Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Press meet May 22 Key Points Live Updates1
రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ..: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు/తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. చంద్రబాబు 12 నెలల పాలనలో జరిగిన అవినీతి, స్కాములు, దోపిడీ.. చేసిన అప్పులు తదితర అంశాలను ఆధారాలతో సహా వివరిస్తున్నారు.రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద నాణేనికి రెండో వైపులా.. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా!.బాబు 12 నెలల పాలనలో..ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, కాగ్‌ నివేదికను పరిశీలిస్తే.. అభివృద్ధి కనిపించలేదు. సంక్షేమం ఊసే లేదు. ఈ సంవత్సర కాలం అంతా మోసాలతో గడిపారు. ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. రాష్ట్ర ఆదాయమంతా బాబు గజదొంగల జేబుల్లోకి వెళ్తోంది. అదే మా హయాంలో.. కోవిడ్‌ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గోప్పగా నడిపాం. అభివృద్ధి, సంక్షేమం.. ప్రజలకు మంచి పరిపాలన అందించాం.అప్పుల సామ్రాట్‌ బాబుఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్‌. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈనాడు.. ఓ మీడియానా?ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఓ మాఫియా రాజ్యం. సెకీకి సన్మానం అంటూ ఈనాడు నా ఫొటోలో ఓ కథనం ఇచ్చింది. 2021 డిసెంబర్‌లో ఏపీతో సెకీ ఒప్పందం అయితే, ఆపై రెండేళ్లకు సెకీ చైర్మన్‌ నియామకం జరిగింది. కానీ, సెకీకి సన్మానం అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ఇచ్చింది. ఈనాడు.. టాయిలెట్‌ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కి తక్కువ. దున్నపోతును ఈనితే.. దూడను కట్టేసినట్లు ఉంది ఈనాడు తీరు. సిగ్గు పడాలి మీడియా అని చెప్పుకునేందుకు. పరాకాష్టకు స్కాంలురాష్ట్రంలో లిక్కర్‌, ఇసుక, క్వార్ట్జ్‌, మైనింగ్‌, సిలికా.. ఇలా అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్‌ నుంచి రాష్ట్రానికి రూపాయి రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్‌ అవర్‌ కోసమంటూ 24 గంటలకు యూనిట్‌కు రూ.4.60 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. మా హయంలో రూ.2.49కే విద్యుత్‌ కొన్నాం. విద్యుత్‌ కొనుగోలులో రాష్ట్ర ఖర్చు తగ్గించాం. బాబు పాలనలో విద్యుత్‌ కొనుగోలులోనూ పెద్ద స్కామ్‌ జరిగింది. చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తులతో కలిసి ఖజానాకు గండి కొట్టారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదోగానీ.. ఉర్సా అనే సంస్థకు భూములు ఇచ్చారు. బిడ్‌ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇచ్చారు. స్కాంలకు పరాకాష్ట్ర అమరావతి పేరుతో దోపిడీనే..

Appula Samrat Chandrababu Says YS Jagan2
చంద్రబాబు.. అప్పుల సామ్రాట్‌: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మోసాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలో ఎండగట్టారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్‌ చేసిన అప్పులను లెక్కలతో సహా వివరించారు. ‘‘ఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్‌. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.ఏపీఎండీసీకి గనులు తాకట్టుపెట్టి 9 వేలకోట్లు అప్పు చేశారు. 293(1) ప్రకారం బాబు అప్పులు చేసే విధానం చట్ట విరుద్ధం. ఏపీఎండీసీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాష్ట్ర గనులపై ప్రైవేట్‌ వ్యక్తులు అజమాయిషి ఇస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Congress MP Jairam Ramesh Reacts President Trump Comments3
‘మోదీజీ.. ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించండి’

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ అంటున్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘డొనాల్డ్‌ ట్రంప్‌ గత 11 రోజుల్లో ఎనిమిది సార్లు భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల ఒప్పందాన్ని తానే కుదిర్చినట్టు చెప్పారు. భారత్‌ను తానే ఒప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ట్రంప్‌ ఇదే చెబుతున్నారు. కానీ, ఆయన స్నేహితుడు ప్రధాని మోదీ మాత్రం ఆయన వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారు. మన విదేశాంగ మంత్రి కూడా ఏం మాట్లాడటం లేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. అంటే భారత్‌, పాకిస్తాన్ ఒకే పడవలో ఉన్నాయి. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ చెప్పినప్పుడు దేశం మొత్తం షాక్ అయ్యింది. ప్రధాని మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆయన ఈ సమస్యల నుండి దృష్టిని మళ్లిస్తున్నారు’ అని ఆరోపించారు.ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌ విషయమై అఖిలపక్ష ప్రతినిధుల బృందంపై జైరాం రమేష్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు జమ్ము, కశ్మీర్‌లోనే తిరుగుతున్నారు. వీరందరూ గత 18 నెలల్లో మూడు ఉగ్రవాద దాడులకు కారణమైనట్టు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను పట్టుకోవడమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యతగా ఉండాలి. ఇలాంటిదేమీ లేకుండా.. ఎంపీలందరూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఎంపీలను ఇతర దేశాలకు పంపడం ఎందుకు?. మేము అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?. పార్లమెంట్ సమావేశం జరగాలి. ప్రధానమంత్రి ఎప్పుడూ అఖిలపక్ష సమావేశాలకు హాజరు కారు. ఆయన ఎటువంటి సమాధానాలు ఇవ్వరు అని విమర్శలు చేశారు.#WATCH | Delhi | Congress MP Jairam Ramesh says, "In the last 11 days, US President Trump has repeated 8 times that he convinced India and enabled the ceasefire... But his friend, PM Modi, is quiet. Our foreign minister is quiet... Donald Trump praises both PM Modi and Pakistan… pic.twitter.com/G2FxHs8Trx— ANI (@ANI) May 22, 2025

Jaishankar Allegations On Pak Leadership And Army Chief4
పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణ

ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం దాడితో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు సంబంధం ఉందని అన్నారు. పహల్గాం దాడికి పాకిస్తాన్‌ నేతల జిహాదీ మైండ్‌ సెట్‌ కారమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ డెన్మా‍ర్క్‌, నెదర్లాండ్స్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా తాజాగా జైశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ..‘కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్‌, పాక్‌ మధ్య మాత్రమే చర్చలు జరిగాయి. ఈ ఒప్పందంపై భారత్‌, పాక్‌ కలిసి చర్చించుకున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి భారత్ అనేక దేశాలకు సమాచారం ఇచ్చిందని, అందులో అమెరికా కూడా ఉందని స్పష్టం చేశారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం చేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.External Affairs Minister Dr S Jaishankar in Copenhagen, #Denmark, meets Indian community representatives.📍EAM also met his Danish counterpart, Lars Løkke Rasmussen, and says, Denmark’s strong solidarity and support in combating terrorism has been truly commendable.… pic.twitter.com/ZSV2bHHs7V— IndSamachar News (@Indsamachar) May 22, 2025 ఇదే సమయంలో పహల్గాం దాడితో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు సంబంధం ఉంది అని చెప్పుకొచ్చారు. అలాగే, కశ్మీర్ భారతదేశంలో భాగమే. ఏ దేశం కూడా తమ భూభాగంలో కొంత భాగం గురించి చర్చించదు. కశ్మీర్‌లోని ఒక ప్రాంతం మాత్రమే పాకిస్తాన్ పరిధిలో ఉంది. వారు ఎప్పుడు దానిని ఖాళీ చేస్తారో అనే విషయమై.. మేము వారితో చర్చించాలనుకుంటున్నాము అని అన్నారు.EAM S. Jaishankar in Netherlands Kashmir is part of India No country ever negotiates part of its territory One area is under Pakistan We would like to discuss with them when they will vacate it @CNNnews18— Siddhant Mishra (@siddhantvm) May 22, 2025మరోవైపు.. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు పదోన్నతి ఇవ్వడంపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. ఆసిఫ్‌ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి ఇవ్వడమనేది పూర్తిగా తన నిర్ణయమేనని షరీఫ్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్‌ సిందూర్‌ను ఎదుర్కోవడంలో మునీర్‌ వైఫల్యం చెందినా ప్రమోషన్‌ ఇచ్చారని సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

They Make My Job Easy Naman Was Outstanding: Hardik Pandya5
వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్‌ పాండ్యా

ఢిల్లీ క్యాపిటల్స్‌ (MI vs DC)తో కీలక పోరులో విజయం సాధించడం పట్ల ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. కాగా గతేడాది హార్దిక్‌ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే.టాప్‌-4లో అడుగుఇక ఐపీఎల్‌-2025 (IPL 2025) ఆరంభంలోనూ వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుకు దూసుకువచ్చిన హార్దిక్‌ సేన.. బుధవారం ఢిల్లీపై గెలిచి టాప్‌-4లో అడుగుపెట్టింది.సూర్య, నమన్‌ ఫటాఫట్‌సొంత మైదానం వాంఖడేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 73 నాటౌట్‌), నమన్‌ ధీర్‌ (8 బంతుల్లో 24 నాటౌట్‌) వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పవర్‌ ప్లేలో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఫాఫ్‌ బృందాన్ని కోలుకోనివ్వకుండా చేశారు. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(6)ను అవుట్‌ చేసి దీపక్‌ చహర్‌ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (11)ను బౌల్డ్‌ పెవిలియన్‌కు పంపాడు.సాంట్నర్‌, బుమ్రా అదరగొట్టారుఆ తర్వాత మిచెల్‌ సాంట్నర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. క్రీజులో పాతుకుపోవాలని చూసిన సమీర్‌ రిజ్వీ (39), విప్రాజ్‌ నిగమ్‌ (20)ల రూపంలో కీలక వికెట్లు తీసిన సాంట్నర్‌.. మరో హిట్టర్‌ అశుతోష్‌ శర్మ (18) వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక బుమ్రా ట్రిస్టన్‌ స్టబ్స్‌ (2) రూపంలో ప్రమాదకర బ్యాటర్‌ను వెనక్కి పంపడంతో పాటు.. మాధవ్‌ తివారి (3), ముస్తాఫిజుర్‌ రహ్మమాన్‌ (0)లను బౌల్డ్‌ చేసి.. ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ కాగా.. హార్దిక్‌ సేన 59 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్‌లో ఎనిమిదో గెలుపు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సాంట్నర్‌, బుమ్రాలకు బంతిని ఇచ్చేందుకు వెనుకాడను. ఎందుకంటే వారిద్దరు మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో దిట్ట.అంతేకాదు.. ఏ పని చేసినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. వాళ్లిద్దరి వల్లే నా పని సులువైంది. ఈ పిచ్‌పై 160 పరుగుల రావడమే ఎక్కువ అనుకున్నాం. అలాంటి స్థితిలో సూర్య, నమన్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా.. నమన్‌.. వికెట్‌ కఠినంగా మారుతున్న వేళ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు’’ అని సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. కేవలం మూడు పరుగులే చేశాడు. అదే విధంగా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ వేయలేదు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్‌Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025

Aishwarya Rai captivates at Canne Film festival in Saree look with Sindoor6
కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌.. ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతుగా ఐశ్వర్యరాయ్‌

ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సందడి చేసింది. భారతీయ సంస్కృతి ఉ‍ట్టిపడేలా వైట్ శారీలో మెరిసింది. నుదుటన సింధూరం ధరించిన కేన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌కు భారత ప్రభుత్వం సింధూర్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకగానే ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సింధూరం పెట్టుకుని కనిపించింది. గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు కేన్స్‌ వేదికగా తన లుక్‌తో మద్దతుగా నిలిచారు ఐశ్వర్య. ఈ సందర్భాన్ని చాటిచెప్పేలా ఐశ్వర్య సిందూరం పెట్టుకుని బలమైన సందేశం‌ ఇచ్చారని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరుగుతోంది. ఈ సారి వేడుకల్లో చీరకట్టులో మెరిసిన ఐశ్వర్యరాయ్ ఆమె నటించిన దేవదాస్‌ సినిమాను గుర్తుకు తెచ్చారు. 2002లో తొలిసారి ఐశ్వర్య కేన్స్‌ ఫెస్టివల్‌కు చీరకట్టులో హాజరయ్యారు. సంజయ్‌ లీలా భన్సాలీ దేవదాస్‌ చిత్రం కోసం ఈ వేడుకల్లో చీరలో కనిపించారు. కొత్త లుక్‌ను చూసిన తర్వాత అభిమానులు దేవదాస్ చిత్రంలోని పార్వతిని గుర్తు చేసుకుంటున్నారు.ఎందుకంటే ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ కనిపించినా ఫ్యాషన్‌ దుస్తుల్లోనే మెరిశారు. సినీ వేడుకల్లో ఐశ్వర్య లుక్‌ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ ఏడాది ఆమె లుక్‌ మాత్రం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ ష్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఆె చీరను డిజైన్‌ చేశారు. ఆమె ధరించిన నెక్లెస్‌ను 500 క్యారెట్ల మొజాంబిక్‌ కెంపులు, వజ్రాలతో తయారు చేశారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

USA Donlad Trump Slams Reporter Over Qatar Jet Question7
ట్రంప్‌కు కోపమొచ్చింది.. ఏం మాట్లాడుతున్నావ్‌ వెళ్లిపో అంటూ..

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి కోపమొచ్చింది. ప్రశ్నించిన ఓ విలేకరిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నావ్‌?. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ట్రంప్‌ చిందులు తొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా, ట్రంప్‌ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ఖతార్‌.. విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించిన విషయమై ట్రంప్‌ను ఎన్‌బీసీ ఛానెల్‌ విలేకరి ప్రశ్నించారు. సదరు విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ ఊగిపోయారు. అనంతరం, ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌?. నువ్వు తెలివితక్కువ వాడివి. ఇక్కడ మేం మాట్లాడుతున్న దానికి, ఖతార్‌ విమానానికి సంబంధం ఏంటి? వాళ్లు విమానం ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. విలేకరిగా విధులు నిర్వహించే అర్హత నీకు లేదు’ అని ట్రంప్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థపై కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షడు ట్రంప్‌కు ఖతార్‌ పాలక కుటుంబం విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జంజో జెట్‌ విమానాన్ని స్వీకరించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. తాజాగా ఈ విమానం ట్రంప్‌ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇక, దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్‌ వన్‌) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీవిరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్‌ ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షన్‌గా ఉపయోగించాలని ప్రణాళికలు చేస్తున్నారు. President Trump Slams NBC reporter 🔥 "GET OUT OF HERE"You ought to go back to your studio at NBC because Brian Roberts and the people that run that place, they ought to be investigated. They are so terrible the way you run that network. And you're a disgrace. No more questions… pic.twitter.com/ezuE4vXstc— Steve Gruber (@stevegrubershow) May 21, 2025

Hyderabad transformed thriving hub for startups infra retail8
హైరేంజ్‌లో హైదరాబాద్‌

దశాబ్దాల చరిత్రను ఇముడ్చుకున్న హైదరాబాద్‌ చారిత్రక నగరం మరెన్నో చరిత్రలు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అటు ఐటీ ఇటు రియల్టీ మరోవైపు ఫార్మా, ఇంకోవైపు సినిమా.. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురేలేదు అన్నట్టు ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఈ దూకుడు ఇలాగే కొనసాగనుందని, దేశంలోనే మన సిటీ అగ్రగామిగా అవతరించనుందని జేఎల్‌ఎల్‌ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక వెల్లడించిన విశేషాల్లో కొన్ని.. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో అభివృద్ధి కేంద్రంగా నగరం స్థిరపడుతోంది. పలు రంగాల్లో ప్రగతితో పాటు ప్రణాళికా బద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరించిన అంతర్జాతీయ స్థాయి జీవనశైలి కారణంగా నగరంలో నివాస, వాణిజ్య గిడ్డంగుల విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, నగరంలో వచ్చే 3–4 సంవత్సరాల్లో లక్ష కొత్త నివాస యూనిట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాన రిటైల్‌ కంపెనీలు నగరంలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ఐటీ నుంచి స్టార్టప్స్‌ దాకా..నగరంలో ఐటీ/ఐటీఈఎస్‌ రంగం సిటీ దూకుడుకు దోహదం చేస్తున్న ప్రధానమైన డ్రైవర్‌గా నిలుస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నగరం 32 బిలియన్‌ డాలర్ల విలువైన ఐటీ ఎగుమతులతో దేశంలోనే రెండో స్థానాన్ని సాధించింది. ఇక్కడ 4 వేలకు పైగా స్టార్టప్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని మొత్తం గ్రేడ్‌ ఏ కార్యాలయ స్థలాల్లో 15.6 శాతం భాగస్వామ్యంతో నగరం ముందంజలో నిలిచింది. అలాగే, దేశంలోని గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో(జీసీసీఎస్‌) 17 శాతం నగరంలో ఉన్నాయి.హైదరాబాద్‌కి ఈ ఊపు ఎందుకు..?‘హైదరాబాద్‌లో 17 శాతం గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు(జీసీసీఎస్‌) ఉండటం దేశీయ వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కీలకమైన మలుపు కాగా ఈ కేంద్రాల నాణ్యత, పరిధి నగర స్థిరాభివృద్ధికి అండగా నిలుస్తాయి,’ అని ప్రముఖ ఆర్బర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యవస్థాపకుడు చిరాగ్‌ మెహతా అన్నారు. జేయుఎస్‌టివో రియల్‌ ఫిన్‌ టెక్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు పుష్పమిత్ర దాస్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ రానున్న రెండేళ్లలో ఏడాదికి 17–19 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని జోడించనుందని, అలాగే, గిడ్డంగుల సామర్థ్యాన్ని మరో 4 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్లకు పెంచనుందనీ తెలిపారు.ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్న అంశాల్లో ఆయన అభిప్రాయం ప్రకారం, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌ ఒక సంతులిత ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగింది. ఇది ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, లాజిస్టిక్స్‌ ఇలా భిన్న రంగాల్లో వృద్ధిని చూపిస్తోంది. మెగా మాస్టర్‌ ప్లాన్‌ 2050, ముచెర్ల 4.0 ఐటీ హబ్, మెట్రో రైలు విస్తరణ వంటి ప్రణాళికలు నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా బెంగళూరుతో పోలిస్తే స్తిరాస్తి ధరలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారిందని అన్నారు. ‘నాణ్యమైన వసతులు, తక్కువ ధరలతో వ్యాపారం నిర్వహించాలనుకునే సంస్థలకు హైదరాబాద్‌ గొప్ప అవకాశం. పలు రంగాల్లో సమతులిత అభివృద్ధి కనిపిస్తుండటంతో పాటు మౌలిక వసతుల పురోగతికి పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు’ అని దాస్‌ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగిఆఫీస్‌ స్పేస్‌కి డిమాండ్‌.. మెరుస్తున్న మాల్స్‌2019 నుంచి ఇప్పటి వరకు 78.2 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్ల గ్రేడ్‌ ఏ కార్యాలయ స్థలాన్ని నగరం జోడించగా, 2024లో 7.31 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం జరిగిందని జేఎల్‌ఎల్‌ పేర్కొంది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 6.1 శాతం అధిక వృద్ధిగా తేల్చింది. నగరంలోని గ్రేడ్‌ ఏ షాపింగ్‌ మాల్స్‌ స్థలం 9.86 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్లుగా లెక్కించింది. ఇక నగరంలో రానురానూ ఖాళీ స్థలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన డిమాండ్‌కి సంకేతంగా భావించవచ్చు. మరోవైపు డేటా సెంటర్ల సామర్థ్యం కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో 23 మెగావాట్ల మేరకు పెరగనుంది. తద్వారా హైదరాబాద్‌ ఒక ప్రధాన డేటా సెంటర్‌ హబ్‌గా మారనుంది. దీని సామర్థ్యం 2020 మొదటి అర్ధభాగంలో 32ఎం.డబ్ల్యూ నుంచి 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగి 130ఎం.డబ్ల్యూకు చేరుకుంటుంది.

HYDRA Demolish Constructions In  Boduppal9
హైడ్రా కూల్చివేతలు.. బోడుప్పల్‌లో కబ్జాలు..

సాక్షి, మేడ్చల్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో స్మశాన వాటికల్లోని కొంత భూమిని కొందరు ఆక్రమించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. సర్వే నంబర్లు 1, 12లోని స్మశాన వాటికల్లోని భూములను కబ్జా చేసి కబ్జాదారులు వాటని విక్రయిస్తున్నారు. గత రెండేళ్లుగా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో, స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్టు గుర్తించారు.ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగస్తామని రంగనాథ్‌.. స్థానికులకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా స్పందించడంతో​ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అంతకుముందు, బుధవారం ఉదయం మేడిపల్లిలోని సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

Health Tips: Dance as Therapy for Individuals with Parkinson Disease10
డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌..! పార్కిన్‌సన్స్‌కు నృత్య చికిత్స

అద్భుతమా, అసంబద్ధమా? ఏమిటిది! నియంత్రణ లేని కదలికలకు నియమబద్ధమైన కదలికలతో చికిత్సా?! ‘పార్కిన్‌సన్స్‌’ డిసీజ్‌ అంటే నడక అదుపు తప్పటం, చేతులు కదలకపోవటం, కాళ్లు మెదలకపోవటం, తల వణకడం, ఉన్నట్లుండి అదిరి పడటం, నాడీ వ్యవస్థకు, ఇంద్రియాలకు మధ్య సమన్వయం గాడి తప్పటం!! దేహం ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు నృత్యం చెయ్యటం ఎంత దుర్లభం! పైగా దుర్లభమే దుర్భరానికి చికిత్స అవటం ఇంకెంత విడ్డూరం! అయితే ఇది విడ్డూరమేమీ కాదు, ప్రయోగాత్మకంగా నిర్థారణ అయిన విషయమే అంటోంది ‘ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ’ (ఐ.ఎ.డి.ఎం.టి). పార్కిన్‌సన్‌లో ఏ కదలికా లయబద్ధంగా ఉండదు. డాన్స్‌లో లయబద్ధంగా లేని ఒక్క కదలికా ఉండదు. కానీ ఐ.ఎ.డి.ఎం.టి. పార్కిన్‌సన్స్‌ వ్యాధిని నయం చేయటానికి, వ్యాధిగ్రస్తుల్ని శక్తిమంతం చేయటానికి భారతీయ నృత్య రీతుల్ని ఒక చికిత్సా విధానంగా ఉపయోగిస్తోంది. విశాలమైన ఒక నిశ్శబ్దపు గది, వెనుక నుంచి మంద్రస్థాయిలో వినిపించే తబలా బీట్‌ వంటి ఒక సంగీత వాద్యం ఈ చికిత్సలో ముఖ్య భాగంగా ఉంటాయి. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా వృద్ధులు అంతా కలిసి ఆ గదిలో ఉంటారు. అందరూ కూడా పార్కిన్‌సన్స్‌ బాధితులే. మనసును తాకుతున్న నేపథ్య ధ్వనికి అనుగుణంగా వాళ్ల చేతులు మబ్బుల్లా తేలుతాయి. చేతి వేళ్లు మృదువైన హావభావాలు అవుతాయి. పాదాలు లయకు అనుగుణంగా కదులుతాయి. గొప్ప పారవశ్యంతో మదిలోంచి జనించే ఉద్దేశపూర్వకమైన ఆంగికం (అవయవాల కదలిక)తో వారు ఒక మహా విజయాన్ని సాధిస్తారు. పార్కిన్‌సన్స్‌లో ప్రమేయం లేని కదలికలు మాత్రమే ఉంటాయి కనుక ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని కదలించటం అన్నది మహా విజయమే. తప్పిన పట్టు తిరిగి వచ్చేస్తోంది‘‘ఇక్కడికి వచ్చిన వారు కొన్ని నెలల క్రితం వరకు కూడా పడిపోతామేమో అనే భయం లేకుండా నడవలేకపోయిన వారే. కానీ వారిని ఈ నృత్య చికిత్స ఎంతగానో మెరుగు పరిచింది’’ అంటారు ఐ.ఎ.డి.ఎం.టి. అధ్యక్షురాలు, ‘డ్రామా థెరపీ ఇండియా’ వ్యవస్థాపకురాలు అన్షుమా క్షేత్రపాల్‌. పార్కిన్‌సన్స్‌లో నాడీ వ్యవస్థ–శరీరావయవాల పరస్పర చర్యల మధ్య సమన్వయం (మోటార్‌ కంట్రోల్‌) దెబ్బతింటుంది. మానసికంగానూ పార్కిన్‌సన్స్‌ వ్యాధిగ్రస్తులు పట్టుతప్పుతారు. ఈ స్థితిలో వారికొక ఉనికిని, వ్యక్తీకరణ శక్తిని, మునుపటి ఆనందకరమైన జీవితంలోకి మార్గాన్ని నృత్య చికిత్స ఏర్పరుస్తుందని అన్షుమా చెబుతున్నారు. ఈ సంస్థల శాఖలు ముంబై, పుణే, బెంగళూరులలో ఉన్నాయి.నృత్యం తెచ్చే మార్పేమిటి?పార్కిన్‌సన్స్‌ మెదడు క్రియాశీలతను, డోపమైన్‌ కేంద్రమైన ‘బేసల్‌ గాంగ్లియా’ను ప్రభావితం చేస్తుంది. దాంతో స్వచ్ఛంద కదలికలు కష్టతరం అవుతాయి. కానీ మెదడు మాత్రం ‘లయ’లకు స్పందిస్తుందని అన్షుమా అంటున్నారు. ‘‘సంగీతాన్ని వింటున్నప్పుడు మెదడులో దెబ్బతినని సర్క్యూట్‌లు (పార్కిన్‌సన్స్‌ వల్ల దెబ్బతిన్నవి కాకుండా) వేర్వేరు నాడీ రహదారుల ద్వారా కదలికలను తెస్తాయి. నాడీ శాస్త్రపరంగా, ఈ నృత్య చికిత్స బలాల్లో ఒకటి రిథమిక్‌ ఆడిటరీ స్టిమ్యులేషన్‌ (ఆర్‌.ఎ.ఎస్‌.) ఉద్దీపన చెందటం. దీనివల్ల అవయవ సమన్వయం ఏర్పడుతుంది. డోపమైన్, ఎండార్ఫిన్‌లు, సెరోటోనిన్‌ల వంటి న్యూరో ట్రాన్సిమీటర్‌ హార్మోన్‌లు పెరుగుతాయి. దాంతో కదలికలు మాత్రమే కాదు, మానసిక స్థితీ మెరుగుపడుతుంది’’ అని ఆమె అంటున్నారు.గర్బా నృత్యంపై తొలి ప్రయోగంగుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’పై 2024లో ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనంలో పార్కిన్‌సన్స్‌ రోగులపై ఈ డ్యాన్స్‌ చక్కటి ప్రభావం చూపినట్లు వెల్లడైంది. పార్కిన్‌సన్స్‌కు చికిత్సగా నృత్య రీతుల్ని ఆశ్రయించటం 2009లో ముంబైలోని ‘పార్కిన్‌సన్స్‌ డిసీ జ్‌ అండ్‌ మూవ్‌మెంట్‌ డిజార్డర్‌ సొసైటీ ’ ప్రయత్నాలతో మొదలైంది. అదే సమయంలో ఆర్జెంటీనాలో టాంగో, సల్సా డ్యాన్సులు పార్కిన్సన్స్‌కు చికిత్స గా ఉపయోగపడతాయా అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఆ స్ఫూర్తితో 2010లో మన దగ్గర శా స్త్రీయ నృత్యాల చికిత్సా తరగతులు వారానికి రెండుసార్లు 3 నెలల పాటు ముంబైలో జరిగాయి. ప్రస్తుతం దేశంలోని అనేక కమ్యూనిటీ సెంటర్లు భరతనాట్యం, గర్బా, కూడియట్టంలతో చికిత్స చేస్తున్నాయి.పార్కిన్‌సన్స్‌ లక్షణాలు – కారణాలుప్రధానంగా ఇవి శారీరకమైనవి. వణుకు, బిగదీసుకుపోవటం, కదలికలు నెమ్మదించటం, భంగిమలో అస్థిరత వంటివి కనిపిస్తాయి. క్రమంగా ఆందోళన, కుంగుబాటు మొదలౌతుంది. ఎవ్వరితోనూ కలవలేక, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అపారమైన దుఃఖం మిగులుతుంది. మెదడులో డోపమైన్‌ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు సక్రమంగా పని చెయ్యకపోవటం లేదా నశించటం పార్కిన్‌సన్స్‌కు ప్రధాన కారణం. మనిషి తను కదలాలనుకున్నట్లు కదలటానికి డోపమైన్‌ అవసరం. డోపమైన్‌ లోపించటం వల్ల కదలికలు అస్తవ్యస్తం అవుతాయి. మెదడులో డోపమైన్‌ ఉత్పత్తి తగ్గటానికి గల కారణాలపై పరిశోధకులింకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఒక కారణం మాత్రం వృద్ధాప్యం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో సుమారు ఒక శాతం మందికి పార్కిన్‌సన్స్‌ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. డోపమైన్‌ను భర్తీ చేసే మందులు, మెదడు ఉద్దీపన వంటి వైద్య చికిత్సలలో పురోగతి సాధించినప్పటికీ ఫలితాలైతే అనుకున్నంతగా లేవు.రోగులు తమకు తామే వైద్యులుసాధారణ వైద్యంలా ఈ ‘డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ’ ఎవరో సూచించేది కాదు. ఎవరికి వారుగా అనుసరించేది. ఎలా కదలాలన్నదీ ఎవరూ చెప్పరు. కదిలే మార్గాలను ఎవరికి వారే అన్వేషించేలా మాత్రం ప్రోత్సహిస్తారు. నడక లేదా భంగిమను సరిదిద్దుతారు. శ్వాసపై నియంత్రణ కల్పిస్తారు. ఊహాశక్తిని, వ్యక్తీకరణను లయబద్ధం చేస్తారు. చికిత్సలో పాల్గొనే వారిలో కొంతమంది కూర్చుని నృత్యం చేస్తారు. మరికొందరు స్థిరంగా నిలబడతారు. కొందరు మరింత స్వేచ్ఛగా కదులుతారు. మొత్తానికి వాళ్లంతా రోగుల్లా కాకుండా, దేన్నో సృష్టిస్తున్నట్లుగా ఉంటారు.సాక్షి నేషనల్‌ డెస్క్‌(చదవండి: హీరో శింబు ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement