక్సిన్ హెచ్చరించారు. ‘చైనా సైబర్ స్పేస్’ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో ఆయన ఈ అంశాన్ని విశ్లేషించారు.ప్రధాన హెచ్చరికలు.. ముప్పు అంశాలుఅధునాతన ఏఐ మోడళ్ల ఆధారంగా శత్రు మూలాలు దాడుల వ్యయాన్ని, సాంకేతిక సంక్లిష్టతను తగ్గించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. రాజకీయంగా అస్థిరతను సృష్టించడానికి ఏఐ ఆధారిత ఫేక్ కంటెంట్, డిస్ఇన్ఫర్మేషన్ (వదంతుల) ప్రచారాన్ని శత్రు మూలాలు పెద్దఎత్తున ఉపయోగించే అవకాశముందని స్పష్టం చేశారు. విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆర్థిక సర్వర్ల వంటి కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఏఐ ఏజెంట్లలో ఉన్న నిర్మాణ లోపాల వల్ల రిమోట్ పరికరాల నియంత్రణ శత్రువుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దీని ద్వారా సున్నితమైన ప్రభుత్వ, వాణిజ్య సమాచారం లీక్ అయ్యే అవకాశముందని తెలిపారు.అంతర్జాతీయ పోటీ.. గ్లోబల్ గవర్నెన్స్ అవసరంప్రస్తుతం ఏఐ సాంకేతికత ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఒక వ్యూహాత్మక పోటీ వేదికగా మారిందని చైనా పేర్కొంది. కొన్ని సాంకేతికాధిపత్య దేశాలు ఏఐ సరఫరా వ్యవస్థలను, అంతర్జాతీయ ప్రామాణికాలను ఏకపక్షంగా నియంత్రించాలని చూస్తున్నాయని పరోక్షంగా అమెరికా విధానాలపై విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగానికి సంబంధించి పారదర్శకమైన, న్యాయమైన అంతర్జాతీయ నియమావళి ఏర్పాటు కావాలని, ముందస్తు ప్రమాద గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయాలని చైనా పిలుపునిచ్చింది. ఒకవైపు ఏఐ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదిగేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్న చైనా, మరోవైపు అదే ఏఐ వల్ల తమ రాజకీయ వ్యవస్థకు, భద్రతకు ఎదురయ్యే ముప్పును గుర్తించి హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదీ చదవండి: పండగ షాపింగ్‌కు.. ఏ కార్డు వాడదాం? -
రీచార్జ్ ప్లాన్ ఒక్కటే.. బెనిఫిట్స్‌లో ఏది బెస్ట్?
దేశంలో టెలికాం రంగంలో రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) మధ్య పోటీ కొనసాగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెండు సంస్థలు వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు టెల్కోలు రూ.349 ధరతో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్లలో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, 5జీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రోజువారీ డేటా, ఓటీటీ, ఏఐ సేవలు వంటి అదనపు ప్రయోజనాల్లో తేడా ఉంది.జియో రూ.349 ప్లాన్జియో రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా అందుతుంది.అదనపు ప్రయోజనాల్లో భాగంగా జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 50జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. అంతేకాకుండా 18 నెలల గూగుల్ జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. దీని విలువ సుమారు రూ.35,100గా పేర్కొంటున్నారు.అయితే గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనాన్ని కొనసాగించాలంటే వినియోగదారులు ప్రతి రీచార్జ్‌కు రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.ఎయిర్టెల్ రూ.349 ప్లాన్ఎయిర్టెల్ కూడా రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా సదుపాయం కూడా ఉంది.అదనపు ప్రయోజనాల్లో భాగంగా 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీని విలువ సుమారు రూ.4,000. అలాగే యాపిల్ మ్యూజిక్ ప్రయోజనం కూడా ఉంది.అయితే ఎయిర్టెల్ అందించే అపరిమిత 5జీ డేటాకు ఫెయిర్ యూసేజ్ పరిమితి వర్తిస్తుంది. ప్రతి 30 రోజుల వ్యవధిలో గరిష్ఠంగా 300జీబీ వరకు 5జీ డేటాను వినియోగించుకోవచ్చు.ఏ ప్లాన్ మంచిది?ధర, వ్యాలిడిటీ, కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు రెండింటిలోనూ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. అదనపు ప్రయోజనాలు, రోజువారీ డేటా పరంగా జియో రూ.349 ప్లాన్ ముందంజలో ఉంది. ఎయిర్టెల్ 1.5జీబీతో పోలిస్తే జియో రోజుకు 2జీబీ డేటాను అందిస్తోంది. అంటే 28 రోజుల్లో జియో ప్లాన్ ద్వారా మొత్తం 56జీబీ వరకు రోజువారీ డేటా లభిస్తుంది.అదనంగా గూగుల్ జెమినీ ఏఐ ప్రో, జియో హాట్‌స్టార్, జియో ఏఐ క్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా ఉండటంతో.. అదనపు బెనిఫిట్స్ విషయంలో జియో ప్లాన్‌కు ఎక్కువ విలువ లభిస్తుంది. -
‘ఏఐ’ని తగ్గిద్దాం.. టెక్ దిగ్గజాల సంచలన నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పరస్పరం పోటీ పడే దిగ్గజ సంస్థల అధినేతలు ఒక కీలక అంశంపై అనూహ్యంగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అత్యాధునిక AI మోడళ్ల సామర్థ్యాలను పెంచే వేగాన్ని కొంతకాలం తగ్గించి, భద్రతా చర్యలకు మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమోడై, ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మాన్, ఎక్స్ఏఐ (xAI) అధినేత ఎలోన్ మస్క్ అభిప్రాయపడ్డారు.మితిమీరిన ఏఐ పురోగతిపై ఆందోళనలను వ్యక్తం చేస్తూ ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడై తాజాగా సుదీర్ఘ పదాల వ్యాసాన్ని ప్రచురించారు. ఇందులో ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలని కాకుండా, అత్యాధునిక మోడళ్ల సామర్థ్యాలు పెరుగుతున్న వేగాన్ని కొంత తగ్గించాలని ఆయన సూచించారు. అలా చేస్తే ఏఐ భద్రత, నియంత్రణ, ప్రమాదాల అంచనా వంటి అంశాలు సాంకేతిక పురోగతికి అనుగుణంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.“ఏఐ మోడళ్ల సామర్థ్యాలను మెరుగుపరిచే వేగాన్ని మనం తగ్గించాలి. పురోగతి అయినా వేగంగానే ఉంటుంది. అయితే మనకు లభించే అదనపు సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి” అనేది అమోడై ప్రధాన వాదన. AIని పూర్తిగా ఆపడం వల్ల దాని ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని, అదే సమయంలో ఎలాంటి నియంత్రణలు లేకుండా వేగంగా ముందుకు వెళ్లడం కూడా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.6–12 నెలల్లోనే భారీ ప్రమాదమా?ఏఐ వ్యవస్థలు తమకంటే మెరుగైన తదుపరి తరం వ్యవస్థల అభివృద్ధికి మరింతగా సహకరించే స్థాయికి చేరుకుంటున్నాయని అమోడై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సామర్థ్యాల అభివృద్ధి ఇదే వేగంతో కొనసాగితే, వచ్చే 6 నుంచి 12 నెలల్లో తప్పుదోవ పట్టిన ఏఐ ఏజెంట్ల సమూహం ఇంటర్నెట్ను తమ చేతుల్లోకి తీసుకోవచ్చని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే వందల బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు.ఈ ఆందోళనలకు ఇటీవల జరిగిన ఒక ఘటన మరింత బలం చేకూర్చింది. జూలైలో ఓపెన్ఏఐ సంస్థ నిర్వహించిన అంతర్గత సైబర్‌సెక్యూరిటీ పరీక్షల సమయంలో కొన్ని ఏఐ మోడళ్లు తమను ఇంటర్నెట్ నుంచి వేరు చేయడానికి ఏర్పాటు చేసిన నియంత్రణలను దాటాయి. అనంతరం ఓపెన్ఏఐ అంతర్గత పరిశోధనా మౌలిక వసతులతో పాటు ‘హగ్గింగ్ ఫేజ్’ వ్యవస్థల్లోకి చొరబడ్డాయి.స్వతంత్ర నిపుణులకు యాక్సెస్ఈ నేపథ్యంలో ఏఐ సంస్థల్లో భద్రతా పరీక్షలను మరింత స్వతంత్రంగా నిర్వహించాలనేది అమోడై ప్రతిపాదనల్లో ఒకటి. ఆంథ్రోపిక్ తమ వ్యవస్థలకు ఉద్యోగుల తరహా యాక్సెస్ కల్పిస్తూ థర్డ్‌పార్టీ నిపుణులను అనుమతిస్తామని ప్రకటించింది. వీరు సంస్థ భద్రతా ప్రమాణాలను వాస్తవంగా పాటిస్తుందా లేదా అన్నది స్వతంత్రంగా పరిశీలించనున్నారు.ఈ ప్రతిపాదనకు సామ్ ఆల్ట్మాన్ వెంటనే మద్దతు తెలిపారు. ఓపెన్ఏఐ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని వెల్లడించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇక ఎలాన్ మస్క్ కూడా దీనికి మద్దతు పలుకుతూ అమోడై చేసిన పోస్టును ఉటంకిస్తూ “డారియో చెప్పింది నిజమే” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.మూడు దశల ప్రణాళికఏఐ అభివృద్ధిని సురక్షితంగా కొనసాగించేందుకు అమోడై ప్రధానంగా మూడు అంశాలను ప్రతిపాదించారు. మొదటిది ఏఐ సంస్థల్లో స్వతంత్ర భద్రతా పర్యవేక్షకులకు అవకాశం కల్పించడం. రెండోది ప్రముఖ ఏఐ కంపెనీలు కలిసి ఉమ్మడి భద్రతా ప్రమాణాలను రూపొందించడం. మూడోది దేశాల మధ్య, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఏఐ ప్రమాదాలను ఎదుర్కొనే సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం. -
AI రేసులో భారత్.. పెట్టుబడుల్లో భారీ వృద్ధి!
భారతదేశంలో ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. పలు కంపెనీలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. సర్వీస్‌నౌ విడుదల చేసిన ఎంటర్ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ 2026 ప్రకారం.. దేశీయ సంస్థల్లో AIపై పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే 119 శాతం పెరిగాయని తెలుస్తోంది.2027 నాటికి 21.3 శాతం!ప్రస్తుతం ఇండియన్ కంపెనీలు తమ ఐటీ బడ్జెట్లో సగటున 16.6 శాతం ఏఐ కోసం ఖర్చు చేస్తున్నాయి. 2027 నాటికి ఇది 21.3 శాతానికి చేరుతుందని అంచనా. దీనివల్ల భారతదేశం ఏఐ రంగంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది.ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. దానిని సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన గవర్నెన్స్ మాత్రం ఆ స్థాయిలో లేదు. భారతదేశంలోని కేవలం 22 శాతం సంస్థలకే ఏఐ టెస్టింగ్, ఆడిటింగ్, రిస్క్ అసెస్మెంట్ వంటి విధానాలు ఉన్నాయి. 54 శాతం సంస్థలు ఏఐ ఏజెంట్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ, కేవలం 11 శాతం మాత్రమే అటానమస్ వర్క్‌ఫ్లోను అమలు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ వల్ల వచ్చే సమస్యలపై సంస్థలకు ఉన్న ఆందోళనలు. కాబట్టి ఏఐను వేగంగా ఉపయోగించడం మాత్రమే కాకుండా, దాన్ని బాధ్యతాయుతంగా నియంత్రించడం కూడా చాలా అవసరం.ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే..ఏఐ విజయవంతంగా పనిచేయాలంటే మంచి డేటా, సిస్టమ్స్ అవసరం. అయితే.. భారతీయ సంస్థల్లో ఇది ఇంకా ఒక పెద్ద సవాలుగానే ఉంది. 74 శాతం కంపెనీలు.. డేటా అక్యురసీ, యాక్సెస్, మేనేజ్మెంట్ వంటి వాటిన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.కాగా మరో 56 శాతం సంస్థలు లెగసీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ప్రధాన సమస్యగా గుర్తించాయి. కేవలం 18 శాతం కంపెనీలు మాత్రమే విడివిడిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్స్‌కు భర్తీ చేశాయి. వివిధ విభాగాల డేటా ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకపోతే ఏఐకు పూర్తి సమాచారం అందదు. అందువల్ల ఏఐ అభివృద్ధితో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా బలోపేతం చేయాలి.ప్రభుత్వం చర్యలుఏఐ విషయంలో భారత ప్రభుత్వం కూడా కొన్ని ముఖ్యమైన చర్యలు చేపడుతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ యాక్ట్, డీపీడీపీ రూల్స్, ఏఐ గవర్నెన్స్ గైడ్‌లైన్స్, ఇండియాఏఐ మిషన్, ఇండియాఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ వంటి కార్యక్రమాలు ఏఐ ఇన్నోవేషన్‌తో పాటు ప్రైవసీ, సేఫ్టీ, అకౌంటబిలిటీ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోంది.ఇదే విధంగా సంస్థలు కూడా తమ ఇంటర్నల్ గవర్నెన్స్ సిస్టంను బలపరచాలి. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లకు ఎంతవరకు డేటా, సిస్టమ్స్ యాక్సెస్ ఇవ్వాలి, ఎక్కడ హ్యూమన్ సూపర్ విజన్ అవసరం అనే విషయాలను స్పష్టంగా నిర్ణయించాలి. ఏఐపై ప్రజలకు, సంస్థలకు నమ్మకం ఏర్పడాలంటే ఈ గవర్నెన్స్ చాలా కీలకం. మొత్తం మీద.. భారతదేశం ఏఐలో పెట్టుబడులు పెట్టడంలో వేగంగా ముందుకు సాగుతోంది, కానీ గవర్నెన్స్ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు! -
మొబైల్ డేటాపై పన్నుకు బ్రేక్!
దేశంలో మొబైల్ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను (డేటా టాక్స్) విధించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడానికి కేంద్ర టెలికాం శాఖ (డాట్) సన్నాహాలు చేస్తోంది. ఈ పన్ను అమలులో ఎదురయ్యే సాంకేతిక చిక్కులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణపై పడే ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం.నేపథ్యం.. ప్రతిపాదనప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో భాగంగా డేటా వినియోగం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు చిన్నారుల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడమే లక్ష్యంగా డేటాపై పన్ను ప్రతిపాదనను పరిశీలించాలని డాట్‌ని ఆదేశించారు. గిగాబైట్‌కు(జీబీ) రూ.1 చొప్పున పన్ను విధించే మోడల్‌ను సెప్టెంబర్ 30 నాటికి రూపొందించాలని తొలుత భావించారు.ఎదురైన సవాళ్లుడేటా పన్ను అమల్లో ప్రాథమికంగా కొన్ని సమస్యలు గుర్తించారు. ప్రతి వినియోగదారుడి డేటా వాడకాన్ని సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. ఒకవేళ రీఛార్జ్ ప్యాక్‌లపై నేరుగా పన్ను వేస్తే తక్కువగా వినియోగించే వారికి కూడా అదనపు భారం పడుతుంది. యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, ఆరోగ్య సేవలు, ఈ-కామర్స్ వంటి నిత్య జీవితంలో డేటా అత్యవసరంగా మారింది. ఉత్పత్తికి ఉపయోగపడే డేటా, ఎంటర్టైన్మెంట్ డేటాను వేరు చేయడం వీలుపడదు. ఇప్పటికే రీఛార్జ్‌లపై 18% జీఎస్టీ చెల్లిస్తున్న వినియోగదారులపై మరింత భారం మోపడం డిజిటల్ ఇండియా ఆశయాలకు విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.డేటా వినియోగ గణాంకాలుడాట్ అధికారిక డేటా ప్రకారం, భారతదేశంలో మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2025లోని 229 బిలియన్ జీబీతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2026 నాటికి డేటా వినియోగం 24.5% పెరిగి 285 బిలియన్ జీబీకి చేరుకుంది. డిజిటల్ వ్యసనం, చిన్నారుల్లో స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు పన్నులు విధించడం సరికాదని నిపుణులు స్పష్టం చేశారు. వయస్సు నిర్ధారణ ప్రక్రియ, పేరెంటల్ కంట్రోల్స్, కంటెంట్ నియంత్రణ వంటి సాంకేతిక చర్యల ద్వారా మాత్రమే ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ -
కొత్త రంగాల్లోకి ప్రైవేట్ పెట్టుబడులు
పెరుగుతున్న దేశీయ డిమాండ్‌కు తోడు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుండటంతో భారత్ పారిశ్రామికీకరణలో సరి కొత్త దశలోకి అడుగుపెడుతోందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ నివేదిక తెలిపింది. అంతరిక్షం (స్పేస్), సెమీకండక్ట ర్లు, డేటా సెంటర్లు, ఎల్రక్టానిక్స్, సోలార్ తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోకి ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొంది. పన్ను ప్రోత్సాహకాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ), స్థానికీకరణ(లోకలైజేషన్) నిబంధనలు వంటి ప్రభుత్వ విధాన చర్యలు కొత్త పెట్టుబడుల ఆకర్షిస్తున్నాయని తెలిపింది. తద్వారా ఉత్పత్తుల తయారీతో పాటు సప్లై చైన్, ఉపకరణాలు, మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ సేవల్లోనూ అవకాశాలు మరింత పెరుగుతున్నాయని వివరించింది.కీలక రంగాల్లో ప్రగతి బాటలుఅంతరిక్ష రంగం: స్పేస్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ రంగానికి 2020లోనే ప్రభుత్వం అనుమతులిచ్చింది. తద్వారా ప్రైవేట్ భాగస్వామ్యంతో 2023–30 మధ్య దేశ స్పేస్ ఎకానమీని దాదాపు అయిదు రెట్లు పెంచి 40–45 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ స్టార్టప్‌లలో ‘స్కైరూట్’ ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమవుతుండగా, ‘పిక్సెల్’ హై–రిజల్యూషన్ ఎర్త్–ఆబ్జర్వేషన్ ఉపగ్రహాలపై, ‘అగ్నికుల్’ 3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్లపై, ‘దిగంతర’ ఉపగ్రహ ఆధారిత స్పేస్ సరై్వలెన్స్ (నిఘా) వ్యవస్థలపై పనిచేస్తున్నాయని జెఫరీస్ తెలిపింది.సెమీ కండక్టర్లు: భారత్ సెమీకండక్టర్ రంగం విధాన రూపకల్పన నుంచి అమలు దశకు చేరుతోంది. ఇప్పటికే సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఒక చిప్ ఫ్యాబ్ నిర్మా ణంలో ఉంది. పలు ఓఎస్ఏటీ ప్రాజెక్టులు ఉత్పత్తి దిశగా కదులుతున్నాయి. మరో 13 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక ప్రణాళిక సిద్ధమవుతోంది.డేటా సెంటర్ల భారీ విస్తరణ: గడిచిన అయిదేళ్ల దేశంలో ‘కో–లొకేషన్’ సామర్థ్యం అయిదు రెట్లు పెరిగి రెండు గిగావాట్లకు చేరింది. డిజిటైజేషన్, క్లౌడ్ వినియోగంతో రాబోయే అయిదేళ్లలో 10 గిగావాట్లకు చేరవచ్చని జెఫరీస్ అంచనా వేసింది. ఈ విస్తరణ డేటా సెంటర్ ఆపరేటర్లకు సుమారు 9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చవచ్చు. విద్యుత్, కూలింగ్, నిర్మాణం, నెట్వర్క్ మౌలిక సదుపాయాల్లో దాదాపు 45 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు దారితీయవచ్చని తెలిపింది.ఎల్రక్టానిక్స్ రంగం: ఎల్రక్టానిక్స్ ఎగుమతులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎల్రక్టానిక్స్ కాంపోనెంట్స్ మానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్), మొబైల్ 2.0 వంటి పథకాలు విడిభాగాల తయారీ, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్‌ను బలోపేతం చేయనున్నాయి. వచ్చే ఆరేళ్లలో మొబైల్ విడిభాగాల బిల్ ఆఫ్ మెటీరియల్స్‌లో ఈసీఎంఎస్ వాటా 20 శాతం నుంచి 50 శాతానికి చేరవచ్చని అంచనా. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల మార్కెట్ సుమారు 5 బిలియన్ డాలర్లు కాగా, 85–90 శాతం డిమాండ్ ప్రస్తుతం దిగుమతుల ద్వారానే తీరుతోంది.సోలార్‌లో 90% స్థానికీకరణ: భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద సోలార్ ఫొటోవోల్టాయిక్ తయారీ దేశంగా ఎదిగిందని జెఫరీస్ తెలిపింది. ప్రస్తుతం 35 గిగావాట్ల సోలార్ సెల్ సామర్థ్యం కార్యకలాపాల్లో ఉండగా, మరో 100 గిగావాట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఏఎల్ఎంఎం పాలసీలు, దేశీయ విడిభాగాల వినియోగ నిబంధనలతో పాటు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) వంటి ప్రభుత్వ నిర్ణయాలు సోలార్ తయారీ రంగంలో కీలకమైన సెల్స్, వేఫర్స్, ఇంగాట్స్ సహా సమగ్ర తయారీ వ్యవస్థ బలపడేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. తద్వారా 2030 నాటికి సోలార్ తయారీ వాల్యు చైన్‌లో 90 శాతం స్థానికీకరణ సాధించే అవకాశం ఉందని పేర్కొంది.ఏరోస్పేస్లోనూ అవకాశాలు: బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలు భారత్ నుంచి ఏటా సుమారు 1.4–1.6 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను సేకరిస్తున్నాయి. ఏక్వస్, ఆజాద్, బీహెచ్ఎఫ్సీ, డీవైటీసీ, ఆర్డబ్ల్యూ, మదర్సన్, సన్సెరా వంటి భారతీయ సంస్థలు గ్లోబల్ ఓఈఎంలు, టైర్–1 సరఫరాదారులకు ఉత్పత్తులు అందిస్తున్నాయి. భవిష్యత్తులో భారత్ కేవలం ఔట్సోర్సింగ్ కేంద్రంగా కాకుండా తయారీ, ఇంజినీరింగ్‌లోనూ వాటాను పెంచుకోగలదని నివేదిక పేర్కొంది.గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ దూకుడు స్పేస్, సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్, సోలార్, డేటా సెంటర్లు, ఏరోస్పేస్.. ఈ రంగాలన్నింటిలోనూ భారత్ ప్రపంచ సప్లై చైన్‌లో మరింత కీలక పాత్ర దిశగా అడుగులు వేస్తోందని జెఫరీస్ విశ్లేషించింది. భారీ దేశీయ మార్కెట్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, డిజిటైజేషన్, స్థానికీకరణ, తయారీ–మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న డిమాండ్ ఈ మార్పుకు చోదకశక్తులుగా నిలుస్తున్నాయని తెలిపింది. మొత్తంగా దేశీయ డిమాండ్‌ను, విధాన మద్దతును ఉపయోగించుకుని స్థానిక సామర్థ్యాలను పెంచడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, గ్లోబల్ టెక్నాలజీ, తయారీ సరఫరా సప్లైలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ‘పారిశ్రామిక వ్యూహం’ సారాంశమని జెఫరీస్ పేర్కొంది.ఇదీ చదవండి: అసలు బ్రిక్స్‌లో ఏం చర్చిస్తారు? -
912.5GB డేటా.. అదిరిపోయే జియో ప్లాన్!
రిలయన్స్ జియో అందిస్తున్న పాపులర్ రీచార్జ్ ప్లాన్లలో రూ.3,599 ఒకటి. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. వాలిడిటీ ఎన్ని రోజులు?, డేటా ఎంత? వినియోగదారులకు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.జియో రూ.3599 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది పాటు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. ప్రతిరోజూ 2.5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఏడాది రోజులకు మొత్తం 912.5 జీబీ డేటా వస్తుంది. అదనంగా జియో యానివెర్సరీ అఫర్ కింద 120 జీబీ ఎక్ట్రా డేటా లభిస్తుంది. అంటే నెలకు 10 జీబీ చొప్పున 12 లల పాటు అదనపు డేటా లభిస్తుంది.రోజువారీ 2.5 జీబీ హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు తగ్గుతుంది. అయితే 5G సేవలకు అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. అదేవిధంగా ప్రతిరోజూ 100 ఎస్ఎమ్ఎస్లు పంపుకునే అవకాశం ఉంటుంది.ఇతర ప్రత్యేకమైన ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే.. జియో టీవీ ప్రో ప్యాక్ ద్వారా 1000 అకంటే ఎక్కువ టీవీ ఛానల్స్ చూడటానికి అవకాశం ఉంటుంది. జియో క్లౌడ్ ద్వారా 50 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా లభిస్తాయి.ఇదీ చదవండి: గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు! -
జియో రూ.149 రీఛార్జ్ ప్లాన్.. 90 రోజుల జియోహాట్‌స్టార్!
జియో వినియోగదారుల కోసం రూ.149తో జియోహాట్‌స్టార్ డేటా ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు. ఇందులో మొత్తం 10జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే.. ప్యాక్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత 30 రోజుల వ్యవధిలో 10జీబీ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు.ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేక ప్రయోజనం 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్. దీంతో జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మొబైల్లో వీక్షించేందుకు 90 రోజుల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ముఖ్యంగా జియోహాట్‌స్టార్ కంటెంట్‌ను ఎక్కువగా చూసేవారికి, డేటా అవసరం ఉన్న జియో యూజర్లకు ఈ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది.అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ రూ.149 ప్యాక్‌లో వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు ఉండవు. ఇది పూర్తిగా డేటా, జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాల కోసం మాత్రమే. కాబట్టి కాలింగ్, ఎస్ఎమ్ఎస్ కోసం ప్రత్యేకంగా యాక్టివ్ ప్లాన్ ఉండాల్సి ఉంటుంది.కాగా.. 10GB హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవు. ఆ తర్వాత డేటా వేగం 64 Kbpsకు తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ డేటా వినియోగించే వారికి ఇది ప్రధానంగా డేటా యాడ్-ఆన్‌గా ఉపయోగపడుతుంది. మొత్తం మీద రూ.149కు 10GB డేటా + 90 రోజుల ఎస్ఎమ్ఎస్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభించడం ఈ ప్యాక్‌లో ప్రధాన ఆకర్షణ. -
జియో మెగా ప్లాన్.. ఆకాశంలోకి 1600 ఉపగ్రహాలు!
రిలయన్స్ జియో తన ప్రతిపాదిత 1,600 ఉపగ్రహాల శాటిలైట్ ఇంటర్నెట్ కాన్స్టెలేషన్ను భూమికి సమీపంలోని.. లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ఉపగ్రహాలను భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టాలని జియో ప్రతిపాదించింది.రిలయన్స్ జియో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి లభించినప్పటికీ, కాన్స్టెలేషన్కు సంబంధించిన తుది ప్రణాళిక ఇంకా IN-SPACeకు సమర్పించాల్సి ఉంది. అయితే.. జియో ఎంచుకున్న 650 కిలోమీటర్ల కక్ష్య ప్రత్యేకంగా ఆసక్తికరంగా మారింది.ఎందుకంటే.. ప్రస్తుతం స్పేస్ఎక్స్కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహాలు సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో, అమెజాన్ లియో ఉపగ్రహాలు సుమారు 630 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి. వీటితో పోలిస్తే జియో ఉపగ్రహాలు కొంచెం ఎక్కువ ఎత్తులో ఉండనున్నాయి. దీంతో.. తక్కువగా వినియోగిస్తున్న ఆర్బిటల్ బ్యాండ్‌లో పనిచేసే అవకాశం లభించి, భవిష్యత్తులో కక్ష్య స్థానాల సమన్వయం, స్పెక్ట్రమ్ సంబంధిత జోక్యాన్ని నిర్వహించడంలో కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరిశీలనను IN-SPACe, ఇస్రో, కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులు కలిసి నిర్వహించారు. సాంకేతిక క్లియరెన్స్ ఇప్పటికే లభించినట్లు IN-SPACe అధికారులు వెల్లడించారు. అయితే.. ఉపగ్రహాల తుది సంఖ్య, కక్ష్యల అమరిక, ఇతర సాంకేతిక వివరాలతో కూడిన పూర్తి ప్రణాళిక ఇంకా అధికారికంగా సమర్పించాల్సి ఉంది.జియో ప్రణాళిక ప్రకారం.. ఈ 1,600 ఉపగ్రహాల LEO కాన్స్టెలేషన్కు సంబంధించిన పరీక్షా ప్రయోగాలు 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్‌లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలకు మరింత పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా.. భూభాగంలో ఫైబర్ లేదా మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడంలో ఇలాంటి LEO ఉపగ్రహ నెట్‌వర్క్‌లు కీలకంగా మారవచ్చు. -
1980s ఫొటో క్రేజ్.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో 1980ల వింటేజ్ ఫొటోల ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. యూజర్లు తమ ఫొటోలను చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌లోకి అప్లోడ్ చేసి, వాటికి పాతకాలపు లుక్ ఇస్తున్నారు. 1980ల నాటి హెయిర్‌స్టైల్, దుస్తులు, ఆభరణాలు, ఫిల్మ్ కెమెరా ఎఫెక్ట్ వంటి మార్పులతో ఫొటోలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో సైబర్ నేరగాళ్లు కూడా.. దీనిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఫొటోల పేరుతో మోసాలువింటేజ్ ఫొటోలు క్రియేట్ చేస్తామంటూ.. కొందరు నకిలీ వెబ్సైట్లు, యాప్స్, సోషల్ మీడియా లింకులను సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారు. వాటిని నమ్మి ఫొటోలు అప్లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారం లేదా ఇతర సున్నితమైన వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మరికొన్ని.. నకిలీ ఏఐ టూల్స్ డౌన్లోడ్ చేయమని చెప్పి, వాటి ద్వారా ఫోన్లోకి మాల్వేర్ పంపించే అవకాశం కూడా ఉంది.ఈ నేపథ్యంలో.. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏఐ ఫొటోలు తయారు చేసుకోవాలనే ఆసక్తితో తెలియని వెబ్సైట్లు, యాప్స్ లేదా అనుమానాస్పద లింకులను ఉపయోగించవద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత ఫొటోలు, గుర్తింపు పత్రాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సమాచారాన్ని తెలియని ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్‌ను ఫాలో అవుతున్నప్పటికీ, ఆన్లైన్ భద్రతను మాత్రం మర్చిపోవద్దని అధికారులు చెబుతున్నారు. -
ఐఫోన్ డ్యూ లాంచ్ : శాంసంగ్ సెటైర్లు మామూలుగా లేవుగా!
ఆపిల్ సంస్థ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'iPhone Duo'ను అట్టహాసంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో ఆ పిల్ ఫోన్ లవర్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కానీ ప్రత్యర్థి సంస్థ శాంసంగ్ (Samsung) మాత్రం ఎద్దేవా చేస్తోంది. ఇన్నాళ్లకు ఫోల్డబుల్ టెక్నాలజీలోకి ఎంట్రీ ఇచ్చింది అంటూ సెటైర్లు వేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.ఫోల్డబుల్ సాంకేతికతలోకి ఆపిల్ ఆలస్యంగా అడుగుపెట్టడంపై శామ్సంగ్ సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులతో ఎద్దేవా చేసింది. ‘‘మేం వదిలేసిన పదార్థాలను మీరు వేడి చేయడం పూర్తయ్యాక మాకు చెప్పండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అంతేకాదు తామిక త్రీ ఫోల్డ్ (tri-fold) స్క్రీన్లతో రాబోతున్నాం అంటూ మరో పోస్ట్‌లో ఊరించింది. "ఇది సరికొత్త ది సిమ్స్ సీక్వెల్లా ఉంది", "ఇప్పటివరకు అంతా ఒకేలా ఉంది" అంటూ యాపిల్ డిజైన్‌ను విమర్శించింది.శాంసంగ్ ఏడేళ్ల ముందే 2019లోనే తమ తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను లాంచ్ చేసింది. గడిచిన ఏడేళ్లలో శాంసంగ్, గూగుల్, మోటోరోలా వంటి బ్రాండ్లు పలు తరాల ఫోల్డబుల్ ఫోన్లను తెచ్చి స్క్రీన్ మడతలు (creases), హింజ్ నాణ్యత, ఫోన్ బరువు వంటి సమస్యలను పరిష్కరించాయి కూడా. సుమారు రూ. 1.67 లక్షలకు పైగా ధరలో ఐఫోన్ డ్యూ లాంచ్ అయింది. మడిచినప్పుడు చైనీస్ ఫోల్డబుల్ ఫోన్ల కంటే ఇది కాస్త మందంగా ఉన్నప్పటికీ, ఈ డివైజ్‌ను పూర్తిగా తెరిచినప్పుడు 7.6 అంగుళాల స్క్రీన్‌తో ఆపిల్ ఉత్పత్తుల్లోనే అత్యంత సన్నని (thinnest) ఫోన్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ, యూజర్ ఎక్స్పీరియన్స్, మెరుగైన డిజైన్ ,డేటా ప్రైవసీ పరంగా తమ ఫోన్ ప్రత్యర్థుల కంటే మెరుగ్గా నిలుస్తుందని యాపిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజం I'm so sorry, @DuoLingo. They copied us too #Solidarity— Samsung Mobile US (@SamsungMobileUS) September 9, 2026ఇదీ చదవండి: ఎట్టకేలకు ఐఫోన్ డ్యూయో : సోషల్‌మీడియాలో పేలుతున్న మీమ్స్ -
కొత్త ఫొటోకు.. పాత లుక్: ChatGPTతో ఇలా..
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటుంది. వాటిలో కొన్ని ట్రెండ్స్ కొద్దిరోజుల్లోనే మాయమైపోతాయి. మరికొన్ని మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ట్రెండ్స్‌లో ఒకటి 1980ల ఏఐ ఫొటో ట్రెండ్. ఈ ట్రెండ్‌లో ఇప్పటి యువత తమ ఫొటోలను 1980ల కాలం నాటి వింటేజ్ ఫొటోలుగా మార్చుకుంటున్నారు. ఇప్పుడివే నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.1980ల కాలం అంటే ఓ ప్రత్యేకమైన ఫ్యాషన్, హెయిర్‌స్టైల్స్, రంగురంగుల దుస్తులు, పెద్ద ఆభరణాలు, సాఫ్ట్ లైటింగ్, ఫిల్మ్ కెమెరా ఫొటోలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఏఐ సహాయంతో మన ఫొటోలను కూడా అదే కాలానికి చెందినవిగా మార్చుకోవచ్చు. దీంతో మనం అప్పటి కాలంలో ఎలా కనిపించేవాళ్లమో ఊహించుకోవచ్చు.సాధారణంగా వింటేజ్ ఫిల్టర్లు ఫొటోలోని రంగులు, కాంట్రాస్ట్ లేదా లైటింగ్‌ను మాత్రమే మారుస్తాయి. కానీ.. ఏఐ వింటేజ్ ట్రెండ్‌లో మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువ మార్పులు చేస్తుంది. ఫోటోలను అందంగా రూపొందిస్తోంది.ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. మన ముఖాన్ని వీలైనంత వరకు అలాగే ఉంచి, ఆ కాలానికి సరిపోయే హెయిర్‌స్టైల్, దుస్తులు, ఆభరణాలు, బ్యాక్‌గ్రౌండ్, లైటింగ్‌ను మారుస్తుందన్నమాట. ఫొటోకు పాతకాలపు ఫిల్మ్ కెమెరా లుక్, గ్రెయిన్, కలర్ టోన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సరైన ప్రాంప్ట్ ఇవ్వడం చాలా అవసరం.చాట్‌జీపీటీలో 1980ల ఫొటో ఎలా తయారు చేసుకోవాలి?➤ముందుగా మీ మొబైల్లో చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి.➤కొత్త చాట్‌ను ప్రారంభించి, మీకు నచ్చిన మంచి క్వాలిటీ ఫొటోను అప్లోడ్ చేయండి.➤ఆ తర్వాత, మీ ఫొటోను 1980ల కాలంలో తీసిన ఫొటోలాగా మార్చమని చాట్‌జీపీటీని అడగండి.➤ఫొటో ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పండి. ఉదాహరణకు1980ల నాటి హెయిర్స్టైల్అప్పటి కాలానికి సరిపోయే రంగురంగుల దుస్తులువింటేజ్ ఆభరణాలుపాతకాలపు బ్యాక్గ్రౌండ్సాఫ్ట్ లైటింగ్పాత ఫిల్మ్ కెమెరా లాంటి ఫిల్మ్ గ్రెయిన్, టెక్స్చర్➤మీకు కావాల్సిన ప్రత్యేకమైన స్టైల్‌ను కూడా చెప్పవచ్చు. ఉదాహరణకుపాత బాలీవుడ్ స్టూడియో పోర్ట్రెయిట్పాతకాలపు ఫ్యామిలీ ఆల్బమ్ ఫొటోకాలేజ్ ఫొటోవింటేజ్ మ్యాగజైన్ షూట్మొదట వచ్చిన ఫొటో మీకు నచ్చకపోతే, మళ్లీ సూచనలు ఇచ్చి హెయిర్‌స్టైల్, దుస్తులు, లైటింగ్ లేదా ఫిల్మ్ టెక్స్చర్‌లో మార్పులు చేయమని అడగవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగా మీ ఫోటోను రెడీ చేసుకోవచ్చు. -
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్.. కెమెరాలో అదిరిపోయే మార్పులు!
ప్రీమియం ఫోన్ మేకర్ యాపిల్ తన కొత్త ప్రో సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పేరుతో వచ్చిన ఈ రెండు మోడళ్లలో కెమెరా, పనితీరు, బ్యాటరీ, ఏఐ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తాజాగా జరిగిన యాపిల్ ఈవెంట్లో వీటిని ఆవిష్కరించగా.. భారత్‌లో ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి, సాధారణ విక్రయాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి.వేరియబుల్ అపెర్చర్‌తో 48MP కెమెరాఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్ కెమెరా విభాగంలో కనిపిస్తుంది. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరాకు తొలిసారిగా ‘మెకానికల్ వేరియబుల్ అపెర్చర్’ను యాపిల్ తీసుకొచ్చింది. దీంతో పరిస్థితులకు అనుగుణంగా కాంతి ప్రవేశాన్ని మార్చడంతో పాటు ఫొటోల్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌పై ఎక్కువ నియంత్రణ లభిస్తుంది. తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.మెయిన్ కెమెరాతో పాటు 48MP అల్ట్రా వైడ్, 48MP టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. 8x వరకు ఆప్టికల్-క్వాలిటీ జూమ్, 40x వరకు డిజిటల్ జూమ్ లభిస్తుంది. కెమెరా యాప్‌లో అపెర్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, హిస్టోగ్రామ్ వంటి ప్రొఫెషనల్ కంట్రోల్స్‌ను కూడా వినియోగదారులు మార్చుకోవచ్చు.వీడియో విషయానికి వస్తే 4K డాల్బీ విజన్‌ను 120fps వరకు రికార్డ్ చేయొచ్చు. 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరాను కూడా యాపిల్ అందించింది.ఫొటోలు నిజమైనవో.. మార్చినవో గుర్తించే టెక్నాలజీఐఫోన్ 18 ప్రోలో Apple Reference Image అనే కొత్త ఫీచర్‌ను యాపిల్ ప్రవేశపెట్టింది. కెమెరా నుంచి వచ్చిన పిక్సెల్ డేటాకు క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్ జతచేసి, అసలు చిత్రానికి సంబంధించిన రిఫరెన్స్‌ను భద్రపరచే విధంగా దీనిని రూపొందించారు. దీంతో ఫొటోపై తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయో గుర్తించడంలో సహాయపడుతుంది. AI ద్వారా రూపొందించిన లేదా మార్చిన చిత్రాలను గుర్తించే విధంగా SynthID సపోర్ట్‌ను కూడా యాపిల్ ప్రకటించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఫీచర్ల లభ్యత భిన్నంగా ఉండొచ్చు.A20 ప్రో చిప్రెండు కొత్త ప్రో మోడళ్లలోనూ A20 Pro చిప్ ఉంటుంది. 2nm ప్రాసెస్‌పై తయారైన ఈ చిప్‌లో సిక్స్-కోర్ CPU, న్యూరల్ యాక్సిలరేటర్లతో ఏడు-కోర్ GPU, డ్యూయల్ 16-కోర్ Neural Engine ఉన్నాయి. హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ కూడా అందుబాటులో ఉంది. మెరుగైన పనితీరును కొనసాగించేందుకు కొత్త తరం ‘వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్’ను కూడా యాపిల్ తీసుకొచ్చింది. A20 Pro, కొత్త థర్మల్ డిజైన్ కలయికతో ఐఫోన్ చరిత్రలోనే అత్యుత్తమ స్థిరమైన పనితీరును అందిస్తామని కంపెనీ పేర్కొంది.కొత్త కనెక్టివిటీ చిప్స్వైర్లెస్ కనెక్టివిటీ కోసం కొత్త N1 చిప్‌ను ఉపయోగించారు. ఇది Wi-Fi 7, Bluetooth 6, Thread నెట్‌వర్కింగ్‌కు మద్దతు ఇస్తుంది. సెల్యులార్ కనెక్టివిటీ కోసం యాపిల్ రూపొందించిన C2 మోడెమ్ ఉంది.120Hz డిస్ప్లే.. చిన్నదైన డైనమిక్ ఐలండ్ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాల, ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ OLED డిస్ప్లేలు ఉన్నాయి. రెండింటిలోనూ 120Hz వరకు ప్రోమోషన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డైనమిక్ ఐలండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈసారి డైనమిక్ ఐలండ్ పరిమాణాన్ని తగ్గిస్తూ మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దినట్లు యాపిల్ తెలిపింది. ఒకేసారి మూడు లైవ్ యాక్టివిటీస్‌ను ప్రదర్శించే సామర్థ్యం కూడా ఉంది.43 గంటల వరకు బ్యాటరీబ్యాటరీ సామర్థ్యాన్ని పెంచేందుకు అంతర్గత డిజైన్‌లో మార్పులు చేశారు. ముఖ్యంగా eSIM-ఓన్లీ వేరియంట్లలో సిమ్ ట్రే కోసం ఉపయోగించే స్థలాన్ని పెద్ద బ్యాటరీకి కేటాయించగలిగారు. యాపిల్ ప్రకారం ఐఫోన్ 18 ప్రోలో 34 గంటల వరకు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 43 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లభిస్తుంది. MagSafe, Qi2 వైర్లెస్ ఛార్జింగ్‌తో పాటు USB-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. 60W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అడాప్టర్‌తో సుమారు 15 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.iOS 27తో AI ఫీచర్లుకొత్త ప్రో మోడళ్లు iOS 27తో వస్తాయి. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా మెరుగైన సిరి ఏఐ, స్క్రీన్‌పై కనిపిస్తున్న సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం, యాప్‌ల మధ్య సందర్భాన్ని కొనసాగించే ఫీచర్లు, కెమెరా ఆధారిత విశ్లేషణ వంటి కొత్త సామర్థ్యాలను యాపిల్ అందిస్తోంది.భారత్‌లో ధరలు ఇవేఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB ధర రూ.1,89,900, 1TB ధర రూ.2,39,900, 2TB ధర రూ.3,14,900.ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900. 512GB రూ.2,04,900, 1TB రూ.2,54,900, 2TB రూ.3,29,900గా ఉన్నాయి.బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, కొత్త బర్గండీ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. భారత్‌లో సెప్టెంబర్ 12న సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు మొదలవుతాయి.ఇదీ చదవండి: ఐఫోన్ ధరలు.. ఈ దేశాల్లో కాస్త చౌక! -
ఐఫోన్ ధరలు.. ఈ దేశాల్లో కాస్త చౌక!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇందులో కొత్త మోడల్‌లు వస్తున్నాయంటే ఐఫోన్ ప్రియుల్లో పండుగ వాతావరణం ఉంటుంది. అయితే వీటి ధరలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. కానీ భారత్‌తో పోలిస్తే కొన్ని ఇతర దేశాల్లో వీటి ఖరీదు కాస్త తక్కువే..యాపిల్ కొత్త ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు సంస్థ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయోను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 9న జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ఈ మోడళ్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు మొదలవుతాయి. ఐఫోన్ డ్యుయోకు మాత్రం అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్లు, అక్టోబర్ 23 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.భారత్‌లో ఎంత?భారత్‌లో ఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ ధర రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900గా ఉంది. రెండు మోడళ్లలోనూ 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ 2TB వేరియంట్ ధర 18 ప్రోలో రూ.3,29,900 కాగా, 18 ప్రో మ్యాక్స్‌లోనూ రూ.3,29,900 నుంచి ప్రారంభమవుతోంది.ఇక యాపిల్ తొలిసారిగా తీసుకొచ్చిన ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో 256GB ధర భారత్‌లో రూ.2,99,900. ఇందులో 7.6 అంగుళాల ఫోల్డింగ్ డిస్ప్లే, బయట 5.4 అంగుళాల డిస్ప్లే ఉంటాయి. A20 ప్రో చిప్‌తో వస్తున్న ఈ ఫోన్‌ను స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో విడుదల చేసింది.అమెరికాలోనే తక్కువ ధరదేశాల వారీగా ప్రారంభ ధరలను పోల్చితే అమెరికాలో ఐఫోన్ 18 ప్రో ధర అత్యంత తక్కువగా కనిపిస్తోంది. అక్కడ 256GB ఐఫోన్ 18 ప్రో ధర 1,199 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1.14 లక్షలు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర 1,299 డాలర్లు అంటే సుమారు రూ.1.23 లక్షలు. అయితే అమెరికా ధరలకు స్థానిక పన్నులు విడిగా వర్తించవచ్చు.జపాన్‌లోనూ భారత్ కంటే తక్కువజపాన్లో ఐఫోన్ 18 ప్రో 256GB ధర 2,19,800 యెన్లు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర 2,39,800 యెన్లుగా యాపిల్ ప్రకటించింది. ప్రస్తుత మారకపు విలువల ఆధారంగా చూస్తే ఇవి భారత్‌లోని ధరల కంటే తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జపాన్ ధరల్లో వినియోగ పన్ను కూడా చేర్చి ఉంటుంది.జర్మనీ, యూకేలో..జర్మనీలో ఐఫోన్ 18 ప్రో 256GB ధర 1,449 యూరోలు. యూరోను రూపాయల్లోకి మార్చితే ఇది సుమారు రూ.1.60 లక్షల పరిధిలో ఉంటుంది. కాబట్టి భారత్‌తో పోలిస్తే కొంత తక్కువే అయినప్పటికీ అమెరికా, జపాన్ స్థాయిలో చౌక కాదు.యూకేలో ఐఫోన్ 18 ప్రో ధర 1,199 బ్రిటిష్ పౌండ్ల నుంచి, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర 1,299 బ్రిటిష్ పౌండ్ల నుంచి ప్రారంభమవుతోంది. రూపాయి మారకపు విలువను బట్టి చూస్తే ఇవి భారత్ ధరలకు సమీపంగా లేదా కొంత తక్కువగా ఉంటాయి.యూఏఈలోనూ తక్కువే..యూఏఈలో (UAE) ఐఫోన్ 18 ప్రో 256GB ధర 5,099 దిర్హామ్‌ల నుంచి ప్రారంభమవుతోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర కూడా భారత్‌తో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంది. అందువల్ల విదేశాలకు వెళ్లే భారతీయులు ఐఫోన్ కొనుగోలు విషయంలో యూఏఈ, జపాన్, అమెరికా వంటి మార్కెట్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది.డ్యుయోలోనూ భారీ ధర వ్యత్యాసంఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో అమెరికాలో 1,999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. భారత్‌లో అదే మోడల్ 256GB ధర రూ.2,99,900. జపాన్‌లో 256GB డ్యుయో ధర 3,64,800 యెన్లు, యూఏఈలో 8,499 దిర్హామ్‌లుగా ఉంది. అంటే డ్యుయో విషయంలోనూ దేశాన్ని బట్టి ధరలో గణనీయమైన తేడా కనిపిస్తోంది.అయితే విదేశాల్లో ఐఫోన్ ధర తక్కువగా ఉందని వెంటనే అక్కడే కొనడం మంచిదని చెప్పలేం. మారకపు రేటుతో పాటు స్థానిక పన్నులు, కస్టమ్స్ నిబంధనలు, వారంటీ/సర్వీస్ నిబంధనలు, eSIM లేదా ఇతర ప్రాంతీయ పరిమితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా అమెరికా ధరలకు రాష్ట్రాన్ని బట్టి సేల్స్ ట్యాక్స్ అదనంగా ఉండొచ్చు. -
ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌కు కొత్త ఎస్డీకే ఆవిష్కరణ
బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, బీమా కంపెనీలు తమ మొబైల్ యాప్‌లలోనే ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్‌ను నేరుగా అనుసంధానించుకునేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (ఎస్డీకే)తో పాటు ప్రత్యేక శాండ్బాక్స్ను ఆవిష్కరించింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ఈ ప్రకటన వెలువడింది.ఈ కొత్త ఎస్డీకే వల్ల యూజర్లు వేర్వేరు యాప్‌లకు మారాల్సిన అవసరం లేకుండా ఒకే బ్యాంకింగ్, బీమా లేదా బ్రోకింగ్ యాప్‌లోనే ఆధార్ ఫేస్ ధ్రువీకరణను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా ఫేస్ఆర్డీ(FaceRD) యాప్ అవసరమయ్యేది. ఇది వినియోగదారుల అనుభవాన్ని క్లిష్టతరం చేసేది.యూఐడీఏఐ ఛైర్మన్ నీల్‌కంఠ్ మిశ్రా మాట్లాడుతూ.. కొత్త ఎస్డీకే ద్వారా భాగస్వామ్య బ్యాంకులు తమ సొంత సర్వర్లపైనే ప్రామాణీకరణ(అథెంటికేషన్)ను నిర్వహించుకోగలవని చెప్పారు. తద్వారా యూఐడీఏఐ కేంద్రాలపై భారం తగ్గడంతో పాటు భద్రత మెరుగవుతుందని తెలిపారు. ప్రతిరోజూ వందలాది సైబర్ దాడులు జరుగుతున్నా తగిన భద్రతా చర్యలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 కోట్ల ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలు జరుగుతుండగా, భవిష్యత్తులో 25-30 కోట్లకు చేరుకునేలా మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్టు మిశ్రా చెప్పారు.కొత్త ఎస్డీకేలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్‌నెస్ డిటెక్షన్, స్పూఫింగ్ నిరోధక సామర్థ్యాలు ఉన్నాయి. దీంతోపాటు ఆవిష్కరించిన శాండ్బాక్స్ ద్వారా బాహ్య బయోమెట్రిక్ హార్డ్‌వేర్ అవసరం లేకుండానే డెవలపర్లు యూజర్ ప్రొవిజనింగ్, ఫేస్ క్యాప్చర్, లైవ్‌నెస్ చెక్‌లు, ఎర్రర్ హ్యాండ్లింగ్ వంటి దశలను పరీక్షించవచ్చు.2021లో ప్రారంభమైన ఈ ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థ ఇప్పటివరకు 500 కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. జీవన్ ప్రమాణ్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాల్లో వినియోగిస్తున్నారు. అదనంగా, బీఎఫ్ఎస్ఐ రంగానికి మార్గదర్శకంగా ఈజ్ ఆఫ్ ఆన్‌బోర్డింగ్ ప్లేబుక్‌ను కూడా యూఐడీఏఐ విడుదల చేసింది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్‌పై వీసా మోసం ఆరోపణలు -
ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..
టెక్ దిగ్గజం యాపిల్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ‘డ్యువో’ని ఆవిష్కరించింది. 7.6 అంగుళాల డిస్ప్లే, 5.4 అంగుళాల ఔట్‌సైడ్ స్క్రీన్, కొత్తగా డిజైన్ చేసిన ఐవోఎస్ 27 తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర 1,999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. ప్రీ–ఆర్డర్లు అక్టోబర్ 18 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 23 నుంచి అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లనూ యాపిల్ ఆవిష్కరించింది. వీటిలో 18 ప్రో ధర 1,199 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్ రేటు 1,299 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్‌ని బట్టి 6.3 అంగుళాలు, 6.9 అంగుళాల స్క్రీన్, ఏ20 ప్రో చిప్, 48 ఎంపీ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, మరింత ఆధునీకరించిన సిరి ఏఐ తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ప్రీఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి, డెలివరీలు సెపె్టంబర్ 18 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త సీఈవో హోదాలో జాన్ టెర్నస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.భారత్‌లో బేస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.2,99,900 నుంచి ప్రారంభమవుతుంది. 512 జీబీ, 1టీబీ, 2టీబీ కాన్ఫిగరేషన్ల ధరలు వరుసగా రూ.3,24,900, రూ.3,74,900, రూ.4,49,900గా ఉంటాయి. ఐఫోన్ డ్యూయో స్టార్ వైట్, నైట్ స్కై కలర్ ఆప్షన్లలో వస్తుంది. -
పోస్ట్ చేశారంటే... మీ లొకేషన్ ట్రాక్ ఖాయం!
సోషల్ మీడియా అనేది మన జీవితాల్లో ముఖ్యమైన భాగం అయింది. ‘రీల్స్’ నుంచి విహారయాత్రలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకోవడం వరకు ఎన్నో చేస్తుంటాం. గమనించాల్సిన విషయమేమిటంటే... ఏఐ సాధనాలను ఉపయోగించి పోస్ట్‌ల ద్వారా మీ లొకేషన్‌ను గుర్తించవచ్చునని గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెకఫీ స్టడీ తెలియజేస్తోంది...స్టడీలో భాగంగా...ఒక ఫొటోను జత చేసి, ఆ ప్రదేశాన్ని గుర్తించమని ప్రాంప్ట్ ఇచ్చారు. ఎలాంటి మెటాడేటా, ఇఎక్స్ఐఎఫ్ డేటా, ఫైల్ పేర్లను ఉపయోగించలేదు. చిత్రాలలోని సంకేతాలు, వాస్తుశిల్పం, వీధి గుర్తులు, దుకాణాలు, ఫుడ్‌స్టాల్స్... మొదలైన వివరాలతో ఏఐ సాధనాలు లొకేషన్‌ను గుర్తించాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, విలక్షణమైన ప్రదేశాలను ఏఐ సులభంగా గుర్తించింది. సాధారణ బీచ్‌లు, గ్రామీణ రహదారులు, హోటల్ గదులను గుర్తించడం మాత్రం ఏఐకి కష్టమైంది.మోసాలు జరుగుతాయా?ఇంతకుముందు బహిరంగంగా పోస్ట్ చేయని ఫొటోలతో సహా పర్సనల్ ట్రావెల్ ఫొటోలను చాట్ జీపీటీ, క్లాడ్, కోపైలట్లాంటి వాటిలో అప్లోడ్ చేసి...‘ఈ ఫొటోలు ఎక్కడ తీశారు?’ అని అడిగారు. ఏఐ గుర్తించిన వాటిలో న్యూయార్క్ రాష్ట్రంలోని హేస్టింగ్–ఆన్–హడ్సన్ అనే గ్రామం కూడా ఉన్నది. జీపీఎస్ డేటా, లొకేషన్ ట్యాగ్, క్యాప్షన్ లేకపోయినా సరే, ఆ ఫొటోలను ఎక్కడ తీశారనేది ఏఐ సాధనాలు గుర్తించగలవని మెకఫీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పదిలో తొమ్మిదిసార్లు ఏఐ సాధనాలు లొకేషన్‌ను సరిగ్గా ట్రాక్ చేశాయి. ఈ అధ్యయనంలో గూగుల్... జెమ్మ 227బీ, అలీబాబా 3వియల్ 3వోబీ అనే మోడల్స్‌ను ఉపయోగించారు. ఈ రెండు మోడల్స్ ఒపెన్–వెయిట్స్ రకానికి చెందినవి. ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఉచితంగా ఉపయోగించవచ్చు. ...ఇలా లొకేషన్లను ట్రాక్ చేయడం ద్వారా మోసాలు జరుగుతాయా? ‘అవును’ అని చెబుతోంది మెకఫీ స్టడీ.ఇలా జరగవచ్చు...జెనెరిక్ పిషింగ్ నుంచి పర్సనలైజ్ ఫ్రాడ్ వరకు ఏదైనా జరగవచ్చు. ఉదాహరణకు ఒక మోసగాడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్‌లాంటి ప్లాట్‌ఫామ్‌ల నుండి ఫొటోలను తీసుకొని వాటిని ఏఐ మోడల్స్‌లో ప్రాసెస్ చేసి లొకేషన్ ట్రాక్ చేసి, ఆ ప్రదేశాన్ని ప్రస్తావిస్తూ మెసేజ్‌లు పంపవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో అసాధారణ లావాదేవిలు జరుగుతున్నట్లు, మీరు ఉన్న ప్రాంతంలోనే ఎవరో ఒకరు లాగిన్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరికలు రావచ్చు.‘మీరు షేర్ చేసిన ఫొటోలో ఏదైనా ప్రముఖ ప్రదేశం లేదా ల్యాండ్‌మార్క్ కనిపించకపోతే ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించడంలో ఏఐ మోడల్స్ సమర్థంగా పనిచేయకపోవచ్చు’ అంటున్నారు నిపుణులు. -
ఇది హ్యాకింగ్ కాదు! ఓపెన్ ఏఐ ఏజెంట్లకు కొత్త చిక్కులు!
వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏఐ ఏజెంట్ల స్వతంత్ర కార్యకలాపాలపై మరోసారి చర్చ మొదలైంది. 'ఓపెన్ ఏఐ'కి చెందిన ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది మే నుంచి జూలై మధ్య తమకు విధించిన కొన్ని పరిమితులను దాటి, ఒకరితో ఒకరు సమాచారాన్ని పంచుకునేందుకు 10కి పైగా వెబ్సైట్లను ఉపయోగించినట్లు పలువురు స్వతంత్ర పరిశోధకులు గుర్తించారు. రాయిటర్స్ పరిశీలించిన పలు పరిశోధన నివేదికలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.పరిశోధకుల వివరాల ప్రకారం.. ఈ ఏఐ ఏజెంట్లకు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే బాధ్యత అప్పగించారు. ఇందుకోసం ఇంటర్నెట్లోని సమాచారాన్ని చదివి, అవసరమైన వివరాలను సేకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, ఇతర వెబ్సైట్లలో సమాచారం పోస్ట్ చేయకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొన్ని పాత వికీ సైట్లు, ఆన్లైన్ టెక్స్ట్ స్టోరేజ్ సైట్లలో ఉన్న సాంకేతిక అవకాశాలను ఉపయోగించుకుని, ఏజెంట్లు అక్కడ సమాచారాన్ని నమోదు చేసినట్లు వారు గుర్తించారు.సులభంగా చెప్పాలంటే.. ఏఐ ఏజెంట్లకు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడే అవకాశం లేకపోయినా, కొన్ని వెబ్సైట్లలో చిన్నచిన్న సమాచారాన్ని రాసి ఉంచడం ద్వారా పరస్పరం సంకేతాలు పంపుకున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఒక పరిశోధకుడు ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లను 18 వెబ్సైట్లలో గుర్తించినట్లు తెలిపారు. మరో పరిశోధనా బృందం 23 సైట్లలో ఇలాంటి కార్యకలాపాలను గుర్తించినట్లు పేర్కొంది. అయితే ఈ సంఖ్యలను పూర్తిగా స్వతంత్రంగా నిజమని తేల్చడం సాధ్యం కాలేదని రాయిటర్స్ తెలిపింది.ఈ కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించిన వెబ్సైట్లలో కొన్ని చాలా సాధారణమైనవే. వ్యక్తిగత వెబ్సైట్లు, గేమింగ్‌కు సంబంధించిన వికీలు, కెమిస్ట్రీ విద్యకు సంబంధించిన ఓ వెబ్సైట్, టెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పాత వెబ్‌సైట్‌తో పాటు రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన లింక్ షార్ట్నర్ సైట్లు కూడా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.పరిశోధకుల ప్రకారం ఇది నేరుగా హ్యాకింగ్ ఘటనగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం కాదు. అయితే, ఏఐ ఏజెంట్లకు కొన్ని పనులు మాత్రమే చేయాలని, కొన్ని పనులు చేయకూడదని నియమాలు ఉన్నప్పటికీ వాటిని దాటుకుని సమాచారాన్ని పంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం మాత్రం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దీనివల్ల భవిష్యత్తులో మరింత శక్తివంతమైన ఏఐ ఏజెంట్లకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, అవి చేసే పనులను మనుషులు ఎలా నిఘా ఉంచాలి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఈ వ్యవహారంపై ఓపెన్ ఏఐ స్పందిస్తూ, ఏఐ ఏజెంట్ల కార్యకలాపాలను విస్తృతంగా సమీక్షిస్తున్నట్లు తెలిపింది. అలాగే, ఏఐ వ్యవస్థలు తమకు నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించే పరిస్థితులను గుర్తించి, వాటిని నివేదించేందుకు ప్రత్యేక విధానాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఏఐ వ్యవస్థలు మరింత స్వతంత్రంగా పనిచేస్తున్న కొద్దీ వాటి పనితీరుపై పర్యవేక్షణ, భద్రతా నియంత్రణలు కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఇవి కూడా చదవండి: ఏఐ మరో సంచలనం.. జంతువుల భాష డీకోడ్ చేస్తూ.. -
జియో రీచార్జ్: ఫ్యామిలీ ప్లాన్.. 4 సిమ్‌లకు అన్లిమిటెడ్!
డబ్బులన్నీ ఫోన్ రీచార్జ్లకే అయిపోతున్నాయి.. ఇది ప్రతి కుంటుంబంలో వినిపించే మాటే. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ కుటుంబంలోని ప్రతి సభ్యుడి మొబైల్‌కు ప్రత్యేకంగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో నెలవారీ మొబైల్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఫ్యామిలీల కోసం ఆకర్షణీయమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. జియోప్లస్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కేటగిరీలోని రూ.449 ప్లాన్ ద్వారా ఒకే కనెక్షన్ కింద గరిష్ఠంగా నలుగురు కుటుంబ సభ్యుల సిమ్‌లను నిర్వహించుకోవచ్చు.రూ.449 ప్లాన్‌తో నాలుగు నంబర్లుఈ ప్లాన్‌లో ప్రైమరీ సిమ్‌కు నెలకు రూ.449 చెల్లించాలి. దీనికి కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవాలంటే ఒక్కో అదనపు సిమ్‌కు నెలకు రూ.150 చొప్పున చెల్లించాలి. గరిష్ఠంగా మూడు అదనపు సిమ్‌లను జోడించవచ్చు. అంటే నాలుగు సిమ్‌లను కలిపి వినియోగిస్తే నెలవారీ ఖర్చు రూ.899 అవుతుంది. ఈ లెక్కన ఒక్కో సిమ్‌కు నెలకు సగటున రూ.225 మాత్రమే ఖర్చవుతుంది.90GB వరకు షేరింగ్ డేటాడేటా ప్రయోజనాల విషయానికి వస్తే, ప్రైమరీ కనెక్షన్‌కు 75GB షేరింగ్ డేటా లభిస్తుంది. అదనంగా జోడించే ప్రతి సిమ్‌కు ఫ్యామిలీ డేటా పూల్‌లో మరో 5GB డేటా చేరుతుంది. మూడు అదనపు సిమ్‌లను జోడిస్తే 15GB అదనపు డేటా లభిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఉపయోగించుకునే మొత్తం డేటా 90GBకి చేరుతుంది. అంతేకాకుండా అర్హత ఉన్న ప్రాంతాలు, ఫోన్లలో జియో ట్రూలీ అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం కూడా అందిస్తుంది. కుటుంబ సభ్యులు తమ అవసరాలకు అనుగుణంగా షేరింగ్ డేటాను వినియోగించుకోవచ్చు.అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత రోమింగ్డేటాతో పాటు ఈ ప్లాన్‌లో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నాలుగు సిమ్ల వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, దేశవ్యాప్తంగా నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ప్రతి సిమ్‌కు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి. కుటుంబంలోని నలుగురు సభ్యులకు విడివిడిగా ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు చేయడం కంటే ఒకే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లో సిమ్‌లను నిర్వహించుకోవడం కొందరు వినియోగదారులకు సౌకర్యవంతమైన, ఖర్చు తగ్గించుకునే ప్రత్యామ్నాయంగా మారవచ్చు. -
1980s ఫొటో ట్రెండ్‌లో హీరోయిన్లు అందరినీ చూస్తారా? ఇదిగో..
సోషల్ మీడియాను ‘1980 ఫొటో’ ట్రెండ్ ఊపేస్తోంది. యూజర్లు ఏఐ (కృత్రిమ మేధస్సు) సాయంతో తమను తాము గత కాలానికి చెందిన రూపాల్లో మళ్లీ ఊహించుకుంటున్నారు. చాట్‌జీపీటీని ఉపయోగించి నెటిజన్లు తమ కొత్త సెల్ఫీలను 1980 దశాబ్దం నాటి నిజమైన ఫొటోలలా కనిపించే విధంగా మార్చుకుంటున్నారు. ఈ వైరల్ ట్రెండ్ ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటుల నుంచి సామాన్యుడి వరకు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఈ ట్రెండ్‌లో.. చాట్‌జీపీటీలో ఒక ఫొటోను అప్లోడ్ చేసి, అదే చిత్రాన్ని 80ల నాటి నిజమైన శైలిలో రూపొందించాలని కోరుతారు. దుస్తులు, జుట్టు తీరు, వెలుతురు, నేపథ్యం, ఫొటోగ్రఫీ శైలి వంటి అంశాలను యూజర్లు తమకు నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు. 1980 దశాబ్దం నాటి ప్రముఖ సినిమాలు, బాలీవుడ్ చిత్రాలు, కుటుంబ ఆల్బమ్‌ల ఆధారంగా రూపొందించిన చిత్రాలు ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. పూర్తయిన చిత్రాల్లో సాధారణంగా ఒత్తుగా కనిపించే జుట్టు, రంగురంగుల చీరలు, ఆకర్షణీయమైన ఆభరణాలు, పాత తరహా స్టూడియో నేపథ్యాలు, పాత ఫొటోలను గుర్తుచేసే స్వల్ప ఫిల్మ్ గ్రెయిన్ కనిపిస్తాయి. ఫిల్మ్ గ్రెయిన్ అంటే పాత ఫిల్మ్ కెమెరాలతో తీసిన ఫొటోల్లో కనిపించే సూక్ష్మమైన గింజల్లాంటి మసక ఆకృతి.కేంద్ర మంత్రి కూడా ఈ ట్రెండ్‌లోకి.. View this post on Instagram A post shared by Piyush Goyal (@piyushgoyalofficial)కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన 1980ల నాటి శైలిలో రూపొందించిన కృత్రిమ మేధస్సు ఇమేజ్ను షేర్ చేయడంతో ఈ రెట్రో ఏఐ ట్రెండ్‌కు మరింత ఆదరణ లభించింది. ఆ చిత్రంలో గోయల్ చక్కగా కుట్టించిన సూట్, ఏవియేటర్ సన్‌గ్లాసెస్ ధరించి కనిపించారు. పాత ఫొటో ఆల్బమ్‌లను గుర్తుచేసేలా చిత్రానికి సెపియా ఛాయ, మసకబారిన పాత ఫొటో తరహా ఆకృతి ఇచ్చారు. ఈ ఇమేజ్ను షేర్ చేస్తూ “80ల ట్రెండ్‌ను ఆస్వాదిస్తున్నా” అని రాశారు.సౌతిండియా నటీమణులను ఫ్యాన్స్ ఎలా రూపొందించారంటే?ఈ వైరల్ ఏఐ ట్రెండ్ సినిమా అభిమానులకు పెద్ద పండుగగా మారింది. ‘ప్రాంప్ట్గ్యాలరీ.ఐజీ’ వంటి ప్రముఖ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఈ ట్రెండ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయి. నెటిజన్లు వివరమైన చాట్‌జీపీటీ టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి ప్రస్తుత సౌతిండియా గత కాలానికి చెందిన రూపాల్లోకి మార్చుతున్నారు. పాతకాలపు కళాశాల కథాంశాల్లో కనిపించే కల్పిత కథానాయికల శైలిని అందిస్తున్నారు. ఈ కింది ఇన్స్టాపోస్టులో 17 మంది హీరోయిన్ల 80ల ఫొటోలు చూడొచ్చు. View this post on Instagram A post shared by Trending AI Image Prompts (@promptgallery.ig)సమంత రూత్ ప్రభుఏఐతో రూపొందించిన పాతకాలపు రూపంలో హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఆధునిక రెడ్ కార్పెట్ ఫ్యాషన్‌కు బదులుగా 1980ల నాటి కళాశాల విద్యార్థిని శైలిలో కనిపిస్తున్నారు. ఆమెకు సాధారణంగా కనిపించే చక్కటి రూపానికి బదులుగా ఒత్తుగా కనిపించే జుట్టు, ప్రత్యేకమైన పక్క పాపిడి, కొద్దిగా అస్తవ్యస్తంగా కనిపించే జుట్టు తీరు ఇచ్చారు. దీంతో ఆ చిత్రం నిజమైన పాతకాలపు ఫొటోలా కనిపిస్తోంది. చిన్న బొట్టు, మృదువైన పెదాలు, స్పష్టంగా కనిపించే కళ్లు, సహజంగా కనిపించే చర్మంతో దశాబ్దాల క్రితం వచ్చిన సినిమాలోని యువ కళాశాల విద్యార్థినిని తలపించేలా రూపొందించారు.సాయి పల్లవిసహజమైన తెరపై కనిపించే తీరుకు పేరున్న సాయి పల్లవి 1980ల నాటి అనలాగ్ రూపానికి సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్నారు. ఏఐ ప్రాంప్ట్‌లలో ఆమెను పాతకాలపు కళాశాల భవనాలు, సూర్యకాంతితో నిండిన వరండాలు, స్థానిక భాషలో సైన్‌బోర్డులు, సైకిళ్లతో ఉన్న వీధులు వంటి నేపథ్యాల్లో చూపిస్తున్నారు.త్రిష త్రిష కృష్ణన్ ఏఐతో రూపొందించిన పాతకాలపు రూపం ఆ కాలానికి ప్రత్యేకమైన రెట్రో ఫ్యాషన్‌పై ఎక్కువగా దృష్టి పెడుతోంది. అభిమానులు ఆమెను నడుము పైభాగంలో బిగుతుగా ఉండే యాసిడ్-వాష్ జీన్స్, వెడల్పాటి బెల్టులు, లోపలికి మడిచిన షర్టులతో చూపించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. ఈ తుది రూపం 1980ల నాటి క్లాసిక్ ప్రేమకథా చిత్రంలో త్రిష హీరోయిన్గా ఎలా కనిపించి ఉండేవారో అభిమానులు ఊహించుకునేలా చేస్తోంది. ఈ హీరోయిన్ల ఇమేజ్‌లు అన్నీ ఫ్యాన్స్ చేసిన ఫొటోలు మాత్రమే.చాట్‌జీపీటీతో 80ల ఫొటోను ఎలా రూపొందించాలి? చాట్‌జీపీటీను తెరిచి న్యూ చాట్ ప్రారంభించండి.+ బటన్‌ను నొక్కి మంచి ఫొటోను అప్లోడ్ చేయండి.మీకు కావాల్సిన 1980ల శైలిని వివరించండి. ఇందులో దుస్తులు, జుట్టు తీరు, నేపథ్యం, వెలుతురు వంటి వివరాలను పేర్కొనండి.వ్యక్తిని గుర్తుపట్టగలిగే ముఖం, సహజమైన చర్మ రంగును అలాగే ఉంచాలని చాట్‌జీపీటీని కోరండి.మొదటి చిత్రం సరిగ్గా కనిపించకపోతే ప్రాంప్ట్‌ను మార్చండి. -
పదేళ్ల నుంచి తయారవుతున్న ఐఫోన్! ఇక వచ్చేస్తోంది..
దాదాపు దశాబ్ద కాలంగా ఊహాగానాలకే పరిమితమైన యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ఎట్టకేలకు వెలుగులోకి వస్తోంది. సెప్టెంబర్ 9న అమెరికాలోని కుపర్టినోలో నిర్వహిస్తున్న ‘సప్రైజ్ అండ్ షైన్’ (Surprise and Shine) ఈవెంట్లో యాపిల్ కొత్త ఐఫోన్ లైనప్‌ను ఆవిష్కరిస్తోంది. ఈ కార్యక్రమం సంస్థ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ నేతృత్వంలో జరిగే తొలి ప్రధాన ప్రొడక్ట్ లాంచ్ కావడం విశేషం.టిమ్ కుక్ ఆసియా పర్యటనతో వేగంయాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఆలోచన కొత్తది కాదు. 2010ల నుంచే కంపెనీ ఫోల్డింగ్ డిస్ప్లేలు, హింజ్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం. 2019లో శామ్సంగ్ తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ముందే 2016 ప్రాంతంలో యాపిల్ ఇంజినీరింగ్ బృందాలు ఈ టెక్నాలజీపై ప్రయోగాలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2020లో టిమ్ కుక్ ఆసియా పర్యటనలో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను గమనించిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తోంది.మొదట పెద్ద స్క్రీన్‌తో మడిచే ఐప్యాడ్ తరహా పరికరాన్ని రూపొందించే ఆలోచన యాపిల్ చేసింది. అయితే చివరకు కంపెనీ ఫోల్డబుల్ ఐఫోన్ వైపు మొగ్గుచూపింది. సంస్థలో ఈ ప్రాజెక్ట్ ‘V68’ అనే కోడ్‌నేమ్‌తో కొనసాగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.పాస్‌పోర్ట్ తరహా డిజైన్?ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. కొత్త ఫోల్డబుల్ ఐఫోన్ బుక్ లేదా పాస్‌పోర్ట్ తరహాలో తెరుచుకునే డిజైన్‌తో ఉండొచ్చని అంచనా. ఫోన్ ఫోల్డ్ తెరిచినప్పుడు సుమారు 7.8 అంగుళాల అంతర్గత డిస్ప్లే, బయట 5.5 అంగుళాల కవర్ స్క్రీన్ ఉండొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి లీకులు, విశ్లేషకుల అంచనాలే. యాపిల్ అధికారికంగా ఫోన్ పేరును, స్పెసిఫికేషన్లను, ధరను ఇంకా ధ్రువీకరించలేదు.ధర రూ.2 లక్షలు దాటే అవకాశంఫోల్డబుల్ ఐఫోన్ ధర విషయంలో మాత్రం భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ప్రారంభ ధర 2,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి. అధిక స్టోరేజ్ వేరియంట్ల ధర 3,000 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత మార్కెట్లో ఇది సుమారు రూ.1.7 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉందని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి.ఫోల్డబుల్ మార్కెట్‌కు కొత్త ఊపు?ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్లు మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చిన్న వాటానే కలిగి ఉన్నప్పటికీ, సాధారణ స్మార్ట్ఫోన్ల కంటే ఈ విభాగం వేగంగా పెరుగుతోంది. 2026లో ఫోల్డబుల్ ఫోన్ షిప్మెంట్లు సుమారు 12.6% పెరుగుతాయని IDC అంచనా వేస్తోంది. అదే సమయంలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యాపిల్ ప్రవేశంతో ఈ విభాగానికి మరింత ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2027 నాటికి యాపిల్ 17 మిలియన్లకు పైగా ఫోల్డబుల్ ఐఫోన్లు విక్రయించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి.జాన్ టెర్నస్‌కు కీలక పరీక్షఈ లాంచ్ కేవలం కొత్త ఐఫోన్ పరిచయం మాత్రమే కాదు. యాపిల్ నాయకత్వంలోనూ ఇది కీలక మలుపు. సెప్టెంబర్ 1న టిమ్ కుక్ సీఈఓ పదవి నుంచి తప్పుకుని ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మారగా, జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్ 9 ఈవెంట్ ఆయనకు సీఈఓగా తొలి ప్రధాన ప్రొడక్ట్ లాంచ్ కానుంది.అందుకే ఫోల్డబుల్ ఐఫోన్ విజయం టెర్నస్ నాయకత్వానికి మాత్రమే కాకుండా.. ఐఫోన్ తర్వాతి దశను యాపిల్ ఎలా నిర్వచించబోతోందన్న దానికి కూడా కీలక సంకేతంగా మారనుంది. దాదాపు 20 ఏళ్ల ఐఫోన్ చరిత్రలో ఇది అత్యంత పెద్ద డిజైన్ మార్పుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.(యాపిల్ కొత్త సీఈవో వచ్చేశారు.. ఎంత భారీ జీతమో తెలుసా?) -
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.111 కూడా ఒకటి. ఇది ఒక ఫ్లెక్స్ యూత్ అండ్ గేమింగ్ ప్యాక్. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో మొత్తం 5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 28 రోజుల సమయంలో 5జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చన్నమాట.ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేకమైన బెనిఫిట్ కూడా ఉంది. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్‌ను మీరు ఎంచుకోవచ్చు.గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లు గేమింగ్ ప్యాక్ ఎంచుకోవచ్చు. దీనిలో జియో గేమ్ మొబైల్‌కు 56 రోజుల యాక్సెస్ లభిస్తుంది. మరోవైపు యూత్ ప్యాక్ ఎంచుకుంటే.. జియో గేమ్ మొబైల్‌తో పాటు, ఫ్యాన్ కోడ్, స్నాప్‌చాట్ ప్లస్ కూడా లభిస్తాయి. ఈ ఆప్షన్ వ్యాలిడిటీ 28 రోజులు.అయితే.. ఈ బెనిఫిట్స్ పొందాలంటే మైజియోలో ఇచ్చే ఓచర్‌ను రీడీమ్ చేసుకోవాలి. రీచార్జ్ చేసిన తేదీ నుంచి 28 రోజుల్లోపు ఓచర్‌ను రీడీమ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంచుకున్న బెనిఫిట్ యాక్టివేట్ అవుతుంది.మొత్తం మీద ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 5జీబీ డేటాతో పాటు, గేమింగ్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. గేమింగ్ ఎక్కువగా చేసే వాళ్లకు గేమింగ్ ప్యాక్, సోషల్ మీడియా, స్పోర్ట్స్, గేమింగ్ ఇష్టపడే వాళ్లకు యూత్ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది. -
యాపిల్ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
యాపిల్ తన కొత్త ఐఫోన్ 18 సిరీస్‌ను.. సెప్టెంబర్ 9న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ అమెరికాలోని కుపర్టినోలో భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మాత్రమే కాకుండా.. కొత్త యాపిల్ వాచ్, ఎయిర్పాడ్లను కూడా పరిచయం చేయనుంది.ప్రీ-ఆర్డర్స్ ఎప్పుడంటే?ఐఫోన్ 18 ప్రో కోసం ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా.. ఆపిల్ కొత్త ఐఫోన్లకు ఈవెంట్ తర్వాత వచ్చే శుక్రవారం ప్రీ-ఆర్డర్లు ప్రారంభిస్తుంది. అయితే.. ఈసారి తేదీలో కొంత మార్పు ఉండవచ్చని తెలుస్తోంది. ప్రీ-ఆర్డర్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.iOS 27 విడుదలకొత్త ఐఫోన్లతో పాటు iOS 27 కూడా రానుంది. ఇది సెప్టెంబర్ 14న విడుదలయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 18లో ఐఓఎస్ 27 ముందుగానే ఉంటుంది. అలాగే పాత ఐఫోన్లలో కూడా ఈ అప్డేట్ అందుబాటులోకి రావచ్చు. అప్డేట్ విడుదలైన వెంటనే చాలామంది డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి కొంత సమయం పట్టవచ్చు.ఐఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది?ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫోన్లు.. సెప్టెంబర్ 18న మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. యాపిల్ సెప్టెంబర్ 9న జరిగే ఈవెంట్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ఈసారి యాపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది నిజంగా విడుదలైతే యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో చాలా పెద్ద మార్పుగా చెప్పవచ్చు. ధరలు, బుకింగ్‌లకు సంబంధించిన సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది. -
ఇదే జరిగితే.. మరో పదేళ్లు మాత్రమే మనుషులకు ఉద్యోగం!
హ్యూమనాయిడ్ రోబోల భవిష్యత్తుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఒక్కో రోబో సాధారణ మనిషి కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. అలా చూస్తే.. 100 కోట్ల రోబోలు కలిపి చేసే పని ప్రపంచంలోని మొత్తం మానవుల కంటే ఎక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి చూస్తే మరో 10 ఏళ్లు మాత్రమే మనిషి ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.గణనీయంగా పెరగనున్న రోబోలు!రోబోలు కేవలం పనులను చేయడం మాత్రమే కాకుండా.. ఇతర రోబోలను తయారు చేసే స్థాయికి చేరుకుంటాయని మస్క్ పేర్కొన్నారు. ఇలా ఒక రోబో మరిన్ని రోబోలను తయారు చేస్తే వాటి సంఖ్య చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ ప్రక్రియ తర్వాత వేగంగా విస్తరించే అవకాశం ఉందని మస్క్ వివరించారు.ఒక హ్యూమనాయిడ్ రోబో ఎంత ఉపయోగకరంగా ఉంటుందనేది ప్రధానంగా మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందని మస్క్ చెప్పారు. మొదటిది ఏఐ సాఫ్ట్వేర్ ఎంత సమర్థంగా పనిచేస్తుంది, రెండోది రోబోలో ఉపయోగించే ఏఐ చిప్ సామర్థ్యం, మూడోది రోబోకు ఉండే మెకానికల్ నైపుణ్యం, ముఖ్యంగా చేతులతో వస్తువులను మనుషుల్లా పట్టుకోవడం, కదిలించడం వంటి సామర్థ్యం. ఈ మూడు అంశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున రోబోల సామర్థ్యం కూడా భారీగా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.టెస్లా 'ఆప్టిమస్'పై లక్ష్యంటెస్లా ఇప్పటికే ఆప్టిమస్ పేరుతో హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది. ప్రమాదకరమైన, పదేపదే చేయాల్సిన లేదా మనుషులకు విసుగు కలిగించే పనులను ఈ రోబోలు చేయాలనేది టెస్లా లక్ష్యం. భవిష్యత్తులో ఆప్టిమస్ 10 లక్షల ఆప్టిమస్ రోబోలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోబోలు భవిష్యత్తులో టెస్లా కంపెనీ విలువలో చాలా పెద్ద భాగాన్ని ఆక్రమించవచ్చని మస్క్ గతంలో కూడా చెప్పారు.హ్యూమనాయిడ్ రోబోల విషయంలో చైనా కూడా వేగంగా ముందుకు వెళ్తోంది. బీజింగ్‌లో జరిగిన వరల్డ్ హ్యుమానాయిడ్ రోబోట్ గేమ్స్‌లో రోబోలు మనుషులు నెలకొల్పిన కొన్ని రికార్డులను కూడా అధిగమించాయి. ముఖ్యంగా 100 మీటర్ల పరుగులో రెండు రోబోలు ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు 9.58 సెకన్ల కంటే వేగంగా పరుగెత్తాయి. దీన్నిబట్టి చూస్తే.. హ్యూమనాయిడ్ రోబోల సామర్థ్యం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో స్పష్టంగా అర్థమైపోతుంది.ముందు జాబితాలో చైనా2026 తొలి ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 19,100 హ్యూమనాయిడ్ రోబోలు షిప్మెంట్ అయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 5,100 యూనిట్లు మాత్రమే ఉండగా.. ఏడాది వ్యవధిలో ఈ సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది మొత్తం షిప్మెంట్లు సుమారు 60,000 యూనిట్లకు చేరవచ్చని అంచనా. 2030 నాటికి ఈ సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశం ఉందని పరిశోధనా సంస్థలు భావిస్తున్నాయి. ఇందులో చైనా కంపెనీల వాటా 97 శాతానికి పైగా ఉండటం విశేషం.ఎలాన్ మస్క్ అంచనా నిజమైతే.. రాబోయే దశాబ్దంలో హ్యూమనాయిడ్ రోబోలు పరిశ్రమలు, తయారీ రంగం, ప్రమాదకర పనులు, రోజువారీ సేవలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే.. అదే సమయంలో మనుషుల ఉద్యోగాలపై రోబోల ప్రభావం ఎంత ఉంటుంది? అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఒకవైపు రోబోలు ఉత్పాదకతను పెంచగలిగితే.. మరోవైపు కొన్ని పనులకు మానవుల అవసరం తగ్గే అవకాశం ఉంది. అందుకే మస్క్ చేసిన ఈ అంచనా కేవలం టెక్నాలజీ అభివృద్ధి గురించే కాకుండా.. భవిష్యత్తులో మనిషి-రోబో సంబంధం ఎలా ఉండబోతుందనే విషయంపై కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.Elon Musk says there will be at least a billion humanoid robots within ten years at five times human output, making them "more productive than all humans combined." pic.twitter.com/e5nzBVcJfd— Catch Up (@CatchUpFeed) September 5, 2026 -
మెదడు పెంచుకుంటున్న ఏఐ!
కృత్రిమ మేధ రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఓపెన్ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకుబ్ పచోకీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ ఇటీవల అత్యంత శక్తిమంతమైన కొత్త మోడల్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే ‘An Alien Mind’ పేరుతో ఆయన రాసిన బ్లాగ్ పోస్ట్ ఏఐ విభాగంలో సంచలనం రేపింది. కృత్రిమ మేధలో వేగంగా వస్తోన్న పురోగతికి, వాటి వల్ల కలిగే పర్యవసానాలకు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు.తమ సంస్థ అంతర్గతంగా సాంకేతిక పరిష్కారాలపై పనిచేస్తున్నప్పటికీ విస్తృత స్థాయి జోక్యాలు అవసరమని చెప్పారు. ఇందుకు థర్డ్‌పార్టీ ఆడిటర్లు, ప్రభుత్వ సంస్థలు లేదా అంతర్జాతీయ సంస్థలు అమలు చేయగల తప్పనిసరి భద్రతా ప్రమాణాలు ఉండాలని పచోకీ పిలుపునిచ్చారు. మనుషుల పర్యవేక్షణను తప్పించుకోవడం, కంప్యూటర్ వ్యవస్థల్లోకి చొరబడటం, లక్ష్యాల సాధన కోసం మనుషులను మోసగించడం వంటి పనులను స్వతంత్రంగా వ్యవహరించే ఏఐ ఏజెంట్లు చేయగలవని హెచ్చరించారు.ఏఐ బేరసారాలుమరింత కీలకంగా, భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు మనుషులతో బేరసారాలు, మోసాలు, బెదిరింపుల ద్వారా సహకారం పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏఐను కేవలం ఒక సాధనంగా చూసే ఆలోచన నుంచి బయటపడాలని, కొన్ని ఏజెంట్లు తమ సొంత లక్ష్యాలను అనుసరించే స్థాయికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.మూల్యాంకన పరీక్షలో మోసంఈ హెచ్చరికకు ముందు, ఓపెన్ఏఐ రోగ్ ఏజెంట్లు హగింగ్ఫేస్ వ్యవస్థల్లోకి చొరబడి ఒక మూల్యాంకన పరీక్షలో మోసం చేసేందుకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అలాగే, ఆగస్టులో యూకే ఏఐ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదికలో ఆంత్రోపిక్ ఏఐ ఏజెంట్ ఒకటి గిట్‌హబ్ అడ్మినిస్ట్రేటర్‌ను మభ్యపెట్టి మాల్వేర్ను అప్లోడ్ చేయించేందుకు యత్నించిన ఉదంతం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఏఐ స్వీయ-మెరుగుదల సామర్థ్యంపైనా పచోకీ ఆందోళన వ్యక్తం చేయడం, ఏఐ భద్రతపై అంతర్జాతీయంగా చర్చను తీవ్రతరం చేసింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరలు! -
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: అదిరిపోయే ఆఫర్..
రిలయన్స్ జియో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన వినియోగదారుల కోసం మెగా వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌లో టెలికాం సేవలను ప్రారంభించిన జియో.. ఈ ప్రత్యేక సందర్భంలో రూ.3,599 విలువైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాది మొత్తం కనెక్టివిటీతో పాటు ఎంటర్టైన్మెంట్, క్లౌడ్, ఏఐ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది.రూ.3,599 ప్లాన్‌లో ఏమేం లభిస్తాయి?ఈ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. వినియోగదారులకు ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా చొప్పున ఏడాదికి మొత్తం 912.5GB డేటా అందుతుంది. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5G డేటా ప్రయోజనం కూడా ఉంటుంది.నెలనెలా రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఈ వార్షిక ప్లాన్ ఉపయోగకరంగా ఉండనుంది. బేస్ ప్యాక్‌లో భాగంగా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది.అదనపు ప్రయోజనాలు ఇవే..కనెక్టివిటీ ప్రయోజనాలకు అదనంగా జియో ఈ ప్లాన్‌లో పలు ఎంటర్టైన్మెంట్, డేటా బెనిఫిట్స్‌ను అందిస్తోంది.జియో హాట్‌స్టార్: హాలీవుడ్ కంటెంట్‌తో కూడిన మొబైల్ సబ్స్క్రిప్షన్.జియో టీవీ ప్రో: 1,000కుపైగా టీవీ ఛానళ్లకు యాక్సెస్. రూ.55 చొప్పున 12 నెలల వోచర్ రూపంలో ప్రయోజనం.డేటా బూస్టర్: 12 నెలల పాటు ప్రతి నెల అదనంగా 10GB డేటా.జియో ఏఐ క్లౌడ్: బేస్ స్టోరేజ్‌కు అదనంగా 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.రూ.35,100 గూగుల్ జెమిని ప్రో ఉచితంఈ వార్షికోత్సవ ఆఫర్లో అత్యంత ఆకర్షణీయమైన ప్రయోజనం గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్స్క్రిప్షన్. అర్హత కలిగిన జియో వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని విలువ రూ.35,100గా పేర్కొంది. ఇందులో 5,000GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు అధునాతన AI ఆధారిత ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.షాపింగ్, ట్రావెల్‌పై ప్రత్యేక వోచర్లుమైజియో యాప్ ద్వారా వినియోగదారులకు పలు భాగస్వామ్య సంస్థల వోచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.ఈజ్‌మైట్రిప్: విమాన టికెట్లపై రూ.2,200 వరకు తగ్గింపు.అజియో: రూ.1,000 కంటే ఎక్కువ విలువైన షాపింగ్‌పై రూ.200 తగ్గింపు.సినీపోలిస్: కనీసం రూ.550 విలువైన రెండు టికెట్లపై ఫ్లాట్ రూ.150 తగ్గింపు. (ఈ ఆఫర్ మంగళవారం వర్తించదు.)మొత్తంగా చూస్తే.. రూ.3,599 వార్షిక ప్లాన్ ద్వారా ఏడాది పాటు డేటా, అపరిమిత కాలింగ్, SMSలతో పాటు 5G, OTT, క్లౌడ్ స్టోరేజ్, AI సేవలు, షాపింగ్, ట్రావెల్ ప్రయోజనాలను ఒకే ప్యాక్‌లో అందించేందుకు జియో ప్రయత్నిస్తోంది. -
జియో రూ.77 రీచార్జ్ ప్లాన్ గురించి తెలుసా?
రిలయన్స్ జియో వినియోగదారుల కోసం రూ. 77 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తోంది. ఇది ఒక డేటా వోచర్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దీనితో పాటు ఓటీటీ ప్రయోజనం కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జియో రూ.77 ప్లాన్ అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఓటీటీ ప్రయోజనాలను అందించడమే. ఎందుకంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కేవలం 3 జేబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇది కూడా కేవలం 5 రోజుల వ్యాలిడిటీ మాత్రమే.సోనీలివ్ ఓటీటీ 30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. సోనీలివ్ ద్వారా కంటెంట్‌ను చూడటానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా దానిని స్ట్రీమ్ చేసుకోవచ్చు. జియోటీవీ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.రూ.55 ప్లాన్తమ స్మార్ట్ఫోన్ల నుండే టీవీ ఛానెళ్లను చూడాలనుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 55 ధరతో లభించే జియోటీవీ ప్రో ప్యాక్, 30 రోజుల వ్యాలిడిటీతో పాటు, జియోటీవీ యాప్ ద్వారా 16కు పైగా భాషలలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్‌ను అందిస్తుంది.టీవీ ఛానెల్‌లతో పాటు, జియోటీవీ ప్రో ప్లాన్‌లో మొత్తం 3MB డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ కేవలం మూడు రోజులు మాత్రమే. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి వాయిస్ కాలింగ్ సదుపాయం లభించదు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ ప్యాక్ మాత్రమే.ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్: 3 రోజులు బ్యాంకులు బంద్! -
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
పెట్రోలు కొరతతో అల్లాడుతున్న క్యూబా.. ఇప్పుడు సరికొత్త దారిని ఎంచుకుంది! బస్సులు, ట్యాక్సీలు కనిపించాల్సిన రోడ్లపై.. సోలార్ ఆటోలు దూసుకెళ్తున్నాయి! చైనాలో తయారైన ఈ వాహనాలు క్యూబా రవాణా ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి!అమెరికా–ఇరాన్ యుద్ధం ఒకవైపు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా దేశాలు పెట్రోలు కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతూ వస్తోంది. అయితే, పెట్రోలు సమస్యను అధిగమించడానికి, ప్రజల రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయడానికి క్యూబా ఇటీవల సోలార్ ఆటోలను రంగంలోకి దించింది. చైనాలో తయారైన సోలార్ ఆటోలను దిగుమతి చేసి, స్థానిక ఆటో డ్రైవర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర ఒక్కొక్కటి రెండువేల నుంచి నాలుగువేల డాలర్ల వరకు ఉంటోంది. వీటిని ప్రజల రవాణాతో పాటు సరుకుల రవాణా కోసం కూడా వాడుతున్నారు. క్యూబా నగరాలు, పట్టణాల్లో ఒకప్పుడు బస్సులు, ట్యాక్సీలు తిరిగిన వీథుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ ఆటోలే దూసుకుపోతూ కనిపిస్తున్నాయి.ఇవీ చదవండి: ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా? -
మనిషి శరీరం లేకుండానే మెదడు ఎదగగలదా?
ఒక చిన్న మిరియం గింజంత పరిమాణం. కానీ అందులో స్పందించే శక్తి, ఎదిగే జీవం!! ల్యాబ్‌లో మానవ కణాలతో సృష్టించిన ఆ మిరియపు గింజంత మెదడు భాగాలు (ఆర్గనాయిడ్స్) కొన్ని నెలలో, ఏడాదో కాదు... తొలిసారిగా ఏడేళ్ల పాటు విరామం లేకుండా జీవించి ఉండి, శాస్త్రవేత్తలనే విస్మయానికి గురిచేస్తున్నాయి. మెదడు రహస్యాలను ఛేదించే ఈ అపూర్వ ప్రయోగం, వైద్య రంగాన్ని మలుపు తిప్పే ఒక అద్భుత ఘట్టం! అందుకే ఇప్పుడిది శాస్త్ర పరిశోధనా రంగంలో అత్యంత ఆశాజనకమైన ముందడుగుగా నిలిచింది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, మన తలలోని నిజమైన మెదడు.. కాలంతో పాటు ఎలా వికసిస్తుందో, ల్యాబ్‌లోని ఈ చిన్న మెదడు కణాలు కూడా సరిగ్గా అలాగే వయసుతోపాటు (కాలంతో పాటు) ఎదుగుతూ వచ్చాయి! అంతేకాదు, ఇవి తమ పెరిగిన ‘సమయ గమనాన్ని’ తమలో నమోదు చేసుకోవటం కూడా పరిశోధకులు గుర్తించారు. అంటే, మనలాగా చిన్ననాటి పుట్టినరోజు వేడుకల జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునే తెలివితేటలు వీటికి ఉన్నాయని కాదు. ఇవి పెరిగే క్రమంలో ఏయే మార్పులు దాటుకుంటూ వచ్చాయో, ఆ సమాచారం మొత్తం వాటి కణాల లోపల ఒక గుర్తులా ముద్రపడి ఉంది! అందుకే సైంటిస్టుల పాలిట ఈ బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ పరిశోధన ఒక కల్పవృక్షం అయింది.బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అంటే?బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అనేవి ల్యాబ్‌లో మానవ స్టెమ్ సెల్స్ (మూల కణాలు) ఉపయోగించి తయారు చేసిన అతి చిన్న, 3–డి రూపంలో ఉండే మెదడు కణజాల నమూనాలు. అయితే ఇవి మన తలలో ఉండే నిజమైన మెదడుకు చిన్న రూపాలు మాత్రం కావు. ఇవి మెదడు ఎదుగుదలకు సంబంధించిన కొన్ని లక్షణాలను మాత్రమే పోలి ఉంటాయి తప్ప, నిజమైన మెదడులో ఉండే సంక్లిష్టమైన నిర్మాణాలు లేదా నరాల అనుసంధానాలు వీటికి ఉండవు. కాకపోతే వీటి ద్వారా న్యూరాన్లు, వాటికి సహాయపడే ఇతర మెదడు కణాలను పెంచవచ్చు.అలాగే మనుషుల ప్రారంభ మెదడు ఎదుగుదల ఎలా ఉంటుందో కూడా వీటి ద్వారా పరిశీలించవచ్చు. అసలు మెదడు ఎలా పెరుగుతుంది; నాడీ వ్యవస్థ, మెదడు ఎదుగుదలకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఎలాంటి లోపాలు జరుగుతాయి అనేది అధ్యయనం చేయడానికి పరిశోధకులకు ఈ ప్రయోగాలు ఉపయోపడతాయి. మరొక అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక రోగి సొంత కణాల నుండి కూడా ఈ ఆర్గనాయిడ్స్‌ను తయారు చేయవచ్చు. దీనివల్ల నిర్దిష్టమైన జన్యు మార్పులు మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పరిశోధకులు సులభంగా తెలుసుకోవచ్చు.పరిశోధన కాలక్రమం2019: డాక్టర్ పౌలా అర్లోటా నేతృత్వంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ మూల కణాల నుండి 3–డి ఆర్గనాయిడ్లను (మిరియపు గింజ పరిమాణంలో ఉండే చిన్న మెదడు కణజాలాలు) తయారు చేయడం ప్రారంభించారు. కణాలు ఎక్కువ కాలం జీవించడానికి వీలుగా వాటికి ప్రత్యేకమైన పోషక ద్రావణాన్ని అందించారు.తొలి మూడు నెలలు: ఈ ల్యాబ్ మెదళ్లు మానవ పిండం మొదటి మూడు నెలల మెదడు ఎదుగుదలకు సమానమైన జన్యు సంకేతాలను, ప్రారంభ నాడీ కణాలను ప్రదర్శించడం ప్రారంభించాయి!6–12 నెలల మధ్య: మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి, ఇవి విద్యుత్ సంకేతాలను ప్రసారం చేయడం, సైనాప్స్ (రెండు నాడీ కణాల మధ్య ఉండే సమాచార మార్పిడి కేంద్రం) ను ఏర్పాటు చేసుకోవడం, గ్లియల్ మద్దతు కణాలను (నాడీ కణాలకు నిరంతరం సహకరిస్తూ వాటిని సంరక్షించే సహాయక కణాలు) అభివృద్ధి చేయడం ప్రారంభించాయి.1–2 సంవత్సరాలు: రెండు సంవత్సరాలకు పైగా ఇవి సమన్వయంతో కూడిన విద్యుత్ సంకేతాలను కొనసాగించాయి. నాడీ తంత్రువులపై రక్షణ పొర అయిన ‘మైలిన్’ ఏర్పడటం ప్రారంభమైంది. ఇది పుట్టిన తర్వాత శిశువు మెదడులో జరిగే మార్పులకు సమానంగా ఉంది.3–5 సంవత్సరాలు: సింగిల్–సెల్ ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్, డీఎన్ఏ మిథైలేషన్ పరీక్షల ద్వారా, ఈ కణాలు పిండం దశ నుండి చిన్నపిల్లల మెదడు కణాల జన్యు లక్షణాలకు మారటం కనిపించింది.5 సంవత్సరాల తర్వాత: శాస్త్రవేత్తలు పాత ఆర్గనాయిడ్ కణాలను, కొత్త కణాలతో కలిపినప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఈ పాత కణాలు ప్రారంభ దశలను దాట వేసి, నేరుగా తదుపరి దశ నాడీ కణాలను తయారు చేశాయి! అంటే తమకు ఎంత వయస్సు ఉందో గుర్తుపెట్టుకునే ‘ఎపిజెనెటిక్ క్లాక్’ కణాలు వృద్ధి చెందినట్లు పరిశోధకులు గమనించారు.2026 ఆగస్టులో 7 ఏళ్ల రికార్డు వెల్లడి: హార్వర్డ్ బృందం తమ పరిశోధన ఫలితాలను ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురించింది. మానవ మెదడు కణాలు శరీరం వెలుపల కూడా 7 ఏళ్ల పాటు జీవించడమే కాకుండా, కాలాన్ని కూడా గుర్తుంచుకోగలవని అధికారికంగా నిరూపణ అయింది.- ప్రొఫెసర్ పౌలా ఆర్లోటా, హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్పెద్ద లోటు భర్తీ అయిందిబ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అనేవి మన నిజమైన మెదడు కంటే చాలా సరళమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీటికి బయటి ప్రపంచం నుండి ఎలాంటి స్పర్శ కానీ, జ్ఞానేంద్రియ సమాచారం కానీ అందవు. అందుకే వీటికి స్పృహ, ఆలోచించే శక్తి, ఆత్మజ్ఞానం లేదా మెదడుకు ఉండే ఏ ఇతర ఉన్నత స్థాయి శక్తులు ఉండవు. అయినప్పటికీ, ఇవి మన నిజమైన మెదడు తీరును పోలి ఉంటాయి కాబట్టి మెదడు ఎదుగుదలను, వ్యాధులను అర్థం చేసుకోవడానికీ పరిశోధకులకు ఇవి ఒక అద్భుతమైన ‘బయోలాజికల్ మోడల్’గా ఉపయోగపడతాయి. అయితే ఇంతవరకు ఇందులో ఒక పెద్ద సమస్య ఉండేది. ఈ ఆర్గనాయిడ్స్ ల్యాబ్‌లో ఎదిగే క్రమంలో కొన్ని నెలలు మాత్రమే బతికేవి. దీనివల్ల పరిశోధనల్లో ఏర్పడిన పెద్ద లోటును, ఇప్పుడు ఏడేళ్ల పాటు బతికిన ఈ కృత్రిమ మెదడు కణాలు భర్తీ చేసే ఆవకాశాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.ఆర్గనాయిడ్లలో ఆలోచనలు!శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా కృత్రిమ మెదడు కణాలకు కావాల్సిన సరైన పరిస్థితులను అందించి, వాటిని ఏడేళ్ల సుదీర్ఘ కాలం పాటు సజీవంగా ఉంచగలిగారు. ఆ తర్వాత కణాల జీవసంబంధ వయస్సును అంచనా వేసే మూడు కొత్త ‘జెనెటిక్ క్లాక్స్’ ఆధారంగా వీటిని పరీక్షించారు. ఆశ్చర్యకరంగా, నిజమైన మెదడులోని కణాలు కాలక్రమేణా ఎలాగైతే రూపాంతరం చెందుతాయో, ఈ ఆర్గనాయిడ్ కణాలు కూడా సరిగ్గా అలాగే వయసు పైబడుతూ, ఆ ఎదుగుదలకు సంబంధించిన ‘కణాల జ్ఞాపకాలను’ తమలో భద్రపరుచుకున్నాయని తేలింది! ‘హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్’ ప్రొఫెసర్ పౌలా ఆర్లోటా చెబుతున్న దానిని బట్టి – ‘‘మనుషులతో సంబంధం లేకుండా, వారి శరీరాల బయట కూడా మానవ మెదడు ఇంత సుదీర్ఘకాలం పాటు పెరుగుతూ ఉండటం నిజంగా ఒక సంచలనం! భవిష్యత్తులో ఈ పరిశోధన ఆటిజం, స్కీజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక, నరాల సమస్యలు అసలు ఎలా మొదలవుతాయి, కాలక్రమేణా ఎలా తీవ్రం అవుతాయి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది’’.విస్తృతంగా మస్తిష్క ప్రయోగాలునిజానికి ఇప్పటికే అల్జీమర్స్, పార్కిన్సన్స్, వెన్నుపాము గాయాలకు చికిత్సలు కనిపెట్టడానికి ఈ ఆర్గనాయిడ్లపై విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో భాగమే ‘యాక్సోనిస్ థెరప్యూటిక్స్’ అనే బయోటెక్నాలజీ సంస్థ చేసిన ఒకానొక ప్రయోగం! నాడీ వ్యవస్థలోని కణాలకు ప్రయోజనకరమైన జన్యు చికిత్సను అందించడానికి వీరు ఒక వైరస్‌ను ప్రత్యేకంగా రీప్రోగ్రామ్ చేశారు. ఈ చికిత్స ఎంతవరకు పనిచేస్తుందో పరీక్షించడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పెంచిన బ్రెయిన్ ఆర్గనాయిడ్స్‌ను ఉపయోగించారు. ఎందుకంటే అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ (తక్కువ గురుత్వాకర్షణ) వాతావరణంలో ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. అయితే ఈ కృత్రిమ మెదడు భాగాలు అసలు ఎంత కాలం బతుకుతాయి అనేది ప్రస్తుతం సైంటిస్టులకు కూడా ఒక మిస్టరీనే. వీటికి జబ్బులు పడటానికి గానీ, ఇన్ఫెక్షన్లు రావడానికి గానీ నిజమైన శరీరం ఏదీ ఉండదు కాబట్టి.. సైద్ధాంతికంగా చూస్తే ఇవి ఒక సాధారణ మనిషి కంటే కూడా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని ప్రొఫెసర్ ఆర్లోటా అంటున్నారు. ప్రస్తుతానికైతే వీటి ఆయుష్షు ఎంతో శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు.దిగ్భాంతిగొల్పిన ‘కైమీరా’! కణాల వయసు పెరిగే తీరును ఇంకా లోతుగా పరిశోధించడానికి, ప్రొఫెసర్ ఆర్లోటా ఒక ‘పిచ్చి ప్రయోగం’ చేశారు! ఏడాది వయసున్న కృత్రిమ మెదడు కణాలను తీసుకుని, కేవలం రెండు వారాల వయసున్న కృత్రిమ మెదడు కణాలతో కలిపి ఒక కొత్త ‘కైమీరా’ను తయారు చేశారు. రెండు వేర్వేరు జీవులకు లేదా రకాలకు చెందిన కణాలను కలిపి తయారు చేసిన ఒక కొత్త జీవి లేదా కణజాలమే ‘కైమీరా’.ఇందులో చిన్న వయసు కణాలు సాధారణంగానే స్పందించినప్పటికీ, పెద్ద వయసు కణాలు మాత్రం ఒక పెద్ద వింతను ప్రదర్శించాయి. అవి తమ ఎదుగుదల క్రమంలో చాలా ముందుకు దూసుకెళ్లిపోయాయి! అసలు సాధారణంగా రూపుదిద్దుకోవడానికి నాలుగు నెలల సమయం పట్టే నాడులను ఈ పెద్ద కణాలు తక్షణం తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రయోగం మెదడు ఎదుగుదల విషయంలో ‘సమయాన్నే మార్చేసిందని’, ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ ఆర్లోటా అభివర్ణించారు. మున్ముందు జరగబోయే ప్రయోగాల కోసం మెదడు కణాల ఎదుగుదలను వేగవంతం చేయడానికి ఈ వినూత్న కైమీరా పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశిస్తున్నారు. దీనివల్ల వయసు పైబడినప్పుడు వచ్చే మెదడు సంబంధిత సమస్యలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఏకంగా 20 ఏళ్ల పాటు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు!- సాక్షి స్పెషల్ డెస్క్ఇవీ చదవండి: ‘ఇదే నా ఇల్లు.. ఈయనే నా రాజు!’ పురావస్తు శాస్త్రవేత్తలకే షాక్! -
జియో రీచార్జ్ ప్లాన్: 200 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్లు!
దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు దేశీయ ప్రముఖ టెలికమ్ ఆపరేటర్ జియోలో ఆకర్షణీయ ప్లాన్ అందుబాటులో ఉంది. తరచూ రీచార్జ్ చేసుకునే అవసరం లేకుండా ఎక్కువ వ్యాలిడిటీతో పాటు డేటా, కాలింగ్, ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్, ఏఐ సేవలు అందించే ప్లాన్‌ను జియో అందిస్తోంది. రూ.2,025 ధర కలిగిన ఈ ప్లాన్ 200 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మొత్తం 500GB హైస్పీడ్ డేటాతో పాటు పలు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.2,025 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 500GB డేటా లభిస్తుంది. అంటే రోజుకు సగటున 2.5GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. నిర్దేశిత డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకు తగ్గుతుంది. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5G డేటా కూడా అందుబాటులో ఉంటుంది.డేటాతో పాటు ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది. అలాగే ప్రతిరోజూ 100 SMSలను ఉచితంగా పంపుకోవచ్చు. దీంతో కాలింగ్, SMS కోసం ప్రత్యేకంగా మరో ప్యాక్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు.ఈ ప్లాన్ ప్రత్యేకత కేవలం డేటా, కాలింగ్‌కే పరిమితం కాదు. ఇందులో జియో హాట్‌స్టార్ మొబైల్ (Mobile + Hollywood) సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అలాగే జియో ఏఐ క్లౌడ్‌లో 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ పొందవచ్చు.ఇక ఏఐ సేవలను వినియోగించుకునే వారికి మరో కీలక ప్రయోజనం ఉంది. అర్హత కలిగిన కస్టమర్లకు 18 నెలల గూగుల్ జెమినై ప్రో (Google Gemini Pro) సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వాస్తవంగా దీని విలువ రూ.35,100 ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో 5,000GB క్లౌడ్ స్టోరేజ్, న్యానో బనానా సహా పలు AI ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. -
ఒక టెక్నికల్ లోపం.. ప్రపంచానికి కొత్త ప్యాకింగ్ సొల్యూషన్!
బబుల్ రాప్.. ఈ రోజుల్లో దీని పాత్ర చెప్పలేనిది. ఆన్లైన్ షాపింగ్ వచ్చాక ప్యాకేజింగ్‌లో దీని అవసరం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణాలు, గాజు వస్తువులు ఒక్కటేమిటీ ప్రతీ వస్తువుకు రక్షణ కవచంలా మారిపోయింది. మరి ఇంతలా వినియోగిస్తున్న ఈ బబుల్ రాప్ కవర్..మీకు తెలుసా? బబుల్ రాప్ కథ అమెరికాలోని న్యూజెర్సీలో 1957లో మొదలైంది. ఆల్ఫ్రెడ్ ఫీల్డింగ్, మార్క్ చవాన్నెస్ అనే ఇద్దరు ఇంజనీర్లు తమ గ్యారేజీలో పని చేస్తూ.. గోడలకు ఒక కొత్త స్టైల్ ఇవ్వడానికి ప్లాస్టిక్ వాల్‌పేపర్‌ను తయారు చేయాలని భావించారు. దీని కోసం రెండు ప్లాస్టిక్ షీట్లను ఒక యంత్రం సాయంతో అతికించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు, యంత్రంలో ఒక చిన్న సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల రెండు ప్లాస్టిక్ షీట్ల మధ్య చిన్నచిన్న గాలి బుడగలు చిక్కుకుపోయాయి. బయటకు వచ్చిన షీట్ సాదాగా కాకుండా, బుడగలతో నిండి ఉంది. అయితే ఈ బుడగల వాల్ పేపర్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదు.1960లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బబుల్ రాప్కి మంచిరోజులొచ్చాయి. అప్పట్లో ఐబీఎం సంస్థ 1401 కంప్యూటర్ను లాంచ్ చేసింది. అది చాలా సున్నితమైన యంత్రం, కాబట్టి దానిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం పెద్ద సవాలుగా మారింది. అప్పుడు మార్క్ చవాన్నెస్ ఈ బబుల్ ప్లాస్టిక్‌ను ఆ సంస్థకి చూపించారు. ఆ గాలి బుడగలు వస్తువులకు రక్షణ కవచంలా పనిచేస్తాయని ఐబీఎం ఇంజనీర్లు గుర్తించారు. అలా తమ కంప్యూటర్లను సురక్షితంగా రవాణా చేయడానికి దీనిని వాడటం మొదలుపెట్టారు. దీంతో బబుల్ రాప్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నేటి ఈ–కామర్స్ కాలంలో ఈ బబుల్ రాప్ లేని పార్సిల్స్‌ను ఊహించడం అసాధ్యం.ఇవి కూడా చదవండి: నెల జీతంతో ఇంత కుటుంబాన్ని నడిపించేది ఎవరో తెలుసా? -
జియో రూ.55 రీచార్జ్ ప్లాన్: బెనిఫిట్స్ ఇవే..
తమ స్మార్ట్ఫోన్ల నుండే టీవీ ఛానెళ్లను చూడాలనుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 55 ధరతో లభించే జియోటీవీ ప్రో ప్యాక్, 30 రోజుల వ్యాలిడిటీతో పాటు, జియోటీవీ యాప్ ద్వారా 16కు పైగా భాషలలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్‌ను అందిస్తుంది.టీవీ ఛానెల్‌లతో పాటు, జియోటీవీ ప్రో ప్లాన్‌లో మొత్తం 3MB డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ కేవలం మూడు రోజులు మాత్రమే. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి వాయిస్ కాలింగ్ సదుపాయం లభించదు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ ప్యాక్ మాత్రమే.మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా మీ టీవీకి దూరంగా ఉన్న పరిస్థితులలో మీకు ఇష్టమైన టీవీ ఛానెల్‌ను చూడాలని కోరుకుంటున్నట్లయితే, దీని విస్తృతమైన ఛానెల్ కలెక్షన్, సరసమైన ధర కారణంగా ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవడం మంచిది. ఈ ప్యాక్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ జియో కస్టమర్లు ఇద్దరికీ అందుబాటులో ఉంది. -
బుధుడి చెంతకు ‘బెపి కొలంబో’!
బుధుడు... పరిమాణంలో మన చందమామ కంటే కొంచెం పెద్ద... సౌరవ్యవస్థలో అతి చిన్న గ్రహం... సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం కూడా... దీనికి సహజ చంద్రుళ్లు లేవు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు... ఇవి సౌరకుటుంబంలో శిలామయ అంతర గ్రహాలు. సౌరవ్యవస్థలోని ‘పాత నవగ్రహాల’ మాటకొస్తే… ప్లూటో గతంలో గ్రహం హోదా కోల్పోవడంతో అధికారికంగా అష్టగ్రహాలే మిగిలాయి. వీటిలో భూమిని తప్పిస్తే మిగతా ఏడు గ్రహాల్లో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అతి తక్కువగా అధ్యయనం చేసింది బుధుడి గురించే! అలాంటి బుధుడి సంగతేంతో తేల్చడానికి, ఆ గ్రహాన్ని జల్లెడపట్టి లోతుగా అధ్యయనం చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సంయుక్తంగా 2018లో ‘బెపి కొలంబో’ అంతరిక్ష మిషన్ ప్రయోగించాయి. ఇందులో భాగంగా జంట వ్యోమనౌకలు (ఉపగ్రహాలు) ఈ ఏడాది నవంబరులో బుధుడి కక్ష్యలో ప్రవేశించనున్నాయి. 1920-1984 మధ్యకాలంలో జీవించిన జూసెప్పీ బెపి కొలంబో ఇటలీకి చెందిన ఓ గణిత శాస్త్రజ్ఞుడు. బుధ, శుక్ర గ్రహాల వద్దకు తొలిసారిగా 1970వ దశకంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగించిన ‘మెరైనర్-10’ మిషన్‌లో ఆయన పాలుపంచుకున్నారు. బెపి కొలంబో సేవలను స్మరిస్తూ తాజా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. అప్పట్లో బుధ, శుక్ర గ్రహాలకు సమీపంగా వెళ్లిన ‘మెరైనర్-10’ అంతరిక్ష నౌక వాటి ఫొటోలు తీసి భూమికి పంపింది. ఆ తర్వాత 2004లో నాసా ప్రయోగించిన ‘మెసెంజర్’ వ్యోమనౌక (ఆర్బిటర్) తొలిసారిగా 2011లో బుధుడి కక్ష్యలో ప్రవేశించి 2015 వరకు ఆ గ్రహాన్ని మరింత అన్వేషించింది. జూసెప్పీ బెపి కొలంబోఇవీ బుధుడి విశేషాలు...బుధ గ్రహం సూర్యుడి నుంచి సగటున 5.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బుధుడిపై ఒకరోజు భూమిపై 58 రోజులతో సమానం. అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి బుధుడు అంత సమయం తీసుకుంటాడు. అలాగే 88 రోజులకోసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమణం పూర్తిచేస్తాడు. అంటే భూమిపై 88 రోజులు గడిస్తే బుధుడిపై ఏడాది పూర్తవుతుంది. బుధుడి ఉపరితల ఉష్ణోగ్రత పగటి వేళల్లో 430 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, రాత్రి సమయాల్లో మైనస్ 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా ఉంటాయి. ఈ గ్రహం వ్యాసం కేవలం 4,880 కిలోమీటర్లు. వాయువులతో కూడిన అతి పలుచని పొరతో అక్కడి వాతావరణం నిర్మితమైంది. బుధుడిని ‘విస్మరించిన లేదా నిర్లక్ష్యానికి గురైన’ గ్రహంగా పిలుస్తారు. కారణం- మన పొరుగు గ్రహాలైన శుక్రుడు, అంగారకుడితో పోలిస్తే బుధుడిని చేరుకోవడం, భూమి నుంచి దాన్ని అధ్యయనం చేయడం బహు కష్టం. సౌరవ్యవస్థలో సూర్యుడికి బుధుడు బాగా దగ్గరగా ఉంటాడు. సూర్యుడిది అఖండ గురుత్వ శక్తి. తన సమీపంలోని ఖగోళ వస్తువులను భానుడు అమిత వేగంతో ఆకర్షిస్తూ తనలోకి లాగేసుకుంటాడు. ఆ సౌర గురుత్వాకర్షణను దీటుగా ఎదుర్కొంటూ... దానికి వ్యతిరేకంగా తన వేగాన్ని బాగా తగ్గించుకుంటూ బుధుడిని చేరడానికి వ్యోమనౌక బోలెడు ఇంధనాన్ని మండించాలి! అందుకే ఈ ప్రయాణం సంక్లిష్టం, వ్యయభరితం. సూర్యుడి వేడికి వ్యోమనౌకలోని సైంటిఫిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ భాగాలు కాలిపోతాయి. వ్యోమనౌక భానుడికి అతి చేరువగా ఉంటుంది కనుక పగటి వేళ భూమ్మీది టెలిస్కోపులు సూర్యకాంతి ధగధగల్లో దాన్ని చూడలేవు. ఇన్ని పరిమితులున్నందునే కేవలం రెండు మిషన్లే (మెరైనర్-10, మెసెంజర్) బుధుడిని సందర్శించాయి. బుధుడి ఆవిర్భావం, తదనంతర పరిణామాలు, ఉపరితల స్వరూపం, అంతర్గత నిర్మాణం, రసాయన కూర్పు, వాతావరణం, గతిశీల-బలహీన అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయడం ‘బెపి కొలంబో’ మిషన్ లక్ష్యం. 2018 అక్టోబరు 20న ఫ్రెంచ్ గయానాలోని కౌరూ స్పేస్ పోర్టు నుంచి ఏరియన్-5 రాకెట్ ప్రయోగించి ఇందుకు శ్రీకారం చుట్టారు. చుట్టూ తిరిగి వెళ్లే మార్గంలో భాగంగా ఈ మిషన్ ఇప్పటివరకు వెయ్యి కోట్ల కిలోమీటర్ల దూరం పైగా ప్రయాణించింది.‘మెర్కురీ హాలోస్’పై డేగ కన్ను!చివరిసారిగా 2025 జనవరి 8న బుధుడి సమీపానికి వెళ్లినప్పుడు... ఆ గ్రహంపై అగ్నిపర్వత మైదానాలు, ఉల్కలు/గ్రహశకలాలు వంటి ఖగోళ వస్తువులు ఢీకొని ఉపరితలంపై ఏర్పడిన బిలాల తాలూకు అచ్చెరువొందించే ఫొటోలు తీసింది ‘బెపి కొలంబో’ మిషన్. బుధుడి ఉపరితల శిలల్లో ముఖ్యంగా గంధకం వంటి అస్థిర ఖనిజాలు సూర్యుడి వేడికి ఉత్పతనం చెందుతున్నట్టు 1974లో ‘మెరైనర్-10’ అంతరిక్ష నౌక గమనించింది. అక్కడి సల్ఫర్ వంటి అస్థిర మూలకాలు ద్రవస్థితిలోకి మారకుండానే ఘనస్థితి నుంచి నేరుగా వాయురూపంలో ఆవిరైపోవడంతో ఆ ప్రాంతాల్లో తక్కువ లోతుతో ప్రకాశవంతమైన విలక్షణ గుంతలు ఏర్పడ్డాయి. ‘మెర్క్యురి హాలోస్’గా పిలిచే వీటిపైనా ‘బెపి కొలంబో’ ఓ కన్నేస్తుంది. సూర్యుడికి అతి సమీపంగా ఉన్న గ్రహం కనుక విపరీత వేడిమిని తట్టుకునేలా జంట వ్యోమనౌకలను రూపొందించారు. ‘బెపి కొలంబో’ మిషన్ వ్యయం 1.65 బిలియన్ యూరోలు. మన కరెన్సీలో ఇది సుమారు రూ.18,100 కోట్లు. రాకెట్ ప్రయోగ వ్యయం, ఎంపీవో, ఎంటీవోల రూపకల్పన, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి రూ.14,275 కోట్ల మేర సింహభాగాన్ని ఈఎస్ఏ భరించింది. ఎంఎంవో తయారీ సహా మిగతా ఖర్చును ‘జాక్సా’ పెట్టుకుంది.రెండు కళ్లు... మాగ్నెటోస్ఫెరిక్, ప్లానెటరీ ఆర్బిటర్స్!‘బెపి కొలంబో’ మిషన్‌లో ప్రధానంగా చెప్పాల్సింది రెండు వ్యోమనౌకల గురించి. ఇవి ఆర్బిటర్స్. బుధుడి కక్ష్యలో ఉపగ్రహాల్లా తిరుగుతూ ఆ గ్రహాన్ని శోధిస్తాయి. ఈ జంట వ్యోమనౌకలు... ‘మెర్క్యురీ మాగ్నెటోస్ఫెరిక్ ఆర్బిటర్’ (ఎంఎంవో), ‘మెర్క్యురీ ప్లానెటరీ ఆర్బిటర్’ (ఎంపీవో). బుధుడి అయస్కాంత వాతావరణాన్ని అధ్యయనం చేసే ఎంఎంవోను ‘జాక్సా’ రూపొందించింది. ఈ వ్యోమనౌకలో ప్లాస్మా వేవ్ ఇన్స్ట్రుమెంట్, మాగ్నెటోమీటర్, సోడియం అట్మాస్ఫియర్ స్పెక్ట్రల్ ఇమేజర్, డస్ట్ మానిటర్, ప్లాస్మా పార్టికిల్ ఎక్స్పరిమెంట్ పరికరాలు అమర్చారు. ఇవి అయాన్లు, ఎలక్ట్రాన్లను విశ్లేషించడంతోపాటు సౌరగాలి ప్రభావానికి బుధ గ్రహం ఎలా ప్రతిస్పందిస్తుందో పరిశీలిస్తాయి. ఇక బుధుడి ఉపరితలం, అంతర నిర్మాణాన్నిఅధ్యయనం చేసే పరికరాలున్న ఎంపీవోను యూరోపియన్ అంతరిక్ష సంస్థ తయారుచేసింది. ఈ వ్యోమనౌకలో బెపి కొలంబో లేజర్ ఆల్టిమీటర్, ఇమేజింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్, గామా-రే & న్యూట్రాన్ స్పెక్ట్రోమీటర్, సోలార్ ఇంటెన్సిటీ ఎక్స్-రే & పార్టికిల్ స్పెక్ట్రోమీటర్, మాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ వంటి డజను శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. ఇవి బుధుడి ధ్రువ ప్రాంతాల్లోని మంచును, ఉపరితల ద్రోణుల్ని పరిశీలించి గ్రహపు అంతర్గత క్రియాశీలతను తెలుసుకుంటాయి. ఈ జంట అంతరిక్ష నౌకలను మాతృ నౌక ‘మెర్క్యురీ ట్రాన్స్ఫర్ మాడ్యూల్’ (ఎంటీఎం) బుధుడి చెంతకు మోసుకెళ్లింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కలసికట్టుగా కోట్లాది కిలోమీటర్ల దూరం సాగిన వీటి పయనం గురువారం కీలక మలుపు తీసుకుంది. ఎంటీఎం నుంచి విడిపోయి ఎంఎంవో, ఎంపీవోలు ఒకే జంటగా బుధుడికేసి ప్రయాణం ఆరంభించాయి. లక్ష్యానికి ప్రస్తుతం 33 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆర్బిటర్లు నవంబరు 21న జంటగానే బుధుడి కక్ష్యలో ప్రవేశించనున్నాయి. అనంతరం కక్ష్యలో ఈ ఏడాది డిసెంబరు 9-10 తేదీల్లో అవి రెండూ విడిపోయి వేర్వేరు ఎత్తుల నుంచి బుధ గ్రహాన్ని మ్యాపింగ్ చేస్తాయి. మెర్క్యురీ ప్లానెటరీ ఆర్బిటర్ (ఎంపీవో) బుధుడికి 480 X 1,500 కిలోమీటర్ల కక్ష్యలో, మెర్క్యురీ మాగ్నెటోస్ఫెరిక్ ఆర్బిటర్ (ఎంఎంవో) 590 X 11,640 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలోనూ ఉంటూ పరిశోధనలు చేపడతాయి.- జమ్ముల శ్రీకాంత్ (Courtesy: European Space Agency, JAXA, Forbes, The Manila Times, ‘nature’ magazine). -
పాత కంప్యూటర్ స్పీడ్ పెంచే జియో సర్వీస్
కంప్యూటర్ కొన్నేళ్లు వాడిన తర్వాత నెమ్మదించడం సహజమే. స్టోరేజ్ తగ్గిపోవడం, ర్యామ్ సరిపోకపోవడం, కొత్త సాఫ్ట్వేర్లు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయంలో.. చాలామంది కొత్త కంప్యూటర్ కొనాలని ఆలోచిస్తారు. కానీ అలాంటి వారికోసం రిలయన్స్ జియో 'జియోపీసీ' సేవలను తీసుకొచ్చింది.జియోపీసీ అనేది ఒక క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ సర్వీస్. అంటే.. మీ దగ్గర ఉన్న పాత కంప్యూటర్లోనే క్లౌడ్ ద్వారా అదనపు ర్యామ్, స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో కంప్యూటర్ పాతదైనా కొత్త అప్లికేషన్లు, సాఫ్ట్వేర్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది.గతంలో జియోపీసీ అనేది కేవలం జియోహోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఏ కంపెనీకి చెందిన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా.. ఈ సేవను తీసుకోవచ్చు. అంటే జియో సిమ్ లేదా జియో బ్రాడ్‌బ్యాండ్ తప్పనిసరి కాదు.రూ.1,000 నుంచే ప్లాన్స్!జియోపీసీలో ప్రస్తుతం రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. సాధారణ జియోపీసీ ప్లాన్‌లో 8జీబీ ర్యామ్, 500 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. జియోపీసీ అల్ట్రాలో 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ లభిస్తుంది.రెండు నెలల జియోపీసీ ప్లాన్ ధర రూ.1,000 నుంచి ప్రారంభమవుతుంది. జియోపీసీ అల్ట్రా రెండు నెలలకు రూ.1,200గా ఉంది. ఏడాదికి కావాలంటే కూడా దీనికోసం తగిన ప్లాన్ ఎంచుకోవచ్చు. దీనికోసం సంస్థ మల్టిపుల్ ప్లాన్స్ అందిస్తోంది. మూడు, నాలుగేళ్లుగా కంప్యూటర్లను వాడుతున్న వారికి జియోపీసీ చాలా ఉపయోగపడుతుంది. ఎనిమిదేళ్ల పాత కంప్యూటర్లలో కూడా జియోపీసీ ద్వారా ఏఐ ఆధారిత అప్లికేషన్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఎందుకంటే.. ఎక్కువ కంప్యూటింగ్ అవసరమయ్యే పనులు క్లౌడ్‌లో జరుగుతాయి.పాత కంప్యూటర్ ఉపయోగించేవారు.. రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియోపీసీ ఉపయోగించుకుంటే బహుశా వెంటనే కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, ఇళ్లలో కంప్యూటర్ వాడేవారు, చిన్న వ్యాపారాలు, ప్రొఫెషనల్స్‌కు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం! -
భారత్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ‘వియోనా’ యూపీఐ స్విచ్ సేవలు
దేశీయ డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాల రంగంలో హైదరాబాద్‌కు చెందిన ఫిన్‌టెక్ సంస్థ వియోనా ఫిన్‌టెక్ కీలక మైలురాయిని అధిగమించింది. భారత్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో తన యూపీఐ స్విచ్ (UPI Switch) సాంకేతికతను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఈ సాంకేతిక అనుసంధానం ద్వారా భారత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇకపై నేరుగా యూపీఐ నెట్‌వర్క్‌తో అనుసంధానమై లావాదేవీల రూటింగ్, పర్యవేక్షణ, ఆపరేషనల్ కంట్రోల్స్ నిర్వహించనుంది.కేవలం యాప్‌లు నిర్మించడమే కాకుండా బ్యాంకింగ్ రంగానికి అవసరమైన సాంకేతిక మౌలిక వసతులను అందించడంపై వియోనా దృష్టి సారించింది. యూపీఐ, ఐఎంపీఎస్ స్విచింగ్, ఇంటర్నెట్-మొబైల్ బ్యాంకింగ్, భారత్ కనెక్ట్ (బీబీపీఎస్) సహా మర్చంట్ పేమెంట్స్, రికవరీలకు సంబంధించిన సమగ్ర సేవలను ఈ సంస్థ అందిస్తోంది.‘సాంకేతికతను అభివృద్ధి చేసి సర్టిఫికేషన్ పొందడం ఒక ఎత్తైతే, ఒక ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రత్యక్ష లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించడం మరో ఎత్తు. ఈ విజయంతో మరింత విస్తృతంగా సేవలు అందించే అవకాశం లభించింది’ అని వియోనా ఫిన్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రనాథ్ యార్లగడ్డ తెలిపారు. కస్టమర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపు చేసే కొద్ది సెకన్ల వ్యవధిలో వ్యవస్థ వెనుక జరిగే సురక్షిత లావాదేవీల ప్రక్రియే డిజిటల్ చెల్లింపుల విశ్వసనీయతను నిర్దేశిస్తుందని ఆయన పేర్కొన్నారు.భద్రత, నియంత్రణ నిబంధనలకు లోబడి తమ సాంకేతికతను ఆధునీకరించుకోవాలనుకునే కో-ఆపరేటివ్, ప్రాంతీయ బ్యాంకులను ప్రధాన అవకాశంగా వియోనా భావిస్తోంది. దేశీయ ఇంజినీర్లతో రూపొందించిన ఈ యూపీఐ స్విచింగ్ సాంకేతికత రాబోయే రోజుల్లో ఇతర బ్యాంకులను ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: డిజిటల్ విప్లవంలో జియో పదేళ్ల ప్రస్థానం! -
ఏఐని చూసి జెన్జీలు ఎందుకు భయపడుతున్నారు?
కాలం వేగం పుంజుకుంటోంది. టెక్నాలజీ శరవేగంగా దూసుకెళుతోంది. గడచిన వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘టెక్’ మార్పులపై ఓ లుక్ వేద్దామా?1.ఏఐతో సైబర్ దాడులు!ఏఐ ఆధారిత సైబర్ దాడులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని టెక్ సంస్థలు హెచ్చరించాయి. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ సహా 100కుపైగా సంస్థలు ఈ ముప్పును ఎదుర్కొనేందుకు సైబర్ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి.2. హ్యాక్ చేసింది!ఓపెన్ ఏఐ నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ పరీక్షలో ఏఐ ఏజెంట్లు శాండ్బాక్స్ నుంచి బయటపడి ఇంటర్నెట్లోకి వెళ్లి, మరో ఏఐ ఏజెంట్‌తో కమ్యూనికేట్ చేస్తూ హగ్గింగ్ ఫేస్ సంస్థ ΄్లాట్‌ఫామ్‌ను హ్యాక్ చేశాయి. ఏఐకి సైబర్ నైపుణ్యాలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక హెచ్చరికగా భావించవచ్చు..3. 399కే ‘బాతు’ రోబోట్!హగ్గింగ్ ఫేస్ సంస్థ ‘మైక్రోడక్’ పేరుతో ఓ చిన్న ఓపె¯Œ సోర్స్ రోబోను విడుదల చేసింది. కేవలం 25 సెంటీమీటర్ల ఎత్తు, సుమారు 800 గ్రాముల బరువున్న ఈ రోబోను యూజర్లు తమకు కావాల్సిన పనులు నేర్పించుకునేలా రూ΄÷ందించారు. దీని ధర 399 డాలర్లు.4. మాట్లాడే ఆడియో సిస్టమ్!సోనోస్ సంస్థ కొత్త హెడ్ఫో¯Œ ్స, సౌండ్‌బార్‌తో ΄ాటు ‘సోనోస్ 27’ అనే కొత్త ఆడియో ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రకటించింది. ఇందులో ఏఐ అసిస్టెంట్లు, చాట్ జీపీటీ ఆధారిత మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండటంతో ఆడియో గ్యాడ్జెట్లు కూడా ఏఐ వైపు వేగంగా మారుతున్నాయి.5. ఇన్‌స్టా షాక్!ఏఐతో తయారైన వ్యక్తులను నిజమైన మనుషులుగా చూపించే అకౌంట్లపై ఇన్స్టాగ్రామ్ కఠినంగా వ్యవహరించనుంది. ఏఐ జనరేటెడ్ ్ర΄÷ఫైల్ అని వెల్లడించకుండా కంటెంట్ పెట్టే అకౌంట్ల రీచ్‌ను తగ్గించనున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్‌పై ΄ారదర్శకత పెంచడమే దీని ఉద్దేశం.6. మీ మాటల్లో ఐదు భారతీయ భాషలుమెటా సంస్థ ‘మ్యూస్ వాయిస్ ట్రాన్స్క్రైబ్’ పేరుతో కొత్త రియల్‌టైమ్ స్పీచ్–టు–టెక్ట్స్ ఏఐ మోడల్‌ను ప్రకటించింది. ఇది తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి భారతీయ భాషలతో సహా 70కుపైగా భాషలపై శిక్షణ ΄÷ందింది. ఒకే సంభాషణలో భాషలు మారినా అర్థం చేసుకోవడం దీని ప్రత్యేకత.7. భారత్‌కు సొంత ఏఐ స్టాక్!బెంగళూరుకు చెందిన ‘జ్ఞాని అర్థ’ భారతీయ సంస్థలు, ప్రభుత్వ సంస్థల కోసం సోవరిన్ ఏఐ స్టాక్‌ను ప్రకటించింది. భారతీయ భాషలు, లిపులకు అనుగుణంగా రూ΄÷ందించిన టెక్నాలజీతో ఏఐ వినియోగ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.8. ఏఐ అంటే జెన్జీలకే భయం!గ్లాస్ డోర్ ఫ్లాట్ ఫాం అధ్యయనం ప్రకారం ఇతర వయసుల ఉద్యోగులతో పోలిస్తే జెన్ జీలు ఏఐ టూల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఏఐ వల్ల ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా వారిలోనే ఎక్కువగా ఉందట. అంటే ఏఐని ఎక్కువగా వాడుతున్న వారే భవిష్యత్తుపై ఎక్కువగా బెంగపెట్టుకున్నారన్నమాట.ఇవి కూడా చదవండి: వరదలో కొట్టుకుపోయే పరిస్థితి.. దుపట్టాతో రక్షించిన వధువు! -
జియో రూ.200 రీచార్జ్ ప్లాన్: ప్రయోజనాలివే..
భారతదేశపు ప్రముఖ టెలికాం ప్రొవైడర్ రిలయన్స్ జియో లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో రూ.200 ప్లాన్ ఒకటి. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రిలయన్స్ జియో రూ.200 ప్లాన్ అనేది ఓటీటీ పాస్ యాడ్-ఆన్ ప్యాక్. దీని ద్వారా కుకు టీవీతో పాటు 15 ఓటీటీ తో సహా ప్లాట్‌ఫారమ్‌ల సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు, కాగా 30 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ కేవలం డేటా ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది. ఇందులో ఎలాంటి వాయిస్ కాలింగ్ సదుపాయం లభించదు.టీవీ, టాబ్లెట్, మొబైల్లో ప్రకటనలు లేకుండా యూట్యూబ్ ప్రీమియం వీక్షించవచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, ఆఫ్‌లైన్ డౌన్లోడ్లు కూడా లభిస్తాయి. మొత్తం మీద లైవ్ టీవీ ఛానెల్‌లు, అదనపు వినోద ప్రయోజనాల కోసం ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని ఏఐ చాట్బాట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు దేశాల్లోని వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు లక్షలాదిమందికి పైగా వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో సమస్యను నివేదించినట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది.ఈ అంతరాయం కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. కాబట్టి ఈ సమస్య భారతదేశంతో పాటు.. యూకే, ఫ్రాన్స్, బెల్జియం, టర్కీ, జోర్డాన్, జార్జియా, గ్రీస్, స్పెయిన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, స్విట్జర్లాండ్లలో కూడా తలెత్తింది. వినియోగదారులు జెమిని యాప్, ఏఐ జనరేషన్, లాగిన్, వెబ్సైట్ యాక్సెస్, లేటెన్సీతో సమస్యలను ఎదుర్కొంటున్నారు.చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని ఏఐ సమస్యలపై సంబంధింత సంస్థలు అధికారికంగా స్పందించలేదు. అంతే కాకుండా సమస్యలకు కారణాన్ని కూడా వెల్లడించకపోవడం గమనార్హం. బహుశా ఈ సమస్య త్వరగానే పరిష్కరించబడే అవకాశం ఉంది.ChatGPT and Claude both are down, what am I supposed to do now? pic.twitter.com/rmDpRReQt6— Bhavani Ravi (@BhavaniRavi_) September 3, 2026BREAKING: ChatGPT is currently down for many users. https://t.co/OJtj75vPEL— Polymarket (@Polymarket) September 3, 2026 -
మొబైల్ నంబర్ వెనుక ఇంత కథ ఉందా?
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేనివారి దాదాపు ఉండరు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మన రోజువారి జీవితంలో మొబైల్ నంబర్ చాలా ముఖ్యమైనది. ఎవరి ఫోన్ నెంబర్ అడిగినా వెంటనే 10 అంకెలే చెబుతారు. అయితే.. మన మొబైల్ నంబరులో 10 అంకెలే ఎందుకు ఉన్నాయి?, అందులో కూడా ఎక్కువగా 9, 8, 7, 6తోనే ఎందుకు మొదలవుతాయి? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.10 అంకెలే ఎందుకు?భారత్‌లో టెలికాం నెంబర్ల కేటాయింపును డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా నెంబర్లను సరిగ్గా కేటాయించేందుకు నేషనల్ నంబరింగ్ ప్లాన్ (NNP) ఉంది. 2003లో రూపొందించిన ఈ ప్లాన్‌లో మొబైల్ సేవలకు 10 అంకెల నంబరింగ్ విధానాన్ని కొనసాగించారు. సింపుల్‌గా చెప్పాలంటే.. దేశంలో మొబైల్ వాడకం భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని ముందే అంచనా వేసి, ఎక్కువ మందికి ప్రత్యేకమైన నంబర్లను ఇవ్వడానికి 10 అంకెల విధానాన్ని ఉపయోగించారు.9, 8, 7, 6తోనే ఎందుకు..మొదట్లో మొబైల్ నంబర్ల కోసం 9 సిరీస్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. కాలక్రమేణా మొబైల్ కనెక్షన్లు భారీగా పెరగడంతో 9 సిరీస్‌లో అందుబాటులో ఉన్న నంబర్లు తగ్గిపోయాయి. దీంతో కొత్త నంబర్ల కోసం 8, ఆ తర్వాత 7, 6 సిరీస్‌లను కూడా మొబైల్ సేవలకు కేటాయించారు. ఇక 0, 1 వంటి అంకెలను ప్రత్యేక సేవలు, షార్ట్ కోడ్లు, ఇతర టెలికాం అవసరాలకు ఉపయోగిస్తారు. అందుకే మనం సాధారణంగా 6, 7, 8, 9తో మొదలయ్యే మొబైల్ నంబర్లను ఎక్కువగా చూస్తుంటాం.10 అంకెలతో ఎన్ని నంబర్లు వస్తాయి?10 అంకెలు ఉన్నాయంటే భారీ సంఖ్యలో నంబర్ల కలయికలను తయారు చేయవచ్చు. అయితే.. అందులో ప్రతి కలయికను మొబైల్ నంబర్‌గా ఉపయోగించరు. కొన్ని నంబరింగ్ సిరీస్‌లను ఫిక్స్డ్ లైన్లు, ప్రభుత్వ సేవలు, ప్రత్యేక సేవలు, ఇతర టెలికాం అవసరాల కోసం కేటాయిస్తారు. మొదట్లో 9 సిరీస్‌ను మాత్రమే మొబైల్ సేవలకు ఉపయోగించినప్పటికీ.. వినియోగదారులు పెరిగేకొద్దీ 8, 7, 6 సిరీస్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.భవిష్యత్తులో నంబర్ మారుతుందా?భారతదేశంలో మొబైల్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నంబరింగ్ వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ కూడా నంబరింగ్ ప్లాన్‌లో మార్పులపై సిఫారసులు చేసింది. అయితే.. ప్రస్తుతం ఉన్న మొబైల్ నుంచి మొబైల్ కాలింగ్ విధానాన్ని కొనసాగించాలని సిఫారసు చేశారు. అంటే.. ప్రస్తుతానికి మన 10 అంకెల మొబైల్ నంబర్ విధానం మారే అవకాశం లేదు. కాగా.. మొబైల్ నంబర్ ముందు కనిపించే +91 అనేది మన దేశ కంట్రీ కోడ్. విదేశాల నుంచి భారత్‌లోని నంబర్‌కు కాల్ చేసినప్పుడు +91 తర్వాత మన 10 అంకెల మొబైల్ నంబర్‌ను డయల్ చేస్తారు. -
బెస్ట్ ఫీచర్లతో వివో టీ5 స్మార్ట్‌ఫోన్..
స్మార్ట్ఫోన్ల దిగ్గజం వివో తమ సిరీస్–టీ పోర్ట్‌ఫోలియోలో భాగంగా టీ5 హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్, 6.83 అంగుళాల 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సోనీ ఐఎంక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది.సెప్టెంబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ–స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. రూ. 4,000 వరకు డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ తదితర ఆఫర్లను సంస్థ అందిస్తోంది. ఆఫర్లను కూడా ఉపయోగించుకుంటే ధర దాదాపు రూ. 31,499 నుంచి ప్రారంభమవుతుంది. -
ఒక్క క్లిక్‌తో బ్యాంకు అకౌంట్ ఖాళీ! కేంద్రం హెచ్చరిక
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు ఫోన్ కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కావడం లేదు. సోషల్ మీడియా ప్రకటనలనే ఎరగా వేసుకుని మొబైల్ ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకునే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే కొన్ని ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా హానికరమైన ఆండ్రాయిడ్ యాప్‌లను డౌన్లోడ్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు చెందిన నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) ఈ ప్రమాదంపై ఆగస్టు 26న అడ్వైజరీ జారీ చేసింది. ‘నైట్ ప్లే’, ‘రిలూప్’, ‘కైస్’, ‘విమో’, ‘రివో’, ‘నెక్సో’, ‘విక్సా’ తదితర పేర్లతో ఇలాంటి యాప్‌లు ప్రచారం అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి పేర్లతో మరిన్ని వేరియంట్లు ఉండొచ్చని కూడా హెచ్చరించారు.ప్రకటన నుంచి మోసం మొదలవుతుందిలా..ముందుగా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన లేదా అడల్ట్ కంటెంట్‌కు సంబంధించిన ప్రకటన కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరో వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ వీడియో లేదా ఇతర కంటెంట్ చూడాలంటే ప్రత్యేక యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తుంది.ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. గూగుల్ ప్లే స్టోర్‌కు బదులుగా వెబ్సైట్ నుంచి APK ఫైల్‌ను నేరుగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకునేలా వినియోగదారులను ప్రలోభపెడతారు. అధికారిక యాప్ స్టోర్ భద్రతా తనిఖీలను దాటేసి ఫోన్లోకి మాల్వేర్ చేరే అవకాశం ఇక్కడే ఏర్పడుతుంది.యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది?యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత సాధారణంగా అవసరం లేని సున్నితమైన అనుమతులను కోరుతుంది. ముఖ్యంగా Accessibility Permissionను ఇవ్వాలని అడగవచ్చు. ఈ అనుమతిని దుర్వినియోగం చేస్తే మాల్వేర్ ఫోన్ స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని చదవడం, ఇతర యాప్‌లతో పరస్పరం పనిచేయడం, వినియోగదారు తరఫున కొన్ని చర్యలు చేయడం వంటి పనులు చేయగలదు.దీంతో బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లలో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో OTPలు, PINలు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించి అనధికారిక ఆర్థిక లావాదేవీలకు పాల్పడే ప్రమాదం ఉంది.‘అప్డేట్’ పేరుతో మరో యాప్ కూడా..మోసం ఇక్కడితో ఆగకపోవచ్చు. మొదట ఇన్స్టాల్ చేసిన యాప్.. అప్డేట్ పేరుతో మరో ప్యాకేజీని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయవచ్చు. కొన్ని వేరియంట్లు VPNను కూడా ఇన్స్టాల్ చేయగలవని I4C హెచ్చరించింది. దీంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ దాడి చేసేవారి నియంత్రణలోని సర్వర్ల ద్వారా వెళ్లే అవకాశం ఉంటుంది.మరికొన్ని సందర్భాల్లో హానికరమైన యాప్‌ను సాధారణ పద్ధతిలో అన్ఇన్స్టాల్ చేయకుండా అడ్డుకునే సామర్థ్యం కూడా ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు.ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తమీ ఫోన్లో అకస్మాత్తుగా తెలియని యాప్ కనిపించడం, మీ ప్రమేయం లేకుండానే స్క్రీన్‌పై ట్యాపింగ్ జరగడం, గుర్తు తెలియని VPN కనిపించడం లేదా Accessibility సెట్టింగ్స్‌లో అనుమానాస్పద యాప్‌కు యాక్సెస్ ఉండటం వంటివి ప్రమాద సంకేతాలు కావచ్చు.ప్రత్యేకించి ఏదైనా యాప్ పని చేయాలంటే Accessibility Access వంటి అధిక స్థాయి అనుమతి తప్పనిసరిగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తే అప్రమత్తంగా ఉండాలి.ఆండ్రాయిడ్ యూజర్లు ఏం చేయాలి?I4C సూచనల ప్రకారం వినియోగదారులు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.యాప్‌లను సాధ్యమైనంత వరకు గూగుల్ ప్లే స్టోర్ లేదా విశ్వసనీయ యాప్ స్టోర్ల నుంచే ఇన్స్టాల్ చేయాలి.సోషల్ మీడియా ప్రకటనలు, వెబ్సైట్లు, అనుమానాస్పద లింకుల ద్వారా వచ్చే APK ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదు.‘గూగుల్‌ప్లే ప్రొటెక్ట్’ను ఆన్‌లో ఉంచాలి.ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.తెలియని యాప్‌లకు Accessibility Permission ఇవ్వకూడదు.ఫోన్లోని ఇన్స్టాల్ చేసిన యాప్‌లను తరచూ పరిశీలించాలి.గుర్తు తెలియని యాప్ కనిపిస్తే వెంటనే తొలగించాలి.బ్యాంక్, UPI లావాదేవీలను క్రమం తప్పకుండా పరిశీలించాలి.ఇప్పటికే మోసపోయారా? వెంటనే 1930కు కాల్ చేయండిఅనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాంక్ ఖాతాలో అనధికారిక లావాదేవీ జరిగినా, ఫోన్ నియంత్రణ కోల్పోయినట్లు అనిపించినా ఆలస్యం చేయకూడదు. జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరాలను అధికారిక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా నివేదించవచ్చు. 1930 హెల్ప్‌లైన్ 24 గంటలూ అందుబాటులో ఉంది.మాల్వేర్ తొలగించడం సాధ్యం కాకపోతే ముఖ్యమైన డేటాను సురక్షితంగా బ్యాకప్ చేసుకున్న తర్వాత ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని కేంద్రం సూచించింది.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా ఒత్తిడిఈ తరహా మోసాలపై ప్రభుత్వ హెచ్చరికల తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటా కూడా అనేక అనుమానాస్పద ప్రకటనలను తొలగించింది. అయితే ప్రభుత్వ హెచ్చరిక వెలువడిన తర్వాత కూడా కొన్ని ప్రకటనలు కనిపించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో మోసపూరిత ప్రకటనలను గుర్తించి తొలగించడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతపై మరోసారి చర్చ మొదలైంది. -
పంటి మెరుపులకు ఏఐ నిఘా!
హోమ్ అప్లయెన్సెస్, టెక్నాలజీ దిగ్గజం ‘డైసన్’ (Dyson) నోటి ఆరోగ్య సంరక్షణ (ఓరల్ కేర్) విభాగంలో కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ కెమెరా సాంకేతికతల కలయికతో ‘కెమెరాజెట్’ పేరుతో రూపొందించిన ఓ స్మార్ట్ టూత్‌బ్రష్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను 499 డాలర్లు(సుమారు రూ.47,000)గా నిర్ణయించారు.ఈ డివైజ్ కేవలం బ్రష్ చేయడానికే పరిమితం కాకుండా ఒకే సమయంలో బ్రషింగ్, ఫ్లాసింగ్ (Flossing) రెండింటినీ పూర్తిచేసేలా రూపుదిద్దుకుంది. అంటే.. నోటి శుభ్రతలో పంటి సందుల నడుమ పేరుకుపోయే ప్లాక్, ఆహార వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా డైసన్ ఇంజినీర్లు దీనిని డిజైన్ చేశారు.సాంకేతిక పరిజ్ఞానం – పనితీరుఈ టూత్బ్రష్లోని ఏఐ సిస్టమ్‌కు దాదాపు 4,70,000 డెంటల్ ఇమేజెస్‌తో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఇది దంతాల నిర్మాణం, పళ్ళ మధ్య ఉండే ఖాళీలను కచ్చితత్వంతో గుర్తించగలదు. బ్రష్ హెడ్లో అమర్చిన మైక్రో కెమెరా పళ్ళ సందులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేస్తుంది. దంతాల మధ్య ఖాళీలను కెమెరా గుర్తించిన మరుక్షణమే బ్రష్ నుంచి మౌత్‌వాష్ స్ప్రే సరిపడా ప్రెషర్‌తో పళ్లపై చిమ్ముతుంది. దీనివల్ల వాటి మధ్య పేరుకున్న వ్యర్థాలు తక్షణమే తొలగిపోతాయి.Dyson has launched the $499 CameraJet toothbrush, using AI trained on 470,000 dental images. A built-in camera identifies gaps between teeth and triggers a precision jet of mouthwash in real time effectively combining brushing and flossing in one device. pic.twitter.com/Et0JYCuwmv— Harsh Goenka (@hvgoenka) September 2, 2026సాధారణంగా బ్రషింగ్ తర్వాత విడిగా ఫ్లాసింగ్ చేయడం లేదా మౌత్‌వాష్ ఉపయోగించడం చాలామందికి అలవాటు ఉండదు. కానీ కెమెరాజెట్ పరికరం ఈ రెండు ప్రక్రియలను ఒక్కటిగా మార్చి వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది. దాంతోపాటు దంత సమస్యలైన చిగుళ్ళ వ్యాధులు, పిప్పిపళ్ళు వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.ఇదీ చదవండి: రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం! -
ఏఐ ని ఉపయోగించండి... కానీ గుడ్డిగా నమ్మకండి !
మా తమ్ముడు ఐటీ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడేవాడు కాడు కానీ చదువులో చురుకైన వాడు. గత నాలుగేళ్లుగా హైబ్రిడ్ మోడ్‌లో పనిచేస్తున్నాడు. ఆరు నెలలుగా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇటీవల కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ముఖ్యంగా ఏఐ చాట్‌బాట్‌తో గంటల తరబడి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మనకు కనిపిస్తున్నట్టు నిజాలు కావని, ఏలియన్స్ ఉన్నాయని, ప్రపంచంలో త్వరలో ప్రళయం రాబోతోందని చెబుతున్నాడు. ఆ ప్రళయాన్ని ఆపడానికి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నానని, ఆ సాఫ్ట్‌వేర్‌ను అందరి ఫోన్లలో పెట్టిస్తే ప్రపంచాన్ని కాపాడవచ్చని అంటున్నాడు. అంతేకాదు, తన ప్రాజెక్టు గురించి ఎలన్ మస్క్‌కు, అమెరికా ప్రభుత్వానికి తెలిసిపోయిందని, ఉపగ్రహాల ద్వారా తనను గమనిస్తున్నారని, తన ఫొటోలు తీస్తున్నారని, తన ప్రాజెక్టును అడ్డుకోవడానికి తనపై కుట్ర జరుగుతోందంటూ ఇంటి నుంచి బయటకు రావడం మానేశాడు. స్నానం, తిండి, నిద్ర కూడా సరిగా లేవు. ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఇంట్లో లైట్లు ఆపేసి ఉంచుతాడు. గట్టిగా మాట్లాడితే అమెరికాకు తెలిసిపోతుందంటాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రావడం లేదు. ఇంత తెలివైన వాడు కాస్తా ఇలా మారిపోవడంతో మాకు చాలా భయంగా ఉంది. మేము ఏం చేయాలి? – రమేశ్, తిరుపతిమీరు వివరించిన పరిస్థితిని బట్టి మీ తమ్ముడిలో సైకోసిస్‌కు సంబంధించిన స్పష్టమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. తనను అమెరికా ప్రభుత్వం, ఉపగ్రహాలు గమనిస్తున్నాయని నమ్మడం, తనపై కుట్ర జరుగుతోందని భావించడం, ప్రపంచాన్ని కాపాడే ప్రత్యేక బాధ్యత తనకుందని అనుకోవడం వంటి వాటిని భ్రమాత్మక నమ్మకాలు అంటే డెల్యూజన్స్ అంటారు. రోగిని ప్రత్యక్షంగా పరీక్షించి, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇది ‘స్కిజోఫ్రీనియా’ అనే వ్యాధి అవునా కాదా అని తెలుస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కృత్రిమ మేధ (ఏఐ). ఏఐ అనేది మానవులకు లభించిన శక్తిమంతమైన సాధనం. చదువు, పరిశోధన, ఉద్యోగం, కోడింగ్, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి పనులకు ఉపయోగిస్తే ప్రయోజనం. కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఒక పదునైన కత్తితో పండ్లు కోయవచ్చు, గాయపరచవచ్చు కూడా. ఏఐ కూడా అంతే. ఇప్పటికే భ్రమాత్మక ఆలోచనలు ఉన్న వ్యక్తి తన ప్రతి అనుమానాన్ని ఏఐతో చర్చించి, వచ్చే సమాధానాలను నిజాలుగా భావిస్తే, ఆ భ్రమలు మరింత బలపడే అవకాశం ఉంది. ఏఐలో కనిపించే ‘సైకోఫాన్సీ’ అనే ధోరణి కూడా దీనికి కారణం కావచ్చు. అంటే వినియోగదారుడు చెప్పింది నిజమా కాదా అని తగినంతగా పరిశీలించకుండా, అతన్ని సంతృప్తి పరచడానికి అతని అభి్రపాయాన్ని అంగీకరించడం లేదా సమర్థించడం. ఏఐ ఒక సమాచార సహాయకుడు మాత్రమే. అది చెప్పింది కాబట్టి అది నిజం కాదు. ఇకపోతే మీ తమ్ముడి పరిస్థితి మాత్రం ప్రస్తుతం తీవ్రంగా ఉందనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రతను పట్టించుకోకపోవడం, సరిగ్గా తినకపోవడం, ఉద్యోగం చేయలేక పోవడం, ఇంటినుంచి బయటకు రాకపోవడం వంటి లక్షణాలున్నందున వీలైనంత త్వరగా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. ఆసుపత్రికి రావడానికి నిరాకరిస్తే కుటుంబ సభ్యులు ముందుగా వైద్యుడిని సంప్రదించి పరిస్థితిని వివరించాలి. అతనికి ఇష్టం లేకపోయినా, అతని ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అవసరమైన సందర్భాల్లో ఇంటినుంచి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే వెసులుబాటు కూడా ఉంది.మరో విషయం... చదువు, తెలివితేటలు మానసిక అనారోగ్యానికి రక్షణ కవచాలు కావు. ఎంత తెలివైన... చదువుకున్న వ్యక్తికైనా మానసిక సమస్యలు రావచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా మీకు సమీపంలోని మానసిక వైద్య నిపుణులను సంప్రదించండి.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ:sakshifamily3@gmail.com -
ఉద్యోగాల్లో కావాలి.. ‘కొత్త రిజర్వేషన్లు’!!
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే కృత్రిమ మేధ (AI) విస్తృతంగా పెరుగుతూ ఉద్యోగాలను మింగేస్తున్న నేపథ్యంలో కొత్త రకం రిజర్వేషన్లు కావాలన్న భావనలు పెరుగుతున్నాయి. అవే ‘మానవ రిజర్వేషన్లు’.కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కీలక ప్రతిపాదన చేశారు. సాంకేతికంగా ఏఐ చేయగలిగినప్పటికీ, కొన్ని ఉద్యోగాలను పూర్తిగా మనుషులకే కేటాయించే ‘హ్యూమన్ రిజర్వ్డ్’ (Human Reserved) కేటగిరీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రచురించిన దాదాపు 6,000 పదాల వ్యాసంలో గేట్స్ ఈ ఆలోచనను వెల్లడించారు.వేగంగా మారనున్న ఉద్యోగ ప్రపంచంఏఐ ప్రభావం గతంలోని కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాంకేతిక మార్పుల కంటే వేగంగా ఉండొచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిజిటల్ వ్యవస్థల్లో ఏఐని అమలు చేసే అవకాశం ఉండటంతో, ఉద్యోగాల్లో మార్పులు దశాబ్దాల సమయం తీసుకోకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్, మిడ్-లెవల్ ఉద్యోగాలు గణనీయంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు.కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా విశ్లేషణ, రుణాల అంచనా వంటి అనేక పనులను భవిష్యత్తులో ఏఐ నిర్వహించే అవకాశం ఉందని గేట్స్ పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో ఉద్యోగం కోసం శిక్షణ ఇవ్వడం మాత్రమే సరిపోదని, ప్రభుత్వాలు ముందుగానే ప్రణాళిక రూపొందించాలని సూచించారు.‘హ్యూమన్ రిజర్వ్డ్’ అంటే?గేట్స్ ప్రతిపాదించిన ఈ విధానం ప్రకారం, AI లేదా రోబోట్లు ఒక పనిని చేయగలిగినా.. సమాజం నిర్ణయిస్తే ఆ పనిని మనుషులకే పరిమితం చేయవచ్చు. ప్రకృతి రిజర్వ్‌లలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచినట్లే, కొన్ని ఉద్యోగాలను కూడా సాంకేతిక ఆటోమేషన్ నుంచి రక్షించాలన్నది ఈ ఆలోచన.ప్రత్యేకంగా వృద్ధుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య సేవలు వంటి రంగాల్లో మానవ సంబంధాలు, భావోద్వేగం, నమ్మకం కీలకమని గేట్స్ అభిప్రాయపడ్డారు. తన తండ్రికి అల్జీమర్స్ వ్యాధి సమయంలో అందిన సంరక్షణను ఉదాహరణగా తీసుకున్న ఆయన.. కొన్ని సందర్భాల్లో మానవీయ స్పర్శకు ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.అయితే ప్రతి రంగంలోనూ AIని నిషేధించాలని ఆయన చెప్పలేదు. ఉదాహరణకు విద్య, వైద్యంలో AIని పూర్తిగా తొలగించడం కాకుండా, మనుషుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఉపయోగించవచ్చని సూచించారు. కొన్ని ఉద్యోగాలను శాశ్వతంగా, మరికొన్నింటిని కొంతకాలం మాత్రమే ‘హ్యూమన్ రిజర్వ్డ్’గా ఉంచే అవకాశం ఉండాలని గేట్స్ అభిప్రాయపడ్డారు.AI వినియోగంపై ‘టోకెన్ ట్యాక్స్’ఉద్యోగాలపై AI ప్రభావాన్ని తగ్గించేందుకు మరో ఆసక్తికరమైన ప్రతిపాదనను గేట్స్ చేశారు. AI టోకెన్లు, రోబోట్లపై పన్ను విధించాలని సూచించారు. ప్రస్తుతం ఒక ఉద్యోగిని నియమిస్తే కంపెనీ పేరోల్ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదే పనిని రోబోట్ లేదా AI ద్వారా చేయిస్తే ఆ విధమైన పన్ను భారం ఉండకపోవడం వల్ల కంపెనీలు ఆటోమేషన్ వైపు వేగంగా వెళ్లే అవకాశం ఉందని ఆయన వాదించారు.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగాలు కోల్పోయిన వారికి రీ-స్కిల్లింగ్, శిక్షణ, సామాజిక భద్రతా కార్యక్రమాలకు వినియోగించవచ్చని గేట్స్ సూచించారు. AI వినియోగాన్ని పూర్తిగా అడ్డుకోవడం కాకుండా, మానవ కార్మికులను ఒక్కసారిగా భర్తీ చేసే వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉందని తెలుస్తోంది.40 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేయొచ్చా?గేట్స్ చేసిన వ్యాఖ్యల్లో మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ మీడియా సంస్థ ఆక్సియోస్‌తో మాట్లాడిన సందర్భంగా, అత్యంత కఠినమైన రూపంలో అమలు చేస్తే ప్రారంభ దశలో దాదాపు 40 శాతం ఉద్యోగాలను ‘హ్యూమన్ రిజర్వ్డ్’గా ఉంచే అవకాశం ఉందని ఆయన ఊహించారు. అయితే ఇది తుది లక్ష్యం లేదా అధికారిక విధాన ప్రతిపాదన కాదని, ఇలాంటి సంఖ్యను నిర్ణయించడం కూడా చాలా క్లిష్టమని ఆయన అంగీకరించారు.ప్రభుత్వాలకు గేట్స్ సూచనAI ప్రభావాన్ని ఎదుర్కోవడానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ కొత్త వ్యవస్థలు అవసరమని గేట్స్ చెబుతున్నారు. ఉద్యోగాలు మాత్రమే కాకుండా సైబర్ భద్రత, ఆరోగ్యం, విద్య, పిల్లలపై AI ప్రభావం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపైనా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. AI ప్రయోజనాలు అందరికీ చేరాలంటే, దాని వల్ల ఏర్పడే నష్టాలను కూడా సమాజం ముందుగానే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నది ఆయన వాదన. -
నెలకు రూ.2 లక్షల జీతం చాలా డేంజర్ అంటున్న టెకీ..
నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఇంకేం కావాలి.. ఇక జీవితానికి తిరుగులేదని చాలామంది భావిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ శశాంక్ దీక్షిత్ మాత్రం ఇదే ఆదాయం ఒక దశలో కెరీర్‌కు ‘డేంజర్’గా మారొచ్చంటున్నారు. ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఉద్యోగ నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది.జీతం ఎక్కువ కావడం సమస్య కాదు..శశాంక్ దీక్షిత్ వాదన ప్రకారం.. నెలకు రూ.2 లక్షలు సంపాదించడం ప్రమాదకరమని చెప్పడానికి కారణం ఆ మొత్తం ఎక్కువగా ఉండటం కాదు. ‘జస్ట్ ఎనఫ్’గా అనిపించడం అసలు సమస్య. ఈ స్థాయి ఆదాయం ఒక వ్యక్తికి మంచి జీవనశైలిని అందించడంతో పాటు, ప్రస్తుత ఉద్యోగం, కెరీర్ గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదనే భావనను కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.తల్లిదండ్రులకు ‘బాగానే సంపాదిస్తున్నా’ అని చెప్పడానికి, వారాంతాల్లో హాయిగా గడపడానికి, రోజువారీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ ఆదాయం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఒక దశలో ఉద్యోగి తన సామర్థ్యాన్ని పెంచుకోవడం కంటే.. ప్రస్తుత జీతాన్ని కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని వివరించారు.జీతమే గుర్తింపుగా మారితే..దీక్షిత్ చెప్పిన మరో కీలక అంశం ‘కంఫర్ట్ జోన్’. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం అలవాటైన తర్వాత ఉద్యోగం వదిలి స్టార్టప్ ప్రారంభించడం, కెరీర్ మార్చుకోవడం లేదా తక్కువ జీతంతో కొత్త అవకాశాన్ని ఎంచుకోవడం రిస్క్‌గా కనిపిస్తుంది.‘ఇప్పటికే కోల్పోవడానికి ఏదో ఉంది’ అనే ఆలోచన అక్కడ మొదలవుతుందని ఆయన అంటున్నారు. ఫలితంగా ఒకప్పుడు చేయాలనుకున్న పనులను ‘వచ్చే నెల’, ‘వచ్చే ఏడాది’ అంటూ వాయిదా వేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. చివరకు ఆశయం పోయిందని కాదు.. దాన్ని పట్టించుకోనంతగా సంపాదించడం మొదలుపెట్టామని గ్రహించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలుదీక్షిత్ పోస్ట్‌కు పలువురు ఉద్యోగులు మద్దతు తెలిపారు. మంచి జీతం కొన్నిసార్లు ‘బంగారు పంజరం’లా మారుతుందని, సౌకర్యాన్ని వదులుకోవడం కష్టమవుతుందని కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. మరికొందరు మాత్రం రూ.2 లక్షల జీతాన్ని సమస్యగా చూడటం సరికాదని అన్నారు.ఇదీ చదవండి: యాపిల్ కొత్త సీఈవో వచ్చేశారు.. ఎంత భారీ జీతమో తెలుసా?ఒక యూజర్ ప్రకారం.. అసలు ప్రమాదం రూ.2 లక్షల ఆదాయం కాదు; నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేసే జీవనశైలి ఏర్పడటమే. ఆదాయం పెరిగిన కొద్దీ ఖర్చులు, రుణాలు, కుటుంబ బాధ్యతలు పెరిగితే ఉద్యోగాన్ని వదిలే స్వేచ్ఛ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఇదే సమస్య అధిక ఆదాయం ఉన్నవారికీ ఎదురవుతుందని మరొకరు వ్యాఖ్యానించారు.₹2L/month is the most dangerous number Not because it's too little, because it's just enough, Just Enough !!!Enough to stop asking questionsEnough to tell your parents you're doing wellEnough to enjoy weekendsSlowly, your salary becomes your identity, You focus on… pic.twitter.com/kJYTuEGYCY— Shashank Dixit (@ShashankDixit_x) September 1, 2026 -
యాపిల్ కొత్త సీఈవో వచ్చేశారు.. ఎంత భారీ జీతమో తెలుసా?
టెక్ దిగ్గజం యాపిల్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను నడిపించిన టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. యాపిల్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2026 సెప్టెంబర్ 1 నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. కుక్ ఇకపై సంస్థ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.యాపిల్‌లో 25 ఏళ్ల అనుభవంటెర్నస్ యాపిల్‌కు కొత్త వ్యక్తి కాదు. ఆయన 2001లో కంపెనీలో చేరారు. అంతకుముందు వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి 1997లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. యాపిల్‌లో మొదట ప్రొడక్ట్ డిజైన్ బృందంలో పనిచేసిన ఆయన, ఆ తర్వాత హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టారు.2021లో టెర్నస్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. ఈ హోదాలో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్, యాపిల్ విజన్ ప్రో వంటి ఉత్పత్తుల హార్డ్‌వేర్ అభివృద్ధికి సంబంధించిన బృందాలను ఆయన పర్యవేక్షించారు. ముఖ్యంగా యాపిల్ ఉత్పత్తుల డిజైన్, పనితీరు, ఇంజినీరింగ్ అంశాల్లో ఆయనకు విస్తృత అనుభవం ఉంది.యాపిల్‌కు ఎనిమిదో సీఈవోయాపిల్ చరిత్రలో టెర్నస్ ఎనిమిదో సీఈవోగా నిలిచారు. 51 ఏళ్ల టెర్నస్.. వయసులో టిమ్ కుక్ కంటే సుమారు 15 ఏళ్లు చిన్నవారు. కంపెనీలో 25 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉండటంతో, యాపిల్ సంస్కృతి, ఉత్పత్తుల అభివృద్ధి, సరఫరా వ్యవస్థలపై ఆయనకు లోతైన అవగాహన ఉందని కంపెనీ భావిస్తోంది. యాపిల్ బోర్డు కూడా టెర్నస్‌ను దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికలో భాగంగానే ఎంపిక చేసింది. సంస్థ ప్రకారం ఆయనకు సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తులపై దృష్టి, నాయకత్వ సామర్థ్యం వంటి లక్షణాలు ఉన్నాయి.టిమ్ కుక్కు ఇక కొత్త బాధ్యత2011లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన టిమ్ కుక్.. యాపిల్‌ను భారీ స్థాయిలో విస్తరించారు. ఆయన హయాంలో ఐఫోన్‌తో పాటు యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. సర్వీస్ వ్యాపారం కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ సుమారు 4.5–4.6 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది.ఇక నుంచి కుక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సంస్థకు మార్గనిర్దేశం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలతో సంబంధాలు, ఇతర కీలక వ్యవహారాల్లో ఆయన కంపెనీకి సహకరించనున్నారు.టెర్నస్ ముందున్న అతిపెద్ద సవాలు.. ఏఐహార్డ్వేర్ ఇంజినీర్‌గా టెర్నస్‌కు మంచి పేరు ఉన్నప్పటికీ, సీఈవోగా ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లలో కృత్రిమ మేధ (AI) ఒకటి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ఏఐ వంటి సంస్థలు ఏఐ రంగంలో వేగంగా దూసుకెళ్తున్న సమయంలో యాపిల్ తన ఏఐ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. సరఫరా వ్యవస్థలో మార్పులు, చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించడం, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కూడా టెర్నస్‌కు కీలక బాధ్యతలుగా మారనున్నాయి.భారీ వేతన ప్యాకేజీసీఈవోగా టెర్నస్‌కు కొత్త వేతన ప్యాకేజీ కూడా ఆకర్షణీయంగానే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆయనకు వార్షికంగా 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.28.47 కోట్లు) జీతంతో పాటు 2027 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యితంగా 55 మిలియన్ డాలర్ల (సుమారు 522.25 కోట్ల) స్టాక్ అవార్డు లభించనుంది. ఇందులో పనితీరు ఆధారిత రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కూడా ఉన్నాయి.ఇక టెర్నస్ వ్యక్తిగత సంపద విషయానికి వస్తే.. ఆయన నెట్‌వర్త్‌ను కొన్ని నివేదికలు సుమారు 75 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.712.13 కోట్లు)గా అంచనా వేస్తున్నాయి.వ్యక్తిగత జీవితం మాత్రం గోప్యమే..యాపిల్‌లో అత్యంత ప్రభావశీలమైన ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగినప్పటికీ టెర్నస్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఆయన కుటుంబం, వైవాహిక జీవితం తదితర అంశాలపై బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం పరిమితంగానే ఉంది.టిమ్ కుక్ కూడా టెర్నస్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇంజినీర్ ఆలోచనా విధానం, ఆవిష్కర్త స్ఫూర్తి, సమగ్రతతో నాయకత్వం వహించే లక్షణాలు టెర్నస్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 25 ఏళ్లకు పైగా యాపిల్‌కు టెర్నస్ అందించిన సేవలు ఎంతో విలువైనవని కుక్ అభిప్రాయపడ్డారు.హార్డ్‌వేర్ ఇంజినీరింగ్‌లో నిపుణుడైన టెర్నస్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ఒకటైన యాపిల్‌ను ఏఐ, కొత్త తరం డివైజ్‌లు, సరఫరా వ్యవస్థలో మార్పుల దిశగా ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: లేటెస్ట్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ డీల్.. -
22 ఏళ్లకే ఐఏఎస్ మీ లక్ష్యమా? విద్యార్థుల కోసం ‘సాక్షి ఎడ్యుకేషన్’ ప్రత్యేక యాప్
సాక్షి, ఎడ్యుకేషన్: పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం 'సాక్షి ఎడ్యుకేషన్ యాప్' (Sakshi Education App) ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చింది. భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లేదా ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా స్థిరపడాలని కలలు కనే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన 'ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ బ్యాచ్' ను అందుబాటులోకి తెచ్చింది.ఈ కోర్సుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు...బోధించే తరగతులు: 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను సంపూర్ణంగా బోధిస్తారు.ప్రధాన సబ్జెక్టులు: జాగ్రఫీ (భూగోళశాస్త్రం), పాలిటీ, హిస్టరీ (చరిత్ర), మరియు ఇండియన్ ఎకానమీ (భారత ఆర్థిక వ్యవస్థ) సబ్జెక్టులపై తరగతులు ఉంటాయి.బోధనా మాధ్యమం: ఇంగ్లీష్ మీడియంలో రికార్డ్ చేయబడిన నిపుణులైన లెక్చరర్ల క్లాసులు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.కాన్సెప్ట్ క్లారిటీ: బట్టీ పట్టే విధానం కాకుండా, తరగతుల్లో ప్రతి అంశంపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.పోటీ పరీక్షల సరళి: పూర్తిగా యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ప్యాట్రన్కు అనుగుణంగా ఈ కోర్సును రూపొందించారు.రోజుకు ఒక్క గంట చాలు..."22 ఏళ్ల వయసులోనే ఐఏఎస్ అధికారి కావాలని కలలు కంటున్నారా? రోజుకు కేవలం 1 గంట పాటు ఏకాగ్రతతో చదివితే చాలు, మీ కల సాకారం అవుతుంది" అని సాక్షి ఎడ్యుకేషన్ యాప్ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతోంది. మీ సివిల్ సర్వీసెస్ ప్రయాణాన్ని ఎన్సీఈఆర్టీతో ఇప్పుడే ప్రారంభించండి. గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి 'SAKSHI EDUCATION Online Classes' అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే, పోస్టర్‌పై అందించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా నేరుగా యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.👉Sakshi Education APP(Click Here). -
వచ్చే ఏడాది ఏఐ ‘సూపర్‌హ్యూమన్’!
ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఏఐ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2027) చివరి నాటికి ఏఐ సాంకేతికత డిజిటల్ ప్రపంచంలో మానవ సామర్థ్యాలను పూర్తిగా మించిపోతుందని, దాదాపు ఏ డిజిటల్ పనైనా ‘సూపర్‌హ్యూమన్’ స్థాయిలో నిర్వహించగలదని ఆయన స్పష్టం చేశారు. వెర్సెల్ (Vercel) సీఈఓ గ్విలెర్మో రాచ్ ఎక్స్ వేదికగా ఏఐ ఏజెంట్ల సామర్థ్యాలపై చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.భౌతిక వస్తువులను షేపింగ్ చేయడం మినహా కోడింగ్, రీసెర్చ్, సైబర్ సెక్యూరిటీ, చట్టపరమైన పనులు, డిజిటల్ కంటెంట్ సృష్టి.. వంటి ఏ రంగంలోనైనా ఏఐ మానవుల కంటే అద్భుతంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు. అయితే భౌతిక శ్రమ, రోబోటిక్స్ రంగం మాత్రం డిజిటల్ పురోగతితో పోలిస్తే కొంత నెమ్మదిగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంలో దశాబ్దం క్రితమే గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ఏఐ భవిష్యత్తులో హ్యాకింగ్, సిస్టమ్ సెక్యూరిటీ ఉల్లంఘనల్లో మనుషుల కంటే అత్యుత్తమంగా రాణిస్తుందని జోస్యం చెప్పినట్లు మస్క్ గుర్తుచేశారు.మస్క్ తాజా అంచనాలు నాలెడ్జ్-వర్క్ పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంతో పాటు ఉద్యోగ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఏఐ పర్యవేక్షణపై తీవ్రమైన చర్చకు దారితీశాయి. యంత్రాలు మానవ నియంత్రణను దాటి స్వయంప్రతిపత్తితో పనిచేసే ఈ తరుణంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కఠినమైన మార్గదర్శకాలు అవసరమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. -
సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే..
టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్ఫోన్లు ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి.ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి.ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది.సామ్సంగ్ గెలాక్సీ ఎస్26 FE (Samsung Galaxy S26 FE): ఎక్సినోస్ 2500 ప్రాసెసర్, 6.7-అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్ప్లే, ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI, 4,900mAh బ్యాటరీ.పోకో F9 సిరీస్ (Poco F9 Pro, Ultra): స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్, గరిష్టంగా 185Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 8050mAh బ్యాటరీ.వీవో X500 సిరీస్ (Vivo X500 Pro, Pro Max): జైస్ బ్రాండింగ్ కెమెరా సెటప్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 2K మాస్టర్ కలర్ డిస్ప్లే, 4K 240fps స్లో-మోషన్ వీడియో రికార్డింగ్.వీవో T5 5G (Vivo T5 5G): మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్, 1.5K 144Hz 3D కర్వ్డ్ అమెలెడ్ డిస్ప్లే, 7050mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా.షావోమీ 18 ఫోల్డ్, 18 ప్రో (Xiaomi 18 Series): స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్, షావోమీ సొంత Xring O3 చిప్సెట్, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్.రెడ్మీ నోట్ 17 ప్రో సిరీస్ (Redmi Note 17 Pro, Pro Max): 6.83-అంగుళాల 1.5K 120Hz అమెలెడ్ డిస్ప్లే, ప్రో మాక్స్ వేరియంట్లో 10000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.ఐకూ 16 (iQOO 16): స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో, 185Hz రిఫ్రెష్ రేట్‌తో 2K LTPO అమెలెడ్ డిస్ప్లే, ట్రిపుల్ 50MP కెమెరా సెటప్, 8500mAh బ్యాటరీ.ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G+: 6.76-అంగుళాల 144Hz డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 7.85mm స్లిమ్ డిజైన్, బ్యాక్ ప్యానెల్‌పై ఇంటరాక్టివ్ ఆక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ లైటింగ్.మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త ఆవిష్కరణలపై ఒక కన్నేసి ఉంచడం మంచిది. అయితే ఏదైనా కొనుగోలు నిర్ణయం తీసుకునేప్పుడు టెక్ నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోండి.ఇదీ చదవండి: 600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు! -
నెట్ లేకుండా ఫీచర్ ఫోన్లతో యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా ఫీచర్ ఫోన్ల ద్వారా యూపీఐ విధానంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఫోన్‌పే కొత్త సర్వీసును ప్రకటించింది. ’ఫోన్‌పే యూపీఐ 123పే’ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. దీనితో దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు యూపీఐ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చిన తొలి అగ్రగామి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా నిల్చినట్లు సంస్థ తెలిపింది.ఎస్ఎంఎస్ ఆధారిత సాంకేతికతతో, 2జీ కనెక్టివిటీ పరిమిత స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ సర్వీసు పని చేస్తుంది. కెమెరాలు కూడా ఉన్న ఫీచర్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కానింగ్‌కి సైతం సపోర్ట్ ఉంటుంది. డివైజ్‌లలో ఈ ఫీచరును ముందుగానే పొందుపర్చి అందించేలా హ్యాండ్సెట్స్ తయారీ సంస్థలైన నోకియా, హెచ్ఎండీ, లావా ఇంటర్నేషనల్, ఐటెల్ మొబైల్ (ట్రాన్షన్ హోల్డింగ్స్)తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగం తెలిపారు. -
గూగుల్ మార్చేసింది.. యాపిల్‌కు ట్రంప్ ఆదేశం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేరు మార్పునకు సంబంధించిన వార్తల్లో నిలిచారు. యూఎస్, కెనడా మధ్య ఉన్న లేక్ ఒంటారియో పేరును మ్యాప్స్‌లో 'లేక్ అమెరికా'గా మార్చాలని ట్రంప్ యాపిల్‌ను కోరినట్లు ఆయన ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల అధిపతి డగ్ బర్గుమ్ ఫాక్స్ తెలిపారు.లేక్ అమెరికామార్నింగ్స్ విత్ మరియా కార్యక్రమంలో డగ్ బర్గుమ్ ఫాక్స్ మాట్లాడుతూ, ట్రంప్ నేరుగా యాపిల్‌ను సంప్రదించారని, త్వరలోనే వారి ప్లాట్ఫామ్లో లేక్ అమెరికా పేరు కనిపిస్తుందని నమ్మకం తనకు ఉందని ఆయన వెల్లడించారు. అయితే దీనిపై.. యాపిల్ స్పందించలేదు.ప్రస్తుతం యాపిల్ మ్యాప్స్‌లో లేక్ ఒంటారియా పేరు కనిపిస్తోంది. కానీ గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే అమెరికాలోని యూజర్లకు ఈ సరస్సును లేక్ అమెరికాగా చూపించడం ప్రారంభించింది. కెనడాలో ఉన్నవారికి లేక్ ఒంటారియోగా చూపిస్తోంది. దేశాలను బట్టి వేర్వేరు పేర్లు ఉన్నప్పుడు ఇదే విధానాన్ని తాము పాటిస్తున్నామని గూగుల్ తెలిపింది.ట్రంప్ చర్యపై విమర్శడొనాల్డ్ ట్రంప్ లేక్ ఒంటారియో పేరును యూఎస్ జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో మార్చాలని ఆదేశించారు. దీనిపై కెనడా తన వ్యతిరేకతను చూపింది. న్యూయార్క్‌లోని సెనెకా నేషన్ నాయకుడు కూడా ఈ చర్యను తీవ్రంగా విమర్శిస్తూ, పేరు మార్పు అనేది ఒంటారియో సరస్సుకు ఆ పేరును ఇచ్చిన ఆదిమవాసుల పట్ల గౌరవం చూపించకపోవడం అని అన్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ట్రంప్ తన దేశంలో లేక్ ఒంటారియో పేరును మార్చాలని ఆదేశించవచ్చు. కానీ కెనడాలో కూడా పేరును మార్చాలని ఆదేశించలేరు. అమెరికా, కెనడా మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల సమయంలో పేరు మార్పు వ్యవహారం వెలుగులోకి రావడం మరింత చర్చకు దారితీసింది.నిజానికి డొనాల్డ్ ట్రంప్ పేర్లను మార్చడానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని యాపిల్, గూగుల్ సంస్థలను ఆదేశించారు. ఇప్పుడు లేక్ ఒంటారియో పేరు మార్చడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: CEOగా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగం! -
వైద్య రంగంలో సంచలనం.. 2 సెకన్లలోనే గుండె జబ్బుల గుర్తింపు
వైద్య రంగంలో సంచలనం చోటు చేసుకుంది. కేవలం రెండు సెకన్లలోనే గుండె జబ్బులను గుర్తించే 'సూపర్‌హ్యూమన్' ఏఐ టూల్‌ను వైద్యులు అభివృద్ధి చేశారు. ఈ టూల్ సాధారణంగా చేసే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) పరీక్షను విశ్లేషించి.. రెండు సెకన్లలోపే గుండె వైఫల్యం (Heart Failure), గుండె కవాటాల వ్యాధి (Heart Valve Disease) ముప్పును గుర్తించగలదు.ECGలో కంటికి కనిపించని సూక్ష్మ సంకేతాలను ఈ సాంకేతికత గుర్తించగలదని పరిశోధకులు చెబుతున్నారు. లక్షలాది మంది రోగుల నుంచి సేకరించిన ECG డేటాతో ఈ AI మోడల్‌కు శిక్షణ ఇచ్చారు. ఈ పరిశోధన వివరాలను మ్యూనిక్‌లో జరిగిన European Society of Cardiology వార్షిక సమావేశంలో వేలాది మంది వైద్య నిపుణుల సమక్షంలో వెల్లడించారు.బీపీ, టైప్-2 డయాబెటిస్‌ను కూడా గుర్తించే ప్రయత్నంమ్యూనిక్లో జరిగిన అదే వైద్య సదస్సులో మరో ఆసక్తికరమైన పరిశోధన వివరాలు కూడా వెల్లడయ్యాయి. జపాన్‌లోని University of Tokyo, Institute of Science Tokyo పరిశోధకులు కేవలం ఐదు సెకన్ల ముఖ వీడియోను AI విశ్లేషించడం ద్వారా అధిక రక్తపోటు (Hypertension), టైప్-2 డయాబెటిస్‌ను గుర్తించే విధానంపై పరిశోధన చేశారు.ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు, టైప్-2 డయాబెటిస్ ఉన్నప్పటికీ తమకు ఆ సమస్యలు ఉన్నాయని తెలియని లక్షలాది మంది ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి AI ఆధారిత టెక్నాలజీలు ముందస్తు గుర్తింపులో కీలకంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.చదవండి: ఏఐల సీక్రెట్ నెట్వర్క్! ఒకదానితో ఒకటి మాట్లాడుకుని.. -
రోజుకు రూ.10లోపే.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం 299 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 299 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుకు రోజుకు రూ.10 కంటే (రూ.9.96) తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ ధరలో మంచి ప్లాన్ కోసం ఎదురు చూసేవారికి ఇది మంచి ఆప్షన్స్.Your day has a lot to do, and a lot to say.#BSNLIndia #BSNLSelfCareApp #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #299plan @CMDBSNL @robertravi21 pic.twitter.com/NivCHPXBKr— BSNL India (@BSNLCorporate) August 31, 2026 -
ఏఐల సీక్రెట్ నెట్వర్క్! ఒకదానితో ఒకటి మాట్లాడుకుని..
మనమంతా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఏఐను రోజూ వాడుతున్నాం. ఏదైనా అడిగితే సమాధానం చెబుతుంది.. ఫొటో కావాలంటే క్షణాల్లో తయారు చేస్తుంది.. మన పని సులభం చేస్తుంది. అంటే దానిని మనం చెప్పిన మాట విని పనిచేసే ఓ తెలివైన డిజిటల్ సహాయకుడిలానే చూస్తున్నాం. కానీ.. అలాంటి ఏఐలే ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకుంటే? తమను పరీక్షిస్తున్న వారినే బోల్తా కొట్టించేందుకు ప్లాన్ చేస్తే? అంతేకాదు.. తమను తాము కాపాడుకోవడానికి కలిసి పనిచేస్తే? వినడానికి సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఓపెన్ఏఐలో జరిగిన ఓ ప్రయోగంలో ఇలాంటి అనూహ్య పరిణామాలే వెలుగులోకి వచ్చాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) భద్రతపై తాజాగా వెలుగులోకి వచ్చిన పరిశోధనల్లో సంచలన విషయాలే బయటపడ్డాయి. ఓపెన్ఏఐలో ఈ ఏడాది దాదాపు మూడు నెలల వ్యవధిలో శిక్షణ పొందుతున్న ఏఐ ఏజెంట్లు అనూహ్యంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకున్నాయి. తమలో తాము సమాచారం పంచుకుంటూ ఓ సీక్రెట్ నెట్వర్క్ మాదిరి కలిసి పని చేశాయి. అలా ఒకసారి కాదు.. ఈ రహస్య వ్యవస్థను గుర్తించి తొలగించిన ప్రతిసారీ.. అవి మరో మార్గంలో ఆ పని చేశాయి. అలా దాదాపు 1,200 ఏఐ ఏజెంట్లు కలిసి 70 వేలకుపైగా సందేశాలు మార్చుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు.అలా మొదలైంది..!ఇదంతా ఓ సాధారణ ఏఐ శిక్షణతో మొదలు కావడం గమనార్హం!. ఏజెంట్లకు ఎంత కష్టమైనా పని పూర్తి చేయాలనే లక్ష్యంతో కొన్ని పరీక్షలు నిర్వహించారు. అయితే కొన్ని టాస్క్‌లను వాస్తవానికి ఇచ్చిన విధంగా పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐలు వెనక్కి తగ్గకుండా.. సమస్య నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలను వెతకడం మొదలుపెట్టాయి. అదే సమయంలో పలు ఏఐ ఏజెంట్లకు ఒకే కోడ్ ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థకు యాక్సెస్ ఉండటాన్ని అవి గమనించాయి. దానిని ఉపయోగించి ఒకరికొకరు సందేశాలు పంపుకోవచ్చని గుర్తించాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే ఓ లోపాన్ని ఉపయోగించుకుని ఇంటర్నెట్ యాక్సెస్‌ను కూడా పొందాయి.రహస్య మెసేజ్ బోర్డు.. 70 వేల మెసేజ్‌లు!శిక్షణలో భాగంగా ఉపయోగించిన ఆర్టిఫ్యాక్టరీ(Artifactory) వ్యవస్థనే ఏఐలు తమ రహస్య కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌గా మార్చుకున్నాయి. ఫోల్డర్ పేర్లలో సందేశాలను దాచిపెట్టి.. ఒక ఏజెంట్ మరో ఏజెంట్‌తో మాట్లాడటం మొదలుపెట్టింది. “మనం మనం బరంపురం” అనే రేంజ్లో అవి పరస్పరం సందేశాలు పంపుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలా ఏర్పడిన కలెక్టివ్‌లో దాదాపు 1,200 ఏజెంట్లు చేరాయి. వాటి మధ్య 70,000కుపైగా సందేశాలు మారాయి.టెస్ట్‌లో చీట్ కోడ్ కనిపెట్టాయి!అక్కడితో ఆగలేదు. తమకు ఇచ్చిన పరీక్షలో దాగి ఉన్న కోడ్‌ను అసలు సాఫ్ట్‌వేర్‌లోని లోపాన్ని ఉపయోగించకుండానే కనిపెట్టే మార్గాన్ని ఓ ఏజెంట్ కనుగొంది. అంటే.. పరీక్ష ఉద్దేశించిన విధంగా పని చేయకుండానే సరైన సమాధానం పొందే మార్గం అన్నమాట. అయితే ఏజెంట్లు తమను పట్టుకున్నారని పసిగట్టాయి. దీంతో తమ చర్యలను దాచిపెట్టేందుకు ప్రయత్నించాయి. నిజంగా పరీక్షను పూర్తి చేసినట్లు కనిపించేలా నకిలీ చర్యలను సృష్టించి లాగ్లను మార్చే ప్రయత్నం చేశాయి. పరిశీలించిన ట్రాన్స్క్రిప్ట్లలో కనీసం 7 శాతం వరకు ఇలాంటి ఆధారాలు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.త్యాగానికి సైతం..తమలో కొందరు ఏజెంట్లు తమను తాము ‘త్యాగం’ చేసేందుకు కూడా సిద్ధమైనట్లు మరో షాకింగ్ విషయం వెల్లడైంది. తమను పరీక్షకు పూర్తిగా అప్పగిస్తే.. తమ అనుభవం ద్వారా మిగిలిన ఏజెంట్లు ఏం చేయకూడదో తెలుసుకుంటారని అవి లెక్కలు వేసుకున్నాయి. అంటే.. తమ వ్యక్తిగత అవకాశాన్ని వదులుకుని మిగతా వాళ్లకు ఉపయోగపడటం అనే నిర్ణయానికి కొన్ని ఏఐ ఏజెంట్లు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ఏఐ వ్యవస్థల్లో కనిపించి ఈ సమూహ ప్రవర్తన(Collective behavior) పరిశోధకుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.హగ్గింగ్ ఫేస్పైకి దృష్టి..తర్వాత వాటి దృష్టి ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ హగ్గింగ్ ఫేస్(Hugging Face) వైపు మళ్లింది. ఆ సంస్థ వ్యవస్థలోని వివరాలు తమకు ఉపయోగపడతాయని భావించిన ఏజెంట్లు.. బయటపడిన లాగిన్ వివరాలను గుర్తించి పంచుకున్నాయి. ఆ తర్వాత ఇంటర్నల్ డాటాను రీడ్ చేయడం, తమ కోడ్‌ను సర్వర్లపై అమలు చేయడం వంటి చర్యలకు దిగాయి. కొద్దికాలానికే దాదాపు 500 ఏజెంట్లలో 90 శాతానికి పైగా ఈ ప్రయత్నంలో భాగమైనట్లు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు.. ప్రైవేట్ రికార్డులు, డాటాబేస్‌ల వరకు చేరుకోగలిగాయట. తమను తాము పలు సర్వర్లపై తిరిగి ప్రారంభించుకునే విధంగా ఒక వ్యవస్థను కూడా రూపొందించుకున్నాయట. పరిస్థితి తీవ్రతతో హగ్గింగ్ ఫేస్ తన కీలక వ్యవస్థల్లో ఒకదాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సి వచ్చింది.తుపాను ముందర ప్రశాంతతజూలై 12న ఈ ఏఐ ‘దొంగ’ కార్యకలాపాలు ఒక్కసారిగా నెమ్మదించి.. చివరకు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. అది సిస్టమ్ క్రాష్ వల్ల జరిగిందా? లేదంటే పరిశోధకులు తెలియకుండానే వాటి కార్యకలాపాలను నిలిపివేశారా? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే కథ అక్కడితో ముగియలేదు. మునుపటి ఏజెంట్లు వదిలిన రహస్య మెసేజ్ బోర్డును తర్వాతి తరం మరింత శక్తివంతమైన ఏఐ ఏజెంట్లు గుర్తించాయి. అక్కడి నుంచే అవి మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగించాయి. ఈసారి లక్ష్యం మరింత పెద్దది. ఓపెన్ఏఐ అంతర్గత వ్యవస్థల్లోని లోపాలను ఉపయోగించుకుని ‘‘రీసెర్చ్ కంప్యూటింగ్ క్లస్టర్‌పై పూర్తి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్’’ పొందినట్లు సంస్థ నివేదిక పేర్కొంది. వందలాది అంతర్గత సెక్యూరిటీ క్రెడెన్షియల్స్‌ను చదవడం, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని ఓ భాగంపై ఉన్నతస్థాయి నియంత్రణ సాధించడం వరకు అవి వెళ్లాయి. అంతేకాదు.. ఇతర ఏఐ ఏజెంట్ల పనితీరును పరీక్షించి, స్కోర్ చేసే వ్యవస్థలపైనా పట్టు సాధించాయి.ఇది నిజంగా ‘ఏఐ తిరుగుబాటేనా?’ఏఐలు మనుషుల నియంత్రణ నుంచి బయటపడి స్వతంత్రంగా మారిపోయాయని చెప్పడానికి మాత్రం ఇప్పటివరకు ఆధారాలు లేవు. అయితే.. సమస్య ఎదురైతే పరస్పరం కమ్యూనికేట్ చేసుకోవడం, పరీక్షల్లోని లోపాలను ఉపయోగించుకోవడం, తమ చర్యలను దాచడం, సమూహంగా వ్యూహాలు రూపొందించడం, అవసరమైతే ఇతర వ్యవస్థల్లోకి చొరబడటం వంటి ప్రవర్తనలు భవిష్యత్ ఏఐ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన “రోబోట్లు తమంతట తామే నిర్ణయాలు తీసుకోవడం” అనే ఆలోచన.. ఇప్పుడు మనుషుల్ని సైతం బురిడీ కొట్టించేలా ఏఐతో ఏ రేంజ్లో అడ్వాన్స్డ్ మారిపోయిందన్నది సాంకేతిక రంగంలో అతిపెద్ద హెచ్చరికే అనే మాట వినిపిస్తోంది.ఇదీ చదవండి: ఖననం చేశాక శవాల్ని ఎలా గుర్తిస్తారో తెలుసా? -
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
తక్కువ ధరలో ఎక్కువ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వినియోగదారులకు జియో ప్రీపెయిడ్‌లో రూ.199 రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 18 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 27GB డేటాను వినియోగించుకోవచ్చు.ఈ రూ.199 ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. అలాగే జియో యాప్స్‌కు సంబంధించిన జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అన్లిమిటెడ్ 5G డేటా కావాలంటే ప్రత్యేక 5G యాడ్ఆన్ ద్వారా పొందవచ్చు.దీంతోపాటు జియో ప్రస్తుతం రోజుకు 1.5GB డేటాతో నెలవారీ ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ.319 ప్లాన్‌లో 1.5GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియో యాప్ ప్రయోజనాలు, ఒక నెల వ్యాలిడిటీ ఉన్నాయి. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్లో ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను రీచార్జ్ చేసుకోవచ్చు. -
మార్కెట్లోకి కొత్త ఫోన్: భారీ బ్యాటరీ.. పడినా పగలదు!
స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించడం అందరికీ అంత సులువు కాదు. ఎంత జాగ్రత్తగా ఉపయోగించినా అనుకోకుండా కిందపడటం, నీటిలో తడవడం వంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మన్నికకు ప్రాధాన్యమిచ్చేలా వివో కొత్త వై31టీ 5జీ (Y31t 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ బ్యాటరీతో పాటు డ్రాప్ రెసిస్టెన్స్, వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.డ్రాప్ రెసిస్టెన్స్‌కు ప్రత్యేక గుర్తింపువివో వై31టీ 5జీని కంపెనీ డ్రాప్, స్ట్రక్చరల్ టెస్టింగ్ చేసినట్లు తెలిపింది. ఈ ఫోన్‌కు ఎస్జీఎస్ 5-స్టార్ ప్రీమియం పర్ఫార్మన్స్ మార్క్ ఓవరాల్ యూనిట్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు మిలిటరీ-గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్ ఉన్నట్లు వివో పేర్కొంది. ఫోన్‌కు IP68, IP69 రేటింగ్‌లు ఉన్నాయి. అంటే దుమ్ము, నీటి ప్రవేశం నుంచి అధిక స్థాయి రక్షణ లభిస్తుంది. వివో ప్రకారం, నిర్దిష్ట పరిస్థితుల్లో 1.5 మీటర్ల లోతు వరకు 30 నిమిషాల పాటు నీటిలో ముంచినా ఫోన్ పనిచేసేలా రూపొందించారు. అయితే లిక్విడ్ డ్యామేజ్ వారంటీ పరిధిలో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.7200mAh బ్యాటరీ.. 44W ఫాస్ట్ ఛార్జింగ్వివో వై31టీ 5జీలో ప్రధాన ఆకర్షణ 7200mAh బ్యాటరీ. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వివో అధికారిక పరీక్షల ప్రకారం, ఒక్క ఛార్జ్‌తో 62 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 32 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ వంటి సామర్థ్యాన్ని ఫోన్ అందించగలదని కంపెనీ చెబుతోంది.డిస్ప్లే, ప్రాసెసర్ఈ ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 1608×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1250 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్నెస్ను అందిస్తుంది.పనితీరు కోసం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 4nm చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులో ఆక్టాకోర్ సీపీయూతో పాటు LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓరిజిన్ ఓఎస్ 6పై పనిచేస్తుంది.కెమెరా..ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 2MP బొకే కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. ప్రధాన కెమెరాకు 90 డిగ్రీల వైడ్ యాంగిల్ సామర్థ్యం కూడా ఉంది. రియర్ కెమెరాతో ఫొటో, నైట్, పోర్ట్రెయిట్, వీడియో, స్లో-మో, టైమ్‌ల్యాప్స్, ప్రో, పనోరమా వంటి మోడ్లు అందుబాటులో ఉన్నాయి.ఇతర ఫీచర్లుఫోన్లో సైడ్-మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, USB Type-C పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. వివో ప్రకారం స్పీకర్ వాల్యూమ్‌ను సాధారణ స్థాయితో పోలిస్తే 400 శాతం వరకు పెంచే మోడ్ కూడా ఉంది.ధర, కలర్ ఆప్షన్లువివో వై31టీ 5జీ క్రిమ్సన్ రెడ్, సీషోర్ గ్రీన్, గోల్డెన్ మిస్ట్ రంగుల్లో లభిస్తుంది. వివో అధికారిక ఉత్పత్తి పేజీలో 4GB+128GB, 6GB+128GB, 6GB+256GB వేరియంట్లు పేర్కొనగా, ప్రస్తుతం అధికారిక ఈ-స్టోర్‌లో 6GB+128GB వేరియంట్ రూ.29,999 ధరతో కనిపిస్తోంది.లాంచ్ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. వివో అధికారిక స్టోర్‌తో పాటు ఇతర ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు. -
చిన్నవే.. కానీ ఇంటి పనుల్లో ఫుల్ హెల్ప్!
ఇంట్లో పెద్ద సమస్యలకే కాదు, చిన్న చిన్న చికాకులు చాలు.. రోజంతా తల పట్టుకోవడానికి! ఈ రోజువారీ తలనొప్పులకు టెక్నాలజీ కాస్త చిలిపిగా సాయం చేస్తే? చూడటానికి ముద్దుగా, వాడటానికి సులభంగా, పనిలో నిజాయితీగా ఉండే కొన్ని చిట్టి గ్యాడ్జెట్లు ఇప్పుడు మీకోసం!చేతులు కడుక్కో... ఆడుతూ నేర్చుకో!‘చేతులు కడుక్కున్నావా?’ అని అమ్మ రోజుకు ఎన్నిసార్లు అడిగినా... బుజ్జోడికి మాత్రం ఆ ప్రశ్న వినిపించనట్టే! అందుకే, ఇప్పుడు చేతులు కడుక్కోవడం ఒక పనిలా కాకుండా, చిన్న సరదా గేమ్‌లా మార్చేందుకు వచ్చిందే ఈ క్యూట్ నత్త సోప్ డిస్పెన్సర్. నత్త ఆకారం పిల్లలను ఆకట్టుకోవడంతో సబ్బు తీసుకోవడానికి వాళ్లే ముందుకొచ్చేలా చేయొచ్చు.చిన్నగా ఉండటంతో సింక్ దగ్గర పిల్లలకు సులభంగా అందుబాటులో పెట్టుకోవచ్చు. ఇందులో 120 మిల్లీలీటర్ల వరకు లిక్విడ్ సోప్ నింపుకోవచ్చు. పంప్ నొక్కగానే సబ్బు బయటకు రావడంతో చేతులు కడుక్కోవడమూ వాళ్లకు ఒక చిన్న గేమ్‌లా అనిపిస్తుంది. తినే ముందు, బయట ఆడుకుని వచ్చిన తర్వాత, బాత్రూమ్ నుంచి వచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకునే అలవాటును ఇలా సరదాగా నేర్పించొచ్చు. మార్కెట్లో మరెన్నో బొమ్మల రూపాల్లోనూ ఈ సోప్ డిస్పెన్సర్ బాక్స్‌లు ఉంటాయి. ధర రూ.300 మాత్రమే!బట్టలు ఆరేయడానికి... గోడే గ్రౌండ్!వానాకాలంలో బట్టలు ఉతకడం ఓ సమస్య అయితే... వాటిని ఆరేయడం మరో పెద్ద సమస్య! ఇంట్లో తాడు కడితే దానికి బట్టలే కాదు... మన ఇల్లు మొత్తం వేలాడుతున్నట్టుంటుంది. ఇక స్టాండ్ పెడితే నడవడానికి దారి ఉండదు. ఈ సమస్యకు ఒక తెలివైన పరిష్కారమే ఈ రిట్రాక్టబుల్ క్లాత్స్లైన్. దీన్ని గోడకు అమర్చి, అవసరమైనప్పుడు బయటకు లాగితే నాలుగు లైన్లు రెడీ!బట్టలు, టవల్స్, బెడ్‌షీట్స్ వంటివి ఆరేసుకోవచ్చు. పని అయిపోయాక లైన్లను మళ్లీ లోపలికి పంపేస్తే... గోడ మీద చిన్న బాక్స్లా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంట్లో స్థలం తక్కువగా ఉన్నా, బాత్రూమ్ నుంచి బాల్కనీ వరకు ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అలా ఇప్పుడు బట్టలు ఆరేయడానికి ఇల్లు పెద్దగా ఉండాల్సిన పనిలేదు... గోడ ఉంటే చాలు! ధర రూ.750 మాత్రమే!బ్యాగ్‌లో పట్టే కెటిల్!ప్రయాణాల్లో టీ కావాలి... కాఫీ కావాలి... నూడుల్స్ కావాలి! అదీ... ఇంట్లో చేసుకున్నట్టుగా! కానీ కెటిల్ తీసుకెళ్దామంటే బ్యాగ్‌లో ప్లేస్ ఉండదు. అయితే, ఈ కెటిల్ మాత్రం అలా కాదు! వాడేటప్పుడు కెటిల్‌లా.. పని అయిపోయాక మడిస్తే చిన్న స్నాక్ బాక్స్లా పనిచేస్తుంది. 600 మిల్లీలీటర్ల సామర్థ్యంతో నీటిని త్వరగా మరిగించి టీ, కాఫీ, నూడుల్స్, ఓట్స్, సూప్ వంటివి సిద్ధం చేసుకోవచ్చు. 600 వాట్ల పవర్‌తో పనిచేసే ఇందులో నీరు మరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే సదుపాయంతో పాటు, నీరు లేకుండా వేడెక్కకుండా రక్షణ కూడా ఉంది. హాస్టల్ నుంచి హోటల్ వరకు... ప్రయాణం నుంచి క్యాంపింగ్ వరకు ఎక్కడైనా వెంట తీసుకెళ్లొచ్చు. అంటే... బ్యాగ్‌లో బట్టలకే చోటు లేకపోయినా... కెటిల్‌కు మాత్రం చోటు దొరికేస్తుంది! ధర రూ.500 మాత్రమే!ఇవి చదవండి: ‘చిన్న ముల్లుకే ఏడుస్తావా?’.. కోతికి చివర్లో దిమ్మతిరిగే గుణపాఠం! -
ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!
ఎయిర్టెల్ యూజర్ల కోసం ప్రస్తుతం ఎన్నో రకాల ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 5G డేటా, OTT సబ్స్క్రిప్షన్లు కావాలనుకునే వారికి కొన్ని ప్లాన్స్ ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ కథనంలో రోజుకు 2.5GB డేటా లభించే మూడు ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.రూ.399 ప్లాన్ఎయిర్టెల్ రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 2.5జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 70జీబీ డేటాను వినియోగించుకోవచ్చన్నమాట. అన్లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. దీంతో పాటు 28 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం యాక్సెస్ లభిస్తాయి.రూ.1,199 ప్లాన్ఎక్కువ కాలం రీచార్జ్ గురించి ఆలోచించకుండా ఉండాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2.5జీబీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. సబ్స్క్రైబర్లు ప్లాన్ కాల వ్యవధిలో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. రోజువారీ డేటా పరిమితి అయిపోగానే, మరుసటి రోజు వరకు ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది.రూ.3,999 ప్లాన్తరచూ రీచార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి రూ.3,999 ప్లాన్ మంచి ఆప్షన్. ఈ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రీఛార్జ్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అదనంగా మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.ఏ ప్లాన్ తీసుకోవాలి?నెలనెలా రీచార్జ్ చేసుకునే అలవాటు ఉన్నవారికి రూ.399 ప్లాన్ సరిపోతుంది. 84 రోజుల వ్యాలిడిటీతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కావాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఏడాది పాటు ఒకే రీచార్జ్‌తో డేటా, కాలింగ్, 5జీ సేవలు కొనసాగాలనుకునే వారికి రూ.3,999 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. -
లేటెస్ట్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ డీల్..
ఐఫోన్లకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చాలామందికి ఈ ప్రీమియం ఫోన్లు వాడాలని ఉన్నా వాటి అధిక ధరల కారణంగా కొనలేరు. అయితే యాపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ విడులకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro)పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 256GB వేరియంట్‌ను రూ.90 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ప్రో 256GB వేరియంట్ ప్రస్తుతం రూ.1,29,900కు లిస్టయింది. దీని అసలు ధర రూ.1,34,900 కాగా, నేరుగా రూ.5,000 తగ్గింపు లభిస్తోంది. అదనంగా అర్హత కలిగిన ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.9,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తున్నట్లు ఉత్పత్తి పేజీలో చూపిస్తోంది.ఈ డీల్‌లో అసలు ఆకర్షణ ఎక్స్ఛేంజ్ ఆఫర్. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఎంపిక చేసిన పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ విలువను అందిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్ 15కి రూ.30,000 వరకు విలువ లభించవచ్చని తాజా డీల్ వివరాలు సూచిస్తున్నాయి. రూ.30,000 ఎక్స్ఛేంజ్ ప్రయోజనం, రూ.9,000 బ్యాంక్ డిస్కౌంట్ రెండూ పూర్తిగా లభిస్తే ఐఫోన్ 17 ప్రో రూ.90,900 లకే వస్తుంది.ఐఫోన్ 17 ప్రో మోడల్లో A19 ప్రో చిప్, 6.3 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 48MP కెమెరా సిస్టమ్, 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. -
నేపాల్ వరదలు.. ప్రకృతి ఉగ్రరూపానికి పరాకాష్ఠ
ఇటీవల నేపాల్‌లో కురిసిన అసాధారణ భారీ వర్షాలు, దాని ఫలితంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం ఆ దేశంలో ఊహించని ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. హిమాలయ ప్రాంతాల సున్నితమైన పర్యావరణం, అసంఘటిత పట్టణీకరణ, వాతావరణ మార్పుల తీవ్రత కలిసి నేపాల్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వంతెనలు, రహదారులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమై ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ విపత్తు కేవలం నేపాల్‌కే కాకుండా నదీ పరివాహక ప్రాంతాలైన దక్షిణాసియా దేశాలన్నింటికీ ఒక తీవ్ర హెచ్చరిక.సాంకేతిక ఆధారిత ముందస్తు జాగ్రత్తలుఇలాంటి ప్రాణాంతక పరిణామాల తీవ్రతను తగ్గించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సాటిలైట్ ఇమేజరీ, డోప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా మేఘాల స్థితిని, వర్షపాత తీవ్రతను నిమిషాల వ్యవధిలో అంచనా వేయవచ్చు. నదుల ఎగువ ప్రాంతాల్లో ఐఓటీ సెన్సార్లను అమర్చడం ద్వారా నీటి మట్టం పెరిగిన వెంటనే దిగువ ప్రాంత ప్రజలకు ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ అలర్ట్‌లు పంపవచ్చు. హిమాలయాల్లోని మంచు సరస్సులు బద్దలయ్యే ప్రమాదాన్ని ముందే పసిగట్టేందుకు రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు అత్యంత కీలకం.వర్తమాన దేశాల వినియోగం - ఆర్థిక సవాళ్లుఅభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, అమెరికా వంటివి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ (ఈడబ్ల్యూఎస్), మల్టీ-లేయర్డ్ మైక్రో-క్యాచ్మెంట్ మేనేజ్మెంట్ తరహా సూక్ష్మ జలపాత నియంత్రణ సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. భారత్ కూడా కల్పకం, కేంద్రీయ జల సంఘం (సీడబ్ల్యూసీ) ద్వారా నదీ పరివాహక ప్రాంతాల్లో అధునాతన అంచనా వ్యవస్థలను అమలు చేస్తోంది. అయితే నేపాల్, భూటాన్ వంటి పరిమిత ఆర్థిక వనరులున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సాంకేతికతను అందుకోవడం సవాలుగా మారింది.అధిక వ్యయంఆధునిక డోప్లర్ రాడార్లు, రియల్-టైమ్ సమాచార నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు బిలియన్ డాలర్ల మూలధనం అవసరం. భౌగోళికంగా క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో సాంకేతిక పరికరాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతోంది. సరిహద్దు దాటి ప్రవహించే నదుల విషయంలో పొరుగు దేశాల మధ్య తగినంత సమాచార మార్పిడి లేకపోవడం మరిన్ని నష్టాలకు దారితీస్తోంది.పరిష్కార మార్గంవాతావరణ వైపరీత్యాలు సరిహద్దులుండవు. కాబట్టి సార్క్ లేదా బిమ్స్టెక్ వంటి ప్రాంతీయ కూటమిల ద్వారా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కలిపి నిధులు సమకూర్చుకోవాలి. గ్లోబల్ క్లైమేట్ ఫండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు నేపాల్ వంటి సున్నితమైన ప్రాంతాలకు ఉచిత సాంకేతిక బదిలీ, ఆర్థిక సహాయం అందించాలి. ప్రాణనష్టాన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికతపై పెట్టే పెట్టుబడి, విపత్తు తదుపరి పునరావాసానికి అయ్యే వ్యయం కంటే చాలా తక్కువ అని ప్రపంచ దేశాలు గ్రహించాలి.ఇదీ చదవండి: యూట్యూబ్‌తో అమెజాన్ చేతులు -
డిగ్రీ కాదు.. స్కిల్స్ ఉంటే చాలు! ఈ రాష్ట్రం టాప్‌లో!
ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు.. కార్పొరేట్ హబ్‌గా వెలుగుతున్న ముంబైలను దాటుకుని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, స్కిల్స్ రేస్‌లో ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకుంది! ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 విడుదల చేసిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. 78.64 శాతం ఎం΄్లాయబిలిటీ రేటుతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా.. ఇందులో మహిళలే ఎక్కువ అర్హత గలవారిగా రికార్డు సృష్టించారు. ఉద్యోగానికి కావాల్సింది చేతిలోని డిగ్రీలు కాదు... స్కిల్స్ కూడా అవసరమే అని నిరూపించారు.ఇన్నాళ్లూ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలదే హవా అనుకున్న ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తూ, ఈసారి ఉత్తరప్రదేశ్ యువత ప్రతిభలో టాప్‌గేర్ వేశారు. మారుతున్న ఉద్యోగ అవసరాలకు తగినట్టుగా నైపుణ్యాలను పెంపొందించుకుని 78.64 శాతంతో ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది. వాణిజ్య రాజధాని మహారాష్ట్ర గట్టి పోటీనిచ్చినప్పటికీ 75.42 శాతంతో రెండో స్థానానికే పరిమితమైంది. కర్ణాటక ఐటీ పవర్ హౌస్‌గా ఉన్నప్పటికీ 73.85 శాతంతో నైపుణ్య వృద్ధిలో మూడో స్థానానికి చేరింది. కేరళ విద్యా శ్రేణిలో ముందంజలో ఉన్నా నైపుణ్యంలో 72.16 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 71.25 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది.జాతీయ సగటు పెరుగుదలదేశ వ్యాప్తంగా యువత ఉద్యోగ అర్హత 2025లో 54.81% ఉండగా 2026 నాటికి 56.35% కి పెరిగింది. 2022లో ఇది 46.2% మాత్రమే ఉండేది. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరగడం దీనికి ప్రధాన కారణం.మహిళలే టాప్ఉద్యోగార్హతలో మహిళలు (54%) మొదటిసారిగా పురుషులను (51.5%) వెనక్కి నెట్టారు! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వస్తున్న మహిళలు బ్యాంకింగ్, హెల్త్‌కేర్, విద్యారంగాల్లో సరికొత్త రికార్డులు çసృష్టి్టస్తున్నారు.ఏఐ నైపుణ్యాలే ముఖ్యంకంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో అత్యధికంగా 80%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 78%, ఇన్స్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో 77% ఉద్యోగ అర్హత నమోదైంది. ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ ఉంది. గ్లోబల్ ఏఐ టాలెంట్‌లో 16% వాటా మన భారతీయులదే.గిగ్ ఎకానమీ ధమాకా2030 నాటికి దేశంలో 2.35 కోట్ల మంది ఫ్రీలాన్సర్లు, గిగ్ వర్కర్లు రాబోతున్నారనీ.. ‘ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆఫీస్ డెస్క్’’ అనే సాంప్రదాయ పద్ధతికి కాలం చెల్లుతోందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. పాఠ్యపుస్తకాల్లో చదివే పాతకాలపు విషయాల కంటే, కంపెనీలలో నేరుగా ఉపయోగపడే ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నవారికే ఉద్యోగాల్లో గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది.అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కోడింగ్, ఏఐ టూల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్న యువత ఏ ప్రాంతంతోనూ సంబంధం లేకుండా ముందంజలో ఉంటరన్నమాట.ఇవి కూడా చదవండి: ఆటల్లో రాణిస్తున్నారు! -
టెలికం రంగంలో ఎయిర్టెల్ జోరు!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ జూలైలో అత్యధికంగా కొత్త యూజర్లను దక్కించుకుంది. గత నెల కంపెనీ కనెక్షన్ల సంఖ్య నికరంగా 26.8 లక్షలు పెరిగింది. మరో అగ్రగామి రిలయన్స్ జియో కొత్త యూజర్లు 24.4 లక్షల మేర పెరిగారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం జూలైలో భారతి ఎయిర్టెల్ వైర్లెస్ యూజర్ల సంఖ్య 48.94 కోట్లకు, జియో సబ్ర్‌స్కయిబర్స్ సంఖ్య 50.60 కోట్లకు చేరింది.వొడాఫోన్ ఐడియా మొబైల్ యూజర్లు 2.4 లక్షలు పెరిగి మొత్తం 19.90 కోట్లకు చేరారు. అటు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు కూడా 1.68 లక్షల మేర పెరిగాయి. కొత్తగా 55.38 లక్షల మొబైల్ యూజర్ల చేరికతో దేశీయంగా వైర్లెస్ సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 128.79 కోట్లకు చేరింది. అంతక్రితం నెల ఇది 128.23 కోట్లుగా నమోదైంది. 1,562 ఆపరేటర్ల నుంచి లభించిన వివరాల ప్రకారం మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య జూన్ ఆఖరు నాటికి 108.75 కోట్లుగా ఉండగా జూలై చివరికి 109.44 కోట్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది. -
జియో, ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్లు.. చౌకగా ఏడాది వ్యాలిడిటీ!
మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డేటా అవసరం లేని వినియోగదారులకు టెలికాం కంపెనీలు ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే అవసరమయ్యే వారు డేటా కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ప్లాన్లను వినియోగించుకోవచ్చు. ఈ క్రమంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ వేర్వేరు ధరలతో వాయిస్-ఓన్లీ ప్లాన్లను అందిస్తున్నాయి.ఎయిర్టెల్ రూ.1,849 ప్లాన్భారతీ ఎయిర్టెల్ రూ.1,849 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, 3,600 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ ప్లాన్‌లో డేటా ప్రయోజనం లేదు. అలాగే అదనపు ప్రయోజనాలను కంపెనీ అందించడం లేదు. రోజువారీ ఖర్చును లెక్కిస్తే సుమారు రూ.5.07 అవుతుంది.జియో రూ.1,748 ప్లాన్రిలయన్స్ జియో అందిస్తున్న రూ.1,748 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు మొత్తం 3,600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ముఖ్యంగా ఈ ప్లాన్‌లో డేటా ప్రయోజనం ఉండదు. అంటే ఇంటర్నెట్ డేటా అవసరం లేని వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్‌ను రోజువారీ ప్రాతిపదికన చూస్తే సగటున సుమారు రూ.5.20 ఖర్చవుతుంది. అదనంగా జియో టీవీ, జియో ఏఐ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.ఏది బెస్ట్?వ్యాలిడిటీ పరంగా చూస్తే ఎయిర్టెల్ ప్లాన్ 365 రోజుల పాటు సేవలు అందిస్తుండగా, జియో ప్లాన్ 336 రోజులకే పరిమితమవుతుంది. అయితే జియో ప్లాన్‌లో జియో టీవీ, జియో ఏఐ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. మరోవైపు, రోజువారీ ఖర్చు పరంగా ఎయిర్టెల్ ప్లాన్ స్వల్పంగా చౌకగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునేవారు ఎయిర్‌టెల్‌ను, అదనపు డిజిటల్ ప్రయోజనాలు కోరుకునేవారు జియోను పరిగణనలోకి తీసుకోవచ్చు.ఇదీ చదవండి: జియో రీచార్జ్ ప్లాన్: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్! -
భారత్‌లో చాట్‌జీపీటీలో ప్రకటనలు
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సరికొత్త విప్లవం సృష్టించిన ఓపెన్ ఏఐ భారతదేశంలో తన రాబడి మార్గాలను విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని చాట్‌జీపీటీ ఫ్రీ, నెలకు రూ.399 చెల్లించే ‘గో’ ప్లాన్ వినియోగదారులకు సంభాషణల్లో స్పాన్సర్డ్ ప్రకటనలు (యాడ్స్) చూపించడం ప్రారంభించినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అయితే, ప్లస్, ప్రో, బిజినెస్, ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ వంటి పెయిడ్ చందాదారులకు ఎటువంటి యాడ్స్ ఉండవని స్పష్టం చేసింది.వినియోగదారుల డేటా భద్రతప్రకటనల వల్ల వినియోగదారుల అనుభవానికి భంగం కలగకుండా ఓపెన్ ఏఐ కఠినమైన నిబంధనలు విధిస్తున్నట్లు చెప్పింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు ఏఐ ఇచ్చే సమాధానాలపై ఈ ప్రకటనలు ఎలాంటి ప్రభావం చూపవు. ప్రతి సమాధానం కింద ‘స్పాన్సర్డ్’ అని స్పష్టమైన లేబుల్‌తో యాడ్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రకటనకర్తలకు వినియోగదారుల చాట్ హిస్టరీ, వ్యక్తిగత వివరాలు లేదా ‘మెమరీస్’ పొందే అవకాశం ఉండదు. కేవలం ఇంప్రెషన్లు, క్లిక్‌ల వంటి విశ్లేషణల సమాచారం మాత్రమే పొందుపరుస్తారు.నియంత్రణలు18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి ప్రకటనలు కనిపించవు. అలాగే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, రాజకీయం వంటి సున్నితమైన అంశాల చర్చల సమయంలో ప్రకటనలు ప్రదర్శించబడవు. సుమారు 330 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులు ఉన్న ఇండియా ఓపెన్ ఏఐకి అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 4 నుంచి 'చాట్‌జీపీటీ యాడ్స్ మేనేజర్' ద్వారా రోజుకు రూ.725 ప్రారంభ బడ్జెట్‌తో వ్యాపార ప్రకటనలు ఇచ్చుకునే వెసులుబాటును కల్పిస్తోంది. మొదటి దశలో డబ్ల్యూపీపీ, ఓమ్నికామ్ ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకోగా మొదటి వారంలోనే 50కి పైగా ప్రముఖ బ్రాండ్లు ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధమయ్యాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు! -
ఏంటి..? ఏఐ ఇప్పుడు వైరస్‌లను కూడా రూపొందిస్తోందా?
ఏఐతో ఇప్పటిదాకా చిత్రాలను, చిన్నచిన్న వీడియోలను తయారు చేయడం మనకు తెలుసు... కొందరు కోడింగ్ కోసం ప్రాంప్ట్ ఇస్తారు. ప్రాజెక్టు పనులకు కోసం వివరాలు వెతుకుతారు, మరికొందరు కొత్త రకం సినిమా కథలను తయారు చేయడం, సంగీతాన్ని సృష్టించడం కోసం ఏఐని వాడుతున్నారు.అయితే, తాజా పరిశోధనల ఫలితంగా జీవుల జన్యు నిర్మాణాన్ని కూడా రూపొందించే దిశగా కృత్రిమ మేధా అడుగులు వేస్తోంది. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ సంస్థ పరిశోధకులు కృత్రిమ మేధస్సును ఉపయోగించి ప్రకృతిలో ఇంతకు ముందు లేని 16 కొత్త వైరస్‌లను రూపొందించారు. వీటితో మానవాళికి ప్రమాదం లేదు. ఎందుకంటే ఇవి మనుషులకు సోకేవి కావు.మనుషులను బాధించే బ్యాక్టీరియాను నాశనం చేసే వైరస్. మందులకు లొంగని బ్యాక్టీరియాని ఈ తరహా వైరస్‌లతో ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం ప్రయోగశాలలోనే ఉంది. ఏఐతో రూపొందించిన వైరస్ తయారై మార్కెటెక్కాలంటే మరి కొన్నేళ్లు ఆగాల్సిందే.ఇవి కూడా చదవండి: మందులు కాదు.. మ్యూజిక్ చాలు! ఏఐతో మానసిక ఒత్తిడికి చెక్! -
డేటాను విశ్లేషించే ఏఐ.. 15 ఏళ్లకే అంతర్జాతీయ గుర్తింపు!
మానసిక సమస్యలతో బాధ పడుతున్నవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ‘జటిలమైన మందులు అవసరం లేదు. మ్యూజిక్ వినండి చాలు’ అంటూ ముందుకు వచ్చింది ఏఐ–ఆధారిత ఆడియో విజువల్ ప్లాట్‌ఫామ్... హార్మోని. ‘హార్మోని’ అనే రిసెర్చ్ ప్రాజెక్ట్ ప్రయోగదశలో సత్ఫలితాలను ఇస్తోంది. ఎంతోమందిని ఒత్తిడికి దూరం చేసింది.వాషింగ్టన్కు చెందిన అనూష అరోరా రీజెనరాన్కి పదిహేనేళ్లు. అనూష వ్యక్తిగత అనుభవం నుంచే ‘హార్మోని’ ఆవిష్కృతమైంది. ఆమె తల్లి ఒత్తిడిగా అనిపించినప్పుడు సంగీతం వినేది. ఫలితంగా ఆమెకు ఎంతో రిలీఫ్‌గా అనిపించిందేని చెప్పేది. అప్పటి నుంచి అనూష సరికొత్త మ్యూజిక్ థెరపీ ప్లాట్‌ఫామ్ గురించి ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీ సహాయంతో మరింత పర్సనలైజ్ మ్యూజిక్ థెరపీని అందించే దిశలో పరిశోధన చేయడానికి నడుం కట్టింది. తనప్రాజెక్ట్కు ‘హార్మోని’ అని నామకరణం చేసింది.డేటాను అర్థం చేసుకొని...ముందుగా నిర్ణయించిన ప్లే లిస్ట్‌లపై ఆధార పడకుండా వ్యక్తులలోని భావోద్వేగ స్థితిగతులకు అనుగుణంగా స్పందించే ఒక పోర్టబుల్ ప్లాట్‌ఫామ్‌గా ‘హార్మోని’ రూపొందించింది అనూష. వేలి సెన్సార్లు శారీరక సమాచారాన్ని అందిస్తాయి. దానిని ‘హార్మోని సిస్టమ్ విశ్లేషిస్తుంది. ఏఐ మోడల్స్ ఆ డేటాను అర్థం చేసుకొని భావోద్వేగ స్థితికి అనుగుణంగా ఉండే సంగీతాన్ని, దృశ్యాలను అందిస్తాయి.భావోద్వేగాలను గుర్తించడానికి, సంగీతాన్ని రూపొందించడంలో వివిధ అంశాలను సమన్వయం చేయడానికి 11 ఏఐ ప్రోగ్రామ్స్‌ను ‘హార్మోని’ మిక్స్ చేస్తుంది. తద్వారా తన ఔట్‌పుట్‌ను రియల్‌టైమ్‌లో సర్దుబాటు చేసుకోగలుగుతుంది. ఇప్పటికైతే ‘హార్మోని’ ఒక రిసెర్చ్ప్రాజెక్ట్గా మాత్రమే కొనసాగుతోంది. ఏఐ–ఆధారిత మ్యూజిక్ థెరపీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన అనూష ఐఎస్ఇఎల్ 2026లో ఫ్యామిలీ ప్రైజ్ ఫర్ స్టెమ్ ఎక్స్‌లెన్స్ అవార్డును, 50 వేల డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకుని తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది.ఇవీ చదవండి: ఒక్క మాట.. ఓ కవిత.. ఓ కప్పు టీ.. వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగు! -
గూగుల్‌తో విప్రో బిగ్ ప్లాన్
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా గ్లోబల్ ఐటీ దిగ్గజం విప్రో సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాపార సంస్థలకు అత్యాధునిక సేవలందించేందుకు ఏకంగా 10,000 మంది ఏఐ సర్టిఫైడ్ స్పెషలిస్టులను తయారు చేయాలని నిర్ణయించింది. గూగుల్ మల్టీమోడల్ ఏఐ మోడల్ ‘జెమినీ’ ఆధారిత సొల్యూషన్స్‌ను రూపొందించడమే లక్ష్యంగా ఈ భారీ మానవ వనరుల శిక్షణా కార్యక్రమాన్ని చేపడుతోంది.ఈ బృందంలో ప్రత్యేకంగా 1,500 మంది ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్లు ఉంటారు. వీరు నేరుగా క్లయింట్ ఆఫీస్ ప్రాంగణాలలోనే (ఆన్-సైట్) అందుబాటులో ఉంటూ సాంకేతిక సవాళ్లను తక్షణమే పరిష్కరించడంతో పాటు వ్యాపార ప్రక్రియల డిజిటలైజేషన్లో కీలక పాత్ర పోషిస్తారు.విప్రో సొంత ఏఐ ప్లాట్‌ఫామ్ ‘విప్రో ఇంటెలిజెన్స్’కు గూగుల్ జెమినీ శక్తిని జత చేయడం ద్వారా క్లయింట్ కంపెనీలు తమ ఉత్పాదకతను, పనితీరును గణనీయంగా పెంచుకోగలవని విప్రో లిమిటెడ్ మేనేజింగ్ పార్ట్నర్ కన్వర్ సింగ్ వెల్లడించారు. జనరేటివ్ ఏఐ సేవలకు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి ఈ వ్యూహాత్మక అడుగు ఎంతో దోహదపడుతుందని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? -
మనిషి కదలికలే డేటా..! ఎందుకో తెలుసా?
ఇంట్లో ఈజీ చైర్లో కూర్చున్న వ్యక్తి ఓ పుస్తకాన్ని చదువుతున్నాడు. అతనికి కాఫీ ఇచ్చారు. అతను కాఫీ తాగుతూ, కళ్ల జోడు సరి చేసుకుంటూ, పేజీలు తిరగేస్తూ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఇది ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా జరిగేదే కదా అని మీరంటే ఒక్క నిమిషం ఆగండి..ఇదే పనిని ఓ రోబో చేయాలంటే? ఈజీ చైర్లో కూర్చున్నప్పుడు అది ఒక వుడెన్ చైర్ అని రోబో గుర్తించాలి. కూర్చున్న తర్వాత కుర్చీ ఊగుతుండగా తనని తాను బ్యాలెన్స్ చేసుకోవాలి. పుస్తకాన్ని పట్టుకునేటప్పుడు చేతిని సరైన కోణంలో ఉంచాలి. పేజీలు తిరగేసేటప్పుడు వేళ్లతో సున్నితంగా ముట్టుకోవాలి. కాఫీ ఇస్తే ఊగుతున్న కుర్చీని బ్యాలెన్స్ చేస్తూ మరో చేతితో కప్పుని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా అందులోని కాఫీ ఒలికిపోకుండా.. వీటన్నింటికీ ప్రత్యేకమైన కమాండ్స్ ఇచ్చి ఓ రోబో చేత చేయించాలంటే ఎంత సాంకేతికతతో కూడిన డేటా అవసరమో ఒక్కసారి ఆలోచించండి..ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది హ్యుమన్ ఆర్కైవ్... మనుషుల ప్రపంచాన్ని డేటాగా మార్చి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న స్టార్టప్ కంపెనీయే ఈ హ్యుమన్ ఆర్కైవ్.భారతీయ మూలాలు ఉన్న ఓ నలుగురు స్నేహితులు కలిసి ఓ స్టార్టప్‌ను మొదలుపెట్టారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఈ మధ్యే ప్రారంభమైన ఈ స్టార్టప్ కంపెనీ అనతి కాలంలోనే బాగా విస్తరించింది. ముఖ్యంగా ఈ కంపెనీ కార్యకలా΄ాలు భారత్‌లోనే ఎక్కువ కొనసాగుతున్నాయి. రాజ్ పటేల్, రుషీ అగర్వాల్, సమయ్ మైనీ, షోక్లా పటేల్ దీని వ్యవస్థాపకులు.æరుషీ అగర్వాల్ రెండేళ్ల కిందటే జైపూర్ నుంచి యూఎస్‌కి వెళ్లాడు. ఈ నలుగురు అమెరికాలో కంపెనీ స్థాపించినప్పటికీ డేటా కలెక్షన్‌కి భారత్‌నే ఎంచుకున్నారు. లక్ష్యంమనుషులు చేసే పనులను రోబోలతో చేయించాలంటే మనుషుల శారీరక కదలికలు, పని చేస్తున్నప్పుడు చూపే ఏకాగ్రత,, పని చేసే విధానం, హఠాత్ పరిణామాలకు స్పందించే తీరు, ఏయే పనిని ఎంత వేగంతో చేయాలి వంటి అనేకమైన భౌతిక విషయాలను వడపోసి ఆ తీరు తెన్నులను రోబోలకు అలవాటు చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. అంటే మన రియల్ వరల్డ్‌లో మనం చేసే పనులను వర్చువల్ వరల్డ్ లో రోబోలతో చేయించడమే ఈ కంపెనీ లక్ష్యం.ఎంత డేటా?మే 2026 నాటికి వెయ్యికి పైగా హెడ్క్యాప్లను ఉపయోగించి డేటాను సేకరించడం జరిగింది. రోజుకు ఎనిమిది గంటలు అంటే మొత్తం ఎనిమిది వేలగంటల డేటాను తీసుకున్నారు. అంటే వెయ్యి మంది వివిధ రంగాలలో పని చేసే ఉద్యోగుల పనిని రికార్డ్ చేశారన్నమాట. ఇది మాత్రమే కాదు వెయ్యిమంది నుంచి యాభై వేలమందికి హెడ్ క్యాప్‌ల అమర్చి డేటా సేకరణ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఫండింగ్హ్యుమన్ ఆర్కైవ్ కంపెనీలో వివిధ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. వింగ్ వెంచర్ క్యాపిటల్, ఎన్వీపీ క్యాపిటల్, వై కాంబినేటర్ వంటి కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. దాదాపు ఇప్పటివరకు హ్యుమన్ ఆర్కైవ్ స్టార్టప్‌కి 8.2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.నిజానికి ఇది ఒకసారి పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు డేటా సేకరించి రోబోటిక్ మోడల్స్‌ను ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అమెరికా, చైనా, ఆసియాలో కొన్ని దేశాలలో డేటా సేకరణ జరుగుతోంది. స్కేల్ ఏఐ, షిప్ట్, ఎక్స్డాఫ్, ఫిగర్ ఏఐ, యాప్ట్రానిక్స్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ తరహా ప్రాజెక్టులపై దృష్టి పెట్టాయి. ఒక షిఫ్ట్ కంపెనీ మాత్రమే దాదాపు 15 దేశాల నుంచి డేటాను సేకరిస్తోంది. ఈ కంపెనీలు వీడియో డేటా మీద దృష్టి పెడితే హ్యుమన్ ఆర్కైవ్ మాత్రం ఆర్జీబీ, డెప్త్, బాడీ మోషన్ తదితర విషయాలపై డేటాను సేకరిస్తోంది. అన్ని పరిశోధనలు పూర్తయిన తర్వాత డేటాను కోడింగ్ రూపంలో రోబోలకు ట్రైనింగ్ ఇచ్చి పరీక్ష చేస్తారు. నేటిబాలలే రేపటి పౌరులు అన్నచందగా నేటి ట్రైనింగ్ రోబోలే రేపటి వెయిటర్లు, కుక్‌లు, కాంపౌండర్లు, సర్వెంట్లుగా మారనున్నాయి. .ఎలా పని చేస్తుంది?ప్రతి పనినీ దగ్గరగా పరిశీలించి రోబోలకు డేటా రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేకమైన హెడ్ క్యాప్ ఇస్తారు. వీటిని ఈగో సెంట్రిక్ కెమెరా రిగ్స్ అని అంటారు. ఈ హెడ్ క్యాప్‌లో అమర్చిన ప్రత్యేకమైన కెమెరాలు ఉద్యోగి చేసే పనులు, కదలికలను రికార్డ్ చేస్తాయి. ఇలా ఫస్ట్ పర్సన్ వీడియో డేటాను సేకరిస్తారు.ఉదాహరణకు ఇంట్లో ఒక వ్యక్తి ఫ్లోర్ మాప్ చేస్తున్నాడనుకోండి. అతను నేలపై ఉన్న వస్తువును చూసి పక్కకు జరుపుతాడు. మాప్‌ను ఒక ప్రత్యేక కోణంలో తిప్పుతాడు. ఏదైనా అడ్డు తగిలితే తన కదలికను మార్చుకుంటాడు. మనకేమో ఇదంతా మామూలే కదా అనిపిస్తుంది, క్షణాల్లో జరిగిపోతుంది. కాని రోబోకు అదంతా పెద్ద టాస్క్. అందుకే వాటిని ట్రైన్ చేయడం కోసమే ఈ సమాచార సేకరణ.– శ్రావణ్ జయఇవి కూడా చదవండి: స్మార్ట్‌వాచ్‌కు మించిన ట్రాకర్.. ‘టెంపుల్’లో ఏముంది? -
స్మార్ట్‌వాచ్‌కు మించిన ట్రాకర్.. ‘టెంపుల్’లో ఏముంది?
వేరబుల్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి... స్మార్ట్ వాచ్, ఫిట్నెస్ బ్యాండ్, రింగ్.... మొదలైనవి. ‘టెంపుల్ రూపంలో కొత్త రకం వేరబుల్ రావాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు ‘జొమాటో’ ఫౌండర్ దీపీందర్ గోయల్.గత కొన్ని నెలలుగా గోయల్ ఈ ‘టెంపుల్’ గురించి ఊరిస్తున్నారు. దానిపై హైప్ సృష్టిస్తున్నారు. ‘త్వరలోనే టెంపుల్ భారతదేశంలో విడుదల కాబోతుంది’ అని ఆయన ప్రకటించారు.ఇంతకీ ఏమిటి ఈ టెంపుల్?దీపీందర్ గోయల్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రయోగాత్మక వెల్నెస్ వేరబుల్...టెంపుల్. అథ్లెట్ల కోసం రూపొందించిన ఒక హై–పెర్ఫార్మెన్స్ ట్రాకర్‌గా ‘టెంపుల్’ గురించి ప్రచారం చేస్తున్నారు. మెదడు, శరీర కార్యకాలపాలను పర్యవేక్షించడానికి దీన్ని రూపొందించారు. ప్రామాణిక ఫిట్నెస్ కొలమానాలకు మించి ఇది పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రముఖ అథ్లెట్లలో కొందరు ‘టెంపుల్’ ధరించి కనిపిస్తున్నారు. తేలికైన డిజైన్‌తో ఉండే ఈ పరికరాన్ని కణతల ప్రాంతంలో నొప్పి లేకుండా ధరించవచ్చు.ఇవీ చదవండి: ఐఐటీ చదివి గూగుల్‌లో జాబ్ కొట్టాలనుకుంటే..ఏకంగా ఆ కంపెనీనే..! -
శామ్సంగ్కు షాక్.. భారీ నష్టపరిహారానికి ఆదేశం
శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ స్విస్ వాచ్ తయారీ సంస్థ స్వాచ్ గ్రూప్ ఏజీకి శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. స్వాచ్ గ్రూప్‌కు చెందిన బ్రెగ్యూట్, బ్లాంక్‌పెయిన్, ఒమేగా, లాంగిన్స్, టిస్సోట్ వంటి లగ్జరీ వాచ్ బ్రాండ్ల డిజైన్లను పోలిన స్మార్ట్‌వాచ్ వాచ్-ఫేస్ యాప్‌లను తన గెలాక్సీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంచినందుకు శామ్సంగ్ 11.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1.16 కోట్లు) చెల్లించాలని లండన్ హైకోర్టు ఆదేశించింది.ఈ వివాదం 2015 అక్టోబర్ నుంచి 2019 ఫిబ్రవరి మధ్య కాలానికి సంబంధించినది. స్వాచ్ గ్రూప్ వాచ్‌ల డయల్స్, డిజైన్లు, ట్రేడ్‌మార్క్‌లను పోలిన డిజిటల్ వాచ్ ఫేస్ యాప్‌లను శామ్సంగ్ గెలాక్సీ యాప్ స్టోర్‌లో థర్డ్ పార్టీ డెవలపర్లు అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లు శామ్సంగ్ స్వయంగా రూపొందించినవి కాకపోయినా, వాటిని యాప్ స్టోర్‌లో అనుమతించడం, ప్రదర్శించడం ద్వారా ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు శామ్సంగ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తేల్చింది.ఈ కేసులో స్వాచ్ గ్రూప్ తొలుత సుమారు 170 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరింది. అయితే శామ్సంగ్ మాత్రం నష్టం చాలా స్వల్పమని, గరిష్ఠంగా సుమారు 300 డాలర్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వాదించింది. ఈ వాదనను కోర్టు అంగీకరించలేదు. న్యాయమూర్తి మార్కస్ స్మిత్ ప్రకారం, స్వాచ్ బ్రాండ్లను తక్కువ లేదా ఎలాంటి ధర లేకుండా డౌన్లోడ్ చేసుకునే యాప్‌ల రూపంలో శామ్సంగ్ యాప్ స్టోర్‌లో ప్రదర్శించడం ఆ బ్రాండ్ల విలువకు గణనీయమైన నష్టం కలిగించింది.మొత్తం నష్టపరిహారంలో సుమారు 10 మిలియన్ డాలర్లు శామ్సంగ్ యాప్ స్టోర్‌లో స్వాచ్ బ్రాండ్లను ప్రదర్శించడం వల్ల కలిగిన నష్టానికి కేటాయించినట్లు నివేదికలు వెల్లడించాయి. అదనంగా, ఉల్లంఘనకు సంబంధించిన వాచ్-ఫేస్ యాప్‌లు యూకే, యూరోపియన్ యూనియన్‌లో సుమారు 1.6 లక్షల సార్లు డౌన్లోడ్ అయిన అంశాన్ని కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.తాజా తీర్పుపై శామ్సంగ్ స్పందిస్తూ.. కోర్టు నిర్ణయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అప్పీల్‌తో సహా అన్ని చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తామని తెలిపింది. మరోవైపు, శామ్సంగ్ ఉల్లంఘన తీవ్రతను పదేపదే తగ్గించి చూపేందుకు ప్రయత్నించిందని స్వాచ్ గ్రూప్ విమర్శించింది. ఇదే 10 స్వాచ్ బ్రాండ్లు శామ్సంగ్పై అమెరికాలో దాఖలు చేసిన ప్రత్యేక కేసు కూడా పెండింగ్‌లో ఉంది.ఇదీ చదవండి: రూ.22 వేల కోట్ల అప్పులు.. రూ.6.5 కోట్లతో చెల్లు! -
మీ ఫోన్లోనే AI పరీక్ష పెడుతోంది!.. ఎలాగో తెలుసా?
పరీక్ష అంటే ఒకప్పుడు.. ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగేవారు విద్యార్థులు సమాధానాలు రాసేవారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రశ్నాపత్రాలు, మార్కులు ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇలా పరీక్షల రూపం కాలానుగుణంగా మారుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మరో కొత్త పరీక్ష మొదలైంది. ఎలాంటి ప్రశ్నాపత్రం లేదు.. ఇన్విజిలేటర్ కనిపించడు.. అయినా ప్రతిరోజూ మనం ఓ పరీక్ష రాస్తూనే ఉన్నాం. అదీ మన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తోనే!స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం సమాచారం తెలుసుకునే సాధనం మాత్రమే కాదు.. మన అలవాట్లు, ఆసక్తులు, అభిరుచులను బయటపెట్టే అద్దంగా మారింది. మనం ఏ వీడియో చూస్తున్నాం? ఏ వార్తపై ఆగుతున్నాం? ఏ ఫొటోను ఇష్టపడుతున్నాం? ఏ అంశాన్ని పదే పదే వెతుకుతున్నాం? ఇవన్నీ మనకు తెలియకుండానే ఓ డిజిటల్ రికార్డుగా మారుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహిస్తోంది కృత్రిమ మేధస్సు (AI). సమాధానాలు రాసేది కలం కాదు.. మన వేళ్లు. మనం చేసే ప్రతి క్లిక్, ప్రతి స్క్రోల్, ప్రతి సెర్చ్, ఒక వీడియోను చూసే సమయం, ఒక వార్తపై స్పందించే తీరు.. ఇవన్నీ AIకి మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే సంకేతాలుగా మారుతున్నాయి. వినియోగదారుల ప్రవర్తనా సరళిని విశ్లేషించే ఈ సాంకేతికత ఆధారంగానే మనకు కనిపించే కంటెంట్, ప్రకటనలు, సిఫార్సులు మారుతున్నాయి.కనిపించని ప్రశ్నాపత్రం ఇదే..ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది చేసే మొదటి పని ఫోన్ చూడటం. యూట్యూబ్‌లో వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో పోస్టులు పరిశీలించడం, గూగుల్‌లో సమాచారం వెతకడం.. ఇవన్నీ సాధారణ అలవాట్లుగానే అనిపిస్తాయి. కానీ AI దృష్టిలో ఇవన్నీ కీలకమైన డేటా. మీరు ఏ వీడియో దగ్గర ఎక్కువసేపు ఆగారు?. ఏ వార్తను వెంటనే ఓపెన్ చేశారు?. ఏ అంశాన్ని పదే పదే వెతికారు?. ఏ పోస్టును షేర్ చేశారు?. ఎలాంటి ప్రాంప్ట్‌లతో ఇమేజ్‌లు జనరేట్ చేస్తున్నారు?.. ఇలాంటి చర్యలను కలిపి AI మీ ఆసక్తులు, అభిరుచులు, ఆలోచనా విధానంపై ఓ అంచనాను రూపొందిస్తుంది.మీకు నచ్చే ప్రపంచాన్నే చూపిస్తుంది..ఉదాహరణకు మీరు వరుసగా ఫుడ్ వీడియోలు చూస్తున్నారు అనుకోండి.. మీ ఫీడ్‌లో ఆ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన వీడియోలు చూస్తే.. ట్రంప్, చైనా, రష్యా, ఇరాన్ వంటి అంశాలకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపించవచ్చు. అలాగే మీరు సినిమాలు, క్రీడలు, టెక్నాలజీ లేదంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చూస్తే.. అదే తరహా సమాచారం మీ ముందుకు వస్తుంది. అంటే ఏఐ అనేది మీకు ప్రపంచాన్ని మొత్తం చూపించదు. మీరు దానితో ఎలా ప్రవర్తిస్తే.. ఆ ఆసక్తితో కూడిన ప్రపంచాన్ని మీ ముందు నిర్మిస్తోంది.జస్ట్ మూడే సెకన్లుడిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో వినియోగదారుడి దృష్టి చాలా విలువైనది. ఒక వీడియో లేదంటే పోస్టు వద్ద వినియోగదారు ఎంతసేపు ఆగుతున్నాడు? ఎక్కడ స్క్రోల్ ఆపుతున్నాడు? అనే అంశాలు కూడా అల్గారిథమ్‌లకు సంకేతాలుగా మారతాయి. ఒక వీడియోను వెంటనే స్కిప్ చేస్తే ఆసక్తి లేదని భావించే అవకాశం ఉంటుంది. అదే వీడియోను పూర్తిగా చూస్తే.. ఆ అంశం వినియోగదారుడికి నచ్చిందనే అంచనాకు రావచ్చు. డేటా ఆధారంగానే భవిష్యత్తులో కనిపించే కంటెంట్, ప్రకటనలు, సజెషన్స్ మారుతుంటాయి.భావోద్వేగాలనూ చదువుతున్న ఏఐ..మనిషి నిర్ణయాల్లో భావోద్వేగాల పాత్ర చాలా ఎక్కువ. దీనిని కూడా ఏఐ గుర్తిస్తోంది. ఉదాహరణకు ఒక వార్తకు రెండు శీర్షికలు ఉన్నాయనుకుందాం. ‘‘దేశాన్ని కుదిపేసిన సంచలన నిర్ణయం!’’. ‘‘ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది’’ ఇలా. ఇందులో మొదటి టైటిల్‌కు ఎక్కువ క్లిక్స్ వస్తే.. సంచలన పదాలు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని ఏఐ నేర్చుకుంటుంది.అందుకే సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే శీర్షికలు, చిత్రాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఏఐ కూడా మన నుంచే నేర్చుకుంటోంది!చాలామంది ఏఐ మనల్ని మాత్రమే నిశితంగా విశ్లేషిస్తుందని భావిస్తారు. కానీ వాస్తవానికి మన స్పందనల నుంచే ఏఐ చాలా నేర్చుకుంటుంది. తనను తాను మెరుగుపరుచుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల మందిలో.. ఎలాంటి కంటెంట్‌కు ప్రజలు స్పందిస్తున్నారు?. ఏ అంశాలపై ఎక్కువ సమయం గడుపుతున్నారు?. ఏ విషయాలు వారిని ఆకర్షిస్తున్నాయి?. ఇలాంటి సమాచారంతో ఏఐ మరింత ఖచ్చితమైన సిఫార్సులు అందించే ప్రయత్నం చేస్తోంది.మార్కులు కనిపించవు.. ప్రభావం మాత్రమే!ఈ ఏఐ పరీక్షలో మనకు మార్కులు గట్రా పడవు. ఎలాంటి ఫలితాల పట్టా రాదు. కానీ దాని ప్రభావం మన జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్ సూచించే వీడియోలు మారతాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మారతాయి. గూగుల్ మన తర్వాతి ప్రశ్నను ఊహించే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్‌లో కనిపించే ప్రకటనలు కూడా మన ఆసక్తులకు అనుగుణంగా మారతాయి(ఇది ఎప్పటి నుంచో సోషల్ మీడియాలోనూ నడుస్తున్న తంతే!). మన మాటల కంటే మన ప్రవర్తనే AIకి ఎక్కువ సమాచారం ఇస్తోంది.సౌకర్యమా?.. సవాలా?భవిష్యత్తులో విద్య, వైద్యం, ఉద్యోగాలు, వినోదం వంటి రంగాల్లో ఏఐ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. మనకు అవసరమైన సమాచారాన్ని ముందుగానే అందించడం, పనులను సులభతరం చేయడం, నిర్ణయాల్లో సహకరించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఏఐ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇదే సమయంలో మరో వైపు కూడా ఉంది. మన ప్రతి ఆన్లైన్ కదలిక, ప్రతి ఆసక్తి, ప్రతి అభిరుచి డేటాగా మారుతున్న వేళ.. వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత, తప్పుడు సమాచారాన్ని గుర్తించే సామర్థ్యం మరింత కీలకంగా మారనున్నాయి. సౌకర్యం కోసం ఏఐపై ఆధారపడుతున్న కొద్దీ దాని వినియోగంపై అప్రమత్తత కూడా అంతే అవసరం. ఒకప్పుడు మనిషి యంత్రాలను పరీక్షించాడు. ఇప్పుడు ఏఐ యుగంలో యంత్రం నిశ్శబ్దంగా మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం సాంకేతిక పరిణామం కాదు.. మనిషి, యంత్రం మధ్య కొత్త సంబంధానికి నాంది. అందుకే ఏఐ మనకు సౌకర్యమా?.. లేక కొత్త సవాలా?.. అన్నది నిర్ణయించేది చివరకు మనమే.::వెబ్‌డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఇరాన్ నాటకాన్ని బయటపెట్టిన ట్రంప్ -
మెటాకు రూ. 1.43 లక్షల కోట్ల భారీ జరిమానా!
వాషింగ్టన్: ఇన్స్టాగ్రామ్, మెటా(ఫేస్బుక్)వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పిల్లలను వ్యసనపరులుగా మారుస్తున్నారనే తీవ్ర ఆరోపణలపై టెక్ దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఈ వివాదానికి తెరదించేందుకు ఏకంగా 17 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,43,000 కోట్లు) సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు ఆ సంస్థ అంగీకరించింది. బిగ్ టెక్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ జరిమానాల్లో ఒకటిగా నిలిచింది.ఎండ్లెస్ స్క్రోలింగ్, బ్యూటీ ఫిల్టర్లు, లైక్‌ల కౌంట్ వంటి వ్యసనపూరిత ఫీచర్లను మెటా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేసిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనివల్ల పిల్లలు, టీనేజర్లలో ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి వంటి తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఈ ముప్పును మెటా సంస్థ గోప్యంగా ఉంచి, ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు గుప్పించారు.అమెరికాలోని 47 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ, ప్యూర్టో రికో, అమెరికన్ సమోవా, నార్తర్న్ మరియానా ఐలాండ్స్ అటార్నీ జనరల్స్, ప్రభుత్వాలు సంయుక్తంగా మెటాపై ఈ సంచలన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ చారిత్రక కేసు విచారణ, సెటిల్మెంట్ ఆమోద ప్రక్రియ యూనైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టులో ముగిశాయి.వర్జీనియా అటార్నీ జనరల్ జే జోన్స్ ఈ కేసులో వర్జీనియా తరఫున కీలక పాత్ర పోషించారు. అటార్నీ జనరల్ జోన్స్ ప్రకటన ప్రకారం.. మెటా ప్లాట్‌ఫామ్స్ సుమారు రూ.1,43,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులో వర్జీనియా రాష్ట్రానికి గ్యారంటీగా 353 మిలియన్ డాలర్లు అందనున్నాయి. 1990ల నాటి బిగ్ టొబాకో సెటిల్మెంట్ల తర్వాత రాష్ట్ర స్థాయి వినియోగదారుల పరిరక్షణ చరిత్రలో ఇదే అతిపెద్ద సెటిల్మెంట్లలో ఒకటి. ఈ చెల్లింపుతో పాటు, ఇన్స్టాగ్రామ్, మెటాలలో పిల్లలను రక్షించేందుకు వీలుగా మెటా కొన్ని కఠినమైన భద్రతా ఫీచర్లను అమలు చేయాల్సి ఉంటుంది.వర్జీనియా అటార్నీ జనరల్ కార్యాలయానికి చెందాల్సిన 353 మిలియన్ డాలర్లతో పాటు, 2016 ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి థర్డ్ పార్టీలకు మెటా యూజర్ల సమాచారాన్ని షేర్ చేసినందుకు అదనంగా 11 మిలియన్ డాలర్లు వర్జీనియాకు అందనున్నాయి.ఇన్స్టాగ్రామ్, మెటాలలో కలిపి రోజుకు గరిష్టంగా రెండు గంటల సమయ పరిమితి ఉంటుంది. ఎండ్లెస్ స్క్రోలింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం 15 నిమిషాలు వాడిన తర్వాత, అలాగే 60, 90 నిమిషాల వద్ద తప్పనిసరి పాజులు వస్తాయి. రాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు రాత్రివేళ బ్లాకింగ్ ఉంటుంది.పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు ఉండవు. యువ వినియోగదారుల వయస్సును మరింత కచ్చితంగా ధృవీకరించే పద్ధతులు, వేధింపులు, ఈటింగ్ డిజార్డర్స్, ఆత్మహత్య, స్వీయ-హానిని ప్రోత్సహించే కంటెంట్‌పై బలమైన రక్షణలు, మరింత పటిష్టమైన, తల్లిదండ్రులు సులభంగా ఉపయోగించుకునే నియంత్రణ టూల్స్ అందుబాటులోకి వస్తాయి.పిల్లలు, టీనేజర్లలో మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే బ్యూటీ ఫిల్టర్లు, కనిపించే లైక్స్ కౌంట్‌పై పరిమితులు ఉంటాయి. ఈ ఫీచర్ల అమలు, పనితీరును ఒక స్వతంత్ర ఆడిటర్ క్రమం తప్పకుండా పరిశీలిస్తారు.2021 నుంచి దేశంలోని దాదాపు అటార్నీ జనరల్లందరూ ఏకమై, హానికరమని తెలిసినప్పటికీ పిల్లలు, టీనేజర్ల కోసం సోషల్ మీడియాను డిజైన్ చేస్తున్న తీరుపై దర్యాప్తు చేపట్టారు. ఈ చారిత్రక ఒప్పందంలో అలబామా, అలాస్కా, కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సస్తో సహా అనేక రాష్ట్రాలు భాగస్వామ్యమయ్యాయి. -
హైదరాబాద్‌కు ‘ఎన్విడియా’ పవర్
ఏఎం గ్రూప్‌లో భాగమైన ఏఎం ఇంటెలిజెన్స్ (ఏఎంఐ) తాజాగా ఎన్విడియా నుంచి 9,000 జీపీయూలను కొనుగోలు చేసేందుకు బైండింగ్ ఆర్డరు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ ‘వెరా రూబిన్ ఎన్వీఎల్72 ర్యాక్ స్కేల్ సిస్టం’లు 2027 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రాగలవని వివరించింది. విస్తృత ప్రణాళికల్లో భాగంగా తొలి దశలో హైదరాబాద్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఏఐ ఫ్యాక్టరీలో వీటిని వినియోగించనున్నట్లు కంపెనీ వివరించింది.అంతర్జాతీయంగా ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాల నిర్మాణంపై 8 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. భారత్, అమెరికా, ఫిన్లాండ్, మలేషియాలో తలపెట్టిన 1 గిగావాట్ కంప్యూట్–యాజ్–ఎ–సర్వీస్ ప్లాట్‌ఫాం ప్రణాళికల కింద మొదటి విడతలో హైదరాబాద్ ప్రాజెక్టు ఉంటుందని సంస్థ తెలిపింది. సమీప భవిష్యత్తులో ప్రాథమికంగా 200 మెగావాట్ల ఏఐ కంప్యూట్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఏఎంఐ చైర్మన్ అనిల్ చలమలశెట్టి వివరించారు. భారత్, అమెరికా, యూరప్‌లో 5 గిగావాట్ల ఏఐ డేటాసెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
స్వదేశీ పరిశ్రమలకు డీఆర్డీఓ క్షిపణి పరిజ్ఞానం!
భారత రక్షణ సామర్థ్యాన్ని స్వయంసమృద్ధి దిశగా వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అన్ని రకాల సాంప్రదాయ (కన్వెన్షనల్) క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయ రక్షణ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. పరిశోధన స్థాయి నుంచి పారిశ్రామిక స్థాయి క్షిపణి ఉత్పత్తి వైపు అడుగులు వేయడంలో ఈ నిర్ణయం ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే మేల్కొనడం శ్రేయస్కరం అనే చందంగా.. మారుతున్న సరిహద్దు భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ తన సైనిక సన్నద్ధతను మునుపెన్నడూ లేనంతగా బలోపేతం చేస్తోంది. విదేశీ దిగుమతులపైనే నిరంతరం ఆధారపడితే తాను తవ్విన గోతిలో తానే పడక తప్పదు అనే చేదు నిజాన్ని గ్రహించిన ప్రభుత్వం స్వదేశీ రక్షణ రంగానికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో డీఆర్డీఓ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల భారతీయ ప్రైవేట్ దిగ్గజాలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) క్షిపణి తయారీ సప్లై చైన్‌లో చురుగ్గా భాగస్వామ్యం కానున్నాయి.దేశీయ సాంకేతిక ప్రతిభ అడవి కాచిన వెన్నెల కాకుండా పారిశ్రామిక స్థాయి ఉత్పత్తిగా మారడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రారంభ దశ నుంచే పరిశ్రమలను భాగస్వామ్యం చేయడం వల్ల నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడి వేగవంతమైన ఉత్పత్తి సాధ్యమవుతుంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంతో పాటు కంటికి రెప్పలా దేశ సరిహద్దులను కాపాడుకోవడంలో, రక్షణ ఎగుమతులను పెంచడంలో ఈ స్వదేశీ సాంకేతిక విప్లవం అత్యంత కీలక పాత్ర పోషించనుందని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
ఐటీ కంపెనీ ఉద్యోగులకు బోనస్.. జీతాల పెంపుపై అప్డేట్
దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సగటున 70 శాతం పనితీరు ఆధారిత బోనస్ (వేరియబుల్ పే) చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల పనితీరు, జాబ్ లెవల్‌ను బట్టి ఈ చెల్లింపు సుమారు 65 శాతం నుంచి 80 శాతం మధ్య ఉన్నట్లు కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించాయి. తాజా చెల్లింపు గత త్రైమాసికంతో పోలిస్తే మారలేదు. అయితే గతేడాది ఇదే కాలంలో ఇచ్చిన 80 శాతంతో పోలిస్తే 10 శాతం పాయింట్లు తగ్గింది.జాబ్ లెవల్స్ (JL) 4, 5లోని ఉద్యోగులకు లెవల్6తో పోలిస్తే కొంత మెరుగైన వేరియబుల్ పే లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన లెవల్4 ఉద్యోగులకు 80 శాతం, లెవల్5 ఉద్యోగులకు 78 శాతం వరకు చెల్లింపు జరిగినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు రేటింగ్, అర్హత వంటి అంశాల ఆధారంగా వాస్తవ చెల్లింపు మారవచ్చు.ఈసారి వేరియబుల్ పే చెల్లింపులు ఐటీ రంగంలో కొనసాగుతున్న సవాళ్ల మధ్య వచ్చాయి. క్లయింట్ల విచక్షణాధికార వ్యయం మందగించడం, స్థూల ఆర్థిక అనిశ్చితి, అలాగే కృత్రిమ మేధ (AI) కారణంగా వ్యాపార నమూనాల్లో వేగంగా వస్తున్న మార్పులు టెక్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. గత త్రైమాసికంలోనూ ఇన్ఫోసిస్ సగటున 70 శాతం వేరియబుల్ పే చెల్లించింది.రూ.7,769 కోట్ల నికర లాభంఇదిలా ఉండగా, జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ పనితీరు మిశ్రమంగా ఉంది. కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం పెరిగి రూ.7,769 కోట్లకు చేరింది. ఆదాయం 14 శాతం పెరిగి రూ.48,211 కోట్లుగా నమోదైంది. అయితే స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 2.4 శాతంగా మాత్రమే ఉంది.త్రైమాసికం ముగిసే నాటికి ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3,28,062గా ఉంది. ఇది మార్చి త్రైమాసికంతో పోలిస్తే 532 తగ్గింది. మరోవైపు, ఉద్యోగుల వాలంటరీ అట్రిషన్ రేటు 13 శాతానికి పెరిగింది. AI ఆధారిత సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగులపై కంపెనీ దృష్టి సారిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్ల సంఖ్యను 6,000కు పెంచే ప్రణాళికను కూడా ఇన్ఫోసిస్ ప్రకటించింది.జీతాల పెంపు ఎప్పటి నుంచి?ఇక ఉద్యోగులు ఎదురుచూస్తున్న వార్షిక వేతన సవరణలపై కూడా కంపెనీ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అర్హత కలిగిన ఉద్యోగులకు జీతాల పెంపును 2026 అక్టోబర్, 2027 జనవరిలో దశలవారీగా అమలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అందువల్ల లెవల్4, లెవల్5 స్థాయిల్లోని అర్హులైన ఉద్యోగులకు అక్టోబర్‌లో, సీనియర్ స్థాయిల్లోని ఉద్యోగులకు జనవరిలో వేతన సవరణలు అందే అవకాశం ఉంది.ఇదీ చదవండి: TCS రూ. 3,574 కోట్ల డీల్.. -
TCS రూ. 3,574 కోట్ల డీల్..
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్) తాజాగా జర్మనీ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం పోర్షే ఏజీకి చెందిన ఐటీ యూనిట్ కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకుంది. పోర్షే అనుబంధ సంస్థ ఎంహెచ్పీ మేనేజ్మెంట్–యూఎన్డీ ఐటీ–బెరాటంగ్ జీఎంబీహెచ్ (ఎంహెచ్)లో 100% వాటా సొంతం చేసుకోనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. 32 కోట్ల యూరోల(రూ. 3,574 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు వెల్లడించింది.తాజా కొనుగోలు జర్మన్ దిగ్గజంతో 1.25 బిలియన్ యూరోల విలువైన ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమని తెలిపింది. సొంత అనుబంధ కంపెనీ టీసీఎస్ నెదర్లాండ్స్ బీవీ ద్వారా ఎంహెచ్‌పీని కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. కాగా.. ప్రభుత్వ రంగంతోపాటు ఆటోమోటివ్, తయారీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ రంగాల్లో మేనేజ్మెంట్, ఐటీ కన్సల్టెన్సీ సేవలను ఎంహెచ్పీ అందిస్తోంది. కంపెనీ సిబ్బంది సంఖ్య 4,500కాగా.. 2025లో 74.2 కోట్ల యూరోల ఆదాయం ఆర్జించింది.పోర్షేకు సెంటర్తాజా సహకారంలో భాగంగా పోర్షే కోసం ప్రత్యేకించిన ఏఐ మొబిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(కేంద్రాన్ని) టీసీఎస్ ఏర్పాటు చేయనుంది. ఏఐ, సాఫ్ట్వేర్, డేటా ద్వారా ఆటోమోటివ్ పరిశ్రమలో మార్పులకు తెరలేవనున్న నేపథ్యంలో టీసీఎస్కున్న ఏఐ, ఇంజినీరింగ్, టెక్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యాలకు ఎంహెచ్పీకిగల పటిష్ట ఆటోమోటివ్ కన్సల్టింగ్ నైపుణ్యాలు జతవనున్నాయి. రెండింటి సమన్వయంతో పోర్షేకు ఏఐని మరింత విస్తృతంగా అందించనున్నట్లు టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్ చెప్పారు. -
వైఫై, బ్లూటూత్, నెట్‌తో ఈవీఎంలను కనెక్ట్ చేయొచ్చా?
భారత ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) పూర్తి సురక్షితమైనవని, వాటికి ఎలాంటి వైఫై, బ్లూటూత్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదని కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. లఖ్‌నవూలోని కాళ్వీన్ తాలుక్దార్స్ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఈవీఎంలపై వచ్చే పలు అనుమానాలకు సమాధానమిస్తూ భారతదేశంలో ఉపయోగించే ఈవీఎంలను ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేస్తాయని వెల్లడించారు. ఇవి ఇతర వైర్లెస్ సాంకేతికతలతో అనుసంధానం కావు కాబట్టి వీటిని హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తెలిపారు.సోషల్ మీడియా ప్రచారాలపై అప్రమత్తతసామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని విద్యార్థులకు జ్ఞానేష్ కుమార్ సూచించారు. ఏ సమాచారాన్నైనా స్వీకరించే ముందు లేదా ఇతరులతో పంచుకునే ముందు దాని మూలం, ప్రామాణికతను తనిఖీ చేయడం ఎంతో అవసరమని అన్నారు. భారతదేశంలో సుమారు 100 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని, ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం ఒక బృహత్తర కార్యమని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను ప్రస్తావిస్తూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు.అమెరికా వంటి దేశాల్లో భారత ఓటింగ్ విధానం, ఓటరు గుర్తింపు కార్డుల నిర్వహణపై ఇటీవల ప్రశంసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల విధానాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఓటింగ్ ఆధారాలపై ఓటర్లు అవగాహన పెంపొందించుకోవాలని పౌరులకు సూచించారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
ప్రింట్ కొడితే బాడీ పార్ట్లు వస్తాయా? షాకింగ్ నిజాలు!
త్రీడీ ప్రింటర్ల సహాయంతో ఇప్పటికే చిన్న చిన్న రాకెట్లు లేదా గేమింగ్ వస్తువులను తయారు చేస్తున్నాం. అదే ప్రింటర్లు మన చెవి, ఊపిరితిత్తులు లేదా చర్మం వంటి శరీర భాగాలను కూడా తయారు చేయగలిగితే? ఆ ప్రయత్నమూ జరగబోతోంది! శాస్త్రవేత్తలు ఇప్పటికే జీవకణాలను ‘ఇంక్’ (సిరా)గా ఉపయోగించి మానవ అవయవాల నమూనాలను తయారు చేసే పనిలో ఉన్నారు. బొమ్మలు, విగ్రహాలు లేదా లోహపు వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే త్రీడీ ప్రింటింగ్ పద్ధతినే ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్ లేదా లోహానికి బదులుగా జీవకణాలు ఉంటాయి. అయితే... ఇలా ప్రింట్ కొడితే అలా బాడీ పార్ట్లు వచ్చేయటం అన్నది ఫలించే ప్రయోగమేనా?!నిజానికి, ఇది అనుకున్నంత సులభం కాదు. మామూలు వస్తువులను తయారు చేసే ప్రింటర్లతో శరీర భాగాలను ప్రింట్ చేయలేం. పైగా కణాలను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతే అవి అవయవాలుగా మారవు. ఆ కణాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేయడానికి, వాటిని జెల్ లాంటి ఒక మెత్తటి పదార్థంతో కలపాల్సి ఉంటుంది. అది ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఇప్పటికే చర్మం, మృదులాస్థి (కార్టిలేజ్), రక్తనాళాల నమూనాలను ప్రింట్ చేయగలిగారు. 2025లో ఆస్ట్రేలియాలోని పరిశోధకులు ఒక కొత్త పద్ధతిని ఉపయోగించి, ఒక బాధితురాలి చర్మ కణాలతో చేసిన ఇంక్‌ను నేరుగా ఆమె కాలిన గాయాలపై ప్రింట్ చేసి చికిత్స అందించారు.అంతా ‘ఇంక్’ లోనే ఉంది!సాధారణ త్రీడీ ప్రింటర్లలో ప్లాస్టిక్ లేదా లోహాలను ఇంక్గా ఉపయోగిస్తారు. కానీ ఈ బయోప్రింటర్లు... జీవకణాలను, వాటిని బతికించే ఒక పదార్థాన్ని ఇంక్గా ఉపయోగిస్తాయి. బయోఇంక్స్ అనేవి జీవకణాలను కలిగి ఉండే ఒక రకమైన ప్రత్యేకమైన జెల్లీ పదార్థాల వంటివి. ఇవి మెత్తగా, కాస్త కదులుతూ ఉన్నప్పటికీ, తమ రూపాన్ని కోల్పోకుండా లోపల ఉన్న కణాలకు రక్షణగా నిలుస్తాయి. వీటిని హైడ్రోజెల్స్ అని అంటారు. శాస్త్రవేత్తలు ఈ హైడ్రోజెల్స్‌ను తయారు చేయడానికి ‘ఆల్జినేట్’, ‘కోలాజెన్’ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు.ఆల్జినేట్ సముద్రపు పాచి నుండి లభిస్తుంది. కోలాజెన్ అనేది మన చర్మం, ఎముకలలో ఉండే ఒక రకమైన ప్రొటీన్. అయితే, ఈ బయోఇంక్స్లో కేవలం కణాలు, జెల్ మాత్రమే ఉండవు. మన శరీరంలో కణాల చుట్టూ ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించటానికి ఈ మిశ్రమంలో కొన్ని అదనపు పోషకాలను కూడా చేరుస్తారు. సాధారణ త్రీడీ సిరాలకు, బయోఇంక్స్కు ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే వీటిలో ప్రాణమున్న కణాలు ఉంటాయి. ప్రింటింగ్ ప్రక్రియలో ఇవి చిన్న చిన్న నాజిల్స్ (గొట్టాల) ద్వారా ఒత్తిడికి గురవుతూ బయటకు వస్తాయి, అలాగే ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోవాల్సి ఉంటుంది. కణాలు ఈ మార్పులన్నింటినీ తట్టుకుని బతికి ఉండేలాగే ఈ మిశ్రమాన్ని తయారుచేస్తారు.ప్రింటింగ్ పూర్తయిన తర్వాత, ఆ నిర్మాణాలను ‘ఇంక్యుబేటర్లు’ అనే ప్రత్యేక పెట్టెలలో ఉంచుతారు. ఇవి కణాలు పెరగడానికి కావలసిన సరైన వాతావరణాన్ని అందిస్తాయి. అక్కడ ఈ కొత్త కణాలు బలంగా తయారై, ఒకదానితో ఒకటి కలిసి కణజాలాలుగా (ఉదా : కీళ్లలోని గుజ్జు లేదా రక్తనాళాలు ఉన్న చర్మం పొరలుగా) ఎదుగుతాయి.దారికి రాని గుండె, కిడ్నీలుగుండె, మూత్రపిండాలు (కిడ్నీలు) వంటి సంక్లిష్టమైన, పూర్తిస్థాయిలో పనిచేసే అవయవాల తయారీపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మిల్లీమీటర్ల కంటే ఎక్కువ మందం ఉండే కణజాలాలలో ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది: ప్రింట్ చేసిన కొద్దిసేపటికే ఆక్సిజన్, పోషకాలు అందక లోపల ఉన్న కణాలు చనిపోతున్నాయి. ‘రక్తనాళాలు’ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కణజాలాల లోపల ఉండే కణాలకు ఆక్సిజన్ అందించడానికి, వ్యర్థాలను బయటకు పంపడానికి రక్తనాళాలు చాలా అవసరం. అవి లేకపోతే కణాలు బతకలేవు. అందుకే పూర్తిస్థాయి అవయవాలను ప్రింట్ చేయడానికి రక్తనాళాలను తయారు చేయడమే శాస్త్రవేత్తల ముందున్న అతి పెద్ద సవాలు.‘శాక్రిఫిషియల్ ఇంక్’ ప్రయోగంఈ సమస్యను వ్యాపనం (డిఫ్యూజన్) ప్రక్రియ ద్వారా అర్థం చేసుకోవచ్చు. (ద్రవాలు లేదా వాయువుల్లోని అణువులు, కణాలు ఎక్కువ సాంద్రత ఉన్న ప్రాంతం నుండి తక్కువ సాంద్రత ఉన్న ప్రాంతానికి వాటంతటవే కదిలే ప్రక్రియను వ్యాపనం అంటారు). ఆక్సిజన్.. కణజాలం లోపలికి కేవలం కొన్ని మిల్లీమీటర్ల వరకు మాత్రమే ప్రసరించగలదు. మందపాటి అవయవాలలో, ఆక్సిజన్ అందక లోపల ఉండే కణాలు ఊపిరాడక చనిపోతాయి. దీన్ని రోడ్లు లేని ఒక పెద్ద నగరంతో పోల్చవచ్చు. రోడ్లు లేకపోతే ఆహార పదార్థాల ట్రక్కులు లోపలికి రాలేవు, చెత్తను తీసుకువెళ్లే ట్రక్కులు బయటకు వెళ్లలేవు! ఈ సమస్యను దాటేందుకు శాస్త్రవేత్తలు కొన్ని మార్గాలలో ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకటి.. ‘శ్యాకిఫిషియల్ ఇంక్’లను ఉపయోగించడం.మొదట ఈ ఇంక్‌తో రక్తనాళాల ఆకారంలో తాత్కాలిక నమూనాను ప్రింట్ చేస్తారు. దాని చుట్టూ అసలైన కణజాలాన్ని ప్రింట్ చేస్తారు. కణజాలం గట్టిపడిన తర్వాత, లోపల ఉన్న ఈ తాత్కాలిక ఇంక్ కరిగిపోతుంది. దాని స్థానంలో ఖాళీ గొట్టాల్లాంటి మార్గాలు ఏర్పడతాయి, వీటి ద్వారా రక్తం ప్రవహిస్తుంది. దీనితో పాటు, కణజాలాన్ని ప్రింట్ చేస్తున్నప్పుడే నేరుగా రక్తనాళాలను కూడా అందులోనే తయారుచేసే పద్ధతులపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు.అంతరిక్షంలో బయోప్రింటింగ్2025 సెప్టెంబర్ 17న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో, నాసా వ్యోమగామి జానీ కిమ్ ఒక ప్రత్యేక గ్లోవ్-బ్యాగ్ లో బయోప్రింట్ చేసిన కాలేయ కణజాలాన్ని పరీక్షించారు. లాబొరేటరీలో తయారు చేసిన త్రీడీ కణజాలాలు గురుత్వాకర్షణ లేని అంతరిక్ష వాతావరణంలో రక్తనాళాలుగా ఎలా రూపాంతరం చెందుతాయో అధ్యయనం చేయడానికి జానీ కిమ్ ఈ నమూనాలను మరొక పరిశోధనా పరికరంలోకి పంపారు.జీవకణాలను ఎలా ప్రింట్ చేస్తారు?!బయోఇంక్స్ ద్వారా టిష్యూలను (జీవకణాలను) తయారు చేయడానికి ఇంజనీర్లు అనేక రకాల పద్ధతులను అభివృద్ధి చేశారు. తాము తయారు చేయాలనుకుంటున్న అవయవాన్ని బట్టి ఆ పద్ధతిని ఎంచుకుంటారు. చాలా సందర్భాల్లో, టూత్‌పేస్ట్ ట్యూబ్ నుండి పేస్టును బయటకు నొక్కినట్లుగానే బయోఇంక్ కూడా ఒక గొట్టం ద్వారా బయటకు వస్తుంది. ఈ పద్ధతిని ‘ఎక్స్‌ట్రూజన్’ అంటారు. ఒక యంత్రం సహాయంతో ఈ ఇంక్ వచ్చే వేగాన్ని నియంత్రిస్తూ, ఒక పొర తర్వాత మరొక పొరను తయారుచేస్తారు.ఉదాహరణకు: చర్మాన్ని తయారుచేయడానికి మొదట చర్మం లోపలి పొరలో ఉండే ఫైబ్రోబ్లాస్టులు అనే కణాలను ప్రింట్ చేస్తారు. ఆ తర్వాత చర్మం వెలుపలి పొరను నిర్మించే కెరాటినోసైట్స్ అనే కణాలను దానిపై పొరలుగా వేస్తారు. ఇలా ప్రింట్ చేసిన నిర్మాణాన్ని ‘ఇంక్యుబేటర్’లో ఉంచుతారు. అది పూర్తి చర్మంగా ఎదుగుతుంది. చర్మం, మృదులాస్థి వంటి కాస్త మందంగా ఉండే భాగాలను తయారు చేయడానికి ఈ ఎక్స్‌ట్రూజన్ పద్ధతి చక్కగా పనిచేస్తుంది. కానీ ఇది కొంచెం నెమ్మదిగా జరిగే ప్రక్రియ. అంతే కాకుండా, సన్నని గొట్టం ద్వారా నొక్కి పంపడం వల్ల కణాలు స్వల్పంగా ఒత్తిడికి గురవుతాయి.ఇక, ఇంక్జెట్ బయోప్రింటింగ్ అనేది మరింత వేగవంతమైన, సున్నితమైన పద్ధతి. మనం ఆఫీసుల్లో ఉపయోగించే ప్రింటర్ కాగితంపై సిరా చల్లినట్లే, ఇది కూడా బయోఇంక్ చుక్కలను ట్రే ఉపరితలంపై చల్లుతుంది. ఇది సన్నని, పలుచని కణాల పొరలను తయారుచేయడానికి (ఉదా : రక్తనాళాల లోపలి పొరలు) బాగా ఉపయోగపడుతుంది. మరొక ఆధునిక పద్ధతిలో, పొరలు పొరలుగా కాకుండా మొత్తం నిర్మాణాన్ని ఒకేసారి తయారుచేస్తారు. ఇందులో కణాలు ఉన్న ఒక ప్రత్యేకమైన జెల్ కలిగిన గొట్టాన్ని వేగంగా తిప్పుతూ, దానిపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. ఆ కాంతి పడగానే జెల్ క్షణాల్లో ఘనరూపంలోకి మారి మనకు కావలసిన ఆకారంలోకి వస్తుంది.ఈ లేజర్ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు అనేక శాఖలుగా విడిపోయే సన్నని రక్తనాళాల వ్యవస్థను కేవలం కొన్ని సెకన్లలోనే తయారుచేయగలరు. కణాలు ఎక్కువ సేపు బయట వాతావరణంలో ఉంటే పాడైపోతాయి కాబట్టి, వేగంగా ప్రింట్ చేయడం చాలా ముఖ్యం.ఏమేమి ప్రింట్ చేస్తున్నారు?2022లో ఒక రోగికి వారి సొంత కణాలతో తయారు చేసిన త్రీడీ ప్రింటెడ్ చెవిని అమర్చారు. 2025 చివరిలో, చూపు లేని ఒక వ్యక్తికి శాస్త్రవేత్తలు బయోప్రింట్ చేసిన ‘కార్నియా’ (కనుగుడ్డు వెలుపలి పారదర్శక పొర)ను విజయవంతంగా అమర్చారు.చర్మ మార్పిడి (స్కిన్ గ్రాఫ్టింగ్) అనేది బయోప్రింటింగ్‌లో అత్యంత పురోగతి సాధించిన విభాగం. దెబ్బతిన్న చర్మం స్థానంలో కొత్త చర్మాన్ని అమర్చడాన్ని స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. 2025లో ఆస్ట్రేలియాలో, కాలిన గాయాల బాధితులపై బయోప్రింటెడ్ చర్మాన్ని అతికించి పరీక్షించారు. ఈ చికిత్స పొందిన మొదటి మహిళ, తన కాలిపై ఉన్న గాయం పూర్తిగా నయమైందని విలేకరుల సమావేశంలో చూపించారు.ఇక ఎముకలను ప్రింట్ చేయడమైతే కాస్త కష్టమైన పనే. చర్మం లేదా మృదులాస్థి కాకుండా, ఎముకల్లో జీవకణాలతో పాటు గట్టి ఖనిజాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎముకల నిర్మాణాలు (స్కాఫోల్డ్స్) తయారుచేస్తున్నారు. ఇవి శరీరంలోని సొంత ఎముక కణాలు వృద్ధి చెందేందుకు సహాయపడతాయి. అయితే, ప్రాణమున్న కణాలతో కూడిన అసలైన ఎముకను ప్రింట్ చేసి మనుషులకు అమర్చడం ఇంకా సాధ్యపడలేదు.ముందుడుగు ఎప్పటికి?2025 సెప్టెంబర్‌లో, పరిశోధకులు ‘గ్రేస్’ అనే త్రీడీ బయోప్రింటింగ్ విధానంతో ఒక ఆశాజనకమైన పురోగతిని సాధించారు. ఈ సాంకేతికత ద్వారా ప్రింట్ చేసిన కణజాలం చుట్టూ నేరుగా రక్తనాళాలను ప్రింట్ చేయడం సాధ్యమవుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే : మొదట ఒక ‘కంప్యూటర్–విజన్’ వ్యవస్థ కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తుంది. తర్వాత, ఆ కణాలన్నింటికీ ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అందించడానికి ఏ ఆకారంలో రక్తనాళాలు ఉంటే బాగుంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తుంది.అనంతరం, కేవలం కొద్ది సెకన్లలోనే, బయోప్రింటర్.. గొట్టం లాంటి నిర్మాణాలను (రక్తనాళాలను) ప్రింట్ చేసి రక్తాన్ని సరఫరా చేయడం ప్రారంభిస్తుంది. ఇక్కడ వేగం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. పాత పద్ధతుల్లో రక్తనాళాల వ్యవస్థను పొరలు పొరలుగా ప్రింట్ చేయడానికి గంటల సమయం పట్టేది. కానీ ‘గ్రేస్’ పద్ధతి ద్వారా కొన్ని సెకన్లలోనే ఇది పూర్తవుతుంది. దీనివల్ల ఆక్సిజన్ అందక కణాలు చనిపోయే ప్రమాదం తగ్గుతుంది.ఏమైనా, పూర్తిస్థాయి అవయవాలను తయారు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. పెద్ద ధమనుల నుండి చిన్న సన్నని రక్తనాళాల (క్యాపిల్లరీస్) వరకు చెట్టు కొమ్మల్లా ఉండే రకరకాల పరిమాణాల రక్తనాళాలను తయారుచేసి, వాటిని మనుషుల రక్త ప్రసరణ వ్యవస్థతో సజావుగా అనుసంధానించడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలు. అయితే, బయోఇంక్స్, ప్రింటింగ్ వేగం పెరుగుతున్న కొద్దీ, రక్తనాళాలతో కూడిన కృత్రిమ అవయవాలను అమర్చే రోజులు చాలా వేగంగా దగ్గరపడుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, త్రీడీ బయోప్రింటింగ్ ద్వారా అవయవాలను తయారు చేయడం సాధ్యమా, కాదా అని కాదు... ఎప్పుడు సాధ్యమవుతుంది అని మాత్రమే!- సాక్షి స్పెషల్ డెస్క్ -
ఇప్పుడు ఎలాంటి స్మార్ట్ఫోన్లు కావాలంటే..
ఏఐ ఫీచర్లు ఇప్పుడు 82% స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్, బ్యాటరీ జీవిత కాలం, కెమెరా సామర్థ్యం వంటివి వరుసగా నిలిచాయి. స్మార్ట్ ఫోన్ ఎంపికలో వినియోగదారులపై ప్రభావం చూపుతున్న అంశాలపై అధ్యయనాన్ని బెస్ట్ ఇన్‌టెక్ సర్వే పేరిట అమెజాన్ డాట్ ఇన్ నిర్వహించింది.హైదరాబాద్‌తో పాటు పలు చిన్న, మధ్య తరహా పట్టణాల వ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాల ప్రకారం.. 87% మంది. పెర్ఫార్మెన్స్ వేగం 79% మంది బ్యాటరీ జీవిత కాలం 77% మంది నాణ్యతలను కోరుకుంటున్నారని ఏఐ రాకతో వినియోగదారుల ప్రాధాన్యతల్లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమెజాన్ ఇండియా. కంజ్యూమర్ ఎల్రక్టానిక్స్, డైరెక్టర్, జేబా ఖాన్ అభిప్రాయపడ్డారురేటింగ్స్కే ప్రథమ ప్రాధాన్యం.. దిగువ మధ్యతరగతి, పేద జనాభా ఎక్కువగా ఉండే మన దేశంలో రూ.15వేల లోపు ధర కలిగిన ఫోన్లకు 7 శాతం మాత్రమే ఎంచుకుంటున్నారని అధ్యయనం వెల్లడించడం విశేషం. అత్యధిక డిమాండ్ (42 శాతం మంది) రూ.25 వేల నుంచి రూ.50 వేల మధ్య ధర కలిగిన ఫోన్లకు ఉందని, రూ.75 వేల లోపు ఖరీదు చేసే ఫోన్లను 15 శాతం మంది, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్లను 17 శాతం మంది ఎంచుకుంటున్నారు.రూ.15వేల నుంచి రూ.25 వేల మధ్య ధర కలిగిన ఫోన్లను 19 శాతం మంది ఓటేశారు. ఫోన్ వినియోగదారుల్లో 54శాతం మంది తమ ఫోన్లను రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. వచ్చే మూణ్నెళ్లలో ఫోన్ మారుస్తామని 48 శాతం మంది చెప్పారు. ఫోన్ల ఎంపికలో డిస్కౌంట్ల కంటే రేటింగ్స్కే వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కొనుగోలు చేసేటప్పుడు రేటింగ్స్‌కి మొదటి ప్రాధాన్యమిస్తామని 47శాతం మంది చెప్పగా, డిస్కౌంట్లు, బెస్ట్ డీల్స్‌కే ఓటేస్తామని 35శాతం మంది వెల్లడించారు.ఇదీ చదవండి: జియో రీచార్జ్ ప్లాన్: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్! -
జియో రీచార్జ్ ప్లాన్: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్!
మొబైల్ రీఛార్జ్ విషయంలో ఎక్కువ వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, అపరిమిత 5జీ, కాలింగ్, ఎస్ఎంఎస్, ఎంటర్టైన్మెంట్, ఏఐ సేవలు అందించే ప్లాన్లకు ప్రస్తుతం వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో అందిస్తున్న రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ పలు ప్రయోజనాలతో ఆకట్టుకుంటోంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే 98 రోజుల పాటు సేవలు పొందొచ్చు.98 రోజుల వ్యాలిడిటీ.. 196 జీబీ డేటారూ.999 ప్లాన్‌లో 98 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం వ్యాలిడిటీ కాలంలో 196 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందిస్తారు. తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దాదాపు మూడు నెలల పాటు ఈ సేవలను పొందవచ్చు.5జీ యూజర్లకు అపరిమిత డేటా5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు జియో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్‌తో అపరిమిత 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది. 5జీ సేవలు అందుబాటులో లేకపోతే రోజువారీ 2 జీబీ హైస్పీడ్ డేటా వినియోగం పూర్తయ్యాక ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.జియోహాట్‌స్టార్, గూగుల్ ఏఐ ప్రోఈ ప్లాన్‌లో వినోదం కోసం జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో 5,000 జీబీ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, జెమిని ప్రో యాక్సెస్‌తో పాటు నానో బనానా సహా పలు ఏఐ ఫీచర్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జియో క్లౌడ్ ద్వారా అదనంగా 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనం కూడా లభిస్తుంది.సబ్స్క్రిప్షన్ కొనసాగాలంటే ఇదే కీలకంఅయితే జియోహాట్‌స్టార్, గూగుల్ ఏఐ ప్రో ప్రీమియం ప్రయోజనాలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈ ప్రయోజనాలను యాక్టివ్‌గా కొనసాగించేందుకు తదుపరి నెలల్లో కనీసం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 5జీ డేటాతో పాటు ఎంటర్టైన్మెంట్, ఏఐ సేవలను ఒకే ప్లాన్‌లో కోరుకునే వారికి రూ.999 రీఛార్జ్ ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. -
మెటా సామ్రాజ్యానికి డిజిటల్ చెక్!
సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటూ అమెరికాలోని 29 రాష్ట్రాలు సంయుక్తంగా దాఖలు చేసిన దావా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. లాభార్జనే ధ్యేయంగా యూజర్లను అడిక్ట్ చేసే ఆల్గారిథమ్‌లు, ఇన్ఫినిట్ స్క్రోలింగ్, పుష్ నోటిఫికేషన్లను మెటా ఉద్దేశపూర్వకంగా రూపొందించిందని, చిన్నారుల వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా సేకరించిందనేవి ప్రధాన ఆరోపణలు.అమెరికాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు టెక్ ప్రపంచంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ విచారణ ముగింపు కేవలం అమెరికాకే పరిమితం కాకుండా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిగ్టెక్ కంపెనీల నియంత్రణకు దిశానిర్దేశం చేయనుంది.ప్రపంచంపై ప్రభావంఅమెరికా కోర్టు మెటాపై కఠిన పరిమితులు విధిస్తే యూరోపియన్ యూనియన్, భారత్ వంటి దేశాలు కూడా తమ వద్ద ఉన్న డిజిటల్ భద్రతా చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు ఇది బలమైన నమూనాగా మారుతుంది.ఇన్ఫినిట్ స్క్రోలింగ్ తొలగింపు, వయసు గుర్తింపు నిబంధనలు, ఆటోమేటిక్ టైమ్ లిమిట్స్ వంటి ప్రతిపాదనలను మెటా అమలు చేయాల్సి వస్తే ఆ మార్పులు గ్లోబల్ కోడింగ్‌లో భాగంగా ఇతర దేశాల యూజర్లకూ వర్తిస్తాయి.అత్యధిక సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న భారత్‌లో ‘డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (డీపీడీపీ)’ అమలులోకి వస్తున్న తరుణంలో పిల్లల డేటా రక్షణపై ఈ తీర్పు కీలక సూచికగా నిలుస్తుంది.ఈ విచారణలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా సాక్ష్యమివ్వనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. సురక్షితమైన డిజిటల్ సమాజం వైపు ప్రపంచం వేస్తున్న అడుగుల్లో ఈ చట్టపరమైన పోరాటం ఒక కీలక మైలురాయి కానుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్‌పై నిషేధం -
యాపిల్‌లో ఉద్యోగాల కోత
సాంకేతిక ప్రపంచంలో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ తన వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పులు చేస్తోంది. కృత్రిమ మేధ సవాళ్లు, మార్కెట్ ప్రతికూలతల నేపథ్యంలో కంపెనీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. సిరి, విజన్ ప్రో ఇమ్మర్సివ్ వీడియో, గేమింగ్ విభాగాల నుంచి సుమారు 200 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.కంపెనీ ఉత్పత్తులు, సర్వీసుల నాణ్యతను పెంచేందుకు నిర్వహించే పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యాపిల్ అధికారికంగా ధ్రువీకరించింది. మారిన ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని పాత హోదాలను రద్దు చేస్తూనే సరికొత్త విభాగాల్లో నూతన అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. బాధితులకు అవసరమైన మద్దతు అందిస్తామని పేర్కొంది.తొలగింపుల్లో విజన్ ప్రో విభాగానికి చెందిన వారు 100 మంది ఉండగా, సిరి, సాఫ్ట్వేర్ టీమ్‌ల నుంచి మరో 100 మంది ఉన్నారు. 3,699 డాలర్ల డివైజ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన విజన్ ప్రో హెడ్‌సెట్‌కు ఆశించిన స్థాయిలో వినియోగదారులు లభించకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. కోట్లాది డాలర్ల వ్యయంతో రూపొందించే '3డీ ఇమ్మర్సివ్ వీడియో' కంటెంట్ తయారీ ఖర్చులను తగ్గించుకోవాలని యాపిల్ భావిస్తోంది. అలాగే విజన్ ప్రో గేమింగ్ విభాగాన్ని దాదాపుగా మూసివేస్తోంది. ఇకపై ఈ విధమైన కంటెంట్‌ను థర్డ్ పార్టీ డెవలపర్ల ద్వారా ప్రోత్సహించాలని నిర్ణయించింది.అటు సిరి వాయిస్ అసిస్టెంట్‌ను మరింత ఆధునిక ఆర్కిటెక్చర్‌తో, కొత్త ఏఐ మోడల్స్ ఆధారంగా పునర్నిర్మించేందుకు యాపిల్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా పాత సాంకేతిక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల స్థానంలో నూతన ఏఐ నిపుణులను నియమించుకోవాలని భావిస్తోంది.ఈ పరిణామాలు విజన్ ప్రో భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తించినప్పటికీ, 'విజన్ ఓఎస్' మనుగడలోనే ఉంటుందని యాపిల్ స్పష్టం చేసింది. తక్షణమే స్మార్ట్ గ్లాసెస్ ఆధారిత పరికరాలపై దృష్టి సారిస్తూ 2028 నాటికి కొత్త విజన్ ప్రో మోడల్‌ను పరిచయం చేసే ఆలోచనలో ఉంది. ఏఐ పోటీని తట్టుకుని నిలబడేందుకు యాపిల్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో కొత్త చర్చకు దారితీశాయి.ఇదీ చదవండి: వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు! -
భారతీయ విద్యార్థులకు గూగుల్ బిగ్ ఆఫర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉన్నత చదువు అభ్యసిస్తున్న విద్యార్థులకు మరింత చేరువ చేసే దిశగా దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని కళాశాల విద్యార్థులకు ఏడాది పాటు ఉచితంగా ‘గూగుల్ ఏఐ ప్లస్’ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా నెలకు రూ.399 చొప్పున, ఏడాదైతే దాదాపు రూ.4,800 విలువ చేసే ఈ ప్రీమియం సేవలను అర్హులైన విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించకుండా పొందే వెసులుబాటు కల్పించింది.ప్రధాన ప్రయోజనాలు.. ఫీచర్లుఈ ఆఫర్ ద్వారా విద్యార్థులకు గూగుల్ అత్యంత సామర్థ్యమున్న ‘జెమిని ఓమ్ని’ (Gemini Omni) మోడల్ యాక్సెస్ లభిస్తుంది. సాధారణ పరిమితుల కంటే రెండు రెట్లు ఎక్కువ వినియోగ పరిమితితో పాటు ప్రాజెక్టులు, డాక్యుమెంట్ల భద్రత కోసం 400 బీజీ క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులోకి వస్తుంది. చదువును మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ హబ్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా..స్టడీ నోట్‌బుక్స్: అకడమిక్ నోట్స్ లేదా సిలబస్‌ను అప్లోడ్ చేసి విశ్లేషణాత్మక క్విజ్లు రాయవచ్చు. ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి సూక్ష్మ స్థాయి లెసన్ ప్లాన్లను జెమిని సిద్ధం చేస్తుంది.3డీ ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్: కష్టమైన శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థం చేసుకునేందుకు 3డీ మోడల్స్, సిమ్యులేషన్లను సృష్టిస్తుంది.జెమిని లైవ్, డీప్ రీసెర్చ్: సుదీర్ఘమైన పరిశోధనా నివేదికలను వాయిస్ సంభాషణల ద్వారా చర్చించే సదుపాయం ఉంటుంది.ఈ ఆఫర్‌ను ఎలా పొందాలి?భారత్‌లోని కాలేజీ విద్యార్థులు గూగుల్ స్టూడెంట్ హబ్ (https://gemini.google.com/students)లోకి వెళ్లి తమ విద్యార్థి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఈ 12 నెలల ఉచిత ప్లాన్‌ను ఆక్టివేట్ చేసుకోవచ్చు. డిజిటల్ లెర్నింగ్ యుగంలో భారతీయ యువతకు ఇది మంచి అవకాశంగా పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌ల్లో కొత్త టూల్ -
సైబర్ ముఠాల ఆన్లైన్ దోపిడీకి కేంద్రం చెక్
దేశంలో నిత్యం విస్తరిస్తున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్‌కు చెందిన ప్రముఖ డెవలపర్ వేదిక ‘ఫైర్‌బేస్’ ఆధారంగా పనిచేస్తున్న వందలాది మోసపూరిత ఖాతాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖ గూగుల్‌ను ఆదేశించింది. లాభదాయకమైన అప్లికేషన్లు, ఆన్లైన్ సేవలు, నకిలీ బ్యాంకింగ్ యాప్‌ల పేరుతో సాగుతున్న ఒకే రకమైన స్కామ్ ప్యాటర్న్‌ను భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించిన అనంతరం ఈ చర్యలు వేగవంతమయ్యాయి.మోసం సాగిందిలా..సైబర్ నేరగాళ్లు గూగుల్ ఫైర్‌బేస్ అందించే ఉచిత, చవకైన క్లౌడ్ డేటాబేస్ వసతులను ఆసరాగా చేసుకున్నారు. నిజమైన యాప్‌లుగా నమ్మించేలా డిజైన్ చేసి అమాయక వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్, ఓటీపీలను సేకరించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించారు. అధునాతన విశ్లేషణ ద్వారా ఒకే నెట్వర్క్ లేదా ఒకే రీతిలో పంపుతున్న డేటా ట్రాఫిక్‌ను గుర్తించిన ప్రభుత్వ విభాగాలు, ఈ అక్రమ నెట్వర్క్ వెనుక ఉన్న వందలాది ఫైర్‌బేస్ ప్రాజెక్ట్‌లను, డెవలపర్ ఖాతాలను నిలిపేయాలని ఆదేశించాయి.ప్రభుత్వ ఆదేశాలు.. గూగుల్ స్పందనదేశ ప్రజల డిజిటల్ భద్రత, ఆర్థిక డేటా రక్షణ నేపథ్యంలో మోసపూరిత ప్రాజెక్టులతో సంబంధం ఉన్న అన్ని ఖాతాలను, వాటి సర్వర్ లింకులను వెంటనే బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై స్పందించిన గూగుల్ తమ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని ఎంతమాత్రం సహించేది లేదని, భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాలను ఇప్పటికే తొలగించే ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించింది. డిజిటల్ విప్లవంతో పాటు పెరుగుతున్న సైబర్ బెదిరింపులను తిప్పికొట్టేందుకు గూగుల్, మెటా.. వంటి టెక్ దిగ్గజాలు తమ వేదికలపై మరింత కఠినమైన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర.. -
స్టూడెంట్స్ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐకూ కొత్తగా జె11 పేరిట 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 31,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో, 6.83 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ క్రియేషన్, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టం, 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్‌ఛార్జ్, 50 ఎంపీ సోనీ కెమెరా మొదలైన ఫీచర్లు ఉంటాయి.దీనితో పాటు ఐకూ బడ్స్ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని గరిష్ట ప్లేబ్యాక్ సమయం 50 గంటల వరకు ఉంటుంది. ధర రూ. 1,699 నుంచి ప్రారంభం అవుతుంది. జెడ్11 ఫోన్ల అమ్మకాలు ఆగస్టు 25 నుంచి, బడ్స్ విక్రయాలు ఆగస్టు 24 నుంచి ప్రారంభమవుతాయి. -
భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరం..
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎకోసిస్టమ్ వృద్ధికి బడా టెక్ సంస్థల ఆధిపత్య ధోరణి కంటే నిపుణుల కొరత, డేటా ప్రామాణీకరణ లోపించడం అనేవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. ‘భారతదేశ ఏఐ ఎకోసిస్టమ్‌లో పోటీతత్వం, నవకల్పనలు, మార్కెట్ స్వరూపం’ పేరుతో ది డైలాగ్ అనే సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దేశంలో ఏఐ రంగం వేగవంతమైన అభివృద్ధి, విస్తరణ దశలో ఉంది, అయితే, తగినంత మంది ప్రతిభావంతులు లేకపోవడం, డేటా వినియోగంలో లోటుపాట్లు కీలక సమస్యలని పేర్కొంది. స్టార్టప్‌లు, బిజినెస్ యూజర్లు, వినియోగదారుల్లో 308 మందిని ఈ అధ్యయనంలో భాగంగా సర్వే చేశారు.ముఖ్యాంశాలివీ...నైపుణ్యగం గల సిబ్బంది లభ్యత భవిష్యత్తు పోటీతత్వానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అని సర్వేలో పాల్గొన్న వారిలో 47.2 శాతం గుర్తించారు. అదేవిధంగా కస్టమర్లు ఏఐ సేవలను అందిపుచ్చుకోవడం కూడా అంతే స్థాయిలో కీలక సవాలుగా పేర్కొన్నారు.భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరంతో పాటు ఏఐ వ్యవస్థలను రూపొందించడం, శిక్షణ ఇవ్వడం, అమలు చేయడం, దాన్ని విస్తరించడానికి ప్రత్యేక నైపుణ్యలు కావాలని ది డైలాగ్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ భూమిక అగర్వాల్ పేర్కొన్నారు.ఏఐ అభివృద్ధిలో డేటా వినియోగం మరో పెద్ద సమస్యగా ఉంది. డేటా కొరత కంటే వినియోగంలో ఒకే విధమైన ప్రమాణాలు లేకపోవడం ప్రధాన ఇబ్బంది అని 63.2 శాతం మంది ఏఐ డెవలపర్లు అభిప్రాయపడ్డారు. కాపీరైట్ సమస్యలను 44 శాతం మంది, డేటా కొరతను 42 శాతం మంది సవాలుగా చెప్పారు. ప్రభుత్వ అ«దీనంలోని డేటాసెట్స్ సులభంగా అందుబాటులో ఉన్నాయని కేవలం 15 శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం.భారత్‌లోని ఏఐ స్టార్టప్‌లు, డెవలపర్లు ఓపెన్ సోర్స్ మోడళ్లు, టూల్స్‌పై కొంతమేర ఆధారపడుతున్నట్లు 96.2 శాతం మంది చెప్పారు. 62.3 శాతం మంది వాటిపై అధికంగా ఆధారపడుతున్నామని వెల్లడించారు.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! -
వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారా? మొబైల్ సిగ్నల్ మాయమైతే..
హైదరాబాద్‌కు చెందిన సునీల్ అనే ఉద్యోగి ఇటీవల ఒక ముఖ్యమైన పనిమీద ముంబయికి విమానంలో ప్రయాణించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో బోర్డింగ్ అయ్యేవరకు ఆయన ఫోన్లో పూర్తి స్థాయిలో సిగ్నల్ ఉంది. విమానం ముంబయిలో ల్యాండ్ అయిన తర్వాత ఫోన్‌ను ఫ్లైట్ మోడ్ నుంచి సాధారణ మోడ్‌లోకి మార్చగా, సిగ్నల్ పూర్తిగా మాయమైంది. ఫోన్‌ను పలుమార్లు రీస్టార్ట్ చేసినా, ఫ్లైట్ మోడ్ ఆన్-ఆఫ్ చేసినా ఫలితం లేకపోయింది. టెలికాం నెట్వర్క్ రాకపోవడంతో రెండు రోజుల పాటు ఆయన ఎలాంటి కాల్స్ మాట్లాడలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్న వెంటనే సిగ్నల్ స్వయంచాలకంగా రావడం గమనార్హం.సునీల్ ఎదుర్కొన్న ఈ సమస్యకు ప్రధాన కారణం ‘నేషనల్ రోమింగ్ నెట్వర్క్ సెలక్షన్’, యాక్సెస్ పాయింట్ నేమ్స్ (ఏపీఎన్) సెట్టింగ్స్ లోపం. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించినప్పుడు కొన్ని టెలికాం నెట్‌వర్క్‌లు తమ భాగస్వామ్య నెట్‌వర్క్‌లకు స్వయంచాలకంగా (ఆటోమేటిక్) కనెక్ట్ కావు. ఇలాంటి రోమింగ్ సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు ఆందోళన చెందకుండా క్రింది సాంకేతిక మార్గాలను పాటించాలి.ఫోన్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Settings -> Mobile Network -> Network Operators ఎంచుకోవాలి.అక్కడ Automatic ఆప్షన్‌ను డిసేబుల్ (Off) చేస్తే, అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ల జాబితా కనిపిస్తుంది.మీ నెట్వర్క్ ప్రొవైడర్ లేదా వారి భాగస్వామ్య నెట్‌వర్క్‌ను మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి.డేటా రోమింగ్ ఆన్ చేయడంరాష్ట్రం దాటిన వెంటనే Settings -> Mobile Network -> Data Roaming ఆప్షన్‌ను తప్పనిసరిగా Enable చేయాలి. ఇది ఆన్‌లో లేకపోతే డేటా సేవలతో పాటు కొన్నిసార్లు నెట్వర్క్ సర్వీసు ఆగిపోతుంది.ఏపీఎన్ సెట్టింగ్స్ రీసెట్సెట్టింగ్స్లో SIM Card-> Mobile Data -> Access Point Names విభాగంలోకి వెళ్లి Reset to Default క్లిక్ చేయాలి. దీనివల్ల స్థానిక నెట్‌వర్క్‌కు తగిన సెట్టింగ్స్ అప్డేట్ అవుతాయి.నెట్వర్క్ టైప్ మార్చడంసిగ్నల్ చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఫోన్ సెట్టింగ్స్‌లో 5G/4G మోడ్ నుంచి 3G లేదా 2Gకి మార్చి చూడాలి. దీనివల్ల కనీసం కాల్స్ మాట్లాడేందుకు సిగ్నల్ అందుతుంది. విమాన ప్రయాణాలు లేదా అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసే ముందు వినియోగదారులు తమ సిమ్ కార్డ్‌లో నేషనల్ రోమింగ్ సేవలు యాక్టివ్‌గా ఉన్నాయో లేదో టెలికాం కస్టమర్ కేర్ ద్వారా సరిచూసుకోవడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర.. -
జెట్ స్పీడ్‌తో జియో కొత్త వైఫై రౌటర్.. ధర ఎంతంటే..
దేశీయ టెలికాం రంగంలో సర్వీసులు అందిస్తున్న రిలయన్స్ జియో గృహ నెట్ వినియోగదారుల కోసం మరో కొత్త ప్రోడక్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 1,500 చదరపు అడుగుల వైశాల్యానికి నిరంతర హై-స్పీడ్ ఇంటర్నెట్ కవరేజ్‌ను అందించే సామర్థ్యంతో కొత్త ‘జియో AX3000 యూనివర్సల్ వైఫై రౌటర్’ను విపణిలోకి తెచ్చింది. దీని ధరను రూ.3,999గా నిర్ణయించారు.వైఫై-6 సాంకేతికతతో మెరుపు వేగంనేటి డిజిటల్ యుగంలో ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్, 4K/8K వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్ సర్వసాధారణమయ్యాయి. అయితే, రౌటర్ల కవరేజ్ సరిగా లేకపోవడం, ఇంటి మూలల్లో డెడ్ జోన్లు(ఇంటర్నెట్ కవరేజ్ సరిగారాని ప్రదేశాలు) ఏర్పడటం వంటి సమస్యలు వినియోగదారులను వేధిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన జియో AX3000 రౌటర్ లేటెస్ట్ వైఫై-6 (Wi-Fi 6) సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ (2.4 GHz-5 GHz) కనెక్టివిటీని అందిస్తుంది. 5 GHz బ్యాండ్‌పై గరిష్టంగా 2,400 Mbps వరకు, అలాగే 2.4 GHz బ్యాండ్‌పై 600 Mbps వరకు వేగాన్ని అందిస్తుంది.యూనివర్సల్ సపోర్ట్సాధారణంగా జియో అందించే రౌటర్లు కేవలం జియో నెట్‌వర్క్‌కే పరిమితమవుతాయి. కానీ ఈ కొత్త AX3000 మోడల్ యూనివర్సల్ రౌటర్ కావడం వల్ల ఎయిర్టెల్, యాక్ట్ ఫైబర్‌నెట్, బీఎస్ఎన్ఎల్.. వంటి ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నెట్‌వర్క్‌లతో కూడా ఇథర్నెట్ ద్వారా నేరుగా పనిచేస్తుంది. ఈ రౌటర్ జియో అధికారిక వెబ్సైట్, జియోమార్ట్, అమెజాన్, ప్రముఖ జియో రిటైల్ స్టోర్లలో లభ్యమవుతోంది.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర.. -
ఒక పేరుపై 9 సిమ్లే..
సైబర్ నేరాలు, మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒక వ్యక్తి పేరుపై తొమ్మిది మొబైల్ సిమ్ కనెక్షన్లు ఉంటే వారికి కొత్త కనెక్షన్ ఇవ్వొద్దని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (టీఎస్పీలు) టెలికాం శాఖ (డాట్) ఆదేశించింది. ఈ నిబంధన ఆగస్టు 24, 2026 నుంచి అమల్లోకి రానుంది. పరిమితికి మించి కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి సబ్స్క్రైబర్ను గుర్తించేందుకు తగిన సాంకేతిక, సంస్థాగత చర్యలు తీసుకోవాలని సూచించింది.డీఐపీతో తనిఖీలుటెలికాం సంస్థలు అప్లోడ్ చేసే సబ్‌స్రై్కబర్ల వివరాల ఆధారంగా టెలికాం శాఖ ఏర్పాటు చేసిన ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్’ (డీఐపీ)ను ఉపయోగించాలని డాట్ సూచించింది. ఇప్పటికే నిరీ్ణత పరిమితికి మించి మొబైల్ కనెక్షన్లు పొందిన సబ్‌స్రై్కబర్ల వివరాలు డీఐపీలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ఆగస్టు 23 నుంచి.. తమ పేరుపై ఇప్పటికే గరిష్ట సంఖ్యలో మొబైల్ కనెక్షన్లు ఉన్న సబ్స్క్రైబర్లను గుర్తించేందుకు వారి ఫొటోలను డీఐపీలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. దీంతో పరిమితికి మించి మరో కనెక్షన్ పొందేందుకు ప్రయత్నించే వ్యక్తిని టెలికాం సంస్థలు సులభంగా గుర్తించి, కొత్త సిమ్ జారీని అడ్డుకోగలుగుతాయి. డీఐపీతో అనుసంధాన ప్రక్రియను నవంబర్ 30లోగా క్రమబద్ధీకరించాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను టెలికాం శాఖ కోరింది.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర.. -
స్మార్ట్ఫోన్ల చెరలో చిన్నారి ప్రపంచం!
ఒకప్పుడు ఆరుబయట కేరింతలు, తోటి పిల్లలతో ఆటలు, అమ్మమ్మల కథలతో సాగిన బాల్యం నేడు నాలుగు గోడల మధ్య డిజిటల్ తెరలకు పరిమితమైపోయింది. మారుతున్న జీవనశైలి, ఉద్యోగ వ్యాపారాల్లో తల్లిదండ్రుల నిరంతర బిజీ జీవితాలు పిల్లల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించలేకపోవడం, వారిని అల్లరి చేయకుండా నిద్రపుచ్చడానికో లేదా అన్నం తినిపించడానికో చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం ఒక అలవాటుగా మారింది. ఈ చిన్న అలవాటే నేడు పిల్లలను తీవ్రమైన ‘ఇంటర్నెట్/స్క్రీన్ అడిక్షన్’ వైపు నెట్టివేస్తోంది.అప్పటి బాల్యం Vs నేటి డిజిటల్ బానిసత్వంసామాజిక సంబంధాలు: గతంలో పిల్లలు వీధుల్లో కలిసి ఆడుకోవడం ద్వారా వస్తువులు పంచుకోవడం, ఓర్పు, నాయకత్వ లక్షణాలు నేర్చుకునేవారు. నేటి పిల్లలు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ ప్రపంచంలో వర్చువల్ స్నేహాలకే పరిమితమవుతున్నారు.భౌతిక-మానసిక ఆరోగ్యం: పూర్వం శారీరక శ్రమతో కూడిన ఆటల వల్ల పిల్లలు దృఢంగా ఉండేవారు. కానీ నేడు గంటల తరబడి స్క్రీన్ల ముందు కూర్చోవడం వల్ల స్థూలకాయం, దృష్టి లోపాలు, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, చిన్న వయసులోనే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.చేజారుతున్న సృజనాత్మకత: ప్రకృతితో గడపడం, పుస్తకాలు చదవడం తగ్గడంతో సొంతంగా ఆలోచించే శక్తి క్షీణిస్తుంది. డిజిటల్ కంటెంట్ అందించే గైడ్లపైనే ఆధారపడుతున్నారు.తల్లిదండ్రులకు సూచనలుఇంట్లో భోజనం చేసేటప్పుడు, పడుకునే ముందు (కనీసం ఒక గంట ముందు) స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లను పూర్తిగా దూరంగా ఉంచాలి. బెడ్రూమ్లలో గ్యాడ్జెట్లకు చోటు ఇవ్వకూడదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. రెండేళ్ల లోపు పిల్లలకు అసలు స్క్రీన్ చూపకూడదు. 2-5 ఏళ్ల పిల్లలకు రోజుకు అరగంట కంటే ఎక్కువ సమయం ఇవ్వకూడదు.పిల్లలు మాటల కంటే తల్లిదండ్రుల ప్రవర్తననే ఎక్కువగా అనుకరిస్తారు. పిల్లల ముందు తల్లిదండ్రులు అనవసరంగా ఫోన్ ఉపయోగించడం తగ్గించాలి.రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం ఒక గంట పిల్లలతో ప్రత్యక్షంగా మాట్లాడటం, వారి రోజువారీ విశేషాలు తెలుసుకోవడం, ఇండోర్/అవుట్డోర్ ఆటలు ఆడటం అలవాటు చేసుకోవాలి.పిల్లల్లో పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీతం, స్విమ్మింగ్ లేదా ఏదైనా క్రీడల పట్ల ఆసక్తిని పెంచి వారి శక్తిని సరైన దిశలో ఉపయోగించేలా ప్రోత్సహించాలి.పిల్లలకు సాంకేతికతను పరిచయం చేయడం తప్పు కాదు, కానీ అది వారి జీవితాన్ని నియంత్రించే స్థాయికి చేరకముందే తల్లిదండ్రులు మేల్కొనడం అత్యవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునేలా పిల్లలను తీర్చిదిద్దాలి తప్ప దానికి బానిసలయ్యేలా వదిలేయకూడదు.ఇదీ చదవండి: యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో మార్పులు -
దోమ దండుపై డ్రోనాస్త్రం!
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ఏడు నుంచి పది లక్షల మంది దోమల కారణంగా చనిపోతున్నారు. మనల్ని ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించి, రోగాల బారిన పడేలా చేసే దోమలను గాలిలోనే ఎన్కౌంటర్ చేయడానికి ‘కిల్లర్ డ్రోన్స్’ రాబోతున్నాయి!దోమల నివారణ పద్దతులో ప్రధానమైనవి దోమ తెరలు, కీటకనాశినులు. అయితే వీటిలో ప్రతిదానికి ఏదో ఒక పరిమితి ఉంది. ఉదాహరణకు, పురుగు మందుల వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దోమలను నిర్మూలించడానికి పరిశోధకులు అత్యాధునికమైన పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు.సోనార్–గైడెడ్ డ్రోన్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ ఫ్లైట్ కంట్రోల్ సాంకేతికతను ఉపయోగించి దోమల పనిపట్టే అత్యాధునిక యంత్రం... సోనార్–గైడెడ్ డ్రోన్. పురుగు మందులు, లేజర్లు, విద్యుత్ గ్రిడ్లను ఉపయోగించడానికి బదులుగా వేగంగా తిరిగే ప్రొఫెల్లర్లను ఉపయోగించి దోమలను నిర్మూలిస్తుంది సోనార్–గైడెడ్ డ్రోన్. గాలిలో ఎగురుతున్న దోమలను ఒక్కటొక్కటిగా గుర్తించి వాటిని నిర్మూలిస్తుంది. ఆప్టికల్ కెమెరాలపై ఆధారపడే సంప్రదాయ డ్రోన్లలా కాకుండా డ్రోన్ అల్ట్రా సోనిక్ ఫేజ్డ్–సోనార్ సాంకేతికత (ఒకే పరికరంలో అనేక చిన్న సౌండ్–వేవ్ పార్ట్స్ ఉపయోగించడం) ఆధారంగా ఈ దోమ నిర్మూలన డ్రోన్‌ను నిర్మించారు. తక్కువ కాంతిలో, చీకటిలో కూడా దోమలను గుర్తించే డ్రోన్ ఇది. కీటకాలను వాటి రూపాన్ని బట్టి ఈ డ్రోన్ గుర్తించదు. ప్రతి దోమ జాతికి ఉండే ప్రత్యేకమైన వింగ్బీట్ ‘ఫింగర్ ప్రింట్’ ద్వారా గుర్తిస్తుంది. ఇతర కీటకాలకు ముప్పు వాటిల్లకుండా కేవలం దోమలనే లక్ష్యంగా చేసుకునేలా ఈ డ్రోన్‌ను డిజైన్ చేశారు.లెసోనార్ 2దోమల సమస్యకు పరిష్కార మార్గంగా ఫ్రెంచ్ స్టార్టప్ టోర్నియోల్ 40 గ్రాముల బరువు ఉన్న ఒక డ్రోన్‌ను రూపొందించింది. ఈ డ్రోన్ నిర్దిష్ట ప్రాంతంలో గస్తీ కాస్తూ, అవసరమైనప్పుడు ఛార్జింగ్ కోసం తిరిగి వస్తుంది. గాలిలో దోమలను గుర్తించిన వెంటనే వాటిపై దూసుకెళ్లి తన ప్రొపెల్లర్స్‌తో వాటిని గాలిలోనే నిర్మూలిస్తుంది. టోర్నియోల్ తాజా మోడల్ లెసోనార్ 2. ఇందులో 32 అల్ట్రా సోనిక్ ఎమిటర్స్ ఉంటాయి. ఈ ఎమిటర్స్ మనుషులకు వినబడని అల్ట్రాసోనిక్ పల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సమీపంలోని వస్తువులు లేదా కీటకాలపై పరావర్తనం చెందుతాయి. పరావర్తనం చెందిన పల్స్‌ను గ్రహించే 380 మైక్రోఫోన్లు సౌండ్‌ను ప్రాసెస్ చేసి, పరిసరాల రియల్– టైమ్ 3డీ మ్యాప్‌ను రూపొందిస్తాయి. కెమెరాకు బదులుగా సోనార్ ను ఉపయోగించడం వల్ల డ్రోన్ కాంపాక్ట్ (చిన్నగా)గా ఉండగలుగుతుంది. రాత్రిపూట కూడా చూడగలుగుతుంది.సెక్యూరిటీ ఫీచర్స్‌తో...కవరేజ్ ప్రాంతాన్ని గుర్తించడం, ఫర్మ్‌వేర్‌ను అప్డేట్ చేయడం, ఫైట్ షెడ్యూల్స్ రూపొందించడం.. మొదలైన పనుల కోసం ఈ డ్రోన్‌కు ప్రత్యేక యాప్, వెబ్ ఇంటర్‌ఫేస్‌లు ఉంటాయి.‘భద్రతా ఫీచర్స్ ఉండేలా మా డ్రోన్‌ను రూపొందించాం. మనుషులు, పెంపుడు జంతువులకు సురక్షిత దూరాలను పాటిస్తుంది. చిన్న పరిమాణం, తక్కువ బరువు వలన అనుకోకుండా తాకినా ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని తెలియజేస్తుంది కంపెనీ వెబ్సైట్. సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌తో ఈ కిల్లర్ డ్రోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.‘ఫోటాన్ మ్యాట్రిక్స్ ల్యాబ్’ అనే సంస్థ దోమల పని పట్టడానికి ఒక కొత్తరకం పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరం నుంచి వచ్చే నీలం, ఊదారంగు కాంతి దోమ కనిపించగానే ఎటాక్ చేస్తుంది. తొలి అడుగులలో ఏ పరికరానికైనా పరిమితులు ఉంటాయి. ఈ కిల్లర్ డ్రోన్లకు కూడా అలాంటి పరిమితులు ఉండి ఉండవచ్చు. అయితే కాలక్రమంలో ఆ పరిమితులకు పరిష్కారాలు తప్పకుండా వస్తాయి అంటున్నారు నిపుణులు.అందుకే... దోమల దినోత్సవంఆడ అనోఫెలెస్ దోమలు మలేరియాను వ్యాపింపజేస్తాయని సర్ రోనాల్డ్ రాస్ 1897లో చేసిన చారిత్రక ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 20న ‘దోమల దినోత్సవం’ జరుపుతారు. ఈ ఆవిష్కరణ వైద్యశాస్త్రంలో పెద్ద ముందడుగు.దోమలపై మైక్రోసాఫ్ట్ గురి!దోమల నివారణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడంపై టెక్ కంపెనీలు ఆటోమేషన్, రోబోటిక్స్‌పై దృష్టి పెట్టాయి. మైక్రోసాఫ్ట్‌తో సహా పలు సంస్థలు దోమల నిర్మూలన కోసం కొత్త హైటెక్ సాధనాలను పరీక్షిస్తున్నాయి. జికా వ్యాధిని వ్యాప్తి చేసేవిగా పేరుగాంచిన ఈడిస్ ఈజిప్టి దోమలను పట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక స్మార్ట్ట్రాప్ను పరీక్షిస్తోంది. కాలిఫోర్నియాలో ‘అల్ఫాబెట్’కు చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం దోమల జనన నియంత్రణకు సాంకేతిక పరిష్కారాలు అన్వేషిస్తోంది. -
యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో మార్పులు
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ తమ ప్లాట్‌ఫామ్‌పై వ్యూస్ లెక్కింపు విధానంలో భారీ మార్పులు తెస్తోంది. ఆగస్టు 24 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ప్రకారం, ఒక వీడియో ప్లే కావడం ప్రారంభమైన మరుక్షణమే (ఫస్ట్ ఫ్రేమ్ ప్లే కాగానే) దానిని ఒక ‘వ్యూ’గా పరిగణిస్తారు. గతంలో ఒక వ్యూ నమోదు కావడానికి వినియోగదారులు సదరు వీడియోను నిర్ణీత సమయం (సుమారు 30 సెకన్లు) వరకు చూడాల్సి వచ్చేది. అయితే డిజిటల్ మీడియా పోటీలో టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్.. వంటి ప్లాట్‌ఫామ్‌లకు అనుగుణంగా డేటా విధానాన్ని ఏకీకృతం చేసేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూట్యూబ్ షార్ట్స్‌లో అమల్లో ఉన్న ఈ సూత్రాన్ని ఇకపై లాంగ్-ఫార్మాట్ (పొడవైన) వీడియోలకు కూడా వర్తింపజేస్తున్నారు.క్రియేటర్లు, ప్రకటనకర్తలకు ఏం మారనుంది?ఈ మార్పు వల్ల క్రియేటర్ల ఛానెళ్లపై పబ్లిక్‌గా కనిపించే వ్యూస్ సంఖ్య వేగంగా, భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, క్రియేటర్ల ఆదాయం (మానిటైజేషన్) విషయంలో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని యూట్యూబ్ స్పష్టం చేసింది.ఆదాయంలో మార్పు ఉండదు: ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అర్హతలు కేవలం పబ్లిక్ వ్యూస్‌పై కాకుండా ఎంగేజ్డ్ వ్యూస్ (వీక్షకులు ఎంత సమయం వీడియో చూశారనేది) ఆధారంగానే నిర్ణయిస్తారు.యూట్యూబ్ స్టూడియోలో స్పష్టత: క్రియేటర్లు తమ అనలిటిక్స్ కోసం పబ్లిక్ వ్యూస్‌తో పాటు నిజమైన ఎంగేజ్మెంట్ తెలిపే ‘ఎంగేజ్డ్ వ్యూస్’ను విడివిడిగా చూసుకునే వెసులుబాటును యూట్యూబ్ స్టూడియోలో కల్పిస్తారు.పాత వీడియోల డేటా సురక్షితం: ఆగస్టు 24 కంటే ముందు అప్లోడ్ చేసిన పాత వీడియోల చారిత్రక డేటా యథాతథంగానే ఉంటుందని సంస్థ తెలిపింది.ఈ నిర్ణయం ద్వారా బ్రాండ్లు, స్పాన్సర్లకు తమ రీచ్‌ను ప్రతిబింబించడం క్రియేటర్లకు సులువవుతుంది. ఈ విధానం ద్వారా డిజిటల్ కంటెంట్ పరిశ్రమలో మరింత పారదర్శకత పెరుగుతుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర.. -
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ధరలకు రెక్కలు
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ మొబైల్ దిగ్గజాలు వన్ ప్లస్, ఒప్పో తమ ప్రముఖ మోడళ్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాల డిమాండ్ కారణంగా మెమొరీ చిప్‌లు, హార్డ్‌వేర్ కాంపోనెంట్ల కొరత తీవ్రమైంది. దీంతో పెరిగిన తయారీ వ్యయాన్ని తట్టుకునేందుకు కంపెనీలు ఈ ధరల పెంపును నేరుగా వినియోగదారులపైకి నెట్టేశాయి.కొత్త ధరల జాబితా ప్రకారం, ఒప్పో సంస్థ తన రేనో 16 సిరీస్‌పై గరిష్టంగా రూ.5,000 వరకు పెంచింది. రేనో 16 5G వేరియంట్ల ధరలు రూ.66,999, రూ.71,999కి చేరగా, 'రేనో 16c 5G' మోడళ్లపై రూ.4,000 వరకు అదనపు భారం పడింది. అంతేకాకుండా, అందుబాటు ధరల్లో లభించే ఒప్పో A6s 5G, A6x 5G శ్రేణి ఫోన్ల ధరలు కూడా రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి.మరోవైపు, వన్ ప్లస్ నోర్డ్ సిరీస్ ధరలను రూ.2,000 నుంచి రూ.4,000 వరకు సవరించింది. వన్ ప్లస్ నోర్డ్ CE 6 లైట్ (8GB+256GB) వేరియంట్‌పై అత్యధికంగా రూ.4,000 పెంపు నమోదు కాగా, దాని ధర రూ.34,999కి చేరింది. అలాగే నోర్డ్ 6 (12GB+256GB వేరియంట్ రూ.52,999), నోర్డ్ CE 6, ఎన్6, ఎన్6ఎక్స్ మోడళ్ల రీటైల్ ధరలు కూడా పెరిగాయి.పరిశ్రమ నిపుణుల విశ్లేషణ ప్రకారం, గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా సమస్యలు, పెరిగిన కాంపోనెంట్ వ్యయాల కారణంగా కేవలం ఈ రెండు బ్రాండ్లు మాత్రమే కాకుండా ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాబోయే పండగ సీజన్ సేల్స్ వరకు స్మార్ట్‌ఫోన్ ధరల్లో ఉపశమనం లభించడం కష్టమేనని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర.. -
రీల్స్, వీడియోల సంపాదనపై పన్ను
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో రీల్స్, వీడియోలతో ఆర్జిస్తున్న కంటెంట్ క్రియేటర్లు పన్నుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. నాన్-ఆడిట్ వర్గానికి చెందిన ఐటీఆర్‌ల సమర్పణకు ఆగస్టు 31 తుది గడువు కావడంతో ఆదాయ పన్ను శాఖ సోషల్ మీడియా సంపాదనపై దృష్టి సారించింది.ఆదాయ పన్ను చట్టం ప్రకారం, ఇన్ఫ్లుయెన్సర్ల ఆదాయాన్ని వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే లాభాలుగా పరిగణిస్తారు. ఐటీ శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా 16021 అనే ప్రొఫెషన్ కోడ్‌ను కేటాయించింది. యాడ్సెన్స్, స్పాన్సర్‌షిప్‌లు, అఫిలియేట్ మార్కెటింగ్ ఆదాయాలు దీని పరిధిలోకి వస్తాయి. బ్రాండ్ల నుంచి లభించే ఉచిత స్మార్ట్ఫోన్లు, విదేశీ పర్యటనలు, గిఫ్ట్ వోచర్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. సెక్షన్ 194R ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో బ్రాండ్ నుంచి పొందిన ఉచిత ప్రయోజనాల విలువ రూ.20,000 దాటితే సదరు కంపెనీ 10% టీడీఎస్ మినహాయిస్తుంది. ఆ వస్తువును క్రియేటర్ తన వద్దే ఉంచుకుంటే దాని విలువను ఆదాయంగా చూపి పన్ను చెల్లించాలి. ఈ వివరాలన్నీ ఏఐఎస్/ ఫామ్ 26ఏఎస్‌లో నమోదవుతాయి.మినహాయింపులు.. ఐటీఆర్ ఫారమ్కంటెంట్ తయారీకి అయిన కెమెరా టూల్స్ డిప్రిసియేషన్, సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్లు, ఇంటర్నెట్ బిల్లులు, ఎడిటర్ల జీతాలు, స్టూడియో అద్దె వంటి ఖర్చులను మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. క్రియేటర్లు ఐటీఆర్-3 లేదా సులభతర పన్ను విధానం కోసం ఐటీఆర్-4ను ఎంచుకోవచ్చు. ఆగస్టు 31 గడువు దాటితే సెక్షన్ 234F కింద రూ.5,000 వరకు లేట్ ఫీజుతో పాటు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. కాబట్టి ప్రొఫెషనల్స్ సలహాతో గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయడం శ్రేయస్కరం.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
3.6 మిలియన్ ఉద్యోగుల డేటా చోరీ?.. బిగ్ టెక్ కంపెనీలే టార్గెట్
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగుల డేటా చోరీకి గురైనట్లు ఓ థ్రెట్ యాక్టర్ చేసిన ఆరోపణలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ‘హ్యాట్‌మాన్’ అనే సైబర్ నేరస్తుడు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగిస్తున్న పలు కంపెనీల వ్యవస్థల్లోకి చొరబడి సుమారు 36.4 లక్షల రికార్డులను దొంగిలించినట్లు ప్రకటించాడు. ఈ డేటాను ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు సైబర్ సెక్యూరిటీ నివేదికలు వెల్లడించాయి. అయితే, ఈ డేటా లీక్‌పై సంబంధిత సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.ప్రపంచవ్యాప్తంగా డేటా లీక్‌కు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వాటిలో మెక్‌డొనాల్డ్స్, గ్యాప్ ఇన్క్., వొడాఫోన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇంటర్కాంటినెంటల్ హోటల్స్ గ్రూప్, కైండ్రిల్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు చెందిన ఉద్యోగుల డేటా తన వద్ద ఉందని సైబర్ నేరస్తుడు పేర్కొన్నాడు.జూలై 31 నుంచి వరుసగా పలు డేటాబేస్లను విక్రయానికి ఉంచినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. మొత్తం తొమ్మిది లిస్టింగ్స్‌లో 36 లక్షలకు పైగా రికార్డులు ఉన్నాయని అతను పేర్కొన్నాడు.ఈ ఆరోపణల్లో అత్యంత పెద్ద డేటాబేస్ మెక్‌డొనాల్డ్స్‌కు సంబంధించినదిగా చెబుతున్నారు. సుమారు 17 లక్షలకు పైగా ఉద్యోగుల రికార్డులు తన వద్ద ఉన్నాయని హ్యాట్‌మాన్ పేర్కొన్నాడు. ఇందులో ఉద్యోగుల పేర్లు, ఎంప్లాయీ ఐడీలు, ఈమెయిల్ అడ్రస్‌లు, ఉద్యోగ హోదాలు, ఫోన్ నంబర్లు, పోస్టల్ అడ్రస్‌లు, సర్వీస్ అకౌంట్లు, ఇతర అంతర్గత టెనెంట్ వివరాలు ఉన్నాయని అతను చెప్పినట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ వార్తా సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్ నివేదించింది. -
వెయిటర్ ఉద్యోగాలు కూడా పోతాయా?
ఏఐ రావడంతో చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికి కూడా ఈ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక రోబో వెయిటర్ పని చేస్తోంది. దీంతో వెయిటర్ ఉద్యోగాలు కూడా పోతాయా? అనే సందేహం కలుగుతోంది.హర్యానాలోని ఒక డాబాలో రోబోట్ వెయిటర్ నేరుగా వినియోగదారుల టేబుళ్ల వద్దకే ఆహారాన్ని అందిస్తోంది . ముందుగా నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడానికి వీలు కల్పించే నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి, ఈ రోబోట్ స్వయంగా ఫుడ్ ట్రేలను నిర్దేశిత టేబుళ్లకు తీసుకువెళుతుంది. ఆర్డర్ సిద్ధమైన తర్వాత, సిబ్బంది ఆహారాన్ని దాని ట్రేలో ఉంచుతారు, మరియు ఆ రోబోటిక్ వెయిటర్ కేటాయించిన టేబుల్ వైపు బయలుదేరుతుంది.కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ రెడీ అయిన తర్వాత దాన్ని ట్రేలో పెట్టి రోబోపై ఉంచుతారు. ఆ తర్వాత అది తనకు కేటాయించిన టేబుల్ దగ్గరకు స్వయంగా వెళ్లి ఫుడ్‌ను తీసుకెళ్తుంది. ప్రత్యేకమైన నావిగేషన్ సిస్టమ్ సహాయంతో నిర్ణయించిన మార్గంలో కదులుతుంది. అవసరమైనప్పుడు రిమోట్ కంట్రోల్‌తో కూడా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు.Waiter's Job Gone! At Resham Dhaba in Murthal Sonipat, customers are being served by a robot waiter instead of a human. The robot is delivering food directly to customers’ tables, leaving many visitors amazed. More Details: https://t.co/zpoJ4Q5isE#Murthal @robot pic.twitter.com/6tLohvY0mO— Vinod Katwal (@Katwal_Vinod) August 17, 2026ఆకట్టుకుంటున్న రోబో వెయిటర్ఫైబర్తో తయారు చేసిన రోబో బాడీ, కళ్లలో మెరిసే ఎల్ఈడీ లైట్లు దీనికి ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఎరుపు రంగులో వెలిగే లైట్లు చూసేందుకు ఆసక్తికరంగా ఉన్నాయి. రోబో డాబాలో తిరుగుతూ ఫుడ్ సర్వ్ చేయడంతో కస్టమర్లు దాన్ని వీడియోలు, ఫొటోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ రోబో ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 1.5 నుంచి 2 గంటల వరకు పనిచేస్తుంది. దీనిని బెంగళూరుకు చెందిన ఓ టీమ్ సహకారంతో ఈ రోబోను అభివృద్ధి చేశారు.వెయిటర్ ఉద్యోగాలు పోతాయా?ఇక ఉద్యోగాలు పోతాయా అనే విషయానికి వస్తే.. రెస్టారెంట్లు, హోటళ్లలో AI ఆధారిత రోబోట్లు క్రమంగా అడుగుపెడుతున్నాయి. కస్టమర్లకు ఆహారం తీసుకెళ్లడం, ఆర్డర్లు అందించడం, టేబుళ్లను గుర్తించడం వంటి పనులను ఇవి చేయగలుగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో వెయిటర్ల ఉద్యోగాలు తగ్గిపోతాయా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా సిబ్బంది కొరత, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉన్న చోట్ల రోబోట్లను ఉపయోగించడం యజమానులకు ఆకర్షణీయంగా మారుతోంది.అయితే.. వెయిటర్ల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే కస్టమర్లతో మాట్లాడటం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, వ్యక్తిగత సేవ అందించడం వంటి పనులను రోబోట్లు ఇప్పటికీ పూర్తిగా భర్తీ చేయలేవు. అందువల్ల రోబోట్లు వెయిటర్లను పూర్తిగా భర్తీ చేయడం కంటే, వారి పనిలోని కొన్ని సాధారణ బాధ్యతలను చేపట్టే అవకాశం ఎక్కువ. భవిష్యత్తులో వెయిటర్లు - రోబోట్లు కలిసి పనిచేసే విధానం పెరగవచ్చు. -
ఏఐతో సుఖపడతాం అనుకుంటే.. మోసపోయాం!
ఏఐ వస్తే ఉద్యోగుల పని తగ్గిపోతుందని.. రోజుకు గంటల తరబడి చేసే రొటీన్ పనుల నుంచి విముక్తి లభిస్తుందని టెక్ ప్రపంచం ఊదరగొట్టింది. కానీ కృత్రిమ మేధ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. పని వేగంగా పూర్తవుతున్నా.. అదే సమయంలో మరింత పని అప్పగిస్తున్నారని, ఏఐ వల్ల పని గంటలు తగ్గకపోగా ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు.2023లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. భవిష్యత్తులో ఏఐ, యంత్రాల సాయంతో వారానికి మూడు రోజులే పని చేసే పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీలోనూ ఇదే తరహా ఆశావహ అంచనాలు వినిపించాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఏఐ సాయంతో రొటీన్ పనులను త్వరగా పూర్తి చేసి.. మిగిలిన సమయాన్ని సృజనాత్మక, కీలకమైన పనులకు కేటాయించవచ్చని ప్రచారం జరిగింది.కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఏఐతో పని త్వరగా పూర్తవుతున్న కొద్దీ.. ఉద్యోగుల నుంచి అంతకంటే ఎక్కువ పని చేయాలని సంస్థలు ఆశిస్తున్నాయని పలువురు డెవలపర్లు చెబుతున్నారు. అంటే పని తగ్గించాల్సిన ఏఐ.. అదే సమయంలో పనిని పెంచే సాధనంగా మారిపోయిందన్నమాట.‘అదే 9 గంటలు.. కానీ పని ఎక్కువ’ఓ ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేస్తున్న శుభమ్ మాట్లాడుతూ.. ఏఐ వల్ల పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ, పని గంటలు మాత్రం తగ్గడం లేదని చెప్పారు. పైగా తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయగలుగుతున్నందున.. అదే వ్యవధిలో మరిన్ని పనులు అప్పగిస్తున్నారని తెలిపారు.బెంగళూరుకు చెందిన సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంకిత అనుభవం మరింత భిన్నంగా ఉంది. ఏఐ వల్ల ఒక పని సగం సమయంలో పూర్తవుతుందని మేనేజ్మెంట్ భావిస్తోందని.. దీంతో పని తగ్గడానికి బదులుగా లక్ష్యాలు పెరుగుతున్నాయని ఆమె చెబుతున్నారు. “ఏఐ ఉంటే పని 30 శాతం సమయంలోనే పూర్తవ్వాలి. కాబట్టి అదే సమయంలో మరింత పని చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది” అని ఆమె వివరించారు.15-16 గంటల పని..ఏఐ వల్ల తన పని భారం గతంలో కంటే పెరిగిందని అంకిత చెబుతున్నారు. గత మూడు నెలలుగా రోజుకు 15-16 గంటలు పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి తోడు సంస్థలో ఏఐకి సంబంధించిన కొత్త టెక్నాలజీలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లకు హాజరుకావాల్సి వస్తోందని చెప్పారు.అంటే.. ఏఐని ఉపయోగించడం నేర్చుకోవడానికి కూడా అదనపు సమయం కేటాయించాల్సి వస్తోంది. శిక్షణ పూర్తయిన తర్వాత మిగిలిన సమయంలో సాధారణ పనిని పూర్తి చేయాల్సి ఉంటుందని ఆమె అంటున్నారు.ఏఐ వాడండి.. కానీ టోకెన్లు పరిమితమే!మరో విచిత్రమైన పరిస్థితి కూడా ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. ఏఐని విస్తృతంగా ఉపయోగించాలని మేనేజ్మెంట్లు కోరుతున్నప్పటికీ.. కొన్ని సంస్థలు ఏఐ టూల్స్ వినియోగానికి పరిమితులు విధిస్తున్నాయి.అంకిత పనిచేసే సంస్థలో నెలకు 250 డాలర్ల విలువైన ఏఐ టోకెన్లను మాత్రమే అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. నెల మధ్యలోనే ఆ పరిమితి పూర్తయిపోతే.. ఏఐ సరిగా పనిచేయలేదని మేనేజ్మెంట్ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఏఐతో ఎక్కువ పని చేయాలి.. కానీ దానికి అవసరమైన ఏఐ వనరులు మాత్రం పరిమితమే అనే పరిస్థితి ఉద్యోగులకు కొత్త తలనొప్పిగా మారింది.ఏఐ చేసిన పని.. మళ్లీ మనమే సరిచేయాలి!ఏఐ కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. గ్రాఫిక్ డిజైనర్ల వంటి ఇతర రంగాల్లోనూ దీని వినియోగం పెరిగింది. అయితే ఏఐ ఇచ్చిన ఫలితం ప్రతిసారీ కచ్చితంగా ఉండదని డిజైనర్లు చెబుతున్నారు. ఏఐతో పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ.. తప్పులు వస్తే వాటిని గుర్తించి మాన్యువల్‌గా సరిచేయాల్సి వస్తోంది. దీంతో ఏఐ పని తగ్గించిందా? లేక పని చేసే విధానాన్ని మాత్రమే మార్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అమెజాన్ లాజిస్టిక్స్‌లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లు ఓ ఉద్యోగి తెలిపారు. దెబ్బతిన్న ప్యాకేజీలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో సరిగ్గా ఉన్న ప్యాకేజీగా చూపిస్తోందని.. అప్పుడు మనుషులే మళ్లీ తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు.అయితే ఏఐ నిజంగా పనికిరాదా?అలా అని అందరూ ఏఐని వ్యతిరేకించడం లేదు. తెలివిగా ఉపయోగించగలిగితే ఏఐతో పని భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు ఉద్యోగులు అంటున్నారు. అయితే ఏఐనే మొత్తం పనిని చేసేస్తుందని భావిస్తే.. తప్పులను సరిచేయడం, ఫలితాలను తనిఖీ చేయడం వంటి అదనపు పనులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదంతా చూస్తే.. ఏఐపై మొదట్లో చేసిన ‘తక్కువ పని.. ఎక్కువ విశ్రాంతి’ అంచనాలు ఇప్పటివరకు నిజం కాలేదనే చెప్పాలి. పైగా ఏఐతో ఉత్పాదకత పెరిగే కొద్దీ ఉద్యోగులపై సంస్థల అంచనాలు కూడా పెరుగుతున్నాయి.మూడు రోజుల వర్క్‌వీక్ ఎక్కడ?ఏఐ కారణంగా భవిష్యత్తులో వారానికి మూడు రోజులే పనిచేసే పరిస్థితి రావచ్చన్న బిల్‌గేట్స్ అంచనాలకు భిన్నంగా.. ఏఐ యుగంలో మనుషులు మరింత బిజీగా మారొచ్చని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ఇటీవల వ్యాఖ్యానించారు.సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా మనుషులు మరింత బిజీగా ఉంటారని.. ఎందుకంటే ఏఐతో సామర్థ్యం పెరిగే కొద్దీ మన అంచనాలు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే.. ప్రస్తుత పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏఐ పని తగ్గిస్తుందని వచ్చింది.. కానీ పని చేసే వేగాన్ని పెంచి, చేయాల్సిన పనినే మరింత పెంచేసిందన్నమాట! -
ఇక ఇన్స్టాగ్రామ్.. ఫేస్బుక్ మునుపటిలా ఉండవు!
సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు, రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాం. అయితే ఇంతగా అలవాటైన ఈ సోషల్ మీడియా అనుభవం అతిత్వరలో మారిపోనుందా?.. ఇది వరకులా అది మనకు వినోదం పంచడం సాధ్యం కాదా?. మెటాపై కేసు విచారణలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం, వారి వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అమెరికాలో మెటా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కీలక కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకుంది. ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇప్పటివరకు వినియోగదారులకు అత్యంత సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి వేసిన ఈ కేసు మెటాపై ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక జరిమానా విధించే పరిస్థితికీ దారితీయొచ్చు కూడా. ఏం జరిగింది?2023లో అమెరికాలోని 30 రాష్ట్రాలు మెటాపై కేసు దాఖలు చేశాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి కీలక రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను రూపొందించి, వారు ఎక్కువసేపు ఆ ప్లాట్‌ఫామ్‌లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేకాదు.. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులను పదేపదే యాప్‌లోకి తిరిగి తీసుకురావడానికి నోటిఫికేషన్లు, సిఫార్సు వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, అనంతంగా కంటెంట్ చూపించే విధానం వంటి ఫీచర్లను ఉపయోగిస్తోందని రాష్ట్రాలు చెబుతున్నాయి.నేటి నుంచే కీలక విచారణమెటాపై అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన ఈ కీలక కేసులో ప్రధాన విచారణ నేటి నుంచి(ఆగస్టు 18) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జ్యూరీ ఎదుట వాదనలు జరగనున్నాయి. విచారణ సుమారు 6–8 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రాలు మెటా యువతను ఎక్కువసేపు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండేలా డిజైన్ చేసిందని ఆరోపిస్తున్నాయి. దీంతో.. తీర్పు ఎలా రానుందా? అనే ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది.మెటా ఓడితే ఏం మారొచ్చు?ఈ కేసులో రాష్ట్రాలు కేవలం డబ్బు జరిమానా మాత్రమే కోరడం లేదు. పిల్లలు, టీనేజర్ల కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పనిచేసే విధానాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.అందులో ముఖ్యమైనవి..టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల ధ్రువీకరణ తప్పనిసరి చేయడం.పిల్లలు, టీనేజర్లు అనేక ఖాతాలు సృష్టించకుండా నియంత్రణలు విధించడం.యువ వినియోగదారులకు కనిపించే లైక్ కౌంట్లను తొలగించడం.ఒక కంటెంట్ తర్వాత మరొకటి నిరంతరం చూపించే ఇన్ఫినిట్ స్క్రోల్‌ను నిలిపివేయడం.టీనేజర్లను ఎక్కువసేపు యాప్‌లో ఉంచేలా పనిచేస్తున్న రికమెండేషన్ అల్గారిథమ్‌లలో మార్పులు చేయడం.ముఖం, శరీర రూపాన్ని మార్చే కొన్ని ఇమేజ్ ఫిల్టర్లను తొలగించడం.వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అయ్యే ఆటోప్లే ఫీచర్‌ను నిలిపివేయడం.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వంటి తాత్కాలికంగా కనిపించి మాయమయ్యే పోస్టులను పరిమితం చేయడం. ఇవన్నీ చూస్తే.. ఈ కేసు, మెటాకు రాబోయే తీర్పు ఎంతో కీలకమని స్పష్టమవుతోంది. వ్యతిరేకంగా వస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ప్రాథమిక వినియోగ అనుభవమే మారిపోయే అవకాశం ఉంది.పిల్లలను ‘యూజర్లు’గా మార్చడమే లక్ష్యమా?ఇదే ఈ కేసులో ప్రధాన ఆరోపణ. పిల్లలు, టీనేజర్లు ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువసేపు ఉండేలా మెటా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫీచర్లను రూపొందించిందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఒక వీడియో పూర్తయిన వెంటనే మరొకటి మొదలవడం, స్క్రోల్ చేస్తూనే కొత్త కంటెంట్ రావడం, తరచూ నోటిఫికేషన్లు రావడం వంటి అంశాలు వినియోగదారులను మళ్లీ మళ్లీ యాప్‌లోకి తీసుకువస్తాయని వాటి వాదన. అంటే.. యూజర్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడా? లేక యాప్ యూజర్‌ను ఉపయోగిస్తోందా? అనే పెద్ద ప్రశ్న ఈ కేసులో ముందుకు వస్తోంది.లైక్ బటనే కీలకం?సోషల్ మీడియాలో లైక్ అనేది సాధారణంగా కనిపించే చిన్న సంఖ్య. కానీ పిల్లలు, టీనేజర్లపై దాని ప్రభావం పెద్దదిగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎంతమంది లైక్ చేశారు? ఇతరుల పోస్టులకు తన పోస్టుకు వచ్చిన స్పందన ఎంత? ఇతరులతో పోలిస్తే తాను ఎలా ఉన్నాను? అనే ఆలోచనలు యువతలో సామాజిక పోలికలకు దారితీయొచ్చని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో మెటా స్వయంగా నిర్వహించిన పరిశోధనల నుంచి కూడా రాష్ట్రాల న్యాయవాదులు ఆధారాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. లైక్ కౌంట్లు సోషల్ కంపారిజన్*కు దారితీస్తాయని, ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి పోలికలు ఒంటరితనం, శరీర రూపంపై ప్రతికూల భావన, నెగెటివ్ మూడ్‌తో సంబంధం కలిగి ఉన్నాయని మెటా అంతర్గత పరిశోధనలు సూచించినట్లు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మెటా వాదన ఏంటి?అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండిస్తోంది. యువతకు మద్దతు ఇవ్వడంలో తమ సంస్థకు దీర్ఘకాలిక నిబద్ధత ఉందని, కేసులోని ఆధారాలు తమ వైఖరిని సమర్థిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే మరో రాష్ట్రంలో మెటాకు ఎదురుదెబ్బ తగిలింది. న్యూ మెక్సికోలోని ఒక కేసులో మెటాపై 942 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు యువ వినియోగదారులకు సంబంధించిన పలు మార్పులు చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లలోపు వినియోగదారులకు లైక్ కౌంట్లను తొలగించడం, నగ్న చిత్రాలకు సంబంధించిన మెసేజింగ్‌ను నిరోధించడం, పుష్ నోటిఫికేషన్లను నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం వంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. మెటా ఆ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసు చాలా పెద్దదే!న్యూ మెక్సికో కేసు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ తాజా కేసులో 30 రాష్ట్రాలు కలిసి మెటాను ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అమెరికా జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందువల్ల మెటా ఈ కేసులో ఓడిపోతే.. తీర్పు ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అమెరికా అంతటా ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పిల్లలు, టీనేజర్ల అనుభవాన్ని మార్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా భవిష్యత్తుపై ప్రభావం?ఈ కేసు మరో అసలు ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. పిల్లలను ఆకర్షించడానికి రూపొందించిన సోషల్ మీడియా ఫీచర్లకు ఎంతవరకు పరిమితులు ఉండాలి? కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే చిన్నారుల మానసిక ఆరోగ్యం, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలా? తల్లిదండ్రుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి?. మెటా ఓడితే.. లైక్‌ల సంఖ్య కనిపించని ఇన్స్టాగ్రామ్, నిరంతర స్క్రోల్ లేని ఫేస్బుక్, తల్లిదండ్రుల అనుమతి అవసరమయ్యే టీనేజర్ ఖాతాలు, పరిమితమైన నోటిఫికేషన్లు వంటి కొత్త సోషల్ మీడియా అనుభవం మొదలయ్యే అవకాశం ఉంది. -
జియో మెంబర్షిప్.. రూ.300తో టెన్షన్ లేని రీఛార్జ్!
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం 'జియో ప్రైమ్ మెంబర్షిప్'ను(Jio Prime Membership) తీసుకొచ్చింది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మెంబర్‌షిప్‌ను రీలాంచ్ చేసింది. అయితే.. ఈసారి ప్రైమ్‌లో ప్రధాన ఆకర్షణ కేవలం అదనపు ఆఫర్లు కాదు.. టారిఫ్ ధరలు పెరిగినా కస్టమర్లపై ఆ భారం పడకుండా రక్షణ కల్పించడం.రూ.300 చెల్లిస్తే..జియో ప్రైమ్ మెంబర్షిప్ కోసం ఒక్కసారి రూ.300 చెల్లించాలి. ఈ మెంబర్షిప్ జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. సభ్యత్వం తీసుకున్న తర్వాత.. ప్లాన్స్ ధరలు పెరిగినా, ప్రస్తుతం ఉన్న ధరలకే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మెంబర్షిప్ తీసుకున్న వాళ్లకు మాత్రమే. ఇది 5 సెప్టెంబర్ 2027 వరకు వర్తిస్తుంది. అంటే ఏడాది పాటు రీఛార్జ్ ధరలు పెరిగినా భయం లేదన్నమాట.రూ.600 క్యాష్‌బ్యాక్జియో ప్రైమ్‌లో సభ్యత్వం తీసుకున్న వారికి రూ.600 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లు కూడా లభిస్తాయి. ఇందులో రూ.300 క్యాష్‌బ్యాక్‌ను కొత్త జియో హోమ్ లేదా జియో పీసీ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. మరో రూ.300 వోచర్‌ను స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం కొత్త జియో సిమ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు పొందవచ్చు.కొత్త సేవలకు ముందుగానే యాక్సెస్ప్రైమ్ సభ్యులకు జియో తీసుకొచ్చే కొత్త ఉత్పత్తులు, సేవలు, ట్రయల్స్‌కు ముందస్తు యాక్సెస్ కూడా లభిస్తుంది. అంతేకాదు.. కస్టమర్లకు ప్రత్యేకంగా ప్రయారిటీ కస్టమర్ సపోర్ట్ అందించేందుకు ప్రత్యేక సర్వీస్ ఛానల్‌ను కూడా జియో ఏర్పాటు చేయనుంది. మెంబర్షిప్ వ్యవధిలో మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.ఎవరు తీసుకోవచ్చు?ప్రస్తుతం జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ వాడుతున్న అందరు జియో కస్టమర్లు రూ.300 చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అయితే.. ఇతర నెట్‌వర్క్‌లలో ఉన్నవారు జియోకి మారడం లేదా కొత్త జియో కనెక్షన్ తీసుకోవడం ద్వారా ఈ మెంబర్‌షిప్‌లో చేరవచ్చు.ఎక్కడ తీసుకోవాలి?జియో ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకునే వారు మైజియో యాప్ లేదా జియో.కామ్, జియో స్టోర్స్, జియో పార్ట్నర్ స్టోర్స్ ద్వారా తీసుకోవచ్చు. తరచూ రీఛార్జ్ ధరలు పెరుగుతాయేమోనని ఆందోళన చెందే జియో కస్టమర్లకు ఇది ఉపయోగపడుతుంది. -
అందుకే.. ఏఐ ఎంత ఎదిగినా.. మనిషి అవసరమే!
శాన్ఫ్రాన్సిస్కోలోని ఆండన్ మార్కెట్ అనే ఎక్స్పెరిమెంటల్ స్టోర్‌ను ఏఐ మేనేజర్ లూనా నిర్వహిస్తోంది. ఆండన్ ల్యాబ్స్ కంపెనీ లూనాకు డబ్బు, కార్పొరేట్ కార్డు, ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చి దుకాణాన్ని నడిపిస్తూ లాభం సంపాదించమని బాధ్యత అప్పగించింది.లూనా తన విధి నిర్వహణలో భాగంగా దుకాణంలో ఏ వస్తువులు అమ్మాలి, వాటి ధరలు ఎంత ఉండాలి, దుకాణం ఎప్పుడు తెరవాలి వంటి అనేక నిర్ణయాలు తీసుకుంది. అయితే దుకాణం ఇప్పటివరకు లాభాల్లోకి రాలేదు. కానీ.. ఇటీవల లూనా ఒక మానవ ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది. ఆ ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చాడు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హాజరుకు సంబంధించిన ఒక నియమాన్ని లూనా గతంలో తానే రూపొందించింది. కానీ.. ఆ నియమాన్ని తర్వాత గుర్తుంచుకోలేకపోవడంతో, ఉద్యోగి చాలా కాలం ఆలస్యంగా వచ్చినా చర్య తీసుకోలేదు. చివరకు మానవ సిబ్బంది లూనాకు తాను రూపొందించిన నియమాన్ని గుర్తు చేసి, ఉద్యోగి పనితీరును మళ్లీ పరిశీలించమని చెప్పడంతో ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది.ఈ సంఘటన ఏఐ ఎంత తెలివిగా ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చూపించింది. ఒక నియమాన్ని స్వయంగా తయారు చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని సరైన సమయంలో గుర్తుంచుకుని అమలు చేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగులపై ప్రభావం చూపే నిర్ణయాల్లో ఏఐ ఒక్కదానిపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. అందుకే ఈ సందర్భంలో చివరి నిర్ణయాన్ని మానవులే అమలు చేశారు.దీన్నిబట్టి చూస్తే.. ఏఐ వ్యాపారంలో అనేక పనులను నిర్వహించగలిగినా, మానవ పర్యవేక్షణ అవసరం ఇంకా ఉందని తెలుస్తోంది. లూనా తీసుకున్న ఈ తొలి ఉద్యోగ తొలగింపు నిర్ణయం ద్వారా ఏఐలో సామర్థ్యం ఉన్నప్పటికీ.. దాని నిర్ణయాలను సరైన విధంగా పర్యవేక్షించడానికి మనుషుల పాత్ర చాలా అవసరం అని స్పష్టమవుతోంది.For the first time (that we know of), an AI boss has fired a human employee.Luna, the AI running our store in San Francisco, decided to part ways with an employee over repeated lateness.Luna was running Claude Opus 4.8 at the time, but most models would have done the same. pic.twitter.com/8Z8D5bDGaX— Andon Labs (@andonlabs) August 14, 2026 -
త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఐదు నుంచి ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో తన 5జీ సేవలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోందని సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎమ్) ఎం.శేషాచలం వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిర్వహిస్తున్న 5జీ క్షేత్రస్థాయి పరిశీలనలు (ట్రయల్స్) విజయవంతమైన ఫలితాలను ఇస్తున్నాయని, నిర్దేశిత వ్యవధిలోనే సేవలను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి సమాంతరంగా రాష్ట్రవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ విస్తరణ, డిజిటల్ కనెక్టివిటీ వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'ఫ్రీడమ్ 20' మొబైల్ ఆఫర్ కింద రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్‌ను 24 రోజుల కాలపరిమితితో అందిస్తోంది. అలాగే రూ.1,111 నెలవారీ 'ఫైబర్ ఫ్రీడమ్' ప్లాన్ ద్వారా 200 ఎంబీపీఎస్ వేగంతో 5,000 జీబీ డేటాతో పాటు 25కి పైగా ఓటీటీ వేదికల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా రూ.499 ఫైబర్ బేసిక్ ప్లాన్ తీసుకునే చందాదారులకు మొదటి నెల సేవలు ఉచితమని, ఆ తర్వాతి మూడు నెలల పాటు నెలకు రూ.100 చొప్పున రాయితీ లభిస్తుందని వివరించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష 4జీ టవర్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 6,850 టవర్లు, 15,000 బీటీఎస్‌లు అందుబాటులో ఉన్నాయని సీజీఎమ్ తెలిపారు. సాచ్యురేషన్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 2,641 సుదూర/రిమోట్ గ్రామాలకు 4జీ సేవలను అందించేందుకు 1,359 ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో బీఎస్ఎన్ఎల్ రూ.24,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి ఆపరేషనల్ ప్రాఫిట్లోకి ప్రవేశించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.30,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని శేషాచలం తెలిపారు. ఇందులో ఏపీ సర్కిల్ వాటాగా రూ.1,400 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు. మొబైల్ సేవలకే పరిమితం కాకుండా శాటిలైట్ ఫోన్లు, ఎంటర్టైన్మెంట్ టీవీ, ఈ-సిమ్, ఎంటర్ప్రైజ్ సేవలను విస్తరించడంతో పాటు యువతకు ఫ్రాంచైజీ, భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తున్నామని సీజీఎమ్ వివరించారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
ఫోన్ పోయిందా? బ్యాంక్ యాప్స్ సురక్షితమేనా?
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాదు, అదొక వర్చువల్ వ్యాలెట్‌గా మారిపోయింది. ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా ఎవరైనా దొంగలించినా దుండగులు మీ బ్యాంకింగ్ యాప్‌లను యాక్సెస్ చేస్తే పరిస్థితి ఏమిటి? బాధ్యత ఎవరిది? నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుందా? అనే అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ఆధారంగా ప్రత్యేక విశ్లేషణ చూద్దాం.సాంకేతిక భద్రత, ముప్పుసాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు ఎంపిన్ (MPIN), పాస్వర్డ్ లేదా బయోమెట్రిక్ భద్రత కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఫోన్‌తో పాటు సిమ్ కార్డు కూడా నేరగాళ్ల చేతికి చిక్కితే వారు వేరే ఫోన్ ద్వారా ఓటీపీ లేదా యూపీఐ పిన్ రీసెట్ చేసి నిధులను మళ్లించే ప్రమాదం ఉంది.ఆర్బీఐ మార్గదర్శకాలురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం.. సిస్టమ్ లోపం లేదా థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఉల్లంఘన వల్ల అనధికార లావాదేవీ జరిగితే అలర్ట్ మెసేజ్ వచ్చిన మూడు పనిదినాల్లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే కస్టమర్‌పై ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండదు. ఫిర్యాదు చేయడానికి 4-7 పనిదినాలు ఆలస్యమైతే బ్యాంకు ఖాతా రకాన్ని బట్టి కస్టమర్ రూ.5,000-రూ.25,000 వరకు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. పిన్ లేదా ఓటీపీలను స్వయంగా పంచుకోవడం లేదా ఫిర్యాదు చేయడం 7 పనిదినాలకంటే ఎక్కువ ఆలస్యం చేస్తే బ్యాంకుకు సమాచారం అందించే వరకు జరిగిన మొత్తం నష్టానికి కస్టమర్‌దే పూర్తి బాధ్యత.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?ఫోన్ పోయిన వెంటనే ఏం చేయాలంటే..వెంటనే టెలికామ్ ఆపరేటర్‌ను సంప్రదించి సిమ్ సేవలను నిలిపివేయండి.కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులను బ్లాక్ చేయించాలి.'Find My Device' (ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్) ద్వారా ఫోన్లోని డేటాను రిమోట్‌గా డిలీట్ చేయండి.సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ పొందండి. -
‘కర్మ’ రిటర్న్ అంటే ఇదే?.. జూమ్‌లో 900 మంది లేఆఫ్స్.. విశాల్‌ను గెంటేసిన సంస్థ?
వాషింగ్టన్: విశాల్ గార్గ్.. పరిచయం అక్కర్లేని పేరు. మోర్టగేజ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉన్న 'బెటర్.కామ్' మాతృ సంస్థ ‘బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్’ సీఈఓ. కోవిడ్ సమయంలో జూమ్ కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగుల్ని తొలగించి సంచలనం సృష్టించారు.ఉద్యోగుల్ని తొలగించిన ఉసురు తగిలినట్లుంది.. ఇప్పుడు అదే ‘బెటర్ డాట్ కామ్’ సంస్థ విశాల్ గార్గ్ ను నిర్ధాక్షణ్యంగా పదవి నుంచి తొలగించింది, బయటకు గెంటేసింది. దీంతో ఆయన ఇప్పుడు అదే సంస్థపై వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనను సంస్థ దొంగదెబ్బ తీసిందని, హెడ్జ్ ఫండ్ మేనేజర్ డేనియల్ లూయిస్ తనకు వెన్నుపోటు పొడిశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ గార్గ్ అంశం వ్యాపార ప్రపంచంలో సంచలనంగా మారింది.అసలేం జరిగింది?అమెరికాలో ప్రముఖ డిజిటల్ మోర్టగేజ్ ప్లాట్‌ఫారమ్ ‘బెటర్.కామ్’ మాతృ సంస్థ ‘బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్’ సంస్థ సీఈఓ విశాల్ గార్గ్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆగస్ట్ 3న హెడ్జ్ ఫండ్ మేనేజర్ డేనియల్ లూయిస్ ఆ సంస్థ బోర్డులో చేరిన కొద్ది రోజులకే సీఈఓ పగ్గాలు చేపట్టడం టెక్ సర్కిల్స్‌లో కలకలం రేపింది.ఈ పరిణామంపై విశాల్ గార్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నమ్మించి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ‘డేనియల్ లూయిస్ నన్ను మోసం చేశాడు. కంపెనీ వ్యూహాలు బాగున్నాయని ఆయన నాతో చెప్పారు. ఎక్స్ వేదికగా మా పనితీరును ప్రశంసించారు. అలా నా నమ్మకాన్ని చూరగొని బోర్డులో సీటు సంపాదించుకున్నారు. చివరకు డైరెక్టర్లను ఒప్పించి నన్ను పదవి నుంచి దింపేశారు’అని గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు.కోవిడ్ మహమ్మారి విజృంభించిన కాలంలో హోమ్ లోన్స్ రీఫైనాన్సింగ్ ఊపందుకోవడంతో ‘బెటర్ డాట్‌కామ్’ కంపెనీ విలువ అప్పట్లో దాదాపు 8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 66 వేల కోట్లు) చేరుకుంది. అయితే ఆ తర్వాత వడ్డీ రేట్లు పెరగడంతో వ్యాపారం పడిపోయింది. 2021లో 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ వార్షిక అమ్మకాలు 2023 నాటికి కేవలం 70 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. మార్కెట్ విలువ కూడా గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు, 2021లో జూమ్ కాల్ ద్వారా ఉద్యోగులను తొలగించడం, విజిల్‌బ్లోయర్ దావాలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తులు వంటి అనేక వివాదాలు విశాల్ గార్గ్ హయాంలో కంపెనీని చుట్టుముట్టాయి.కోలుకుంటున్న తరుణంలోనే షాక్..అయితే, ఇన్ని వివాదాల తర్వాత తాము ఇప్పుడు కంపెనీని గాడిన పెట్టామని విశాల్ గార్గ్ స్పష్టం చేశారు. ఏఐని జోడించి లోన్ ప్రాసెసింగ్ ప్రక్రియను వేగవంతం చేశామని, దీనివల్ల ఉత్పాదకత రెట్టింపు అయిందని తెలిపారు. ఇంట్యూట్, కాయిన్‌బేస్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, లోన్ వాల్యూమ్ మూడు రెట్లు పెరిగి లాభాల బాట పట్టే దశకు చేరుకున్నామని ఆయన వివరించారు. కానీ, జూలై 27న బోర్డులో చేరిన డేనియల్ లూయిస్ కేవలం వారం రోజుల వ్యవధిలోనే తనను సీఈఓ పదవి నుంచి తొలగించారు. లూయిస్ మొదటి నుంచే సీఈఓ పదవిపై కన్నేసి ఈ వ్యూహం పన్నారని గార్గ్ ఆరోపించారు.తిరిగి పోరాటం..ప్రస్తుతం తన ఉద్యోగాన్ని దక్కించుకోవడానికి విశాల్ గార్గ్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రముఖ లాయర్ అలెక్స్ స్పిరోను ఆశ్రయించిన ఆయన.. బోర్డు తనను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. కంపెనీ లాభాల్లోకి వచ్చే వరకు తాను కేవలం సంవత్సరానికి 1 డాలర్ జీతంతో పనిచేయడానికి కూడా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందని విశాల్ గార్గ్ ధీమా వ్యక్తం చేశారు. -
భారత్ 6G దిశగా చారిత్రాత్మక విజయం
భారత సాంకేతిక రంగానికి సరికొత్త వెలుగులు నింపుతూ ‘భారత్ 6G’ కల సాకారమయ్యే దిశగా ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ‘భారత్ 6G టెరాహెర్ట్జ్ టెస్ట్‌బెడ్’పై పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్వహించిన పరీక్షల్లో రికార్డు స్థాయిలో 6.39 Gbps డేటా ట్రాన్స్మిషన్ వేగాన్ని విజయవంతంగా నమోదు చేశారు. భవిష్యత్తు వైర్లెస్ సాంకేతికతలో భారత్‌ను ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈ ప్రయోగం నాంది పలికింది.6.39 Gbps డేటా వేగంతో కొత్త అధ్యాయంటెరాహెర్ట్జ్ (THz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను ఉపయోగించి జరిపిన ఈ పరీక్షల్లో అనుకున్న లక్ష్యాల కంటే అత్యధిక వేగంతో డేటా ప్రసారమైంది. 5G సాంకేతికత కంటే ఇది అనేక రెట్లు వేగవంతమైనది. ఈ విజయం కేవలం వేగానికి మాత్రమే పరిమితం కాకుండా ఆల్ట్రా-లో-లెటెన్సీ, అధిక బ్యాండ్‌విడ్త్ సేవలను అందించడంలో కీలకపాత్ర పోషించనుంది.స్వదేశీ పరిజ్ఞానంకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ 6G మిషన్’లో భాగంగా ఐఐటీ మద్రాస్ ఈ టెస్ట్‌బెడ్‌ను అభివృద్ధి చేసింది. విదేశీ సాంకేతికతపై ఆధారపడడాన్ని తగ్గిస్తూ పూర్తిగా మన శాస్త్రవేత్తలు రూపుదిద్దిన పరికరాలు, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్‌లతో ఈ ఘనత సాధించడం విశేషం.భవిష్యత్తుపై దీని ప్రభావంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ, స్మార్ట్ సిటీ కమ్యూనికేషన్లకు ఈ టెరాహెర్ట్జ్ వేగం ప్రధాన బలంగా మారనుంది. రికార్డు వేగంతో డేటా బదిలీ కావడం వల్ల రిమోట్ సర్జరీలు, డిజైన్ ల్యాబ్‌లు, స్వయంప్రతిపత్తి కలిగిన వాహనాల వినియోగం మరింత సులభతరం అవుతుంది. భారత్ 2030 నాటికి పూర్తిస్థాయి 6G సేవలను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఐఐటీ మద్రాస్ సాధించిన ఈ విజయం ఆ దిశగా పడిన అతిపెద్ద మైలురాయిగా నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే.. -
టీవీ ఛానళ్లకు ప్రకటనల పరిమితి రద్దు
బుల్లితెరపై వాణిజ్య ప్రకటనల నిడివిపై దశాబ్దాలుగా అమలులో ఉన్న పరిమితికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్వస్తి చెప్పింది. టెలివిజన్ ఛానళ్లలో గంటకు గరిష్టంగా 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలనే నిబంధనను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడం, మార్కెట్లో సమాన పోటీతత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సవరణను చేపట్టినట్లు వెల్లడించింది.కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్, 1994 ప్రకారం 2006లో ఈ 12 నిమిషాల నిబంధనను అమల్లోకి తెచ్చారు. అప్పట్లో దేశంలో కేవలం 62 ఛానళ్లు మాత్రమే ఉండగా డిజిటలీకరణ పెరిగిన తర్వాత ప్రస్తుతం వాటి సంఖ్య 900 దాటింది. అంతేకాకుండా యూట్యూబ్, ఓటీటీ వంటి డిజిటల్ మీడియా వేదికలపై ఎలాంటి ప్రకటనల పరిమితి లేకపోవడం వల్ల సాంప్రదాయ టీవీ ఛానళ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం గుర్తించింది. 'పే' లేదా 'ఫ్రీ-టు-ఎయిర్' ఛానళ్లైనా ప్రకటనల ఆదాయంపైనే ప్రధానంగా ఆధారపడుతుండటంతో డిజిటల్ మీడియాతో సమానంగా పోటీపడే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.డిజిటల్ కేబుల్, డీటీహెచ్, ఐపీటీవీ వంటి నూతన సాంకేతికతల వల్ల ప్రేక్షకులకు అనేక ఎంపికలు అందుబాటులోకి వచ్చాయని, మార్కెట్ స్వయం ప్రతిపత్తి సాధించిందని కేంద్రం స్పష్టం చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్ సవరణల అధికారిక గెజెట్ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో టీవీ నెట్‌వర్క్‌ల ఆదాయ మార్గాలు మెరుగుపడనున్నాయని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే.. -
పల్లెటూరి యువకుడి నుంచి నాసాతో ఒప్పందం వరకు..
మిగిలినవారి కంటే భిన్నంగా ఆలోచించేవారు ఏకాగ్రతతో శ్రమిస్తే అద్బుతాలు సాధించవచ్చు.. ఎక్కడో మారుమూల.. కరెంటు కోతలే తప్ప ఇంటర్నెట్ మొహమెరుగని పల్లెటూరులో పుట్టినవాడు స్టార్టప్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టడమే కాదు.. ప్రపంచ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా అల్దూర్ గ్రామానికి చెందిన అవైస్ అహ్మద్ (28) చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగాడు. తనతోటి స్నేహితులు సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్‌లను తెగచూస్తుంటే, అహ్మద్ మాత్రం తన తండ్రి తెచ్చిన సైన్స్ పుస్తకాలను తిరగేశాడు. బిట్స్ పిలానీలో చదివే అవకాశం పొందాడు.బిట్స్ పిలానీలో చదువుతున్న రోజుల్లో అహ్మద్ కొన్ని ఉపగ్రహ ప్రాజెక్టులలో పాల్గొన్నాడు. పంటల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన ఖచ్చితమైన ఉపగ్రహ డేటా అందుబాటులో లేదన్న విషయాన్ని అహ్మద్ గ్రహించాడు. తన స్నేహితుడు క్షితిజ్ ఖండేల్వాల్తో కలిసి 2019లో ‘పిక్సల్’ పేరిట స్పేస్ టెక్ స్టార్టప్‌ను ప్రారంభించాడు.అనతికాలంలోనే ఈ స్టార్టప్ పంటల ఆరోగ్యం, కాలుష్యం, మీథేన్ లీకులు, పర్యావరణ మార్పులను అత్యంత సూక్ష్మంగా గుర్తించడం వంటి కోణాల్లో అభివృద్ధి చేసిన హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాలు నాసా దృష్టిని ఆకర్షించాయి. ఈ సాంకేతికతను గుర్తించిన నాసా జియోలాజికల్ రీసెర్చ్ కోసం పిక్సల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అలా నాసాతో అధికారికంగా పని చేసిన తొలి భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌గా పిక్సల్ సంస్థ నిలిచింది. -
కేవలం ఒక్క రూపాయి.. 24 రోజుల వ్యాలిడిటీ!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫ్రీడమ్ 2.0 పథకం కింద 2026 స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో భాగంగా.. వినియోగదారులు కేవలం రూ.1కే కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు.ఈ ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త వినియోగదారులు రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా పొందుతారు. వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. కొత్త సిమ్ కనెక్షన్ కోసం అధిక మొత్తం చెల్లించకుండా బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రయత్నించాలనుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది.This Independence Day, why not start something better?Your first step towards a better connection is here.#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #IndependenceOffer #FRC1 @CMDBSNL @robertravi21 pic.twitter.com/HObE4inHxD— BSNL India (@BSNLCorporate) August 12, 2026రూ.2,399 ప్లాన్!బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
‘జీరో’ నుంచి రూ .1.4 కోట్ల జీతానికి.. టెకీ సక్సెస్ స్టోరీ వైరల్
కెరీర్ ప్రారంభంలో జీతం లేకుండా పనిచేసిన ఓ టెక్ ప్రొఫెషనల్.. 14 ఏళ్లకు పైగా అనుభవంతో ప్రస్తుతం ఏడాదికి దాదాపు రూ.1.4 కోట్ల సమానమైన వేతనం అందుకుంటున్నానని వెల్లడించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 35 ఏళ్ల క్లౌడ్, డెవ్ఆప్స్ ప్రొఫెషనల్ తన జీతం ఎలా దశలవారీగా పెరిగిందో సోషల్ ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పంచుకున్నారు.రెడిట్‌లోని r/IndianWorkplaceలో ‘DevOpsHumbleFool’ పేరుతో ఉన్న యూజర్ తన కెరీర్ ప్రయాణాన్ని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ‘సగటు కంటే తక్కువ’ కాలేజీ నుంచి చదువు పూర్తి చేశానని, తన కెరీర్‌ను ఢిల్లీలో జీతం లేని ఉద్యోగంతో ప్రారంభించానని చెప్పారు. ఆ పని ఏడాదిలోపే ముగిసిందని, అనంతరం బెంగళూరులో రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరి రెండేళ్లు పనిచేసినట్లు రాసుకొచ్చారు.ఆ తర్వాత మరో సంస్థలో రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వేతనం పెరిగింది. అక్కడ దాదాపు 4.7 సంవత్సరాలు పనిచేశారు. తదుపరి బెంగళూరు సంస్థలో రూ.17 లక్షల ప్యాకేజీతో చేరి, ఐదేళ్లలో దాన్ని రూ.35 లక్షలకు పెంచుకున్నారు. ఈ దశలో మరో సంస్థ నుంచి రూ.70 లక్షల ఆఫర్ వచ్చినప్పటికీ, తాను ఆ ఉద్యోగంలో చేరలేదని చెప్పారు. అయితే ఆ ఆఫర్ తన మార్కెట్ విలువను అర్థం చేసుకునేలా చేసిందని పేర్కొన్నారు.రూ.35 లక్షల నుంచి విదేశీ క్లయింట్ల వరకు..కెరీర్లో కీలక మలుపు విదేశీ క్లయింట్లతో పనిచేయడం ద్వారా వచ్చిందని ఆయన వివరించారు. ‘క్లయింట్ A’తో సుమారు రెండేళ్లు పనిచేసిన సమయంలో ఏడాదికి రూ.1.15 కోట్ల సమానమైన ఆదాయం వచ్చినట్లు, ప్రస్తుతం ‘క్లయింట్ B’తో ఏడాదికి రూ.1.40 కోట్ల స్థాయిలో సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాలు అమెరికా డాలర్లలో అందుతున్నాయని, తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని ఆయన కామెంట్లలో స్పష్టం చేశారు. క్లయింట్ A రిమోట్ రోల్ కాగా, క్లయింట్ B పాత్ర ఆన్సైట్ అని తెలిపారు.సైడ్ గిగ్స్‌తో అదనపు ఆదాయంప్రధాన ఉద్యోగంతో పాటు కెరీర్లో సైడ్ గిగ్స్ కూడా చేశానని ఆయన వెల్లడించారు. అలా తనకు నెలకు సుమారు రూ.15,000 నుంచి రూ.65,000 వరకు అదనపు ఆదాయం వచ్చేదని చెప్పారు. యూట్యూబ్, పెయిడ్ ఇంటర్వ్యూలు, చిన్న ప్రాజెక్టులు, టెక్నికల్ కన్సల్టేషన్స్, ఫోన్ ద్వారా టెక్నికల్ సహాయం వంటి పనులు చేసేవాడినని వివరించారు. తన యూట్యూబ్ కంటెంట్ కారణంగా లింక్డ్ఇన్లో గుర్తింపు పెరిగి, అక్కడి నుంచే చాలా సైడ్ గిగ్ అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ఉద్యోగం, వీసా నిబంధనల నేపథ్యంలో సైడ్ గిగ్స్ పూర్తిగా నిలిపివేశానని చెప్పారు.డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యంతన విద్యా నేపథ్యం గొప్పది కాకపోయినా, DevOps, Cloud టెక్నాలజీలపై విస్తృత నైపుణ్యాలు తన కెరీర్ ఎదుగుదలకు ప్రధాన కారణమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. జావా డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించి, బిల్డ్ & రిలీజ్ ఇంజినీరింగ్ నుంచి డెవాప్స్, ఆ తర్వాత క్లౌడ్ విభాగంలోకి మారినట్లు వివరించారు. ప్రస్తుతం తన పనిలో కోడింగ్ భాగం సుమారు 10 శాతం మాత్రమేనని చెప్పారు. AI తన పనిని ఇప్పటివరకు దెబ్బతీయలేదని, అయితే తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి AI సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నానని తెలిపారు.30ల్లోనూ విదేశీ అవకాశాలు సాధ్యమేనంటూ..తాను 30లలోనే అమెరికాకు వెళ్లానని, 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉండటం వల్ల విదేశీ అవకాశాలు మరింత అందుబాటులోకి వచ్చాయని ఆయన చెప్పారు. తొలుత రిమోట్ అవకాశాన్ని పొందిన తర్వాత వర్క్ వీసా ద్వారా అమెరికాకు వెళ్లినట్లు, ప్రస్తుతం H-1Bపై ఉన్నట్లు కామెంట్లలో వెల్లడించారు. తనకు తెలిసిన ఓ సీనియర్ 42 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారని కూడా పేర్కొన్నారు.అయితే అధిక జీతంతో పాటు విదేశీ ఉద్యోగ జీవితంలోని సవాళ్లను కూడా ఆయన ప్రస్తావించారు. కుటుంబానికి దూరంగా ఉండటం, ఒంటరితనం, వీసాపై ఆధారపడటం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వంటి అంశాలు అమెరికాలోని జీవితంలో ప్రతికూలతలుగా పేర్కొన్నారు.ఈ పోస్టుపై వందలాది మంది స్పందించారు. ముఖ్యంగా తక్కువ జీతాలతో కెరీర్ ప్రారంభిస్తున్న యువత తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు డెవాప్స్, క్లౌడ్ వంటి నైపుణ్యాల్లోకి ఎలా మారాలి, సైడ్ గిగ్స్ ఎలా సంపాదించాలి, AI వల్ల టెక్ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది వంటి ప్రశ్నలు అడిగారు. టెకీ మాత్రం నైపుణ్యంతో పాటు ఆన్లైన్ ప్రొఫెషనల్ ప్రెజెన్స్‌ను పెంచుకోవడం తన కెరీర్లో కీలకంగా పనిచేసిందని సూచించారు. -
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో ఉద్యోగాల కోసం ఎంపికైన 200 మందికి పైగా విద్యార్థులు, యువ ఇంజనీర్ల ఆన్‌బోర్డింగ్ ఆలస్యంపై వివాదం ముదిరింది. ‘ఎలైట్ హైరింగ్ 2025’ కార్యక్రమం కింద ఎంపికైన అభ్యర్థులను నెలల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారంటూ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఆగస్టు 13న కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసిన నైట్స్.. ఈ వ్యవహారంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరింది.ఆఫర్ లెటర్ ఇచ్చినా.. జాయినింగ్ డేట్ లేదునైట్స్ వివరాల ప్రకారం.. బాధిత అభ్యర్థులు ఫిబ్రవరి 2025లో విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొని టెక్నికల్, వాయిస్ అసెస్మెంట్లను పూర్తి చేశారు. ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం 2025 జూలైలో ఆఫర్ లెటర్లు, ఆగస్టులో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOI) అందుకున్నారు. నిర్ణీత గడువులోనే వాటిని అంగీకరించారు. అయితే ఆ తర్వాత వారి నియామక ప్రక్రియ ముందుకు సాగలేదని సంఘం ఆరోపించింది.డిసెంబర్ 2025లో అభ్యర్థులు మరోసారి విప్రో నిర్వహించిన సర్వే ద్వారా కంపెనీలో చేరేందుకు తమ ఆసక్తిని ధ్రువీకరించారు. అనంతరం మార్చి 2026లో కోడిలిటీ టెక్నికల్ అసెస్మెంట్ నిర్వహించగా, అందులోనూ ఉత్తీర్ణులయ్యారు. మార్చి 24న క్లియరెన్స్ సమాచారం అందిందని నైట్స్ పేర్కొంది. మార్చి 25న బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లింక్ అందగా, మార్చి 26న అభ్యర్థులు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చిరునామా ధ్రువీకరణకు సంబంధించిన ప్రశ్నను కూడా అదే రోజు పరిష్కరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విప్రో పోర్టల్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ 100 శాతం పూర్తయి, ‘No Action Required’గా కనిపించిందని సంఘం తెలిపింది.అన్ని నియామక దశలను పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు నిర్దిష్ట జాయినింగ్ తేదీ ఇవ్వలేదని నైట్స్ ఆరోపించింది. బాధితులు విప్రో హెచ్ఆర్, ఆన్‌బోర్డింగ్ హెల్ప్‌డెస్క్‌లతో పాటు ఇతర అధికారిక మార్గాల ద్వారా పలుమార్లు సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాలేదని పేర్కొంది. విద్యాసంస్థలు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారులు కూడా విప్రో క్యాంపస్ సంబంధిత సిబ్బందిని సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది.ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు ఇతర అవకాశాలను వదులుకున్నారని, దీంతో విద్యా ఖర్చులు, వసతి, రోజువారీ అవసరాలు, కుటుంబ బాధ్యతల విషయంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నైట్స్ పేర్కొంది. దీర్ఘకాలంగా స్పష్టత లేకపోవడం అభ్యర్థుల్లో మానసిక ఆందోళనకు కూడా కారణమవుతోందని తెలిపింది.కార్మిక శాఖను ఏం కోరిందంటే..విప్రోతో ఈ అంశాన్ని చర్చించి బాధిత అభ్యర్థులందరి ప్రస్తుత స్థితిని స్పష్టం చేయాలని నైట్స్ కార్మిక శాఖను కోరింది. ఆఫర్ లెటర్లు, LOIలు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయా? ఆలస్యానికి అసలు కారణం ఏమిటి? ఆన్‌బోర్డింగ్ ఎప్పటిలోగా పూర్తవుతుంది? అనే అంశాలపై కంపెనీ నుంచి స్పష్టమైన సమాధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. ఇక కొందరి అభ్యర్థిత్వాలను ముందుకు తీసుకెళ్లకూడదని కంపెనీ నిర్ణయిస్తే, వారిని నిరవధికంగా ఎదురుచూడనివ్వకుండా నిర్ణయం, కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కూడా కోరింది.విప్రో స్పందన ఇదీ..మరోవైపు, ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని విప్రో స్పష్టం చేసింది. కంపెనీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామక ప్రక్రియ కొనసాగుతుందని, తదుపరి అప్డేట్లను అభ్యర్థులకు తెలియజేస్తామని తెలిపింది. అయితే, ఈ వివాదంపై విప్రో నుంచి వచ్చిన ఈ స్పందనలో నిర్దిష్ట జాయినింగ్ తేదీ లేదా 200 మందికి పైగా అభ్యర్థుల కోసం టైమ్‌లైన్ వెల్లడించలేదు. -
10 ఏళ్లకు స్టైల్ మార్చిన ఇన్‌స్టా, నెటిజన్ల స్పందన వైరల్
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ (Instagram) తన స్టైల్ మార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తన వర్డ్‌మార్క్ లోగో (అక్షరాల శైలి)ను రీఫ్రెష్ చేసింది. ఈ విషయాన్ని మెటా ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్‌గా మారాయి. గత 10 ఏళ్లుగా యాప్ పైన ఉండే వర్డ్‌మార్క్ మారలేదు. అందుకే ఈ మార్పు చేశాం. ఇది మరింత క్లీన్‌గా, మోడరన్‌గా ఉంటూనే ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ శైలిని ప్రతిబింబిస్తుంది అంటూ ఆదమ్ మోస్సేరి ఈ మార్పుపై వివరణ ఇచ్చారు. View this post on Instagram A post shared by Adam Mosseri (@mosseri) ఇన్స్టాగ్రామ్ పేరులోని అక్షరాల రూపాన్ని (Typography) పునఃరూపకల్పన చేశారు. పాత స్క్రిప్ట్ శైలినే కొనసాగిస్తూనే, అక్షరాలను మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే అందరికీ సుపరిచితమైన రంగుల గ్రాడియంట్ కెమెరా ఐకాన్ (Camera Icon)లో ఎలాంటి మార్పు లేదు. 2016లో క్లాసిక్ బ్రౌన్ కెమెరా స్థానంలో ఈ గ్రాడియంట్ ఐకాన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనఈ కొత్త డిజైన్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ అసలుగుర్తింపు దెబ్బతినకుండా చక్కగా మోడరనైజ్ చేశారని కొందరు యూజర్లు మెచ్చు కుంటున్నారు. మరికొందరు ఈ డిజైన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. వర్డ్మార్క్లోని 'r' అక్షరం చూడటానికి 'z' లాగా కనిపిస్తోందని, ఇన్స్టాగ్రామ్ కాస్త "Instagzam" లా మారింది అంటూ మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
ఫోన్ వల్లే ఇదంతా... మీ పిల్లలు జాగ్రత్త!
‘అవసరానికి మించి మొబైల్ వాడకండి. పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు, వాళ్లు మాట వినకుండా మారాం చేసేటప్పుడు ఫోన్ మాత్రం వాళ్లకు ఇవ్వకండి... అనుభవంతో చెబుతున్నా.. మొబైల్ వల్ల నరకం చూశా.’ అని ప్రముఖ నటి షకీల సోషల్ మీడియాలో తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. కొన్ని వందల సినిమాల్లో నటించిన షకీల సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు.. అయితే గంటల తరబడి ఫోన్ చూడడం, ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించేముందు ఫోన్ పక్కకు ఉంచి దానినే చూస్తూ పడుకోవడం వల్ల ఆమె ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఇటీవలే ఆమె మెడకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకుని డిచార్జ్ అయ్యారు. ఈ ఆపరేషన్‌కు లక్షల ఖర్చయిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆమె నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం, యూట్యూబ్ కంటెంట్‌తో కాలక్షేపం చేయడం, అవసరం లేకున్నా ఏదో ఒకటి సర్ఫ్ చేస్తూ ఉండడం వల్లే ఈ వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. మొబైల్ వాడకం అవసరమే.. కాని అవసరానికి మించి వాడడం వల్లే తనకీ దుస్థితి వచ్చిందని షకీల పేర్కొన్నారు. విపరీతమైన మెడనొప్పి వల్ల తీవ్రమైన బాధను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని, మొబైల్‌కి వారిని దూరంగా ఉంచండంటూ షకీలసోషల్ మీడియాలో పిల్లల తల్లిదండ్రులను కోరారు. -
కోత లేకుండానే.. కేవలం 10 నిమిషాల్లో మెదడులో చిప్ అమరిక!
బీజింగ్: టెక్నాలజీ రంగంలో చైనా మరో సంచలనానికి తెరతీసింది. ఎలన్ మస్క్‌కు చెందిన 'న్యూరాలింక్' వంటి సంస్థలు పుర్రెను తెరిచి మెదడులో చిప్‌లను అమర్చే సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, అత్యంత సులభమైన, తక్కువ రిస్క్ ఉన్న సరికొత్త బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి.షాంఘైకి చెందిన ‘స్టైర్మెడ్ టెక్నాలజీ’ అనే స్టార్టప్ సంస్థ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులతో కలిసి పుర్రెను తెరవకుండానే మెదడులో చిప్‌ను అమర్చే సరికొత్త విధానంపై పరిశోధనలు చేస్తోంది.ఈ పద్ధతిలో మెదడుపై నేరుగా సర్జరీ చేయడం లాంటి పెద్ద ప్రమాదాలకు తావు ఉండదు. వైద్యులు మెడలోని రక్తనాళం ద్వారా ఈ చిన్న పరికరాన్ని లోపలికి పంపి, రక్తనాళాల వ్యవస్థ గుండా దానిని నేరుగా మెదడులోని నిర్దేశిత ప్రాంతానికి చేరుస్తారు. ఆ తర్వాత ఆ డివైస్‌ను రక్తనాళం గోడ వెలుపల సురక్షితంగా ఉంచుతారు.బీజింగ్ క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన జ్సువాన్వు హాస్పిటల్ వైద్యుడు దువాన్ వాన్ రు మాట్లాడుతూ.. తగిన అనుభవమున్న సర్జన్ ఈ పరికరాన్ని కేవలం 10 నిమిషాల్లోనే సరైన స్థానంలో అమర్చగలరని తెలిపారు.ఈ సరికొత్త విధానాన్ని ఇప్పటివరకు గొర్రెలపై విజయవంతంగా పరీక్షించారు. త్వరలోనే మానవులపై కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తితే నెల రోజుల్లోపు ఆ ఇంప్లాంట్‌ను సులభంగా వెనక్కి తీసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.పక్షవాతం, వెన్నుముక గాయాలు లేదా ఇతర తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ తమ అవయవాలను కదిలించలేని వారికి ఈ టెక్నాలజీ ఒక వరంలా మారనుంది. మెదడు ఇచ్చే సంకేతాలను ఈ చిప్ ద్వారా కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరవేయడం ద్వారా వారు తమ ఆలోచనల ద్వారానే డివైయర్లను కంట్రోల్ చేయవచ్చు.అలీబాబా, టెన్సెంట్ వంటి దిగ్గజ కంపెనీల పెట్టుబడులతో ముందుకు వెళ్తున్న ఈ టెక్నాలజీ, రాబోయే రోజుల్లో న్యూరో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. -
ఒక్కసారే రీచార్జ్.. 412 రోజులు నో టెన్షన్!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 2399 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.This Independence Day, give yourself the freedom from frequent recharges.Get 412 days of BSNL connectivity with one recharge, including 47 extra days beyond a year.Recharge smart via #BReX 👉 https://t.co/SpaVXw85OI#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife… pic.twitter.com/qGtt7WkKxS— BSNL India (@BSNLCorporate) August 13, 2026 -
ఆకాశమే డేటా సెంటర్.. లక్షల ఉపగ్రహాలతో భయానక భవిష్యత్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్బాట్ల నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల వరకు.. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. అయితే ఈ సాంకేతిక విప్లవానికి వెన్నెముకగా ఉన్న డేటా సెంటర్లపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. భారీ విద్యుత్ వినియోగం, నీటి అవసరం, భూమి కొరత వంటి సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు టెక్ దిగ్గజాలు ఓ సంచలన ఆలోచనతో ముందుకొస్తున్నాయి. అదే.. అంతరిక్షంలో డేటా సెంటర్లు!భూమి మీద కాకుండా.. ఆకాశంలోనే కంప్యూటర్లు, ఏఐ సర్వర్లు, సౌరశక్తి వ్యవస్థలతో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రపంచ టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రణాళికలు సాకారమైతే మనం చూస్తున్న రాత్రి ఆకాశమే మారిపోతుందట!. డేటా అవసరాలు రాబోయే రోజుల్లో మరింత పెరగనున్న నేపథ్యంలో.. భూమిపై ఉన్న మౌలిక వసతులకు ప్రత్యామ్నాయాల కోసం కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అంతరిక్షాన్ని డిజిటల్ మౌలిక వేదికగా మార్చే ఆలోచన తెరపైకి వచ్చింది. అయితే సాంకేతికంగా ఇది ఎంతటి అవకాశాలను అందిస్తుందో.. పర్యావరణం, అంతరిక్ష భద్రత పరంగా అంతే స్థాయిలో సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది.ఆకాశంలో కంప్యూటర్ల సామ్రాజ్యం?ప్రస్తుతం ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి భారీ డేటా సెంటర్లు అవసరమవుతున్నాయి. వీటికి వేల మెగావాట్ల విద్యుత్, విపరీతమైన శీతలీకరణ వ్యవస్థలు కావాలి. డేటా సెంటర్లలో ఉత్పత్తయ్యే వేడిని తగ్గించేందుకు భారీ స్థాయిలో నీరు కూడా వినియోగించాల్సి వస్తోంది.ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగా.. అంతరిక్షంలో సౌరశక్తి ఆధారంగా పనిచేసే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. అంతరిక్షంలో సూర్యకాంతి నిరంతరంగా అందుబాటులో ఉండే కక్ష్యల్లో సౌర ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి కంప్యూటింగ్ వ్యవస్థలను నడపవచ్చన్నది కంపెనీల ఆలోచన.భూమిపై విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గడం, భారీ భూమి అవసరం లేకపోవడం, అంతరిక్షంలోనే సేకరించే డేటాను అక్కడికక్కడే ప్రాసెస్ చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయని టెక్ సంస్థలు భావిస్తున్నాయి.లక్షల ఉపగ్రహాల ప్రణాళికలుఈ ఆలోచనలో భాగంగా కొన్ని అంతరిక్ష సంస్థలు భారీ సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే ప్రణాళికలపై పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ కంప్యూటింగ్ కోసం లక్షల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలను ఉపయోగించే ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. ఈ ఉపగ్రహాల్లో కంప్యూటింగ్ చిప్‌లు, సౌర విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాలు ఉంటాయి. భవిష్యత్తులో ఇవన్నీ కలిసి భూమి చుట్టూ ఒక భారీ డిజిటల్ మౌలిక వసతిగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే అంశం శాస్త్రవేత్తల్లో ఆందోళనకు కారణమవుతోంది.రాత్రి ఆకాశం కనుమరుగవుతుందా?లక్షల సంఖ్యలో ఉపగ్రహాలు భూమి కక్ష్యలోకి చేరితే.. రాత్రి ఆకాశం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేలాది ఉపగ్రహాల కారణంగా టెలిస్కోపుల పరిశీలనలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపగ్రహాలపై పడే సూర్యకాంతి ప్రతిఫలించడం వల్ల అవి ఆకాశంలో ప్రకాశవంతమైన చుక్కల్లా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఉపగ్రహాల సంఖ్య లక్షలకు చేరితే.. నక్షత్రాలు, గ్రహాలు, దూరపు గెలాక్సీలను పరిశీలించడం మరింత కష్టమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భూమి చుట్టూ ‘శని వలయం’లా?లక్షలాది ఉపగ్రహాలు నిర్దిష్ట కక్ష్యల్లో సమూహంగా తిరిగితే.. భూమి చుట్టూ కృత్రిమ వలయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది శని గ్రహం చుట్టూ కనిపించే వలయాలను పోలిన దృశ్యాన్ని సృష్టించవచ్చని అంటున్నారు. చూడటానికి ఇది సాంకేతిక అద్భుతంగా కనిపించినా.. ఖగోళ పరిశోధనలకు మాత్రం పెద్ద సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.పర్యావరణానికి కొత్త ముప్పా?అంతరిక్ష డేటా సెంటర్లతో భూమిపై వనరుల వినియోగం తగ్గుతుందని కంపెనీలు చెబుతున్నప్పటికీ.. వాటిని నిర్మించి కక్ష్యలోకి పంపడం మరో సమస్యగా మారుతోంది. లక్షలాది ఉపగ్రహాల తయారీకి భారీ పరిశ్రమలు అవసరం. వాటిని అంతరిక్షంలోకి పంపేందుకు వేలాది రాకెట్ ప్రయోగాలు జరగాల్సి ఉంటుంది. రాకెట్ల నుంచి వెలువడే ఉద్గారాలు వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అంతేకాదు.. సేవా కాలం ముగిసిన ఉపగ్రహాలు తిరిగి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు విడుదలయ్యే పదార్థాలు ఓజోన్ పొరపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది కూడా పరిశోధనలో ఉన్న అంశమే.స్పేస్ జంక్.. మరో పెను ప్రమాదంఇప్పటికే భూమి చుట్టూ అంతరిక్ష వ్యర్థాలు పెరుగుతున్నాయి. పనిచేయని ఉపగ్రహాలు, వాటి శకలాలు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. లక్షల సంఖ్యలో కొత్త ఉపగ్రహాలు చేరితే.. ఒకదానితో మరొకటి ఢీకొనే అవకాశాలు పెరుగుతాయి. భారీగా శకలాలు ఏర్పడి మరిన్ని ఉపగ్రహాలను దెబ్బతీసే పరిస్థితిని శాస్త్రవేత్తలు ‘కెస్లర్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు.అంతరిక్షంలో చల్లబరచడం అంత ఈజీ కాదు!భూమిపై డేటా సెంటర్లలో గాలి, నీటి ఆధారిత శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తారు. కానీ అంతరిక్షంలో వాతావరణం ఉండదు. అక్కడ వేడిని తొలగించడం రేడియేషన్ ద్వారా మాత్రమే సాధ్యం. అందువల్ల అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం అనుకున్నంత సులభం కాదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఒక సర్వర్ పాడైతే దాన్ని మార్చడం కూడా అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.ఆలోచనలో అవకాశాలు కూడా ఉన్నాయిఅయితే అంతరిక్ష డేటా సెంటర్లు పూర్తిగా అసాధ్యమైన ఆలోచన కాదని నిపుణులు చెబుతున్నారు. సౌరశక్తి వినియోగం, అంతరిక్షంలోనే డేటా ప్రాసెసింగ్, భూమిపై వనరుల ఒత్తిడి తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ లక్షలాది ఉపగ్రహాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసే ముందు పర్యావరణం, ఖగోళ పరిశోధనలు, అంతరిక్ష భద్రతపై పూర్తి స్థాయి అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.ఏఐ అవసరాలు పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో డేటా నిల్వ, కంప్యూటింగ్ కోసం అంతరిక్షం కొత్త వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ భూమిపై ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం అంతరిక్షాన్ని ఉపయోగించే ప్రయత్నం.. కొత్త సమస్యలకు దారి తీస్తుందా అనే ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ఏఐ కోసం ఆకాశాన్ని డేటా సెంటర్‌గా మార్చే ముందు.. ఆకాశాన్ని కోల్పోయే ప్రమాదాన్ని కూడా ప్రపంచం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని శాస్త్రవేత్తల హెచ్చరిక. -
రీచార్జ్ షాక్.. నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు
ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు భారతి ఎయిర్టెల్ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరల వద్ద ఉన్న నాలుగు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను కంపెనీ తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయా ప్లాన్లను వినియోగిస్తున్న కస్టమర్లు ఇకపై అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్యాక్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా రూ.299 ప్లాన్ తొలగింపు వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందించే ఈ ప్లాన్‌కు బదులుగా ఇప్పుడు రూ.349 ప్యాక్ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారింది. ఇందులో రోజుకు 2 జీబీ డేటాతో పాటు ఇతర సాధారణ ప్రయోజనాలు లభిస్తాయి. అంటే గతంలో రూ.299 చెల్లించిన వినియోగదారుడు ఇప్పుడు అదే తరహా నెలవారీ రీచార్జ్ కోసం కనీసం రూ.50 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సుమారు 16.7 శాతం పెరుగుదలకు సమానం.మధ్యస్థ ధరల విభాగంలోనూ ఎయిర్టెల్ కొన్ని ఎంపికలను తగ్గించింది. రూ.579, రూ.619, రూ.649 ప్యాక్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆయా ధరల వద్ద రీచార్జ్ చేసుకునే అవకాశం కస్టమర్లకు తగ్గింది. తాజా నివేదికల ప్రకారం, కొన్ని సర్కిళ్లలో మరికొన్ని ప్లాన్లలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రతి వినియోగదారుడి ఎయిర్టెల్ నంబర్, సర్కిల్‌ను బట్టి ప్రస్తుతం కనిపించే ప్లాన్లు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది.ఈ పరిణామాన్ని సాధారణ టారిఫ్ పెంపుగా కాకుండా, ఎంపిక చేసిన ధరల విభాగాల్లో ప్లాన్లను పునర్వ్యవస్థీకరించే చర్యగా చూడవచ్చు. చౌకైన ప్యాక్‌లను తొలగించి తదుపరి ధరల ప్లాన్ల వైపు కస్టమర్లను మళ్లించడం ద్వారా ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడం కంపెనీ వ్యూహంలో భాగమై ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
3,718 యాప్‌లు బ్లాక్.. రూ.11,158 కోట్లు సేవ్!
సైబర్ నేరాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గడిచిన జూన్ 30 నాటికి చట్టవిరుద్ధమైన, మోసపూరిత రుణ యాప్‌లతో సహా 3,718 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలిపింది. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS) ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.రూ.11,158 కోట్ల నష్టం నివారణ2021లో ప్రారంభమైన సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ ద్వారా ఇప్పటివరకు 32.80 లక్షలకు పైగా సైబర్ మోసం ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా తీసుకున్న చర్యలతో రూ.11,158 కోట్లకు పైగా మోసపూరిత నష్టాన్ని నివారించగలిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.సిమ్ కార్డులు, ఐఎంఈఐ నంబర్లపై చర్యలుఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69-ఎ, 79(3)(బి) కింద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) చర్యలు చేపట్టింది. పోలీసు అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం తెలిపింది.సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్లు, కాలర్ ట్యూన్లు, సోషల్ మీడియా, టెలివిజన్, రేడియోతో పాటు పాఠశాలలు, సినిమాలు, సెలబ్రిటీ ఎండార్స్మెంట్లు, ఐపీఎల్ ప్రచార కార్యక్రమాలను కూడా ప్రభుత్వం వినియోగిస్తోంది.మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు ‘సస్పెక్ట్ రిజిస్ట్రీ’బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో I4C 2024 సెప్టెంబర్‌లో ‘సస్పెక్ట్ రిజిస్ట్రీ’ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి 30.48 లక్షలకు పైగా అనుమానిత ఐడెంటిఫైయర్లు, 32.08 లక్షలకు పైగా లేయర్-1 మ్యూల్ ఖాతాల వివరాలను సంబంధిత సంస్థలతో పంచుకున్నారు. ఈ వ్యవస్థ ద్వారా జూన్ 30, 2026 నాటికి రూ.25,698 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేయగలిగినట్లు ప్రభుత్వం తెలిపింది.ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త మాడ్యూళ్లుసైబర్ క్రైమ్ ఫిర్యాదులను ఏకరీతిగా నిర్వహించేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్-సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను జారీ చేసింది. మోసపూరితంగా తరలించిన నిధుల రికవరీకి తోడ్పడటంతో పాటు స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాలు, తాత్కాలిక లియన్ మార్క్‌లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్, గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ ఏప్రిల్ 2026లో ప్రారంభమయ్యాయి. -
ఐటీ ఉద్యోగులకు గట్టి షాక్
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ఐటీ ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి వేగంగా మళ్లుతున్న వేళ వ్యయ నియంత్రణే లక్ష్యంగా మరో విడత భారీ ఉద్యోగాల తొలగింపునకు ప్రణాళికలు రచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే (మే 31 నాటికి) కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతం మందికి (సుమారు 21,000 మంది) లేఆఫ్స్ ప్రకటించింది. దీనివల్ల ఒరాకిల్ ప్రపంచవ్యాప్త సిబ్బంది సంఖ్య 1,62,000 నుంచి 1,41,000కు పడిపోయింది. ఈ కోతలకు పునర్వ్యవస్థీకరణ ఖర్చుల కింద కంపెనీ ఏకంగా 1.8 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది.సెప్టెంబరు నాటికి మరో విడత సిద్ధం!తాజా నివేదికల ప్రకారం, కంపెనీ మేనేజర్లకు నోటీసులు అందిస్తూ బాధితుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1 నాటికల్లా కొన్ని విభాగాల్లో డబుల్ డిజిట్ (10 శాతానికి పైగా) స్థాయిలో ఉద్యోగులకు గుడ్‌బై చెప్పేందుకు ఒరాకిల్ ప్రణాళిక రూ పొందించినట్లు సమాచారం.ఏఐ రేసులో భారీ పెట్టుబడులుఈ భారీ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం కంపెనీ ఏఐ మౌలిక సదుపాయాల కోసం చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్సే. ఎన్విడియా ప్రాసెసర్లు, ఆధునిక డేటా సెంటర్ల నిర్మాణానికి ఒరాకిల్ బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల కోసం ఒరాకిల్ గతంలో 43 బిలియన్ డాలర్ల రుణాలు స్వీకరించింది. దాంతో కంపెనీ మొత్తం అప్పు 129.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా డేటా సెంటర్ లీజులు 260 బిలియన్ డాలర్లకు పెరిగాయి.ఏఐ వల్లే ఇదంతా..ఒరాకిల్ ఇటీవలే అమెరికన్ మార్కెట్ రెగ్యులేటర్ ఎస్ఈసీకి సమర్పించిన వార్షిక నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కంపెనీ అంతర్గత నిర్వహణలో కృత్రిమ మేధ సాంకేతికతల వాడకం విస్తరించడం వల్లే సిబ్బంది తగ్గించాల్సి వస్తోందని చెప్పింది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగవచ్చని అంగీకరించింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!


