Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Meets With Public Representatives Of Local Bodies Updates1
మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి:’’ అంటూ వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్‌ జగన్‌.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.‘‘మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్‌ చేశాం. తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని, మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్‌ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం, కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా, చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం...జగనన్నకు చెబుదాం నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడు’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..👉స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు👉తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి పెట్టి, లాగేసుకునే ప్రయత్నంచేస్తోంది👉అయినా సరే మెజార్టీ వైయస్సార్‌సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు:👉పోలీసులు వైయస్సార్‌సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు👉సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు👉కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే👉రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు👉ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం👉పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు👉యలమంచిలిలో మన వాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు👉ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది👉కాని చంద్రబాబుగారి పరిపాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది👉మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు👉జగన్‌ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు👉కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు 👉కాని, మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ వెళ్లాడు👉గడపగడపకూ కార్యక్రమం కింద మూడుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లారు:👉99శాతం హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైయస్సార్‌సీపీ మాత్రమే👉మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు👉10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు👉ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్‌బాల్‌ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు👉వైఎస్సార్‌సీపీ మాదిరిగా ప్రతి ఇంటికీ వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా?👉హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది👉మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు👉పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు👉ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు👉రూ.3600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు👉ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు👉వైద్యంకోసం అప్పులు పాలు అయ్యే పరిస్థితి👉ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడంలేదు👉ప్రభుత్వం రంగంలో వైయస్సార్‌సీపీ తీసుకొచ్చిన కాలేజీలను చంద్రబాబు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు:👉కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం ప్రారంభించాం👉శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లాం👉ఇప్పుడు ఆమూడు పోర్టులను కమీషన్లకోసం అమ్మేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు👉ట్రైబల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపించాం👉ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, ట్రైబల్‌ యూనివర్శిటీ, మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు పెట్టాం👉బోగాపురం ఎయిర్‌పోర్టుకు గత చంద్రబాబు హయాంలో అనుమతులు లేవు, భూసేకరణ లేదు👉మనం అన్నీచేసి 30శాతం పనులు చేశాం👉రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనులు కేవలం వైయస్సార్‌సీపీ హయాంలోనే జరిగాయి👉ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి👉వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు👉ప్రజలను వెన్నుపోటు పొడిచాడు👉ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చాడు👉రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు👉ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నాడు👉చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు👉తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు 👉గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు👉పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు👉ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను👉జగన్‌ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది👉కోవిడ్‌ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం👉ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను 👉రేపు కచ్చితంగా వై​ఎస్సార్‌సీపీకి కార్యకర్తే నంబర్‌ ఒన్‌👉అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి👉కొడతానంటే.. కొట్టమనండి👉కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి👉కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం👉రిటైర్డ్‌ అయిన వారినీ లాక్కుని వస్తాం👉దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం👉అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం👉మనకూ టైం వస్తుంది👉చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి👉చంద్రబాబు దుర్మార్గపు పాలనవల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది👉మహిళలను అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు👉ఒక కేసులో బెయిల్‌ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు👉ఇలా కేసులు మీదు కేసులు పెడుతన్నారు👉వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు👉దళితుడైన ఎంపీ నందిగం సురేష్‌ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు👉సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు👉తనను, తన కుటుంబ సభ్యులను తిడితే, ఎందుకు తిట్టావన్నందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు👉చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మరిచిపోవద్దు👉రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దాం👉వచ్చేది మన ప్రభుత్వమే👉మంచి రోజులు కచ్చితంగా వస్తాయి

Tiruvuru Municipal Chairman Election Postponed Indefinitely2
తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా

సాక్షి, విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. కోరం లేక ముగించిసనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న, ఈ రోజు టీడీపీ అరాచకం వల్ల ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరగకుండా టీడీపీ గూండాలు అల్లర్లు సృష్టించారు. టీడీపీ గూండాల బీభత్సంతో రెండు రోజులు ఎన్నిక జరగలేదు. వైసీపీ కౌన్సిలర్లు తిరువురు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దాడితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజురుకాలేకపోయారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ఆర్డీవో కే.మాధురి ముగించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యచరణ ఉంటుందని ఆర్డీవో ప్రకటించారు.దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసు వాహనం ఎక్కనివ్వకుండా టీడీపీ టీడీపీ నేత రమేష్ రెడ్డి, టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై కూడా టీడీపీ గూండాల దాడి చేశారు. దేవినేని అవినాష్ , మొండితోక అరుణ్ కుమార్‌లను రెడ్డిగూడెం స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు.

Kaleshwaram Commission Issues Notice to Kcr and Harish Rao and Etela Rajender3
KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

సాక్షి,హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం (మే 20) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది. కాగా, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ హయాంలో హరీష్‌రావు నిటి పారుదల వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచార‌ణ గడువు పొడిగింపు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ (Kaleshwaram commission) విచార‌ణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో వ్య‌క్తిగ‌తంగా విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ కేసీఆర్‌,హ‌రీష్‌రావు,ఈటల రాజేంద‌ర్‌కు కాళేశ్వ‌రం క‌మిష‌న్ నోటీసులు పంపించింది.

New evidence emerges in Jyoti Malhotra espionage case4
NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు

చండీఘడ్‌: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్‌ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్‌క్రిప్టెడ్‌ డివైజ్‌లు వినియోగించిన‌ట్లు తేలింది. ఎన్ఐఏ విచార‌ణ‌లో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్ర‌పంచానికి తాను వ్లాగ‌ర్‌గా ప్ర‌మోట్ చేసుకుంటుంది. కానీ అస‌లు విష‌యం ఏంటంటే? ఎన్‌క్రిప్టెడ్ డివైజ్‌ల‌ను ఉప‌యోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేద‌ని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్‌ విత్‌ జో’పేరిట ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబ‌ర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోష‌ల్ మీడియా పోస్టుల్లో భారతీయుల‌కు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం,ఉగ్ర‌దాడికి ముందు ప‌హ‌ల్గాంలో ప‌ర్య‌ట‌న, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాల‌యం ఉద్యోగి ఇషాన్ దార్‌తో స‌న్నిహితంగా ఉండ‌డంతో మే 16న జ్యోతిపై సివిల్‌ లైన్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ ఐఆర్ న‌మోదైంది.గూఢ‌చ‌ర్యం కేసులో ఆమెను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్‌లో పర్యటన, ఐఎస్‌ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్‌ ఉగ్రదాడికి ముందు కశ్మీర్‌ సందర్శన, కశ్మీర్‌ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్‌ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది.

IPL 2025: For The First Time In IPL History, Three Overseas Players From The Same Team Have Scored 400 Plus Runs In A Single Season5
IPL 2025: చరిత్ర సృష్టించిన లక్నో ప్లేయర్లు.. ఐపీఎల్‌లో ఇలా జరగడం​ ఇదే తొలిసారి..!

ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్లేయర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. లీగ్‌లో మునుపెన్నడూ జరగని విధంగా ఈ సీజన్‌లో లక్నోకు చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటారు. 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఓ సీజన్‌లో ఒకే ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి.నిన్న (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్‌ త్రయం ఎయిడెన్‌ మార్క్రమ్‌, మిచెల్‌ మార్ష్‌, నికోలస్‌ పూరన్‌ ఈ ఘనత సాధించింది. సీజన్‌ ప్రారంభం నుంచి భీకర ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటారు. ఈ మ్యాచ్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. మార్ష్‌ (61), మార్క్రమ్‌ (61), పూరన్‌ (45) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందే పూరన్‌ 400 పరుగులు పూర్తి చేయగా.. మార్క్రమ్‌, మార్ష్‌ ఈ మ్యాచ్‌లో 400 పరుగుల మైలురాయిని తాకారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పూరన్‌ నాలుగు అర్ద సెంచరీల సాయంతో 455 పరుగులు చేయగా.. మార్ష్‌ 11 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు.. మార్క్రమ్‌ 12 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 409 పరుగులు చేశారు. ఈ సీజన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో పూరన్‌ 9, మార్ష్‌ 10, మార్క్రమ్‌ 12 స్థానాల్లో ఉన్నారు.ఈ సీజన్‌లో ముగ్గురు విదేశీ బ్యాటర్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా లక్నో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం సోచనీయం. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్‌, మార్ష్‌, మార్క్రమ్‌ సత్తా చాటినా లక్నో గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో లక్నో తరఫున ఈ ముగ్గురు మినహా బ్యాటింగ్‌లో ఎవ్వరూ రాణించలేదు. అడపాదడపా బదోని బ్యాట్‌కు పని చెప్పాడు. మిడిలార్డర్‌లో పంత్‌ ఘోరంగా విఫలం కావడం.. సరైన్‌ ఫినిషర్‌ లేకపోవడం ఈ సీజన్‌లో లక్నో కొంపముంచాయి. బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్‌, దిగ్వేశ్‌ రాఠీ పర్వాలేదనిపించినా వీరికి సహకరించే బౌలర్లే కరువయ్యారు. రవి బిష్ణోయ్‌ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. పేసర్‌ ఆకాశ్‌దీప్‌ తేలిపోయాడు. మరో పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లకంతా దూరంగా ఉండిన మయాంక్‌ యాదవ్‌ రెండు మ్యాచ్‌లు ఆడి తిరిగి గాయపడ్డాడు. వీటన్నిటికి మించి రిషబ్‌ కెప్టెన్సీలో లోపాలు ఈ సీజన్‌లో లక్నో ఖేల్‌ ఖతం చేశాయి. మార్క్రమ్‌, మార్ష్‌, పూరన్‌ ఫామ్‌ మినహా ఈ సీజన్‌లో ల​క్నో గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సీజన్‌లో లక్నోకు మరో రెండు లీగ్‌ మ్యాచ్‌లు (మే 22న గుజరాత్‌తో, మే 27న ఆర్సీబీతో) మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవడం​ తప్ప లక్నో చేయగలిగిందేమీ లేదు.

Tdp Conspiracy Politics In Tiruvuru Municipal Chairman Elections6
వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి

👉వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్‌దేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌లు అరెస్ట్‌తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులురెడ్డిగూడెం స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడిదేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌ వాహనాలపై దాడివైఎస్సార్‌సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలుదారికాసి వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలుఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్‌ వద్ద టీడీపీ గూండాల విధ్వంసంసాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, వైసీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్‌సీపీ నేత స్వామిదాస్‌ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.వైఎస్సార్‌సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్‌, స్వామిదాస్‌ అరుణ్‌ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్‌, స్వామిదాస్‌పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్‌ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్‌ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.

Peoples Star Narayana Murthy Lessons To The Media7
మీడియాకు పీపుల్స్ స్టార్ పాఠాలు

పీపుల్ స్టార్ నారాయణమూర్తి ఏ అంశాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఆయనకు ముఖస్తుతి.. డబ్బా కొట్టడం.. చెంచాగిరి అసలు తెలియదు.. చిన్నపిల్లలు పెద్దవాళ్లు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు.. డబ్బున్న వాళ్ళు పేదలు అనే తేడా లేకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉంటూనే తన మనసులో ఉన్న భావాలను స్పష్టంగా వెల్లడించగలిగే ధైర్యం కలిగిన ఒకే ఒక్క సినీ నటుడు నారాయణమూర్తి.ఆయన ఎవరిని అయినా మంచి చేసుకోవడం కోసమో మచ్చిక చేసుకోవడం కోసమో మాట్లాడరు. కెరీర్ కోసము.. సినీ అవకాశాల కోసం భజన చేయడం అసలు ఉండదు.. అలాంటి నారాయణమూర్తి ఓ సభలో మీడియా తీరతెన్నులను తూర్పారబట్టారు. సమాజంలో మీడియా బాధ్యతను.. సమాజ మనుగడలో మీడియా పాత్రను దాన్ని ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూనే ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు పోతున్న పోకడలను ఈ పీపుల్స్ స్టార్ పెద్దల సమక్షంలోనే ఎండగట్టారు.కొన్ని పత్రికలు, కొంతమంది కోసం.. కొన్ని మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూ తన బాధ్యతను విస్మరిస్తున్నాయని.. తమకు నచ్చిన నాయకుడు ఎలా వ్యవహరిస్తున్న ఎంత దుర్మార్గంగా పాలిస్తున్నా ఆయన కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని, ఈ వైఖరి అంతిమంగా సమాజానికి ఎనలేని కీడు చేస్తోందని నారాయణమూర్తి దుయ్యబట్టారు.మీడియా సంస్థలు తమ బాధ్యతను విస్మరించి కొన్ని పార్టీలకు ఊడిగం చేస్తూ మనుగడ సాగిస్తున్నాయని ఇలాంటి సంస్థల వలన సమాజానికి ఏం లాభం అని ఆయన మాజీ చీఫ్ జస్టిస్ రమణ వంటి పెద్దల సమక్షంలోనే దులిపి ఆరేశారు. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థలను నేరుగా తాకాయని పాత్రికేయులు విశ్లేషకులు అంటున్నారు. నారాయణమూర్తి మాట్లాడింది నూటికి నూరు శాతం నిజం అని.. చంద్రబాబుని కొన్ని మీడియా సంస్థలు వెనకేసుకు వస్తూ ఆయన తప్పులను కాపాడుతూ సమాజానికి నష్టం చేస్తున్నాయని.. విషయాన్ని నారాయణమూర్తి నిర్భయంగా బయటపెట్టారని ఎప్పటికీ సోషల్ మీడియాలో పోస్టింగులు మొదలయ్యాయి.ఇంగ్లీష్ మీడియం చదవాలండిదీంతోపాటు నారాయణమూర్తి ఇంకేమన్నారంటే పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలని ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించాలని అప్పుడే ఉన్నత స్థానాలకు చేరగలుగుతారని అన్నారు. వేదికపై ఉన్న మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను చూపిస్తూ ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగులోనే సాగిన ఆ తర్వాత ఆంగ్లంలో ప్రారంభించిన సంపాదించి న్యాయ స్థానాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఈ అంశం కూడా గతంలో వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియాని ప్రవేశపెట్టిన అంశాన్ని పాత్రికేయులు ప్రజలు గుర్తు చేసుకున్నారు.ఆనాడు వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు మరికొందరు నాయకులు అడ్డుకున్నారని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాని వ్యతిరేకించారని తద్వారా పేద పిల్లలకు ఆంగ్ల అందకుండా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. నేడు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి కూడా ఆంగ్ల విద్య ప్రాధాన్యాన్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఆనాటి వైఎస్ జగన్ పాలనను గుర్తుచేస్తుంది అని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి నిక్కచ్చిగా మాట్లాడే నారాయణమూర్తి పలు అంశాల్లో అటు పక్షపాత మీడియాకు.. ఆంగ్ల మీడియం వద్దన్న నాయకులకు చురకల్లా తగిలాయని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న

HomeCooked food Easy Diet Plan Woman Loses 40 Kgs 8
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నతనంలోనే చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే అధికబరువుతో దారితీస్తున్న అనారోగ్యాలపై పెరుగుతున్న అవగాహన కారణంగా అధికబరువును తగ్గించేందుకు కసరత్తుల భారీగానే చేస్తున్నారు. ఆహారంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. తమ సక్సెస్‌ స్టోరీను సోషల్‌మీడియాలో ఫాలోయర్స్‌తో పంచుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్. పదండి ఆమె వెయిట్‌లాస్‌ జర్నీ గురించి తెలుసుకుందాం. కోపాల్ అగర్వాల్ చిన్న వయసులోనే 101 బరువుతో బాధపడేది. ఇష్టమైన దుస్తులు వేసుకోవాలంటే కుదిరేదికాదు. పైగా ఏనుగులా వున్నావ్‌.. నీతో ఎవరు డేటింగ్‌ చేస్తారు... ఇలాంటి వెక్కింపులు, వేళాకోళాలు. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ దెబ్బతినేది. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించు కుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. చక్కటి ఫలితాన్ని సాధించింది. 101 కిలోల బరువు వద్ద మొదలైన ఆమె వెయిట్‌ లాస్‌జర్నీ 62 కిలోలకు చేరింది.కోపాల్ అగర్వాల్ తన అద్భుతమైన సక్సెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తను పాటించిన ఆహార నియమాలు, వ్యాయామల గురించి అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనం తీసుకునేది. క్రమం తప్పకుండా కఠిన వ్యాయామం చేసింది. దీంతో సుమారు 40 కిలోల బరువును తగ్గించుకుంది. ఇపుడు ఇష్టమైన మోడ్రన్‌ దుస్తులు కూడా వేసుకుంటోంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక శ్రేయస్సు , కాన్ఫిడెన్స్‌ కూడా మెరుగుపడిందని ఆమె చెప్పింది. మరో వీడియోలో, తాను కేవలం ఆరు నెలల్లో 32 కిలోలు తగ్గినట్టు చెప్పుకొచ్చింది అగర్వాల్‌. View this post on Instagram A post shared by KOPAL AGARWAL | Fitness | Nutrition | Skincare | Travel (@_kopal.agarwal_)బరువు తగ్గడానికి తీసుకున్న రోజువారీ ఆహారం:అల్పాహారం: ఒక రోటీ, 5 గుడ్డులోని తెల్లసొన, ఒక గిన్నె పోహా 2 పనీర్ ముక్కలతో అధిక ప్రోటీన్ కలిగిన ఫ్రూట్స్‌, పెరుగుమధ్యాహ్నం: పుచ్చకాయ , స్ట్రాబెర్రీలు బ్లాక్ కాఫీ, కొబ్బరి నీరుభోజనం: ఆకుకూరలతో 100 గ్రాముల చికెన్, కిచ్డీ పెరుగుతో పచ్చి కూరగాయలతో పనీర్ భుర్జీమధ్యాహ్నం: గ్రీన్ టీరాత్రి భోజనం: ఆకుకూరలతో సాటేడ్ పనీర్ సలాడ్, 100 గ్రాముల చికెన్, గుడ్డు భుర్జీదీంతో పాటు, రాత్రి తొందరగా నిద్రపోవడం, ఉదయాన్నేతొందరగా మేల్కోవడం లాంటివి పాటించింది. ఇంకా ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు త్రాగడం , పరగడుపున గోరువెచ్చని నీరు సేవించడం, ప్రతిరోజూ కనీసం 10వేలు అడుగులు నడవడంతన దినచర్యలో భాగం చేసుకుంది. చక్కెర ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తీసుకుంటూ, జంక్ ఫుడ్‌కు కంప్లీట్‌గా నో చెప్పింది. మొత్తానికి కష్టపడి తన శరీర బరువు 101 నుండి 62 కిలోలకు చేరి వావ్‌ అనిపించుకుంది.నోట్‌ : ఇదే టిప్స్‌ అందరికీ పాటించాలనే నియమం ఏదీ లేదు. కానీ కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తి నిబద్దత, ఓపికతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం కష్టమేమీ కాదు. అయితే బరువు తగ్గే ప్రయత్నాలను ప్రారంభించేందు ముందు, బరువు పెరగడానికి గల కారణాలును వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకుని ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త పడాలి.

Rashi khanna Injured In Movie Shooting9
గాయాలతో రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్‌

హీరోయిన్ రాశి ఖన్నా స్వల్పంగా గాయపడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్‌ చేశారు. ఒక సినిమా షూటింగ్‌లో కథ డిమాండ్‌ మేరకు చాలా రిష్క్‌ ఉన్న యాక్షన్‌ సీన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా 'ది సబర్మతి రిపోర్ట్‌'తో మెప్పించిన ఆమె 'ఫర్జీ2' వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ఇందులో భాగంగానే ఆమెకు గాయాలు అయినట్లు సమాచారం.గాయాలతో ఉన్న ఫోటోలు షేర్‌ చేసిన రాశి ఖన్నా ఇలా చెప్పుకొచ్చింది. 'ఒక్కోసారి కథ డిమాండ్‌ చేస్తే గాయలను కూడా లెక్కచేయకూడదు. ఈ క్రమంలో మీ గాయాలు కూడా ఒక్కోసారి మీ శరీరం, మీ శ్వాస మీద ప్రభావం చూపవచ్చు.' అంటూ పోస్ట్‌ చేసింది. షూటింగ్‌లో చిన్నచిన్న గాయాలైనట్లు రాశి ఖన్నా తెలిపింది.కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్‌గా చేయనుంది. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna)

Gold and silver rates today on market in Telugu states10
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,100 (22 క్యారెట్స్), రూ.95,020 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 దిగి రూ.87,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 తగ్గి రూ.95,170 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ(Silver Price) మార్పులొచ్చాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే మంగళవారం కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement