యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌2 లాంచ్: ధర ఎంతంటే? | Apple AirPods Max 2 Launched | Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌2 లాంచ్: ధర ఎంతంటే?

Mar 21 2026 5:17 PM | Updated on Mar 21 2026 5:23 PM

Apple AirPods Max 2 Launched

డిసెంబర్ 2020లో యాపిల్ కంపెనీ ఒరిజినల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌ విడుదల చేసిన తరువాత.. ఇప్పుడు ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2ను పరిచయం చేసింది. ఈ కొత్త ప్రీమియం ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌ల ధర భారతదేశంలో రూ. 67,900గా ఉంది. ఈ కొత్త హెడ్‌ఫోన్‌లు యాపిల్‌ హెచ్‌2 చిప్‌తో పనిచేస్తాయి. ‘మునపటి తరంతో పోల్చితే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావంతమైన యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ఏఎన్‌సి)ను అందిస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది. విమానం, రైలు శబ్దాల వంటి బాహ్య శబ్దాలను ఈ అప్‌గ్రేడ్‌ సమర్థవంతంగా నిరోధిస్తుంది.

ఈ హెడ్‌ఫోన్‌ల కోసం ప్రీ-ఆర్డర్లు మార్చి 25న ప్రారంభమవుతాయి, కాగా డెలివరీలు ఏప్రిల్ ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ హెడ్‌ఫోన్‌లో అప్‌గ్రేడ్ మైక్రోఫోన్‌లు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి వాటిని అప్డేట్ చేసింది. కాబట్టి ఇది వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది.

యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్
భారతదేశంలో యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యువత, ప్రీమియం వినియోగదారుల మధ్య iPhone, MacBook, iPad వంటి పరికరాలు ప్రతిష్టాత్మక గుర్తుగా మారాయి. మెరుగైన కెమెరా నాణ్యత, సేఫ్టీ ఫీచర్స్, ఎకోసిస్టమ్ సమగ్రత వల్ల వినియోగదారులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా.. EMI ఆఫర్లు, ఆన్‌లైన్ విక్రయాలు.. భారతదేశంలో స్థానిక తయారీ పెరగడం వంటి అంశాలు కూడా యాపిల్ ఉత్పత్తుల చేరువను పెంచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement