రూ.1000లోపు రీఛార్జ్.. 164 రోజుల వ్యాలిడిటీ! | BSNL New Recharge Plan 164 Days Validity | Sakshi
Sakshi News home page

రూ.1000లోపు రీఛార్జ్.. 164 రోజుల వ్యాలిడిటీ!

Mar 22 2026 9:19 PM | Updated on Mar 22 2026 9:21 PM

BSNL New Recharge Plan 164 Days Validity

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన కొత్త ప్లాన్ ప్రకారం.. 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు.. అపరిమిత కాలింగ్స్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు పంపుకోవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఈ నెల చివరి వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement