ఏప్రిల్‌ నుంచి ఇక ఉద్యోగాల జాతరే.. | Indias Job Market to Surge 4 7pc Employment Growth Expected in H1 2026 27 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ నుంచి ఇక ఉద్యోగాల జాతరే..

Mar 26 2026 8:14 AM | Updated on Mar 26 2026 9:50 AM

Indias Job Market to Surge 4 7pc Employment Growth Expected in H1 2026 27

ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి అర్ధభాగంలో ఉపాధి ఊపందుకోనున్నట్లు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ప్రాజెక్ట్స్‌ నివేదిక పేర్కొంది. ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలంలో ఉద్యోగాలు 4.7 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఈకామర్స్, టెక్‌ స్టార్టప్స్, హెల్త్‌కేర్, ఫార్మా, తయారీ(మ్యాన్యుఫాక్చరింగ్‌) రంగాలు ఊతమివ్వనున్నట్లు ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్‌ పేరుతో విడుదల చేసిన నివేదికలో టీమ్‌లీజ్‌ తెలియజేసింది.

భారీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఉపాధి కల్పన కనిపించనున్నట్లు తెలియజేసింది. వీటిలో 74 సంస్థలు విస్తరణ చేపట్టే సంకేతాలిచ్చినట్లు పేర్కొంది. మధ్యస్థాయి సంస్థలు 57 శాతం, చిన్న బిజినెస్‌లు 38 శాతం విస్తరణ యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. వెరసి విస్తరణ ద్వారా ఉపాధి కల్పన విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇటు డిజిటల్, అటు కీలక ఆర్థికవ్యవస్థ సంబంధిత పరిశ్రమల నుంచి ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఎకానమీ వృద్ధికి కీలకంగా నిలిచే రంగాలలో విద్యుత్, స్టీల్, చమురు గ్యాస్, సిమెంట్, ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టులు తదితరాలున్నాయి.  

8.9 శాతం ఎన్‌ఈసీ 
అత్యధికంగా ఈకామర్స్, టెక్‌ స్టార్టప్‌లు 8.9 శాతం నికర ఎంప్లాయ్‌మెంట్‌ చేంజ్‌(ఎన్‌ఈసీ)కు కారణంకానున్నట్లు టీమ్‌లీజ్‌ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఫార్మాస్యూటికల్స్‌ 7 శాతం, తయారీ, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాలు 6.6 శాతం ఎన్‌ఈసీ సాధించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లో 4.7 శాతం ఎన్‌ఈసీ నమోదుకానున్నట్లు అభిప్రాయపడింది. నివేదికను 20 నగరాల నుంచి 23 రంగాలకు చెందిన 1,268 సంస్థల(ఎంప్లాయర్స్‌) అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా రూపొందించింది.

ఇందుకు 2025 నవంబర్‌ నుంచి 2026 జనవరి కాలంలో సర్వే చేపట్టింది. దేశీయంగా మానవవనరుల పరిస్థితులు సైక్లికల్‌ డిమాండ్‌ను అనుసరించడంకాకుండా వ్యవస్థాగత, విధానపరమైన అంశాల ఆధారంగా మా ర్పులకు లోనవుతున్నట్లు వివరించింది. కాగా.. శ్రామిక చట్టాల అమలు కారణంగా ఉద్యోగ వ్య యాలు 80% పెరగనున్నట్లు 64 సంస్థలు తెలియజేశాయని, వేతన వ్యవస్థను పునర్‌నిర్వచించడం ప్రభావం చూపనున్నట్లు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ బాలసుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement